Sri Sivamahapuranamu-II
Chapters
అథ ఏకోన చత్వారింశోeôధ్యాయః శివుని యాత్ర నారద ఉవాచ | విధే తాత మహాప్రాజ్ఞ విష్ణుశిష్య నమోeôస్తు తే | అద్భుతేయం కథాశ్రావి త్వత్తోeôస్మాభిః కృపానిధే || 1 ఇదానీం శ్రోతుమిచ్ఛామి చరితం శశిమౌలినః | వైవాహికం సుమాంగల్యం సర్వా ఫ°ఘవినాశనమ్ || 2 కిం చకార మహాదేవః ప్రాప్య మంగల పత్రికామ్ | తాం శ్రావయ కథాం దివ్యాం శంకరస్య పరాత్మనః || 3 నారదుడిట్లు పలికెను- ఓ విధీ! తండ్రీ! మహాప్రాజ్ఞా! విష్ణుశిష్యా! నీకు నమస్కారము. ఓ దయానిధీ!నీవు నాకీ అద్భుతమగు గాథను వినిపించితివి (1). ఇపుడు చంద్రశేఖరుని సుమంగళమగు, సమస్త పాపరాశులను నశింపజేసే వివాహవృత్తాంతమును వినగోరుచున్నాను (2). మంగళపత్రికను పొందిన తరువాత మహాదేవుడేమి చేసెను? శంకర పరమాత్ముని ఆ దివ్యగాథను వినిపింపుము (3). బ్రహ్మోవాచ | శృణు వత్స మహాప్రాజ్ఞ శాంకరం పరమం యశః | యచ్చకార మహాదేవః ప్రాప్య మంగల పత్రికామ్ || 4 అథ శంభుర్గృహీత్వా తాం ముదా మంగల పత్రికామ్ | వి జహాస ప్రహృష్టాత్మా మానం తేషాం వ్యధాద్విభుః || 5 వాచయిత్వా చ తాం సమ్యక్ స్వీచకార విధానతః | తజ్జనా న్యాపయామాస బహు సమ్మాన్య చాదృతః | 6 ఉవాచ ముని వర్గాంస్తాన్ కార్యం సమ్యక్ కృతం శుభమ్ | ఆగంతవ్యం వివాహే మే వివాహ స్స్వీకృతో మయా || 7 బ్రహ్మ ఇట్లు పలికెను - వత్సా! మహాప్రాజ్ఞా! శంకరుని పరమకీర్తిని వినుము. మహాదేవుడు మంగళ పత్రికను స్వీకరించి తరువాత ఏమి చేసెను? అను విషయమును వినుము (4). శంభుడు ఆ మంగళ పత్రికను ఆనందముతో స్వీకరించి, సంతసించిన అంతరంగము గలవాడై చిరునవ్వు నవ్వెను. వారికి ఆ ప్రభుడు సత్కారమును చేసెను (5). ఆ పత్రికను యథావిధిగా చదివించి ఆయన స్వీకరించెను. వారిని చాలా సత్కరించి పంపించెను (6). అపుడాయన సప్తర్షులతో, 'శుభకార్యమును చక్కగా నిర్వహించితిరి. ఈ వివాహము నాకు అంగీకారమే. నా వివాహమునకు రండు' అని చెప్పెను (7). ఇత్యాకర్ణ్య వచశ్శంభోః ప్రహృష్టాస్తే ప్రణమ్య తమ్ | పరిక్రమ్య యయుర్ధామ శం సంతస్స్వం విధిం పరమ్ || 8 అథ దేవేశ్వరశ్శంభు స్సస్మార త్వాం మునే ద్రుతమ్ | లౌకికాచార మాశ్రిత్య మహాలీలాకరః ప్రభుః || 9 త్వమాగతః పరప్రీత్యా ప్రశంసంస్త్వం విధిం పరమ్ | ప్రణమంశ్చ నతస్కంధో వినీతాత్మా కృతాంజలిః || 10 అస్తౌస్సు జయశబ్దాన్హి సముచ్చార్య ముహుర్ముహుః | నిదేశం ప్రార్థయం స్తస్య ప్రశంసంస్త్వం విధిం మునే || 11 శంభుని ఆ మాటను విని వారు మిక్కిలి సంతసించిన వారై ఆయనకు నమస్కరించి ప్రదక్షిణము చేసి తమ గొప్ప భాగ్యమును కొనియాడుచూ తమ స్థానమునకు వెళ్లిరి (8). ఓ మహర్షీ! అపుడు గొప్పలీలలను ప్రదర్శించు దేవదేవుడగు ఆ శంభు ప్రభుడు వెంటనే నిన్ము స్మరించెను (9). నీవు మహానందముతో నీ పరమ భాగ్యమును కొనియాడుతూ విచ్చేసి, చేతులు జోడించి వినయము నిండిన మనస్సుతో తలవంచి నమస్కరించితివి (10). ఓ మహర్షీ! నీవు అనేక పర్యాయములు జయశబ్దములను పలికి స్తుతించితివి. నీవు శంభుని ఆదేశమును ప్రార్థించి నీ భాగ్యమును కొనియాడుకొంటివి (11). తతశ్శంభుః ప్రహృష్టాత్మా దర్శయన్ లౌకికీం గతిమ్ | ఉవాచ మునివర్య త్వాం ప్రీణయన్ శుభయా గిరా| 12 ఓ మునిశ్రేష్ఠా! తరువాత శంభుడు హర్షముతో నిండిన మనస్సుగలవాడై లోకాచారమును ప్రదర్శించువాడై శుభవచనములతో ఆనందమును కలిగిస్తూ నీతో నిట్లనెను (12). శివ ఉవాచ | ప్రీత్యా శృణు మునిశ్రేష్ఠ హ్యాస్మత్తోeôద్య వదామి తే | బ్రువే తత్త్వాం ప్రియో మే యద్భక్తరాజ శిరోమణిః || 13 కృతం మహత్తపో దేవ్యా పార్వత్యా తవ శాసనాత్ | తసై#్య వరో మయా దత్తః పతిత్వే తోషితేన వై || 14 కరిష్యేeôహం వివాహం చ తస్యా వశ్యో హి భక్తితః | సప్తర్షిభిస్సాధితం చ తల్లగ్నం శోధితం చ తైః || 15 అద్యతస్సప్తమే చాహ్ని తద్భవిష్యతి నారద | మహాత్సవం కరిష్యామి లౌకికీం గతి మాశ్రితః || 16 శివుడిట్లు పలికెను - ఓ మునిశ్రేష్ఠా! నేను నీకు చెప్పెదను. నీవిపుడు ప్రీతితో వినుము. నీవు గొప్ప భక్తులలో అగ్రగణ్యుడవు, నాకు ప్రియుడవు. కావుననే నీకు చెప్పుచున్నాను (13). పార్వతీదేవి నీ ఆదేశముచే గొప్ప తపస్సును చేసినది. నేను సంతోషించి ఆమెను వివాహమాడెదనని వరము నిచ్చితిని (14). భక్తికి వశుడనయ్యే నేను ఆమెను వివాహమాడెదను. ఈ కార్యమును సప్తర్షులు సాధించినారు. వారు వివాహ లగ్నమును కూడా నిర్ణయించినారు (15). ఓ నారదా! ఈ నాటి నుండి ఏడవనాడు వివాహము సంపన్నము కాగలదు. నేను లోకాచారము ననుసరించి గొప్ప ఉత్సవమును చేయగలను (16). బ్రహ్మోవాచ | ఇతి శ్రుత్వా వచస్తస్య శంకరస్య పరాత్మనః | ప్రసన్నధీః ప్రభుం నత్వా తాత త్వం వాక్యమబ్రవీః|| 17 బ్రహ్మ ఇట్లు పలికెను- ఓ కుమారా! శంకర పరమాత్మ యొక్క ఆ మాటను విని, ప్రసన్నమగు మనస్సు గల నీవు ఆ ప్రభునకు నమస్కరించి ఇట్లు పలికితివి (17). నారద ఉవాచ| భవతస్తు వ్రతమిదం భక్తవశ్యో భవాన్మతః |సమ్యక్కృతం చ భవతా పార్వతీమానసేప్సితమ్ || 18 కార్యం మత్సదృశం కించిత్ కథనీయం త్వయా విభో | మత్వా స్వసేవకం మాం హి కృపాం కురు నమోeôస్తుతే || 19 నారదుడిట్లు పలికెను - ఇది నీ వ్రతము. నీవు భక్తులకు అధీనుడవని చెప్పెదరు. పార్వతియొక్క మనస్సులోని కోరికను తీర్చి నీవు మంచి పనిని చేసితివి (18). హే విభో! నీవు నన్ను నీ సేవకునిగా తలంచి, నాకు తగిన కార్యమునందు నియోగించుము. నాయందు దయను చూపుము. నీకు నమస్కారమగును గాక! (19) బ్రహ్మోవాచ | ఇత్యుక్తస్తు త్వయా శంభుశ్శంకరో భక్తవత్సలః | ప్రత్యువాచ ప్రసన్నాత్మా సాదరం త్వాం మునీశ్వర || 20 బ్రహ్మ ఇట్లు పలికెను- ఓ మహర్షీ! నీవు ఇట్లు పలుకగా, భక్తవత్సలుడగు శివశంకరుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై సాదరముగా నీతో నిట్లనెను (20). శివ ఉవాచ | విష్ణు ప్రభృతి దేవాంశ్చ మునీన్ సిద్ధానపి ధ్రువమ్ | త్వం నిమంత్రయ మద్వాణ్యా మునేeôన్యానపి సర్వతః || 21 సర్వ ఆయాంతు సోత్సాహా స్సర్వశోభా సమన్వితాః | సస్త్రీ సుతగణాః ప్రీత్యా మమ శాసన గౌరవాత్ || 22 నాగమిష్యంతి యే త్వత్ర మద్వి వాహోత్సవే మునే | తే స్వకీయా న మంతవ్యా మయా దేవాదయః ఖలు || 23 శివుడిట్లు పలికెను- ఓ మునీ! విష్ణువు మొదలగు దేవతలను, మునులను, సిద్ధులను మరియు ఇతరులనందరినీ కూడా నామాటగా తప్పని సరిగా నీవు ఆహ్వానించుము (21). అందరు నా శాసనమునందలి ఆదరముతో ఉత్సాహవంతులై సర్వశోభలను కలిగియున్నవారై భార్యపుత్రులతో పరివారముతో గూడా ప్రీతితో వచ్చెదరు గాక! (22) ఓ మునీ! దేవతలు మొదలగు వారు ఎవరైతే ఈ వివాహమహోత్సవమునకు హాజరు కారో, వారిని నేను నా వారు అని భావించలేను (23). బ్రహ్మోవాచ | ఇతీ శాజ్ఞాం తతో ధృత్వా భవాన్ శంకరవల్లభః| సర్వాన్నిమంత్ర యామాస తం తం గత్వా ద్రుతం మునే || 24 శంభూపకంఠ మాగత్య ద్రుతం మునివరో భవాన్ | తద్దూత్యాత్తతత్ర సంతస్థౌ తదాజ్ఞాం ప్రాప్య నారద || 25 శివోeôపి తస్థౌ సోత్కంఠ స్తదాగమనలాలసః | స్వగణౖ స్సోత్సవైస్సర్వైర్నృత్యద్భితస్సర్వతో దిశమ్ ||26 ఏతస్మిన్నేవ కాలే తు రచయిత్వా స్వవేషకమ్ | ఆజగామాచ్యుతశ్శీఘ్రం కైలాసం సపరిచ్ఛదః || 27 బ్రహ్మ ఇట్లు పలికెను- ఓ మునీ! శివునకు ప్రియుడవగు నీవు శివుని ఆ యాజ్ఞను స్వీకరించి అందరి వద్దకు వ్యక్తిగతముగా వెళ్లి శీఘ్రమే ఆహ్వానించితివి (24). నారదా! నీవు శివుని దూతవై ఆయన ఆజ్ఞను నిర్వర్తించి వెనువెంటనే శివుని వద్దకు వచ్చి నిలబడితివి (25). శివుడు కూడా ముహూర్తము యొక్క రాకను ఉత్కంఠతో ఎదురుచూచుండెను. శివగణములన్నియూ అన్ని దిక్కులయందు నాట్యము చేయుచూ ఉత్సవమును చేసుకొనెను (26). అదే కాలములో విష్ణువు తన వేషమును ధరించి గణములతో గూడి శీఘ్రముగా కైలాసమునకు వచ్చెను (27). శివం ప్రణమ్య సద్భక్త్యా సదారస్సదలో ముదా | తదాజ్ఞాం ప్రాప్య సంతస్థౌ సుస్థానే ప్రీతిమానసః || 28 తథాహం స్వగణౖరాశుకైలాసమగమం ముదా | ప్రభుం ప్రణమ్యాతిష్టం వై సానందస్స్వ గణాన్వితః || 29 ఇంద్రాదయో లోకపాలా ఆయయుస్సపరిచ్ఛదాః | తథైవాలంకృతాస్సర్వే సోత్సవాస్సకలత్రకాః || 30 తథైవ మునయో నాగాస్సిద్ధా ఉపసురాస్తథా | ఆయయుశ్చాపరేeôపీహ సోత్సవాస్సునిమంత్రితాః || 31 ఆయన భార్యతో గణములతో గూడి శివునకు ఆనందముతో పూర్ణ భక్తితో నమస్కరించి, ఆయన ఆజ్ఞను పొంది, చక్కని స్థానమునందు హర్షము నిండిన మనస్సు గలవాడై నివసించెను (28). అదేవిధముగా నేను కూడా నా గణములతో గూడి ఆనందముతో వెంటనే కైలాసమునకు వెళ్లి గణములతో సహా శివునకు నమస్కరించి ఆనందముగా మకాము చేసితిని (29). ఇంద్రుడు మొదలగు లోకపాలు రందరు చక్కగా అలంకరించుకొని తమ భార్యలతో, పరివారముతో గూడి ఉత్సాహముతో విచ్చేసిరి (30). అదే విధముగా ఆహ్వానించబడిన మునులు, నాగులు, సిద్ధులు, ఉపదేవతలు, మరియు ఇతరులందరు ఉత్సాహముతో కైలాసమునకు విచ్చేసిరి (31). మహేశ్వరస్తదా తత్రాగతానాం చ పృథక్ పృథక్ | సర్వేషా మమరాదీనాం సత్కారం వ్యదధాన్ముదా || 32 అథోత్సవో మహానాసీత్ కైలాసే పరమోeôధ్భుతః | నృత్యాదికం తదా చక్రుర్యథాయోగ్యం సురస్త్రియః || 33 ఏతస్మిన్ సమయే దేవవిష్ణ్వాద్యా యే సమాగతాః | యాత్రాం కారయితుం శంభోస్తత్రోషుస్తేeôఖిలా మునే || 34 శివాజ్ఞ ప్తాస్తదా సర్వే మదీయమితి యంత్రితాః | శివకార్యమిదం సర్వం చక్రిరే శివసేవనమ్ || 35 అపుడు మహేశ్వరుడు అచటకు వచ్చిన దేవతలు మొదలగు వారందరికీ వ్యక్తిగతముగా సత్కారమును ఆనందముతో చేసెను (32). తరువాత కైలాసములో అత్యద్భుతమగు మహోత్సవము జరిగెను. అపుడు దేవతాస్త్రీలు యథోచితముగా నాట్యము మొదలగు వాటిని చేసిరి (33). ఓ మునీ! ఆ సమయములో అచటకు విచ్చేసిన విష్ణువు మొదలగు దేవతలు అందరు శంభుని వివాహయాత్రను సంపన్నము చేయుటకై అచటనే నివసించి యుండిరి (34). అపుడు శివునిచే ఆజ్ఞాపించబడిన వారందరు శివకార్యము నంతనూ స్వీయకార్యముగా భావించి శివుని సేవించిరి (35). మాతరస్సప్త తాస్తత్ర శివభూషావిధిం పరమ్ | చక్రిరే చ ముదా యుక్తా యథా యోగ్యం తథా పునః || 36 తస్య స్వాభావికో వేషో భూషావిధిరభూత్తదా |తస్యేచ్ఛయా మునిశ్రేష్ఠ పరమేశస్య సుప్రభోః || 37 చంద్రశ్చ ముకుటస్థానే సాన్నిధ్య మకరోత్తదా | లో చనం సుందరం హ్యాసీత్తృతీయం తిలకం శుభమ్ | 38 కర్ణాభరణ రూపౌ చ ¸° హి సర్పౌ ప్రకీర్తితౌ | కుండలేeôభవతాం తస్య నానారత్నాన్వితే మునే || 39 కైలాసమునందు సప్తమాతృకలు శివునికి చక్కని యథోచితమైన అలంకార విధిని ఆనందముతో చేసిరి (36). ఓ మహర్షీ! పరమేశ్వరుడగు ఆ శివప్రభుని ఇచ్ఛచే ఆయన యొక్క సహజవేషము అలంకార విధిగా మారిపోయెను (37). చంద్రుడు కిరీటముగా రూపు దిద్దుకొనెను. సుందరమగు మూడవ కన్ను శుభతిలకముగా మారిపోయెను (38). ఓ మునీ! రెండు సర్పములు అనేక రత్నములతో గూడిన కర్ణకుండలములుగా రూపు దాల్చెను (39). అన్యాంగ సంస్థితాస్సర్పాస్తదంగా భరణాని చ | బ భూవురతి రమ్యాణి నానారత్న మయానిచ || 40 విభూతిరంగరాగోeôభూ చ్చందనాది సముద్భవః | తద్దుకూల మభూద్దివ్యం గజచర్మాది సుందరమ్ || 41 ఈ దృశం సుందరం రూపం జాతం వర్ణాతి దుష్కరమ్ | ఈశ్వరోeôపి స్వయం సాక్షాదైశ్వర్యం లబ్ధవాన్ స్వతః || 42 తతశ్చ సర్వే సురయక్ష దానవా నాగాః పతంగా ప్సరసో మహర్షయః | సమేత్య సర్వే శివసన్నిధిం తదా మహోత్సవాః ప్రోచురహో ముదాన్వితాః || 43 ఇతరావయవముల యందుండే సర్పములు ఆయా అంగములకు మిక్కిలి రమ్యములు, అనేక రత్నములు పొదగబడినవి అగు ఆభరణములుగా రూపు దిద్దుకొనెను (40). విభూతి గంధాదులతో గూడిన అంగవిలేపనమాయెను. గజచర్మము దివ్యము, సుందరము అగు పట్టు వస్త్రమాయెను (41). ఆయన ఇట్టి వర్ణింప శక్యము గాని సుందర రూపమును పొందెను. ఈశ్వరుడే స్వయముగా ఐశ్వర్యమును పొందెను (42). అపుడు దేవతలు, రాక్షసులు, యక్షులు, నాగులు, పతంగములు, అప్సరసలు, మహర్షులు అందరు మహోత్సాహముతో శివుని సన్నిధికి వచ్చి, ఆనంద భరితులై ఆశ్చర్యముతో గూడిన వారై ఇట్లనిరి (43). సర్వే ఊచుః | గచ్ఛ గచ్ఛ మహాదేవ వివాహార్థం మహేశ్వర | గిరిజాయా మహాదేవ్యాస్సహాస్మాభిః కృపాం కురు || 44 తతో విష్ణురువాచేదం ప్రస్తావసదృశం వచః | ప్రణమ్య శంకరం భక్త్యా విజ్ఞాన ప్రీతమానసః || 45 అందరు ఇట్లు పలికిరి- మహాదేవా! మహేశ్వరా! పార్వతీ మహాదేవిని వివాహమాడుట కొరకై మాతో గూడి శీఘ్రమే బయలు దేరుము. దయను చూపుము (44). అపుడు జ్ఞానముచే సంతుష్టమైన మనస్సు గల విష్ణువు భక్తితో శంకరునకు నమస్కరించి సందర్భమునకు అనురూపమగు మాటలను ఇట్లు పలికెను (45). విష్ణురువాచ | దేవ దేవ మహాదేవ శరణాగతవత్సల | కార్యకర్తా స్వభక్తానాం విజ్ఞప్తిం శృణు మే ప్రభో || 46 గృహ్యోక్త విధినా శంభో స్వవివాహస్య శంకర | గిరీశసుతయా దేవ్యా కర్మ కర్తు మిహార్హసి || 47 త్వయా చ క్రియమాణ తు వివాహస్య విధౌ హర | స ఏవ హి తథా లోకే సర్వస్సుఖ్యాతి మాప్నుయత్ || 48 మండప స్థాపనం నాందీ ముఖం తత్కుల ధర్మతః | కారయ ప్రీతితో నాథ లోకే స్వం ఖ్యాపయన్ యశః || 49 విష్ణువు ఇట్లు పలికెను- దేవ దేవా! మహాదేవా! శరణు జొచ్చిన వారిపై నీకు ప్రీతి మెండు. నీవు నీ భక్తుల కార్యములను చక్కబెట్టెదవు. ఓ ప్రభూ! నావిన్నపమును వినుము (46). శంభో! శంకరా! నీవు పార్వతీ దేవిని గృహ్యసూత్రములలో చెప్పబడిన విధానములో వివాహమాడదగుదువు (47). హే హరా! నీవు వివాహవిధిని పాటించినచో, లోకము నందు ఆ విధి అంతటా ఖ్యాతిని పొందగలదు (48). ఓ నాథా! వారి కులధర్మమునను సరించి మండప స్థాపనమును, నాందీముఖమును ప్రీతి పూర్వకముగా అనుష్ఠించి, లోకములో నీ కీర్తిని విస్తరింపజేయుము (49). బ్రహ్మోవాచ| ఏవముక్తస్తదా శంభుర్విష్ణునా పరమేశ్వరః | లౌకికాచారనిరతో విధినా తచ్చకార సః || 50 అహం హ్యధి కృతస్తేన సర్వమభ్యుదయోచితమ్ | అకుర్వం మునిభిః ప్రీత్యా తత్ర తత్కర్మ చాదరాత్ || 51 కశ్యపోeôత్రిర్వ శిష్ఠశ్చ గౌతమో భాగురిర్గురుః | కణ్వో బృహస్పతి శ్శక్తిర్జమదగ్నిః పరాశరః || 52 మార్కండేయ శ్శిలాపాకోeôరుణపాలోeôకృతశ్రమః | అగస్త్యశ్చ్యవనో గర్గశ్శిలాదోeôథ మహామునే || 53 బ్రహ్మ ఇట్లు పలికెను- విష్ణువు ఇట్లు పలుకగా, లోకాచారమునందు శ్రద్ధ గల శంభుపరమేశ్వరుడు ఆ కర్మలను యథావిధిగా చేసెను (50). ఆయనచే నియోగింపబడని నేను మునులతో గూడి అచట అభ్యుదయమునకు తగిన ఆ కర్మలను అన్నింటినీ ప్రీతితో ఆదరముతో చేసితిని (51). ఓ మహర్షీ! కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, భాగురి, గురుడు, కణ్వుడు, బృహస్పతి, శక్తి, జమదగ్ని పరాశరుడు (52), మార్కండేయుడు, శిలాపాకుడు, అరుణపాలుడు, అకృతశ్రముడు, అగస్త్యుడు, చ్యవనుడు, గర్గుడు, మరియు శిలాదుడు అచటకు విచ్చేసిరి (53). దధీచిరుపమన్యుశ్చ భరద్వాజోeôకృతవ్రణః | పిప్పలాదోeôథ కుశికః కౌత్సో వ్యాసస్సశిష్యకః || 54 ఏతే చాన్యే చ బహవ ఆగతాశ్శివ సన్నిధిమ్ | మయా సునోదితాస్తత్ర చక్రుస్తే విధివత్క్రి యామ్ || 55 వేదోక్త విధినా సర్వే వేద వేదాంగ పారగాః | రక్షాంచక్రు ర్మహేశస్య కృత్వా కౌతుక మంగలమ్ || 56 ఋగ్యజుస్సామ సూక్తైస్తు తథా నానా విధైః పరైః | మంగలాని చ భూరీణి చక్రుః ప్రీత్యర్ష యోeôఖిలాః || 57 %దధీచి, ఉపమన్యువు, భరద్వాజుడు, ఆకృతవ్రణుడు, పిప్పలాదుడు, కుశికుడు, కౌత్సుడు, వ్యాసుడు, ఆతని శిష్యులు (54) మరియు ఎందరో ఇతరులు శివుని సన్నిధికి వచ్చి యుండిరి. వారందరూ నా ప్రేరణచే అచట వైవాహిక కర్మను యథావిధిగా నిర్వర్తించిరి (55). వేదవేదాంగవేత్తలగు వారందరు మహేశునకు వేదోక్త విధానముచే పవిత్ర వివాహ కర్మకు మంగళమును కలిగించే రక్షాబంధనమును నిర్వర్తించిరి (56). ఆ ఋషులందరు ఋగ్యజుస్సామ వేదముల యందలి సూక్తములను, ఇతరములైన వివిధ ఆశీర్వచనములను పఠించి ప్రేమతో విస్తృతమగు మంగళా శాసనములను చేసిరి (57). గ్రహాణాం పూజనం ప్రీత్యా చక్రుస్తే శంభునా మయా | మండపస్థ సురాణాం చ సర్వేషాం విఘ్న శాంతయే || 58 తతశ్శివస్సు సంతుష్టః కృత్వా సర్వం యథోచితమ్ | లౌకికం వైదికం కర్మ ననామ చ ముదా ద్విజాన్ || 59 అథ సర్వేశ్వరో విప్రాన్ దేవాన్ కృత్వా పురస్సరాన్ | నిస్ససార ముదా తస్మాత్కైలాసాత్పర్వతోత్తమాత్ || 60 బహిః కైలాస కుధురాచ్చంభుస్త స్థౌ ముదాన్వితః | దేవైస్సహ ద్విజైశ్చైవ నానా స్వీకారకః ప్రభుః || 61 వారు శంభునిచే గ్రహపూజను ఆనందముతో చేయించిరి. మరియు విఘ్న నివారణ కొరకు మండపమును స్థాపించి దానియందు దేవతలనందరినీ ఆరాధించిరి (58). అపుడు శివుడు లౌకికవైదిక కర్మలనన్నిటినీ యథా యోగ్యముగా చేసి ఆ బ్రాహ్మణులకు ఆనందముతో నమస్కరించెను (59). అపుడు సర్వేశ్వరుడగు శివుడు బ్రాహ్మణులను, దేవతలను ముందిడుకొని, పర్వతరాజమగు ఆ కైలాసము నుండి ఆనందముతోబయలు దేరెను (60). అనేక లీలలను నెరపు ఆ శంభు ప్రభుడు ఆనందముతో నిండినవాడై దేవతలతో మరియు ఋషులతో గూడి కైలాస పర్వతమునకు బయట నిలచెను (61). తదోత్సవో మహానాసీత్తత్ర దేవాదిభిః కృతః | సంతుష్ట్యర్థం మహేశస్య గాన వాద్య సునృత్యకః || 62 ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే శివయాత్రా వర్ణనం నామ ఏకోన చత్వారింశోeôధ్యాయః (39). అపుడు దేవతలు అచట మహేశుని సంతోషము కొరకు గాన వాద్ నృత్యములతో నలరారే ఉత్సవమును జరిపిరి (62). శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో శివ యాత్రా వర్ణనమనే ముప్పది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (39).