Brahmapuranamu
Chapters
శ్రీః వేదవ్యాస ప్రోక్తము బ్రహ్మపురాణము ఆంధ్రానువాదసహితము అనువాదకులు: గురుశిశువు శ్రీ కల్లూరి వేంకటసుబ్రహ్మణ్యదీక్షితులు ప్రకాశకులు: శ్రీవేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ గురుకృప 1-10-140/1, అశోక్‌నగర్, హైదరాబాదు-500 020 ప్రథమ
ముద్రణము సర్వస్వామ్యములు ప్రకాశకులవి. 1984 మూల్యము
:
81-00 ప్రతులు :
2000 ఇంటింట
దేవతామందిరములందు పూజింపవలసినవి ఆడపడుచులు
అత్తవారింటికి వెళ్లునపుడు సారె పెట్టవలసినవి ఆచంద్రార్కము
మనుమలు మునిమనుమలు ఆయురారోగ్యభాగ్య
సౌభాగ్య సమృద్ధికి ధర్మము
ధనము భోగము మోక్షమునుకోరి చదివి
చదివించి విని
వినిపింపవలసినవి వేదవేదాంత రహస్య
సుబోధకములైనవి. వ్యాసప్రోక్త
ఆష్టాదశ (18)
మహాపురాణములు వానిని
సంస్కృతమూల-సరళాంధ్రానువాద-పరిశోధనలతో శ్రీ వేంకటేశ్వర
ఆర్షభారతి ట్రస్టు ముద్రించి అందించుచున్నది. ప్రతులకు
:
ముద్రణ: శ్రీ వేంకటేశ్వర
ఆర్షభారతి ట్రస్ట్ క్లియర్ ప్రింట్స్ గురుకృప
బాకారం, ముషీరాబాదు, 1-10-140/1,
అశోక్‌నగర్, హైదరాబాదు-500 048 హైదరాబాదు-500
020. ఫోన్ :
62850 ఓమ్ శ్రీ చంద్రమౌళీశ్వరాయనమః శ్రీ
కాంచీకామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ
శంకరాచార్యస్వామిమఠః కాంచీపురం
- 631 502 మకాం
- రాయచోటి తేది.
3-1-1984 శ్రీ
శ్రీ శ్రీ కామకోటి పీఠాధీశ్వర శ్రీ జగద్గురు శ్రీ మజ్జయేంద్రసరస్వతీ
శ్రీ పాదైః అనుగృహీతం
శ్రీముఖమ్. సువిదిత
మేతత్ యదస్మాకం భారతీయసనాతనధర్మస్య
ముఖ్యం ప్రమాణం వేదా ఇతి| వేదనామర్థం
తాత్పర్యంచ సర్వేషాం కృతే ప్రతిపాదయితుం ప్రవృత్తాని
ఇతిహాసపురాణాని| ఏతేషు చాస్మాకం వైదికోధర్మః
అనాదిరితి ప్రతిపాద్యతే| చరిత్రసంబంధినో
విషయాః బహవః ప్రతిపాదితాః పురాణషు |
ఇమేవిషయాః ఆస్మత్పూర్వతనానాం ఆచార్యాణాం ఋషీణాంచ
కౌశలం దీర్ఘదృష్టితాంచ జ్ఞాపయంతి ఇత్యత్ర
నవిమతిః. అష్టాదశసంఖ్యాకాని
పురాణానీత్యప్యస్తి ప్రసిద్ధిః| తేషా మేషాం మధ్యే
శ్రీ మద్బ్రహ్మపురాణం ప్రాథమికం స్థాన మధితిష్ఠతి|
అస్యచ పఠనేన తథా తదర్ధబోధేనచ
ఆత్రత్యా విషయాః సమ్యక్ స్తూయంతే ఇత్యేవన.
అపితు అస్మదీయపాతకానా మప్యున్మూలసంభవతీతి
నిశ్చప్రచం| అస్యచ పురాణస్య సర్వజన సాధారణతయా
బోధాయ ప్రవచనం తథా అదసీయమూలశ్లోకానాం
ప్రాదేశిక లిప్యాం లలితలలితసామాన్యభాషాయాం
అనువాదేనసహ ప్రకటీకరణంచసర్వేషామపి
శ్రేయ సేకలయతే| ఏతాదృశముత్తమోత్తమం
ధార్మికం కార్యం భాగ్యనగర హైదరాబాదునివాసీ
భక్తాగ్రేసరః శ్రీమాన్ పి. వెంకటేశ్వర్లు మహోదయః
స్వకీయ మనల్పం ధనం వ్యయీకృత్య కరోతీ
త్యేతస్మిన్ కార్యే శ్రీకల్లూరి వేంకట సుబ్రహ్మణ్యదీక్షితాః
శ్రీజంధ్యాలసుబ్రహ్మణ్య శాస్త్రిణః ఇత్యాదయః
పండితాః భాగం వహంతీతిచ జ్ఞాత్వా అతీవ
మోదామహే వయమ్. ఏవమేవాయం
వెంకటేశ్వర్లు మహాభాగః ఇతరాణ్యపి మహాపురాణాని
ఆచిరేణ కాలేన ప్రకటీకృత్య శ్రేయోభాగ్భవతు.
తథా ఏతేషాం పురాణానాం పఠనేన తదర్థపరిజ్ఞానేనచ
సర్వేప్యాంధ్రమహాజనాః కృతకృత్యాః పుణ్యభాజశ్చ
భ##వేయు రిత్యాశాస్మహే. ఇతి
నారాయణస్మృతిః సమర్పణమ్ స్వస్తిశ్రీమదిత్యాది
బిరుదావళీ విరాజమాన శ్రీకామాక్షి సమేత శ్రీమదేకామ్రనాథకాంచీక్షేత్రే శ్రీమత్పరమ
హంస పరివ్రాజకాచార్యవర్య శ్రీజగద్గురు శ్రీమచ్ఛఙ్కభగవత్పాదాచార్యాణాం అధిష్ఠానే
సింహాభిషిక్త శ్రీమచ్చంద్ర శేఖరేన్ద్ర
సరస్వతీ సంయమీన్ద్రాణాం తదీయ
శ్రీకరకమల సంజాత శ్రీజయేన్ద్ర సరస్వతీ శ్రీపాదైః
తదీయ శ్రీకర కమల
సంజాత శ్రీశంకరానందేన్ద సరస్వతీ శ్రీచరణౖః
సమవేతానామ్ పూర్ణబ్రహ్మణాం
శ్రీకరమలయోః సాష్టాంగప్రణామ పూర్వక పూర్ణసంఖ్యాక
శ్లోకవినుతి పూర్వకం సమర్ప్యతే శ్రీవేదవ్యాసప్రోక్త
బ్రహ్మపురాణ సంస్కృతమూ లాస్మదాంధ్రానువాద
గ్రంథరూపో೭యం
పూజారత్నపుష్పోపహారః శ్రీగురుమూర్తే|
కాఞ్చీ కామాక్షీ కామకోటిపదనిలయే| కలయే
భవతీ మరుణాం కరుణాం దరహాసచంద్రికాభరణామ్.
1 శ్రీచంద్రశేఖర
జగద్గురు హస్తపద్మ ద్వంద్వే భవాబ్ధితరణ
శరణ రమాయాః | పౌరాణికీం
కృతి మిమా మిహ మాతృభాషా భూషాం సమర్పయతి
దీక్షిత ఏష భక్త్యా || 2 ఆంధ్రీకృతపారాశర
బ్రహ్మపురాణార్థసూక్తిసైరంధ్రీ| బ్రహ్మపురంధ్రీ
శ్రయతే శ్రుతిశేఖర శేఖరీభవద్భవదంఘ్రిమ్||
3 కామాక్షీకరుణాసుధామధురితై
రాలోకనై స్తత్ స్మిత ప్రాలేయద్యుతిశీతలై
శ్శశివతంసానర్తనశ్రీభ##రైః | అస్మద్భాగ్యరసోదయై
స్సుకవితాజీవాతుభిః పావయన్ శ్రీమన్| స్వీకురు
సత్కృతింకృతిమిమా మంకే శిశుం మాం కురు. ధీమందరేణ
మమ సాత్యవతేయసూక్తి| క్షీరాబ్ధిమంథనవిధౌ
భవతః కటాక్షాత్ పాత్రే
కృతం భగవతో భవతః పురస్తాత్| నీతం
నవం మమ వచో నవనీత మస్తు 5 శ్రీమన్!
నివేశిత మిదం తవ యత్కరాబ్జే| ప్రీత్యా
గృహాణ మయి నిత్యమనుగ్రహాయ నిత్యోత్సవాయ
నిఖిల శ్రుతివత్సలాయ వ్యాసోక్తిసారరసికాయ
నమో నమస్తే. 6 సర్వజ్ఞ
స్సర్వేశ స్సర్వసమర్థో భవా నితి జ్ఞాతే| కిమపి
సమర్పణ మేత త్కైతవ ముపచార మేవ
మే మన్యే. 7 యద్యత్కర్మ
కరోషి మంగళకరం త న్మహ్య మావేదయన్|
కామాక్షీచరణారుణాబ్జమధుపః కల్యాణలీలా
హరేః గాయన్
తీర్ణభవో భ##వేరితి విభు ర్యోమే దదా
వాశిషం| తం వందే೭స్మదనేకజన్మదురిత
ధ్వాంతౌఘచండప్రభమ్ 8 శిశిరకరకిశోరస్మేరకోటీరకోటీ|
వశిజనహృదయాంతఃకౌసుమారామవాటీ శిశుజనవదనాబ్జన్య
స్తకర్పూరవీటీ| జయతు శివవధూటీ శ్రీగురుః
కామకోటీ, 9 ఇతి
గురుశిశుః శ్రీః శ్రీః
శ్రీః పురాణముల వైశిష్ట్యము ఆర్షభారతియొక్క సమ్యగ్రూపము ˳ØLRi¼d½¸R…VVÌÁ xqsLRi*úxmsª«sX»R½VòÌÁV Aª«sVVztsQøNRPª«sVV\®ªsxmsoƒ«sNRPV rygRiV¿RÁVLi²R…VÈÁ xmsLjiFyÉÓÁ. Hz¤¦¦¦NRP ÒÁª«sƒ«sª«sVVƒ«sLiµR…ÖÁ úxms»R½ùLiaRPª«sVVƒ«sV FyLRiÍÝNTPNRP xqsVÅÁª«sVVƒ«sNRPV „sLRiVµôðR…ª«sVV NSLSµR…ƒ«sVÈÁ ªyLjiª«sVVÆÜ[ù®µô…[aRPª«sVV. ª«sVƒ«s xqsLRi*µ³R…LRiøª«sVVÌÁVƒ«sV @LiµR…VÌÁNRPV »R½gjiƒ«sÈýÁVgRi®ƒs[ ‡ÁVVxtsvÌÁ¿Á[»R½ నుపదేశింపబడినవి. శిష్టులచేతను అనాదిగా ఆ దృష్టితోనే ఆచరించబడుచు, మానవ సమాజమునకు మార్గదర్శకములుగ కొనసాగుచువచ్చినవి. పురాణ వాఙ్మయము ఈ పరమార్థ దృష్టి ప్రధానమగు భారతీయ ధర్మదృష్టికి ఆలంబనముగ వెలయుచున్నది. ఐహికాముష్మిక సుఖముల సంపన్నములొనర్చు ధర్మములను ప్రతిపాదించుటలో శ్రుతు(వేదము)లతో బాటు పురాణములకును ప్రామాణ్యము కలదని ఛాందోగ్య బృహదారణ్యకోపనిష ద్వచనముల వలన వ్యక్తమగుచున్నది. ఇతిహాసములు ఇతి-హ-అస ఇట్లు జరిగియుండెనట అను వ్యుత్పత్తిచే ప్రాచీనకాలమున జరిగిన వృత్తాంతములను బోధించినవి. సృష్టికి పూర్వపుస్థితిలో నారంభించి, సృష్టిస్థితి లయములను సమగ్రముగ ప్రతిపాదించి, లోకస్థితికి కావలసిన ధర్మములను, లయమున జగత్తు పరమాత్మునిలో లీనమగు విధమును పురాణములు ప్రతిపాదించును. కాని ఇతిహాసములు ఏదోయొక వృత్తాంత విశేషరూపమును కధరూపమున ప్రతిపాదించుచు, ప్రాసంగికముగ ఐహికాముష్మిక ధర్మములను అందజేయుచుండును. అని దీనినిబట్టి తెలియుచున్నది. ఇతిహాసలక్షణములు కొన్ని భాగవతాది పురాణములలోను, పురాణలక్షణములు కొన్ని భారతేతిహాసముందును కనబడుచున్నను, ఇతిహాసమనుపేరు భారతేతిహాసమునకును, పురాణములను వ్యవహారము భాగవతాదులకును ప్రసిద్ధమైయున్నది. ఇట్లు ఇతిహాస పురాణములు వేదములతోబాటు ఐహికాముష్మీక ధర్మబోధకములగుటచే మనువుమున్నగు శిష్టులచే నాటినుండి నేటి వరకు వేదములతోపాటు నాదరింపబడుచున్నవి. ''బిభే త్యల్పశ్రుతా ద్వేదో మామయం ప్రతరే దితి'' ''ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బృంహయేత్'' అల్ప పాండిత్యముగలవాని వలన వేదము'' ఇతడు నన్ను మోసగించునని'' భయపడునట. కావున ఇతిహాస పురాణముల నాధారముగ గొని వేద ప్రతిపాద్యార్థమును పోషించవలెను. (మనుస్మృతి). మఱియు పురాణములుచేయు వేదోక్త ధర్మప్రతిపాదనలో వైశిష్ట్యముగలదు. శబ్దప్రధానములగు శ్రుతులు ప్రభుతుల్యములు, ప్రభువు ప్రజలను ''మీరిట్లు నడువవలెను, నడువనియెడల దండింపబడుదురు.'' అని శాసించును. అట్లు నడచుటవలన మేలునుగాని, నడువకపోవుట వలన వచ్చుకీడునుగాని వివరింపడు. అట్లే శ్రుతులు సత్యంవద, ధర్మంచర అని విధిరూమునను ''న వివసన స్స్నాయాత్'' ఇత్యాది నిషేధరూపమునను ధర్మమును విధించి, అధర్మమును నిషేధించును. వానివలన కలుగు మేలుకీడులను వివరింపవు. స్మృతులుకూడనిట్లే. ఇక పురాణములు చేయు ధర్మాధర్మ ప్రతిపాదనము మిత్రవచన సదృశము. ధర్మాధర్మాచరణమువలన ఆయా వ్యక్తులు పొందిన మేలుకీడులను ఉదాహరణముగ జెప్పుచు రామాదులవలె ధర్మాచరణము చేయనగును. రావణాదులవలె నధర్మాచరణము చేయరాదు అని చెప్పి ధర్మమునందు ప్రవృత్తిని, ఆధర్మమునుండి నివృత్తిని సులభముగ కలిగించును. మఱియు వేదములభాష సంస్కృతమేయయ్యును లౌకిక సంస్కృతముకంటె క్లిష్టమైనది. వేదములకు స్వర (ఉదాత్తాది) వ్యవస్థ, దానివలన నర్థభేదము కలదు. సంప్రదాయానుసరణము, షడంగ శిక్షణము, మీమాంసా శాస్త్రాద్యధ్యయనము మున్నగువానితోగాని వేదార్థ వివేచనము కలుగదు. పురాణములట్లుగాక సులభగ్రాహ్యమగు సంస్కృత భాషతో సరళమగు రీతితో ధర్మాదులను బోధించుచున్నవి. అందువలన నవి సర్వజన సమాదరణీయములు. కాల ప్రభావమున ఈ సరళతమభాషకూడ నందుబాటులో చాలమందికి లేకుండుటచే వానిని దేశభాషలోనికి ననువదించు నావశ్యకత యేర్పడినది. పురాణశబ్దమునకు పండితులు మూడురకములుగ నర్థనిర్వచనము చేయుచున్నారు. 1. పురాభవం= పురాణం. పూర్వమునందు ఉన్నది లేక జరిగినది. 2. పురా೭పి నవం. పూర్వమెపుడో రచితమైనను ఇప్పటికిని క్రొత్తదియే. 3. పురా అను అవ్యయమునకు మునుపు అనునర్థముతోబాటు ముందు అను నర్థము కూడ నొకప్పుడు గలదు. ముందుండునది అని అర్థము. అనగా భవిష్యత్కాలార్థము. పురాణములు సృష్టికి పూర్వపుస్థితి నారంభించి రాబోవు విషయములనుగూడ తెలుపుచుండుట అన్ని పురాణములందును కాననగును. దీనికి తగినట్లు పురాణ లక్షణమునిట్లు తెలిపియున్నారు. ''సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ| వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణమ్||'' (అమరకోశము) ''భూమ్యాదేశ్చైవ సంస్థానం'' అనియు తృతీయపాద పాఠాంతరము కలదు ఆ పాఠము ననుసరించి (1) సర్గము-పరమాత్ముని మాయా విలాసముచే అవ్యాకృత తత్త్వమునుండి మహత్తత్వము దానినుండి అహంకార తత్త్వము, దానినుండి సూక్ష్మ భూతోత్పత్తి కలుగుట. (2) ప్రతిసర్గము-హిరణ్యగర్భుడను ప్రధమ జీవునినుండి అతని మానస పుత్రులగు మరీచ్యాది ప్రజాపతుల వలన జరిగిన చరాచర భూతసృష్టి. (3) వంశము- ప్రజాపతులనుండి సృష్టి క్రమములో కొనసాగిన ఆయా ఋషుల - రాజుల వంశాదికము. (4) మన్వంతరములు- స్వాయంభువుడు మొదలగు మనువులు, వారివారి పాలనలో జరిగిన విషయములు. (5) భూమ్యాదిసంస్థానం- భూగోళ విభాగము - ఆయా వర్షములందలి విభాగము - పర్వత సముద్రాది సంస్థానము. (కూర్పు.) నదీ తీర్థ క్షేత్రాది వృత్తాంతము. ఈ అయిదవ లక్షణమున వంశానుచరితమనెడి పాఠములో - సర్గము= సృష్టి. ప్రతిసర్గము= ప్రలయము, వంశ-మన్వంతర-వంశాను చరితములు= స్థితి -యగును. అపుడు 'జన్మాద్యస్యయతః' అనెడి ¸°పవిషదబ్రహ్మ లక్షణమే పౌరాణిక బ్రహ్మలక్షణమని శ్రీవిద్యారణ్యోక్తి సార్థకమగును. ప్రకృత బ్రహ్మ పురాణములోను ఇతర పురాణములలోనుకూడ భూమ్యాది సంస్ధానము ప్రధానముగ చెప్పబడుట నిట గమనింపనగును. మహాపురాణములు 18. ఉపపురాణములు 18 అని పురాణములు రెండు రకములుగ నున్నవి. పురాణములన్నియు శివునిగాని, విష్ణువునుగాని, దేవినిగాని పరమదై వతముగ ప్రతిపాదించుచున్నవి. బ్రహ్మ పురాణము విష్ణుదేవుని పరదైవతముగ ప్రతిపాదించుచున్నది. పురాణములన్నిటికిని కర్త ఆ వేదవ్యాస మహామునియే. ''అష్టాదశ పురాణానాం కర్తా సత్యవతీసుతః'' శ్రీ వేదవ్యాసుడు పురాణములను రచించిన స్థానము భూలోకమున నుత్కృష్టస్థలము, నరనారాయణక్షేత్రము, మొదట విద్యాపీఠమునగు శ్రీ బదరికాశ్రమము. అందు ప్రథమ గురుశిష్యులు శ్రీ నరనారాయణ మునులు, వారిని, శ్రీ సరస్వతీదేవిని నమస్కరించియే 'జయ' అను పేర తాను వ్రాసిన ఇతిహాస పురాణములను పఠింపనగునని వేదవ్యాసులు తన శిష్యులకిట్లు ఆదేశించిరి. ''నారాయణం నమస్కృత్య నరంచైవనరోత్తమం | దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్'' అని. శిష్యులు గురువునందు భక్తిచే వారిపేరునుగూడ పైశ్లోకమున జేర్చి ''దేవీం సరస్వతీం ''వ్యాసం'' అని మార్పుచేసిరి. ఈవ్యాసులు శ్రీ బదరికాశ్రమ విద్యాపీఠమునకు కులపతియై సకల విద్యా ప్రచారము చేసినట్లుస్కాంద మహాపురాణాంతర్గత కాశీఖండము తెలుపుచున్నది. వ్యాసశిష్యుడగు రోమహర్షణుడు (రౌమహర్షణి) అనుసూత మహాముని నైమిశారణ్యమునందు ద్వాదశ వార్షిక బ్రహ్మ సత్రయాగమున గూడిన మునుల కీ పురాణముల నన్నిటిని వినిపించి, ప్రచారము చేసెను. పై శ్లోకములోని ''జయ'' పదమునకు వర్షానాం వామతో గతిః'' 'కాదినప'' ఇత్యాది సంకేతములతో-18 సంఖ్య లభించును. ఆయ్యది ప్రత్యేక షడంగయుక్త వేదత్రయిని (6x3=18) గాని తదుప బృంహక (18) పురాణములను గాని చెప్పును. మఱియు- వేదశాస్త్ర విహిత సత్కర్మముల నాచరించి మానవులు సర్వభూతయోగ క్షేమములను ఇహపర సుఖములను, చిత్తశుద్ధిద్వారమున మోక్షసాధనాధికారమును, సాధనచే మోక్షమును సాధించుకొనవలయుననునది పురాణములుచేయు ప్రధానోపదేశము. ఈ విషయమును పై శ్లోకగత ''జయ'' పదము సూచించుచున్నది. జయపదమును తలక్రిందుగ నుచ్చరించిన యజ యగును. అనగా యజింపుము. దేవతల నారాధించుము, అని యర్థము. యజ్ఞమున యజింపబడువాడు విష్ణువు. ''యజ్ఞోవైవిష్ణుః'' యజ్ఞములలో నారాధనీయ ప్రజాపతితత్త్వము సప్తదశ దేవతాత్మకము. ఈ తత్త్వము ఆశ్రావయ - అస్తుశ్రాషట్ - యజ - యే యజామహే - వషట్ - అను సప్తదశా (17) క్షరములచే సంకేతింపబడినది. ''చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభి రేవచ | హూయతేచ పున ర్ద్వాభ్యాం సమే విష్ణుః ప్రసీదతుః ||'' నాలుగు - నాలుగు - రెండు - అయిదు - రెండు - మొత్తము పదునేడక్షర రూపమగు పైన చెప్పిన పదములచే యజ్ఞములందు ఆరాధింపబడు ప్రజాపతి రూపమగు నా మహావిష్ణువు నాయెడ ప్రసన్నుడగుగాక! అని వ్యాసులు భారతమున కంఠోక్తిగ చెప్పియున్నారు. ఈ యంశములు శ్రీ మద్రామాయణమున బాల, అరణ్యకాండములలో మూలమునందును, వ్యాఖ్యానములందును వివరింపబడినది. మానవులు అగ్నిముఖులగు దేవతలకు నందజేయదలచిన హవిస్సు అగ్నిద్వారమున వారికి చేరును. తృప్తులైన దేవతలు పర్జన్యుని ద్వారా వర్షము కురిపింతురు. సోమునియనుగ్రహమున ఓషధులు ఫలించగా నన్నము సిద్ధించును. ఆయన్నముచే ప్రాణుల- ఉత్పత్తి, వృద్ధియుకలుగును. కావున ప్రాణుల సృష్టిస్థితులకు అగ్నీషోములు మూలభూతులు. ఈ యగ్నీషోమీయతత్త్వము వేదశాస్త్రపురాణములందు నన్నిటను ప్రతిపాదింపబడినది. ఈ ప్రకృత బ్రహ్మపురాణమునందు గూడ దక్షోత్పత్తిమున్నగు ననేకస్థలములందు చెప్పబడినది. ఈవేదపురాణోక్త ధర్మమే శ్రీభగవద్గీతయందు- ''దేవాన్ భావయ తానేన తేదేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథః'' అనిచెప్పబడినది. మానవుల యభ్యుదయ నిశ్శ్రేయసములు వేదోక్తకర్మాచరణ చేతనే సాధించుకొనవలెనని పురాణములు చేయు ధర్మోపదేశము. పురాణములు భగవదుపాసనకు సోపానములు. ఇవి విరాట్‌పురుషుని దృశ్య ప్రపంచాత్మకరూపమును సమగ్రముగ వివరించుచున్నవి. ఈ విరాట్‌స్వరూపోపాసనము పరమాత్మ నుపాసించుటకు సాక్షాత్తుగ మార్గమనియు అట్టిరూపమును ప్రతిపాదించు వాఙ్మయమును నధ్యయనము చేయుట శబ్దాత్మక బ్రహ్మనుపాసించుటయే యనియు, శ్రీమద్భాగవత ద్వితీయస్కంధముతెలుపుచున్నది. ఈవిరాట్‌స్వరూపమును సర్వ వేదసారమనదగు పురుషసూక్తము, రుద్రాధ్యాయ (నమక) ము శ్రీవిష్ణుసహస్రనామస్త్రోత్రము వర్ణించుచు మోక్షసాధనములుగ నుపాసింపబడుచున్నవి. విరాడ్రూపమును వర్ణించునవగుటచే పురాణములును నుపాదేయములు. ఇదిగాక ఈదృశ్య ప్రపంచమంతయు నగ్నీమాత్మకములనియు యజ్ఞములలో దేవతలను అగ్నిద్వారమున నారాధించుటచే తత్ఫలితముగ పర్జన్యుడు వర్షించగా, సోముని ద్వారమున ఓషధులు ఫలింపగా లభించిన యన్నముచేతనే ప్రాణులుత్పన్నములై వృద్ధినొందుననియు శ్రుతులును శాస్త్రములును తెలుపుచున్న విషయమును తెలిపియుంటిమి. ఈసంగతి పురాణములలో సృష్టిక్రమ ప్రదిపాదనసమయన నిట్టు చెప్పబడుచున్నది. ప్రజాపతి పరంపరలోనివారగు ప్రచేతులు, తామురాజులయ్యు ప్రజాపరిపాలనమును వర్ణించి తీవ్రతప మొనరింపసాగిరి. ఆ తపోగ్నిచే నోషధీతతులు మాడగా ప్రజలకు నన్నములేక పోయెను. దానిని చూచిసోముడు తన కన్యయగు మారిషను ప్రచేతులకు నిచ్చి పెండ్లిచేసెను. వారికిని మారిషకును జన్మించినవాడే దక్షుడు. ఇచట ప్రచేతులు అగ్న్యంశము. మారిష సోమాంశము. వారితనయుడు దక్షుడు. అతనినుండి ప్రజావృద్ధి జరిగినది. ఈక్రమమంతయు పురాణములలో వివరింపబడినది. అగ్నీషోముల సమాహార (కలసిన) రూపమే ఆదిత్యుడు. అతడు ప్రకాశించు పగటికాలమున అగ్నియు, సోముడును తమప్రకాశమును చూపజాలరు. కాని సూర్యుడు తనలోని అగ్న్యంశముచే భూతకోటికి ప్రాణశక్తినందించును. అందుచే భూతములకు శ్రమ, తాపము కలుగును. రాత్రులందు సోముడు భూతముల శ్రమతాపములను తొలగించి, జీవనశక్తినిచ్చి పోషించును. అగ్నియు, సోముడును రాత్రులందు తమ ప్రకాశమును బాగుగ చూపగలుగుట ప్రత్యక్షమే. కనుకనే ఆదిత్యుని పరమాత్మునిగ నుపాసించుట భారతీయుల సంప్రదాయము. ఈ సూర్యుడే ప్రాణులదేహమున ముఖ్య ప్రాణతత్త్వముగ నున్నాడని ఛాందోగ్యోపనిషత్తు నందు ప్రధమాధ్యాయమున చెప్పబడినది. ఈయంశములన్నియు బ్రహ్మపురాణమునందు 32, 179వ అధ్యాయములలో చెప్పబడియున్నవి. అన్ని పరిణామములకును కాలము కారణము. అది అనంతము. భగవంతుడు విరాట్రూపమున నందు నిలిచియు, దానికి నతీతుడు. ఆ అనంతుడే ఆదిశేషుడు. విష్ణు వసంతునిపై| శయనించి, అతని కతీతుడై శేషియై, స్వామియై యున్నాడు. శ్రీవిద్యాసంప్రదాయమున మూలాధారాది సహస్రారాంతచక్రసముదాయమున శ్రీదేవి ననంత కాలరూపమున నుపాసించుట పరిపాటి. శ్రీవిద్య గాయత్రీమంత్ర రూపాంతరము. గాయత్రి ఆధ్యాత్మమున అజపాతత్త్వముగ దినమునకు 21600 మారులు స్పందించుచు కాలతత్త్వాత్మకమైయొప్పుచున్నది. ఈవిషయము ఋగ్వేదము 1 మండలమున 164వ ''అస్యకామస్య'' అను సూక్తమున ప్రతిపాదింపబడినది. పురాణములు, కాలపరిణామరూపమగు ఆయాయుగముల యందు జరిగిన జరుగుచున్న వృత్తాంతములను తెలుపుచు సమస్త వేదవేదాంతాగమసారభూతములయి వెలయుచున్నవి. ఈదృష్టి నవలంభించి పురాణములను పఠించుట పరమార్ధ (మోక్ష) సంపాదకమగుట యతిశయోక్తికాదు. బ్రహ్మపురాణము ఈపురాణము అష్టాదశ మహాపురాణములలో ప్రాథమికము. విష్ణుపారమ్యమును ప్రతిపాదించుచు ధర్మార్థకామమోక్షములనెడి పురుషార్థ చతుష్టయమును సమకూర్చుచున్నది. ''పురాణం వైష్ణవం త్వేతత్ సర్వకిల్బిష నాశకం | విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదకమ్'' (బ్ర.పు. 246 అధ్యా. 20 శ్లో) విష్ణుదేవతాకమగు నీ బ్రహ్మపురాణము సర్వపాపాపనోదకమును, సర్వపురాషార్థసంధాయకము నగుటలో సర్వశాస్త్రములకంటె విశిష్టము. బ్రహ్మపురాణము నందు 246 అధ్యాయములు గలవు. ఇందుసర్గము - ప్రతిసర్గము - వంశము-మన్వంతరములు - భూమ్యాది సంస్థానము (భూమి, ద్వీప, పర్వత, నదీ, సముద్ర పుణ్యతీర్థక్షేత్రాది సంస్థానములు) విశదముగ వివరింపబడెను. అనేక నదీనదముల వివరించుచు శ్రీ గౌతమీ మహాత్మ్యము 106 అధ్యాయములలో వర్ణింపబడినది. అనేక క్షేత్రముల వర్ణించుచు, పురుషోత్తమక్షేత్రమని ప్రసిద్ధిగాంచిన శ్రీపురీ జగన్నాధ క్షేత్ర మహాత్మ్యము విశేషముగ వర్ణింపబడినది. సృష్టిక్రమ ప్రదిపాదనముతో నారంభింపబడిన యీ పురాణము నైమిత్తిక - ప్రాకృత - అత్యంతిక రూపత్రివిధ ప్రతిసంచరము (ప్రళయ) ల క్రమమును ప్రతిపాదించుటతో ముగింపబడినది. కావున ఉపక్రమోప సంహారములకు సమన్వయము చక్కగ కుదురుచున్నది. సృష్టిప్రళయమును, ఉత్పత్తి వినాశములు స్వాభావికములు. ఈ అనాది సంసారమునందు పుట్టుట గిట్టుటయను వానిలో జీవుడు చక్రనేమి క్రమమున తిరుగుచుండునని తెలిసికొనుటలో పురాషార్థ సిద్ధి యేమియు లేకుండుటను గమనించి, పరమపురుషార్థ సాధనముగా 235 అధ్యాయమునుండి 245 అధ్యాయము వరకు 11 అధ్యాయములలో యోగసాధనము ప్రతిపాదింపబడినది. ఈ విషయమై మునులొక విషయమడిగిరి- ఇదానీం బ్రూహి! యోగం చ దుఃఖ సంయోగ భేషజం | యం విదిత్వా೭ వ్యయం తత్ర యుంజామః పురుషోత్తమమ్ || (బ్ర.పు.235 అ.1) ఇపుడు మాకు దుఃఖప్రాప్తి నివారణౌషధమగు యోగమును చెప్పుము. దానిని తెలిసికొని యవ్యయుడగు పురుషోత్తముని చేరగలము. ఈ విధముగ పరమపురుషార్థ సాధన ప్రతిపాదనముతో నీ పురాణము ముగింపబడినది. మరియు నిందు ప్రాసంగికముగ వర్ణాశ్ర మాచార ధర్మములు చక్కగ విశదీకరింపబడినవి. 235 నుండి 245 అధ్యాయము వరకు గల 11 అధ్యాయములలో యోగసాంఖ్యములను పరస్పర సమన్వయముతో సమన్వయించురీతి చమత్కారజనకముగనున్నది. ఏకాదశ (11) సంఖ్యకొక విశిష్టత గలదు. కర్మేంద్రియ పంచకము, జ్ఞానేంద్రియ పంచకము, తత్ప్రవర్తకమగు అంతఃకరణము మొత్తము 11 గదా! పురీ జగన్నాధ క్షేత్రగత భగవానుడు పురుషోత్తముడు. మనదేహక్షేత్రగత క్షేత్రజ్ఞుడును భగవంతుడే. పురుషోత్తమతత్త్వము భగవద్గీతయందు విస్పష్టముగ ప్రతిపాదితము. పరమాత్మ సర్వక్షేత్రములందును ప్రవేశించినట్లుండియు తద్దోష స్పర్శ లేకుండుటచే ఉత్తముడే. ఇట్లు క్షరాక్షర వివేచన పూర్వకముగ పురుషోత్తమ తత్త్వమును తత్సాధనములను బోధించు నీ బ్రహ్మపురాణము సర్వపురాణ రాజమనదగును. దీనిని సర్వపురుషార్థ సాధకమగునను దృష్టితో పాఠక మహాజనులు ఆదరముతో పఠించి తత్ఫలము నందుకొని, యేతత్పురాణ కర్తయొక్కయు, అనువాద కర్తల యొక్కయు కారయితలగు వదాన్యశేఖర శ్రీ పల్లంపాటి వేంకటేశ్వర మహోదయులయొక్కయు, సహాయకులయొక్కయు శ్రమను సఫలము కావింతురుగాక|. ఇతిశమ్. బుధజన విధేయః విద్వాన్ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి వ్యాకరణ విద్యాప్రవీణః, సాహిత్య విద్యాప్రవీణః వేదాంత విశారదః