Sri Sivamahapuranamu-II
Chapters
అథ ఏకత్రింశో%ధ్యాయః బ్రహ్మవిష్ణువులకు శివుని ఉపదేశము సనత్కుమార ఉవాచ | అథాకర్ణ్య వచశ్శంభుర్హరి విధ్యో స్సుదీనయోః | ఉవాచ విహసన్ వాణ్యా మేఘనాద గభీరయా || 1 సనత్కుమారుడిట్లు పలికెను- మిక్కిలి దీనులగు ఆ బ్రహ్మ విష్ణువుల ఈ మాటలను విని శంభుడు నవ్వి మేఘగర్జన వలె గంభీరమగు స్వరముతో నిట్లనెను (1). శివ ఉవాచ | హే హరే వత్స హే బ్రహ్మంస్త్యజతం సర్వతో భయమ్ | శంఖచూడోద్భవం భద్రం సంభవిష్యత్యసంశయమ్ || 2 శంఖచూడస్య వృత్తాంతం సర్వం జానామి తత్త్వతః | కృష్ణభక్తస్య గోపస్య సుదామ్నశ్చ పురా ప్రభో || 3 మదాజ్ఞయా హృషీకేశో కృష్ణరూపం విధాయ చ గోశాలాయాం స్థితో రమ్యే గోలోకే మదధిష్ఠితే || 4 స్వతంత్రో%హమితి స్వం స మోహం మత్వా గతః పురా | క్రీడాస్సమకరోద్బహ్వీసై#్స్వరవర్తీవ మోహితః || 5 తం దృష్ట్వా మోహమత్యుగ్రం తస్యాహం మాయయా స్వయా | తేషాం సంహృత్య సద్బుద్ధిం శాపం దాపితవాన్ కిల || 6 ఇత్థం కృత్వా స్వలీలాం తాం మాయాం సంహృతవానహమ్ | జ్ఞానయుక్తాస్తదా తే తు ముక్త మోహాస్సుదబుద్ధయః || 7 సమీపమాగతాస్తే మే దీనీభూయా ప్రణమ్య మామ్ | అకుర్వన్ సునుతిం భక్త్యా కరౌ బద్ధ్వా వినమ్రకాః || 8 శివుడిట్లు పలికెను- ఓ హరీ! కుమారా! ఓ బ్రహ్మా! శంఖచూడుని వలన కలిగిన భయమును మీరు పూర్తిగా విడిచిపెట్టుడు. మీకు నిస్సంశయముగా మంగళము కలుగగలదు (2). ఓ ప్రభూ! శంఖచూడుని వృత్తాంతమును నేను పూర్తిగా యథాతథముగా నెరుంగుదును. ఆతడు పూర్వజన్మలో కృష్ణభక్తుడు అగు సుదాముడనే గోపాలకుడు (3). ఇంద్రియాధిపతియగు విష్ణువు నాయాజ్ఞచే కృష్ణరూపమును దాల్చి నాచే శాసింపబడే సుందరమగు గోలోకము నందు గోశాలయందున్నాడు (4). పూర్వము ఆతడు తాను స్వతంత్రుడనని భావించి మోహితుడై స్వేచ్ఛాచారివలె అనేక క్రీడలను చేసెను (5). వాని ఆ మిక్కిలి తీవ్రమగు మోహమును గాంచి నేను నా మాయచే వారి మంచిబుద్ధిని ఉపసంహరించి శాపమునిప్పించితిని. (6). ఇట్లు నా లీలను ప్రకటించి, తరువాత నా మాయను ఉపసంహరించితిని అపుడు వారు తొలగిన మోహము గల వారై సద్బుద్ధిని, జ్ఞానమును పొందిరి (7). వారు దీనవదనులై నా వద్దకు వచ్చి వినయముతో నమస్కరించి చేతులు జోడించి భక్తితో చక్కని స్తోత్రమును చేసిరి (8). వృత్తాంతమవదన్ సర్వం లజ్జాకులితమానసాః | ఊచుర్మత్పురతో దీనా రక్ష రక్షేతి వై గిరః || 9 తదా త్వహం భవస్తేషాం సంతుష్టః ప్రోక్తవాన్ వచః | భయం త్యజత హే కృష్ణ యూయం సర్వే మదాజ్ఞయా || 10 రక్షకో%హం సదా ప్రీత్యా సుభద్రం వో భవిష్యతి | మదిచ్ఛయా%ఖిలం జాతమిదం సర్వం న సంశయః || 11 స్వస్థానం గచ్ఛ త్వం సార్ధం రాధయా పార్షదేన చ | దానవస్తు భ##వేత్సో%యం భారతే%త్ర న సంశయః || 12 శాపోద్ధారం కరిష్యే%హం యువయోస్సమయే ఖలు | మదుక్తమితి సంధార్య శిరసా రాధయా సహ || 13 శ్రీకృష్ణో%మోదదత్యంతం స్వస్థానమగమత్సుధీః | న్యష్ఠాతం సభయం తత్ర మదారాధనతత్పరౌ || 14 మత్వాఖిలం మదధీనమస్వతంత్రం నిజం చ వై | స సుదామా%భవద్రాధాశాపతో దానవేశ్వరః || 15 శంఖచూడాభిధో దేవద్రోహీ ధర్మవిచక్షణ | క్లిశ్నాతి సబలాత్కృత్స్నం సదా దేవగణం కుధీః || 16 మన్మాయమోహితస్సో%తి దుష్టమంత్రి సహాయవాన్ | తద్భయం త్యజతాశ్వేవ మయి శాస్తరి వై సతి || 17 వారు సిగ్గుతో కలవరపడిన మనస్సు గలవారై నా ఎదుట దైన్యముతో వృత్తాంతమునంతనూ చెప్పి 'రక్షింపుము, రక్షింపుము' అని పలికిరి (9). అపుడు భవుడనగు నేను సంతసిల్లి వారితో నిట్లంటిని ; ఓ కృష్ణా! మీరందరు నా ఆజ్ఞచే భయమును విడనాడుడు (10). నేను సర్వదా ప్రేమతో మిమ్ములను రక్షించెదను. మీకు మంచి మంగళము కలుగ గలదు. ఇది అంతయూ నా ఇచ్ఛచేతనే జరిగినది. సందేహము లేదు (11). నీవు రాధతో మరియు నీ అనుచరునితో గూడి నీ స్థానమునకు వెళ్లుము. ఈతడు భారతదేశములో దానవుడై జన్మించును గాక! దీనిలో సంశయము లేదు (12). నేను సమయము వచ్చినపుడు మిమ్ములనిద్దరినీ శాపమునుండి ఉద్ధరించెదను. నా ఈ మాటను రాధాకృష్ణులిద్దరు శిరసా వహించిరి (13). బుద్ధిమంతుడగు శ్రీకృష్ణుడు చాల సంతసించి తన స్థానమునకు వెళ్లెను. వారిద్దరు భయపడుతూ నా ఆరాధనయందు నిష్ఠ గలవారై అచటనే మకాము చేసిరి (14). సర్వము నా ఆధీనములో నున్నదనియు, తమకు స్వాతంత్ర్యము లేదనియు వారు గుర్తించిరి. ఆ సుదాముడు రాధయొక్క శాపముచే దానవవీరుడై జన్మించెను (15). ధర్మవివేకము గల ఆ దానవుడు శంఖచూడుడను పేర ప్రసిద్ధిని గాంచి దేవతలకు ద్రోహమును తలపెట్టినాడు. ఆ దుష్టుడు దేవగణములనన్నింటినీ సర్వదా బలాత్కారముగా కష్టములకు గురిచేయుచున్నాడు (16). నా మాయచే మిక్కిలి మోహితుడై యున్న ఆ శంఖచూడునకు దుష్టులగు మంత్రులు తోడగుచున్నారు. మీరు వెనువెంటనే భయమును విడనాడుడు. నేను రక్షకుడను ఉన్నాను గదా! సనత్కుమార ఉవాచ | ఇత్యూచివాన్ శివో యావద్ధరిబ్రహ్మపురః కథామ్ | అభవత్తావదన్యచ్చ చరితం తన్మునే శృణు || 18 తస్మిన్నేవాంతరే కృష్ణో రాధయా పార్షదైస్సహ | సద్గోపైరాయ¸° శంభుమనుకూలయితుం ప్రభుమ్ || 19 ప్రభుం ప్రణమ్య సద్భక్త్యా మిలిత్వా హరిమాదరాత్ | సంమతో విధినా ప్రీత్యా సంతస్థౌ శివశాసనాత్ || 20 తతశ్శంభుం పునర్నత్వా తుష్టావ విహితాంజలిః | శ్రీకృష్ణో మోహ నిర్ముక్తో జ్ఞాత్వా తత్త్వం శివస్య హి || 21 సనత్కుమారుడిట్లు పలికెను- శివుడు ఈ తీరున బ్రహ్మ విష్ణువుల యెదుట వృత్తాంతమును చెప్పుచుండగనే, అచట మరియొక ఘటన జరిగినది. ఓ మునీ! దానిని వినుము (18). ఇదే సమయములో శ్రీకృష్ణుడు రాధతో మరియు మంచి గోపాలకులైన అనుచరులతో గూడి శంభుప్రభుని ప్రసన్నునిగా చేయుట కొరకై విచ్చేసెను (19). ఆతడు మంచి భక్తితో ప్రభునకు ప్రణమిల్లి, హరిని ఆదరముతో కలుసుకొని, విధిచే ప్రీతిపూర్వకముగా ఆదరింపబడిన వాడై, శివుని యాజ్ఞచే నిలబడి యుండెను (20). తొలగిన మోహము గల శ్రీకృష్ణుడు శివుని తత్త్వము నెరింగి, అపుడు చేతులు జోడించి మరల శంభునకు నమస్కరించి ఇట్లు స్తుతించెను (21). శ్రీకృష్ణ ఉవాచ | దేవదేవ మహాదేవ పరబ్రహ్మ సతాం గతే | క్షమస్వ చాపరాధం మే ప్రసీద పరమేశ్వర || 22 త్వత్త శ్శర్వ చ సర్వం చ త్వయి సర్వం మహేశ్వర | సర్వం త్వం నిఖిలాధీశ ప్రసీద పరమేశ్వర || 23 త్వం జ్యోతిః పరమం సాక్షాత్సర్వవ్యాపీ సనాతనః |త్వయా నాథేన గౌరీశ సనాథాస్సకలా వయమ్ || 24 సర్వోపరి నిజం మత్వా విహరన్మోహమాశ్రితః | తత్ఫలం ప్రాప్త వానస్మి శాపం ప్రాప్త స్సవామకః || 25 పార్షదప్రవరో యో మే సుదామా నామ గోపకః | స రాధాశాపతస్స్వామిన్ దానవీం యోనిమాశ్రితః || 26 అస్మానుద్ధర దుర్గేశ ప్రసీద పరమేశ్వర | శాపోద్ధారం కురుష్వాద్య పాహి నశ్శరణాగతాన్ || 27 ఇత్యుక్త్వా విరరామైవ శ్రీకృష్ణో రాధయా సహ | ప్రసన్నో%భూచ్ఛివస్తత్ర శరణాగతవత్సలః || 28 శ్రీకృష్ణుడిట్లు పలికెను- ఓ దేవదేవా! మహాదేవా! సత్పురుషులకు గతియైన వాడా! నా అపరాధమును క్షమించుము. ఓ పరమేశ్వరా! ప్రసన్నుడవు కమ్ము (22). ఓ శర్వా! సర్వము నీనుండి పుట్టుచున్నది. ఓ మహేశ్వరా! సర్వము నీయందు ఉన్నది. ఓ నిఖిలాధీశ్వరా! సర్వము నీవే. ఓ పరమేశ్వరా! ప్రసన్నుడవు కమ్ము (23). నీవు సాక్షాత్తుగా పరమజ్యోతిస్స్వరూపుడవు. సనాతనుడవగు నీవు సర్వవ్యాపివి. ఓ గౌరీపతి! నాథుడవగు నీ చేత మాత్రమే మేము అందరము సనాథులమగు చున్నాము (24). నేనే సర్వమునకు ఆధీశ్వరుడననే మోహమును పొంది విహరిస్తూ దాని ఫలమును పొంది యుంటిని. తప్పుదారిలో నడచిన వాడు శాపమును పొందినాడు (25). ఓ స్వామీ! నా అనుచరులలో ప్రముఖుడు, గోపాలకుడు అగు సుదాముడు రాధయొక్క శాపముచే దానవుడై జన్మించినాడు (26). ఓ దుర్గాపతీ! మమ్ములనుద్ధరించుము. శరణు జొచ్చిన మమ్ములను రక్షింపుము (27). రాధా సమేతుడైన శ్రీకృష్ణుడిట్లు పలికి విరమించెను. అపుడు శరణాగత వత్సలుడగు శివుడు ప్రసన్నుడాయెను (28). శ్రీ శివ ఉవాచ | హే కృష్ణ గోపికానాథ భయం త్యజ సుఖీ భవ | మయాను గృహ్ణాతా తాత సర్వమాచరితం త్విదమ్ || 29 సంభవిష్యతి తే భద్రం గచ్ఛ స్వస్థానముత్తమమ్ | స్థాతవ్యం స్వాధికారే చ సావధానతయా సదా || 30 విహరస్వ యథాకామం మాం విజ్ఞాయ పరాత్పరమ్ | స్వకార్యం కురు నిర్వ్యగ్రం రాధయా పార్షదైః ఖలు || 31 వారాహప్రవరే కల్పే తరుణ్యా రాధయా సహ | శాపప్రభావం భుక్త్వా వై పునరాయాస్యసి స్వకమ్ || 32 సుదామా పార్షదో యో హి తవ కృష్ణ ప్రియప్రియః | దానవీం యోనిమాశ్రిత్యేదానీం క్లిశ్నాతి వై జగత్ || 33 శాపప్రభావాద్రాధాయా దేవశత్రుశ్చ దానవః | శంఖచూడాభిధస్సో%తి దైత్యపక్షీ సురద్రుహః || 34 తేన నిస్సారితా దేవాస్సేంద్రా నిత్యం ప్రపీడితాః | హృతాధికారా వికృతాస్సర్వే యాతా దిశో దశ || 35 బ్రహ్మాచ్యుతౌ తదర్థే హీహాగతౌ శరణం మమ | తేషాం క్లేశవినిర్మోక్షం కరిష్యేనాత్ర సంశయః || 36 శ్రీశివుడిట్లు పలికెను- ఓ కృష్ణా! గోపీ వల్లభా! భయమును వీడి స్వస్థుడవు కమ్ము. వత్సా! అను గ్రహబుద్ధి గల నాచే ఈ సర్వము చేయబడినది (29). నీకు మంగళము కలుగగలదు. ఉత్తమమగు నీ స్థానమునకు వెళ్లి, నిత్యము సావధానుడవై నీ కర్తవ్యమును నిర్వహించుము (30). నేను పరాత్పరుడనని యెరింగి యథేచ్ఛగా విహరించుము. రాధతో మరియు అనుచరులతో గూడి నిశ్చింతగా నీ కర్తవ్యమును చేయుము (31). శ్వేతవరాహ కల్పములో రాధాసుందరితో గూడి శాపప్రభావమునను భవించి మరల నీ స్థానమును చేరగలవు (32). ఓ కృష్ణా! నీకు పరమ ప్రియుడు, అనుచరుడునగు సుదాముడు ఇపుడు దానవుడై జన్మించి జగత్తును కష్టపెట్టుచున్నాడు (33). రాధయొక్క శాపప్రభావముచే దేవతలకు శత్రువు అగు దానవుడై జన్మించి శంఖచూడుడను పేరుతో ప్రసిద్ధిని గాంచినాడు (34). వానిచే నిత్యము పీడింపబడి బయటకు త్రోసివేయబడిన ఇంద్రాది దేవతలు అందరు తమ అధికారములను గోల్పోయి వికృతరూపములతో పదిదిక్కులకు తరలి వెళ్లినారు (35). వారి కొరకై బ్రహ్మవిష్ణువులు ఇచటకు వచ్చి నన్ను శరణు పొందినారు. నేను నిస్సందేహముగా వారి కష్టములు తొలగించగలను (36). సనత్కుమార ఉవాచ | ఇత్యుక్త్వా శంకరః కృష్ణం పునః ప్రోవాచ సాదరమ్ | హరిం విధిం సమాభాష్య వచనం క్లేశనాశనమ్ || 37 సనత్కుమారుడిట్లు పలికెను - శంకరుడు శ్రీకృష్ణునితో నిట్లు పలికి మరల బ్రహ్మవిష్ణువులను సాదరముగా సంబోధించి దుఃఖమును పోగొట్టే వచనము నిట్లు పలికెను (37). శివ ఉవాచ | హే హరే హే విధే ప్రీత్యా మమేదం వచనం శృణు | గచ్ఛతం త్వరితం తాతౌ దేవానాదాయ నిర్భయమ్ || 38 కైలాసవాసినం రుద్రం మద్రూపం పూర్ణముత్తమమ్ | దేవకార్యార్థ ముద్భూతం పృథగాకృతి ధారిణమ్ || 39 ఏతదర్థే హి మద్రూపః పరిపూర్ణతమః ప్రభుః | కైలాసే భక్తవశతససంతిష్ఠతి గిరౌ హరే || 40 మత్తస్త్వత్తో న భేదో%స్తి యువయోస్సేవ్య ఏవసః | చరాచరాణాం సర్వేషాంసురాదీనాం చ సర్వదా || 41 ఆవయోర్భేదకర్తా యస్స నరో నరకం వ్రజేత్ | ఇహాపి ప్రాప్నుయాత్కష్టం పుత్రపౌత్రవివర్జితః || 42 ఇత్యుక్త వంతం దుర్గేశం ప్రణమ్య చ ముహుర్ముహుః | రాధయా సహితః కృష్ణస్స్వస్థానం సగణో య¸°|| 43 హరిర్బ్రహ్మాచ తౌ వ్యాస సానందౌ గతసాధ్వసౌ | ముహుర్మహుః ప్రణమ్యేశం వైకుంఠం యయతుర్ద్రుతమ్ || 44 తత్రాగత్యాఖిలం వృత్తం దేవభ్యో వినివేద్య తౌ | తనాదాయ బ్రహ్మవిష్ణూ కైలాసం యయతుర్గిరిమ్ || 45 తత్ర దృష్ట్వా మహేశానం పార్వతీవల్లభం ప్రభుమ్ | దీనరక్షాత్త దేహం చ సగుణం దేవనాయకమ్ || 46 తుష్టువుః పూర్వవత్సర్వే భక్త్యా గద్గదయా గిరా | కరౌ బద్ధ్వా నతస్కంధా వినయేన సమన్వితాః || 47 శివుడిట్లు పలికెను- ఓ హరీ! ఓ బ్రహ్మా! నా ఈ మాటను ప్రీతితో వినుడు. కుమారులారా! మీరు వెంటనే దేవతలను దోడ్కొని నిర్భయముగా కైలాసవాసియగు రుద్రునివద్దకు వెళ్లుడు. ఉత్తమమగు నాపూర్ణరూపమే రుద్రుడు. నేను దేవకార్యము కొరకై రెండవ ఆకారమును దాల్చి ఉద్భవించినాను (38, 39). ఓ హరీ! నా అవతారము. పరిపూర్ణుడు, సర్వసమర్థుడు అగు రుద్రుడు భక్తులకు సులభుడై వారి కొరకై కైలాసపర్వతమునందు స్థిరుడై ఉన్నాడు (40). నీకు నాకు భేదము లేదు. మీరిద్దరు ఆ రుద్రుని సేవించదగుదురు. దేవతలు మొదలగు స్థావరజంగమాత్మకముగ సర్వప్రాణులు ఆయనను సేవింతురు (41). మన ఇద్దరిలో భేదమును కల్పించు వ్యక్తి ఇహలోకములో పుత్రులచే, పౌత్రులచే నిరాకరింపబడినవాడై కష్టముల ననుభవించి, పిదప నరకమును పొందును (42). ఈ విధముగా పలికిన దుర్గాపతియగు శివుని రాధాసమేతుడైన శ్రీకృష్ణుడు పలుమార్లు ప్రణమిల్లి తన అనుచరులతో గూడి తన స్థానమునకు వెళ్లెను (43). ఓ వ్యాసా! బ్రహ్మవిష్ణువులు కూడ భయరహితులై ఆనందముతో ఈశ్వరునకు పలుమార్లు ప్రణమిల్లి వెంటనే వైకుంఠమునకు వెళ్లిరి (44). ఆ బ్రహ్మ విష్ణువులు అచటకు చేరి దేవతలకు వృత్తాంతమునంతను వివరించి వారిని దోడ్కొని కైలసపర్వతమునకు వెళ్లిరి (45). అచట పార్వతీ వల్లభుడు, దీనుల రక్షణ కొరకై దేహమును స్వీకరించినవాడు, సగుణుడు, దేవదేవుడు అగు మహేశ్వర ప్రభుని గాంచి (46). పూర్వమునుందు వలెనే వారందరు వినయముతో గూడిన వారై తలలు వంచి చేతులు జోడించి భక్తితో బొంగురుపోయిన కంఠములతో స్తుతించిరి (47). దేవదేవ మహాదేవ గిరిజానాథ శంకర | వయం త్వాం శరణాపన్నా రక్ష దేవాన్ భయాకులాన్ || 48 శంఖచూడం దానవేంద్రం జహి దేవనిషూదనమ్ | తేన విక్లబితా దేవాస్సంగ్రామే చ పరాజితః || 49 హృతాధికారాః కుతలే విచరంతి యథా నరాః | దేవలోకో హి దుర్దృశ్యస్తేషా మాసీచ్చ తద్భయాత్ || 50 దీనోద్ధర కృపాసింధో దేవానుద్ధర సంకటాత్ | శక్రం భయాన్మహేశాన హత్వా తం దానవాధిపమ్ || 51 ఇతి శ్రుత్వా వచశ్శంభుర్దేవానాం భక్తవతత్సలః | ఉవాచ విహసన్ వాణ్యా మేఘనాద గభీరయా || 52 దేవతలిట్లు పలికిరి - ఓ దేవదేవా! మహాదేవా! గిరిజాపతీ! శంకరా! మేము నిన్ను శరణు జొచ్చినాము. భయముచే కంగారు పడుతున్న దేవతలను రక్షించుము (48). దేవతలను నశింపజేసిన దానవవీరుడగు శంఖచూడుని సంహరించుము. ఆతడు దేవతలను యుద్ధములో జయించి కష్టములకు గురిచేసినాడు (49) దేవతలు అధికారములను గోల్పోయి మానవులవలె భూలోకములో తిరుగాడు చున్నారు. వాని భయము వలన వారు దేవలోకమును కన్నెత్తి చూడలేకున్నారు (50). దీనులనుద్ధరించే దయానిధీ! దేవతలనీ సంకటమునుండి ఉద్ధరించుము. ఆ దానవరాజును సంహరించి ఇంద్రునకు భయము నుండి విముక్తిని చేయుము. ఓ మహేశ్వరా! (51). ఈ మాటలను విని భక్త వత్సలుడగు శంభుడు నవ్వి మేఘగర్జనవలె గంభీరమగు స్వరముతో దేవతలనుద్దేశించి ఇట్లు పలికెను (52). శ్రీ శంకర ఉవాచ | హే హరే హే విధే దేవాస్స్వస్థానం గచ్ఛత ధ్రువమ్ | శంఖచూడం వధిష్యామి సగణం నాత్ర సంశయః || 53 శ్రీ శంకరుడిట్లు పలికెను- ఓ హరీ! ఓ బ్రహ్మా! దేవతలారా! మీరు నిశ్చయముగా మీమీ స్థానములకు వెళ్లుడు. అనుచరులతో సహా శంఖచూడుని వధించెదను. ఈ విషయములో సంశయము వలదు (53). సనత్కుమార ఉవాచ | ఇత్యాకర్ణ్య మహేశస్య వచః పీయూషసన్నిభమ్ | తే సర్వే ప్రముదా హ్యాసన్నష్టం మత్వా చ దానవమ్ || 54 హరిర్జగామ వైకుంఠం సత్యలోకే విధిస్తదా | ప్రణిపత్య మహేశం చ సురాద్యాస్స్వపదం యయుః || 55 ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే శివోపదేశో నామ ఏకత్రింశో%ధ్యాయః (31). సనత్కుమారుడిట్లు పలికెను- మహేశ్వరుని అమృతతుల్యమగు ఈ పలుకులను విని వారు అందరు శంఖచూడుడు నశించినట్లే యని తలంచి మహానందమును పొందిరి (54). అపుడు హరి వైకుంఠమునకు , బ్రహ్మ సత్యలోకమునకు వెళ్లిరి. దేవతలు మొదలగు వారు మహేశునకు ప్రణమిల్లి తమ స్థానములకు వెళ్లిరి (55). శ్రీ శివ మహా పురాణములోని రుద్ర సంహితయందు యుద్ధఖండలో శివోపదేశవర్ణనము అనే ముప్పది ఒకటవ ఆధ్యాయము ముగిసినది (31). అథ ద్వాత్రింశోధ్యాయః పుష్పదంతుడు శంఖచూడునకు నచ్చజెప్పుట సనత్కుమార ఉవాచ| అథేశానో మహారుద్రో దుష్టకాలాస్సతాం గతిః | శంఖచూడవధం చిత్తే నిశ్చికాయ సురేచ్ఛయా || 1 దూతం కృత్వా చిత్రరథం గంధర్వేశ్వరమీప్సితమ్ | శీఘ్రం ప్రస్థాపయామాస శంఖచూడాంతికే ముదా || 2 సర్వేశ్వరాజ్ఞయా దూతో య¸° తన్నగరం చ సః | మహేంద్రనగరోత్కృష్టం కుబేరభవనాధికమ్ || 3 గత్వా దదర్శ తన్మధ్యే శంఖచూడాలయం నరమ్ | రాజితం ద్వాదశైర్ద్వారైర్ద్వారపాల సమన్వితమ్ || 4 స దృష్ట్వా పుష్పదంతస్తు వరం ద్వారం దదర్శ సః | కథయామాస వృత్తాంతం ద్వారపాలయ నిర్భయః ||5 అతిక్రమ్య చ తద్ద్వారం జగామాభ్యంతరే ముదా | అతీవ సుందరం రమ్యం విస్తీర్ణం సమలంకృతమ్ || 6 స గత్వా శంఖచూడం తం దదర్శ దనుజాధిపమ్ | వీరమండలం మధ్యస్థం రత్నసింహాసనస్థితమ్ || 7 దానవేంద్రైః పరివృతం సేవితం చ త్రికోటిభిః | శతకోటిభిరన్యైశ్చ భ్రమద్భిశ్చస్త్ర పాణిభిః || 8 ఏవం భూతం చ తం దృష్ట్వా పుష్పదంతస్సవిస్మయః | ఉవాచ రణవృత్తాంతం యదుక్తం శంకరేణ చ || 9 సనత్కుమారుడిట్లు పలికెను - తరువాత మహాభయంకరస్వరూపుడు, దుష్టులకు మృత్యువు, సత్పురుషులకు శరణు అగు ఈశ్వరుడు దేవతల కోర్కెపై శంఖచూడుని వధించవలెనని నిశ్చయించెను (1). తనకు ఇష్టుడగు చిత్రరథుడనే గంధర్వరాజును దూతను చేసి వెంటనే శంఖచూడుని వద్దకు ఆనందముతో పంపెను (2). ఆ దూత సర్వేశ్వరుని ఆజ్ఞచే, మహేంద్రనగరము వలె గొప్పదైన శంఖచూడుని నగరమునకు వెళ్లి, ఆ నగరమధ్యములో కుబేర భవనము కంటే గొప్పది, పన్నెండు ద్వారములతో ప్రకాశించునది, ద్వార పాలకులతో కూడినది అగు శంఖచూడుని శ్రేష్ఠమగు నివాసమును గాంచెను (3, 4). ఆ పుష్పదంతుడు (చిత్రరథుడు) శ్రేష్టమగు ద్వారమును గాంచి తాను వచ్చిన పనిని నిర్భయముగా ద్వారపాలకునకు చెప్పెను (5). ఆతడు మిక్కిలి సుందరముగా అలంకరింపబడి యు%్న ఆ విశాలద్వారము దాటి ఆనందముతో లోపలకు వెళ్లెను (6). ఆతడు లోపలకు వెళ్లి వీరుల సముదాయము మధ్యలో రత్నసింహాసనము పైనున్న రాక్షసేశ్వరుడగు ఆ శంఖచూడుని గాంచెను (7). మూడు కోట్లమంది వీరులగు రాక్షసులచే చుట్టువారబడి యున్నవాడు, శస్త్రములను ధరించి తిరుగుతున్న వందకోటి ఇతరసైనికులచే సేవింపబడుచున్నవాడు (8) అగు ఆ శంఖచూడుని గాంచి పుష్పదంతుడు ఆశ్చర్యచకితుడై శంకరుడు చెప్పిన యుద్ధవృత్తాంతమునాతనికి చెప్పెను (9) పుష్పదంత ఉవాచ | రాజేంద్ర శివదూతో%హం పుష్పదంతాభిధః ప్రభో | యదుక్తం శంకరేణౖవ తచ్ఛృణు త్వం బ్రవీమీ తే || 10 ఓ మహారాజా! నేను శివుని దూతను. పుష్పదంతుడు నాపేరు. ఓ ప్రభూ! శంకరుని సందేహమును నీకు చెప్పెదను. దానిని వినుము (10). శివ ఉవాచ | రాజ్యం దేహి చ దేవానా మధికారం హి సాంప్రతమ్ | నో చేత్కురు రణం సార్ధం పరేణ చ మయా సతామ్ || 11 దేవా మాం శరణాపన్నా దేవేశం శంకరం సతామ్ | అహం క్రుద్ధో మహారుద్రస్త్వాం వధిష్యామ్యసంశయమ్ || 12 హరో%స్మి సర్వదేవేభ్యో హ్యభయం దత్త వానహమ్ | ఖలదండధరో%హం వై శరణాగతవత్సలః || 13 రాజ్యం దాస్యసి కిం వా త్వం కరిష్యసి రణం చ కిమ్ | తత్త్వం బ్రూహి ద్వయోరేకం దానవేంద్ర విచార్య వై || 14 శివుడిట్లు పలికెను- వెంటనే దేవతలకు రాజ్యమును, అధికారమును అప్పజెప్పుము. లేనిచో సత్పురుషులకు పరమగమ్యమగు నాతో యుద్ధమును చేయుము (11). సత్పురుషులకు మంగళమును ఇచ్చు దేవదేవుడనగు నన్ను శరణు పొందినారు. మహారుద్రుడనగు నేను కోపించియున్నాను. నిన్ను నిస్సంశయముగా వధించగలను (12). సంహారకరుడను, దుష్టులను శిక్షించువాడను, శరణాగతవత్సలుడను అగు నేను దేవతలందరికీ అభయమునిచ్చి యున్నాను (13). రాజ్యమునప్ప జెప్పెదవా? లేక, యుద్ధమును చేసెదవా! ఓ రాక్షసేంద్రా! నీవు ఆలోచించి ఈ రెండింటిలో ఒక మార్గము నెన్నుకొని యథార్థమగు ప్రతివచనము నిమ్ము (14). పుష్పదంత ఉవచ | ఇత్యుక్తం యన్మహేశేన తుభ్యం తన్మే నివేదితమ్ | వితథం శంభువాక్యం న కదాపి దను జాధిప || 15 అహం స్వస్వామినం గంతుమిచ్ఛామి త్వరితం హరమ్ | గత్వా వక్ష్యామి కిం శంభోస్తథా త్వం వద మామిహ || 16 పుష్పదంతుడిట్లు పలికెను- మహేశుడు చెప్పిన సందేశమును నేను నీకు విన్నవించితిని. ఓ రాక్షసరాజా! శంభుని వాక్యము ఎన్నటికీ పొల్లు పోదు (15). నేను నా ప్రభువగు హరుని వద్దకు శీఘ్రముగా చేరవలెనని ఆకాంక్షించుచున్నాను. నేను అచటకు వెళ్లి శంభునకు ఏమని చెప్పవలెను? నీ సమాధానమును ఇప్పుడు చెప్పుము (16). సనత్కుమార ఉవాచ | ఇత్థంచ పుష్పదంతస్య శివదూతస్య సత్పతేః | ఆకర్ణ్య వచనం రాజా హసిత్వా తమువాచ సః || 17 సనత్కుమారుడిట్లు పలికెను - సత్పురుషులకు ప్రభువగు శివుని దాతయైన పుష్పదంతుని ఈ వచనములను విని ఆ రాజు నవ్వి ఆతనితో నిట్లనెను (17). శంఖచూడ ఉవాచ | రాజ్యం దాస్యే న దేవేభ్యో వీరభోగ్యా వసుంధరా | రణం దాస్యామి తే రుద్ర దేవానాం పక్ష పాతినే || 18 యస్యోపరి ప్రయాయీ స్యాత్స వీరో భువనే% ధమః | అతః పూర్వమహం రుద్ర త్వాం గమిష్యామ్యసంశయమ్ || 19 ప్రభాత ఆగమిష్యామి వీరయాత్రా విచారతః | త్వం గచ్ఛాచక్ష్వ రుద్రాయ హీదృశం వచనం మమ ||20 ఇతి శ్రుత్వా శంఖచూడ వచనం సుప్రహస్య సః | ఉవాచ దానవేంద్రం స శంభుదూతస్తు గర్వితమ్|| 21 అన్యేషామపి రాజేంద్ర గణానాం శంకరస్య చ | న స్థాతుం సమ్ముఖే యోగ్యః కిం పునస్తస్య సమ్ముఖమ్|| 22 స త్వం దేహి చ దేవానా మధికారాణి సర్వశః | త్వమరే గచ్ఛ పాతాలం యది జీవితుమిచ్ఛసి || 23 సామాన్యమమరం తం నో విద్ధి దానవసత్తమ | శంకరః పరమాత్మా హి సర్వేషామీశ్వరేశ్వరః || 24 శంఖచూడుడిట్లు పలికెను- దేవతలకు రాజ్యము నీయను. రాజ్యము (భూమి) వీరులు అనుభవింప దగినది. ఓ రుద్రా! దేవపక్షపాతివగు నీకు యుద్ధమును ఇచ్చెదను. (18) శత్రువునకు తనపై దండెత్తే అవకాశము నిచ్చు వీరుడు ఈ లోకములో అధముడు. ఓరుద్రా! కావున నేను ముందుగా నీపై దండెత్తెదను. దీనిలో సందేహము లేదు (19). నా జైత్రయాత్రను పరిశీలించినచో, నేను రేపు తెల్లవారు సరికి అచటకు చేరగలను. నీవు వెళ్లి నా ఈ వచనమును రుద్రునకు చెప్పుము (20). శంభుని దూతయగు పుష్పదంతుడు గర్వితుడగు శంఖచూడుని ఈ వచనములను విని నవ్వి ఆ రాక్షసరాజుతో నిట్లనెను (21). ఓ రాజశేఖరా! శంకరుని గణముల యెదుట నైననూ నిలువగలిగే యోగ్యత నీకు లేదు. ఇక శంకరుని ఎదుట నిలబడుట గురించి చెప్పునదేమున్నది? (22). కావున నీవు అధికారములనన్నిటినీ దేవతలకు అప్పజెప్పుము. ఓరీ! నీకు జీవించు కోరిక ఉన్నచో, పాతాళమునకు పొమ్ము (23). ఓ రాక్షసశ్రేష్ఠా! శంకరుడు సామాన్య దేవతయని తలంచుకుము. ఆయన సర్వులకు, మరియు ఈశ్వరులకు కూడ ఆధీశ్వరుడగు పరమాత్మ (24). ఇంద్రాద్యాస్సకలా దేవా యస్యాజ్ఞానవర్తినస్సదా | సప్రజావతయస్సిద్ధా మునయశ్చాప్యహీశ్వరాః || 25 హరేర్విధేశ్చ స స్వామీ నిర్గుణస్సగుణస్స హి | యస్య భ్రూ భంగమాత్రేణ సర్వేషాం ప్రలయో భ##వేత్ || 26 శివస్య పూర్ణరూపశ్చ లోక సంహారకారకః | సతాం గతిం ర్దుష్టహంతా నిర్వికారః పరాత్పరః || 27 బ్రహ్మణో%ధిపతిస్సో%పి హరేరపి మహేశ్వరః | అవమాన్యా న వై తస్య శాసనా దానవర్షభ || 28 కిం బహుక్తేన రాజేంద్ర మనసా సంవిచార్య చ | రుద్రం విద్ధి మహేశాన పరం బ్రహ్మ చిదాత్మకమ్|| 29 దేహి రాజ్యం హి దేవానామధికారాంశ్చ సర్వశః | ఏవం తే కుశలం తాత భవిష్యత్యన్యథా భయమ్ || 30 ఇంద్రాది సమస్త దేవతలు, ప్రజాపతులు, సిద్ధులు, మునులు, మరియు నాగశ్రేష్ఠులు ఆయన ఆజ్ఞకు నిత్యము వశవర్తులై ఉందురు (25). బ్రహ్మ విష్ణువులకు ప్రభువగు ఆయన సగుణుడు, నిర్గుణుడు కూడా అగుచున్నాడు. ఆయన కనుబొమను విరిచినంతమాత్రాన సర్వలోకములకు ప్రళయము వాటిల్లును (26). లోకములను సంహరించే రుద్రుడు శివుని పూర్ణస్వరూపుడు. వికారములు లేని ఆ పరాత్పరుడు దుష్టులను సంహరించి సత్పురుషులకు శరణు నొసంగును (27). ఆ మహేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు కూడ అధీశ్వరుడు. ఓ దానవశ్రేష్ఠా! ఆయన శాసనమును తిరస్కరించుట తగదు (28). ఓ రాజశ్రేష్ఠా! ఇన్ని మాటలేల? మనస్సులో చక్కగా ఆలోచించుము. రుద్రుడే మహేశ్వరుడు, పరబ్రహ్మ, చైతన్యస్వరూపుడు అని తెలుసుకొనుము (29). దేవతలకు రాజ్యమును, సర్వాధికారములను అప్పజెప్పుము. కుమారా! ఈ తీరున చేసినచో నీకు క్షేమము కలుగ గలదు. అట్లు గానిచో, నీకుభయము తప్పదు (30). సనత్కుమార ఉవాచ | ఇతి శ్రుత్వా దానవేంద్రశ్శంఖచూడః ప్రతాపవాన్ | ఉవాచ శివదూతం తం భవితవ్య విమోహితః || 31 సనత్కుమారుడిట్లు పలికెను- ప్రతాపశాలి, దావనశ్రేష్టుడు అగు శంఖచూడుడు ఈ పలుకులను విని విధిచే సమ్మోహితుడై ఆ శివుని దూతతో ఇట్లనెను (31). శంఖచూడ ఉవాచ | స్వతో రాజ్యం న దాస్యామి నాధికారాన్ వినిశ్చియాత్ | వినా యుద్ధం మహేశాన సత్యమేతద్బ్రవీమ్యహమ్ || 32 కాలాధీనం జగత్సర్వంవిజ్ఞేయం సచరాచరమ్ | కాలాద్భవతి సర్వం హి వినశ్యతి చ కాలతః || 33 త్వం గచ్ఛం శంకరం రుద్రం మయోక్తం వద తత్త్వతః | స చ యుక్తం కరోత్వేవం బహువార్తాం కురుష్వనో || 34 శంఖచూడుడిట్లు పలికెను- మహేశ్వరునితో యుద్ధము చేయకుండగా నా అంతట నేను నిశ్చయించుకొని రాజ్యమును, అధికారములను అప్పజెప్పుట కల్ల. నేను సత్యమును పలుకు చున్నాను (32). ఈ స్థావరజంగమాత్మకమగు జగత్తు అంతయూ కాలమునకు వశ##మై యున్నది. సర్వము కాలమునందు పుట్టి, కాలమునందు గిట్టును (33). నీవు మంగళకరుడగు రుద్రుని వద్దకు వెళ్లి నా సందేశమును యథాతధముగా చెప్పుము. ఆయన ఏది యోగ్యమో దానిని చేయగలడు. నీవు అధికప్రసంగమును చేయకుము (34). సనత్కుమార ఉవాచ | ఇత్యుక్త్వా శివదూతో%సౌ జగామ స్వామినం నిజమ్ | యథార్థం కథయామాస పుష్పదంతశ్చ సన్మునే || 35 ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే దూతగమనం నామ ద్వాత్రింశోధ్యాయః (32). సనత్కుమారుడిట్లు పలికెను- ఆతడిట్లు పలుకగా శివుని దూతయగు పుష్పదంతుడు తన ప్రభువు వద్దకు వెళ్లెను. ఓ మహర్షీ! ఆతడు యథాతథముగా జరిగిన సంభాషణను రుద్రునకు చెప్పెను (35). శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందలి యుద్ధఖండలో శివదూత శంఖచూడ సంవాదమనే ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32).