Sri Devi Bhagavatam-1
Chapters
అథ అష్టమో%ధ్యాయః సహుష స్త్వథ తాంశ్రుత్వా గురోస్తు శరణాగతామ్ | చక్రోధ స్మరబాణార్త స్తమాంగిరస మాశువై.
1 దేవానాహాంగిరస్సూనుర్హంతవ్యో%యం మయా కిల | ఇతీంద్రాణీం గృహే మూఢో రక్షతీతి మయాశ్రుతమ్.
2 ఇతి తం కుపితం దృష్ట్వా దేవాః సర్షిపురోగమాః | అబ్రువ న్నహుషం ఘోరం సామపూర్వం వచస్తదా.
3 క్రోధం సంహార రాజేంద్ర ! త్యజ పాపమతిం ప్రభో | నిందతి ధర్మశాస్త్రేషు పరదారాభిమర్శనమ్.
4 శక్రపత్నీ సదా సాధ్వీ జీవమానే పతౌ పునః | కథ మన్యం పతిం కుర్యా త్సుభగా%తి పతివ్రతా. 5 త్రిలోకీశ స్త్వమధునా శాస్తా ధర్మస్య వై విభో | త్వాదృశో%ధర్మ మాతిష్ఠే త్తదా నశ్యే త్త్రపజాధ్రువమ్.
6 సర్వథా ప్రభుణా కార్యం శిష్టాచారస్య రక్షణమ్ | వారముఖ్యాశ్చ శతశోవర్తంతే%త్ర శచీసుమాః. 7 రతి స్తు కారణం ప్రోక్తం శృంగారస్య మహాత్మభిః | రసహాని ర్బలాత్కారే కృతే సతి తు జాయతే.
8 ఉభయోః సదృశం ప్రేమ యది పార్థివసత్తమ | తదావై సుఖసంపత్తి రుభయో రుపజాయతే.
9 తస్మా ద్భావ మిమం ముంచ పరదారాభిమర్శనే | సద్భావం కురు దేవేంద్రపదం ప్రాప్తో%స్యనుత్తమమ్.
10 ఋద్ధిక్షయస్తు పాపేన పుణ్యనాతి వివర్ధనమ్ | తస్మా త్పాపం పరిత్యజ్య సన్మతి కురు పార్థివ.
11 నహుషఉవాచ: గౌతమస్య యదా భుక్తా దారాః శ##క్రేణ దేవతాః వాచస్పతే స్తు సోమేన క్వ యూయం సంస్థితా స్తదా.
12 పరోపదేశే కుశలాః ప్రభవంతి నరాః కిల | కర్తా చైవోపద్దేషాచ దుర్లభః పురుషో భ##వేత్.
13 మామా గచ్ఛతు సా దేవీ హితం స్యా దద్భుతం హి వః | ఏతస్యాః పరమం దేవాః సుఖమేవం భవిష్యతి.
14 అన్యథా న హి తుష్యే%హం సత్యమేతద్ర్బవీమివః | వినయా ద్వా బలాద్యా%పి తామాశు ప్రాపయంత్విహ.
15 ఎనిమిదవ అధ్యాయము ఇంద్రాణి శ్రీదేవిని సందర్శించుట అంతట శచీదేవి బృహస్పతిని శరణు వేడెను. అది విని నహుషుడు తాళ##లేని మదనబాణ బాధచే బృహస్పతిపై క్రుద్ధుడయ్యెను. 'గురుడు మూఢుడు. అతడింద్రాణికి తన యింట నాశ్రయ మిచ్చెనని వింటిని. కావున నతని చంపుదు' నని నహుషుడు దేవతలతో ననెను. అత డట్లు కుపితుడగుట గాంచి దేవతలు క్రూర నహుషునితో సామవచనములతో నిట్లనిరి: 'రాజా! కోప ముడుగుము. పాపబుద్ధి వదలుము. పరభార్యను గూడుట ధర్మశాస్త్రములు నిషేధించును. ఇంద్రుని భార్య పతివ్రత. సాధ్వి. ఆమె తన పతి బ్రదికియుండగ మరొక్కని నెట్లు పతిగ బడయగలదు? నీవు త్రిలోకపతివి గదా! ధర్మశాసకుడవే! నీవంటివాడధర్మ మాచరించినచో నిక ప్రజలు తప్పుడు త్రోవలు పట్టకుందురా? ప్రభువగు వాడు శిష్టాచారము గాపాడవలయును. ఇచట శచిని బోలు దేవకామినులు నూర్లకొలదిగ గలరు. శృంగార రసమునకు రతిస్థాయిభావమని సాహితీవేత్తలందురు. స్త్రీని బలాత్కరించినచో రసభంగమగును. రాజా! ప్రేమ రాగబంధము ఇర్వురిలోన సమానముగ నున్నచో వారిలోని రసానందము పెంపువహించును. ఇంత గొప్ప దేవేంద్ర పదవి నలంకరించితివి. పరభార్యలను గలియునట్టి చెడుతలంపు వదలుము. మంచి మేలు తలంపులు గల్గియుండుము. సిరిసంపదలు పాపము వలన తరుగును. పున్నెమువలన పెరుగును. కునుక పాపచింతన వదలి సద్భావము గల్గియుండుము' అన నహుషు డిట్లనెను : 'సురలారా! ఇంద్రుడు గౌతమపత్నిని చంద్రుడు గురుపత్నిని ననుభవించిననాడు మీరెక్కడ ఉంటిరి? మీరందరును పరోపదేశమున పండితులే. కాని, వారిలో స్వయముగ నాచరించి బోధించువాడు దొరకుట దుర్లభము. శచీదేవిని నా చెంతకు గొనిరండు. దానివలన మీకును ఆమెకును మేలు గల్గును. సుఖములు గల్గును. నేను నిజము చెప్పుచున్నాను. నా మదికి మఱి దేనివలనను శాంతి చేకూరదు. ఆమెను బలముతోగాని వినయమున, గాని తెచ్చి నాతో గూర్చుడు.' ఇతి తస్య వచః శ్రుత్వా దేవాశ్చ మునయస్తథా | త మూచు శ్చాతి సంత్రస్తా నహుషం మదనాతురమ్.
16 ఇంద్రాణీ మానయిష్యామః సామపూర్వం తవాంతికమ్ ఇత్యుక్త్వా తే తదా జగ్ము ర్బృహస్పతి నికేతనమ్.
17 తే గత్వా%ంగిరసః పుత్రం ప్రోచుః ప్రాంజలయః సురాః | జానీమః శరణం ప్రాప్తా మింద్రాణీం తవ వేశ్మని.
18 సా దేయా నహుషాయాద్య వాసవో%సౌ కృతోయతః | వృణోత్వియం వరారోహా పతిత్వే వరవర్ణినీ.
19 బృహస్పతిః సురానాహ తచ్ఛ్రుత్వా దారుణం వచః | నాహం త్యక్ష్యే తు పౌలౌమీం సతీం చ శరణాగతామ్.
20 దేవాః: ఉపాయో%న్యః ప్రకర్తవ్యో యేనసో%ద్య ప్రసీదతి | అన్యథా కోపసంయుక్తో దురారాధ్యో భవిష్యతి.
21 గురుః : తత్ర గత్వా శచీ భూపం ప్రలోభ్యవచసాభృశమ్ | కరోతు సమయం బాలా పతిం జ్ఞాత్వా మృతం భ##జే.
22 ఇంద్రే జీవతి మే కాంతే కథ మన్యం కరోమ్యహమ్ | అన్వేషణార్థం గంతవ్యం మయా తస్య మహాత్మనః.
23 ఇతి సా సమయం కృత్వా వంచయిత్వా చ భూపతిమ్ | భర్తు రానయనే యత్నం కరోతు మమ వాక్యతః.
24 ఇతి సంచింత్య తే సర్వే బృహస్పతి పురోగమాః | నహుషం సహితా జగ్ము రింద్రపత్న్యా దివౌకసః.
25 తానాగతా న్సమీక్ష్యాహ తదా కృత్రిమవాసవః | జహర్ష చ ముదాయుక్త స్తాం వీక్ష్య ముదితో%బ్రవీత్.
26 అద్యాస్మి వాసవః కాంతే: భజ మాం చారులోచనే | పతిత్వే సర్వలోకస్య పూజ్యో%హం విహితః సురైః.
27 ఇత్యుక్తా సా నృపం ప్రాహ వేపమానా త్రపాయుతా | వర మిచ్ఛా మ్యహం రాజం స్త్వత్తః ప్రాప్తం సురేశ్వర.
28 కించితాల్కం ప్రతీక్షస్వ యావత్కుర్వే వినిర్ణయమ్ | ఇంద్రో%స్తీతి న వా%స్త్రీతి సందేహోమే హృదిస్థితః. 29 తత స్త్వాం సముపస్థాస్యే కృత్వా నిశ్చమ మాత్మని | తావతమస్వ రాజేంద్ర సత్యమేత ద్ర్బవీమి తే.
30 న హి విజ్ఞాయతే శక్రో నష్టః కిం వాక్వ వాగతః | ఏవ ముక్తః స చేంద్రాణ్యా నహుషః ప్రీతిమానభూత్.
31 నహుషుని మాటలు విని సురలు మునులు భయత్రస్తులై కామార్తుడగు నహుషునితో మే మింద్రాణితో సామవచనములు పలికి యామెను నీ చెంతకు చేర్తు'మని పలికి గురు నింటి కేగిరి. వేల్పులు గురునకు ప్రణమిల్లి యిట్లనిరి : 'ఇంద్రాణి మీ యింట తలదాచుకొనుట మే మెఱుగుదుము. ఆమెను నహుషున కీయవలయును. మేము నహుషు నింద్రుని జేసితిమి. ఆ వరవర్ణిని యాతనిని పతిగ వరించును గాక!' ఈ పరుషవాక్కులు విని బృహస్పతి సురలతో శచీదేవి సాధు శీల, నన్ను శరణు బొందినది. నే నామెను విడువను.' అనగా సురలు ఐనచో నహుషుడు సంతృప్తి జెందుటకు తగిన యుపాయ మాలోచింపుడు. కానిచో నతనికి కోపము రెచ్చిపోవును. అపు డతడు దుస్సాధ్యు డగును.' అన గురు విట్లనియెను : 'శచీదేవి యచటి కేగి యతని కాసగొల్పి' నా పతి మరణించినచో నిన్ను సేవింపగలను. ఇంద్రుడు బ్రతికి యున్నచో మరొక్కని నెట్లు గొల్వగలను? కనుక నా మహాత్ముని వెదకుటకు నేనేగలవయును.' అని యామె శపథముచేసి నహుషుని వంచించి నా మాట చొప్పున తన పతిని రప్పించుటకు యత్నింపవలయును.' అని యిటు లందఱును కూడ బల్కుకొని దేవతలును బృహస్పతియును శచీదేవిని తోడ్కొని నహుషుని చెంత కేగిరి. అట్లు వారు శచీదేవితో నేతెంచుటగని సంతసించుచు నామెతో 'కాంతా! చారులోచనా! నేను నేడు నిజముగ నింద్రుడ నైతిని. నేను ముల్లోకములకు పతిని. పూజ్యుడను. నన్ను పతిగ గొల్వుము. నేను నీ పతి నైతిని.' అనగా శచీదేవి గడగడలాడుచు సిగ్గుతో నతని కిట్లనెను : 'రాజా! సురవరా! నీవు నా కొక వర మీయవలయును. ఇంద్రుడు బ్రతికియుండి ఎటనైన దాగెనా చచ్చెనా యను సందేహము నా మదిలో నున్నది. దాని నెఱుగువఱకు కొంచె మోపిక యవసరము. అది నాకు నిశ్చయమైన పిమ్మట నిన్ను చేరగలను. రాజా! అంతమటుకు తాళుము. నా మాట నమ్ముము. ఇదే నీవు నా కీయదగు వరము.'' అని యామె పలుకగ నహుషుడు మొదము వెలిపుచ్చి సరే యని సంతోసముతో నామెను వదలి పెట్టెను. వ్యసర్జయత్స తాం దేవీం తథేత్యుక్త్వా ముదా%న్వితః | సా విసృష్టా నృపేణాశు గత్వా ప్రాహ సురా న్సతీ.
32 ఇంద్రస్యా%%గమనే యత్నం కురుతాద్య కృతోద్యమాః | శ్రుత్వా తద్వచనం దేవా ఇంద్రాణ్యా రసపచ్ఛుచి.
33 మంత్రయామాసు రేకాగ్రాః శక్రార్థం నృపసత్తమ | తే గత్వా వైష్ణవం ధామ తుష్టువుః పరమేశ్వరమ్.
34 ఆదిదేవం జగన్నాథం శరణాగతవత్సలమ్ | ఊచు శ్చైనం సముద్విగ్నా వాక్యం వాక్య విశారదాః.
35 దేవదేవః సురపతి ర్ర్బహ్మహత్యా ప్రపీడితః | ఆదృశ్యః సర్వభూతానాం క్వాపి తిష్ఠతి వాసవః.
36 త్వద్ధియా నిహతే విప్రే బ్రహ్మహత్యా కుతః ప్రభో | త్వం గతి స్తస్య భగవ న్నస్మాకం చ తథైవ హి.
37 త్రాహి నః పరమాపన్నా న్మోక్షం తస్య వినిర్దిశ | దేవానాం వచనం శ్రుత్వా కాతరం విష్ణు రబ్రవీత్.
38 యజతా మశ్వమేధేన శక్రపాపనివృత్తయే | పుణ్యన హయమేధేన పావితః పాకశాసనః.
39 పున రేష్యతి దేవానా మింద్రత్వ మకుతో భయః | హయమేధేన సంతుష్టా దేవీ శ్రీ జగదంబికా.
40 బ్రహ్మహత్యాది పాపాని నాశయిష్య త్యసంశయమ్ | యస్యాః స్మరణమాత్రేణ పాపజాలం వినశ్యతి.
41 కిం పున ర్వాజిమేధేన తత్ర్పీత్యర్థం కృతేన చ| ఇంద్రాణీ కురుతా న్నిత్యం బగవత్యాః ప్రపూజనమ్.
42 ఆరాధనం శివాయా స్తు సుఖకారి భవిష్యతి | నహుషో%పి జగన్మాతు ర్మాయయా మోహితః కిల.
43 వినాశం స్వకృతే నాశు గమిష్య త్యేనసా సురాః | పావితా శ్చాశ్యమేధేన తురాషాడపి వైభవమ్.
44 ప్రాప్స్యత్యచిరకాలేన స్వమాసన మనుత్తమమ్ | తే తు శ్రుత్వా శుభాం వాణీం విష్ణో రమితతేజసః.
45 అట్టు లామె విడువబడి సురలతో మీరెల్లరింద్రుని రాకకు బాగుగ ప్రయత్నములు సల్పుడు అనిన'శచి పవిత్ర వాక్కులు దేవతలెల్లరు విని ఇంద్రునికై తీవ్రముగ నాలోచించిరి. అంతట గాలించిరి. శ్రీ వైకుంఠమేగిరి. వారు జగన్నాథుడు శరణాగత వత్సలుడు ఆది దేవుడునగు విష్ణుని సంస్తుతించి యుద్విగ్న మానసులైందేవదేవా! ఇంద్రుడు బ్రహ్మ హత్యా పీడితుడై యెవరికంటబడ కెటకో వెళ్ళెను. అతడు నీ ప్రేరణవలననే విప్రుని జంపి బ్రహ్మ హత్యా పాపమొడిగట్టుకొనెను. కనుక నిపుడతనికి మాకును నీవే శరణ్యము. మేము విపన్నులము. ఇంద్రునకు విముక్తి గల్గించుము.'' అని వేడుకొన దేవతల దీనవచనములు విని విష్ణువు వారికిట్లనియెను : ఇంద్రుడు తన పాప పరిహారమున కశ్వమేధయాగ మొనరించవలయును. అశ్వమేధ యాగము పుణ్యప్రదము. దానిచే అతడు పాపముక్తుడగును. అతడు మరల నమరులకు పతియై యింద్రత్వమందగలడు. శ్రీ జగదంబికాదేవి యశ్వమేధ యాగమునకు ప్రసన్నయగును. ఆ తల్లి బ్రహ్మహత్యా దోషమును తప్పక తొలగించి వేయగలదు. ఆ దేవినొక్కమారు సంస్మరించిన మాత్రన పాపరాసులు పటాపంచలగును. ఇంక దేవీ ప్రీతి కశ్వమేధయాగమొనర్చిన గలుగు ఫలితమెంతని చెప్పగలము? ఇంద్రాణియు నిత్యము శ్రీదేవీ పూజలాచరింపవలయును. శివారాధన వలన తప్పక యోగక్షేమములు గల్గును. మహాదేవి మాయకు నహుషుడు మోహితుడుగా గలడు. అతడు తన పాపఫలితముగ కచ్చితముగ నశింపగలడు. ఇంద్రు డశ్వమేధమున పవిత్రుడై తన పూర్వ వైభవమున విరాజిల్లగలడు. ఇంద్రుడు కొలది కాలమునకు తన యింద్రాసనము తిరిగి యధిష్ఠింపగలడు.'' అను మహాతేజస్వియగు విష్ణుని మధుర వాక్కులు సురలు వినిరి. జగ్ముస్తం దేశమనిశం యత్రాస్తే పాకశాసనః | తుమాశ్వాస్య సురాః శక్రం బృహస్పతి పురోగమాః.
46 కారయామాసు రఃలం హయమేధం మహాక్రతుమ్ | విభజ్య బ్రహ్మహత్యాంతు వృక్షేషు చ నదీషు చ.
47 పర్వతేషు పృథివ్యాంచ స్త్రీషు చైవా క్షిప ద్విభుః | తాం విసృజ్య చ భూతేషు విపాపః పాకశాసనః.
48 విజ్వరః సమభూద్భూయః కాలాకాంక్షీ స్థితోజలే | అదృశ్యః సర్వభూతానాం పద్మనాళే వ్యతిష్ఠత.
49 దేవా స్తు నిర్గతాః స్థానే కృత్వా కార్యం తదద్భుతమ్ | పౌలోమీతు గురుం ప్రాహ దుఃఃతా విరహాకులా.
50 కృతయజ్ఞ్బోపి మే భర్తా కి మదృశ్యః పురందరః | కథం ద్రక్ష్యేప్రియం స్వామింస్తముపాయం వదస్వమే.
51 బృహస్పతిః : త్వమారాధయ పౌలోమి దేవీంభగవతీం శివామ్| దర్శయిక్ష్యతితేనాథం దేవీ విగతకల్మషమ్.
52 ఆరాధితాజగద్ధాత్రీనహుషంవారయిష్యతి | మోహయిత్వానృపంస్థానాత్పాతయిష్యతి చాంబికా.
53 ఇత్యుక్తా సా తదాతేనపులోమతనయా నృప | జగ్రాహమంత్రం విదివద్గురోర్దేవ్యాః ససాధనమ్.
54 విద్యాం ప్రాప్యగురోర్దేవీ దేవీం శ్రీ భువనేశ్వరీమ్ | సమ్యగారాధయామాస బలిపుష్పార్చనైః శుభైః.
55 త్యక్తాన్యభోగసంభారా తాపసీ వేషధారిణీ | చకార పూజనం దేవ్యాః ప్రియదర్శనలాలసా.
56 కాలేన కియతా తుష్టా ప్రత్యక్షం దర్శనం దదౌ | సౌమ్యరూపధరా దేవీ వరదా హంసవాహనా.
57 అంత దేవతలింద్రుడున్నయెడ కిరిగిరి. సురలు గురుని మున్నిడుకొని యింద్రునూరడించిరి. వారింద్రుని చేత నశ్వమేధ మహాయాగ మొనరింపజేసిరి. ఇంద్రుడు తన బ్రహ్మహత్యా పాపమును విభజించి తరువులందు - నదులందు - గిరులందు - భూమియందు - స్త్రీలయందు నుంచెను. ఇట్లు పాపమును వదలించుకొని యింద్రుడు పాపముక్తుడయ్యెను. రోగ రహితుడయ్యెను. అతడు సుకాలమునకు దారితెన్నులు జూచుచు పద్మనాళమునం దదృశ్యుడై దాగియుండెను. ఈ విధముగ విబుధులద్భుత కార్యమొనరించి తమ తమ నెలవుల కరిగిరి. అంత నింద్రాణి తన పతి విరహమున బాధపడుచు బృహస్పతితో ఇంద్రుడు యాగమొనరించియు నదృశ్యుడుగ నేలయుండెను? నా ప్రియస్వామిని దర్శించునుపాయము సెలవిమ్ము అనగా బృహస్పతి యిట్లనెను : 'ఓ శచీదేవీ! నీవు భగవతియగు శివాదేవి నారాధింపుము. ఆ తల్లి నీకు పాపరహితుడగు నీ పతిని చూపగలదు. జగన్మాతను చక్కగ నారాధించుము. ఆమె నహుషు నోడించగలదు' అది విని యింద్రాణి బృహస్పతి నుండి శ్రీ దేవీ సిద్ధిమంత్రమును విధి పూర్వకముగ గ్రహించెను. ఆ విధముగ నింద్రాణి గురుని నుండి మంత్రము బడసి భువనేశ్వరీ దేవిని బలులతో పుష్పార్చనలతో నారాధించెను. ఆమె తన భోగ సామగ్రినంతయు విడనాడి తపస్వినీ వేషముదాల్చి తన ప్రియుని దర్శించు కుతూహలముతో దేవీ నిత్యపూజలాచరించెను. కొంత కాలమునకు శ్రీ రాజరాజేశ్వరి దేవి సుప్రసన్నయై సౌమ్య రూపిణియై రాయంచనెక్కి యింద్రాణికి ప్రత్యక్ష దర్శన భాగ్యమొసంగెను. కోటిసూర్య ప్రతీకాశా చంద్రకోటిసుశీతలా | విద్యుత్కోటి సమానాభా చతుర్వేద సమన్వితా.
58 పాశాంకుశాభయవరాన్దధతీ నిజబాహుభిః | ఆపాదలంబినీం స్వచ్ఛాం ముక్తామాలాంచ బిభ్రతీ.
59 ప్రసన్న స్మేరవదనా లోచనత్రయభూషితా | ఆబ్రహ్మకీటజననీ కరుణామృతసాగరా.
60 అనంతకోటి బ్రహ్మాండనాయికా పరమేశ్వరీ | సౌమ్యానంత రసై ర్యుక్త స్తన ద్వయ విరాజితా.
61 సర్వేశ్వరీ చ సర్వజ్ఞా కూటస్థా%క్షరరూపిణీ | తా మువాచ ప్రసన్నాహ శక్రపత్నీం కృతోద్యమామ్.
62 మేఘగంభీరశ##బ్దేన ముదమాదదతీ భృశమ్ | దేవ్యువాచ: వరం వరయ సుశ్రోణి వాంఛితం శక్రవల్లభే.
63 దదామ్యద్య ప్రసన్నా%స్మి పూజితా సుభృశం త్వయా | వరదా%హం సమాయాతా దర్శనం సహజం న మే.
64 అనేకకోటి జన్మోత్థ పుణ్యపుంజం హి లభ్యతే | ఇత్యుక్తా సా తదా దేవీ తామాహ ప్రణతా పురః.
65 శక్రపత్నీ భగవతీం ప్రసన్నాం పరమేశ్వరీమ్ | వాంఛామి దర్శనం మాతః పత్యుః పరమదుర్లభమ్.
66 నహుషా ద్భయనాశం చ స్వపదప్రాపణం తథా | దేవ్యువాచ : గచ్ఛ త్వమనయా దూత్యాసార్థం శ్రీమానసం సరః.
67 యత్ర మే మూర్తి రచలా విశ్వకామాభిధా మతా | తత్ర పశ్యసి శక్రం త్వం దుఃఃతం భయవిహ్వలమ్.
68 మోహయిష్యామి రాజానం కాలేన కియతా పునః | స్వస్థా భవ విశాలాక్షి కరోమి తవ చేప్సితమ్.
69 భంశయిష్యామి భూపాలం మోహితం త్రిదశాసనాత్ | వ్యాస ఉవాచ : దేవీదూతీ తాం గృహీత్వా శక్రపత్నీం త్వరాన్వితా.
70 ప్రాపయామాస సాన్నిధ్యం స్వపత్యుః పరమేశ్వరీమ్ | సా దృష్ట్వా తం పతిం బాలా సరేశం గుప్త సంస్థితమ్. ముదిత్బాభూ ద్వరం వీక్ష్య బహుకాలాభివాంఛితమ్ |
71 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ షష్ఠస్కంధే శచీకృత శక్రదర్శనం నామాష్టమో%ధ్యాయః శ్రీ దేవి కోటిసూర్య తేజస్విని చంద్రకోటి సమశీతల కోట్ల మెఱపు తీగెల మిఱుమిట్లు గొల్పునది సకల వేద సంపన్నురాలు. పాశ అంకుశ - వర - అభయ కరాంబుజ. మెడనుండి పాదముల వఱకు చెన్నొందు ముత్యాల హారము గలది. కమ్మతమ్ములముతో చిందులాడు చిఱుత నగవుల తల్లి; లోచనత్రయ విభూష; ఆ బ్రహ్మకీట జనని అవ్యాజకరుణా రస సాగర అనంతకోటి బ్రహ్మాండనాయిక మహేశ్వరి అమృత నవరసముల నిండారిన శాంత కుచ ద్వంద్వ విరాజిత. సర్వేశ్వరి - సర్వజ్ఞ - కూటస్థ - అక్షర స్వరూపిణి - సుప్రసాదమూర్తి. దేవి పూజామగ్నయగు శచీదేవిని గని మేఘ గంభీర భాషలతో నిట్లనియెను : వాంఛితము కోరుకొనుము. నీ పూజా పరాయణతకు సంతసించితిని. నేనిపుడు వరదాయినినై వచ్చితిని. నా దర్శన మందఱికి నంత సులభముగ నగునది కాదు. నా దివ్య సందర్శనము కోట్ల జన్మ జన్మముల పుణ్య పరిపాకమున గాని లభింపదు. అంత నింద్రాణి శ్రీ దేవికి ప్రణామము లొనరించి సుప్రసన్నయగు పరమేశ్వరి నీ విధముగ ప్రార్థించెను. 'మాతా! అదృశ్యుడగు నా పతిని చూడగోరుచున్నాను. నాకు నహుషుని భయము తొలగవలయును. స్వర్గ పదవి లభింపవలయును.' అన దేవి యిట్లనెను : 'నీవీ దూతిక వెంట శ్రీ మానస సరోవరము జేరుము. అచట శ్రీ విశ్వకామయను పేర నా దివ్యమూర్తి గలదు. అచట భయపీడితుడగు నీ పతిని దర్శింపగలవు. విశాలాక్షీ! స్వస్థురాలవు గమ్ము. నీ కోర్కి యీడేర్తును. కొద్ది కాలమునకు నహుషుని మాయామోహితుని జేసి స్వర్గచ్యుతుని జేయగలను.' అపుడు దేవీ దూతిక త్వరితముగ నింద్రాణిని గొనిపోయి ఇంద్రుని చెంతకు చేర్చెను. ఇంద్రాణి రహస్యముగ దాగిన తన పతియగు సురపతిని గాంచెను. తన చిరకాల వాంఛితము తీరినందున శచీదేవి పరమానంద భరితురాలయ్యెను. ఇది శ్రీమద్దేవీ భాగవత మందలి షష్ఠస్కంధమందు నింద్రాణి శ్రీదేవీని సందర్శించుటయను అష్టమాధ్యాయము.