Sri Devi Bhagavatam-1
Chapters
అథ ద్వాత్రింశో%ధ్యాయః జనమేజయః: మహిమా వర్ణితః సమ్యక్చండికాయాస్త్వయా మునే | కేన చారాధితా పూర్వం చరిత్ర త్రయయోగతః.1 ప్రసన్నా కస్య వరదా కేన ప్రాప్తం ఫలం మహత్ | ఆరాధ్య కామదాం దేవీం కథయస్వ కృపానిధే.
2 ఉపాసనవిధిం బ్రహ్మం స్తథా పూజావిధిం వద | విస్తరేణ మహాభాగ హోమస్య చ విధిం పునః. 3 ఇతి భూపవచః శ్రుత్వా ప్రీతః సత్యవతీ సుతః | ప్రత్యువాచ నృపం కృష్ణో మహామాయా ప్రపూజనమ్. 4 స్వారోచిషేంతరే పూర్వం సురథోనామ పార్థివః | బభూవ పరమోదారః ప్రజాపాలన తత్పరః. 5 సత్యవాదీ కర్మపరో బ్రాహ్మణానాం చ పూజకః | గురుభక్తిరతో నిత్యం స్వదారగమనేరతః. 6 దానశీలో%విరోధీ చ ధనుర్వేదైకపారగః | ఏవం పాలయతో రాజ్యం వ్లుెచ్ఛాః పర్వతవాసినః. 7 బలాచ్ఛత్రుత్వ మాపన్నాః సైన్యం కృత్వా చతుర్విధమ్ | హస్తశ్వరథ పాదాతి సహితా స్తే మదోత్కటాః. 8 కోలా విధ్వంసినః ప్రాప్తాః పృథ్వాగ్రహణ తత్పరాః | సురథః సెన్య మాదాయ సమ్ముఖః సమపద్యత. 9 తథా%పి తైర్జితో యుద్ధే దైవా ద్రాజా పరాజితః | భగ్న శ్చ స్వపురం ప్రాప్తః సురక్షం దుర్గమండితమ్. 11 చింతయామాస మేధావీ రాజా నీతివిచక్షణః | ప్రధానా న్విమనాన్ దృష్ట్వా శత్రుపక్షమాశ్రితాన్. 12 స్థాన గృహీత్వా విపులం పరిఖా దుర్గమండితమ్ | కాలప్రతీక్షా కర్తవ్యా కిం వా యుద్ధం వరం మతమ్. 13 ముప్పదిరెండవ యధ్యాయము సురథోపాఖ్యానము జనమేజయు డిట్లు వ్యాసుని ప్రశ్నించెను : మునిచంద్రా ! నీవు శ్రీచండికాదేవి మాహాత్మ్యము విపులముగ చక్కగ వివరించితివి. ఆ దేవి యొక్క మూడు చరిత్రములు మున్నెవడు తెలిసికొనెను? ఆ దేవిని మున్నెవ డారాధించెను? పూర్వమా వరదాయిని యగు దేవి నారాధించి యెవడు మహాఫలమందెను? ఆ తల్లి యెవని యెడల సుప్రసన్న మయ్యెను? దయానిధీ! నాకది యంతయు దెలుపుము. మహాత్మా! ఆ దేవి పూజాహోమ విధానములు నుపాసనాక్రమమును నాకు క్రమముగా వివరింపుము అను రాజు పలుకులు వినిన సత్యవతీ తనయుడగు వ్యాసమహర్షి ప్రసన్నుడై రాజునకు మహామాయాపూజా విధానమిట్లు చెప్పసాగెను. రాజా! పూర్వము స్వారోచిష మన్వంతరమునందొక రాజుండెను. అతని పేరు సురథుడు. అతడు ప్రజాపాలన తత్పరుడు - మహోదారుడు - నిత్యసత్యవత్రుడు - సత్కర్మనిరతుడు - బ్రాహ్మణపూజకుడు - గురుభక్తి పరాయణుడు - ఏకపత్నీరతుడు - దానశీలి - అజాతశత్రువు - ధనుర్విద్యాపారగుడు. అట్టి మంచి రాజు పాలించుచుండగ పర్వత వాసులగు వ్లుెచ్ఛులకు చెడుబుద్ధి పుట్టెను. వారు రాజుతో పగబూని మదగర్వముతో చతురంగబలములు గూర్చుకొనిరి. ఆ కోలావిధ్వంసులు (కోల-అవిధ్వంసినః-తమ ఆహారమునకై పందులను చంపనివారు - వ్లుెచ్ఛులు) సురథుని రాజ్య మపహరింప తరలిరి. సురథుడును తన సేనలతో వైరులను తాకెను. అంత వారిర్వురికిని దారుణమగు పోరు సంఘటిల్లెను. అందు వ్లుెచ్ఛుల బలము కొలది - రాజు బలము పెద్దది అయ్యెను. ఐనను దైవ మనుకూలింపని కారణమున రాజోడిపోయెను. అతడు దుర్గ రక్షితమైన తన పురమును జేరెను. నీతివిశారదుడు - మేధావియగు ఆ రాజు తన మంత్రులు తన్ను వీడి శత్రు పక్షములో జేరుటగని ఇపుడు నేనేమి చేయవలయునాయని చింతింపసాగెను. నాపురమున కగడ్త గలదు. ఇది దుర్గ రక్షితము. ఇపు డిచ్చటనే యుండి మంచికాలమున కెదరు చూచుట మంచిదా? మంత్రిణః శత్రువశగా మంత్రయోగ్యా న తే కిల ! కిం కరోమితి మనసా భూపతిః సమచింతయత్. 14 కదాచి త్తే గృహీత్వా మాం పాపాచారాః పరాశ్రితాః | శత్రుభ్యో%థ ప్రదాస్యంతి తదా కింవా భవిష్యతి. 15 పాపబుద్ధిషు విశ్వాసో న కర్తవ్యః కదాచన | కిం న తే వై ప్రకుర్వంతి యే లోభవశగా నరాః 16 భ్రాతరం పితరం మిత్రం సుహృదం భాంధవం తథా | గురుం పూజ్యం ద్విజం ద్వేష్టి లోభావిష్టః సదా నరః 17 తస్మా న్మయా న కర్తవ్యో విశ్వాసః సర్వథా%ధునా | మంత్రివర్గే%తి పాపిష్ఠే శత్రుపక్షసమాశ్రితే. 18 ఇతి సంచింత్య మనసా రాజా పరమదుర్మనాః | ఏకాకీ హయమారుహ్య నిర్జగామ పురాత్తతః. 19 అసహాయో%థ నిర్గత్య గహనం వన మాశ్రితః | చింతయామాస మేధావీ క్వ గంతవ్యం మయా పునః. 20 యోజన త్రయమాత్రే తు మునే రాశ్రమ ముత్తమమ్ | జ్ఞాత్వా జగామ భూపాల స్తాపసస్య సుమేధసః. 21 బహువృక్షసమాయుక్తం నదీపులిన సంశ్రితమ్ | నిర్వైరశ్వాపదాకీర్ణం కోకిలారావ మండితమ్. 22 శిష్యా ధ్యయన శబ్దాఢ్యం మృగయూథశతావృతమ్ | నీవారాన్న సుపక్వాఢ్యం సుపుష్ప ఫలపాదపమ్. 23 హోమధూమ సుగంధేన ప్రీతిదం ప్రాణినాం సదా | వేదధ్వని సమాక్రాంతం స్వర్గాదపి మనోహరమ్. 24 దృష్ట్వా తమాశ్రమం రాజా బభూవాసౌ ముదాన్వితః | భయం త్యక్త్వా మతిం చక్రే విశ్రమాయ ద్విజాశ్రమే. 25 ఇపుడు మంత్రులెల్లరును శత్రుపక్షములో జేరియున్నారు. కనుక నాలోచించుట తగదు. ఇపుడేమి చేయుదునని రాజు నెమ్మది నిట్లు తలపోసెను : ఒకవేళ పరుల నాశ్రయించిన పాపిష్ఠులగు నా మంత్రుల నన్ను పరులకు పట్టించి యప్పగించిన నేనేమి చేయగలను? పాపాత్ముల నెన్నడు నమ్మరాదు. లోభులెంతటి పనినైన చేయగలరు. లోభమునకు పాల్పడినవాడు పూజ్యులగు గురువులను - ద్విజులను - తల్లిదండ్రులను - సోదరులను - బంధుమిత్రులను ద్వేషించుచుండును. నేనిపుడు పరులకు వంతపాడు నా పాపిష్ఠ మంత్రులను నమ్మకూడదు, అని యిట్లు సురథుడు చింతించెను. అతనికి మనశ్శాంతి లేదు. కనుక నతడు గుఱ్ఱమెక్కి యొంటరిగ తన పురము విడిచి వెళ్ళెను. ఆ మేధావి యే తోడు నీడలేక యొక మహారణ్యము చేరెను. అపు డింకెచటి కేగవలయునాయని యతడు చింతింపసాగెను. ఆ చోటికి మూడు యోజనముల దూరమున నొక తాపసాశ్రమము గలదు. ఆ తాపసోత్తముడు సుమేధుడు. రా జాముని సన్నిధికి జేరెను. ఆ యాశ్రమ మొక నదీ తీరమున గలదు. అది పలువిధములగు మధుర రస ఫలయుతములగు చెట్లతో - కోయిలల కలకంఠారావములతో సహజవైర ముడిగిన క్రూర జంతు సంతతితో నొప్పారుచుండెను. ఆ పావనాశ్రమములో నొక్కెడ శిష్యుల వేదఘోషలు మరొక్కెడ లేళ్ళగుంపులు నింకొక్కెడ ఫలపుష్పభరిత వృక్షములు వేరొక్కెడ పండిన నీవారధాన్యములు కనులపండువు సేయుచుండెను. ఒక్కెడ ప్రాణులకు ప్రీతి గొల్పునట్టి హోమధూమములు - సుగంధ పరిమళములు వాసించుచుండెను. అది స్వర్గము కంటె మిన్నగ నిట్లందగించుచుండెను. అట్టి యాశ్రమమును గాంచి రాజు పరమానందబరితుడయ్యెను. అతడు జయమువాసి శాంతి చెందెను. మరియు ఆ ద్విజాశ్రమమందు విశ్రమింప మది దలచెను. ఆసజ్య పాదపే%శ్వంతు జగామ వినయాన్వితః | దృష్ట్వా తం మునిమాసీనం సాలచ్ఛాయాసుసంశ్రితమ్. 26 మృగాజినాసనం శాంతం తపసా%తికృశమృజుమ్ | అధ్యాపయంతం శిష్యాం శ్చ వేదశాస్త్రార్థ దర్శినమ్. 27 రహితం క్రోధలోభాద్యై ర్ద్వంద్వాతీతం విమత్సరమ్ | ఆత్మజ్ఞానరతం సత్యవాదినం శమసంయుతమ్. 28 తం వీక్ష్య భూపతి రూభెమౌ పపాత దండవత్తదా | తదగ్రే%శ్రు జలాపూర్ణనయనః ప్రేమసంయుతః. 29 ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే తమువాచ తదా మునిః | శిష్యో దదౌ బృసీం తస్మె గురుణా నోదిత స్తదా. 30 ఉత్థాయ నృపతి స్తస్యాం సమాసీన స్తదాజ్ఞయా | అర్ఘ్యపాద్యార్హణాం చక్రే సుమేధా విధిపూర్వకమ్. 31 పప్రచ్ఛాత్ర కుతః ప్రాప్తః కస్త్వం చింతాపరః కథమ్ | కథయస్వ యథాకామం సంవృతం కారణం త్విహా. 32 కి మాగమన కృత్యం తే బ్రూహి కార్యం మనోగతమ్ | కరిష్యే వాంఛితం కామ మసాధ్యమపి య తవ. 33 రాజోవాచ:- సురథో నామ రాజా%హం శత్రుభిశ్చ పరాజితః | త్యక్త్వా రాజ్యం గృహం భార్యా మహం తే శరణం గతః. 34 యదాజ్ఞాపయసే బ్రహ్మం స్తదహం భక్తితత్పరః | కరిష్యామి న మే త్రాతా త్వదన్యః పృథివీతలే. 35 శత్రుభ్యో మే భయం ఘోరం ప్రాప్తో%స్మ్యద్య తవాంతికమ్ | త్రాయస్వ మునిశార్దూల శరణాగతవత్సల. 36 ఋషిరువాచ : నిర్భయం వస రాజేంద్ర నాత్ర తే శత్రవః కిల | ఆగమిష్యంతి బలినో నిశ్చయం తపసో బలాత్. 37 నాత్ర హింసా ప్రకర్తవ్యా వనవృత్త్యా నృపోత్తమ | కర్తవ్యం జీవనం శ##సై#్త ర్నివారఫల మూలకైః. 38 అతడొక చెట్టునకు తన గుఱ్ఱమును కట్టివేసి సవినయముగ ముని సన్నిధి కేగి మునిని దర్శించెను. ఆ ముని యొక సాలతరువు క్రింద నుండెను. అతడు కృష్ణాజినము పై గూర్చుండి వేదశాస్త్రార్థము లెఱుగగోరు శిష్యుల కధ్యాపన మొనరించుచుండెను. ఆ ముని పరమశాంతుడు. తపముచే కృశించినవాడు. కామక్రోధ మత్సరరహితుడు. సత్యవాది. ఆత్మవంతుడు. శమ దమ సంపన్నుడగు ఆ మునీశ్వరుని దర్శించగనే రాజునకు కన్నులనిండ నీరు నిండెను. అతడు వెంటనే మునికి దండప్రణామము లాచరించెను. అంత ముని లేలెమ్ము. నీకు సేమమా?' యని యడిగెను. ఒక శిష్యుడు ముని యనుమతితో రాజు కూర్చుండుటకు కుశాసన మేర్పరచెను. ముని యానతితో అతడు దానిపై కూరుచుండెను. ముని అతని కర్ఘ్యపాద్యాదివిధు లొనరించెను. నీవెవరవు? నీవెట నుండి వచ్చితివి? నీ మోము వాడినదేమి? నీ దైన్య కారణమేమి? నా కన్నియు దాపరికము లేక తెల్పుము. నీ రాకకు కారణమేమి? నీ మనోగత వాంఛిత మెద్ది? నీ కోర్కి యెంత యసాధ్యమైనదైనను సాధింపగలను. అంతయు తెలుపుము' అని ముని రాజు నడిగెను. రాజిట్లనియెను : నే నొక రాజను. నన్ను సురథుడందురు. నేను పగతురచేతిలో నోడితిని. రాజ్యమును గృహమును భార్యను వదలిపెట్టితిని. నీ శరణు చొచ్చితిని. ఓ మునిచంద్రమా! నీవు నన్నాజ్ఞాపింపుము. నీవు చెప్పిన దానిని భక్తిశ్రద్ధలతో నొనరింతును. నిన్ను మించిన రక్షకుడు నా కింకొకడు లేడు. నీవు శరణాగతవత్సలుడవు. నేను శత్రుభీతిచే నీ శరణు జేరితిని. నన్ను బ్రోవుము.' అన ముని యిట్లనియెను : నీ విచ్చట నిర్భయముగ నుండుము. నీ వైరు లిచటకి రాజాలరు. వచ్చినను నా తపోబలము ముందు వారు నిలువ నోపరు. ఇచట హింసకు తావు లేదు. ఇట వన్యవృత్తితో నీవారధ్యానములతో ఫలపుష్పములతో మనుగడ సాగింపవలయును.' ఇతి తస్య వచః శ్రుత్వా నిర్భయః స నృపస్తదా | ఉవాసాశ్రమ ఏవా%సౌ ఫలమూలాశనః శుచిః. 39 కదాచి త్స నృప స్తత్ర వృక్షచ్ఛాయాం సమాశ్రితః | చింతయామాస చింతార్తో గృహ ఏవ గతాశయః. 40 రాజ్యం మే శత్రుభిః ప్రాప్తం వ్లుెచ్ఛైః పాపరతైః సదా | సంపీడితాః స్యు ర్లోకాసై#్త ర్దురాచారై ర్గతత్రపైః. 41 గజాశ్చ తురగాః సర్వే దుర్బలా భక్ష్యవర్జితాః | జాతాః స్యు ర్నాత్ర సందేహః శత్రుణా పరిపీడితాః. 42 సేవకా మమ సర్వే తే శత్రూణాం వశవర్తినః | దుఃఃతా ఏవ జాతాః స్యుః పాలితా యే మయా పురా. 43 ధనం మే సుదురాచారై రస ద్వ్యపరైఃపరైః | ద్యూతాసవభుజిష్యాదిస్థానే స్యాత్ర్పాపితం కిల. 44 కోశక్షయం కరకిష్యంతి వ్యసనైః పాపబుద్ధయః | న పాత్ర దాననిపుణా వ్లుెచ్ఛా స్తే మంత్రిణో%పి మే. 45 ఇతి చింతావరో రాజా వృక్షమూల స్థితో యదా | తదా%%జగామ వైశ్య స్తు కశ్చిదార్తి పర స్తథా. 46 నృపేణ పుర తో దృష్టః పార్శ్వే తత్రోపవేశితః | పప్రచ్ఛ తం నృపః కో%సి కుత ఏవాగతో వనమ్. 47 కో%సి కస్మా చ్చ దీనో%సి హరిణః శోకపీడితః | బ్రూహి సత్యం మహాభాగ మైత్రీ సాప్తపదీ మతా. 48 తచ్ఛ్రుత్వా వచనం రాజ్ఞ స్తమువాచ విశోత్తమః | ఉపవిశ్య స్థిరోభూత్వా మత్వాసాధుసమాగమమ్. 49 మిత్రాహం వైశ్యజాతీయః సమాధిర్నామ విశ్రుతః | ధనవా న్ధర్మనిపుణః సత్యవాగనసూయకః. 50 అనిన ముని వాక్కులు విని రాజు నిర్భయుడు నిశ్చింతుడును శుచియునై ఫలమూలాదుల తినుచు నాశ్రమమందుండెను. ఒకనాడు రాజొక చెట్టు నీడను గూర్చుండి తన యిల్లు మున్నగు వానిని గుఱించి ఇట్లు నెమ్మది నాలోచించుచుండెను. నా రాజ్యము పాపులగు వ్లుెచ్ఛుల చేతిలోబడినది. ఆ సిగ్గుమాలిన దుష్టుల మూలమున నా ప్రజలెంత పీడింపబడుచున్నారోకదా! వేళకు మేత లేనందువలన నా గజాశ్వములు స్రుక్కి పరులచేత పీడింపబడుచుండును. నా సేవకులు నాచేత చక్కగ పాలింపబడిరి. నేడు వారు తప్పక శత్రువులకు వశులై కడగండ్ల పాలైయుందురు. ఆ దుష్టులు నా సంచిత ధనరాశులను జూదము త్రాగుడు మున్నగు దురభ్యాసములకు వ్యయించి నాశము చేసి యుందురు. ఆ పావులు వ్యసన పరులునగు వ్లుెచ్ఛులను వారి మంత్రులును దాన పాత్రత్వ మెరిగినవారు కారు కాన వారు ధనాగారమును శూన్యము చేతురు. ఇట్లు రాజు చెట్టు మొదట చింతాక్రాంతుడై యుండగ నంతలో నచటికొక కోమటి దుఃఖార్తుడై వచ్చెను. అతడు వచ్చి రాజు చెంత గూర్చుండగా ఆజతని నిట్టులడిగెను: 'నీవెవరు? ఈ వనమున కెచటి నుండి యేతెంచితివి? నీ పేరేమి? ఏల శోకపీడితుడవైనట్లు తెల్లబోవుచు పాలిపోయినవాడవై దీనముగ గనింపించుచున్నావు? ఏడు పదముల చేతనే నరులు పరస్పర మిత్రములడుదురు. కాన నేను నీకిపుడు మిత్రుడను. నాతోనన్నియు దెలుపుము' అనిన రాజు పలుకులు విని చక్కగ గూర్చుండి తను మంచి మైత్రి దొరికినదని తలచి రాజుతో కోమటి ఇట్లనియెను : మిత్రమా! నేను జాతికి కోమటిని. నా పేరు సమాధి. ధనికుడు - ధర్మ నిరతుడను. సత్యవాదిని. అసూయలేనివాడను. పుత్రదారై ర్నిరస్తో%హం ధనలుబ్దై రసాధుభిః | కృపణతి మిషం కృత్వా త్యక్త్వా మాయాం సదుస్త్యజామ్. 51 స్వజనేన చ సంత్యక్తః ప్రాప్తో%స్మి వనమాశు వై. 52 కో%సి త్వం భాగ్యవా న్భాసి కథయస్వ ప్రియధునా | రాజా : సురథో నామ రాజా%హం దస్యుభిః పీడితో%భవమ్. 53 ప్రాప్తో%స్మి గతరాయో%త్ర మంత్రిభిః పరివంచితః | దిష్ట్వా త్వ మత్ర మిత్రం మే మిళితో%సి విశోత్తమ. 54 సుఖేన విహారిష్యావో వనే%త్ర మంత్రిభిః పరివంచితః | దిష్ట్యా త్వ మత్ర మిత్రం మే మిళితో%సి విశోత్తమ. 55 అత్రైవ చ యధాకామం సుఖం తిష్ఠ మయా సహ | వైశ్యః కుటుంబం మే నిరాలంబం మాయాహీనం సుదుంఃతమ్ | భవిష్యతి చ చింతార్తం వ్యాధికోపతాపితమ్. 56 భార్యాదేహే సుఖం నోవావాపుత్త్రదేవేనవా సుఖమ్ | ఇతి చింతాతురం చేతే న మే శామ్యతి భూమిప. 57 కదా ద్రక్ష్యే సుతం భార్యాం గృహం స్వజన మేవచ | స్వస్థం న మన్మనో రాజన్గృహచింతాకులం భృశమ్. 58 హితకారీ వరః శత్రు ర్దుఃఖదాః సుహృదః కుతః | తస్మా త్థ్సిరం మనః కృత్వా విహరస్వ మయా సహ. 59 వైశ్యః: మనో మే న స్థిరం రాజ న్భవత్యద్య సుదుఃఃతమ్ | చింతయాత్ర కుటుంబస్య దుస్త్యజస్యదురాత్మభిః. 60 రాజోవాచ: మమాపి రాజ్యజం దుఃఖం దునోతి కిల మానసమ్ | గచ్ఛావో%ద్య మునిం శాంతం శోకనాశన మౌషధమ్. 61 ఇతి కృత్వా మతిం తౌ తు రాజా వైశ్యశ్చ జగ్మతుః | ముని తౌ వినయోపేతౌ ప్రష్టుం శోకస్య కారణమ్. 62 గత్వాతం ప్రణిపత్యాహ రాజా ఋషి మనుత్తమమ్ | ఆసీనం సమ్యగాసీనః శాంతం శాంతి ముపాగతః. 63 ఇతి శ్రీ దేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే ద్వాత్రింశోధ్యాయః. నా భార్యాపుత్రులు ధనాశపరులు దుష్టాత్ములు. వారు మాయ పన్ని నన్ను దిక్కరించిరి. నేను పిసినిగొట్టునను నెపము నాపై మోపిరి. నన్ను వారిల్లువెడల బైటికి గెంటిరి. నేను గెంటబడి యీ వనము చేరితిని. నీవు మహానుభావుడవుగ గనంబడుచున్నావు. నీవెవరవో తెలుపుము' అన రాజిట్లనెను : నన్ను సురథు డందురు. వ్లుెచ్ఛులు నన్ను బాధలు పెట్టిరి. నా మంత్రులు నన్ను మోసగించిరి. అంత నే నిచ్చటికి వచ్చి చేరితిని. నా యదృష్టము కొలది నీవు నాకు మిత్రుడవైతివి. మహాబుద్ధీ! నీ విక శోక ముడుగుము. చిత్తశాంతి నొందుము. మన మీచల్లని చెట్ల నీడను సుఖముగ విహరింతము. నీవు నాతో నిచట స్వేచ్ఛగ సుఖముండుము' అన వైశ్యుడిట్లనెను : నేను లేనందున నా కుంటుంబము దిక్కుమాలిని దగును. అది చింతాశోకములకు వ్యాధి దుఃఖములకు లోనయి బాధలు పడుచుండును. నా భార్యపుత్రులు సుఖముండిరో లేదో యని నాకు చింతగల్గుచున్నది. నా మదికి శాంతి చేకూరుట లేదు. నా మనస్సు గృహచింతలతో సతమతమగుచున్నది. నా చిత్తమునకు శాంతి గల్గుటలేదు. నా భార్యాపుత్రుల నెన్నడు చూతునాయని విచారపడుచున్నాను' అన రాజిట్లనియెను : నీవు చెడువృత్తిగల నీ పుత్త్రులచే తిరస్కరింపబడితివి గదా! వారిని మరల గాంచినచో నీ చిత్తమున కెట్లు శాంతి గల్గును? అన వైశ్యుడిట్లనియెను : నరు డెంత చెడ్డవాడైనను తన కుటుంబమును వదలజాలడు: అట్టి కుటుంబము దుఃఖముల పాలయినందున నా మది యెంతయో కుందుచున్నది. నా మదికి నిలుకడ కుదురుటలేదు' అని రాజిట్లనెను : రాజ్యదుఃఖము నా మనస్సునుగూడ కలత పరచుచునే యున్నది. పరమశాంతుడగు మునిని జేరి శోకనాశమునకు తగిన ¸°షధ మడుగుదము అని వారిర్వురు నిట్లొక నిశ్చయమునకు వచ్చి శోకకారణ మడుగుటకు సవినయముగ మునిని జేరిరి. రాజు మునిని సమీపించి యతనికి ప్రణమిల్లి కూర్చుండి శాంత చిత్తముతో సుఖాసీనుడైన మునితో నీ విధముగ బలికెను: ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు సురథోపాఖ్యానమను ముప్పదిరెండవ యధ్యాయము.