Brahmapuranamu    Chapters   

అథ షడధికద్విశతతమో7ధ్యాయః

బాణయుద్ధవర్ణనమ్‌

వ్యాస ఉవాచ

బాణో7పి ప్రణిపత్యాగ్రే తతశ్చా77హ త్రిలోచనమ్‌ || 1

దేవ బాహు నహస్రేణ నిర్విణ్ణో7హం విని7హవమ్‌ | కచ్చిన్మమైషాం బాహూనాం సాఫల్యకరణోరణః || 2

భవిష్యతి వినా యుద్ధం భారాయ మమ కిం భుజైః ||

శంకర ఉవాచ

మయూరధ్వజభంగస్తే యదా బాణ భవిష్యతి | పిశితాశి జనానందం ప్రాప్స్యపి త్వం తదా రణమ్‌ || 3

వ్యాసుడిట్లనియె. బాణుడు త్రిలోచనునికి మ్రొక్కియిట్లనియె. వేయిబాహువులతో యుద్ధములేక నేను నిస్పృహుడనైతిని. ఈచేతులున్నందులకు ఇవి సాఫల్యము నందుటకేదేని రణము సంఘటింపవలదా? అదిలేనపు డీచేతులు బరువు చేటుగదా. ఇవియెందులకు? అన శంకరుండు నీనెమలిటెక్కెమెప్పుడు విఱుగునో యప్పుడు మాంసాశనులగు జనముల కానందమగు యుద్ధము నీకు సంఘటించుననియె.

వ్యాస ఉవాచ

తతః ప్రణమ్య ముదితః శంభు మభ్యాగతో గృహాన్‌ |

భగ్నం ధ్వజమథా77 లోక్య హృష్టో హర్షం పరంయ¸° || 4

ఏతస్మిన్నేవ కాలే తు యోగవిద్యాబలేన తమ్‌ | అనిరుద్ధమథా77నిన్యే చిత్రలేఖా వరా సఖీ || 5

కన్యాంతః పురమధ్యేతం రమమాణం సహోషయా | విజ్ఞాయ రక్షిణో గత్వా శశంసు ర్దైత్యభూపతేః || 6

దివ్యాష్టం కింకరాణాంతు సైన్యం తేన మహాత్మనా | జఘాన పరిఘం లౌహ మాదాయ పరవీరహా || 7

అంతట సంతసించి శంభునికిమ్రొక్కి యింటికివచ్చి రాగానే ధ్వజభంగమగుట చూచి మిక్కిలి హర్షమొందెను. ఇదేసమయమున చిత్రలేఖ యాయనిరుద్థుని కన్యాంతఃపురమునకు యోగబలమున గొనివచ్చినిలుప నుషాదేవితో గ్రీడించుచున్న వానింజుచి కావలివాండ్రు దైత్యపతికెఱిగించిరి. బాణునానతిచే పచ్చిపైబడిన సేవకసైన్యము నమ్మహాత్ముడనిరుద్ధుడు ఇనుపపరిఘంగొని చాపమోచెను.

హతేషు తేషు బాణో7పి రథస్థ స్తద్వధోద్యతః | యుధ్యమానో యథాశక్తి యదా వీరేణ నిర్జితః || 8

మాయయా యుయుధే తేన సతదా మంత్రచోదితః | తతశ్చ పన్నగాస్త్రేణ బబంధ యదునందనమ్‌ || 9

ద్వారవత్యాం క్వయాతో7సా వనిరుద్ధేతి జల్పతామ్‌ | యదూనా మాచచక్షే తం బద్ధం బాణన నారదః || 10

తం శోణితపురే శ్రుత్వా నీతం విద్యావిదగ్ధయా | యోషితా ప్రత్యయం జగ్ము ర్యాదవా నామవైరిణి || 11

వారట్లు హతులైనంత బాణుడు రథమెక్కివచ్చి పోరియవ్వీరుని వలన బరాజయమొందెను. అవ్వలబాణుడు మంత్రము జపించి మాయాయుద్ధము సేయనారంభించెను. సర్పాస్త్రముచే యదునందనుని బంధించెను. అనిరుద్ధుడెటువోయెనని ద్వారకలో ననుకొనుచున్న యదువులకు నారదుడతని బాణునిచేబద్ధుడయినట్లు తెలియజేసెను. అవ్వల యాదవులా యనిరుద్ధ కుమారుని యోగవిద్యా విశారదయగు నొకయంగన శోణితపురమునకు గొంపోయి నట్లు విని శత్రువునందు విశ్వాసము నందిరి.

తతో77గరుడ మారుహ్య స్మృతమాత్రా గతం హరిః | బలప్రద్యుమ్న సహితో బాణస్య ప్రయ¸° పురమ్‌ || 12

పురీప్రవేశే ప్రమథై ర్యుద్ధ మాసీ న్మహాబలైః | య¸° బాణపురాభ్యాశం నీత్వా తా న్సంక్షయం హరిః || 13

తతస్త్రిపాదస్త్రిశిరా జ్వరో మాహేశ్వరో మహాన్‌ | బాణరక్షార్థమత్యర్థం యుయుధే శారఙ్గ ధన్వనా || 14

తద్భస్మస్పర్శసంభూత తాపం కృష్ణాంగసంగమాత్‌ | అవాప బలదేవో7పి సమం సంమీలి తేక్షణః || 15

తతః సంయుధ్యమానస్తు సహ దేవేన శారిఙ్గ ణా | వైష్ణవేన జ్వరేణా77శు కృష్ణదేవా న్నిరాకృతః || 16

నారాయణభుజాఘాత పరిపీడన విహ్వలమ్‌ | తంవీక్ష్య క్షమ్యతా మస్యే త్యాహ దేవః పితామహః || 17

తతశ్చ క్షాంత మేవేతి ప్రోచ్య తం వైష్ణవం జ్వరమ్‌ | ఆత్మన్యేవ లయం నిన్యే భగవా న్మధుసూదనః || 18

మమ త్వయా సమం యుద్ధం యే స్మరిష్యంతి మానవాః | విజ్వరాస్తే భవిష్యంతీ త్యుక్త్వా చైనం య¸°హరిః || 19

తతో7గ్నీన్భగవాన్పంచ జిత్వా నీత్వా క్షయం తథా | దానావానాం బలం విష్ణు శ్చూర్ణయామాస లీలయా || 20

తతః సమస్త సైన్యేన దైతేయానాం బలేః సుతః | యుయుధే శంకరశ్చైవ కార్తికేయశ్చ శౌరిణా || 21

హరిశంకరయో ర్యుద్ధ మతీ వా77సీ త్సుదారుణమ్‌ | చుక్షుభుః సకలా లోకాః శస్త్రాసై#్రర్బహుధా7ర్దితాః || 22

ప్రళయో7యమశేషస్య జగతో నూన మాగతః | మేనిరే త్రిదశా యత్ర వర్తమానే మహారణ || 23

జృంభాణాస్త్రేణ గోవిందో జృంభయాస శంకరమ్‌ | తతః ప్రణశు ర్దైతేయాః ప్రమథాశ్చ సమంతతః || 24

జృంభాభిభూతశ్చ హరో రథోపస్థ ఉపావిశత్‌ | న శశాక తదా యోద్ధుం కృష్ణే నాక్లిష్ట కర్మణా || 25

గరుడక్షతబాహుశ్చ ప్రద్యుమ్నాస్త్రేణ పీడితః | కృష్ణహుంకారనిర్ధూత శక్తి శ్చా7పయ¸° గుహః || 26

జృంభితే శంకరే నష్టే దైత్యనైన్యే గుహేజితే | నీతే ప్రమథస్తెన్యే చ సంక్షయం శారఙ్గధన్వనా || 27

నందీశ సంగృహీతాశ్వ మధిరూఢో మహారథమ్‌ | బాణస్తత్రా77య¸°యోద్ధుంకృష్ణకార్షిణ బలైఃః సహ|| 28

అంతట హరి తలచినంతనే వచ్చినగరుడునెక్కి బలరామునితో ప్రద్యుమ్నునితో గూడి బాణపురమున కేగెను. పురప్రవేశమందే బలశాలురగు ప్రమథగణముతో రణమయ్యెను. హరి వారిని క్షయమొందించి బాణపుర ప్రాంతములకు వెళ్లెను.

అవ్వల త్రిపాదముత్రిశిరస్కమునైన మాహాజ్వరము బాణునికాపుదలకై శారఙ్గధన్వునితో(హరితో)పోరజొచ్చెను. కృష్ణశరీరస్పర్శ వలన భస్మసర్శవలన జనించిన యొకానొకతాపమును బలరాముడుకూడ పొంది కన్నులుమూసికొనెను. కృష్ణునితో బోరుచున్న మహేశ్వరజ్వరము వైష్ణవ జ్వరముచే కృష్ణదేహమునుండి త్రోసివేయబడెను. నారాయణుని భుజముల యొత్తిడిచే పీడింపబడిన మహేశ్వరజ్వరమును చూచిబ్రహ్మదీనిని క్షమింపుడనిపలికెను. వానిబాహువనమట్లు తెగిపోవ మధువైరి త్రిపురవైరిచే దెలుపబడి చేతనున్న సుదర్శనమును వదలనెంచెను. అప్పుడుమాపతిలేచి బాహువులతెగి రక్తధారలను వర్షించుచున్న బాణునింగని సామపూర్వకముగ గోవిందునితో నిట్లనియె.

నారాయణభుజాఘాతముచే గల్గినబాధచే గన్నులు తీసివేసిన మాహేశ్వరజ్వరముంగని బ్రహ్మ వీనిని క్షమింపుమని హరింగోరె అటుమీద క్షమించితినని వైష్ణవజ్వరమును దనయంద లయింప జేసికొనెను. నీతోనాకైన యీ యుద్ధము నెవ్వరు స్మరింతురోవారు విజ్వరులు (జ్వరబాధలేనివారు) అయ్యెదరని హరి యేగెను. అవ్వల శత్రు ప్రయుక్తములగు పంచాగ్నులగెల్చి క్షీణింపజేసి దానవులసేనలను విష్ణువు లీలగ పిండిసేసెను.

అవ్వల బాణుడు శంకరుడు కుమారస్వామియు సమస్తసైన్యముతో కృష్ణునెదిరించి యుద్ధముసేసిరి. హరిహరుల పోరాటము మిక్కిలి దారుణమయ్యెను. శస్త్రాస్త్రములచే లోకములు సంక్షోభించెను. ఇది సర్వజగత్ప్రళయము వచ్చినదని వేల్పులు తలచిరి. గోవిందుడు జృంభణాస్త్రముచే శంకరుని జృంభింప జేసెను. అంతట దైత్యులు ప్రమథులును నశించిరి. జృంభణమువలన నోటువడి హరుడు రథమధ్యమందొరగెను. కృష్ణునితో బోరలేడయ్యెనుకుమారస్వామి గరుడునిచే బొడువబడినబాహువులతో ప్రద్యుమ్నుని యస్త్రములదెబ్బతిని కృష్ణుని హుంకారములచే శక్త్యాయుదము చెదర రణభూమినుండి తొలగిపోయెను. హరిచే శంకరుడూదరగొన నసురసైన్యము నాశముగన గుహుడోటువడ ప్రమథసేన క్షయమొంద నందీశుడశ్వములం బూన్చిన రథమెక్కి బాణుడు కృష్ణునితో కృష్ణునితో బలముతో బోరవచ్చెను.

మహావీరుడు బలభద్రుడు బాణునిసైన్యము ననేకవిధముల జెండాడెను. ప్రద్యుమ్నుడు రణధర్మము ననుసరించి పారిపోక (వెనుదివక) పోరెను. బలరాముడు నాగలికొనచే బట్టిలాగి రోకలిను చక్రిబాణములచే నుగ్గాసేయుటను బాణుడు నూచెను. అవ్వల కృష్ణుడును బాణుడును దలపడిరి. ఒండొరులు మెఱుగులుగ్రమ్ము కవచములను ఖండించుకొనిరి. ఒండొరుల బాణములను ఒండొరులను గొట్టుకొనిరి. తుదకుహరి బాణుని సంహరింపవలెనిన దృఢనిశ్చయము సేసికొనెను అంతట నూరుగురు నూర్యులట్లు వెలుగుచక్రమును సుదర్శనాఖ్యమును దైత్యచక్రవైరి హరిచేబట్టెను. మధువైరి ఈ సారిబాణుడు నశించితీరవలెనని చక్రాయుదమును వదలినంతట రాక్షసుల మాయామంత్రశక్తి కోటరియనునది దిగంబరి యయ్యెను. అనగా వెల్లడియయ్యెను.

ఆశక్తింగని కనులుమూసికొని బాణుని బాహువనమును ఖండించుటకు సుదర్శనమును విసరెను. ఆ చక్రాయుధము బాణుని బాహువనమును నరకెను. హరి యామీద బాణునిగూడ సంహరింపనెంచినంతట త్రిపురవైరి (శివుడు) బాణుడు చేతులు తెగి రక్తము వర్షించుచుండ గని తటాలునవచ్చి హరితో సామపూర్వముగ నిట్లనియె.

బలభద్రో మహావీర్యో బాణసైన్య మనేకథా | వివ్యాధ బాణౖః ప్రద్యుమ్నో ధర్మత శ్చాపలాయితః || 29

ఆకృష్య లాంగలాగ్రేణ ముసలేన చ పోథితమ్‌ | బలం బలేన దదృశే బాణో బాణౖశ్చ చక్రిణః || 30

తతః కృష్ణస్య బాణన యుద్ధ మాసీ త్సమాసతః | పరస్పరం తు సందీప్తా న్కాయత్రాణవిభేదినః || 31

కృష్ణ శ్చిచ్ఛేద బాణాం స్తాన్బాణన ప్రహితాన్‌ శ##రైః | బిభేద కేశవం బాణో బాణం వివ్యాధ చక్రధృక్‌ || 32

ముముచాతే తథా7స్త్రాణి బాణకృష్ణౌ జిగీషయా | పరస్పర క్షతి పరౌ పరిఘాంశ్చ తతో ద్విజాః || 33

చిద్యమానేష్యశేపేషు శ##స్త్రే ష్వస్త్రే చ సీదతి | ప్రాచుర్యేణ హరి ర్బాణం హంతుం చక్రే తతో మనః || 34

తతో7ర్కశత సంభూత తేజసా సదృశద్యుతి | జగ్రాహ దైత్యచక్రారి ర్హరిశ్చక్రం సుదర్మనమ్‌ || 35

ముంచతో బాణనాశాయ తచ్చక్రం మధువిద్విషః | నగ్నా దై తేయ విద్యా7భూ త్కోటరీ పురతో హరేః || 36

తామగ్రతో హరి ర్దృష్ట్వా మీలితాక్షః సుదర్శనమ్‌ | ముమోచ బాణముద్దిశ్య ఛేత్తుం బాహువనం రిపోః || 37

క్రమేణాస్య తు బాహూనాం బాణ స్యాచ్యుత చోదితమ్‌ | ఛేదం చక్రే7సురస్యాశు శస్త్రాస్త్ర క్షేపణా ద్ద్రుతమ్‌ ||

ఛన్నే బాహువసే తత్తు కరస్థం మధుసూదనః | ముముక్షు ర్బాణనాశాయ విజ్ఞాత స్త్రిపురద్విషా || 39

స ఉత్పత్యా77హ గోవిందం సామపూర్వ ముమాపతిః | విలోక్య బాణం దోర్దండ ద్ఛేదాసృక్ర్సాప వర్షిణమ్‌ || 40

రుద్ర ఉవాచ

కృష్ణ కృష్ణ జగన్నాథ జానేత్వాం పురుషోత్తమమ్‌ | పరేశం పరమాత్మాన మనాదివిధనం పరమ్‌ || 41

దేవతిర్యబ్మనుష్యేషు శరీరగ్రహణాత్మికా | లీలేయం తవ చేష్టా హి దైత్యానాం వధలక్షణా || 42

తత్ర్పసీదాభయం దత్తం బాణస్యాస్య మయా ప్రభో | తత్త్వయా నానృతం కార్యం యన్మయా వ్యాహృతం వచః ||

అస్మ త్సంశ్రయ వృద్ధో7యం నాపరాధస్త వావ్యయ | మయా దత్తవరో దైత్య స్తతస్త్వాం క్షమయామ్యహమ్‌ || 44

వ్యాస ఉవాచ

ఇత్యుక్తః ప్రాహ గోవిందః శూలపాణి ముమాపతిమ్‌ | వ్రసన్నవదనో భూత్వా గతామర్షో7సురం ప్రతి || 45

కృష్ణా! కృష్ణా! జగన్నాథ! నీవుపురుషోత్తముడవుపరాత్పరుడవు ఆద్యంతములులేనివాడవునని యెఱుంగుదును. దేవమనుష్య పశుపక్ష్యాదులందు శరీరమును గ్రహించుట దైత్యసంహారము సేయుటయను క్షణముగల యీచేష్టనీలీల. కావున ప్రసన్నుడవగుము. ఈబాణునకేనభయ మిచ్చియున్నాను. నాపల్కిన పలుకునీవబద్ధము సేయదగడు. నాయాశ్ర యమదముచే బెరిగినవాడువీడు. నీయపరాధమిందులేదు. ఈదైత్యుని కేను వరములిచ్చితిని. కావున నిన్ను నేను సైరణ గొనుమనికోరుచున్నాను. అన గోవిందు డ మాధవుని శూలపాణింగూర్చి ప్రసన్నముఖుడై బాణునియెడ గసివిడచి యిట్లనియె.

శ్రీభగవానువాచ

యుష్మద్దత్తవరో బాణో జీవతా దేష శంకర | త్వ ద్వాక్యగౌరవా దేత న్మయా చక్రం నివర్తితమ్‌ || 46

త్వయా య దభయం దత్తం తద్దత్త మభయం మయా | మత్తో7విభిన్నమాత్మానం ద్రష్టుమర్హసి శంకర || 47

యో7హం సత్వం జగచ్చేదం సదేవాసురమానుషమ్‌ | అవిద్యామోహితాత్మానః పురుషా భిన్నదర్శినః || 48

వ్యాస ఉవాచ

ఇత్యుక్త్వా ప్రయ¸° కృష్ణః ప్రద్యుమ్ని ర్యత్ర తిష్ఠతి | తద్బంథపణినో నేశు ర్గరుడావిలశోషితాః || 49

తతో7నిరుద్ధ మారోప్య సపత్నీకం గరుత్మతి | అజగ్ము ర్ద్వారకాం రామకార్షిణదామోదరాః పురీమ్‌ || 50

ఇతి శ్రీమహాపురాణఆదిబ్రాహ్మేబాణయుద్ధేషడధికద్విశతతమో7ధ్యాయః

శంకర! నీచేవరములీబడిన వాడుగావున నీభాణుడు బ్రతుకుంగాక! నీమాటపైగల గౌరవముచేనిదిగో చక్రమును మఱలించితిని. నీవభయమిచ్ఛుట నేనిచ్చుటయే. నాకంటె నీవువేఱుగావని చూడదగను. నేనెవ్వడనో యతడునీవే. సదేవా సురమానుషమైన యీజగత్తు గూడమనమే. అవిద్యామోహితులైనవారు భేదదృష్టినందుదురు. అని కృష్ణుడుపలుక ప్రద్యుమ్నుని జుట్టుకొనియున్నపాములు చచ్చువడిపోయినవి. అంతట పత్నితోగూడిన యనిరుద్దుని గరుడునిపై కెక్కించికొని బలరామకృష్ణ కృష్ణసంబంధిపరివారములు ద్వారకాపురికి వచ్చిరి.

ఇది బ్రహ్మపురాణమందు కృష్ణచరితమున బాణాసుర యుద్ధము అను రెండువందలాఱవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters