Brahmapuranamu    Chapters   

ఏక చతుర్వింశో7ధ్యాయః

ఏకామ్రక్షేత్ర మాహాత్మ్యమ్‌

లోమహర్షణ ఉవాచ

శ్రుత్వైవం వై మునిశ్రేష్ఠాః కథాం పాపప్రణాశినీం | రుద్రకోపోద్భవాం పుణ్యాం వ్యాసస్య వదతో ద్విజాః || 1

పార్వత్యాశ్చ తధా రోషం క్రోధం శంభోశ్చ దుస్సహం | ఉత్పత్తిం వీరభద్రస్య భద్రకాల్యాశ్చ సంభవమ్‌ || 2

దక్షయజ్ఞ వినాశం చ వీర్యం శంభో స్తథా7ద్బుతం| పునః ప్రసాదం దేవస్య దక్షస్య సుమహాత్మనః || 3

యజ్ఞ భాగం చ రుద్రస్య దక్షస్య చ ఫలం క్రతోః | దృష్ట్వా బభూవు స్సం ప్రీతా విస్మితాశ్చ పునః పునః || 4

పప్రచ్చుశ్చ పున ర్వ్యాసం కధాశేషం తధా ద్విజాః | పృష్టః ప్రోవాచ తా న్వ్యసః క్షేత్ర మేకామ్రకం పునః || 5

లోమహార్షణుం డిట్లనియె. మునివరులార! వ్యాసులు తెలుపుచుండ రుద్రుడు కోపించిన మీదట జరిగిన పుణ్యకథను పార్వతి రోషము శంభుని క్రోధము వీరభద్రుని యెక్కయు, భద్రకాలి యొక్క అవతారము దక్షయజ్ఞ ధ్వంసము శంకరుని ఆద్భుత విక్రమము తిరిగి యాయన మహాత్ముడగు దక్షునికి ప్రసన్నడగుట రుద్రునకు యజ్ఞ భాగమిచ్చుట దక్షునికి క్రతుఫలము లభించుట చూచి సంప్రీతులు విస్మితులునై ఋషులు వ్యాసుని తక్కినక థను దెలుపుమని యడిగిరి. వ్యాసభగవానుడు ఏకామ్రక్షేత్రమునుగురించివారడుగ నిట్లు తెలుపదొడంగెను.

వ్యాస ఉవాచ

బ్రహ్మప్రోక్తాం కథాం పుణ్యాం శ్రుత్వా తు ఋషిపుంగవాః |

ప్రశశంసు స్తదా హృష్టా రోమాంచితతనూరుహాః || 6

ఋషయః ఊచుః

అహో దేవస్య మాహాత్మ్యం త్వయా శంభోః ప్రకీర్తితమ్‌|దక్షస్య చ సుర శ్రేష్ఠ యజ్ఞ విధ్వంసనం తధా || 7

ఏకామ్రకం క్షేత్రవరం వక్తు మర్హసి సాంప్రతమ్‌|శ్రోతు మిచ్చామహే బ్రహ్మ న్సరం కౌతూహలం హినః || 8

వ్యాస ఉవాచ

తేషాం తద్వచనం శ్రుత్వా లోకనాథ శ్చతుర్ముఖః|ప్రోవాచ శంభోస్తతేత్రంభూత లేదుష్కృతచ్చిదమ్‌ || 9

వ్యాసుడు పలికెను

బ్రహ్మ తెలిపిన పుణ్యకథనాలించి మునిపుంగవులు యొడలుపులకరింప ఆనందభరితులై వ్యాసులను కథను గొనియాడిరి.

ఋషులు పలికిరి

ఆహా ! శంభుదేవుని మహిమ నీవు చక్కడ దెల్పితివి. ఇపుడేకామ్రక్షేత్రమునుగురించి తెలుపుము. వినవలెనని మిక్కిలి కుతూహలముతో నున్నామనిరి, వ్యాసుడు వారి వచనమువిని లోకేశ్వరుడు చతుర్ముఖుడు భూతలమున పాపహరమగు నాశివక్షేత్రముం గూర్చి మునులకిట్లు తెలిపెను.

బ్రహ్మోవాచ

శృణుధ్వం మునిశార్దూలాః ! ప్రవక్ష్యామి సమాసతః | సర్వపాపహరం పుణ్యం క్షేత్రం పరమదుర్లభమ్‌ || 10

లింగకోటిసమాయుక్తం వారాణసి సమం శుభమ్‌|ఏకామ్ర మితి విఖ్యాతం తీర్దాష్టకసమన్వితమ్‌ || 11

ఏకామ్రవృక్ష స్తత్రా77సీ త్పురా కల్పే ద్విజోత్తమాః|నామ్నా తసై#్యవ తత్‌క్షేత్రం మేకామ్రక మితి శ్రుతమ్‌ || 12

హృష్టపుష్టజనాకీర్ణం నరనారీసమన్వితమ్‌|విద్వాంస గణభూయిష్ఠం ధనధాన్యాదిసంయుతమ్‌ || 13

గృహగోపురసంబాధం త్రికచాద్వారభూషితమ్‌|నానావణిక్సమాకీర్ణం నానారత్నోపశోభితమ్‌ | 14

పురాట్టాలకసంయుక్తం రథిభిః సమలంకృతం|రాజహాంసనిభైః శుభ్రైః ప్రాసాదై రుపశోభితమ్‌ || 15

మార్గగద్వార సంయుక్తం సితప్రాకారశోభితమ్‌|రక్షితం శస్త్రసంఘైశ్చ పరిఖాభి రలంకృతమ్‌ || 16

సిత రక్తై స్తథా పీతైః కృష్ణశ్యామైశ్చ వర్ణకైః|సమీరణోద్దతాభిశ్చ పతాకాభి రలంకృతమ్‌ || 17

నిత్యోత్సవ ప్రముదితం నానావాదిత్రనిస్యనైః|వీణావేణు మృదంగైశ్చక్షేపణీభి రలంకృతమ్‌ || 18

దేవతాయతనై ర్దివ్యైః ప్రాకారోద్యానమండితైః |

పూజా విచిత్రరచితైః సర్వత్రసమలంకృతమ్‌ || 19

స్త్రియః వ్రముదితాస్తత్ర దృశ్యంతే తనుమధ్యమాః |

హారై రలంకృత గ్రీవాః పద్మపత్రాయతేక్షణాః || 20

పీనోన్నతకుచాః శ్యామాః పూర్ణచంద్రనిభాననాః |

స్థిరాలకా స్సుకపోలాః కాంచీనూపురనాదితాః || 21

సుకేశ్య శ్చారుజఘానాః కర్ణాంతాయతలోచనాః |

సర్వలక్షణసంపన్నాః సర్వాభరణభూషితాః || 22

దివ్యవస్త్రధరాః శుభ్రాః కాశ్చి త్కాంచనసన్నిభాః |

హంసవారణగామిన్యః కుచభారావనామితాః || 23

దివ్యగంధానులిప్తాంగాః కర్ణాభరణభూషితాః |

మదాలసాశ్చ సుశ్రోణ్యో నిత్యం ప్రహసితాననాః || 24

ఈషద్విస్పష్టదశనా బింబోష్ఠా మధురస్వరాః |

తాంబూలరంజితముఖా విదగ్ధాః ప్రియదర్శనాః || 25

సుభగాః ప్రియవాదిన్యో నిత్యం ¸°వనగిర్వితాః |

దివ్యవస్త్రధరాః సర్వాః సదా చారిత్రమండితాః || 26

క్రీడంతి తా స్సదా తత్ర స్త్రియ శ్చాప్సరసోపమాః |

స్వే స్వే గృహే ప్రముదితా దివా రాత్రౌ వరాననాః || 27

పురుషా స్తత్ర దృశ్యంతే రూప¸°వనగర్వితాః |

సర్వలక్షణసంపన్నాః సుమృష్టమణికుండలాః || 28

బాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శూద్రాశ్చ మునిసత్తమాః |

స్వధర్మ విరతా స్తత్ర నివసంతి సుధార్మికాః || 29

అన్యాశ్చ తత్ర తిష్ఠంతి వారముఖ్యాః సులోచనాః |

ఘృతాచీ మేనకా తుల్యా స్తథా సమ తిలోత్తమాః || 30

ఊర్వశీ సదృశాశ్చైవ విప్రచిత్తినిభాస్తథా |

విశ్వాచీ సహజన్యభాః ప్రవ్లూెచాసదృశాస్తథా || 31

సర్వా స్తాః ప్రియవాదిన్యః సర్వా విహసితాననాః |

కళాకౌశలసంయుక్తాః సర్వా స్తా గుణసంయుతాః || 32

ఏవం పణ్యస్త్రియ స్తత్ర నృత్యగీత విశారదాః |

నివసంతి మునిశ్రేష్ఠా ! స్సర్వ స్త్రీగుణగర్వితాః || 33

ప్రేక్షణాలాపకుశలా స్సుందర్యః ప్రియదర్శనాః |

న రూపహీనా దుర్వృత్తాన పరద్రోహకారికాః || 34

యాసాం కటాక్షపాతేన మోహం గచ్ఛంతి మానవాః |

న తత్ర నిర్ధనా స్సంతి న మూర్ఖాన పరద్విషః || 35

న రోగిణో న మలినా న కదర్యా న మాయినః |

న రూపహీనా దుర్వృత్తా న పరద్రోహకారిణః || 36

తిష్ఠంతి మానవా స్తత్ర క్షేత్రే జగతి విశ్రుతే |

సర్వత్ర సుఖసంచారం సర్వసత్త్వ సుఖావహమ్‌ || 37

నానాజనసమాకీర్ణం సర్వసస్యసమన్వితమ్‌ |

కర్ణికారైశ్చ పనసై శ్చంపకై ర్నాగకేసరైః || 38

పాటలాశోకవకులైః కపిత్థై ర్బహులై ర్ధవైః |

చూతనింబకదంబైశ్చ తథా7న్యైః పుష్పజాతిభిః || 39

నీపకై ర్ధవ ఖదిరై ర్లతాభి శ్చ విరాజితమ్‌ |

శాలై స్థాలై స్తమాలైశ్చ నారికేళైః శుభాంజనైః || 40

అర్జునై స్సమపర్ణైశ్చ కోవిదారైః సపిప్పలైః |

లకుచైః సరళై ర్లోధ్రైర్హింతాలై ర్దేవదారుభిః || 41

పలాశై ర్ముచుకుందై శ్చపారిజాతైః సకుబ్జకైః |

కదళీవనఖండైశ్చ జంబూపూగఫలై స్తథా || 42

కేతకీకరవీరైశ్చ అతిముక్తై శ్చ కింశుకైః |

మందారకుందపుషై#్ప శ్చ తథా7న్యైః పుష్పజాతిభిః || 43

నానా పక్షిరుతై స్సేవ్యైరుద్యానైర్నందనోపమైః |

ఫల భారానతై ర్వృక్షై స్సర్వర్తుకుసుమోత్కరైః || 44

చకోరై శ్శతవత్రైశ్చ భృగంరాజై శ్చకోకిలైః | కలవింగైర్మయూరైశ్చ ప్రియపుత్రైః శుకైస్తథా || 45

జీవంజీవక హారీతై శ్చాతకైర్వన వేష్టితైః | నానాపక్షిగణౖశ్చాన్యైః కూజద్భిర్మధురస్వరైః || 46

దీర్ఘికాభిస్తటాకైశ్చ పుష్కరిణీభిశ్చ వాపిభిః |

నానాజలాశ##యైశ్చాన్యైః పద్మినీషండమండితైః || 47

కుముదైః పుండరీకైశ్చ తథా నీలోత్పలై శ్శుభైః కాదంబై శ్చక్రవాకైశ్చ తథైవ జలకుక్కు టైః || 48

కారండవైః ప్లవైర్హంసై స్తథా7న్యై ర్జలచరాభిః |

ఏవం నానావిధై ర్వృక్షైః పుషై#్పర్నానా విధై ర్వరైః || 49

నానాజలాశ##యైః పుణ్యౖః శోభితం తత్సమంతతః | అస్తే తత్ర స్వయం దేవః కృత్తివాసా వృషధ్వజః || 50

హితాయ సర్వలోకన్య భుక్తిముక్తి ప్రదః శివః | పృథివ్యాం యాని తీర్థాని సరితశ్చ సరాంసి చ || 51

పుష్కరిణ్య స్తటాకాని వాప్యః కూపాశ్చ సాగరాః |

తేభ్యః పూర్వం సమాహృత్య జలబిందూన్పృథ క్పృథక్‌ || 52

సర్వలోక హితార్దాయ రుద్రః సర్వసురైస్సహ |

తీర్థం బిందుసరో నామ తస్మిన్‌క్షేత్రే ద్విజోత్తమాః || 53

చకార ఋషిభిః సార్థం తేన బిందుసరః స్మృతమ్‌ |

అష్టమ్యాం బహుళే పక్షే మార్గశీర్షే ద్విజోత్తమాః || 54

య స్తత్ర యాత్రాం కురుతే విషునే విజితేంద్రియః | విధివ ద్బిందుసరసి స్నాత్వా శ్రధ్దాసమన్వితః || 55

దేవానృషీన్మనుష్యాంశ్చ పితౄన్‌ సంతర్ప్య వాగ్యతః | తిలోదకేనవిధినా నామగోత్రవిధానవిత్‌ || 56

స్నాత్వైవం విధివత్తత్ర సో7శ్వమేధ ఫలంలభేత్‌ | గ్రహోపరాగే విషువే సంక్రాంత్యా మయనే తథా || 57

యుగాదిషు షడశీత్యాం తథా7న్యత్ర శుభేతిథౌ | యేతత్ర దానం విప్రేభ్యః ప్రయచ్చంతి ధనాదికమ్‌ || 58

ఆన్యతీర్థా చ్చతగుణం ఫలం తే ప్రాప్నువంతివై | పిండం యే సంప్రయచ్చంతి పిత్భభ్య స్సరసప్తటే || 59

పితౄణామక్షయాం తృప్తిం తే కుర్వంతి న సంశయః |

తతః శంభోర్గృహం గత్వా వాగ్యతః సంయతేంద్రియః || 60

ప్రవిశ్య పూజయే చ్చర్వం కృత్వా తం త్రిః ప్రదిక్షిణమ్‌ |

ఘృతక్షీరాదిభిః స్నానం కారయిత్వా భవం శుచిః | 61

చందనేన సుగందేన విలిప్య కుంకుమేన చ |

తతః సంపూజయేద్దేవం చంద్రమౌళి ముమాపతిమ్‌ || 62

పుషై#్పర్నానావిధై ర్మేధ్యై ర్బల్వార్క కమలాధిభిః | ఆగమోక్తేన మంత్రేణ వేదోక్తేన చ శంకరమ్‌ || 63

అదీక్షితస్తు నామ్నైవ మూలమంత్రేణ చార్చయేత్‌ | ఏవం సంపూజ్య తం దేవం గంధపుష్పానురాగిభిః || 64

ధూపదీపైశ్చనై వేద్యైరుపహారై స్తథా స్తవైః | దండవత్ర్పణి పాతై శ్చ గీతై ర్వాద్యైర్మనోహరైః 65

నృత్యజప్యనమస్కారై ర్జయశ##బ్దైః ప్రదక్షిణౖః | ఏవం సంపూజ్య విధివ ద్దేవ దేవ ముమాపతిమ్‌ || 66

సర్వపాప వినిర్ముక్తో రూప¸°వన గర్వితః | కులై కవింశ ముద్ధృత్య దివ్యాభరణ భూషితః || 67

సౌపర్ణేన విమానేన కింకిణీజాలమాలినా | ఉపగీయమానో గంధర్వైరప్సరోభిరలంకృతః || 68

ఉద్యోత యన్దిశః సర్వాః శివలోకం సగచ్చతి | భుక్త్వా తత్ర సుఖం విప్రా మనసః ప్రీతిదాయకమ్‌ || 69

తల్లోక వాసిభిః సార్ధం యావదాభూత సంప్లవమ్‌ | తతస్తస్మాదిహా77యాతః పృథివ్యాం పుణ్యసంక్షయే || 70

జాయతే యోగినాం గేహే చతుర్వేదీ ద్విజోత్తమాః |

యోగం పాశుపతం ప్రాప్య తతో మోక్షమవాప్నుయాత్‌ || 71

శయనోత్థాపనే చైవ సంక్రాంత్యా మయనే తథా | అశోకాయాం తథా7ష్టమ్యాం పవిత్రారోపణ తథా || 72

యే చపశ్యంతి తం దేవం కృత్తివాసస ముత్తమమ్‌ | విమానేనార్క వర్ణేన శివలోకం వ్రజంతి తే || 73

సర్వకాలేపి తందేవం యే పశ్యంతి సుమేధసః | తే7పి పాప వినిర్ముక్తాః శివలోకం వ్రజంతి వై || 74

దేవస్య పశ్చిమే పూర్వే దక్షిణ చోత్తరే తథా | యోజన ద్వితయం సార్థం క్షేత్రం తద్బుక్తి ముక్తిదమ్‌ || 75

తస్మిన్‌క్షేత్రవరే లింగం భాస్కరేశ్వర సంజ్ఞితమ్‌ |

పశ్యంతి యే తు తం దేవం స్నాత్వా కుండే మహేశ్వరమ్‌ || 76

ఆదిత్యేనార్చితం పూర్వం దేవదేవం త్రిలోచనమ్‌ | సర్వపాప వినిర్ముక్తా విమాన వర మా స్థితాః || 77

ఉపగీయమానా గంధర్వైః శివలోకం వ్రజంతితే | తిష్ఠంతి తత్ర ముదితాః కల్పమేకం ద్విజోత్తమాః || 78

భుక్త్వాతు విపులాన్‌ భోగాన్‌ శివలోకే మనోరమాన్‌ | పుణ్యక్షయాదిహా77యాతా జాయంతే ప్రవరే కులే || 79

అథవా యోగినాం గేహే వేదవేదాంగ పారగాః | ఉత్పద్యంతే ద్విజవరాః సర్వభూతహితే రతాః || 80

మోక్ష శాస్త్రార్ధ కుశలాః సర్వత్రసమబుద్ధయః | యోగం శంభో ర్వరం ప్రాప్య తతో మోక్షం వ్రజంతి తే || 81

తస్మిన్‌ క్షేత్రవరే పుణ్య లింగం యద్దృశ్యతే ద్విజాః | పూజ్యాపూజ్యంచ సర్వత్ర వనే రథ్యాంతరేపి వా || 82

చతుష్పథే శ్మశానేవా యత్రకుత్రచ తిష్ఠతి| దృష్ట్వా తల్లింగ మవ్యగ్రః శ్రద్ధయా సుసమాహితః || 83

స్నాపయిత్వా తు తం భక్త్యా గంధైః పుషై#్పర్మనోహరైః |

ధూపైర్దీపైః సనై వేద్యై ర్నమస్కారై స్తథా స్తవైః || 84

దండవత్ర్పణిపాతైశ్చ నృత్యగీతాదిభిస్తథా |

సంపూజ్యైవం విధానేన శివలోకం వ్రజేన్నరః || 85

నారీ వా ద్విజశార్దూలాః సంపూజ్య శ్రధ్దయాన్వితా |

పూర్వోక్తం ఫలమాప్నోతి నాత్ర కార్యా విచారణా || 86

కః శక్నోతి గుణాన్వక్తుం సమగ్రా న్మునిసత్తమాః |

తస్యక్షేత్రవరస్యాథ ఋతే దేవా న్మహేశ్వరాత్‌ || 87

యస్మి న్యస్మిం స్థితౌ విప్రాః స్నాత్వా బిందు సరో7ంభపి |

పశ్యే ద్దేవం విరూపాక్షం దేవీం చ వరదామ్‌ శివామ్‌ | 88

గణం చండం కార్తికేయం గణశం వృషభం తథా |

కల్పద్రుమంచ సావిత్రీం శివలోకం సగచ్ఛతి || 89

స్నాత్వా చ కపిలే తీర్థే విధివ త్పాపనాశ##నే |

ప్రాప్నో త్యభిమాతాన్‌ కామాన్‌ శివలోకం సగచ్ఛతి || 90

యః స్తంభం తత్ర విధివ త్కరోతి నియతేంద్రియః |

కులైక వింశ ముద్దృత్య శివలోకం సగచ్ఛతి || 91

ఏకామ్రకే శివక్షేత్రే వారణాసీ సమే శుభే |

స్నానం కరోతి యస్తత్ర మోక్షం స లభ##తే ధ్రువమ్‌ || 92

ఇతి శ్రీ బ్రహ్మపురాణ ఏకామ్రక్షేత్రమాహాత్మ్యం నామ ఏక చత్వారింశో7ధ్యాయః

సర్వపాపహరము పరమదుర్లభము కోటిలింగ సహితము కాశీక్షేత్ర సమానము ఎనిమిది తీర్థములతో గూడి నదియు నేకామ్రమని ప్రసిద్ధిగల పుణ్యక్షేత్రమును గురించి చెప్పుచున్నాను. వినుడు.

పూర్వకల్పమం దక్కడ నేనామ్రవృక్షము (ఒంటి మామిడి చెట్టు) ఉన్నందున నా క్షేత్రమున కాపేరు వచ్చినది. అందు సంతుష్టి, పుష్టియు గల స్త్రీ పురుషులుందరు. పండిత సమూహాముతోను ధన ధాన్యములతోను గూడినది. గృహ గోపురముల యొత్తిడి గొన్నది. త్రకోణాకార ద్వారబంధ శోభితము. నర్తకబృంద సహితము సర్వరత్నోవ శోభితము, కోట బురుజులతో నొప్పునది, రథికులచే శోభించునది, రాజహంసలట్లు తెల్లని ప్రాసాదములతో రాణించునది పురద్వారములతో నొప్పునదియు తెల్లని ప్రాకారములతో వ్యాప్తమైనదియు, ఆయుధ ధారులచే నభిరక్షితము, కందకములతో రాణించునదియు, వాయుకంపిత బహువర్ణ పతాకా పరిశోభితము, నిరంతరోత్సవ ప్రముదితము, నానా వాద్యధ్వని సంకులము, దేవాలయములు, ప్రాకారములు, ఉద్యానవనములతో పరమసుందరము. అందలి స్త్రీలు పరమసుందరులు, ఆనందభరితులు, సర్వాభరణ భూషితులు, పద్మనేత్రలు పూర్ణచంద్రాననలు కాంచీనూపుర శబ్దశోభితలు కొందరు బంగరు చాయవారు. కొందరు గజగమనలు. కొదరు పినోన్నత కుచభారావనమ్రలు దివ్యగందాను లిప్తలు, కొందరు కర్ణాభరణ భూషితలు, మరికొందఱు మదవతులు, సుశ్రోణులు, కొందరు నగుమోము గలవారు, ఆపుడించుక వెలువడు వలువరుస గలవారు కొందరు బింబాధరోష్టులు కొందురు మధురస్వర మనోహరులు. తాంబూల రంజితముఖులు, ప్రియదర్శనులు, మనోహారిణులు, క్రియవాదినులు, నిత్ర ¸°వన గర్వితలు. అందరు దివ్యాంబరాభరణ థారిణులు, పరమ పతివ్రతలు ఆ క్షేత్రమున యువతులు అప్సరస్సమానులు, క్రీడావిలాసినలు, రేయింబవళ్ళు తమతమ గృహములందు ఆనందభరితులై యుండు ఉత్తమ గృహిణులు.

అచట పురుషులు రూప¸°వన గర్వితులు, సర్వలక్షణ సంపన్నలు నిగనిగ మెరగయుమణిమండనములు ధరించు వారు. బ్రహ్మణాది వర్ణములవారు స్వధర్మ నిరతులు. అందు వారాంగనలు కూడ పరమసుందరులై యెప్పుదురు. ఊర్వసీ, మేనకాది దేవ సుందరీమణుల యందమున నొప్పువారు. సంగీతాది సకలకలానిపుణులు. ప్రియవాదినులు. సర్వలక్షణ లక్షితులు, నృతయగీత విశారదులు. సర్వరమణీ రమణీయ గుణగర్వితలు. వాలు చూపులలో మాటలలోనిపుణులు ; కురూపులు, కుబుద్దులు, పరద్రోహ పరాయణులు, నందు గానరారు. వారి కటాక్ష ప్రసరణమాత్రమున మానవులు మోహా వివశులగుదురు.

నిర్ధనులు, మూర్ఖులు పరద్వేషులు, రోగులు, లోభులు మాయకులు, జగత్ర్పసిద్ధమైన ఆ క్షేత్రమున నుండరు, సర్వసుఖ సంచారము. సర్వసత్త్వ సుఖకరము, సర్వసన్య సంభరితము. సర్వజన సంకులము. అందుకల ఫలవృక్షములు ఎందును లేవు. అందలి యుద్యానములు నందనవనోపమములు, సర్వర్తు కుసుమఫల భారావనమ్ర వృక్ష శోభితములు.

అందు శుక పికచకోర చక్రవాత ప్రముఖ సకల పక్షికుల కిలకిలారావ సంకులములగు వనములు, సరస్సులు దిగుడుబావులు, చూడముచ్చట గొల్పుచుండును. అందు కమలములు కలువలు ఎర్ర తామరలతో నిండిన పుణ్యసరస్సు లెటుచూసినను కన్నులపండువు చేయుచుండును. అయట పరమశివుడు సన్నిహితుడు. ఆ పరమేశ్వరుడు భూమి యందున్న నదులు పుష్కరిణులు చెరువులు నూతులు సాగరములు అనువాని నుండి జల బిందువులను సేకరించి సురలతో నా పుణ్యక్షేత్రమును బిందుసరమను తీర్థమును నిర్మించెను. మార్గశీర్ష బహుళాష్టమినాడు జితేంద్రియుడై యచట యాత్రచేసి శ్రద్ధతో స్నానముచేసి వాజ్నియమమూని దేవర్షి పితృతర్పణ మాచరించి తిలాంజలులు చేసినవాడు అశ్వమేధఫలమందును. గ్రహణ పర్వకాలమున విషువమున (సమరాత్రిందివ కాలమున) సంక్రమణమందు అయన సమయమున యుగాదులందు షడశీలితిని (తుల మొదలుకొని 86వ రోజున వచ్చెడి పుణ్యకాలము. ఇది సంవత్సరమునకు నాలుగు పర్యాయములు వచ్చును. ద్విస్స్వభావ రాశియందే యిదివచ్చును.) మఱి యితర శుభసమయములందు ధనాది పుణ్యదానములు చేసినవారు ఇతర తీర్థములకంటె నూరురెట్ల ఫలము నందుదురు. ఆబిందు సరస్తీర్థము నందు పితృదేవతలకు పిండప్రదానము చేసినవారు పితృదేవతలకు అక్షయతృప్తిని కలుగజేసినవారగుదురు సంశయము లేదు.

అటుపై నింద్రియముల నిమిడించుకొని వాక్కును నిగ్రహించుకొని, శివాలయమునకు (ఏకామ్రేశ్వరాలయము) ఏగి అందు శంకరుని పూజింపవలెను. ఆ మున్ను ఆలయమునకు ముమ్మారు ప్రదక్షిణము చేయవలెను. ఆవునేతితో గోక్షీరముతో శుచియై స్వామి కభిషేకించి చందనము, కుంకుమయు పూసి యవ్వల ఉమాపతియగు చంద్రమౌళీశ్వరుని పుష్పములచే పవిత్రములగు బిల్వార్క కమలాదులచే నాగమ విధానమున వైదిక మంత్రములతో నారాధించవలెను. దీక్షాపరుల పూజావిధానమిది. దీక్ష నొందనివారు మూలమంత్రముతోను నామములతోను అర్చించవలెను. ఈ విధముగ గంధపుష్పాదులతో షోడశోపచారములతోను నృత్యగీతాదులతోను నారాధించి పాపవిముక్తులగుదురు. రూపసి యువకుడు నగును. ఇరువది యొక్క తరముల వారి నుద్ధరించి దివ్యాభరణముల దాల్చి, చిరుగంటలు మ్రోయుబంగరు విమానమున గంధర్వాప్సరసాదులు కీర్తింప స్వదిశల మిరుమిట్లు గొల్పుచు తుదకు శివలోకము చేరును. అచటిభక్తులతో భూత ప్రళయపర్యంత మచటనుండి భూలోకమునకు వచ్చి యోగిగృహమునందు చతుర్వేది యగును. అచట పాశుపతదీక్షగొని మోక్షము నొందును.

శయనైకాదశి, ఉత్థానైకాదశులందు సంక్రమణములందు, అయన పుణ్యకాలములందును, అశోకాష్టమి పవిత్రారోపణములందును శివదర్శనము చేయువారు సూర్యప్రభమగు విమానమున శివలోకమున కేగుదురు. మేధావంతులు ఎల్లకాలము శివదర్శనము చేసి శివలోక మందుదురు. ఈ శివక్షేత్రమునకు నలుదిక్కులందుగల రెండున్నర యోజనముల ప్రదేశము భుక్తి ముక్తుల నిచ్చు క్షేత్రము. ఆ క్షేత్రమునందుగల లింగము భాస్కరేశ్వరమనబడును. అచట నున్న కుండమున స్నానముచేసి ఆదిత్యునిచే నర్చింపబడిన ఆ భాస్కరేశ్వరుని దర్శించినవారు విమానమెక్కి గంధర్వ గానము లవధరించును శివలోకమున కేగుదురు. అచట నానందభరితులై ఒక కల్పకాలము మనోహర భోగముల ననుభవించి పుణ్యక్షయముకాగా భూలోకముచేరి యోగిగృహమునందుపుట్టి వేదవేదాంగపారగులై సర్వభూత హితము కోరు బ్రాహ్మణులై సర్వసములై మోక్షశాస్త్ర కుశలురై శివయోగమంది మోక్షమందుదురు. పూజ్యమైనను అపూజ్యమైనను ఒక శివలింగము అడవిలో రాచబాటలో నాల్గుదార్లు కలిసినచోట శ్మశానమునందు గాని యెక్కడో యక్కడాక్షేత్రమునందున్న యెడల దానింజూచి తొట్రుపడక శ్రద్ధతో మనసునిలిపి భక్తితో నభిషేకము చేసి సుగంధ పుష్పాదులచే ధూదీప నైవేద్యాదులచే నమస్కారములచే స్తుతులచే నమస్కరించి సాష్టాంగ దండప్రణామము గావించి నృత్యగీతాదులచే యాధావిధిగా నర్చించిన యతడు శివలోక మేగును. స్త్రీయైనను శ్రద్ధతో శివుంబూజించిన నీ మన్ను జెప్పిన ఫలమందును. ఇందు విమర్శింప బనిలేదు.

ఆ యేకామ్రక్షేత్రముయొక్క సమగ్రగుణ విశేషములను పరమేశ్వరునికంటే మఱియెవ్వడు వర్ణింపగలడు? ఏ యే స్థితిలోనున్ననను వైశాఖాది మాసములందు బిందుసరోవరజలమందు స్నానముచేసి యటనున్న శివుని, వరదాత్రియగు పరమేశ్వరిని ప్రమథగణములను కుమారస్వామిని గణపతిని నందిని కల్పవృక్షమును సావిత్రీదేవిని దర్శింపవలెను. అందువలన శివుని సాలోక్యమందును. కపిలతీర్థమున యధావిధిగ స్నాన మాచరించి యభీష్టముల నంది శివలోకమందును. ఆ క్షేత్రములనే జితేంద్రియుడై యధావిధి స్తంభప్రతిష్ట చేయునతడు ఇరువది యొక్క తరముల కులము నుద్ధరించి శివలోకమున కేగును. కాశీక్షేత్ర సమయమున శివక్షేత్రమగు నేకామ్రక్షేత్రము నందు స్నానము సేసిన యతడు తప్పక మోక్షమందును.

ఇది బ్రహ్మపురాణమునందు ఏకామ్రక్షేత్ర మహాత్మ్యము అను నలుబది యొకటవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters