Sri Devi Bhagavatam-1
Chapters
అథ ద్వావింశో%ధ్యాయః పరాజితాః సురాః సర్వే రాజ్యం శుంభః శశాస హ | ఏవం వర్ష సహస్రంతు జగామ నృపసత్తమ.
1 భ్రష్టరాజ్యా స్తతో దేవా శ్చింతామాపుః సుదుస్తరామ్ | గురు దుఃఖాతురాస్తే తు పప్రచ్ఛు రిదమాదృతాః.
2 కిం కర్తవ్యం గురోబ్రూహి సర్వజ్ఞ స్తవం మహామునిః | ఉపాయో%స్తి మహాభాగ దుఃఖస్య వినివృత్తయే.
3 ఉపచారపరా నూనం వేదమంత్రాః సహస్రశః | వాంచితార్థకరా నూనం సూత్రైః సంలక్షితాః కిల.
4 ఇష్టయో వివిధాః ప్రోక్తాః సర్వకామఫలప్రదాః | తాం కురుష్వ మునే నూనం త్వం జానాసి చ తత్క్రియాః.
5 విధిః శత్రు వినాశాయ యథోద్దిష్టః సదాగమే | తం కురుష్వాద్య విధివ ధ్యథా నో దుఃఖ సంక్షయః.
6 భ##వే దాంగిరాసాద్యైవ తథా త్వం కర్తు మర్హసి | దానవానాం వినాశాయ అభిచారం యథామతి.
7 బృహస్పతిః: సర్వే మంత్రాశ్చవేదోక్తా దైవాధీన ఫలాశ్చ తే | న స్వతంత్రాః సురాధీశ తథై కాంతఫలప్రదాః.
8 మంత్రాణాం దేవతా యూయం తే తు దుఃఖైకభాజనమ్ | జాతాః స్మ కాలయేగేన కిం కరోమి ప్రసాధనమ్.
9 ఇంద్రాగ్ని వరుణాధీనం యజనం యజ్ఞ కర్మసు | తే యూయం విపదః ప్రాప్తాః కరిష్యంతి కిమిష్టయః.
10 అవశ్యం భావిభావానాం ప్రతికారో న విద్యతే | ఉపాయ స్త్వథ కర్తవ్య ఇతి శిష్టానుశాససనమ్.
11 దైవం హి బలవత్కేచి త్ప్రవదంతి మనీషిణః | ఉపాయవాదినో దైవం ప్రవదంతి నిరర్థకమ్.
12 దైవం చ వాప్యుపాయశ్చ ద్వావేవాభిమతౌ నృణామ్ | కేవలం దైవం మాశ్రిత్య న స్థాతవ్యం కదాచన.
13 ఇరువది రెండవ యధ్యాయము దేవతలు శ్రీదేవిని సంస్తుతించుట రాజా ! అట్లు దేవత లెల్ల రోడిపోవగ శుంభుడు వేయేండ్లు పాలించెను. అపుడు రాజ్యభ్రష్టులైన సురలు దుర్భర దుఃఖసాగరమున మునిగి బ్రహస్పతిని జేరి యిట్లనిరి: 'గురూ! నీవు మహామునివి; సర్వజ్ఞుడవు. మాకిపుడు దుఃఖము తొలగునట్టి యుపాయమును కర్తవ్యమును దెలుపుము. వేదమంత్రము లనంతములుగ గలవు. వానిని ససూత్రముగ నిష్ఠతో నాచరించినచో నవి వాంఛితము లీడేర్చును. కోరికలు దీర్చునట్టి యజ్ఞములు పెక్కులు గలవు. నీవు వాని నన్నిటి నెఱుగుదువు. కనుక నీవు వానిని మా శ్రేయమున కొనరింపుము. వేదమున శత్రునాశమునకు మంత్రములు చెప్పబడినవి. ఆ పద్ధతులను నీవు విధిగ మా దుఃఖనాశమునకు మా బ్రదుకు వెల్గునకు నిర్వహింపుము. దానవ వినాశమున కభిచారకృత్యములు చేయుటకు నీవే సమర్థుడవు' అన బృహస్పతి యిట్లనెను : 'సురలారా! సకల వేదోక్త మంత్రములును దైవాధీనములు. అవి స్వతంత్రములు గావు. అవి నియమబద్ధములైనపుడే ఫలము లొసంగును. ఎల్ల మంత్రములకు దేవతలు మీరలు. అట్టి మీరు బలిష్ఠమైన కాలవశమున దుఃఖముల పాలైతిరి గదా! ఇక నేనుమాత్రమేమి చేయగలను? యాగము లన్నిటియందు నింద్రాగ్ని వరుణులను మిమ్ము గూర్చి వేల్తురు గద! అట్టి మీరే యిపుడు విపత్తులోనుండగ నిక జన్నములెట్లు సాగును? జరుగవలసిన దాని కెన్నడును ప్రతీకారము జరుగజాలదు. కాని, యట్టి పరిస్థితియందు నుపాయ మవలంబింపవచ్చునని శిష్టులందురు. కొందఱు సారమతులు దైవమే బలవత్తరమైన దందురు. కాని, కొందఱది వ్యర్థము పురుషకారమే గొప్పదని వాదింతురు. ఉపాయము-దైవము-రెండును నరుల కావశ్యకములే. కేవలము దైవము మీదనే యాధారపడి యుండరాదు. ఉపాయః సర్వథా కార్యో విచార్య స్వధియా పునః | తస్మా ద్ర్బవీమి వః సర్వా న్సం విచార్య పునః పునః.
14 పురా భగవతీ తుష్టా జఘాన మహిషాసురమ్ | యుష్మాభి స్తు స్తుతా దేవీ వరదానం దదా వధ
15 ఆపదం నాశయిష్యామి సంస్మృతా వా సదైవ హి | యదా యదా వో దేవేశా ఆపదో దైవసంభవాః. 16 ప్రభవంతి తదా కామం స్మర్తవ్యా%హం సురైః సదా | స్మృతా%హం నాశయిష్యామి యుష్మాకం పరమాపదః. 17 తస్మా ద్ధిమాచలే గత్వా పర్వతే సుమనోహరే | ఆరాధనం చండికాయాః కురుధ్వం ప్రేమపూర్వకమ్. 18 మాయా బీజ విధానజ్ఞా సత్పురశ్చరణ రతాః | జానా మ్యహం యోగబలా త్ప్రసన్నా సా భవిష్యతి. 19 దుఃఖ స్యాంతో%ద్య యుష్మాకం దృశ్యతే నాత్ర సంశయః | తస్మిన్ శైలే సదా దేవీ తిష్ఠతీతి మయా శ్రుతమ్. 20 స్తుతా సంపూజితా సద్యో వాంఛితార్థా న్ప్రదాస్యతి | నిశ్చయం పరమం కృత్వా గచ్ఛధ్వం వై హిమాచలమ్. 21 సురాః సర్వాణి కార్యాణి సా వః కామం విధాస్యతి | ఇతి తస్య వచః శ్రుత్వా దేవాస్తే ప్రయయు ర్గిరిమ్. 22 హిమాలయం మహారాజ దేవీధ్యాన పరాయణాః | మాయాబీజం హృదా నిత్యం జపంతః సర్వ ఏవ హి. 23 నమశ్చక్రు ర్మహామాయాం భక్తానా మభయప్రదామ్ | తుష్టువుః స్తోత్ర మంత్రై శ్చ భక్త్యా పరమయా యుతాః. 24 కనుక నెల్ల విధముల బుద్ధితో చక్కగ నుపాయ మాలోచించియే చేయవలయును. నేను మీతో పల్మారు దూరమాలోచించియే పలుకుచున్నాను. పూర్వము దుర్గాభవాని మహిసాసురు నంతమొందించెను. అపుడు మీ రా తల్లిని నుతింపగ నామే మీకిట్లు వరప్రదానము చేసెను : దేవతలారా! నన్ను సంస్మరింపుడు. మీ యాపద లెల్ల తొలగును. మీ కెప్పుడైన దైవికముగ సంకటములు గల్గవచ్చును. అపుడు మీరు నన్నే స్మరింపుడు. మీ బాధలన్నిటిని బాపగలను. కాన, మీరిపుడు సుమనోహరమగు హిమగిరికేగి కామకళాస్వరూపిణియగు శ్రీచండికాదేవిని శ్రద్ధాభక్తులతో సేవింపుడు. మీరు మాయాబీజ విధాన మెఱిగి దానిని పునశ్చరణ చేయుడు. ఆ నామపారాయణ ప్రీతియగు దేవి మీ యెడల సుప్రసన్నయగునని నేను యోగబలమున నెఱింగితిని. దాన మీ క్లేశములు తప్పక గట్టెక్కును. ఆ మహాకైలాస నివాసియగు దేవి నిరంతరము హిమాలయముపై కాపుర ముండునని విందుము. మీరు కాత్యాయనిని పూజించి సంస్తుతింపుడు. మీ వాంఛితము లీడేరును. ఇపుడు వేగమే మీరు కలసికట్టుగ హిమగిరికేగ నిశ్చయించుకొనుడు. ఆ దుర్గాదేవి మీ పనులన్నిటిని చక్కబెట్టును' అను గురుని వాక్యములు విని యమరులు హిమనగరమున కేగిరి. వారచ్చట మాయాబీజమును తమ హృదయకమలములందు నిల్పుకొనిరి. హ్రీంమయి-మాయబీజ నివాసిని యగు తల్లిని ధ్యానింప గడంగిరి. వారు పరమభక్తుల కోర్కులు దీర్చు మహామాయను పరమభక్తితో నమస్కరించి మంత్రములతో నిట్లు సంస్తుతించిరి: నమో దేవి విశ్వేశ్వరి ప్రాణనాథేమదానందరూపే సురానందదే తే నమో దానవాంతప్రదే మానవానా మనేకార్థదే భక్తిగమ్య స్వరూపే. 25 న తే నామ సంఖ్యా న తే రూపమీదృక్తథా కో%పి వేదాది దేవస్వరూపే త్వమేవాసి సర్వేషు శక్తి స్వరూపా ప్రజాసృష్టి సంహారకాలే సదైవ. 26 స్మృతిస్త్వం ధృతిస్త్వం త్వమేవా%సి బుద్ధి ర్జరా పుష్టి తుష్టీ ధృతిః కాంతిశాంతీ సువిద్యా సులక్ష్మీర్గతిః కీర్తిమేదే త్వమేవాసి విశ్వస్య బీజం పురాణమ్. 27 యదా యైః స్వరూపైః కరోషీహకార్యం సురాణాంచ తేభ్యో గమామో%ద్య శాంత్యై | క్షమా యోగనిద్రా దయా త్వం వివక్షా స్థితా సర్వ భూతేషు శ##సై#్తః స్వరూపైః. 28 కృతం కార్య మాదౌ త్వయా యత్సురాణాం హతో%సౌ మహరి ర్మదాంధో హయారిః. | దయా తే సదాసర్వదేవేషు దేవి ! ప్రసిద్ధా పురాణషు వేదేషు గీతాః. 29 కిమత్రాప్తి చిత్రం యదంబా సుతే స్వం ముదా పాలయేత్పోష యేత్సమ్యగేవ | యతస్త్వం జనిత్రీ సురాణాం సహాయా కరుషై#్వక చిత్తేన కార్యం సమగ్రమ్. 30 న వా తే గుణానా మియత్తాం స్వరూపం వయం దేవి జానీమహే విశ్వవంద్యే కృపా పాత్ర మిత్యేవ మత్వా తథా%స్మాన్భయేభ్యః సదా పాహి పాతుం సమర్థే. 31 వినాబాణపాతై ర్వినా ముష్ఠిఘాతై ర్వినాశూలఖడ్గైర్వినాశక్తి దండైః. రిపూన్హంతు మేవాసి శక్వా వినోదా త్తథా%పీహ లోకోప కారాయ లీలా. 32 ఇదం శాశ్వతంనైవ జానంతి మూఢానకార్యంవినా కారణం సంభ##వేద్వా వయం తర్కయామో%నుమానం ప్రమాణంత్వమేవాసి కర్తా%స్య విశ్వస్య చేతి. 33 అజః సృష్టికర్తా ముకుందో%వితా%యం హరో నాశకృద్వైపురాణ ప్రసిద్ధః నకిం త్వత్త్రపసూతాస్త్రయస్తే యుగాదౌ త్వమేవాసి సర్వస్య తే నైవ మాతా. 34 త్రిభి స్త్వం పురా%%రాధితా దేవి దత్తాత్వయాశ క్తిరుగ్రా చ తేభ్యః సమగ్రా త్వయా సంయుతాస్తే ప్రకుర్వంతి కామం జగత్పాలనోత్పత్తి సంహారమేవ. 35 తే కిం న మందమతయో యతయో విమూఢాస్త్వాం యేన విశ్వజననీం సముపాశ్రయంతి. విద్యాం పరాం సకలకామఫలప్రదాంతాం ముక్తిప్రదాం విబుధ బృంద సువందితాంఘ్రిమ్. 36 యే వైష్ణవాః పాశుపతాశ్చ సౌరా దంబాస్త ఏవ ప్రతిభాంతి నూనమ్ ధ్యాంతి న త్వాం కమలాం చ లజ్జాం కాంతిం స్థితి కీర్తి మథా%పి పుష్టిమ్. 37 'విశ్వేశ్వరీ! భక్తిగమ్యా! సచ్చిదానంద స్వరూపిణీ ! ప్రాణశ్వరేశ్వరీ ! అశేషదుష్టదనుజమర్దినీ ! అమరానంద ప్రదాయినీ ! నీకు నమస్కారమమ్మా! ఆదిదేవీ! నీ యనంత నామరూపము లెవ్వడు నెఱుగజాలడు. సృష్టిసంహారాది కార్యములన్నిటిలో నీవు సర్వక్రియాశక్తి స్వరూపిణివి. సర్వేశ్వరీ ! స్మృతి-ధృతి-బుద్ధి-జర-తుష్టి-పుష్టి-కాంతి-శాంతి-విద్య-లక్ష్మి-గతి-కీర్తి-మేధ-విశ్వాదిబీజము-ఇవన్నియు నీవే అమ్మా! నీ వేయే దివ్యరూపములలో విబుధుల కార్యముల నిర్వహింతువో ఆ యాయా యద్భుత రూపములకు నమస్కరించుచున్నాము. నీవు శాంతి - క్షమ-యోగనిద్ర మున్నగు సర్వరూపములతో జీవులలో నివసింతువు. నీవు తొల్లి దేవతల మహోజ్జ్వల భవిష్యత్తునకై మదాంధుడగు మహిషాసురు నంతమొందించితి, ఆనాడు నీ యనుగ్రహభాగ్య మెల్ల సురలపట్ల నుండెను. నీవు దయామతల్లివని వేదములు నుద్ఘోషించుచున్నవి. తల్లి తన తనయుని గారాబముతో లాలించి పాలించి పెంచుననుటలో నచ్చెరువేమియునులేదు. నీవు నిఃల సురలకు సహాయ మొనర్చుదానవు. ఇపుడు తప్పక నీవు మా యెల్ల కార్యములు చక్కపఱచుము. విశ్వవంద్యా! నీ యనంత గుణరూపము లత్యద్భుతములు. మేము వాని నెఱుగజాలము. మేము నీ దయకు పాత్రులము. మా భయములు పాపుము. మమ్ము బ్రోవ నీవే సమర్థురాలవు. శత్రువులను పరిమార్చుటకు నీకు బాణములు - ముష్టిఘాతములు-శూలఖడ్గములు-శక్తిదండములు మున్నగువానితో పనిలేదు. నీవు లోకోపకారమునకు యుద్ధాదులొనర్తువు. అవి నీకు లీలావినోదమాత్రములే. ఈ జగము నశ్వరమని మూఢులకును తెలియును. కారణము లేక కార్యము జరుగదు. కాన నన్నిటికి నీవే మూలకారణము ప్రమాణము నని తలంతుము. బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు సృష్టి-స్థితి-సంహారకర్తలుగా పురాణములందు ప్రఖ్యాతి వహించిరి. సృష్టికి మొదట త్రిమూర్తులను గన్నతల్లివి నీవే కదా! కనుక నీ విశ్వములకు జననివి నీవే. నీవు పూర్వము త్రిమూర్తులచే బూజింపబడితివి. వారికి పరిపూర్ణ దివ్యశక్తులు ప్రసాదించితివి. నీవు సృష్టి స్థితి సంహారవినోదవు. దేవవందితపాదకమలవు. సకల కామముక్తి ఫలదాయినివి, పరావిద్యవు. త్రిమూర్తులు నీ శక్తులనుగూడి తమ తమ పనులు చక్కగ నిర్వహించుచున్నారు. నిన్ను గొల్వనిచో యతులైనను మందమతులై మూఢులగుదురు. ఏకవు-లజ్జవు-కీర్తివి-పుష్టివి-కాంతివి-స్థితివి. నిన్ను ధ్యానింపని వైష్ణవులు-శైవులు-సౌరులు డాంబికులుగ నెన్నబడుదురు. హరిహరా దిభి రప్యథ సేవతాత్వమి హ దేవవరై రసురై స్తథా. భువి భజంతి న యో%ల్పధియో నరా జనని తే విధినా ఖలు వంచితాః. 38 జలధిజా పద పంకజ రంజనం జతురసేన కరోతి హరిః స్వయమ్ త్రినయనో%పి ధరాధరజాంఘ్రి పంకజపరాగ నిషేవణతత్పరః. 39 కిమపరస్య నరస్య కథానకై స్తవ పదాబ్జయుగం న భజంతి కే విగతరాగ గృహశ్చ దయాం క్షమాం కృతథియో మునయో%పి భజంతి తే. 40 దేవి త్వదంఘ్రిభజనే న జనా రతా యే సంసారకూపపతితాః పతితాః కిలామీ తే కుష్ఠ గుల్మ శిర ఆధియుతా భవంతి దారిద్య్రదైన్యసహితా రహితాః సుఖౌఘైః. 41 యే కాష్టభారవహనే యవసాపహారే కార్యేభవంతినిపుణాధనదారహీనాః జానీమహే%ల్పమతిభిర్భవదంఘ్రిసేవా పూర్వేభ##వేజననితైర్నకృతాకదాపి. 42 ఏవం స్తుతా సురైః సర్వైరంబికా కరుణాన్వితా | ప్రాదుర్బభూవ తరసా రూప¸°వన సంయుతా. 43 దివ్యాంబరధరా దేవీ దివ్యభూషణ భూషితా | దివ్యమాల్యసమాయుక్తా దివ్యచందన చర్చితా. 44 జగన్మోహనలావణ్యా సర్వలక్షణలక్షితా | అద్వితీయస్వరూపా సా దేవానంద దర్శనం గతా. 45 జాహ్నవ్యాం స్నాతుకామా సా నిర్గతా గిరగహ్వరాత్ | దివ్యరూపధరా దేవీ విశ్వమోహన మోహినీ. 46 దేవా స్త్పుతిపరా నాహ మేఘగం భీరయా గిరా | ప్రేమపూర్వం స్మితం కృత్వా కోకిలా మంజువాదినీ. 47 భో భోః సురవరాః కా%త్ర భవిద్భిః న్తూయతేభృశమ్ | కిమర్థం బ్రూత వః కార్యం చింతావిష్టాః కుతః పునః. 48 తుచ్ఛ్రుత్వా భాషితం తస్యా మోహితా రూపసంపదా | ప్రేమపూర్వం హృదుత్సాహా స్తామూచుః సురసత్తమాః. 49 జననీ! నీవు హరిహరాది దేవవరులచేత సేవింపబడుదువు. నిన్నీపుడమిపై కొంచెపు బుద్దివారు గొలువనోపరు. వారు నిజముగ విధివంచితులు. హరి స్వయముగ లక్ష్మియొక్క పదకమలములకు లత్తుకరంగు పూయును. శివుడును శివాచరణకమల రజము సేవింప గోరుకొనును. ఇక సామాన్యులగూర్చి చెప్పనేల? వీతరాగులు ధీమంతులు మునులు సైతము దయాక్షమాది సద్భావములతో నిన్నే సేవింతురు. కనుక లోకములందు నీ పదకమలములు సేవింపని వారెవరును లేరు. పారిజాత పరిమళములు విరజిమ్ము నీ చరణ కమలములకు పూల పూజ పచరింపని నరులు సంసారకూపనిపతితులు-పతితులు - కుష్ఠ గూల్మాది రోగ పీడితులు-దైన్య దారిద్ర సహితులు-సుఖరహితులు-నై యుందురు. తల్లీ! ఈ జన్మములో కట్టెలు గడ్డి గాదములు మోయుటలో నేర్పరులై - భార్య సంపదలు లేనివారె బుద్ధిహీనులై యున్నవారు గత జన్మములో నీ పదకమల సేవ చేయనివారని భావింతుము.' అని యీ విధముగ దేవతలెల్లరును సంస్తుతింపగా మహాతిశయ లావణ్యయగు జగదంబ వేగిరమే కనికరముతో వారికి ప్రత్యక్షమయ్యెను. శృంగార రస పూర్ణయగు దేవి దివ్యమాల్యాంబర భూషణములు దాల్చి దివ్య చందనములలందుకొని వెలుగొందు చుండెను. దేవి సర్వశుభ లక్షణములతో సాటిలేని జగన్మోహన సుందరాంగియై దేవతలకు కనులపండు వొనరించెను: ఆ విశ్వమోహన మోహిని కామకలారూపిణియగు దేవి గంగలో స్నానమాడగోరి గిరిగుహ వెడలివచ్చెను. మధుర కలకంఠియగు ఆ దేవి వాత్సల్యము చిగురింప మేఘ గంభీర వాక్కులతో తన్ను నుతించు దేవతలతో నిట్లు పలికెను సురవరులారా ! మీరిచట నెవరిని నుతించుచున్నారు? మీకేమి కావలయును? మీరేల యిట్లు దీనవదనములతో నున్నారు? అని దేవి పలుకగ సురలు దేవి సురూపశ్రీకి మొదట ముగ్ధులైరి. పిదప వారు తెల్వితెచ్చుకొని దేవి వాక్కుల కలరి భక్తినమ్రులై యామె కిట్లనిరి: దేవి స్తుమ స్త్వాం విశ్వేశి ప్రణతాః స్మ కృపార్ణవే | పాహి నః సర్వ దుఃఖేభ్యః సంవిగ్నా న్దైత్యతాపితాన్. 50 పురా త్వయా మహాదేవి నిహత్యాసురకంటకమ్ | మహిషం నో వరో దత్తః స్మర్తవ్యా%హం యదా%%పది. 51 స్మరణా ద్దైత్యజాం పీడాం నావయిష్యా మ్యసంశయమ్ | తేన త్వం సంస్మృతా దేవి నూనమస్మాహభి రిత్యపి. 52 అద్య శుంభనిశుంభౌ ద్వావసురౌ ఘోరదర్శనౌ | ఉత్పన్నౌ విఘ్న కర్తారావహన్యౌ పురుషైః కిల. 53 రక్తబీజ శ్చ జలవాం శ్చండముండౌ తథా%సురౌ | ఏతై రన్యై శ్చ దేవానాం హృతం రాజ్యం మహాబలైః. 54 గతి రన్యా న చాస్మాకం త్వమేవాసి మహాబలే | కురు కార్యం సురాణాం వై దుఃఃతానాం సుమధ్యమే. 55 దేవాస్త్వదంఘ్రిభజనే నిరతాః సదైవ తే దానవైరతిబలై ర్విపదంసు గీతాః తాన్దేని దుఃఖరహితా న్కురు భక్తి యుక్తా న్మాతస్త్వమేవ శరణం భవ దుఃఃతానామ్. 56 సకలభువనరక్షా దేవి కార్యా త్వయా%ద్య స్వకృతమితి విదిత్వా విశ్వమేతద్యుగాదౌ జనని జగతి పీడాం దానవా దర్పయుక్తాః స్వబలమదసమేతా స్తే ప్రకుర్వంతి మాతః. 57 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే ద్వావింశో%ధ్యాయః. 'దేవి! నీవు విశ్వేశ్వరివి. దయా సాగరవు. నీ కివే మా ప్రణా మాంజలులు. ఇవే మా స్తుతులు. మేము దైత్య పీడితులము. మాలో చింత మెఱమెఱలాడు చున్నది. మమ్ము దుఃఖములనుండి కాపాడు మమ్మా మహాదేవీ! తొల్లి నీవు లోక కంటకుడగు మహిషాసురుని వధించితివి. అపు డాపదలందు నన్ను స్మరింపుడని మా కభయ ప్రదాన మొనర్చితివి. నిన్ను స్మరించినంతనే దానవులవలని బాధలు తొలగింతు నంటివి. అందులకే మేమిపుడు నిన్ను స్మరించుచున్నాము. ఇపుడు శుంభ నిశుంభులను నిర్వురు ఘోరరాక్షసులు పుట్టి మా కార్యములకు విఘ్నము లొనర్చు చున్నారు. వారు పురుషులకు వధ్యులుగారు. రక్తబీజుడు-చండ ముండులు మహాబలవంతులు. వారు సురల రాజ్య మపహరించిరి. దేవదేవీ! మాకు నీవే దిక్కు. మా మొఱలాంలించి పాలించు మమ్మా! మేమాపదలలో జిక్కుకొంటిమి. మా కార్యము చక్కబెట్టుము. మాకు వేరే దిక్కెవ్వరునులేరు. అమరుల్లెవేళల నీ చరణ కమల సేవలో మగ్నులై యుందురు. ఐనను దైత్యులు వారి కాపదలు గల్గింతురు. అట్టి సురలు దుఃఃతులు-నీ యందలి నిశ్చల భక్తితత్పరులు. వారికి నీ కరావలంబ మొసగుము. వారిని దుఃఖరహితులుగ జేయుము. జననీ! విశ్వమంతయు నీచే సృజింపబడినది. అటులే యిపుడును విశ్వపరిరక్షణ నీ కవశ్య కర్తవ్యమగును. ఇది శ్రీమద్దేవీ భాగవత పంచమ స్కంధమందు వేల్పులు శ్రీదేవిని సంస్మరించుట యను నిరువది రెండవ యధ్యాయము.