Brahmapuranamu    Chapters   

ఏకోనత్రింశో7ధ్యాయ

సూర్యపూజాప్రకరణమ్‌

మునయః ఊచుః

శ్లో|| శ్రుతో7స్మాభిః సురశ్రేష్ఠ భవతా య దుదాహృతమ్‌|భాస్కరస్య పరం క్షేత్రం భుక్తి ముక్తి ఫలప్రదమ్‌ || 1

న తృప్తి మధిగచ్ఛామః శ్రుణ్వంతః సుఖదాం కథామ్‌ | తవ వక్త్రోద్భవాం పుణ్యా మాదిత్య స్యాఘనాశినీమ్‌ || 2

అతః పరం సురశ్రేష్ఠ! బ్రూహినో వదతాం వర | దేవ పూజాఫలం యచ్చ యచ్చ దానఫలం ప్రభో || 3

ప్రణిపాతే నమస్కారే తథా చైవ ప్రదక్షిణ | ధూపదీపప్రదానేచ సమ్మార్జన విధౌచయత్‌ || 4

ఉపవాసే చ యత్‌ పుణ్యమ్‌ యత్‌పుణ్యం నక్తభోజనే | అర్ఘ్యంచ కీదృశం ప్రోక్తం కుత్రవాసంప్రదీయతే || 5

కథంచ క్రియతే భక్తిః కథం దేవః ప్రసీదతి | ఏతత్‌ సర్వం సురశ్రేష్ఠ శ్రోతు మిచ్ఛామహే వయమ్‌ || 6

మీ చెప్పిన భాస్కర క్షేత్రమహిమ వింటిమి. కాని మాకు తృప్తి కలుగలేదు. కావున పూజా విధానము దానము నమస్కారము- ప్రదక్షిణము ధూప దీపాది సమర్పణ ముపవాసము, సూర్యాలయమార్జనము-మొదలగు వాని విశేషములను వినగోరెదము. సూర్యప్రీతికరములైన పూవులను, నమస్కారవిశేషములను, సూర్యార్ఘ్యవిధానము, సూర్యునుద్దేశించి చేయు నుపవాసము, నక్తము (పగలుపవాసముండి రాత్రి భోజనముచేయుట) మొదలగువాని ఫలము, దేశకాల విశేషములను వినవలెనని కుతూహలపడుచున్నాము. అని మునులడుగ బ్రహ్మయిట్లనియె.

బ్రహ్మోవాచ

శ్లో|| అర్ఘ్యం పూజాదికం సర్వం భాస్కరస్య ద్విజోత్తమాః|భక్తిం శ్రద్ధాం సమాధించ కథ్యమానం నిబోధత || 7

మనసా భావనా భక్తి రిష్టా శ్రద్ధాచ కీర్త్యతే | ధ్యానం సమాధి రిత్యుక్తం శ్రణుధ్వం సుసమాహితాః || 8

తత్కధం శ్రావయే ద్యస్తు తద్భక్తాన్‌ పూజయీతవా | అగ్ని శుశ్రూషకశ్చైవ సవైభక్తః సనాతనః || 9

తచ్చిత్త స్తన్మనాశ్చైవ దేవపూజారతః సదా | తత్కర్మకృ ద్భవే ద్యస్తు సవైభక్తః సనాతనః || 10

దేవార్థే క్రియమాణాని యః కర్మా ణ్యనుమన్యతే | కీర్తనాద్వా పరో విప్రాః సవై భక్తతరో నరః || 11

నాభ్యసూయేత తద్భక్తాన్‌ న నింద్యా చ్చాన్యదేవతామ్‌ | ఆదిత్యవ్రతధారీచ సవై భక్తతరో నరః || 12

గచ్ఛం స్తిష్ఠన్‌ స్వపన్‌ జిఘ్ర న్నున్మిషన్ని మిషన్నపి|యః స్మరే ద్భాస్కరం నిత్యం సవై భక్తతరో నరః || 13

ఏవం విధా త్వియం భక్తిః సదా కార్యా విజానతా | భక్త్యా సమాధినా చైవ స్తవేన మనసా తథా || 14

క్రియతే నియమో యస్తు దానం విప్రాయ దీయతే | వ్రతిగృహ్ణంతి తం దేవా మనుష్యాః పితర స్తథా|| 15

పత్రం పుష్పం ఫలం తోయం యద్భక్త్యా సముపాహృతమ్‌ | ప్రతిగృహ్ణంతి తద్దేవా నాస్తికాన్‌ వర్జయంతి చ || 16

బావశుద్ధిః ప్రయోక్తవ్యా నియమాచార సంయుతా | భావశుద్ధ్యా కృతం య ద్యత్తత్సర్వం సఫలం భ##వేత్‌ || 17

స్తుతిజప్యోపహారేణ పూజయాపి వివస్వతః | ఉపవాసేన భక్త్యా వై సర్వపాపైః ప్రముచ్యతే || 18

ప్రణిధాయ శిరో భూమ్యాం నమస్కారం కరోతి యః|తత్‌క్షణాత్‌ సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః || 19

భక్తియుక్తో నరో యో7సౌ రవేః కుర్యా త్ప్రదక్షిణమ్‌ | ప్రదక్షిణీ వృతా తేన సప్త ద్వీపా వసుంధరా || 20

సూర్యం మనసి యః కృత్వా కుర్యా ద్వ్యోమ ప్రదక్షిణం|ప్రదక్షీణీకృతాస్తేన సర్వే దేవా భవంతి హి || 21

ఏకాహారో నరో భూత్వా షష్ఠ్యాం యో7ర్చయతే రవిమ్‌ | నియమవ్రతచారీచ భ##వే ద్భక్తిసమన్వితః || 22

సప్తమ్యాం వా మహాభాగాః సో7శ్వమేధఫలం లభేత్‌ | అహోరాత్రోపవాసేన పూజయే ద్యస్తు భాస్కరమ్‌ || 23

సప్తమ్యా మధవా షష్ట్యాం సయాతి పరమాం గతిమ్‌ | కృష్ణపక్షస్య సప్తమ్యాం సోపవాసో జితేంద్రియః || 24

సర్వరత్నోపహారేణ పూజయే ద్యస్తు భాస్కరమ్‌ | పద్మప్రభేణ యానేన సూర్యలోకంస గచ్ఛతి || 25

శుక్లపక్షస్య సప్తమ్యా ముపవాసపరో సరః | సర్వశుక్లోపహారేణ పూజయే ద్యస్తు భాస్కరమ్‌ || 26

సర్వపాపవినిర్ముక్తః సూర్యలోకం స గచ్ఛతి | అర్కసంపుటసంయుక్త ముదకం ప్రసృతం పిబేత్‌ || 27

క్రమవృద్ధ్యాచతుర్వింశ మేకైకం క్షపయే త్పునః | ద్వాభ్యాం సంవత్సరాభ్యాంతు సమాప్తనియమో భ##వేత్‌ || 28

పర్వకామప్రదా హ్యేషా ప్రశస్తా హ్యర్కసప్తమీ | శుక్లపక్షస్య సప్తమ్యాం యదాదిత్య దినం భ##వేత్‌ || 29

సప్తమీ విజయా నామ త్రత దత్తం మహత్‌ ఫలం | స్నానం దానం తపో హోమ ఉపవాసస్తథైవచ || 30

సర్వ విజయ సప్తమ్యాం మహాపాతకనాశనమ్‌ |

మనస్సుచేతజేయుభావన భక్తి శ్రద్ధ ధ్యానము సమాధియనుపేర్ల పిలువబడును. భక్తి సమాధి స్తుతి యనువానిచే పత్రపుష్పఫలముతోయము లేకొంచె మొసంగిన నది భగవంతుడు స్వీకరించి ప్రీతి చెందును. రవికి భక్తితో చేసిన ప్రదక్షిణ మఖిలభూప్రదక్షిణమే. సర్వదేవతాప్రదక్షిణమే. షష్టితిధియందు ఏకభుక్తముచేసి గాని సప్తమి నాడు భానునర్చించిన నది యశ్వమేధఫలమిచ్చును. కృష్ణపక్షసప్తమీతిధియందు. భాస్కరుని పూజించిన పద్మప్రభ##మైన విమానములో నెక్కి సూర్యలోక మేగును. శుక్లపక్షసప్తమినాడు ఉపవసించి తెల్లని పూజాద్రవ్యముల నబ్జబాంధవుని పూజించిన సరియే ఫలము. అర్కసంపుటముతో (రాగిఅరివాణముతో) గూడిన తీర్థము నేకోత్తర వృద్ధిగా నిరువది నాలుగు రోజులు పానముచేసి క్రమముగా తగ్గించుకొనివచ్చుచు సేవించుచు నిట్లు రెండేడ్లకు వ్రతసమాప్తి చేసినచో నయ్యర్కసప్తమీ వ్రత మశేష కామప్రదము. శుక్లపక్షసప్తమి భానువారము కలిసివచ్చెనేని యది విజయసప్తమి యనబడును. అందు స్నాన దానములనంతఫలదములగును.

యే చాదిత్య దినే ప్రాప్తే శ్రాద్ధం కుర్వంతి మానవాః || 31

యజంతిచ మహాశ్వేతం లభంతే తే యుథేప్సితమ్‌|యేషాం ధర్మ్యాఃక్రియాః సర్వా స్సదైవోద్దిశ్య భాస్కరమ్‌ || 32

న కులే జాయతే తేషాం దరిద్రో వ్యాధితోపి వా | శ్వేతయా రక్తయా వాపి పీతమృత్తికయాపివా|| 33

ఉపలేపనకర్తా తు చింతితం లభ##తే ఫలమ్‌ | చిత్రభానుం విచిత్రైస్తు కుసుమై ర్య స్పుగంధిభిః|| 34

పూజయేత్‌ సోపవాసోయ స్పకామా నీప్సితాన్‌ లభేత్‌ | ఘృతేన దీపం ప్రజ్వాల్య తిలతై లేన వా పునః 35

ఆదిత్యం పూజయేద్యస్తు చక్షుషా న స హీయతే | దీపదాతా నరో నిత్యం జ్ఞానదీపేన దీప్యతే || 36

తిలాః పవిత్రాః తైలం వా తిలగోదాన ముత్తమమ్‌| అగ్నికార్యేచ దీపేచ మహాపాతకనాశనమ్‌ || 37

దీపం దదాతి యో నిత్యం దేవతాయతనేషు చ | చతుష్పథేషు రథ్యాసు రూపవాన్‌ సుభగో భ##వేత్‌ || 38

హవిర్భిః ప్రథమః కల్పో ద్వితీయ శ్చోషథీరసైః | వసామేదోస్థి నిర్యాసై ర్నతు దేయః కథంచన || 39

భ##వే దూర్థ్వగతి ర్దీపో న కదాచి దథోగతిః | దాతా దీప్యతి చాప్యేవం న తిర్యగ్గతి మాప్నుయాత్‌ || 40

జ్వలమానం సదాదీపం నహరే న్నాపి నాశ##యేత్‌ | దీపహర్తా నరో బంధం నాశం క్రోధం తమో వ్రజేత్‌ || 41

దీపదాతా స్వర్గలోకే దీపమాలేవ రాజతే | యః సమాలభ##తే నిత్యం కుంకుమాగురుచందనైః || 42

సంపద్యతే నరః ప్రేత్య ధనేన యశసా శ్రియా | రక్తచందనసంమ్మిశ్రైః రక్తపుషై#్పః శుచిర్నరః 43

ఆదివారము శ్రాద్ధముపెట్టినను మహాశ్వేతము (తెల్ల జిల్లేడు) తో హోమమొనర్చినను నఖీష్టసిద్ధి గల్గును. వారి వంశమున దరిద్రుడుగాని రోగిగాని పుట్టడు. తెల్లని యెఱ్ఱని పసుపుపచ్చని మృత్తికతో పూజికొన్నవాని కోర్కెలు నెరవేరును. రంగురంగుల పూలతో చిత్రభానునర్చించి యుపవాసముండిన నభీష్టము వడయును. ఆవునెయ్యితోగాని నువ్వులనూనెతోగాని దీపముపెట్టి ఆదిత్యుని పూజించినవానికి నేత్రవ్యాధులుండవు. దీపదాతకుజ్ఞానదీపము లభించును. తిలలు పవిత్రములు కావున తైలగోదానము పుణ్యప్రదము. నలుదారులు కలిసినచో (చతుష్పథములందు) రాజమార్గములందు నట్టి దీనదానముచేసిన నరు డందగాడు (సుభగుడు) భాగ్యవంతుడు నగును. దీపము హవిర్ద్రవ్యములు (ఆవునెయ్యి) మొదలైన వానిచే బెట్టుట ప్రథమ కల్పము. ఓషధీరసములచేతబెట్టుట రెండవ కల్పము. వసా మేదోస్థి సంబంధమైన (క్రొవ్వు పదార్థములు) దీపము నిషిద్ధము. దీపమెపుడు నూర్ధ్వముగా బ్రసరించును. కావున దీపదాత యెపుడు నూర్ధ్వగతినేగాని యథోగతి నందడు. వెలుగుచున్నదీపమును దగ్గింపరాదు. ఆర్పివేయరాదు. అట్లుచేసినవాడు బంధము నాశనము కోపము తమోగుణమును బొందును. దీపదాత స్వర్గమందు దీపమాలవలె వెలుగును. కుంకుమాగరుచందనములచే రక్తచందన రక్తపుష్పములచే నాదిత్యు నర్పించినయత డుదయ మందర్ఘ్యమిచ్చినతడు సంవత్సరములో నిష్టసిద్ధిగాంచును.

ఉదయే7ర్ఘ్యం సదా దత్వా సిద్ధిం సంవత్సరా ల్లభేత్‌ | ఉదయాత్‌ పరివర్తేత యావదస్తమనే స్థితః || 44

జప న్నభిముఖః కించి స్మంత్రం స్తోత్ర మథాపివా |ఆదిత్యవ్రత మేతత్తు మహాపాతకనాశనమ్‌ || 45

అర్ఘ్యేన సహితంచైవ సర్వం సాంగం ప్రదాపయేత్‌ | ఉదయే శ్రద్ధయా యుక్తః సర్వపాపైః ప్రముచ్యతే|| 46

సువర్ణధేన్వనడుహ వసుధా వస్త్రసంయుతమ్‌ | అర్ఘ్యప్రదాతా లభ##తే సప్తజన్మానుగం ఫలమ్‌ || 47

అగ్నౌ తోయే న్తరిక్షేచ శుచౌ భూమ్యాం త థైవచ|ప్రతిమాయాం తథాపిండ్యాందేయమర్ఘ్యం ప్రయత్నతః || 48

నాపసవ్యం నసవ్యంచ దద్యా దభిముఖః సదా | సఘృతం గుగ్గులం వాపి రవే ర్భక్తిసమన్వితః | 49

తత్‌క్షణాత్‌ సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః | శ్రీవాసం చతురస్రంచ దేవదారుం తథైవచ || 50

కర్పూరాగరుధూపాని దత్వా వై స్వర్గగామినః | ఆయనే తూత్తరే సూర్య మథవా దక్షిణాయనే || 51

పూజయిత్వా విశేషేణ సర్వపాపైః ప్రముచ్యతే | విషువే షూపరాగేషు షడశీతిముఖేషు చ|| 52

పూజయిత్వా విశేషేణ సర్వపాపైః ప్రముచ్యతే | ఏవం వేలాసు సర్వాసు సర్వకాలంచ మానవః|| 53

భక్త్యా పూజయతే యో7ర్కం సో7ర్కలోకే మహీయతే|కృసరైః పాసరైః పూపైః ఫలమూలఘృతౌదనైః|| 54

బలిం కృత్వా తు సూర్యాయ సర్వాన్‌ కామా నవాప్నుయాత్‌ | ఘృతేన తర్పణం కృత్వా సర్వసిద్ధో భ##వేన్నరః || 55

క్షీరేణ తర్పణం కృత్వా మనస్తాపై ర్న యుజ్యతే | దధ్నాతు తర్పణం కృత్వా కార్యసిద్ధిం లభే న్నరః|| 56

స్నానార్థ మహరేద్యస్తు జలం భానోః సమాహితః | తీర్థేషు శుచితాపన్నః నయాతి పరమాం గతిమ్‌ || 57

ఛత్రం ధ్వజం వితానం వా పతాకాం చామరాణి చ | శ్రద్ధయా బానవే దత్వా గతి మిష్టా మవాప్నుయాత్‌ || 58

యద్యద్ద్రవ్యం నరో భక్త్యా ఆదిత్యాయ ప్రయచ్ఛతి | తత్తస్య శతసాహస్ర ముత్పాదయతి భాస్కరః | 59

మానసం వాచికం వాపి కాయజం యచ్చ దుష్కృతమ్‌ | సర్వం సూర్యప్రసాదేవ తదశేషం వ్యపోహతి|| 60

ఏకాహేనాపి యద్భానోః పూజయాః ప్రాప్యతే ఫలమ్‌ | యథోక్తదక్షిణౖ ర్విపై#్రర్న తత్‌క్రతుశ##తైరపి|| 61

ఇతి శ్రీ బ్రాహ్మే మహాపురాణ సూర్యపూజాకల్పోనామైకోన త్రింశో7ధ్యాయః.

సూర్యుడుదయించి అస్తమించుదాకానిలబడి సూర్యాభిముఖుడై యేదేనిమంత్రము జపించినవాడు సూర్యస్తోత్ర మేదేని చేసినవాడుసర్వపాపములంబాయును. దీనిని ఆదిత్యవ్రతమందురు. సువర్ణగోవృషభవస్త్రదానములతోసూర్యార్ఘ్యమునిచ్చిన పుణ్యుడా ఫలమేడుజన్మలదాకా యనుభవించును. అగ్ని నీరు యంతరిక్షము పవిత్రభూమి ప్రతిమపిండితోచేసినసూర్యమూర్తి అనువానియందర్ఘ్య మీయనగును. సవ్యముగా గాని యపసవ్యముగ (కుడి ఎడమ ప్రక్కల) నర్ఘ్యమీయరాదు. అభిముఖముగా మాత్రమే సూర్యార్ఘ్యమీయ వలెను. రవికి గుగ్గులుక్రర మారేడు దేవదారువులతో చేసిన నలుపలకల యాసనము కర్పూరాగరుధూపము లొసగినవారు స్వర్గమందుదురు. విషువములందు (రాత్రిపగలుసమముగానున్న పర్వములందు) బ్రభాకరునర్చించిన సర్వ దురితములు దొలంగును. కృసరము (పులగము) పాయసము - అపూపములు పండ్లు - దుంపలు- నెయ్యి యను వానిచే సూర్యబలి యిచ్చిన సర్వ కామసమృద్ధినందును. ఆవునేతితో తర్పణముచేసిన సర్వసిద్ధినందును. ఆవుపాలతోతర్పణము మనస్తాప హరణము, ఆవుపెరుగుతో చేసిన కార్యసిద్ధి. పవిత్రతీర్థజలములచే మార్తాండునకు స్నానము నిర్వర్తించినచో పరమగతి వడయును. ఛత్రముధ్వజము వితానము చాందినీ)పతాకచామరములు భానునకు సమర్పించిననభీష్టగతిలభించును. ఏద్రవ్య మర్కునకు భక్తితో సమర్పించునో ఆ ద్రవ్య మనంతముగా లభించును. త్రికరణకృతదురితజాలమెల్ల జలజబంధువు వారింపగలడు. యథోక్తదక్షిణముగా చేసిన క్రతుశతమునువలని ఫలము ఒక్కనాడు సూర్యుని భక్తితో నారాధించినను లభింపగలదు.

ఇది శ్రీ బ్రహ్మపురాణమందు సూర్యపూజాకల్పమను ఇరువదితొమ్మిదవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters