Brahmapuranamu    Chapters   

అథద్వ్యధికద్విశతతమో7ధ్యాయః

నరకాసురవధవర్ణనమ్‌

వ్యాస ఉవాచ

ద్వారవత్యాం తతః శౌరిం శక్రస్త్రిభువనేశ్వరః | ఆజగామాధ మునయో మత్తైరావతపృష్ఠగః || 1

ప్రవిశ్య ద్వారకాం సో7థ సమీపే చ హరే స్తదా | కథయామాస దైత్యస్య నరకస్య విచేష్టితమ్‌ || 2

ఇంద్ర ఉవాచ

త్వయా నాథేన దేవానాం మనుష్యత్వే7పి తిష్ఠతా | ప్రశమం సర్వదుఃఖాని నీతాని మధుసూదన || 3

తపస్వి జనరక్షాయై సో7రిష్టో ధేనుక స్తథా | వ్రలంబాద్యాస్తథా కేశీ తే సర్వే నిహతా స్త్వయా || 4

కంసః కువలయాపీడః పూతనా బాలఘాతినీ | నాశం నీతాస్త్వయా సర్వే యో7న్యే జగదుపద్రవాః || 5

యుష్మద్దోర్దండ సంబుద్ధి పరిత్రాతే జగత్రయే | యజ్ఞే యజ్ఞహవిః ప్రాశ్య తృప్తిం యాంతి దివౌకసః || 6

సో7హం సాంప్రత మాయాతో యన్నిమిత్తం జనార్దన | తచ్ఛ్రుత్వా తత్ర్పతీకార ప్రయత్నం కర్తుమర్హపి | 7

భౌమో7యం నరకో నామ ప్రాగ్జ్యోతిష పురేశ్వరః | కరోతి సర్వభూతానా మపఘాత మరిందమ || 8

దేవసిద్ధసురాదీనాం నృపాణాం చ జనార్దన | హత్వా తు సో7సురః కన్యా కురోధ నిజమందిరే || 9

ఛత్రం యత్సలిలస్రావి తజ్జహార ప్రచేతసః | మందరస్య తథా శృంగం హృతవాన్మణి పర్వతమ్‌ || 10

అమృతస్రావిణీ దివ్యే మాతుర్మే7మృత కుండలే | జహార సో7సురో7దిత్యా వాంఛ త్యైరావతం ద్విపమ్‌ || 11

దుర్నీతమే తద్గోవింద మయా తస్య తవోదితమ్‌ | యదత్ర ప్రతి కర్తవ్యం తత్స్వయం పరిమృశ్యతామ్‌ || 12

నరకాసురవధ

వ్యాసులిట్లనియె. ''ఇంద్రురైరావతమెక్కి ద్వారవతియందున్న కృష్ణుని జూడవచ్చియతనికి నరకాసురుని చర్యలను దెలిపెను. దేవతలకు దిక్కయిన నీవు మనుష్యరూపమున నుండియు సర్వదుఃఖ ప్రశమనము జేసినావు. తపశ్శాలుర రక్షణకు నరిష్టుడు మొదలుగ గంసునిపరకు గల జగదుపద్రవమైనవారిని నశింపజేసితివి. నీ బాహుదండము చేతను బ్రబోధముచేతను ద్రిభువనములు రక్షణముబొంది దేవతలు యజ్ఞములందు హవిర్భావములారగించి తృప్తులగు చున్నారు. నేనిపుడు ఎందులకు వచ్చితినో విని ప్రతిక్రియకు నెత్నింపుడు. భూమిపుత్రుడు నరకుడనువాడు ప్రాగ్జ్యోతిష పురాధిపతి సర్వభూతములకు బాధచేయుచున్నాడు. దేవసిద్ధులు సురులు మొదలగువారి కన్యకల హరించి తనయింట నిర్భంధించినాడు. ఉదకమును స్రవించు వరుణుని యొక్క గొడుగును వాడు హరించెను. మణులకు ఆకరమైన మందర పర్వత శిఖరమును గొనిపోయినాడు. మాతల్లి యదితియొక్క కుండలములను అమృతము స్రవించు వానిని గాజేసినాడు. ఇపుడు ఐరావతము కావలెననుచున్నాదు. వాని దుష్కృత్యము నీకునివేదించినాను. ఇందు జేయవలసిన ప్రతిక్రియ నీవు స్వయముగా విమర్శింపుము.

వ్యాస ఉవాచ

ఇతి శ్రుత్వా స్మితం కృత్వా భగవాన్దేవకీసుతః | గృహీత్వా వాసనం హస్తే సముత్తస్థౌ వరాసనాత్‌ || 13

సంచింతిత ముపారుహ్య గరుడం గగనే చరమ్‌ | సత్యభామాం సమారోప్య య¸° ప్రాగ్జ్యోతిషం పురమ్‌ || 14

అరుహ్యైరావతం నాగం శ##క్రే7పి త్రిదశాలయమ్‌ | తతో జగామ సుమనాః పశ్యతాం ద్వారకౌకసామ్‌ || 15

అనవిని భగవంతుడు దేవకీసుతుడు అల్లననవ్వి ఇంద్రునిజేతబట్టుకొని పీఠమునుండి లేచెను. తలచినంతన వచ్చిన గరుత్మంతునిపై సత్యభామను ఎక్కించి ప్రాగ్జ్యోతిష పురమునకేగెను. ఇంద్రుడు ఐరావతమునెక్కి ద్వారకావాసులు చూచుచుండ స్వర్గమున కేగెను.

స్రాగ్జ్యోతిషపురస్యాస్య సమంతా చ్ఛతయోజనమ్‌ | ఆచితం భైరవైః పాశైః పరసైన్యనివారణ || 16

తాంశ్చిచ్ఛేద హరిః పాశా న్షి%్‌షిప్త్వా చక్రం సుదర్మనమ్‌ | తతో మురః సముత్తస్థౌ తం జఘాన చ కేశశః || 17

మురస్ప తనయాన్యప్త సహస్స్రాస్తాం స్తతో హరిః చక్రధారాగ్ని నిర్ధగ్ధ్నాం శ్చకార శలభానివ || 18

హత్వా మురం హయగ్రీవం తథా పంచజనం ద్విజాః | ప్రాగ్జ్యోతిషపురం ధీమాం స్త్వరావాన్సము పాద్రవత్‌ ||

నరకేనాస్య తత్రాభూ న్మహాసైన్యేన సంయుగః | కృష్ణస్య యత్ర గోవిందో జఘ్నే దైత్యాన్సహస్రశ ః || 20

శస్త్రౌస్త్రవర్షఫం ముంచంతం స భౌమం నరకం బలీ | క్షిప్త్వా చక్రం ద్విధా చక్రే చక్రీ దైతేయ చక్రహా || 21

హతే తే నరకే భూమి ర్గృహీత్వా7దితి కుండలే | ఉపతస్థే జగన్నాథం వాక్యం చేదమథాబ్రవీత్‌ || 22

ప్రాగ్జ్యోతిష పురము చుట్టునూ నూరు యోజనములు భయంకరములైన పాశములచే జుట్టబడి యుండెను. పరసైన్య నిరోధమునకు ఏర్పడిన యా పాశములను సుదర్శనాయుధము విసరి హరి ఖండించెను. అవ్వల మురాసురుడు ఎదిరింపరాగ హరి వానిని గడతేర్చెను. మరియు వాని కొడుకులను ఏడువేలమందిని మిడుతలను వలె చక్రధారాగ్ని దగ్ధులను జేసెను. అచ్చటనే హయగ్రీవుని జంపి బుద్దీశాలియగు హరి తొందరతో ప్రాగ్జ్యోతిషపురమునకు బరువెత్తెను. అచ్చట నరకునితో మహాసైన్యముతో ఘోర యుద్ధమయ్యెను. గోవిందుడు వేలకొలది దైత్యులను గూల్చెను. అవ్వల శస్త్రాస్త్రములను వర్షించుచున్న భౌముని మీకిది జక్రాయుధమును విసరి దైతేయచక్రసంహారి వానిని రెండుగ జేసెను. నరకుడు కూలగా భూదేవి యదతి యిచ్చిన కుండలములు గొని జగన్నాధు సన్నిధికి వచ్ఛి యిట్లనియె.

ధరణ్యువాచ

యదా7హముద్ధృతా నాథ త్వయా శూకర మూర్తినా | తత్సంస్పర్మభవః పుత్ర స్తద్యా7యం మయ్యజాయత || 23

సో7యం త్వయైవ దత్తోమే త్వయైవ వినిపాతితః | గృహాణ కుండలే చేమే పాలయాస్య చ సంతతిమ్‌ || 24

భారావతరణార్థాయ మమైవ భగవానామమ్‌ | అంశేన లోక మాయాతః ప్రసాదసుముఖ ప్రభో || 25

త్వం కర్తా చ వికర్తా చ సంహర్తా ప్రభవో7వ్యయః | జగత్ప్వరూపో యశ్చ త్వ స్తూయసే7చ్యుత కిం మయా ||

వ్యాపీ వ్యాప్యః క్రియా కర్తా కార్యం చ భగవాన్సదా | సర్వభూతాత్మ భూతాత్మా స్తూయసే7చ్యుత కిం మయా ||

పరమాత్మా త్వమాత్మాచ భూతాత్మా చావ్యయో భవాన్‌ | యదా తదా స్తుతిర్నా స్తి కిమర్థం తే ప్రవర్తతామ్‌ || 28

ప్రసీద సర్వభూతాత్మ న్నరకేన కృతం చయత్‌ | తత్షమ్యతా మదోషాయ మత్సుతః స నిపాతితః || 29

వ్యాస ఉవాచ

తథేతి చోక్త్వా ధరణీం భగవాన్భూత భావనః | రత్నాని నరకావాసాజ్జగ్రాహ మునిసత్తమాః || 30

కన్యాపురే స కన్యానాం షోడశాతుల విక్రమః | శతాధికాని దదశే సహస్రాణి ద్విజోత్తమాః || 31

చతుర్దంష్ట్రాన్గజాంశ్చోగ్రా న్షట్సహస్రాణి దృష్టవాన్‌ | కాంభోజానాం తథా7శ్వానాం నియుతాన్యేవింశతిమ్‌ ||

కన్యాస్తాశ్చ తథా నాగాం స్తానశ్వాన్ద్వారకాపురీమ్‌ | ప్రాపయామాస గోవిందః సద్యో నరక కింకరైః || 33

దదృశే వారుణం ఛత్రం తథైవ మణి పర్వతమ్‌ ఆరోపయామాస హరి ర్గరుడే పతగేశ్వరే || 34

ఆరుహ్య చ స్వయం కృష్ణః సత్యభామాసహాయవాన్‌ | ఆదిత్యాః కుండలే దాతుం జగామ త్రిదశాలయమ్‌ || 35

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే కృష్ణచరితే నరకవధో నామ ద్వ్యిధిక ద్విశతతమో7ధ్యాయః

భూమికృత కృష్ణస్తుతి

''స్వామి! వరాహమూర్తివై ననుద్ధరించినపుడు ఆ నీ స్పర్శవలన నీ పుత్రుడు పుట్టినాడు. నీ యిచ్చినవాడు వీడు. నీ చేతిలో కూలినాడు. ఈ కుండలములను గైకొనుము. ఈ నరకుని సంతానమును రక్షింపుము. నా భారమును దింపుటకు నీవీ లోకమున నంశావతార మెత్తినావు. అనుగ్రహ సుముఖుడవు గమ్ము. నీవు కర్తవు. వికర్తవు. (వేరు చేయువాడవు) సంహర్తవు. సృష్టిహేతువవు. జగత్‌స్వరూపుడవు.నిన్ను నేనెక్కడ స్తుతింపగలను, వ్యాపించువాడవు. వ్యాపింపబడువాడవు. చేయువాడవు. చేయనగు పని చేయుటయు నీవె. సర్వ భూతములకు నాత్మ స్వరూపుడవు. నేనెక్కడ స్తుతింతును. ఆత్మ (జీవుడు) భూతాత్మ (భూత స్వరూపము) పరమాత్మవు నీవె. నరకుడు చేసిన దానిని దప్పిదము కాకుండ క్షమింపుము. ప్రసన్నుడవు కమ్ము. వీడు నా కుమారుడు. కూల్పబడినాడు.'' అని భూదేవి హరిని స్తుతించెను.

కృష్ణుడు ధరణితో నట్లేయని నరకునింటనున్న రత్నములను దీసికొనెను. (రత్నములనగ మణులేకాదు ఆయా వస్తువులలోకెల్ల నుత్తమమయిన యెల్ల వస్తువులను) అంతఃపురమున పదహారువేలు పైన నూర్గురునగు కన్యకలను గూడ గైకొనెను. నాలుగు దంతములుగల యారువేల యేనుగులనచట జూచెను. కాంభోజ దేశీయములైన గుఱ్ఱములు ఇరువదియొక్క నియతముల సంఖ్యగలవి వానియింట నున్నవి. నరకుని కింకరులచే నప్పటికప్పుడు గోవిందుడు ద్వారకాపురికి దరలింపజేసెను. వారుణచ్ఛత్రమట గనిపించెను. అట్లే మణి పర్వతమును. హరిదానిని ఖగరాజు గరుడనెక్కించెను. సత్యభామతో దాను నధిష్ఠించి యదితికి కుండలములిచ్చుటకు ద్రిదశపురికేగెను.

ఇది బ్రహ్మపురాణమున నరకాసురవధ యను రెండవందలరెండవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters