Sri Padma Mahapuranam-I
Chapters
నవమోధ్యాయః పితృవంశాసుచరితమ్ భీష్మ ఉవాచ : భగవాన్ శ్రోతు మిచ్ఛామి పితౄణాం వంశముత్తమమ్ | రవేశ్చ శ్రాద్ధదేవస్య సోమన్యచ విశేషతః ||
1 పులస్త్య ఉవాచ : హంత తే కథయిష్యామి పితౄణాం వంశముత్తమమ్ | స్వర్గే పితౄగణాః సప్తత్రయ స్తేషా మమూర్తయః ||
2 మూర్తిమంతో7థ చత్వారః సర్వేషా మమితౌజసామ్ | అమూర్తయః పితృగణావై రాజస్య ప్రజాపతేః ||
3 యజన్తియాన్ దేవగణా వైరాజా ఇతి విశ్రుతాః | యే వై తే యోగ విభ్రష్టాః ప్రాపు ర్లోకా స్సనాతనాన్ ||
4 పునర్ర్భహ్మదినాంతేతు జాయంయే బ్రహవాదినః | సంప్రాప్య తాం స్మృతిం భూయో యోగం సాంఖ్యమనుత్తమమ్ ||
5 సిద్ధిం ప్రయాంతి యోగేన పునరావృత్తిదుర్లభామ్ | యోగినామేవ దేయాని తస్మాచ్ఛ్రాద్ధాని ధాతృభిః || 6 ఏతేషాం మానసీ కన్యా పత్నీ హిమవతో మతా | మైనాకస్తస్య దాయాదః క్రౌంచ స్తస్య సుతో7భవత్ || 7 క్రౌంచద్వీపః స్మృతో యేన చతుర్ధో ధృతిసంయుతః | మేనాతు సుషు వేతిస్రః కన్యా యోగవతీస్తతః || 8 ఉమైకవర్ణా పర్ణాచ తీవ్రవ్రత పరాయణాః | రుద్రస్త్యెకా భృగోశ్చైకా జైగీష వ్యస్యచాపరా || 9 దత్తా హిమవతా బాలాః సర్వలోక తపో7ధికాః | పితౄణాం లోకసంగీతం కథయామి శృణుష్వ తత్ || 10 -: వైరాజుని సంతతి - హిమవంతుని సంతతి :- పితరుల యుత్తమచరిత్ర విశేషించి సూర్యచంద్రుల కథయును వినగోరెదనన పులస్త్యు డిట్లనియె. మంచిది. స్వర్గమందు పితృగణములు సాకారులు నలురకములు. నిరాకారులు మూడురకములు, ఓజశ్శక్తి సంపన్నులు. వైరాజుని సంతతి యిది. దేవగణములు యజించు (పూజించు) వారు వైరాజు లనబడుదురు. యోగ భ్రష్టులైనవారు సనాతన లోకములం బొందుదురు. బ్రహ్మపగటిచివర బ్రహ్మవాదులై ముందటి జన్మమందలి జ్ఞాపకమును యోగము, సాంఖ్యమునుం బొంది పునరావృత్తిలేని సిద్ధిని బడయుదురు. అందుచే శ్రాద్ధముపెట్టువారు యోగులకే పెట్టవలెను. వీరి మానసపుత్రి హిమవంతుని భార్య. మైనాకుడు హిమవంతుని కొడుకు, క్రౌంచు డతని కొడుకు. క్రౌంచద్వీపము నాల్గవది యాతనిపేరిది. మంచి ధృతి (నిలకడ) కలది. అవ్వల హిమవంతుని భార్య యోగశక్తి సంపన్నులగు మువ్వురు కూతుండ్రం గన్నది. వారు ఉమ ఏకపర్ణ అపర్ణ యనువారు. రుద్రునికి భృగునికి జైగీషవ్యునికి వరుసగా వారు పత్నులైరి. హిమవంతుడు సర్వలోకాతీతతపశ్శాలినులను వారిని కన్యాదానము సేసెను. ఇక పితృలోక సంకీర్తనము సేసెద నాలింపుము. 10 లోకాః సోమపథానామ యత్ర మారీచనందనాః | వర్తంతే యత్ర పితరో యాన్ దేవాన్ భావయస్త్యలమ్ || 11 -: అచ్ఛోదాయాః సత్యపతీత్వమ్ :- అగ్నిష్వాత్తా ఇతి క్రవ్యాదాయజ్వనో7భవన్ | అచ్ఛోదానమాతేషాం తు కన్యా భూ ద్వరవర్ణినీ || 12 అచ్ఛోదం చ నరస్తత్ర పితృభిర్నిర్మితం పురా | అచ్ఛోదాథ తపశ్చక్రే దివ్యం వర్షసహస్రకమ్ || 13 ఆజగ్ముః పితరస్తుష్టా దాస్యన్తః కిల తే వరమ్ | దివ్యరూపధరాః సర్వే దివ్యమాల్యానులేపనాః || 14 సర్వే ప్రథానా బలినః కుసుమాయుధ సన్నిభాః | తన్మధ్యే7మావసుం నామ పితరం వీక్ష్య సాంగనా || 15 వవ్రే వరార్ధినీ సంగం కుసుమాయుధ పీడితా | యోగద్ర్భష్టాతు సా తేన వ్యభిచారేణ భామినీ || 16 ధరా న్నస్పృశ##తే పూర్వం ప్రయాతాథ భువస్తలే | తథైవామావసు ర్యో7య మిచ్ఛాం చక్రేచ తాంప్రతి || 17 :- అచ్చోద సత్యవతియగుట - వ్యాసావతారము :- సోమపథములను లోకములున్నవి. అందు పితృదేవతలున్నారు. వారిం భావనసేయవలయును. యజ్ఞము సేసినవారు అగ్నిష్వాత్తులు క్రవ్యాదులునను పితరులు వారగుదురు. పితృదేవతలను నుద్దేశించియిచ్చు ద్రవ్యము కవ్యమన బడును. అచ్చోదయను సుందరి వారికూతురు. పితరు లామెపేరనక్కడ అచ్చోదనమను సరస్సు నేర్పరచిరి. అచ్ఛోద వేయి దివ్యసంవత్సరములు తపస్సు చేసినది. అందులకు సంతుష్టులై వారు దివ్యరూపులు దివ్యగంధమాల్యాదిధరులునై వరమీయవచ్చిరి. మన్మధాకారులు వారందరు. బ్రథానులే, బలశాలురే. వారినడుమ అమావాస్యయను పితృదేవుని యామె చూచి కామవివశ##యై యాతనితోడి సంగమును వరముగ గోరెను. ఆ వ్యభిచార దోషముచే నామె యోగభ్రష్టయై అంతమున్ను భూమిందాకనైన దాకనిది భూతలమునకు జారిపోయినది. అటుపై సమావసు వామెను గామించెను. 17 ధైర్యేణ తస్యసా లోకే అమావాస్యేతి విశ్రుతా | పితౄణాం వల్లభా యస్మాద్దత్త స్యాక్షయ కారికా || 18 అచ్ఛోదాధోముఖీ లానా లజ్జితా తపసఃక్షయాత్ | సా పితౄ న్ప్రార్ధయామాస పునరాత్మసమృద్దయే || 19 విలజ్జమానా పితృభిరిద ముక్తా తపస్వినీ | భవిష్య మథచాలోక్య దేవకార్యం చ తే తదా || 20 ఇదమూచుర్మహా భాగాః ప్రసాద శుభయాగిరా | దివి దివ్యశరీరేణ యత్కించి త్ర్కియతే బుధ్తేః || 21 తేనైవ తత్కర్మఫలం భుజ్యతే వరవర్ణిని || సద్యః ఫలంతి కర్మాణి దేవత్వే ప్రేత్య మానుషే || 22 తస్మాత్త్వం సుకృతం కృత్వా ప్రాప్స్యసే ప్రేత్య యత్ఫలమ్ | అష్టావింశే భవిత్రీత్వం ద్వాపరే మత్స్యయోనిజా || 23 వ్యతిక్రమాత్ పితౄణాంతు కష్టం కుల మవాప్స్యసి | తస్మాద్రాజ్ఞో వసోః కన్యా త్వమవశ్యం భవిష్యసి || 24 కన్యాత్వే దేవలోకాం స్తాన్‌పునః ప్రాప్స్యసి దుర్లభాన్ | పరాశరస్య వీర్యేణ పుత్ర మేక మవాప్స్యపి || 25 ద్వేవేతు బాదరీప్రాయే బాదరాయణ మప్యుత | న వేదమేకం బహుధా విభజిష్యతి తే సుతః || 26 ధైర్యము పూని అమెయు నాతని మోహించి అమావాస్య యనుపేర నాతనిలోకమందే వసించుచున్నది. పితృప్రియ కావున వారినుద్దేశించి యిచ్చు క్రవ్యము నామెయక్షయమగునట్లు సేయుచుండును. అచ్చోద తపఃక్షయమునకు సిగ్గువడి తలవంచుకొని దీనురాలై తనకు తిరిగి సమృద్ధి కూర్పుడని పితరుల వేడుకొనెను. సిగ్గువడుచున్న యా తపస్వినింగని పితరులు మహానుభావులుగావున కాబోవు దేవకార్య మొకటి కూడ గమనించి ప్రసన్నమైన, శుభ##మైన యీ మాట పలికిరి. దివ్యశరీరముతో స్వర్గమందేకొంచెము పని చేసినను నా కర్మఫల మాశరీరముతోనే (దివ్యోపాధితోనే) యనుభవింపబడును. దేవత్వమందు కర్మములప్పటికప్పుడే పరిపాకదశ నందును. మానుషోపాధియందలివి చనిపోయి నంగాని ఫలింపవు. అందుచే నీవీపుణ్యఫలము నిరువదియెనిమిదవ ద్వాపర మందనుభవింతువు. అప్పుడు నీచయోనియందు పుట్టెదవు. పితరులయెడ దప్పుసేసినందులకు నికృష్టకులమందు పుట్టవలసివచ్చినది, అప్పుడు వసురాజునకు కూతురౌదువు. కన్యాత్వముతోనే నీవు పుణ్యలోకముల నందుదువు. పరాశరవీర్యముచే నీవొక్క కొడుకుం గందువు. బదరీద్వీపమునందు ఆ కాన్పగుటచే నీవు పుణ్యలోకములు నందుదువు. పరాశరవీర్యముచే నీవొక్క కొడుకుం గందుపు. బదరీద్వీపమునందు ఆ కాన్పగుటచే నతడు బాదరాయణుడనబడును. ఆయన ఏకరూపముననున్న వేదమును పెక్కు భాగములుగ వ్యాసించును. విభజించును, అందుచే వ్యాసుడను పేరాయనకు సార్దకమగును. 26 పౌరవస్యాత్మౌజౌ ద్వౌతు సముద్రాంశస్య శంతనోం | విచిత్రవీర్యస్తనయ స్తథా చిత్రాంగదో నృపః || 27 ఇమా పుత్పాద్య తన¸° క్షేత్రజా తస్యధీమతః | ప్రోష్టపద్యష్టకా భూయః పితృలోకే భవిష్యసి || 28 నామ్నా సత్యవతీ లోకే పితృలోకే తథాష్టకా | ఆయురారోగ్యదా నిత్యం సర్వకామఫలప్రదా || 29 భవిష్యసి పరేలోకే నదీత్వం చ గమిష్యసి | పుణ్యతోయా సరిచ్ఛ్రేష్ఠా లోకే ష్వచ్ఛోదనామికా || 30 ఇత్యుక్తా సా గణౖసై#్తస్తు తత్త్రెవాంతరధీయత | సాప్యాప చారిత్రఫలం మయా యదుదితం పురా || 31 ''సముద్రువంశమున పౌరవంశీయుడు శంతనుడు పుట్టెను. అతనికి విచిత్రవీర్యుడు చిత్రాంగదుడను నిద్దరు పుత్రులు. బుద్ధిమంతుడగు శంతనుని కీయిద్దరిని క్షేత్రమందు (కళత్రమందు) జనించినవారిని గని ప్రోష్టపద్యష్టకా రూపమున పితృలోకమును నీవు పొందగలవు. ఇహలోకమున సత్యవతివైన నీవు పితృలోకమందష్టకగానుండి ఆయురారోగ్యములను సర్వకామములనిచ్చుదానవగుదువు. ఇహలోకమం దచ్చోదయను పేర పుణ్యజలముతో నుత్తమ నదియునయ్యెదవు'' అని పితృగణములు పలికియక్కడనే యంతర్ధానమైరి. ఆమె యింతమున్ను నేను జెప్పిన అపచారమున కీఫలము పొందినది. 31 విభ్రాజా నామయేచాన్యే దివిసంతి సువర్చసః | లోకా బర్హిషదో యత్ర పితరః సంతి సువ్రతాః || 32 యత్ర బర్హిషి యుక్తాని విమానాని సహస్రశః | సంకల్పపాదపా యత్ర తిష్ఠన్తి ఫలదాయినః || 33 యదుభ్యుదయశాలాసు మోదంతే శ్రాద్ధదాయినః | యే దానవాసురగణా గంధర్వాప్సరసాం గణాః || 34 యక్షరక్షోగణాస్తే చ యజంతి దివి దేవతాః | పులస్త్యపుత్రాః శతశస్తపోయోగబల్వానితాః || 35 దృఢాత్మానో మహాభాగా భక్తానా మభయంకరాః | ఏతేషాం పీవరీ కన్యా మానసీ దివి విశ్రుతా || 36 స్వర్గమందు బర్హిషదులున్నచోట మంచి వర్చస్వులు విభ్రాజులను నింకొకరు నున్నారు. సువ్రతులు వారు పితృదేవతలు. బర్హిస్సుతో గూడిన విమానము లాలోకమందు వేలకొలది గలవు. సంకల్పమాత్రమున పండ్లొసంగు వృక్షములునటనున్నవి. శ్రాద్ధదాతలక్కడ సర్వాభ్యుదయములిచ్చుశాలలందు వసింతురు. దానవులు దేవగణములు గంధర్వాప్సరోగణములు యక్షరక్షోగణములు నాదివంబున గలరు. యజ్ఞములు సేసిన పులస్త్యపుత్రులు వందలమంది తపోయోగబలులై దృఢ మనస్కులై భక్తాభయదాతలైన మహానుభావు లక్కడున్నారు. అక్కడ వీరి మానసపుత్రి ప్రసిద్ధిగన్న పీవరియను పేర ప్రసిద్ధురాలు వీరికన్యయున్నది. 36 యోగినీ యోగమాతాచ తపశ్చక్రే సుదారుణమ్ | ప్రసన్నో భగవాం స్తస్యా వరం వవ్రే తు సాతతః || 37 యోగవంతం సురూపంచ భర్తారం విజితేంద్రియమ్ | దేహి దేవ ప్రసన్నస్త్వం యది మే వదతాంవర || 38 ఉవాచ దేవో భవితా వ్యాసపుత్రో యదాశుకః | భవిత్రీ తస్య భార్యా త్వం యోగాచార్యస్య సువ్రతా || 39 భవిష్యతి చ తే కన్యా కృత్తీనామా7థ యోగినీ | పాంచాలపతయే దేయా సాత్వతీయతు సా తదా || 40 జననీ బ్రహ్మదత్తస్య యోగసిద్ధాంత గా స్మృతా | కృష్ణః గౌరశ్చ శంభుశ్చ భవిష్యంతి చ తే సుతాః || 41 సర్వకామనమృద్ధేషు విమానేష్యపి పావనాః | కింపునః శ్రాద్ధదా విప్రా భక్తిమంతః క్రియాన్వితాః || 42 గౌ ర్నామ కన్యా యేషాం తు మానసీ దివి రాజతే | సుకన్యా దయితా పత్నీ సాధ్యానాం కీర్తివర్ధినీ || 43 మరీచిగర్భ నామానో లోకేమార్తాండమండలే | పితరోయత్ర తిష్ఠంతి హవిష్మంతో7ంగిరః సుతాః || 44 తీర్థ శ్రాద్ధప్రదా యాంతి యత్రక్షత్రియసత్తమాః | రాజ్ఞాం తు పితరస్తే వై స్వర్గభోగఫలప్రదాః || 45 ఆమె యోగిని యోగమాతయునై ఘోరతపస్సు సేసినది. భగవంతుడామెకు ప్రసన్నుడయ్యెను. ఆమె ''దేవా ! నాయెడ అనుగ్రహము సూపితివి. కావున యోగవంతుని జక్కనివాని నింద్రియములను నిగ్రహించినవానిని భర్తనిమ్మని వరమడిగెను. భగవంతుడు ''వ్యాసభగవానునికి శుకుడుగల్గును. యోగాచార్యుడైన యాతనికి నీ విల్లాలి వగుదువు. నీకు కృత్తియను పేర యోగిని యొక యాడుపిల్లయుం గల్గును. దానిని పాంచాలరాజు సాత్వతునికి యీయ దగును. యోగసిద్ధాంతపారగురాలామె బ్రహ్మదత్తునికి తల్లియగును. నీకు కృష్ణుడు, గౌరుడు, శంభువు నను సుతులు గల్గుదురు, సర్వకామసమృద్ధములయిన విమానములందు వారు విహరింతురు. శ్రాద్ధము యథావిధిగ పెట్టిన భక్తులు కర్మిష్ఠుల విషయమేమి చెప్పవలెను ? వీరికి గోవనుకన్య మనస్సుచే నుదయించి (మానసీకన్య) స్వర్గమున రాణించును. సాధ్యుల కా చిన్నది చాలమంచిది. పత్నియై కీర్తినిపెంపొందించును. సూర్యమండలమందు మరీచిగర్భులను పేరివారు హవిష్మంతులు (హవిర్భాగములందుకొనువారు) అంగిరసు కుమారు లా పితృలోకమందున్నారు. తీర్థశ్రాద్ధములు పెట్టిన క్షత్రియసత్తములుండుపితృలోకమది, వారు రాజులకు పితృదేవతలు. స్వర్గభోగఫలదాతలు. 45 ఏతేషాం మానసీ కన్యా యశోదానామవిశ్రుతా | పత్నీ యాంశుమతః శ్రేష్ఠా స్నుషా వంచజనస్యచ || 46 జనన్యథదిలీపస్య భగీరథపితామహీ | లోకాః కామదుఘా నామ కామభోగఫలప్రదాః || 47 సుస్వధానామ పితరో యత్ర తిష్ఠంతి తే సుతాః | ఆజ్యపానామలోకేషు కర్దమస్య ప్రజాపతేః || 48 పులహాగ్రజదాయాదా వైశ్యాస్తా న్భావ యంత్వి చ | యత్ర శ్రాద్ధకృతః సర్వే పశ్యన్తి యుగపద్గతాః || 49 మాతృభ్రాతృ పితృష్వనౄః సఖి సంబంధిబాన్ధవాన్ | అపిజన్మాయుతై ర్దృష్టా ననుభూతాన్ సహస్రశః || 50 ఏతేషాం మానసీ కన్యా విరాజానామ విశ్రుతా | సా పత్నీ సహుష స్యాసీ ద్యయాతే ర్జననీ తథా || 51 ఏషాష్టకా భవత్పశ్చాద్ బ్రహ్మలోక గతాసతీ | త్రయ ఏతే గణాః ప్రోక్తా శ్చతుర్థతు వదా మ్యహమ్ || 52 వీరి మానసపుత్రి యశోద. అంశుమంతుని భార్య. పంచజనుని కోడలు. దిలీపుని తల్లి. భగీరథుని మామ్మ. అభీష్టభోగఫలములనిచ్చు కామదుఘములను లోకములు గలవు. అందు సుస్వధులను పేరి పితృదేవతలుందురు. ఆజ్యవములను లోకములు కర్దమ ప్రజాపతియొక్క లోకములు. పులహునన్న వంశమువారిందున్నారు. వారు వైశ్యులు శ్రాద్ధకర్తలు వారినందరిని ఒక్కమారుగా దర్శింతురు. తల్లి తమ్ములు మేనత్తలు స్నేహితులు ఇతర సంబంధులు చుట్టాలు పదివేల బంధుకోటిని చూచిన వారిని బందువులుగా ననుభవించినవారిని శ్రాద్ధకర్తలు వేలకొలది మంది నిందు దర్శింతురు. ఈ పితృదేవతల మానసపుత్రి విరజ. సహుషుని భార్య, యయాతికి తల్లి. ఈమె బ్రహ్మ లోకమేగి అష్టకమయ్యెను. ఇంతదనుక నివి మూడు పితృగణములు. నాల్గవదానిం దెలిపెద. 52 -: నాల్గవ పితృగణము :- లోకాః సుమనసోనామ బ్రహ్మలోకోవరిస్థితాః | సోమపానామ పితరో యత్ర తిష్ఠింతి శాశ్వతమ్ || 53 ధర్మమూర్తిధరాః సర్వే పరతో బ్రహ్మణః స్మృతాః | ఉత్పన్నాః ప్రలయాంతేతు బ్రహ్మత్వం ప్రాప్యయోగినః || 54 బ్రహ్మలోకముమీద సుమనో(దేవ) లోకములున్నవి. ఇందు సోమపులను పేరిపితృదేవతలు శాశ్వతముగ నుందురు. అందరు ధర్మమూర్తి ధరులు. బ్రహ్మకంటెను పైవారు. ప్రళయాంతరమందీయోగులు బ్రహ్మత్వమునంది పుట్టుదురు. 54 కృత్వా సృష్ట్యాదికం సర్వే మానసే సాంప్రతం స్థితాః | నర్మదానామ తేషాంతు కన్యా తోయవహా సరిత్ || 55 భూతాని పునాతి (పూయతే) యాతు (తి) పశ్చిమోదధిగామినీ | తేభ్యః సర్వత్ర మనుజాః ప్రజాసర్గేచ నిర్మితాః || 56 జ్ఞాత్వా శ్రాద్ధాని కుర్వంతి ధర్మభావేన సర్వదా | సర్వదా తేభ్య ఏవాస్య ప్రసాదా ద్యోగసంతతిః || 57 పితౄణామాదిసర్గేతు శ్రాద్ధ మేవం వినిర్మితమ్ | సర్వేషాం రాజతం పాత్ర మథవా రాజతాన్వితమ్ || 58 దత్తం స్వథాం పురోధాయ పితౄన్ ప్రీణాతి సర్వదా | ఆగ్నీంధ్ర సోమపాభ్యాంతు కార్య మాప్యాయనం బుథైః || 59 అగ్న్యభావేతు విప్రస్యపాణౌవాథ జలేపివా | అజాకర్ణేశ్వకర్ణేవా గోష్ఠేవాథ శివాంతకే || 60 పితౄణా మమలం స్థానం దక్షిణాదిక్ ప్రశస్యతే | ప్రాచీనావీత ముదకం తిలసంత్యాగమేవచ || 61 ఖడ్గినామామిషం చైవ మన్నం శ్యామాకశాలయః | యవ నీవారముద్గేక్షు శుక్లపుష్పఫలాని చ || 62 వల్లభాని ప్రశస్తాని పితౄణా మిహసర్వదా | దర్భా మాషా ష్షష్టికాన్నం గోక్షీరం మధుసర్పిషీ || 63 సృష్ట్యాదికార్యములు సేసి మానససరస్సునందిప్పుడున్నారు. వారి కన్య నర్మాదానది. పశ్చిమసముద్ర గామిని. భూతలమును బవిత్రమొనరించునది. వారిచే ప్రజాసృష్టియం దెల్లెడ మనుజులు సృష్టింపబడిరి. ఎల్లప్పుడు వారి యనుగ్రహముచేతనే యీ శ్రాద్ధకర్తకు యోగసంతతి కలుగుటయును. ఆదిసర్గమందుపితృదేవతల నుద్దేశించి శ్రాద్ధమిది యేర్పరుపబడినది. అందరికి వెండిది లేదా వెండిపూత పెట్టినదియునగు భోజనపాత్ర నిర్దేశింపబడినది. పితృదేవతలకు వెండియాకులో వడ్డింపవలెనన్నమాట. అరటాకు వేసియు (''రజతమయ మిదం పాత్రం'' ఇది వెండిపాత్రగా భావించి అనుగ్రహింపుడని శ్రాద్ధసమయమున కర్త యను టిది సంప్రదాయసిద్ధము.) స్వధాపూర్వకముగా స్వధా అని చెప్పి యిచ్చిన తర్పణము కవ్యమువలన పితృదేవతలు తృప్తులగుదురు. ఆగ్నీంధ్ర సోమపులకు (సోమయాగము సేసినవారికి) గూడ యిట్లే తెలిసినవా రాప్యాయనము గావింపవలెను. అగ్ని లేనప్పుడు విప్రుని అరచేతియందు లేక జలమందు లేదా మేక గుఱ్ఱముచెవియందు గోశాలయందు శివాలయమందు స్వధాపూర్వకముగ నీయవలెను. పితృదేవతలకు దక్షిణదిక్కు ప్రాచీనావీతము తిలలతోనుదక త్యాగము (తర్పణము, ప్రశస్తములు, ఖడ్గమృగ మాంసము శ్యామాకము బియ్యము యవలు నివ్వరిబియ్యమునన్నము పెసరపప్పు చెఱకురసము తెల్లనిపువ్వులు పండ్లు పితృప్రీతికరములు. ప్రశస్తములు, దర్భలు, మినుములు షష్టికాన్నము (అరువదిరోజులలో పండు ధాన్యవిశేషము) ఆవుపాలు, తేనె, నెయ్యి (ఆవునెయ్యియే) వస్త్రములు వారికి ప్రియములు. 63 శస్తానిచ ప్రవక్ష్యామి శ్రాద్దే వర్జ్యాని యానిచ | మసూర శణ నిష్పావా రాజమాషాః కులుత్థకాః || 64 పద్మబిల్వార్కదు (ధ) త్తూరపరి భద్రాటరూషకాః | న దేయాః పితృకార్యేషు పయ శ్చాజావికం తథా || 65 కోద్రవో దారవరణకపిత్థమధుకాతసీ | ఏతాన్యపి నదేయాని పితృభ్యః శ్రియమిచ్ఛతా || 66 పితౄన్ ప్రీణాతి యోభక్త్యా తే పునః ప్రీణయంతి తమ్ | యచ్ఛంతి పితరః పుష్టింస్వాంగారోగ్యం ప్రజాఫలమ్ || 67 దేవకార్యాదపి పునః పితృకార్యం విశిష్యతే | దేవతాభ్యః పితౄణాంతు పూర్వమాప్యాయనం స్మృతమ్ || 68 శీఘ్ర ప్రసాదాస్త్వ క్రోధా నిఃసంగాః స్థిరసౌహృదాః | శాంతాత్మానః శౌచ పరాః సతతం ప్రియవాదినః || 69 భక్తానురక్తాః సుఖదాః పితరః పర్వ దేవతాః | హవిష్మతా మాధిపత్యే శ్రాద్ధదేవ స్మృతోరవిః || 70 ఏతద్ధి సర్వ మాఖ్యాతం పితృవంశాను కీర్తనమ్ | పుణ్యం పవిత్రమారోగ్యం కీర్తనాయ నృభిః సదా || 71 భీష్మ ఉవాచ : శ్రుత్వైతదఖిలం భూయః పరాభక్తి రుపస్థితా | శ్రాద్ధకాలం విధించైవ శ్రాద్ధమేవ తధైవచ || 72 శ్రాద్ధేషు భోజనీయా యే శ్రాద్ధ వర్జ్యా ద్విజాతయః | కస్మిన్ వాసరభాగేతు పితృభ్యఃశ్రాద్ధ మారభేత్ || 73 అన్నం దత్తం కథం యాతి శ్రాద్ధేవై బ్రహ్మవిత్తమ | విధినా కేన కర్తవ్యం కథం ప్రీణాతి తాన్ పితౄన్ || 74 శ్రాద్ధమందు వాడకూడని వస్తువులం జెప్పెద- సెనగలు రాజమాషములు నిష్పావములు=బొబ్బర్లు చిఱుసెనగలు (చిన్నవి) కుశుత్థములు=ఉలువలు పద్మములు మారేడు జిల్లేడు పరిభద్రము అటము రూషకములు, మేక గొఱ్ఱపాలు నిషిద్ధములు, కోద్రవము=వరిగలు ఉదారము=శాలిధాన్యము, వరము=కందులు కపిత్థము=వెలగ మధుకము=కొఱ్ఱలు అతసి=అవిసెలు, ఐశ్వర్యకాముకుడివి పితృదేవతలకు పెట్టరాదు, పితృదేవతలం దృప్తి చేసిన వారాచేసినవానిం దృప్తునిం జేయుదురు. శరీర పుష్టిని ఆరోగ్యమును సంతానము నిత్తురు. దేవకార్యముకంటెను పితృకార్యము చాల విశేషము. దేవతలకంటెముందు పితృదేవతాప్రీతి సేయవలెనని న్మృతులు సెప్పుచున్నవి. శీఘ్రముగ ఫలమిత్తురు. కోపములేనివారు శక్తిలేనివారు స్థిరమైన స్నేహమునూపువారు శాంతమనస్కులు అచారశీలురు ఎప్పుడుం బ్రియము పలుకువారు భక్తానురక్తులు పితరులు సుఖమిచ్చువారు. పర్వమందారాధింపబడు దేవతలు వారు అమావాస్య మొదలయినవి పితృపర్వములు. హవిష్మంతులన హవిర్భాగార్హులగు నింద్రాది దేవతలకు శ్రాద్ధదేవుడు సూర్యభగవానుడే అధిపతి. పితృవంశాను కీర్తనమిదియెల్ల తెలిపితిని. ఈ అధ్యాయపారాయణ పుణ్యము, పవిత్రము, ఆరోగ్యకరము. ఇది విన్న తరువాత నాకెంతో భక్తి యేర్పడినది. శ్రాద్ధమునకు ముఖ్యకాలము శ్రాద్ధవిధి శ్రాద్ధమందు నిమంత్రణముచేసి భోజనమును పెట్టదగిన పెట్టగూడని ద్విజులంగూర్చి ఆ దినమందు సరిగా నేసమయమున శ్రాద్ధ ప్రారంభముసేయవలెను? పెట్టిన శ్రాద్ధము వారికెట్లు ముట్టును బ్రహ్మవేత్త ఏ విధముగా శ్రాద్ధమొనరించి పితృదేవతలను సంప్రీతిపరుపగల డానతిమ్మని భీష్ముడడుగ పులస్త్యుం డిట్లనియె. పులస్త్య ఉవాచ : కుర్యాదహరహః శ్రాద్ధ మన్నాద్యే నోదకేనచ | వయోమూలఫలైర్వాపి పితృభ్యః ప్రీతిమానహన్ || 75 నిత్యం నైమిత్తి కం కామ్యం త్రివిధం శ్రాద్ధముచ్యతే | నిత్యం తావత్ ప్రవక్ష్యామి అర్ఘ్యా వాహన వర్జితమ్ || 76 అదైవతం విజానీయా త్పార్వణం పర్వసు స్మృతమ్ | పార్వణం త్రివిధం ప్రోక్తం శ్రుణు యత్నాత్ మహీవతే || 77 పార్వణ యే నియోజ్యాస్తు తాన్ శ్రుణుష్వ నరాధిప | పంచాగ్నిః స్నాతకశ్చైవ త్రిసౌపర్ణః షడంగవిత్ || 78 శ్రోత్రియః శ్రోత్రియసుతో విధివాక్య విశారదః | సర్వజ్ఞో వేదవాన్ మంత్రీ జ్ఞాన వంశకులాన్వితః 79 త్రిణాచికేతస్త్రిమధుః శ్రుతేష్వన్యేఘ సంస్థితః | పురాణవేత్తా బ్రహ్మజ్ఞః స్వాధ్యాయీ జపతత్పరః || 80 బ్రహ్మభక్తః పితృపరః సూర్యభక్తో7థ వైష్ణవః | బ్రాహ్మణో యోగనిష్ఠాత్మా విజితాత్మా సుశీలవాన్ || 81 పితృశ్రాద్ధ మన్నముచేగాని, ఉదకముచేగాని, పాలు, దుంపకూరలు పండ్లతోను ప్రతిదినముం బెట్టవలెను. శ్రాద్ధము నిత్యము, నైమిత్తికము, కామ్యము నను మూడువిధములు. పర్వములందుపెట్టు పార్వణము అదైవతమని తెలియ నగును, అనగా నందు విశ్వేదేవప్రసక్తి యుండదు. అమావాస్యాది పర్వములందు బెట్టు శ్రాద్ధమునందు పంచాగ్ని హోత్రి స్నాతకుడు త్రిసుపర్ణవేత్త వేదాంగము లాఱుందెలిసినవాడు) శ్రోత్రియుడు (వేదసంప్రదాయ నిర్వాహకుడు) లేదా అట్టివాని కొడుకు విధి శ్రాస్త్రవాక్య సమన్వయము చక్కగా నెఱిగినవాడు సర్వజ్ఞుడు వేదము చదివినవాడు మంత్రోపాసన కలవాడు జ్ఞానులవంశములో బుట్టినవాడు స్వకులాచారమును ఆచరించువాడు మఱి యితరమైన శ్రుతము లందు (శ్రుతమనగా వినికిడి, పెద్దలవలన అనేక ధర్మవిషయములు వినుటచే) పండితుడు పురాణములెరిగినవాడు బ్రహ్మవేత్త వేదాధ్యయన సంపన్నుడు జపనిష్ఠుడు బ్రహ్మ వేదమునందు భక్తుడు పితృదేవతార్చనాతత్పరుడు సూర్య భక్తుడు వైష్ణవుడు (విష్ణుభక్తుడు) బ్రాహ్మణుడు యోగవిష్ఠుడు. ఇంద్రియనిగ్రహము గలవాడు మంచి స్వభావము గలవాడు. వీరు పితృకార్యములందర్చించ వలసినవారు. 81 ఏతే తోష్యాః ప్రయత్నేన వర్జనీయాని మాంచ్ఛృణు | పతితస్తత్సుతః క్లీబః పిశునోవ్యంగరోగితః || 82 సర్వేతే శ్రాద్ధకాలేతు త్యాజ్యావై ధర్మదర్శిభిః | పూర్వేద్యు రపరేద్యుర్వా వినీతాంశ్చ నిమంత్రయేత్ || 83 నిమంత్రితాంశ్చ పితర ఉపతిష్ఠంతి తాన్ ద్విజాన్ | వాయు భూతాని గచ్ఛంతి తథాసీ నానుపాసతే || 84 దక్షిణం జానుచా లభ్య వామం పాత్య నిమంత్రయేత్ | అక్రోధనైః శౌచపరైః సుస్నాతై ర్ర్బహ్మవాదిభిః || 85 భవితవ్యం భవద్భిస్తు మయా చ శ్రాద్ధకర్మణి | పితృ యజ్ఞం వినిర్వర్త్య తర్పణా న్యంతు యో7గ్నిమాన్ || 86 పిండా న్వాహార్య కంకుర్యా చ్ఛ్రాద్ధ మిందుక్షయే తథా | గోమయేనాను లిప్తంతు దక్షిణాప్లవన స్థలే || 87 శ్రాద్ధం సమారభేద్ భక్త్యా గోష్ఠేవా జలసన్నిధౌ | అగ్నిమా న్నిర్వపే త్పిత్ర్యం చరుం వా సక్తుముష్టిభిః || 88 పితృభ్యో నిర్వపామీతి సర్వం దక్షిణతో7న్యసేత్ | అభిఘార్య తతః కుర్యా న్నిర్వాపత్రయ మగ్రతః || 89 తే వితస్త్యాతు తాః కార్యా శ్చతురజ్గుల విస్తృతాః | దర్వీత్రయం చ కుర్వీత ఖాదిరం రజతాన్వితమ్ || 90 ఇక వర్జనీయులు (విడిచిపెట్టవలసినవారిని) వినుము. కులభ్రష్ఠుడు, వానికొడుకు, నపుంసకుడు, పిసినిగొట్టు, అంగలోపము గలవాడు, రోగి, అధర్మదృష్టి కలవానిని శ్రాద్ధమందు నియంత్రింపరాదు, వినయశీలురగువాని ముందు రోజు తద్దినము తరువాతి రోజునగూడ పిలువవలెను. ఆ పిలిచిన బ్రాహ్మణులందు పితృదేవతలు వాయుస్వరూపులై పితృస్థానమందు గూర్చున్న వారి యందావేశింతురు. వారి కుడి మోకాలపట్టుకొని తన ఎడమకాలు వంచి మీరు శ్రాద్ధ సమయమందు క్రోధరహితులు ఆచారపరులు స్నానము చక్కగా సేసినవారు బ్రహ్మవాదులునై యెపుడునుండవలెను. నేను నట్లే యుందును. నిత్యాగ్నిహోత్రి పితృభోజనము పితృతర్పణాదికము నిర్వర్తించి పిండాన్వాహార్యకం (పిండ ప్రదానము) సేయవలెను. ఇది అమావాస్యనాటి విధి. ఆవుపేడతో నలికి దక్షిణమువైపు వాలుగానున్న చోట గోశాల లేక తీర్థమందు (జలసన్నిధిని) శ్రాద్ధారంభము సేయవలెను. అగ్నిహోత్రి పేలపిండిగుప్పిళ్ళతోను లేదా చెరువునైన నిర్వాపణము చేయవలెను (నిర్వాపణము=సమర్పణము). ఆ నిర్వపణము ''పితృభ్యోనిర్వపామి'' అని పలుకుచు సర్వము దక్షిణముగా నొనరింపనగును. అభిఘరించి ఆ మీద మూడు ముద్దలు నిర్వాపణము సేయవలెను. ఆ ముద్దలు అరచేతినిండ నాల్గంగుళములు విరివిగ నుండవలెను. దర్వి (ఆజ్యగ్రహణ సాధనము) అవి మూడు కావలెను. చండ్రకర్ర వెండితొడుగుతో నవి సమకూర్చుకొనవలెను. 90 అరత్నిమాత్రం పరిశ్లిక్షణం హస్తాకారాగ్రముత్తమమ్ | ఉద పాత్రాణి కాంస్యస్య మేక్షణం చ సమిత్కుశమ్ || 91 తిల పాత్రాణి సద్వాసో గంధధూపాను లేపనమ్ | అహరే దపసవ్యం చ సర్వం దక్షిణతః శ##నైః || 92 ఏవ మాసాద్య తత్సర్వం భవనస్యో త్తరేం7తరే | గోమయే నానులిప్తా యాం గోమూత్రేణ చ మండలమ్ || 93 సాక్షా తాభిః సుపుష్పాభి రద్భిః సవ్యాప సప్యవత్ | విప్రాణాం క్షాలయేత్పాదావభి వంద్య పునః పునః || 94 ఆసనే ఘాపవిష్ఠేషు దర్భవత్సు విధానతః | ఉపస్పృష్టోదకా న్విప్రా సుపవేశ్యానుమంత్రయేత్ || 95 ద్వౌదైవే పితృకృత్యే త్రీనేకైకంచోభయత్రవా | భోజయే దీశ్వరో7పీహ సకుర్యా ద్విస్తరం బుధః || 96 దైవపూర్వం నివేద్యాథ విప్రా నర్ఘాదినా బుధః | అగ్నౌ కుర్యా దనుజ్ఞాతో విపై#్ర ర్విప్రో యథావిధి || 97 స్వగృహ్యోక్తేన విధినా కాలే కృత్వా సమంతతః | అగ్నీషోమమయాభ్యాంతు కుర్యా దాప్యాయనం బుధః || 98 అరత్ని మాత్రము (పన్నెండు అంగుళముల పొడవుగల) అరచేతి యాకారముగ నది యుండవలెను. ఉదకపాత్ర కంచుది మేక్షణము=హోమసాధనము సమిధలతో దర్భలతో సమర్పినది గావలెను. నువ్వుల గిన్నెలు నూత్న వస్త్రములు గంధధూపానులేపనము అపసవ్యముగా కుడివైపునకు గొనిరావలెను. ఇట్లదియెల్ల గొనివచ్చి ఇంటి యుత్తరపువైపున విప్రుల పాదప్రక్షాళనము మఱి మఱి నమస్కరించుచు గావింపవలెను. గోమయముతో లేక గోమూత్రముతో నలికి అక్షతలు పువ్వులు నింపిన ఉదకముతో సవ్యముగా (విశ్వేదేవస్థానములో) అపసవ్యముగా (పితృ దేవతాస్థానములో) విప్రుల పాదముల మఱి మఱి నమస్కరించుచు కడుగవలెను. దర్భలువేసిన ఆసనమందు వారు కూర్చున్న తరువాత వారుదకస్పర్శ (ఆచమనము) చేసిన తర్వాత ఆసనమందుపవేశింపజేసి (కూర్చుండబెట్టి) అనుమంత్రణము సేయవలెను. వారిచేయి తన చేతం బట్టుకొని మంత్రము సెప్పుచు సేయుప్రక్రియ (అనుమంత్రణను) విశ్వేదేవ స్థానమందిద్దరని పితృస్థానమందు ముగ్గురను లేదా అక్కడొకరిని యిక్కడొకరినిపిలిచి (యిద్దరనేయన్నమాట) భోజనము పెట్టవలెను. సర్వసమృద్ధి సమర్ధుడైనను తెలిసినవాడు శ్రాద్ధవిస్తరము సేయరాదు. విశ్వేదేవులతో ముందుగా నారంభించి పితృదేవతలకు ధనాదులను (వస్త్రము మొదలయినవి) నివేదించి ఆ విప్రులయనుజ్ఞతో అగ్నీకరణము (అగ్నియందు హోమము) అగ్నీషోమమంత్రములతో అగ్నీషోముల నుద్దేశించి సేయవలెను. ఇదంతయు సకాలముగ స్వశాఖానుకూల గృహ్యసూత్రముతోనే సేయవలయును. 98 దక్షిణాగ్నిప్రణీతేన స ఏవాగ్ని ర్ద్వి జోత్తమః | యజోపవీతా న్నిర్వర్త్య తతః పర్యుక్షణాదికమ్ || 99 ప్రాచీనావీతినా కార్య మేతత్సర్వం విజానతా | లబ్ధ్వా తస్మా ద్విశేషేణ పిండాన్ కుర్వీత చోదకమ్ || 100 దద్యాదుదక పాత్రైస్తు సలిలం నవ్యపాణినా | దద్యా త్సర్వ ప్రయత్నేన దమయుక్తో విమత్సరః || 101 విధాయ రేఖాం యత్నేన నిర్వపే దవనేజనమ్ | దక్షిణాభిముఖః కుర్యా త్తతో దర్భా న్నిధాయవై || 102 నిధాయ పిండమేకై కం సర్వం దర్భోపరిక్రమాత్ | నిర్వపే దథ దర్భేషు నామగోత్రానుకీర్తనైః || 103 తేషు దర్భేషు తం హస్తం విమృజ్యా ల్లేపభాగినమ్ | తథైవ చ జపం కుర్యా త్పునః ప్రత్యవనేజనమ్ || 104 జలయుక్తం నమస్కృత్య గంధధూపార్చనాదిభిః | ఏవమావాహ్య తత్సర్వం వేదమంత్రై ర్యధోదితైః || 105 ఏకాగ్నిరేకావ ఏవాద్భిర్నిర్వపే ద్దర్వికాం తథా | తతః కృత్వా నరో దద్యా త్పితృభ్యస్తు కుశా న్వుధః || 106 తతః పిండాదికం కుర్యా దావాహనవిసర్జనమ్ | తతో గృహీత్వా పిండేభ్యో మాత్రాః సర్వాః క్రమేణతు || 107 తానేవ విప్రా స్పృథమ మాశయిత్వా చ మానవః || వర్ణయన్ భోజయే దన్న మిష్టపూతం చ సర్వదా || 108 అటుపై పితృదేవతోద్దేశముగ ప్రాచీనావీతిగానె చేయవలెను. అవ్వల పిండోదకముల నీయవలెను. ఉదక పాత్రములతో కుడిచేతిలో దమముతో (ఇంద్రియ నిగ్రహముతో) మాత్సర్యము విడిచి అర్చన యీయవలెను. రేఖ గీసి అవనేజనముసేసి (ప్రోక్షణ) అటుపై దక్షిణాభిముఖుడై దర్భలు పరచి ఒక్కొక్క పిండముదర్భలపై నుంచి నామగోత్రములు సెప్పుచు నిర్వపణము సేయవలెను, పిండశేషములలో మెతుకులను ఆమీద లేవభాగులగువారికి విదిలింపవలెను. (పితృదేవతలకు) హస్తమార్జనము సేసికొని ప్రత్యవనేజన నిమిత్తముగ జపము సేయవలెను (గాయత్రీజపము). తీర్థ జలములతో గంధధూపాదులతో నిట్లర్చించి నమస్కరించి లేదేని ఇట్లావాహనాదులు మంత్రపూర్వకముగ ఏకాగ్నియైన గృహస్థు ఒక్కటే దర్విని (ఒక్కసారే) నిర్వహింపవలెను. ఆమీద పితరులకు కుశలనీయవలెను. అవ్వల పిండముల కావాహన విసర్జనము లొనరింపవలెను. పిమ్మట పిండముల నుండి మెతుకులుతీసి వానినే బ్రహ్మాదులచే దినిపించి వారి కిష్టము పవిత్రమునైన అన్నాది పదార్థములను వారిని నారగింపజేయవలెను. 108 వర్జయేత్ర్కోధపరతాం స్మర న్నారాయణం హరిమ్ | తృప్తాన్ జ్ఞాత్వా పునః కుర్యా ద్వికిరం సార్వవర్ణికమ్ || 109 విధృత్య సోదకం త్వన్నం స తిలం ప్రక్షిపేద్భువిః | అచాంతేషు పునర్దద్యా జ్జలం పుష్పాక్షతోదకమ్ || 110 స్వధావాచనకం సర్వం పిండోపరి సమాచారేత్ | దేవాద్యంతం ప్రకుర్వీత శ్రాద్ధ నాశో7న్యథా భ##వేత్ || 111 విసృజ్య విప్రాన్ ప్రణతస్తేషాం కృత్వా ప్రదక్షిణమ్ | దక్షిణాం దిశ మాకాంక్ష న్పితౄనుద్దిశ్య మానవః || 112 దాతారో నోభివర్ధన్తాం వేదాః సంతతిరేవచ | శ్రద్ధాచ నో మావ్యగమద్ బహుదేయం చ న్నో7స్త్వితి || 113 అన్నం చ నో బహు భ##వేదతిధీంశ్చ లభేమహి | యాచితారశ్చనః నంతు మాచయాచిష్మ కంచన || 114 ఏతదగ్ని మతః ప్రోక్త మన్వాహర్యం తు పార్వణమ్ | యథేందుసంక్షయే తద్వ దన్యత్రాపి నిగద్యతే || 115 పిండాంస్తు గో7జవిప్రేభ్యో దద్యా దగ్నౌ జలే%పివా | విప్రాంస్తేం వాథ వికిరే దాపో భిరథ వాపయేత్ || 116 పత్నీం తు మధ్యమం పిండం ప్రాశ##యే ద్వినయాన్వితమ్ | ఆధత్త పితరో గర్భం పుత్రసంతాన వర్ధనమ్ || 117 తావన్నిర్వాపణం తిష్ఠే ధ్యావ ద్విప్రా వినర్జితాః | వైశ్వదేవం తతః కుర్యా న్ని వృత్తః పితృకర్మణః |7 118 ఇష్టైః సహ తతః శాన్తో భుఞ్జిత పితృసేవితమ్ | పురర్భోజన మధ్వానం యాన మాయాస మైధునమ్ || 119 శ్రాద్ధ కృ చ్ఛ్రాద్ధభుగ్యోవా సర్వమేత ద్వివర్జయేత్ | స్వాధ్యాయం కలహం చైవ దివాస్వప్నం చ సర్వదా || 120 అనేన విధినా శ్రాద్ధం త్రివర్గస్యేహ నిర్వపేత్ | కన్యా కుంభ వృషస్థే%ర్కే కృష్ణపక్షేషు సర్వదా || 121 యత్ర యత్ర ప్రదాతవ్యం సపిండీకరణాత్మకమ్ | తత్రానేన విధానేన దేయ మగ్నిమతా సదా || 122 నారాయణుం దలచికొనుచు కోపము విడిచి తృప్తులయితిరా యని బ్రాహ్మణులనడిగి వారైతి మన్నతర్వాత వికిరపిండము పెట్టవలెను. ఇది అన్ని వర్ణముల వారికిని విహితము. ఉదకముతో తిలలతో నుదకపూర్వకముగా నన్నమును విదిలించి యతనిపై వేయవలెను. బ్రాహ్మణు లాచమించినతర్వాత (భోజనములయి చేతులుగడిగికొని ఆచమనము సేసినతర్వాత) స్వధావాచనము సేయుచు పిండముల మీద తక్కిన విధియెల్ల పూర్తిచేయవలెను. బ్రాహ్మణులకు ప్రదక్షిణ నమస్కారములు సేసి వారికి ''విసర్జనము పితరః స్వదేశం గచ్ఛంతు'' అని వారిని బంపి, పితృదేవతల నుద్దేశించి దక్షిణదెసకు దిరిగి ''మా కుటుంబమున దాతలు వృద్ధిపొందుదురుగాక ! వేదములు సంతానము మాకుగల్గును గాక ! శ్రద్ధ మమ్ములను విడువకుండుగాక! అనేక మందికిక అనేకముగా దానము సేయదగిన ధనసమృద్ధి మాకుండుగాక! అతిథులు మాకు లభింతురుగాక! యాచకులు మాకు లభింతురుగాక ! మేమెవ్వరిని యాచించకుందుముగాక ! అని ప్రార్థింపవలెను. ఇది అగ్నిహోత్రికి జెప్పబడిన విధానము. పార్వణము = అమావాస్యాది పర్వదినములందు. బెట్టు శ్రాద్ధము (నైమిత్తికము) అన్వాహార్యమనంబడును, ఈ నైమిత్తికశ్రాద్ధ మమావాస్యయందెట్లో మఱియితరచోట్లనట్టే పిండములను గోవులకు మేకలకు విప్రులకుబెట్టవలెను. అగ్నిలో, నదీజలములలో గాని వేయవలెను. బ్రాహ్మణులచుట్టు నీళ్లుజల్లుచు సాగనంపవలెను. విప్రులను సాగనంపువరకు విప్రులు వెళ్లుదాక జలనిర్వాపణము చేయుచునే నిలువబడవలెను. పితృకర్మ నుండి (శ్రాద్ధవిధి నుండి) వెనుదిరిగి అటుపై వైశ్వదేవము ఇష్టితో సేసికొనవలెను. అటుపైని పితృశేషమును శాంతుడై భుజింపవలెను. శ్రాద్ధకర్త శ్రాద్ధభోక్తయుంగూడ ఆవేళ మరల భోజనమును ప్రయాణమును ఏదైనా బండియెక్కుట ఆయాసము (శరీరశ్రమ) మైధునమును స్వాధ్యాయము కలహము పగటినిద్రను వర్జింపవలెను. ఈ విధముగా త్రివర్గమునకు (పితృపితామహ ప్రపితామహులకన్నమాట) తద్దినముపెట్టవలెను. రవి కన్యా కుంభవృషభ రాజులందున్నప్పుడు కృష్ణపక్షములందును నెచ్చటెచ్చట నపిండీకరణాత్మకమైన శ్రాద్ధము విహితమో అక్కడక్కడ యీ విధముగ నిత్యాగ్ని హోత్రి సేసి పితృప్రీతిసేయవలెను. 122 అతః పరం ప్రవక్ష్యామి బ్రాహ్మణాయ దుదీరితమ్ | శ్రాద్ధం సాధారణం నామ భుక్తిముక్తి ఫలప్రదమ్ || 123 అయనే విషువే చైవ అమావాస్యార్క సంక్రమే | అమావాస్యాష్టకా కృష్ణపక్ష పంచదశీఘ చ || 124 ఆర్ద్రా మఘా రోహిణీషు ద్రవ్యబ్రాహ్మణ సంగమే | గజచ్ఛాయా వ్యతీపాతే విష్టివైధ్యతి వాసరే || 125 వైశాఖస్య తృతీయాచ నవమీ కార్తికస్య చ | పంచదశీతు మాఘస్య నభ##స్యే చ త్రయోదశీ || 126 యుగాదయః శ్మృతా హ్యేతాః పితృపక్షోపకారికాః | తథా మన్వంతరాదౌ చ దేయం శ్రాద్ధం విజానతా || 127 బ్రహ్మ సెప్పిన సాధారణ శ్రాద్ధవిధి నీపై నానతిత్తును. అయనములందు విఘువములందు (రేయింబవళ్లు సమానముగానుండురోజు విషువత్తునను పర్వము). అమావాస్యనాడు అష్టకలందు కృష్ణపక్షములలో పూర్ణిమలందు అర్ధ్ర మఘ రోహిణియను నక్షత్రములందు ద్రవ్యము బ్రాహ్మణులు సమకూడినప్పుడు గజచ్ఛాయ వ్యతీపాత విష్టివైధృతియను మోగములందు వైశాఖ శుక్ల తదియ కార్తీక శుక్ల నవమి నాడు మాఘపూర్ణిమను భాద్రవదత్రయోదశిని యాగాదులు మన్వంతరము నను నివి పితృపక్షోపకారకములైన దినములందు శ్రాద్ధమును పెట్టవలెను. 127 అశ్వయుజ్నవమీ చైవ ద్వాదశీ కార్తికే తథా | తృతీయా చైత్రమాసస్య తథా భాద్రపదస్య చ || 128 ఫాల్గునస్య త్వమావాస్యా పౌషసై#్యకాదశీ తథా | ఆషాఢస్యాపి దశమీ మాఘమాసస్య సప్తమీ || 129 శ్రావణ చాష్టమీ కృష్ణా తథాషాఢౌపూర్ణిమా కార్తికీ ఫాల్గునీ చైవ జ్యేష్ఠ పంచదశీ సితా | మన్వంతరాద యస్త్వేతా దత్తస్యాక్షయకారికాః || 130 మన్వంతరములు (మన్వాది తిథులు) అశ్వియుజమున నవమి కార్తికద్వాదశి చైత్ర భాద్రపద తృతీయలు ఫాల్గునామావాస్య పుషై#్యకాదశి ఆషాఢదశమి మాఘసప్తమీ (రథసప్తమి) శ్రావణకృష్ణాష్టమి ఆషాడపూర్ణిమ కార్తిక ఫాల్గున జ్యేష్ఠ పూర్ణిమలు. ఈ మన్వాదులందు పితృదేవతలనుద్దేశించి యిచ్చునది అక్షయము. 130 పానీయ మప్యత్ర తిలైర్విమిశ్రం దద్యా త్ర్పితృభ్యః ప్రయతో మనుష్యః | శ్రాద్ధం కృతం తేన సమాస్సహస్రం రహస్య మేత త్పితరో వదంతి || 131 వైశాఖ్యా ముపవాసేషు తథోత్సవ మహాలయే || 132 తీర్ధాయతన గోష్ఠేషు ద్వీపోద్యాన గృహేషుచ | వివిక్తేషూ ఫలిప్తేషు శ్రాద్థం దేయం విజానతా || 133 విప్రా న్పూర్వే వరేచాహ్ని వినీతాత్మా నిమంత్రయేత్ | శీలవృత్తగుణోపేతా న్వయోరూపసమన్వితాన్ || 134 శ్రాద్ధమందు మానవుడు నియమవంతుడై నువ్వులతో పానీయము గూడ యీయవలెను. తిలతర్పణము చేయవలె నన్నమాట. దానిచే వేయిసంవత్సరములు శ్రాద్ధముపెట్టినట్లగును. ఈ విషయము పితృదేవతలే చెప్పినారు. వైశాఖమందు ఉపవాసములందు ఉత్సవములందు మహాలయములందు తీర్థములందు గోశాలలందు ద్వీపములందు ఉద్యాన గృహములందు వివిక్తములై జనసమర్దములేని గృహములందు శ్రాద్ధము జరుపవలెను. పూర్వాహ అపరాహ్ణములందు బ్రాహ్మణులను బిలువవలెను. (ఇది నిమంత్రణమందురు) వారు ఉత్తమ శీలగుణవంశ రూపవంతులుగా నుండవలెను. 134 ద్వౌదైవే పితృకృత్యే త్రీ నేకైక ముభయత్రవా | భోజయే త్సుసమృద్ధో೭పి నచకుర్వీత విస్తరమ్ || 135 విశ్వేదేవాస్యవైః పుషై#్ప రభ్యర్చ్యా సనపూర్వకమ్ | పూరయేత్పాత్రయుగ్మం తు స్థాప్యం దర్భపవిత్రకే || 136 శన్నోదేవీత్యపః కుర్యా ద్యవో೭సీతి యవానపి | గంధపుషై#్పస్తు సంపూజ్య విశ్వాన్ దేవాన్ ప్రతిన్యసేత్ | 137 విశ్వేదేవా స ఇత్యాభ్యా మావాహ్య వికిరే ద్యవాన్ | యవో೭సి ధాన్యరాజస్త్వం వారుణో మధుమిశ్రితః || 138 నిర్ణుదః సర్వపాపానా మ్పవిత్ర ఋషినంస్తుతః | గంధైః పుషై#్పరలం కృత్య యా దివ్యే త్యర్ఘ్య ముత్సృజేత్ || 139 అభ్యర్చ్య గంథాద్యుత్స్రుజ్య పితృయజ్ఞం సమారభేత్ | దర్భాననాది కృత్వాదౌ త్రీణిపాత్రాణి చార్చయేత్ || 140 నపవిత్రాణి కృత్వాదౌ శన్నోదేవీ త్యపః క్షేపేత్ | తిలో೭సీతి తిలాన్ కుర్యా ద్గంధపుష్పాదికం పునః || 41 పాత్రం వనస్పతిమయం తథా పర్ణమయం పునః | రాజతం వా ప్రకుర్వీత తథా సాగరసంభవమ్ || 42 సౌవర్ణం రజతం తామ్రం పితౄణాం పాత్ర ముచ్యతే | రజతస్య యథావాపి దర్శనం దానమేవ చ || 43 దైవనిమిత్తముగ (విశ్వేదేవస్థానమందు) ఇద్దరు, పితృస్థానమున ముగ్గురుని లేదా యీ రెండు స్థానములం దొక్కరొక్కరినికాని కూర్చుండబెట్టవలెను. శ్రాద్ధమందు ఎక్కువమందిని నిమంత్రింపరాదు. విశ్వేదేవుల యవలతో పూలతో ఆసనపూర్వకముగా నర్చింపవలెను. వారికి పాత్రములు (దొన్నెలు) రెండే. వానిం దర్భపవిత్రమం దుంప వలెను. అందు ''శంనోదేవి'' అను మంత్రముతో నీళ్లు ''యివోసిథాన్యరాజోవా'' అని యవలను గంధ పుష్పాదులతో వానిని నింపి విశ్వేదేవులను గూర్చి వాని నట నుంచవలెను. ''విశ్వేదేవాస'' అను మంత్రముతో వారి నావాహనము సేసి వారిపై యవలను జల్లవలెను. ''యవో೭సిధాన్యరాజస్త్యం'' బియవమధాన్యరాజువు వరుణ దేవతాకమవు తేనెతో గూడినదానవు సర్వపాపాపనోదనము సేయుదువు ఋషులుప్రస్తుతించిన పవిత్రమవు అను నర్ధముగల యీ మంత్రముతో నాపాత్రలందు యవలను జల్లి గంధపుష్పాదులచే వానినలంకరించి ''యాదివ్యా'' అను మంత్రముతో నర్ఘ్యమీవలెను. గంధాదికము నొసంగి, పితృయజ్ఞమారంభింపవలెను (పిత్రాద్యర్చన మన్నమాట). దర్భలతో అసనము కల్పించి మూడుపాత్రములనుంచి ''శంనోదేవీ'' అని అందుదకము నింపి ''తిలో೭సి'' అని మంత్రముసెప్పి తిలలందు వేసి గంధపుష్పాదులనుంచవలెను. వృక్షమయము (దారుమయము) ఆకులు (అరటి మోదుగ దొన్నెలవన్నమాట). వెండిచేగాని ఆపాత్రమునొనరింపవలెను. సాగరమయమేని సముద్రమందులభించుశంఖాదులు ముత్యపుచిప్ప లేని మంచివే. 43 రాజతైర్భాజనై రేషాం పితౄణాం రజతాన్వితైః | వార్యపి శ్రద్ధయా దత్త మక్షయాయోప కల్పతే || 144 దద్యాచ్చ పితృపాత్రేషు పితౄణాం రాజతాన్వితమ్ | శివనేత్రోద్భవం యస్మా దుత్తమం పితృవల్లభమ్ || 145 ఏవం పాత్రాణి సంకల్ప్య యథాలాభం విమత్సరః | యాదివ్యేతి పితు ర్నామ గోత్రే దర్భాన్ కరే న్యసేత్ || 146 పితౄ నవహయిష్యామి తథేత్యుక్తః సతైః పునః | ఉశంతస్త్వా తథాయన్తు ఋగ్భ్యా మావాహయే త్ర్పితౄన్ || 147 యాదివ్యే త్యర్థ్య ముత్సృజ్య దద్యా ద్గంధాదికం తతః | వస్త్రోత్తరం దర్భపూర్వం దత్వా సంశ్రయమాదితః || 148 పితృపాత్రే నిధాయాథ న్యుబ్జ ముత్తర తోన్యసేత్ | పితృభ్యః స్థాన మసీతి నిధాయ పరివేషయేత్ || 149 తత్రాపి పూర్వతః కుర్యా దగ్నికార్యం విమత్సరః | ఉభాభ్యామపి హస్తాభ్యా మాహృత్య పరివేషయేత్ || 150 ఉశన్తస్త్వేతి తం దర్భం పాణిభక్తం విశేషతః | గుణాన్వితైశ్ఛ శాకాద్యై ర్నానా భ##క్ష్యైస్తధైవచ || 151 అన్నం చ సదధిక్షీరం గోఘృతం శర్కరాన్వితమ్ | మాసం ప్రీణాతివై సర్వా న్ర్పితౄ నిత్యాహ పద్మజః || 152 వెండిపాత్రములలో వెండినాణములు కూడవేసి శ్రద్ధతో పితృదేవతలకిచ్చిన నీరుకూడ అక్షయమగును. పితృ దేవతోద్దేశముగ వెండిపాత్రములలో వెండితోగూర్చి యిచ్చినదెప్పుడుగూడ అక్షయమే. వెండి శివుని నేత్రములందుండి పుట్టినది. పితృదేవతల కది ప్రియము. ఇట్లు మాత్సర్యముడిగి యథాశక్తిగ వెండిపాత్రములను లేదా వెండిపాత్రలుగా సంభావించి మఱి యే యర్ఘ్యపాత్రలనో కల్పించి ''యాదివ్యా'' అను మంత్రముసెప్పి పితృవర్గము పేరు గోత్రములు చెప్పుచు నుద్దేశింపబడిన బ్రాహ్మణుని హస్తమందు దర్భల నుంచవలెను. కర్త పితౄనావాహ యిష్యామి (పితరులు నావాహనము సేయుచున్నాను) అని చెప్పగా బ్రాహ్మణుడు ఓంతథా=ఆలాగేయని ప్రత్యుత్తరమీయగా ''ఉశంతస్త్వా'' అను మంత్రముతో ''ఆయస్తుపితరః'' అనుదానితోను పితరుల నావాహించి ''యాదివ్యా'' అను మంత్రముతో నర్ఘ్యమిచ్చి గంధాదిక మాపై నీయవలెను. ఉత్తరీయము దర్భలతో గూర్చియిచ్చి మొదటినుండియు సంశ్రయఘు పాత్రక్రిందవేసిన దర్భలనుకూడ చేర్చి పితృపాత్రలో నుంచి - న్యుబ్జ్యం - వంచినదానిని (అర్ఘ్యమిచ్చినదానిని) ఉత్తరముగ నుంచవలెను. పితరులకు స్థానమైతివను నర్ధముగల వార్యమిది పల్కి వారికి ఉత్తరముగా నుంచి పరివేషణము (వడ్డన) సేయవలెను. అందుగూడ ముందు అగ్ని కార్యముగావించి రెండు చేతులతోను పాకాహరణముచేసి వడ్డింపవలెను. ''ఉశంతస్త్వా'' అను మంత్రముతో సలక్షణములైన కూరలతో పెక్కుభక్ష్యములతో పెరుగు పాలతో అన్నమును ఆవునేతిని పంచదారను గూర్చి వడ్డింపవలెను. అట్టి పదార్థము పితృదేవతలకొక్క మాసము సంపృప్తి సేయునని బ్రహ్మ పలికెను. 152 ద్వౌమాసౌ మత్స్య మాంసేన త్రీన్ మాసా సరిణనతు | ఔరభ్రే ణాథ చతురః శకునేనాథపంచవై || 153 పరాహస్యతు మాంసేన షణ్మాసం తృప్తిరుత్తమా | సప్తరోహస్య మాంసేన తథాష్టా వాజకేనతు || 154 వృషతస్యతు మాంసేస తృప్తిః మాసాన్న వైవతు | దశమాంసాశ్చ తృప్యం తే వరాహమహిషామిషైః || 155 శశకూర్మయోస్తు మాంసేన మాసానే కాదశైవతు | సంవత్సరం తు గవ్యేన వయసా పాయసేన వా || 156 సౌకరణ తు తృప్యంతే మాసాన్పంచ దశైవతు | వార్ద్రోణసస్య మాంసేన తృప్తి ర్ద్వాదశవార్షికీ || 157 కాలశాకేనచానంత్యంఖడ్గమాంసేన చైవహి | యత్కించిన్మధునా మిశ్రం గోక్షీరం దధిపాయసమ్ || 158 దత్త మక్షయ మిత్యాహుః పితరః పూర్వదేవతాః | స్వాధ్యాయం శ్రావయే త్ర్పిత్ర్యం పురాణా న్యభిలాని చ || 159 బ్రహ్మవిష్ణ్వర్క రుద్రాణాం స్తవాని వివిధాని చ | ఇంద్రేశ సోమ సూక్తాని పావమానశ్ఛ శక్తితః || 160 బృహద్రథంతరం తత్ర జ్యేష్ఠ సామాథరౌరవమ్ | తథైవ శాంతి కాధ్యాయం మధుబ్రాహ్మణ మేవచ || 161 మండలబ్రాహ్మణం తద్ద్వత్ర్పీతి కారిచ యత్పునః | విప్రాణా మాత్మనశ్చాపి తత్సర్వం సముదీరయేత్ || 162 భారతాధ్యయనం కార్యం పితౄణాం పరమప్రియమ్ | భుక్తవత్సు చ విప్రేషు భోజ్యతోయాదికం నృపః || 163 సార్వవర్ణికమన్నాద్య మానయే త్సావధారణమ్ | సముత్సృజేద్ భుక్తవతా మగ్రతో వికిరా న్భువి || 164 అగ్నిధగ్ధాశ్చ యే జీవా యే೭ప్యదగ్ధాః కులే మమ | భూమౌ దత్తేన తృప్యం తు తృప్తాయాంతు వరాం గతిమ్ || 165 యేషాం న మాతా న పితా న బంధుర్న చాపి మిత్రం న తథాన్నమస్తి | తత్తృప్తయే೭న్నం భువి దత్త మేత త్ర్పయాతు యోగాయ యతో యతస్తే || 166 అసంస్కృతప్రమీతానాం త్యాగినాం కులభాగినామ్ | ఉచ్ఛిష్టభాగధేయానాం దర్భేషు వికిరాసనమ్ || 167 తృప్తాన్ జ్ఞాత్వోదకం దద్యా త్సకృద్వికిరణ తథా | విప్రవిప్తమహీవృష్ఠే గోశకృన్మూత్రవారిణా || 168 నిధాయ దర్భాన్విధివద్దక్షిణాగ్రా న్ప్రయ త్నతః | సర్వవర్ణ విధానేన పిండాంశ్చ పితృయజ్ఞవత్ || 169 అవనేజనపూర్వం తు నామ గోత్రం తు మానవః | ఉక్త్వా పుష్పాదికం దత్వా కృత్వా ప్రత్యవనేజనమ్ || 170 జ్ఞాత్వా೭పసవ్యం సవ్యేన పాణినా త్రిఃప్రదక్షిణమ్ | పితృవన్ మాతృకం కార్యం విధివర్ధర్భపాణినా || 171 దీపప్రజ్వలనం తద్వత్కుర్యా త్పుష్పార్చనం బుధః | తథాచాంతే షు చాచమ్య దద్యాచ్చాపః సకృత్సకృత్ || 172 తధా పుష్పాక్షతాన్ పశ్చా దక్షయ్యోదక మేవచ | సతిలం నామగోత్రేణ దద్యా చ్ఛక్త్వా చ దక్షిణామ్ || 173 గో భూ హిరణ్య వాసాంసి భవ్యాని శయనాని చ | దద్యా ద్యదిష్టం విప్రాణామాత్మనః పితరేవ చ || 174 విత్తశాఠ్యేన రహితః పితృభ్యః ప్రీతిమావహేత్ | ఇతః స్వధావాచనకం విశ్వేదేవేషు చోదకమ్ || 175 దత్వాశీః ప్రతిగృహ్ణేయాద్ ద్విజేభ్యో೭పియథా బుధః | అఘోరాః పితరః సంతు సంత్వి త్యుక్తః పునర్ద్విజైః || 176 గోత్రం తథా వర్ధతాంతు తథేత్యుక్తశ్చతైః పునః | స్వస్తివాచనకం కుర్యా త్పిండానుద్ధృత్య భక్తితః || 177 ఉచ్చేషణంతు తత్తి ష్ఠేద్యావ ద్విప్ర విసర్జనమ్ | తతో గృహ బలిం కుర్యా దితి ధర్మో వ్యవస్థితః || 178 ఉచ్ఛేషణం భూమిగత మజిహ్మస్యా శఠస్య చ | దాస వర్గస్య తత్పిండం భాగధేయం ప్రచక్షతే || 179 పితృభి ర్నిర్మితం పూర్వ మేతదాప్యాయనం సదా | అవ్రతానా మపుత్రాణాం స్త్రీణామపి నరాధిప || 180 తతః స్థానాగ్రతః స్థిత్వా ప్రతిగృహ్యాంబుపాత్రికామ్ | వాజేవాజేతి చ జపన్కుశాగ్రేణ విసర్జయేత్ || 181 బహిః ప్రదక్షిణం కుర్యాత్ప దాన్యష్టా వనువ్రజేత్ | బంధువర్గేణ సహితః పుత్ర భార్యా సమన్వితః || 182 నివృత్య ప్రణిపత్యాథ ప్రయుజ్యాగ్నిం సమంత్రవిత్ | వైశ్వదేవం ప్రకుర్వీత నైత్యికం బలిమేవ చ || 183 తతస్తు వైశ్వదేవాంతే సభృత్య సుత బాంధవః | భుంజీతా తిథి సంయుక్తః సర్వం పితృ నిషేవితమ్ || 184 ఏతచ్చాసుపనీతో೭పి కుర్యాత్సర్వేషు పర్వసు | శ్రాద్ధం సాధారణం నామ సర్వకామ ఫలప్రదమ్ భార్యా విరహితో ప్యేతత్ర్పవాసస్థో೭పి భక్తిమాన్ || 185 శూద్రో೭ప్య మంత్రకం కుర్యాదనేన విధినా నృప | తృతీయ మాభ్యుదయికం వృద్ధి శ్రాద్ధే విధీయతే || 186 ఉత్సవానంద సంస్కారే యజ్ఞోద్వాహాది మంగలే | మాతరః ప్రథమం పూజ్యాః పితరస్తదనంతరమ్ || 187 తతో మాతా మహారాజన్విశ్వే దేవాస్త థైవచ || ప్రదక్షిణోప చారేణ దద్యక్షత ఫలోదకైః || 188 ప్రాజ్ముఖో నిర్వపేత్పిండా న్పూర్వాంశ్చైవ పురాతనాన్ | సంపన్న మిత్యభ్యుదయే దద్యాదర్ఘంద్వయోర్ద్వయోః || 189 యుగ్మా ద్విజాతయః పూజ్యా వస్త్రాకల్పాంబరాదిభిః | తిల కార్యం యవైః కార్యం తచ్చ సర్వానుపూర్వకమ్ || 190 మంగల్యాని చ సర్వాణి వాచయేద్ ద్విజపుంగవాన్ | ఏవం శూద్రో೭పి సామాన్యం వృద్ధి శ్రాద్ధం చ సర్వదా || 191 నమస్కారేణ మంత్రేణ కుర్యాద్దానాని వై బుధః దానమ్ ప్రధానం శూద్రస్య ఇత్యాహ భగవాన్ర్పభుః | దానేన సర్వకామాప్తి స్తస్య సంజాయతే యతః || 192 ఇతి శ్రీపద్మపురాణ ప్రథమే సృష్టిఖండే సాధారణాభ్యుదయ కీర్తనం నామ నవమో೭ధ్యాయః చేపమాంసముతోబెట్టిన రెండు లేదా లేడిమాంసముతోనైన మూడు ఉరభ్రమాంసముతో నాల్గు శకున మాంసముతో నైదు వరాహమాంసముచే నాఱు మాసములు లోహమాంసముచే నేడు అజకమాంసముచే (మేకమాంసము) నేనిమిది పృషతమాంసముచే తొమ్మిది వరాహమహిషముల మాంసములు రెండు కలిపి పది శశము=జింక కూర్మ తాబేలు మాంసములచే బదునొకండు ఆవుపాలు పాయసముచే పండ్రెండు సూకరమాంసముచే (పందులలో నిదియొక రకము) పదియైదు వార్ద్రోణమాంసముచే పండ్రెండు మాసములు (ఒక్కసంవత్సరము) తృప్తులగుదురు. కాలశాకము ఖడ్గమాంసమును అనంతకాల తృప్తికూర్చును. దానితో కొంచెము తేనె ఆవుపాలు పెరుగు పాయసము గూడ కలిసిన నెంతేని విశేషము. ఇట్లొనంగినది పూర్వదేవతలగు పితరులక్షయమని యన్నారు. తద్దినమునందు స్వాధ్యాయము సర్వపురాణములును బ్రహ్మ విష్ణు సూర్యస్తవములు లెన్నేని వినిపింపవలెను, ఇంద్రసూక్తము ఈశసూక్తము పావమాన సూక్తము యధాశక్తి బృహద్రధంతరము అందులో జ్యేష్ఠసామ రౌరవము శాంతికాధ్యాయము మధుబ్రాహ్మణము మండలబ్రాహ్మణము తనకు బ్రాహ్మణులకు ఇంకను ప్రీతికరమైన దంతయు పఠింపజేయవలెను. పితరులకు పరమ ప్రీతికరము భారతాధ్యయనము కర్తవ్యము. బ్రాహ్మణులు (భోక్తలు) భోజనము సేసిన తర్వాత, భోజనపదార్థము ఉదకము, సర్వవర్ణ సాధారణమైన అన్నభక్ష్యాదులను సావధారణముగ (శ్రద్ధగా) తీసికొనిరావలెను. భోజనముసేసిన బ్రాహ్మణుల ముందు వికిరములను వదలవలెను. నాకులములో అగ్నిదగ్ధులయినవారు, కానివారు భూమియందుంచిన యీ పిండముతో తృప్తులగుదురుగాక! తృప్తులై పరమగతి నందుదురుగాక. ఎవరికి తల్లిలేదో తండ్రిలేడో బంధువులేడో మిత్రుడులేడో అన్నములేదో వారి తృప్తికొరకీయన్నము భూమియందీయబడినది. ఇది వారెక్కడెక్కడ నున్నను వారికిది వోవుగాక! సంస్కారములేకుండా పోయినవారికి కులమునందున్న యోగులయినవారికి ఉచ్ఛిష్టభాగధేయులయిన వారికి (ఉచ్ఛిష్టము తమవంతు భాగముగా గలవారికన్నమాట) దర్భలందు వికిరాసనము వికిరాన్నము నుద్దేశింపబడినది. వారు ఒక్కమారిచ్చిన యా వికిరమందు సంతృప్తులైరని గ్రహించి ఉదకమీయవలెను. అపైని విప్రునిచే గోమయ గోమూత్ర జలముచే నలుకబడినచోట యధావిధిగ దక్షిణాగ్రములుగా దర్భలు పరచి పితృయజ్ఞమందట్లు సర్వవర్ణ విధానముగా అవనేజపూర్వముగా నామగోత్రములు సెప్పి పుష్పాదికము నిచ్చి సవ్యపాణితో (కుడిచేతితో) అపసవ్యముగా మూడుసారులు ప్రదక్షిణము సేయవలెను. తండ్రికి వలెనే తల్లికిని దర్భపాణియై యధావిధిని శ్రాద్ధము నీయవలెను. శ్రాద్ధాదులందు తొలుత దీపము వెలిగించుట పుష్పములతో నర్చనయు జరుగనయినదే. అంతయునైన తర్వాత ఆచమనమునేసి ఒక్కొక్కరికిని తర్పణమునుజేయవలెను. పుష్పాక్షతలు తర్వాత తిలలతో నామగోత్రములు సెప్పి యక్షయ్యోదకమీయవలెను. యథాశక్తి దక్షిణ సమర్పింపవలెను. అవి గోవులు భూమి హిరణ్యము (బంగారము) వస్త్రములు చక్కని శయనములు (మంచము పరుపులు మొదలగునవి) బ్రాహ్మణులకు తనకు పితరులకు నేదేది యిష్టమది యీయవలెను. ధనలోభము లేనివాడై పితృదేవతలకు ప్రీతిని చేకూర్చవలెను. స్వధాకారముతో విశ్వేదేవతలకును నుదకమునిచ్చి యా బ్రాహ్మణుల వలన ఆశీస్సులను గ్రహింపవలెను. పితరులు అఘోరులగుదురుగాక యని కర్త తా ననగా మీదట బ్రాహ్మణులును అట్లే యగుదురుగాక యనినమీదట స్వస్తివాచనము సేసి భక్తితో పిండముల నుద్ధరించి (పైకెత్తి) విప్రవిసర్జనముదాక ఉచ్చేషణము (పిండశేషము) యటనేయుంచి ఆ మీద గృహబలి సేయవలెను. ధర్మమీలాగుననున్నది. భూమిమీద నున్న ఉచ్ఛేషణ పిండమునకు మాయావి శఠుడుగాని దానవర్గము భాగస్వామి యని చెప్పబడినది. అనగా వారికది పెట్టవలెను. వ్రతములు లేనివారికి పుత్రులు లేనివారికి స్త్రిలకును గూడ యిది (ఉచ్ఛేషణము) పితృదేవతలచేతనే యేర్పరుపబడినది. అటుపై నచ్చోటికి అగ్రమందు (ముందు) చెంబుచేతగొని ''వాజేవాజే'' అను మంత్రము జపించుచు కుశాగ్రముతో బ్రాహ్మణ విసర్జనము సేయవలెను. ఇంటివెలుపల ప్రదక్షిణముసేసి యెనిమిదడుగులు వారిని సాగనంపవలెను. బంధువర్గముతో పుత్రపౌత్రులతో నిదిసేసి తిరిగివచ్చి అగ్నిప్రదక్షిణము సేసి మంత్రవేత్తయగు నా యజమానుడు వైశ్వదేవము సేయవలెను. నైత్వికము (నిత్యముసేయనైనది) అగు బలిని గావింపవలెను. వైశ్వదేవమయిన తర్వాత భృత్యులతో కొడుకులతో బంధువులతో నతిథులతోగూడి పితృదేవతలారగించిన దెల్ల (శేషము) భుజింపవలెను. ఇది ఉపనీతుడు గానివాడు కూడి పర్వములందు నిత్యముసేయవలెను. ఇది సాధారణ శ్రాద్ధమనునది. సర్వాభీష్టఫలప్రదము. భార్యలేనివాడు దగ్గరలేనివాడును ప్రవాసమందున్న వాడైనను భక్తితో జేసితిరవలెను. శూద్రుడును అమంత్రముగా నిదే విధిలో చేయనగునది మూడవది ఆభ్యుదయికము (అభ్యుదయము లిచ్చునది) వృద్ధిశ్రాద్ధమనునది విధింపబడినది. ఉత్సవానందమందు సంస్కారమందు యజ్ఞములందు వివాహాది మంగళకార్యములందు నీ వృద్ధిశ్రాద్ధము (నాంది యనుపేర) జరుపనైయున్నది. మొదట తల్లులు పూజ్యులు తరువాత తండ్రులు తర్వాత అటుపై మాతామహులు విశ్వేదేవులు ప్రదక్షిణోపచారముతో పెఱుగు అక్షతలు పండ్లు ఉదకములతో పూజింపదగినవారు. తూర్పు మొగమైకూర్చుండి పూర్వజులకు పురాతనములకు పిండమును నిర్వాపణ సేయవలెను. అనగా తండ్రి తాత ముత్తాతలను వరుసగా గణింపవలెనన్నమాట. ''సంపన్నమ్'' చక్కగానైనదని కర్తయనగా, సుసంపన్నం అని చాలా చక్కగా నైనదని విప్రులు పలుకగా వస్త్రములు అలంకారములు మొదలయినవానితో వారింబూజింపవలెను. వృద్ధిశ్రాద్ధమందు నువ్వులతో జేయవలసినది కూడ యవలతోనే చేయవలెను. అపైని ద్విజశ్రేష్ఠులచే మంగళ వాచనములు గావింపవలెను. శూద్రుడు గూడ యిట్లు సాధారణ శ్రాద్ధవిధిని వృద్ధిశ్రాద్ధ మనుపేర నెల్లప్పుడునుం జేయవలెను. ''నమః'' అను మంత్రముతో దానములనుసేయవలెను. శూద్రునకు దానము ప్రధానమని భగవానుడు ప్రభువు పలికి నాడు. దానముచేతనే అతనికి సర్వకామసిద్ధియగును. ఇది ''సాధారణాభ్యుదయ కీర్తనము'' అను తొమ్మిదవ యధ్యాయము