Sri Devi Bhagavatam-1
Chapters
అథ వింశో%ధ్యాయః అథా%ద్భుతం వీక్ష్య మునే! ప్రభావం దేవ్యా జగచ్ఛాంతి కరం వరం చ న తృప్తి రస్తి ద్విజవర్య శృణ్వతః కథా%మృతం తే ముఖపద్మ జాతమ్.
1 అంతర్హితాయాం చ తదా భవాన్యాం చక్రుశ్చకం దేవపురోగమా స్తే దేవ్యాశ్చరిత్రం పరమం పవిత్రం దురాపమేవాల్ప పుణ్యౖర్న రాణామ్.
2 కస్తృప్తి మాప్నోతి కథా%మృతేన భిన్నో%ల్పభాగ్యాత్పటు కర్ణరంధ్రః పీతేన యేనామరతాం ప్రయాతి ధిక్తాన్నరాన్యే న పిబంతి సాదరమ్.
3 లీలాచరిత్రం జగదంబికాయా రక్షాన్వితం దేవ మహామునీనామ్ సంసారవార్ధే స్తరణం నరాణాం కథం కృతజ్ఞా హి పరిత్యజేయుః.
4 ముక్తాశ్చ యేచైవ ముముక్షవశ్చ సంసారిణో రోగయుతాశ్చ కేచిత్ తేషాం సదా శ్రోత్రపుటై శ్చ పేయం సర్వార్థదం వేదవిదో వదంతి.
5 తథా విశేషేణ మునే నృపాణాం ధర్మార్థకామేషు సదారతానామ్ ముక్తా శ్చ య స్మాత్ఖలు తత్పిబంతి కథం న పేయం రహితైశ్చ లేభ్యః.
6 యైః పూజితా పూర్వభ##వే భవానీ సత్కుందుపుషై#్ప రథ చంపకై శ్చ బైల్వైర్దలై స్తే భువి భోగయుక్తా నృపాభవంతీత్యనుమేయమేవమ్.
7 యే భక్తిహీనాః సమవాప్య దేహం తం మానుషం భారతభూమిభాగే యై ర్నార్చితా తే ధనధాన్యహీనా రోగాన్వితాః సంతతివర్జితాశ్చ.
8 భ్రమంతి నిత్యం కిల దాసభూతా ఆజ్ఞాకరాః కేవలధారవాహాః దివానిశం స్వార్థపరాః కదా%పి నైవాప్నువంత్యౌదర పూర్తి మాత్రమ్.
9 అంధాశ్చ మూకా బధిరాశ్చఖంజాః కుష్ఠాన్వితా యే భువి దుఃఖభాజః తత్రానుమానం కవిభి ర్విధేయం నారాధితా తైః సతతం భవానీ.
10 యేరాజభోగాన్వితబుద్ధిపూర్ణాః సంసేవ్యమానా బహుభిర్మనుషై#్యః| దృశ్యంతి యే వా విభ##వైః సమేతాసై#్తః పూజితా%ంబే త్యనుమేయమేవ.
11 తస్మాత్సత్యవతీసూనో! దేవ్యా శ్చరిత ముత్తమమ్ | కథయ స్వ కృపాం కృత్వా దయావానసి సాంప్రతమ్.
12 హత్వా తం మహిషం పాపం స్తుతా సంపూజితా సురైః | క్వ గతా సా మహాలక్ష్మీః సర్వతేజఃసముద్భవా.
13 కథితం తే మహాభాగ గతా%ంతర్ధాన మాశు సా | స్వర్గే వా మృత్యులోకే వా సంస్థితా భువనేశ్వరీ.
14 లయం గతా వా తత్రైవ వైకుంఠే వా సమాశ్రితా | అథవా హేమ శైలే సా తత్తతో మే వదాధునా.
15 ఇరువదవ యధ్యాయము మహిష వధానంతరము ప్రజల ధర్మప్రవృత్తి జనమేజయు డిట్లు ప్రశ్నించెను : మునిసత్తమా ! శ్రీదేవీ దివ్యచరిత కథామృతరసము శాంతికరము-హితకరము-మహాద్భుతము. దానిని మీ ముఖకమలమునుండి యెంత గ్రోలినను తనివి తీరుటలేదు. అట్లు భవాని యంతర్ధానము జెందిన పిమ్మట దేవత లేమి చేసిరి? నాకు సర్వము తెలుపుము. దేవీ పరమపావన పుణ్యచరిత మల్పపుణ్యముగలవారికి లభ్యముగాదు గదా! అది యల్పభాగ్యునకు సాధ్యము కానేకాదు. ఇక భక్తిప్రపత్తులతో వినువాడు దేవీ మధుర కథారసామృత మెంతయని క్రోలగలడు! ఎంతయిన తనియగలడు! ఏ సత్కథామృతము గ్రోలిన అమరత్వమబ్బునో యట్టి దాని నాస్వాదింపని వానిజన్మ మెన్ని జన్మములకును వ్యర్థమే కదా! జగదంబికా లీలా చరిత్రము ముక్కోటి దేవతలకును మునులకును శ్రీరామరక్ష. సంసారసాగరమందలి నరులను దాటించు నావ. అట్టి దానిని కృతజ్ఞు లేల వదలుకొందురు? దేవీ దివ్యలీలలు నవరస భరితములు-కోర్కులీడుర్చునవి. ముముక్షులు-రోగులు-సంసారులు-ప్రతివాడును వినదగినవి అని పండితులందురు. దేవీ మహిమములను ధర్మార్థకామనిరతులగు రాజులు తప్పక సావధానముగ వినవలయును. ముక్తసంగులును దేవీ మహిమామృతము గ్రోలుదురే! ఇక పామరుడేల క్రోలడు? తొంటి పుట్టువున శ్రీజగదంబ నెవరు కుంద-చంపక-బిల్వ సుమదళములతో పూజించిరో వారలీ జన్మమున భరతభూమిపై రాజభోగము లనుభవింతురు. ఈ పరమ పావనమైన కర్మభూమిపై మనుజుడై పుట్టినవాడు శ్రీజగదంబ నర్చింపనిచో వాడు ధనధాన్య సంతానహీనుడై రోగియై యలమటించును. అట్టివారు దాసులుగ పరాజ్ఞాకరులుగా బరువులు మోయువారుగ రేబవళ్ళు శ్రమించువారుగ స్వార్థపరులుగ జీవింతురు. ఐనను వారి పొట్టలు పూర్తిగ నిండవు. నేటి కుంటి-గ్రుడ్డి-చెవిటి-మూగ-కుష్ఠరోగి-నిత్యదరిద్రుడు-మున్నగువారినిగని వీరు తొల్లి యాతల్లిని సేవించినవారుకారని తెలిసిన వారు తలంపవలయును. నేడు రాజభోగములతో సకల సంపదలతో తులతూగుచు పెక్కుమందిచే సేవింపబడువారు గలరు. వీరు పూర్వమా లోకమాతను గొల్చిన వారని తలంపవలయును. కావున సత్యవతీనందనా! దయామయా! నాయందు దయయుంచి నాకు విచిత్రమైన దేవీదివ్య చరిత్రము తేనెలొలుక తేటతేటలుగ వినిపింపుము. అట్లు సర్వజ్యోతుల మేళనమున నవతరించిన మహాలక్ష్మి పాపాత్ముడగు మహిషుని దెగటార్చి దేవసన్నుతయై పిమ్మట నెచ్చటికేగెనో తెలుపుము. మహాత్మా! ఆ త్రిభువనేశ్వరి వేగముగ నంతర్ధానమందెనంటివి. ఇపుడామె స్వర్గలోకమందుండునా? లేక మనుజలోకము నందుండునా? ఆ దేవతామయి యచ్చోటనే అదృశ్యయైనాదా? విష్ణులోకము జేరినదా? హిమాలయమునకేగినదా? నాకిపుడు నిజము తెలుపుము. వ్యాసః: పూర్వం మయా తే కథితం మణిద్వీపం మనోహరమ్ | క్రీడాస్థానం సదా దేవ్యా వల్లభం పరమం స్మృతమ్. 16 యత్ర బ్రహ్మా హరిః స్థాణుః స్త్రీభావం తే ప్రపేదిరే | పురుషత్వం పునః ప్రాప్య స్వాని కార్యాణి చక్రిరే. 17 యః సుధాసింధు మధ్యే%స్తి ద్వీపః పరమ శోభనః | నానారూపైః సదా తత్ర విహారం కురుతే%ంబికా. 18 స్తుతా సంపూజితా దేవైః సా తత్రైవ గతా శివా | యత్ర సంక్రీడతే నిత్యం మాయా శక్తిః సనాతనీ. 19 దేవా స్తాం నిర్గతాం వీక్ష్య దేవీం సర్వేశ్వరీం తధా | రవి వంశోద్భవం చక్రు ర్భూమిపాలం మహాబలమ్. 20 అయోధ్యాది పతిం వీరం శత్రుఘ్నం నామ పార్థివమ్ | సర్వలక్షణసంపన్నం మహిషస్యాసనే శుభే. 21 దత్త్వా రాజ్యం తదా తసై#్మ దేవా ఇంద్ర పురోగమాః | స్వకీయై ర్వాహనైః సర్వే జగ్ముః స్వాన్యాలయాని తే. 22 గతేషు తేషు దేవేషు పృథివ్యాం పృథివీపతే | ధర్మరాజ్యం బభూవాథ ప్రజా శ్చ సుఃతా స్తథా. 23 పర్జన్యః కాలవర్షీ చ ధరా ధాన్యగుణావృతా | పాదపాః ఫలపుష్పాఢ్యా బభూవుః సుఖదాః సదా. 24 గావ శ్చ క్షీర సంపన్నా ఘటోధ్న్యః కామదా నృణామ్ | నద్యఃసుమార్గగాః స్వచ్ఛాః శీతోదాఃఖగసంయుతాః. 25 బ్రాహ్మణా వేదతత్త్వా శ్చ యజ్ఞ కర్మరతా స్తథా | క్షత్రియా ధర్మ సంయుక్తా దానాధ్యయన తత్పరాః. 26 శస్త్రవిద్యారతా నిత్యం ప్రజారక్షణతత్పరాః | న్యాయదండధరా సర్వే రాజానః శమసంయుతాః. 27 వ్యాసుడిట్లనెను : రాజా! మున్ను నీకు సుమనోహరమైన మణిద్వీపముగూర్చి తెలిపితివి. ఆ ద్వీప మనంతకోటి బ్రహ్మాండ జననికి పరమప్రియమైనది. తొల్లి హరిహరబ్రహ్మ లచ్చోటనే స్త్రీభావము లొందిరి. వారు పిదప దయామతల్లి యగు దేవీకృపవలన మరల పురుషత్వమంది తమ తమ పనులు నిర్వహించుచున్నారు. ఆ సుందరదివ్యమణిద్వీపము సుధాసాగరము నడుమ వెలుగొందుచున్నది. అందు సకల వర్ణసంశోభినియగు దేవి పలురూపముల విహరించుచుండును. కామ రూప-మాయాశక్తి-సనాతనియగు భవాని నిత్యమే మణిద్వీపమందు విరాజిల్లునో యా ద్వీపమునకే దేవతల వలన పూజాస్తుతులందుకొనిన మహిషాసుర మర్దిని యరిగెను. ఆ సర్వేశ్వరి అదృశ్యయైన పిదప దేవతలొక రాజును చేరిరి. అతడు రవివంశజుడు-బలిశాలి-సకల శుభ లక్షణ లక్షితుడు-అయోధ్యాధిపతియగు శత్రుఘ్నుడు. దేవతలతనిని మహిషాసురుని రాజ్యమున కధిపతిగ జేసిరి. అట్లతనికి రాజ్యమప్పగించి యింద్రాది దేవతలు తమ తమ వాహనములెక్కి నిలయముల కరిగిరి. సురులు వెడలినపిదప భూమండలమున ధర్మరాజ్యము నెలకొల్పబడెను. ప్రజలు సుఖముండిరి. మేఘము లదనునకు వానగురియు చుండెను. నేల నాల్గుచెఱగులు పాడి-పంటలతో నిండెను. చెట్లు ఫలపుష్పములతో సుఖదాయకములయ్యెను. ఆలమందల పాలపొదుగులు నిండుకుండలవలెనుండి జనుల కోర్కులు తీర్చుచుండెను. చల్లని నిర్మలోదకముచే నొప్పుచు జంతువులకు ప్రీతి గూర్చుచు తిన్నని మార్గమున ప్రవహించు చుండెను. విప్రులు వేదతత్త్వములు నెరిగి యజ్ఞకార్యము లందు మునిగిరి. రాజులు శస్త్ర విద్యానిపుణులు-ప్రజారక్షణ పరాయణులు-న్యాయతత్పరులు-దండనీతి పరులునై యుండిరి. అవిరోధ స్తు భూతానాం సర్వేషాః సంబభూవ హ | ఆకరా ధనదా నౄణాం ప్రజా గోయూథసంయుతాః. 28 బ్రాహ్మణాః క్షత్త్రియా వైశ్యాః శూద్రాశ్చ నృపసత్తమ | దేవీభక్తి పరాః సర్వే సంబభూవు ర్ధరాతలే. 29 సర్వత్ర యజ్ఞయూపా శ్చ మండలాశ్చ మనోహరాః | మఖైః పూర్ణాధరాశ్చాసన్ బ్రాహ్మణౖఃక్షత్రియైః కృతైః. 30 పతివ్రతధరా నార్యః సుశీలాః సత్యసంయుతాః | పితృభక్తిపరాః పుత్త్రా ఆసన్ధర్మపరాయణాః. 31 న పాఖండం న వా%ధర్మః కుత్రాపి పృథివీతలే | వేదవాదాః శాస్త్రవాదా నాన్యే వాదా స్తథా%భవన్. 32 కలహో నైవ కేషాం చి న్న దైన్యం నాశుభామతిః | సర్వత్ర సుఃనో లోకాః కాలే చ మరణం తథా. 33 సుహృదాం న వియోగశ్చ నాపద శ్చ కదాచన | నా%నావృష్టి ర్న దుర్భిక్షం న మారీ దుఃఖదా నృణామ్. 34 న రోగో న చ మాత్సర్యం న విరోధః పరస్పరమ్ | సర్వత్ర సుఖసంపన్నా నరా నార్యః సుఖాన్వితా. 35 క్రీడంతి మానవాః సర్వే స్వర్గే దేవగణా ఇవ | న చోరా నైవ పాఖండా పంచకా దంభకా స్తథా. 36 పిశునా లంపటాః స్తబ్ధా న బభూవు స్తదా నృప | న వేదద్వేషిణః పాపా మానవాః పృథివీపతే. 37 సర్వధర్మరతా నిత్యం ద్విజసేవాపరాయణాః | త్రిధాత్వాత్సృష్టి ధర్మస్య త్రివిధా బ్రాహ్మణా సత్తః. 38 భూతములలో వేటి యందును పరస్పరము వైరభావము లేకుండెను. పెన్నిధులు ధనరాసు లొసగుచుండెను. గొల్లపల్లె లాలమందలతో కళకళలాడుచుండెను. భూమి యందంతటను నాల్గువర్ణములవారును శ్రీదేవీభక్తిపరులై యుండిరి. భూమి యెల్లెడల బ్రాహ్మణ క్షత్రియులు గొప్ప యజ్ఞము లాచరించిరి. యాగశాలలు యూపస్తంభములతో నలరారుచుండెను. స్త్రీలు శీలవతులు-పతివ్రతలు-సత్యసంపన్నులునై యుండిరి. పుత్త్రులు పితృభక్తిపరులు-ధర్మపరాయణులునై వర్తించిరి. ఎచ్చటను నాస్తికత్వముగాని యధర్మముగాని లేకుండెను. ఎల్లెడల వేదశాస్త్రవాదములు వినిపించుచుండెను. ఎవరిలోను కలహము-దైన్యము-చెడుతలంపులేవు. అకాలమరణములు లేవు. ప్రజానీకమంతయును సుఖశాంతులతో వర్ధిల్లెను. ప్రజల కెన్నడును తమ మిత్రులవలన వియోగముగాని-యాపదగాని గలుగకుండెను. దుఃఖదాయకములగు కరవుకాటకములు-అనావృష్టి-మారీరోగములు లేకుండెను. స్త్రీ పురుషు లెల్లరు నెల్లెడల మచ్చరము వైరముమాని యే రోగములు లేక సుఖసంపదలతో నభివర్ధిల్లిరి. వేయేల? అతని పాలనలో స్వర్గమందలి యమరులవలె మనుజులు క్రీడావినోదము లనుభవించిరి. ఆనాడు భూమిపై దొంగ-నాస్తికుడు-వంచకుడు-దాంభికుడు-లోభి-చపలుడు-మందుడు- బ్రహ్మద్వేషి-పాపి మున్నగు వారెవరును లేకుండిరి. ఆనాళ్లలో మనుజు లెల్లరును ధర్మపరులై బ్రాహ్మణ సేవా పరాయణులై యుండిరి. ఈ సృష్టి మూడు విధములుగ నుండును. అటులే బ్రాహ్మణులు మువ్విధములుగ నుందురు. సాత్త్వికా రాజసా శ్చైవ తామసాశ్ఛ తథా%పరే | సర్వే వేదవిదో దక్షాః సాత్త్వికా సత్త్వవృత్తయః. 39 ప్రతిగ్రహవిహీనా శ్ఛ దయాదమపరాయణాః | యజ్ఞాం స్తే సాత్త్వికై రన్నైః కుర్వాణా ధర్మతత్పరాః. 40 పురోడాశవిధానై శ్చ పశుభి ర్న కదాచన | దాన మధ్యయనం చైవ యజనం తు తృతీయకమ్. 41 త్రికర్మరసికా స్తే వై సాత్త్వికా బ్రాహ్మణా నృప | రాజసా వేదవిద్వాంసః క్షత్త్రియాణాం పురోహితాః. 42 షట్కర్మనిరతాః సర్వే విధివన్మాంసభక్షకాః | యజనం యాజనం దానం తథైవ చ ప్రతిగ్రహః. 43 అధ్యయనం తు వేదానాం తథైవాధ్యాపనంతు షట్ | తామసాః క్రోధసంయుక్తా రాగద్వేషపరాః పునః. 44 రాజ్ఞాం కర్మకరా నిత్యం కించిదధ్యయనే రతాః | మహిషే నిహతే సర్వే సుఃనో వేదతత్పరాః. 45 బభూవు ర్ర్వతనిష్ణాతా దానధర్మపరా స్తథా | క్షత్త్రియాః పాలనే యుక్తా వైశ్యా వణిజవృత్తయః. 46 కృషి వాణిజ్య గోరక్షా కుసీదవృత్తయః పరే | ఏవం ప్రముదితో లోకో మహిషే వినిపాతితే. 47 అనుద్వేగః ప్రజానాం వై సంబభూవ ధనా%%గమః | బహుక్షీరాః శుభా గావో నద్యశ్చైవ బహూదకాః. 48 వృక్షా బహుఫలా శ్చాస న్మానవా రోగవర్జితాః | నా%%ధయో నేతయః క్వా%పి ప్రజానాం దుఃఖదాయకాః. 9 న నిధన ముపయాంతి ప్రాణిన స్తే%ప్యకాలే సకలవిభవయుక్తా రోగహీనాః సదైవ నిగమ విహితధర్మే తత్పరా శ్చండికాయా శ్చరణ సరసిజానాం సేవనే దత్తచిత్తాః. 50 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే వింశో%ధ్యాయ. వారు సాత్త్వికులు-రజసులు-తామసులని మూడు విధములగలరు: వేదార్థవిదులు-సకల సమర్థులు-స్త్వ వృత్తి గలవారు సాత్విక ద్విజులు. వీరొకరినుండి యేమియు గ్రహింపరు; దయా ధర్మశాంతిపరులు. ఆత్మవిచారరతులు న్యాయార్జిత ధనములతో సాత్త్వికభావమున పురోడాశాదికముతో యాగము లొనర్తురు. పశుహింస జేయరు. బ్రాహ్మణులకు ముఖ్యమైనవి మూడు కర్మములు. అవి దానము-అద్యయనము-యజ్ఞము. సాత్త్విక బ్రాహ్మణులీ త్రివిధ కర్మము లాచరింతురు. రాజసిక విప్రులును వేదవిదులై యుందురు. వీరు క్షత్రియులకు పురోహితులుగ నుందురు. షట్కర్మనిరతులై విధి విధానమున మాంస భక్షణ మొనర్తురు; యజన-యాజనములు-దాన-ప్రతిగ్రహములు-అధ్యయనాధ్యాపనము లొనర్తురు. తామసద్విజులు రాగద్వేషములకు కామక్రోధములకు వశులైయుందురు. వీరు కొలదిగ చదువుకొని గొప్ప గొప్ప రాజులకు పనులు చేయుచుందురు. మహిషు డంతమొందిన పిదప విప్రులందఱును వేదతత్పరులైరి. వారు దానధర్మవ్రతము లనుష్ఠించుచుండిరి. క్షత్రియులు సముచితముగ పాలించిరి. వైశ్యులు వాణిజ్య వృత్తిలో మునిగియుండిరి. శూద్రులు వ్యవసాయము-గోరక్షణ-వడ్డీవ్యాపారములు చేయుచుండిరి. ప్రాణులెల్లరును సుఖముగ నిద్రించిరి. ప్రజలు కోపోద్రేకములు మానిరి. న్యాయముగ డబ్బు సంపాదించిరి. ఆవులు బహుక్షీరములతో నొప్పెను. నదులు శాంతముగ ప్రవహింపసాగెను. వృక్షములు ఫలభరములతో వంగియుండెను. ప్రజలు రోగములు లేకుండిరి. వారి కీతిబాధలు-ఆధివ్యాధులు లేవు. ఇట్లు ప్రాణు లెల్లరు నకాలమరణము లేక రోగ రహితులై వేద ధర్మానుసారముగ వ్యవహరించిరి. వారు హ్రీంకారిణియగు చండికయొక్క పద-కమల సేవయందు నిరతులై సకల విభవ సంపన్నులై విలసిల్లిరి. ఇది శ్రీమద్దేవీ భాగవత మందలి పంచమ స్కంధమందు మహిష వధానంతరము ప్రజల ధర్మ ప్రవృత్తియను నిరువదవ యధ్యాయము.