Sri Padma Mahapuranam-I
Chapters
అష్టమోథ్యాయః పృథురాజ్ఞః కథానకమ్ భీష్మ ఉవాచ : బహుర్భిద్ధరణీ భుక్తా భూపాలైః శ్రూయతేపురా | పార్ధివాః పృధివీ యోగాత్ పృధివీ కస్యయోగతః ||
1 కిమర్ధం చ కృతాసంజ్ఞా భూమేస్సా పారిభాషికీ | గౌరీతీయంచ సంజ్ఞా వా భువః కస్మాద్ బ్రవీహిమే ||
2 పులస్త్య ఉవాచ : పురాకృత యుగస్యా సౌదంగో నామ ప్రజాపతిః | మృత్యోస్తు దుహితా తేన పరిణీతా తి దుర్ముఖీ ||
3 సునీథా నామ తస్యాస్తు వేనో నామ సుతః పురా | అధర్మ నిరతః కామీబలవాన్ వసుధాధిపః ||
4 లోకస్యా ధర్మ కృ చ్ఛాపి పర భార్యాప హారకః | అథ తస్య ప్రసిద్ధర్ధ్యం జగదర్ధం మహర్షిభిః ||
5 అను నీతో7పి నదదావ శుద్ధాత్మా7భయం తతః | శాపేన మారయిత్వైన మ రాజక భయార్ధితాః ||
6 మమంథు ర్బ్రాహ్మణాస్తస్య బలాద్దేహమకల్మషాః | తతా೭యాన్మధ్య మానాత్తు జనీతా వ్లుెచ్ఛ జాతయః ||
7 శరీరే మాతురంశేన కృష్ణాంజన సమప్రభాః | పితురంశస్య సంగేన ధార్మికో ధర్మకారకః ||
8 ఉత్పన్నో దక్షీణా ద్ధస్తాత్స ధనుః సశరోగదా | దివ్య తేజోమయః పుత్రస్స రత్నకవచాం గదః ||
9 పృథురేవా భవన్నామ్నా సహివిష్ణు రజాయత స విపై#్రరభి షిక్తః సంస్తపః కృత్వాసు దుష్కరమ్ ||
10 విష్ణోర్వరేణ సర్వస్య ప్రభుత్వ మగమ త్ర్పభుః | నిః స్వాధ్యాయ వషట్ కా రం నిర్ధర్మం వీక్ష్యభూతలమ్ ||
11 ధుమేవోద్యతః కోపాచ్చరేణామిత విక్రమః || తతో గోరూపమాస్థాయ భూః పలాయితు ముద్యతాః ||
12 వృష్టే త్వన్వంగమ త్తస్యాః పృథుః సేషుశరాసనః | తతః స్థిత్వైక దేశేతు కింకరో మీతి చాబ్రవీత్ ||
13 పృధు రప్యవ దద్ధాత్ర్యా మీ ప్సితం దేహిసువ్రతే | సర్వస్య జగతః శీఘ్రం స్థాపరస్య చరస్య చ ||
14 తిథేతి చా బ్రవీద్ భూ మిర్దు దోహస నరాధిపః | స్వకే పాణౌ పృథు ర్వత్సం కృత్వాస్వాయం భువం మునమ్ ||
15 తదన్నమ భవద్ దుగ్ధం ప్రజాజీవంతి యేనతు | తతస్తు ఋషిర్భి దుగ్ధావత్సః సోమస్తదా భవత్ ||
16 దోగ్ధా వాచస్పతి ర భూ త్పాత్రం వేదస్తపోరసః | దేవైశ్చ వసుధా రుగ్ధా మరుద్దోగ్ధా తదా భవత్ ||
17 ధరణి ననేకులు భూపాలు రనుభవించిరని విన్నాము. పృథివికి సంబంధించినవారు పార్థివులనబడిరి. పృథివి యనుపే రెవ్వని సంబంధమున వచ్చినది. ఆపరిభాష (సంజ్ఞ) పేరు ఎట్లేర్పడెను? ఈ భూమికి ''గౌః'' గోవనియు పేరెట్లువచ్చినది? తెల్పుమని భీష్ముడడుగ పులస్త్యుడనియె. మున్ను కృతయుగము చివర అంగుడను ప్రజాపతి యుండెను. అతడు మృత్యువు కూతురును మిక్కిలి పాడుమొగముదానిని పెండ్లాడెను. ఆమెకు వేనుడు పుట్టెను. అతడు అధర్మపరుడు. కాముకుడు ప్రబలుడగు రాజు. వాడు లోకమందధర్మము నొనరించెను. దేవభార్యలను హరించెను. ఎంత బ్రతిమాలినను అశుద్ధమనస్కుడుగావున నభయమీడయ్యెను. అంగట ఋషులు వానిని శాపముచే హతమార్చి - అమీద రాజ్య మరాజకమగుటకు జడిసి బ్రాహ్మణులు బలిమిమై వాని దేహమును మధించిరి. వాని మేనినుండి అప్పుడు వ్లుెచ్ఛాతులు పుట్టిరి. తల్లియంశమున కాటుక రంగువాండ్రు పుట్టిరి. తండ్రియంశమున ధర్మమూర్తి ధర్మకారకుడు. వాని కుడిబాహువునుండి ధనుర్భాణములతో గదతో దివ్యతేజోమయుడు రత్నకవచము బుజకీర్తులతో నొక శిశువుదయించెను. అతడే పృథువు. అతడు విష్ణువే. విప్రులచే నభిషిక్తుండై దుష్కరమైన తపముసేసి విష్ణువు వరమున సర్వప్రభువయ్యెను. అతడు స్వాధ్యాయమును (వేదము) వషట్కారములేనిదై (యజ్ఞము సేయనిదై) ధర్మశూన్యమైన భూతలముంగని కోపముగొని బాణముచే భూమిం జంప బూనెను. అంత నవని గోరూపమూని పారిపోబూనెను. పృథువు ధనార్భాణములతో నామెను వెంబడించెను. అంత నాదేవి యొక్కచో నిలువబడి యేమి చేయుచుదుననెను. పృథువు ఓ సువ్రతా ! చరాచర జగత్తునకెల్ల కోరినది వెంటనే యిమ్మనెను. భూమి ఆలాగే యనెను. నరపతి స్వాయంభువమనువుం దూడగావించి తనచేతిలో పిదికెను. ఆ పిదికిన పాలు ప్రజలు తిని బ్రతుకనగు నన్నమయ్యెను. ఆ మీద ఋషులు పాల్పిదికిరి. సోముడు దూడయయ్యెను. బృహస్పతి దోగ్ధ (పితుకువాడు) వేదము పాత్రము, తపస్సు రసమునయ్యెను. దేవతలు మనుపు పిదోగ్ధయయ్యెను.
17 ఇంద్రో వత్సః సమభవత్ క్షీర మూర్జస్స లం బలమ్ | దేవానాం కాంచనం పాత్రం పితౄణాం రాజతం తథా || 18 అంతకశ్చా భవద్దోగ్ధా యమోవత్సః స్వధారసః | విలంచ పాత్రం నాగానాం తక్షకో వత్సకో೭భవత్ || 19 విషం క్షీరం తతో దోగ్ధా ధృతరాష్ట్రో೭భవత్పునః | అసురైరపి దుగ్ధేయం ఆయసే శతృపీడనమ్ || 20 పాత్రం మాయామయం ద్వత్సః ప్రాహ్లాదిస్తు విరోచనః | దోగ్ధా త్రిమూర్థా తత్రాసీన్మాయా యేన ప్రవర్తితా || 21 యక్షైశ్చ వసుధా దుగ్ధా పురాంతర్ధాన మీప్నుభిః | కృత్వా విశ్వా వసుం వత్సం మణిపాత్రౌ మహీవతే || 22 ప్రేతరక్షో గణౖర్ధుగ్ధా వసా రుధిర ముల్వణమ్ | రౌప్యనాభో೭భవద్దోగ్ధా సుమాలిర్వత్స ఏవచ || 23 గంధర్వైశ్చ పునర్దుగ్ధా వసుధా సా ప్సరోగణౖః | వత్సం చిత్రరధం కృత్వా గంధాన్ పద్మదలే తథా || 24 ఇంద్రడు దూడ వాలు బలము ఊర్జస్వియును. బంగారుపాత్ర దేవతలకు. పితృదేవలకు వెండిగిన్నె. యముడు పితుకువాడు యముడు దూడ పాలు స్వధా. తక్షకుడు దూడ. నాగులకు గిన్నె బిలము=కన్నము తక్షకుడు దూడ పాలు విషము. దృతరాష్ట్రుడను నాగుడు పిదుకువాడు. అసురులును నీగోవును యినుపగిన్నెలో పిదికిరి. పాలు శతృపీడనము. పాత్ర మాయ. ప్రహ్లాదకుమారుడు విరోచనుడు దూడ. త్రిమూర్థుడు దోగ్ధ, అతడు మాయకు ప్రవర్తకుడు. అంతర్ధానమైయుండగోరి యక్షులు భూమిం బిదికిరి. విశ్వావసువప్పుడు దూడ. పాత్ర మణిమయము. ప్రేత రక్షోగణము లప్పుడు నోరుగలవారు రక్తముం బిదికిరి పిదుకువాడు రౌప్యనుడు, దూడ సుమాలి. గంధర్వులు అప్సరసలతో చిత్రరథుని దూడసేసి తామరపూవురేకులో గంధములను బాలుగా పిదికిరి. 24 దోగ్ధావసు రుచిర్నామాధర్వ వేదస్య పారగః | గిరి భిర్వసుధా దుగ్ధా రత్నాని వివిధాని చ || 25 ఔషధాని చ దివ్యాని దోగ్ధామేరు మహీధరః | వత్సో`òభూద్ధి మహంస్తత్ర పాత్ర శైలమయం పునః || 26 వృక్షైశ్చ వసుధా దుగ్ధాక్షీరం చ్ఛిన్న ప్రరోహణమ్ | పాలాశ పాత్రే దోగ్ధాతు సాలః పుష్పవనాకులః || 27 ప్లక్షో`òభవత్తతో వత్సః సర్వ వృక్ష వనాధిపః | ఏవ యన్యైశ్చ వసుధా తథా దుగ్ధా య థేచ్ఛతః || 28 దోగ్ధ వసురుచి. అతడధర్వవేద పండితుడు. పర్వతములు వివిధ రత్నాలను బిదికినవి. మేరుపర్వతము దోగ్థయై థివ్యౌషధులను (మూలికలను) పిదికెను. అక్కడ హిమవంతుడు దూడయయ్యెను. అట శిలామయపాత్ర పాలచెంబు. చెట్లు నాట్లుపెట్టినప్పుడు కారు పాలు అక్కడపాలు. మోదుగాకు దొన్నె పుష్పవన సంభరితమైన సాలము వృక్షము దోగ్ధ. అందు సర్వవృక్ష వనపతి ప్లక్షము (జువ్వి) దూడయయ్యెను. ఇంకనెందరో యధేచ్ఛగా వసుధను బిదికిరి. ఆయుర్థనాని సౌఖ్యం చ పృధౌరాజ్యం ప్రశాసతి | న దారిద్ర్యం తథా రోగే నాధనేన చ పాపకృత్ || 29 నోపసర్గా న చా ఘాతః పృథౌ రాజ్యం ప్రశాసీతి | నిత్యం ప్రముదితా లోకా దుఃఖ శోక వివర్జితాః || 30 ధనుష్కోట్యా చ శైలేంద్రానా నుత్సార్య సమహాబలః | భూమండలం సమం చక్రే లోకానాం హితకామ్యయా || 31 న పుర గ్రామ దుర్గాణి న చాయుధధరా నరాః | మ్రి యంతే యత్ర దుఃఖంచ నార్థశాస్త్రస్య చాదరః || 32 ధర్మైకతానాః పురుషాః పృథై రాజ్యం ప్రశాసతి | కధితాని చ పాత్రాణి యత్ క్షీరం చ యథా తవ || 33 యే షొ యేన రుచిస్తత్ర తేభ్యోదేత్తం విజానతా | యజ్ఞ శ్రీదేషు సర్వేషు మయా తుభ్యం నివేదితమ్ || 34 దుహితృత్వం గతా యస్మా త్పృథో పృధ్వీ మహామతే | తస్యానుసార యోగచ్చ పృధివీ విశ్రుతా బుధైః || 35 పృథురాజ్యపాలనమందు ప్రజలకు ఆయువు ధనము సౌఖ్యము సమృద్ధము. దారిద్ర్యమన్న మాటేలేదు. ధనాశకలవాడు పాపి లేనేలేడు. విప్లవములు అఘాతములును లేవు. లోకములు నిత్యానందభరితములు. దుఃఖశోకములు లేనేలేవు. ఆ బలశాలి వింటికొనచే మహాపర్వతములను లేపి లోకహితముగోరి ఎగుడుదిగుడుగానున్న నేలను చదును. సేసెను. పంట కనువు పరచెను. పురములు గ్రామములకు దుర్గములులేవు. సుగమములు సులభప్రయాణములు గావింపబడెను, ఆయుధముపట్టువారే లేరు. అట్టివారిచే మరణము దుఃఖము లేనేలేదు. అర్దశాస్త్రమం దాదరములేదు ధనార్జన వినియోగములే రాజ్యాంగ విషయములుగావు. ప్రజలకు ధర్మము (పురుషార్థము) ఒక్కటే ప్రధానలక్ష్యము. పాత్రలు పాలు నేమేమో నీకు దెల్పితిని. ఏయే దేవతల కేది యిష్టమో అది వారికి దెలిసి యీయవలెను. ఆయా యజ్ఞములందాయా పదార్ధములు నీకు నివేదించితిని. పృథుచక్రవర్తికి కూతురైనందునను అతని నాదేవి అనువర్తించి యుండుటచేతనూ పండితులు భూమికి పృధివియను ఖ్యాతినిచ్చిరి. 35 భీష్మ ఉవాచ ! ఆదిత్య వంశ మఖిలం వద బ్రహ్మన్యథాక్రమమ్ | సోమ వంశం చ తత్వజ్ఞ యథా వద్వక్తుమర్హసి || 36 పులస్త్య ఉవాచ ! వివస్వాన్ కశ్యపాత్పూర్వ మదిత్యామభవత్ పురా | తస్య పత్నీ త్రయం తద్వ త్సంజ్ఞా రాజ్ఞీవ్రభా తథా || 37 రేవతన్య సుతారాజ్ఞీ రైవతం సుషువే సుతమ్ | ప్రభా ప్రభాతం సుఘవే త్వా ష్ట్రం సంజ్ఞా తథా మనుమ్ || 38 యమశ్చ యమునా చైవతు యమతే చ బభూవతుః | తతస్తేజోమయం రూపమసహం తీ వివస్వతః || 39 నారీ ముత్పాదయామాస స్వ శరీరాదనిందితమ్ || త్వా ష్ట్రే స్వరూప రూపేణ నామ్నా ఛాయేతి భామినీ || 40 : ఆదిత్య వంశము : సూర్యచంద్రవంశముల యథాక్రమముగ దెల్పుమని భీష్ముండడుగ పులస్త్యుడిట్లనియె. కశ్యపుని కదితియందు మును సూర్యుడు జనించెను, ఆయనకు సంజ్ఞ రాజ్ఞి ప్రభయను ముగ్గురు భార్యలు. రేవతుని కూతురు రాజ్ఞి రైవతుడను కొడుకుం గనెను. ప్రభ ప్రభాతుని సంజ్ఞ త్వష్టయను మనువుం గనెను. యముడు యమునయు నను కవలపిల్లలుం గల్గిరి. సంజ్ఞ రవితేజోమయరూపము నోర్వలేక తన మేనినుండి యొక స్త్రీని జనింప జేసెను. ఆ కన్న కన్య సరిగా తనపోలికదే. ఆమెపేరు ఛాయ. 40 కిం కరో మీ తి పురతః సంస్థితాం తామభాషత | ఛా యే త్వం భజ భర్తారం మదీయం తం వరాననే || 41 అపత్యాని మదీయాని మాతృస్నే హేన పాలయ | తథేత్త్యు క్వాచ సాదేవ మగా త్కమాయ సువ్రతా || 42 కామ యా మాస దేవో `òపి సంజ్ఞేయమితి చాదరాత్ | జనయామాస సావర్ణిం మనుం మను స్వరూపిణమ్ ||43 సవర్ణత్వా చ్చ సావర్ణేర్మనో ర్వైవస్వతస్యతు | తతః సుతాం చ తపతీం త్వా ష్ట్రీం చైవ క్రమేణతు || 44 ఛాయాయాం జనయామాస సంజ్ఞేయమితి భాస్కరః | ఛాయా స్వపుత్రే త్వధికం స్నేహం చక్రేమనో తదా || 45 న చక్షమే మనః పూర్వస్తద్యమః క్రోధమూర్ఛితః | సంతర్జయా మాస తదా పాద ముత్షిప్య దక్షిణమ్ || 46 శశాపచ యమం ఛాయా భవతు క్రిమి సంయుతః | పాదో య మేకో`òభవితా పూయ శోణిత విశ్రవః || 47 ని వేదయా మాస పితుర్యమః శాపేన దర్షితః | నిష్కారణ మహం శప్తో మత్రా దేవా సకోపయా || 48 బాల భావాన్మయా కించిదుద్యత శ్చరణః సకృత్ | మనునా వార్యమాణాపి మమ శాపమదా ద్విభో || 49 ఆ ఛాయ నన్నేమిచేయమందువని సంజ్ఞనడుగ నీవు నాభర్తను బొందుము. నాబిడ్డలను గూడ మాతృ వాత్సల్యముతో సంరక్షింపుమనియెను. సరేయని యామె కామప్రవృత్తికై సూర్యని చెంతకేగెను ఈమె సంజ్ఞ యనుకొని యాదరించి యామెంబొంది సావర్ణియను మనువు స్వరూపుని గనియె. సావర్ణి వైవస్వత మనువు యొక్క వర్ణము గలవాడగుటచే నతనికి సావర్ణియను పేరు సార్ధకమయ్యెను. ఆమీద తపతిని ఛాయయే యనుకొని యామె యందు తపతిని త్వాష్టిని గనెను. ఛాయ తన కొడుకు మనువునం దెక్కువ వాత్స్యలము నెరవును. తొలుత సంజ్ఞయందు పుట్టిన యముడు మనువది సంహింపలేడయ్యెను, దాన కోపవశుడై కుడిపాదమెత్తి సవతితల్లిందన్నుదునని బెదరించెను. అంతట ఛాయా''నీ పాదమును పురుగులోడుగాక చీమురక్తముగారుగాక '' యని శపించెను. శాపమునకు జడిసీ యముడీ విషయమును దండ్రికెరిగించి అకారణముగ నేను మా అమ్మచే కోపముచే శపింపబడితిని కుఱ్ఱతనముచే కొంచెమొకసారి నా పాదమెత్తితిని. మనువు వద్దన్ననూ నామె నాకు శాపమిచ్చినది. ప్రాయోన మాతా సా స్మాక మసమాస్నేహ తోయతః | దేవో ప్యాహయమం భూయః కింకరో మి మహామతే || 50 సౌఖ్యా త్కస్య నదు ఖం స్యాద థవా కర్మ సంతతిః | అనివార్యం భవస్యాపి కాకథన్యేషు జంతుషు || 51 కృకవాకుస్తవ పదే సక్రిమిం భక్షయిష్యతి | ఖంజం చ రుచిరం చైవ పాదమే తద్భవిష్యతి || 52 ఏవ ముక్తః సమాశ్వస్తస్తప స్తీవ్రం చకారహ | వైరాగ్యా త్సుష్కరే తీర్థే ఫల ఫేనానిలాశనః || 53 పితామహం సమారాధ్య యా వద్వర్ష యుతం పునః | తపః ప్రభావాద్దేవేశః సంతుష్టః పద్మసంభవః || 54 వవ్రేసలోక పాలత్వం పితృలోకం తథాక్షయం | ధర్మా ధర్మాత్మకస్యాస్య జగతస్తు పరీక్షణమ్ || 55 ఏవం సలోకపాలత్వ మగమ త్పద్మ సంభవాత్ | పితౄణామాధి పత్యంచ ధర్మాధర్మస్య చానఘ || 56 వివస్వానధ తజ్ఞాత్వా సంజ్ఞాయాః కర్మచేష్టితమ్ | త్వష్టుః సమీప మగమదా చచక్షే సరోషవాన్ || 57 తమువాచ తతస్స్వషాసాంత్వ పూర్వ మిదం వచః తవాసహంతీ భగవంస్తేజస్తీవ్రం తమోనుద || 58 వడవారూప మాస్థాయ మత్సకాశ మిహాగతా | దవారితా మయాసా చ త్వద్భయేన దివస్పతే || 59 యస్మాద విజ్ఞాత మనా మత్సకాశ మిహాగతా | తస్మాన్మదీయం భపనం ప్రవేష్టు న తవార్హతి || 60 ఏవ ముక్తా జగామశుమరుదేశ మనిందితా | వడవారూప మాస్థాయ భూతలే సంప్రతిష్ఠితా || 61 తస్మాత్ర్పసాదం కురుమే యద్వనుగ్రహ భాగవామ్ | అవనేష్యామితే తేజః కృత్వా యన్త్రే దివాకరమ్ ||62 రూపం తవ కరిష్యామి లోకానంద కరం ప్రభో | | తథేత్యుక్తః సరవిణాభ్రమే కృత్వా దివాకరమ్ || 63 పృథక్చకార తేజశ్చ చక్రం విష్ణోః ప్రకల్పయత్| త్రిశూలం చాపి రుద్రస్య వజ్ర మింద్రస్య చాపరమ్ || 64 దైత్య దానవ సంహర్తు సహస్ర కిరణాత్మకమ్ | రూపం చా ప్రతిమం చక్రే త్వష్టా పద్భ్యమృతంమహత్ || 65 నశశాక చ తద్ ద్రష్టుం పాదరూపం రవేః పునః | అద్యాపి చ తతః పాదౌ న క శ్చిత్కార యే త్వ్కచిత్ || 66 యః కరోతి స పాపి ష్ఠోగతి మాప్నోతి నిందితామ్ | కుష్ట రోగమావాప్నోతి లోకేస్మిన్ దుఃఖ సంజ్ఞితమ్ ||67 తల్లితో సమానమైన ప్రేమలేనిదిది బహుశః ఆమె మా అమ్మ కాదన సూర్యదేవుండను యమునింగని బుద్ధిమంతుడా | యేమిచేయను. సుఖము దుఃఖము వేరికి గల్గదు? అదిగాక కర్మసంతతి పరమేశ్వరునికైన వారింపరాదు. ఇతర జంతువుల షయమున జెప్పెడిదేు? నీ పాదక్రిమిని వడి తినగలదు. ఇది ఖంజమైనను (కుంటివడినను) నందముగా నుండునులే యని యనునయింపబడి యముడు విరక్తిగొని పుష్కరతీర్ధమందు పండ్లు నురుగు గాలియుందిని తీవ్ర తపస్సు సేసెను. బ్రహ్మను పదివేలేండ్లారాధించెను. ఆ తపఃప్రభావమునకు దేవేశుడు బ్రహ్మ సంతుష్టుడయ్యెను. యముడాయనను లోకపాలత్వమును అక్షయలోక నివాసమును ధర్మాధర్మాత్మకమైన యీ జగత్తు యొక్క పరీక్షాధికరమును గోరుకొనెను. ఇట్లాతడు పద్మభవుని వలన నా మూడు కోరికలనుబడసెను. అటుపైని సూర్యుడు సంజ్ఞ చేసినచేతల దెలిసికొని ఆమెతండ్రి త్వష్టదరికేగి రోషముతో నీ చేసినపని తెలిసెను. త్వష్ట యతని ననునయించుచు నిట్లనెను. నీ తేజస్తీవ్రత నోర్వలేక ఓ తమోహర | సంజ్ఞ బడబరూవమున ఆడుగుఱ్ఱము రూపుగొని నాకడకిక్కడకు వచ్చినది. నేను వద్దన్నను వలన జడిసి మనసుతెలసుకొనలేక నా యింటికివచ్చినది కావున యిది తిరిగి నా యిల్లు నీ యిల్లుంగూడ సొచ్చుటకు తగదనెను. తండ్రి యిట్లన్నంత నాసాధ్వి గుఱ్ఱము రూపుకొని యొక యెడారికి వెళ్ళి పోయెను నేడునక్కడనున్నది. నేను పాత్రుడనేని నాయెడ నీవనుగ్రహము సూపుము. నిన్నొక యంత్రమెక్కించి తరణిబట్టి నీ తీవ్రతను తగ్గింతును. నీరూపు లోకనందకర మొనరింతుననెను. అతడు వల్లెయన భ్రమమందు (తిరుగాడుసారెయందు) రవినెక్కించి యాయన తేజస్సునెల్ల వేర్పరచేను. దానితో విష్ణు చక్రముంగల్పించెను. రుద్రుని త్రిశూలమును యింద్రుని వజ్రాయుధముం గూడ దాననే సంహారకమైన సహస్ర కిరణాత్మకరూపమును పాదములు లేకుండ నొనరించెను. రవి పాదములతోడ రూపమీక్షింప జాలనిదయ్యెను. నేటికిని సూర్యభగవాను నర్చించునెడ నాయన మూర్తుకి పాదములుంచరాదు. ఒకవేళ పాదములున్న మూర్తినర్చించునచో అతడు దుర్గతిపాలగును. కేవల దుఃఖమైన కుష్టువ్యాధిపాలగును. తస్మాన్న ధర్మకామార్ధీ చిత్రేష్వాయతనేషు చ | నక్వచి త్కారయే త్పాదౌ దేవదేవస్య ధీమతః || 68 ఓ బుద్ధిమంతులరా | ధర్మకామములు కోరువాడు చిత్తర్వులందు దేవాలయములందును దేవదేవుడగు సూర్యునికి బాదములు చిత్రింపరాదు. తతః స భగవాన్గత్వా భూర్లోక మమ రాధిపః | కామయామాస కామార్తో ముఖ ఏవ దివాకరః || 69 అశ్వరూపేణ మహతా తేజసా చ సమన్వితః | సంజ్ఞా చ మనసా క్షోభ మగ మద్భయ విహ్వలా || 70 నాసా పుటాభ్యా ముసృప్టం పరో`òయమితి శంకయా | తస్యా థరే తసో జాతావశ్వినా వితినః శ్రుతమ్ || 71 దస్రౌ శ్రుతిత్వాత్సంజాతౌ నాసత్యౌ నాసికాగ్రతః | జ్ఞాత్వా చిరాచ్చతం దేవం సంతోష మగమత్సరమ్ || 72 విమానేనాగమత్స్వర్గే పత్న్యా సహ ముదాన్వితః | సావరోణ్య`òపి మనుర్మేరావ ద్యాపి తపతే తపః ||73 శనిస్తపో బలాచ్చాపి గ్రహాణాం సమతాం గతః | యమునా తపతీ చైవ పునర్నద్యో బభూవతుః || 74 విష్ఠిర్ఘోరా త్మికా తద్వత్కాల త్వేన వ్యవస్థితా | అవ్వల సూర్యభగవానుడు భూలోకమునకు వచ్చి కుమార్తుడై ముఖమునందే రమింపగోరెను. అందులకు తన దివ్యతేజమున నశ్వరూపము ధరించెను. సంజ్ఞ భయభ్రాంతయై మనసున క్షోభించెను. ఆతడు తన భర్తగా డెవడో యన్యుడని నా రవి తేజస్సును (వీర్యమును) ముక్కుపుటములం జీదివేసెను. ఆ తేజస్సునుండి అశ్వినులు పుట్టిరని విన్నాము. నాసిక (ముక్కు కొననుండి పుట్టిరికాన నాసత్యులు) శ్రుతిత్వముచే దస్రులు నను పేరా యిద్దరువడసిరి. సంజ్ఞ తనను బడబారూపముననున్న దానిని అశ్వరూపమున బొందిన యాతడా సూర్యభగవానుడు తన భర్తయేనని తెలిసి పరమానందభరితులయ్యెను. భానుడు నెంతో సంతోషపడి పత్నితో విమానమున స్వర్గమున కేగెను. సావర్ణ్యమను విప్రుడును మేరువునందు తపస్సు సేయుచున్నాడు. సూర్యునికి ఛాయయందు జనించిన శని తపోబలమున గ్రహము తోడివాడయ్యెను. యమున తపతియును నదులైరి. ఘోరరూపయైన విష్ఠి కాలరూపముననుండెను. 74 మనౌర్వైవస్వ తస్యాపి దశపుత్రా మహాబలాః || 75 ఇలస్తు ప్రధమస్తేషాం పుత్రేష్ట్వా సమకల్పియః | ఇక్ష్వాకుః కుశనాభశ్చ అరిష్టో ధృష్ట ఏవచ || 76 వైవస్వతమనువునకు పదిమంది కొడుకులు పుట్టిరి. అందు మొదటవా డిలుడు. ఇక్ష్యాకువు కుశనాభుడు అరిష్ఠుడు ధృష్టుడు 76 నరిష్యంతః కరూషశ్చ శర్యాతిశ్చ మహాబలః | వృషధ్రశ్చాథ నాభాగః సర్వేతే దివ్యమానుషాః || 77 అభిషిచ్య మనుః పూర్వమిలం పుత్రం సధార్మికమ్ | జగామ తబసే భూయః పుష్కరం సతపోవనమ్ || 78 అథా జగామ సిద్ధ్యర్ధం తస్య బ్రహ్మా వరప్రదః | వరం వర య భద్రం తి మానవేయ యథేప్సితం|| 79 ఉవాచ సతదా దేవం పద్మాక్షం పద్మజం విభుమ్ | వశేమే ధర్మసంయుక్తాః ప్భధివ్యాం సర్వ పార్ధివాః || 80 భ##లేయు రీశ్వరాః స్వామిన్ ప్రసాదాత్తవ కంజజ | తథేత్యుక్త్వా తదేవేశస్త త్రైవాంతర ధీయత || 81 తలో೭యోధ్యాం సమాగత్య సమ తిష్ఠద్యథా పురా | అదై కదా రథరూఢ ఇలో నిజసుతో మనోః || 82 నిర్జగామార్థ సిద్ధ్యర్ధ మినప్రాయాం మహీమిమామ్ | భ్రమన్ ద్వీపాని సవర్ణాని క్ష్మాభృతః సంప్రసాదయన్ || 83 జగామోపవనం శంభోరథాకృష్టః ప్రతాపవాన్ | కల్పద్రుమ లతాకీర్ణం నామ్నా శరవణం మహత్ || 84 రమతే యత్రదేవేశః సోమః సోమార్థశేఖరః | ఉమయా సమయస్తత్ర పరాశరవణ కృతః || 85 నరిష్యంతుడు కరూషుడు శర్యాతి పృషధ్రుడు నాభాగుడు ననువారు పదిమంది. జ్యేష్ఠుడగు నిలుని ధార్మికుని సార్వభౌమునిగా పట్టాభిషేకించి మనువు తిరిగి పుష్కరక్షేత్రమందలి తపోవనమున కేగెను. తపస్సిద్ధి నిచ్చుటకు బ్రహ్మవచ్చి భద్రమగుత వరము కోరుకొమ్మన మనువు పద్మలోచనుని పద్మ భవు నా బ్రహ్మదేవుంగని పృథివి యందున్న యెల్ల సమర్థులు పార్థివులు ధర్మనిష్ఠులు నాకు స్వాధీనమగుదురుగాక స్వామీ ! పంకజోద్భవ ! యిది నా అభిలాష యన నప్పుడే యాలాగే యని యటనే యంతర్థానమందెను. అవ్వల మునువటియట్ల యాత డయోధ్యకువచ్చి యటనుండెను. అవ్వల నొకప్పుడు మనువు కొడు కిలుడు ప్రతాపశాలి రధమెక్కి కొండొక ప్రయోజనము సిద్ధింప నీ భూమినెల్ల తిరిగి ద్వీపములెల్ల తిరిగి పర్వతముల గూల్చి చదునుచేయుచు (సమతలముచేయుచు) రథమట్టెలాగుకొనిపొవ శంభుదేవుపవనమున కేగెను. పరమేశ్వర మహోద్యానమది కల్పలతా ద్రుమాకీర్ణము. శరవణమని పిలువబడుచుండెను. సోమార్థశేఖరుండు (సగము జాబిల్లిం దల దాల్చినవాడు) మున్నుమా దేవితో నా శరవణమందు సమయము కట్టడ సేసియుండును. 85 పుం నామ సంజ్ఞం యత్కించిదాగమిష్యతి నోవనమ్ | స్త్రీ త్వ మేథ్యతి తత్సర్వం దశయోజనమండలే || 86 అజ్ఞాత నమయో రాజా ఇలః శరవణం గతః | స్త్రీ త్వం జగామ సహసా పడవాశ్వో೭భవన్ క్షణాత్ || 87 పురుషత్వే కృతం సర్వం స్త్రీకాయే విస్మృతం తతః | ఇలే తి సో೭భవన్నారీ పీనోన్నతఘనస్తనీ 88 ఉన్నతశ్రోణి జఘన పద్మపత్రాయతేక్షణా | పూర్ణేందు వదనా తన్వీ విలాసిన్యా సితేక్షణా || 89 పీనోన్నతాయ త భుజనీల కుంచిత మూర్ధజా | తను లోమాసు వదనామృదు గద్గద భాషిణీ || 90 శ్యామా గౌరేణ వర్ణేన తను తామ్ర నఖాంకురా | కార్ముక భ్రూయుగోపేతా హంసావరణ గామినీ || 91 భ్రమ మాణావనే తస్మిన్ చింతయామాస భామినీ | కోమే పితా వా భ్రాతా వా కోమేత్రాతా భ##వేదిహ || 92 కస్య భర్తురహం దత్తా కియ ద్వర్షాస్మి భూతలే | చింతయంతీ చ దదృశే సోమపుత్రేణ సాజ్గునా || 93 ఇలారూప స మాక్షిప్త మానసావర వర్ణినీ | బుధస్త దాప్తయే యత్నమకరో త్కామ పీడితః || 94 పది యోజనములు చుట్టుకొలుత గలదానికి మన యీ ఉద్యానవనమునకు పురుషుడనే పేరుగలదేదేని కొంచెము వచ్చెనా యత డాడుది యగునని యా శివుడు చేసిన సమయము. ఇలు డాసమయమెఱుంగక శరవణమునకేగెను. (శరణనగా ఱల్లు) ఏగిన క్షణములో హఠాత్తుగా స్త్రీ యయ్యెను, బడబ అశ్విరూపముననున్న సంజ్ఞ గుఱ్ఱమయ్మెను. పురుషుడుగానున్నపుడు స్త్రీ శరీరమందాతడు సేసినదెల్ల మఱపయ్యెను. బలిసిన ఎత్తైన బిగువుగొన్న చన్నులుగల యిల యను నాడుదిగ నాతడు తయారయ్యెను. ఎత్తైన పిరుదలు జషునము తామరరేకులట్టి కాటుక కన్నులు నిండు చందురుని కెనయగు నెమ్మోమును సన్నని నడుము గలిగి బలసిన ఎగుభుజములు, ఉంగరాల్దిరిగిన నల్లని తలకట్టు అల్పాల్ప రోమాళి చక్కని మోము మృదువుగ నెడనెడ తడబడుచు ముద్దుగులుకు బలుకులుంగల ముద్దియయై అప్పుడే యంకురించు జవ్వనముతో గౌరవర్ణియై (తెలుపు పసుపు కలిసినరంగు గౌరవర్ణము) అల్పాల్పము లెఱుపుగదిరిన నఖాంకురము లలర వంగిన వింటికెనయగు కనుబొమ్మలతో హంసగమనయై యవ్వనమున నిట్టటు దిరుగుచు నా ఖామిని నా తండ్రి యెవడు తమ్ముడెవడు సంరక్షకుడెవడిక్కడ ఏ మగనికి నేనీబడితిని అవనితల మందెంత వయసుగల దాననని యాలోచించుచు సోమకుమారుడగు బుధునిచే నట తిలకింపబడెను. అవ్వరవర్ణిని ఇలా రూపముచే నాకర్షింపబడినదయ్యెను. బుధుడు కామపీడితుడై యామెం బొందుటకు యత్నమొనరించెను. 94 విశిష్టాకారవా న్ముండీ న కమండలు పుస్తకః | వేణు దండ కృతావేశః పవిత్రక ఖనిత్రకః 95 ద్విజరూపః శిభీబ్రహ్మా నిగదన్ కర్ణకుండలీ | వటు భి శ్చార్ధి భిర్యుక్తః సమిత్పుష్పకుశోదకైః || 96 వనే೭నిష్యన్ తతస్తిస్మి న్నాజుహావనతా మిలామ్ | బహిర్మనస్యాంతరితః కిలపాదక మండపే || 97 ససంభ్రమమకస్మాచ్చ సోపాలంభ మివా భవత్ | త్యక్త్వాగ్నిహోత్ర శుశ్రూషాం క్వాయాతా మందిరాన్మమ || 98 ఇయం విహారవేలాతే అతిక్రామతి సాంప్రతమ్ | ఏహ్యేహిపృథు సుశ్రోణి సంభ్రాంతా కేన హేతునా || 99 ఇయం సాయంతనీ వేలా విహారస్యేహ భామిని || కృత్వోప లేపనం పుష్పేరలం కురు గృహం మమ || 100 చక్కని రూపుగొని తలబోడియై కమండలుపు పుస్తకము వెదురుదండము చేత (వ్రేలికి) పవిత్రము తపుగోలయుం బూని జుట్టుముడితో బ్రాహ్మణరూపుడై వేదమువల్లెవేయుచు చెవి కుండలముతో భిక్షార్థులగు వటువులతో (బ్రహ్మచారులతో) గూడి సమిధలు పువ్వులు దర్భలు తీర్ధోదకములునుం బూని బుధు డావనమున వెదకులాడుచు నా యిలను ఇలా ఇలా యని పిలచెను. చెట్లగుబురునందాగి (స్థూలశరీరము దాచి) మనస్సును (అంతరంగమును) బహిరంగమొనరించి తడబడుచు హఠాత్తుగ ద్రిప్పుచున్నాడన్నట్లయి అగ్నిహోత్ర శుశ్రూష (సేవ) మాని నా యిల ఏటువోయితివే. ఇది నీ విహారసమయ మిదె దాటిపోవుచున్నది. ఇలా ఇలారా నీ పిరుదులెంత పెద్దవి ఎంత బాగున్నవి? ఎందులకు కంగారుపడుచుంటివి? ఇదిగో యిది సాయం సమయము. ఓ భామిని యిట విహరింపుము. గంధము పూసికొని పువ్వులు ముడిచికొని నా గృహమలంకరింపుము. 100 సాబ్రవీ ద్విస్మ తాహం చ సర్ప మేవ తపోధన | ఆత్మానం త్వాం చ భర్తారం కులం చవదమే೭నఘ || 101 బుధః ప్రోవాచతాం తన్వీ మిలాత్వం పరవర్ణిని | అహం చ కాముకో నామ బహువిద్యో బుధఃస్మృతః || 102 తేజస్విసః కులేజాతః పితామే బ్రాహ్మణాధిపః | ఇతి సాతస్య వచనా ప్రవిష్టా బుధమందిరమ్ || 103 రత్నస్తంభ సమాకీర్ణం దివ్య మాయా వినిర్మితమ్ | ఇలా కృతార్థ మాత్మానం మేనే తద్భవనే స్థితా || 104 అహోవృత్త మహోరూప మహోధన మహోకులమ్ | మమ చాస్య చ భర్తృర్వా అహోలావణ్య ముత్తమమ్ || 105 రేమే చ సా తేన నమ మతికాలమిలావనే | సర్వభోగమయే గెహే మహేంధ్రభవనే తథా || 106 నా విని ఆమె ఓ తపోధనా ! అంతా మఱచిపోయాను. నన్ను నా పెనిమిటిని నిన్ను కులము సర్వము మరపయ్యె. ఓ పుణ్యాత్ముడ ! నాకు జెప్పుమన; బుధుడామెతో వరవర్ణిని ! నేనొక కాముకుడనులే. బహువిద్యలు నేర్చినాడను నన్ను బుధుడందురు. మహాతేజస్వి కులమందు బుట్టితివి. మా తండ్రి బ్రాహ్మణాధిపతి అని పల్కి యాతని మాటంబట్టి యా బుధుని మందిరమును బ్రవేశించెను. ఆ మందిరము నెటుసూచిన రతనాల స్తంభములు అది మయు నిర్మాణము. ఆ యింట నిలిచి యా యిల తాను ధన్యురాలనైతి ననుకొనెను. ఓహో! ఏమి నడవడి ? ఏమి రూపము? ఏమి ధనము ? ఏమి కాలము ? నాది యు నా మగనిది యు లావణ్య మత్యుత్తమము అని య య్యిల యవ్వనమున ఎంతోకాలమతనితో క్రీడించెను. ఆమెకు సర్వభోగములకు నెలవా భపన మింద్రభవనమే యయ్యెను. అథాన్విప్యం తో రాజానం బ్రాతరస్తస్య మానవాః | ఇక్ష్వాకు ప్రముఖా జగ్ముస్తదా శరవణాంతికమ్ || 107 తతస్తేదదృశుః శ##ర్వేవడవా మగ్రతఃస్థితామ్ | రత్న పర్యంత కిరణదీప్యమానా మనుత్తమామ్ || 108 సంప్రాప్య ప్రత్యభి జ్ఞానా త్సర్వే విస్మయా మాగతాః | అయా చంద్ర ప్రభోనామ వాజీ తస్య మహాత్మనః || 109 అగమద్వాడవా రూప ముత్తమం కేన హేతునా | తతస్తు మైత్రా వరుణిం ప్రపచ్ఛుః స్వ పురోహితమ్ || 110 కిమేతదిత్య భూచ్చిత్రం పద యోగవిదాం వర | వసిష్ఠో ప్యబ్రవీ త్సర్వా దృష్ట్వా తం ధ్యాన చక్షుషా || 111 సమయం శంభు దయితాకృతా శరవణపురా | యః పుమాన్ర్ప విశేచ్చాత్ర సనారి త్వ మ వాప్స్యతి || 112 అయ మశ్వో೭పి మగాద్రాజ్ఞా సహైవతు ఇలః పురుహూతామితి యథాసౌ ధనదోపమః || 113 తథైవ యత్నః కర్తవ్య ఆరాధ్య చ పినాకినమ్ | తదస్తే మానవా జగ్ముర్యత్ర దేవో మహేశ్వరః || 114 తుష్టువు ర్వివిధైః స్తోత్రైః పార్వతీపరమేశ్వరౌ | తావూచ తురలంచైవ సమయః కింను సాంప్రతమ్ || 115 ఇక్ష్వాకో రశ్వమేధే నయత్ఫలంస్యా త్తదావయోః | దత్వా కిం పురుషో వారః స భవిష్య త్య సంశయమ్ 116 తథేత్యుక్త్వాతు తే సర్వే జగ్ముర్వైవస్వ తాత్మజా | ఇష్ట్వాశ్వమేధే సతత ఇలా కిం పురుషో೭భవత్ || 117 మాసమేకం పుమాన్ వీరః స్త్రీ త్వం మాసమ భూత్పునః | బుధస్వ భవనే తిష్ఠన్నిలో గర్భ ధరో೭భవత్ || 118 అవ్వల నీఱనితమ్ము లిక్ష్వాకుపు మొదలగు వారాతనిని వెదకుచు శరవణ సమపమున కేగిరి. అవ్వల వారెట్ట యెదుటనున్న ఆడుగుఱ్ఱముం జూచిరి అతి రత్నాలకాంతులతో మెఱసిపోవుచుండెను. అటుసేరి గుర్తులంబట్టి యందరు నచ్చెరువందిరి. అదిగో యిది ఆ మహానుభావుని గుఱ్ఱము చంద్రప్రభమనునది. ఏమి కారణముచే నిది యీ ఉత్తమమైన దేవరూపమందినది? అని మైత్రావరుణుని (వసిష్ఠులను) తమ పురోహితునడిగిరి. ఇదేమి చాల వింత యిది యోగవిద్వరుడపు చెప్పుమన వసిష్ఠుడు ధ్యాననేత్రమునం జూచి యంతయుం దెలిపెను. శంభుప్రియ (పార్వతి) శరవణ విషయములో మున్ను ఇందెవడేని పురుషుడు ప్రవేశించినా ఆడుదియగునని నొక కట్టడిసేసినది. కుబేరసముడీ ఇలుడు పురుషత్వమందునట్లు యత్నము సేయవలెను. పరమశివుని ఆరాధించి యిందుకు పూనుకొనుడన వారు మహేశ్వరుని సన్నిధికేగి వివిధ స్తోత్రముల పార్వతీ పరమేశ్వరులను స్తుతించిరి. వారును చాలు నిక నిపుడు సమయమేమి. ఇక్ష్వాకు వశ్వమేధముసేయగల్గు ఫలమది మాకు సమర్పించిన నతడు పురుషుడగును సంశయములేదు. అట్లేయని వైవస్వత మనుకుమారులు వారశ్వమేధము సేసిరి. ఇలా దేవి కింపురుషుడయ్యెను. ఒక్కనెల పురుషుడు ఒక్కనెల స్త్రీయునయ్యెను. బుధునింట వసించుచు నిలుడు గర్భవతుడయ్యెను. 118 అజీజనత్ పుత్రమేక మనేక గుణ సంయుతమ్ || బుధ ఉత్పాద్య పూర్వం సస్వర్ధ మగమ త్పునః || 119 ఒక్కపుత్రుని పెక్కుగుణములు గలవానిని బుధుడట గని తరిగి స్వర్గమునకేగెను. 119 ఇలస్య నామ్నా తద్వర్ష మిలావృత మభూత్తదా | సోమార్క వంశజో రాజా ఇలో೭భూద్వంవంశ వర్థనః || 120 ఏవం పురూరవాః పురోరభద్వంశ వర్ధనః | ఇక్ష్వాకు రర్కవంశస్య తథైవోక్తో నరేశ్వరః || 121 ఇలః కిం పురుషత్వే చ సుద్యుమ్న ఇతిచోచ్యతే | పునః పుత్రత్రయ మభూ త్సుద్యుమ్నస్యా పరాజితమ్ || 122 ఉత్కలో೭థ గయ స్తత్వద్ధరి తాశ్వశ్చ వీర్యవాన్ | ఉత్కల స్యోత్కలానామ గయాస్యతు గయాపురీ || 123 హరితాశ్వస్య దిగ్యా మ్యా సంజ్ఞాతా కురుభి సహ | ప్రతిష్ఠానో೭భిషిచ్యాథ న పురూరవ సంస్తుతమ్ || 124 జగామేలావృతం భోక్తుం దివ్యం వర్షం ఫలాశనః | ఇక్ష్వాకు ర్జేష్ఠ దాయాదో మధ్యదేశ మవాప్తవాన్ || 125 నరిష్యం తస్యపుత్రో೭భూచ్ఛుకోనా మహాబలః | నాభాగా దంబరీషస్తు ధృష్టస్యతు సుతత్రయమ్ || 126 ధృష్టకేతుః స్వధర్మా%థో రణధృష్టశ్చ వీర్యవాన్ | ఆనర్తోనామ శర్యాతేః సుకన్యాచైవ దారికా || 127 ఇలునిపేర నిప్పుడావర్షమిలావృతమయినది. చంద్రశూర్య వంశజుడగు రాజు ఇలుడు వంశవర్ధను డయ్యెను. ఇట్లే పురూరవుడు పూరుని కుదయించి వంశవర్ధనుడయ్యెను. అట్లే ఇక్ష్వాకు మహారాజు సూర్యవంశ వర్ధనుడయ్యెను. ఇలుడు కింపురుషుడై సుద్యుమ్నుడని పిలువబడెను. అతని కపరాజితులు ముగ్గురు కొడుకులు గల్గిరి. వారు ఉత్కలుడు, గయుడు, హరితాశ్వుడు ననువారు. ఉత్కలుని రాజధాని ఉత్కల. గయుని నగరము గయ, హరితాశ్వుని దిశ దక్షిణము. అతడు పురూరవుని తన కుమారుని ప్రతిష్ఠాన నగరమం దభిషేకించి ఒక్క దివ్యసంవత్సరము ఫలాహారము మాత్రముసేసి యిలావృత వర్షముననుభవింప (పాలింప) నేగెను. జ్యేష్ఠుడు ఇక్ష్వాకుడు మధ్యదేశమునొందెను. నరిష్యంతుని కొడుకు శుకుడు మహాబలశాలి. నా భాగునికి అంబరీషుడు పుట్టెను. దృష్టునికి దృష్టకేతువు స్వధర్ముడు రణధృష్టుడు నను ముగ్గురు జన్మించిరి. శర్యాతి కొడుకు ఆనర్తుడు - కూతురు సుకన్య 127 ఆనర్తస్యా భవత్పుత్రో రోచమానః ప్రతాపవాన్ | ఆనర్తోనామ దేశో೭భూన్నగరీచ కుశస్థలీ || 128 రోచమానస్య పుత్రో೭భూ ద్దైవతుః | కకుద్మీచాపరం నామ జ్యేష్ఠ పుత్ర శతస్య చ || 129 రేవతీ తస్య సా కన్యా భార్యా రామస్య విశ్రుతా | కరూషాచైవ కరూషాబహవః ప్రథితా భువిః || 130 పృషధ్రో గోవధా చ్ఛుద్రోగురు శాపా దజాయత | ఇక్ష్వాకు పుత్రా నామ్నాథ వికుక్షి నిమిదండకాః || 131 శ్రేష్ఠాః పుత్రశతస్యా స స్పంచాశ చ్ఛాథ తత్సుతాః | మేరో రుత్తరత స్తేతు జాతాః పార్థివ సత్తమాః || 132 చత్వారింశ త్తథాష్ఠాన్యే శరమన్యే చ యే భవన్ | మేరోర్దక్షిణ తశ్చైవ రాజానస్తే ప్రకీర్తితాః || 133 జ్యేష్ఠాత్కకుత్థ్సనామా భూ త్సు తస్తస్య సుయోధనః | తస్యపుత్రః పృథుర్నామ విశ్వస్తస్య పృథోః సుతః || 134 ఆర్ధ్రస్తస్య చ పుత్రో೭భూ ద్యువనాశ్వ స్తతో೭భవత్ | యువనాశ్వస్య పుత్రో೭భూ చ్ర్ఛావస్తోనామ వీర్యవాన్ || 135 నిర్మితా యేన శావస్తీహ్యంగదేశే నరాధిప | శవస్తాద్ బృహదశ్వో೭భూ త్కువలా శ్వస్తతో೭భవత్ || 136 ఆనర్తుని కొడుకు రోచమానుడు. ప్రతాపశాలి. ఆతని పేరున ఆనర్తమను దేశముగలదు. దానికి రాజధాని కుశస్థలి. రోచమానుని కుమారులు నూర్వురిలో రైవతుడు పెద్ద. కకుద్మి యని యతనికింకొకపేరు. అతని కూతురు రేవతి. బలరాముని భార్య. కరూషుని కొడుకులు కౌరూషులు పెక్కురు ప్రసిద్ధులు. వారిలో వృషధ్రడనువాడు గోవధచేసి గురుశాపమువలన శూద్రుడయ్యెను. ఇక్ష్వాకువు కొడుకులు వికుక్షి, నిమి, దండకుడును నూరుగురిలో వీరు ముగ్గురు నుత్తములు. వారి కుమారు లేబదిమంది. మేరువున కుత్తరమున వారు జనించిరి. వారిలో పెద్దవానికి కుకుత్సుడుదయించెను. అతనికొడుకు సుయోధనుడు. అతనికొడుకు పృథువు, అతనికి విశ్రుడు, అతనికి ఆర్ద్రుడు అతనికి యువనాశ్వుడు గల్గిరి. శ్రావస్తియను నగర మంగదేశమున నిర్మించిరి. శ్రావస్తుడు యువనాశ్వుని కుమారుడు. శ్రావస్తుని తనయుడు బృహదశ్వుడు, అతనికొడుకు కువలాశ్వుడు. 136 ధుంధు మార త్వ మగమ ద్ధుంధుం హత్వా೭సురం పురా | తస్య పుత్రాస్త్రయో జాతా దృఢాశ్వోఘృణిరేవచ || 137 కపిలాశ్వశ్చ విఖ్యాతో ధౌంధుమారిః ప్రతాపవాన్ | దృఢాశ్వస్య ప్రమోదస్తు హర్యశ్వస్తస్య చాత్మజః || 138 హర్యశ్వస్య నికుంభో೭భూ త్సంహతాశ్వస్తతో భవత్ | అకృతాశ్వో రణాశ్వశ్చ సంహతా సుతావుభౌ || 139 యువనాశ్వో రణాశ్వస్య మాంధాతా చ తతో೭భవత్ | మాంధాతుః పురుకుత్సో భూద్ధర్మసేతుశ్చ పార్థివః || 140 ముచుకున్దశ్చ విఖ్యాతశ్శక్ర మిత్రః ప్రతాపవాన్ | పురుకుత్సస్య పుత్రో೭భూత్ దుఃసహోనర్మదా పతిః || 141 సభూతిస్తస్య పుత్రో೭భూత్త్రిధన్వా చ తతో೭భవత్ | త్రిధన్వనః సుతో జాతస్త్రయ్యారుణ ఇతి స్మృతః || 142 తస్య సత్యవ్రతోనామ తస్మాత్ సత్యరథః స్మృతః | తస్యపుత్రో హరిశ్చంద్రో హరిశ్చంద్రస్య రోహితః || 143 రోహితస్య వృకో జాతో వృకార్వాహు ర జాయత | నగరస్తస్య పుత్రో೭భూద్రాజా పరమాదార్మీకః || 144 ద్వేభార్యే సగరస్యాపి ప్రభా భానుమతీ తథా | తాభ్యామారాధితః పూర్వమౌర్వాగ్ని పుత్రకామ్యయా || 145 కువలాశ్వుడు నందుడను నసురుంజంపి దుంధుమారుడను పేరొందెను. అతని కొడుకులు దృడాశ్వుడు ఘృణి, కపిలాశ్వుడు, ననువారు ముగ్గురు. కపిలాశ్వడు మంచి బలశాలి. దృడాశ్వుని కుమారుడు హర్యశ్వుడు. అతని కొడుకు నికుంభుడు. వానికి సంహతాశ్వుడు గల్గెను. అతనికి అకృతాశ్వుడు రణాశ్వుడునుం గల్గిరి. రణాశ్వునికి యువనాశ్వుడు, వానికి మాంధాతయు వానికి పురుకుత్సుడు గల్గిరి. పురుకుత్సుడు దుర్జయుడు నర్మదాపతి. అతనికి సభూతి వానికి త్రిధన్వుడు వానికి త్రయ్యారుణి. అతనికి సత్యవ్రతుడు, వానికి సత్యరథుడు, వానికి హరిశ్చంద్రుడు అతనికి రోహితుడు, అతనికి వృకుడు, అతనికి బాహువు గల్గిరి. అతని కొడుకు సగరుడు పరమధర్మాత్ముడు. అతనికి ప్రభ, భానుమతి యనువారిద్దరు భార్యలు, వారు మున్ను పుత్రకామనతో ఔర్వాగ్నిని (బడబాగ్నిని) ఆరాధించిరి. 145 ఔర్వస్తుష్టస్తయోః ప్రాద్యాదధేష్టం వర ముత్తమమ్ | ఏకాష ష్టిసహస్రాణి సుత మేకం తథాపరా || 146 అగృహాద్వంశకర్తారం ప్రహ్లా೭గృహ్లాద్వ హూన్సుతాన్ | ఏకం భానుమతీ పుత్రమగృహ్లాదసమంజసమ్ || 147 తతః షష్టి సహస్రాణి సుషువే యాదవీప్రభా | ఖనంతః పృథివీం దగ్థా విష్ణునా యేశ్వగార్గణ || 148 అసమంజస తనయో హ్యంశుమా న్నామ విశ్రుతః | తస్యపుత్రో దిలీపస్తు దిలీపాత్తు భగీరథః || 149 యేన భాగీరధీ గజ్గా తపఃకృత్వావతారితా | భగీరథస్య తనయో నాభాగ ఇతి విశ్రుతః ||150 నా భాగ స్యాంబరీషో೭భూ త్సింధు ద్యీప స్తతో೭భవత్ | తస్యాయుతాయుః పుత్రో೭భూ దృతుపర్ణస్తతో`òభవత్ || 151 తస్య కల్మాషపాదస్తు సర్వ కర్మా తతః స్మృతః | త స్యానరణ్యః పుత్రో7భూ న్నిఘస్తస్యసుతో భవత్ || 152 నిఘపుత్రాపుభౌ జాతా వసమిత్ర రఘూత్తమౌ | అనమిత్రో వన మగా దరినాశకృతే నృప || 153 రఘెరభూ ద్దిలీపస్తు దీలీపాచ్చాప్యజ స్తథా | దీర్ఘబాహు రజా జ్జాతః ప్రజాపాల స్తతో7భవత్ || 154 తతో దశరథో జాత స్తస్య పుత్రచతుష్టయమ్ | నారాయణాత్మకాః సర్వే రామ స్తస్యాగ్రజో7భవత్ || 155 ఔర్వుడు వారు కోరిన వరమిచ్చెను. ఒకతె అరువదివేలమంది కొడుకులను ఇంకొకతె ఒక్కనిం గోరెను. ప్రభ వంశకర్త నొక్కపుత్రుని గోరెను. అసమంజు నొక్కని గ్రహించిరి. అవ్వల యదువంశజ (యాదవి) యై ప్రభ యిరుదివేలమందిని కొడుకులంగనియె. వారు భూమిని ద్రవ్వి విష్ణువుచే దహింపబడిరి. వారు బూడిదయైన యా ప్రదేశము భస్మద్వీపము (Ashes Island) అని నేడు పిలువబడుతున్నది. అసమంజుని కొడు కంశుమంతుడు అతని వాడు దిలీపుడు, వాని కొడుకు భగీరథుడు. అతడు తపస్సుచేసి గంగ నవతరింప జేసినాడు, భాగీరధి యను పేరందులకే గల్గినది. భగీరథునివాడు నాభాగుడు. వాని కుమారు డంబరీషుడు. అతడు సింధుద్వీపము నేర్పరచెను. అతనికి ఆయుతాయువు అతనికి ఋతువర్ణుడు అతనికి కల్మాషపాదు, అతనికి సర్వకర్ముడు అతని కనరణ్యుడు అతనికి నిఘుడును కుమారులు గల్గిరి. నిఘుని కొడుకులు అనమిత్రుడు రఘువు. అనమిత్రుడు శతృనాశనమున కరణ్యమున కేగెను. రఘువునకు దిలీపుడు, అతనికి అజుడు. అతనికి దీర్ఘ బాహువు. అతనికి ప్రబూపాలుడు, అతనికి దశరథుడు. ఆయనకు నల్గురు పుత్రులు నారాయణ స్వరూపులుదయించిరి. రాముడందు పెద్దవాడు. 155 రావణాంతకరస్తద్వద్రఘాణాం వంశవర్థనః | వాల్మీకి ర్యస్య చరితం చక్రే భార్గవసత్తమ || 156 తస్యపుత్ర కుశోనామ ఇక్ష్వాకుకులవర్ధనః | అతిథిస్తు కుశాజాతో నిషధ స్తస్య చాత్మజః || 157 నలస్తు నిషధా జ్ఞాతో నభా స్తస్మాదా జాయత, నభసః పుండరీకో7భూత్ క్షేమధన్వా తతఃపరమ్ || 158 తస్య పుత్రో7భవ ద్వీరో దేవానకః ప్రతాపవాన్ | అహీనగుస్తస్య సుతః సహస్రాశ్వ స్తతః పరమ్ || 159 తత శ్చంద్రావలోకస్తు తారా పీడస్తతో7భవత్ | తస్యాత్మజ శ్చన్ద్ర గిరిశ్చన్ద్రస్తస్య సుతో7భవత్ || 160 శ్రుతాయు రభవీత్తస్మా ద్భారతే యో నిపాతితః | నలౌద్వావేవ విఖ్యాతౌ వంశే యస్య విశేషతః || 161 వీరసేనస్తుత స్తద్వనై షధశ్చ నరాధిపః | ఏతే వివశ్వతో వంశే రాజానో భూరిదక్షిణాః || 162 ఇక్ష్వాకు వంశప్రభావాః ప్రాధాన్యేన ప్రకీర్తితాః || 163 ఇతి శ్రీపద్మపురాణ ప్రథమఖండే ఆదిత్యవంశ కథనమ్ నామాష్టమో7ధ్యాయః అతడు రావణాంతకుడు. రఘువంశవర్ధనుడు, భార్గవోత్తమ ! ఆయన చరిత్రయే వాల్మీకి వ్రాసినారు అతని కుమారుడు కుశుడు. అత డిక్ష్వాకుకులవర్ధనుడు. కుశుని కతిధి యుదయించెను. అతని కొడుకు నిషథుడు నిషథునికి నలు డుద్భవించె. నలునికి నభస్సు కలిగెను. నభసునికి పుండరీకుడు, అతనికి క్షేమధన్వుడు. అతనికి వీరుడు దేవానీకుడు అతనికి ప్రతాపశాలి అహీనగుడు అతనికి సహస్రాశ్వుడు అతనికి చంద్రావలోకుడు అతనికి చంద్రాపీడుడుంగల్గిరి. అతని కొడుకు శ్రుతాయువు. అతడు భారతయుద్ధమందు గూల్పంబడెను. ఈ వంశమునందు విశేష ప్రఖ్యాతినందినవారు నలులిద్దరు. వీరసేన సుతుడొకడు, నిషథుని కొడుకొక్కడు. వీరు సూర్యవంశమునందు యించిన రాజు, భూరిదక్షిణులు. (సర్వస్వదక్షిణమైన విశ్వజిద్యాగమును రఘుమహారాజు సేసినట్లు విన్నాముగదా) ఇక్ష్వాకువంశ ప్రభువులను ముఖ్యముగా గీర్తించితిని. ఇది ఆదిత్య (సూర్య) వంశకథనమను నెనిమిదవ యధ్యాయము.