Sri Devi Bhagavatam-1
Chapters
అథసప్తద%శోధ్యాయః సూత : ఇత్యుక్త్వా పితరం పుత్రః పాదయోః పతితః శుకః | బద్ధాంజలి రువా చేదం గంతుకామో మహామనాః.
1 అపృచ్ఛే తాం మహాభాగ గ్రాహ్యంతే వచనం మయా | విదేహా న్ద్రష్టు మిచ్ఛామి పాలితాం జనకేన తు.
2 వినాదండం కథం రాజ్యం కరోతి జనకః కి | ధర్మే న వర్తతే లోకో దండ శ్చే న్న భ##వే ద్యది 3 ధర్మస్య కారణం దండో మన్వాది ప్రహితః సదా | సకథం వర్తతే తాత సంశయో%యం మహా న్మమ. 4 మమ మాతా త్వియం వంధ్యా తద్వ ద్భావి విచేష్టితమ్ | పృచ్ఛామి త్వాం మహాభాగ గచ్ఛామి చ పరంతప. 5 సూతః : తం దృష్ట్యా గంతుకామం చ శుకం సత్యవతీసుతః | అలింగ్యోవాచపుత్రంతంజ్ఞానినంనిఃస్పృహందృఢమ్. 6 వ్యాసః : స్వస్త్యస్తు శుక ధీర్ఘయుర్భవ పుత్ర మహామతే | సత్యాం వాచం ప్రదత్వా మే గచ్ఛతాతయథాసుఖమ్ 7 ఆగంతవ్యం పున ర్గత్వా మమాశ్రమ మనుత్తమమ్ | న కుత్రాపిచ గంతవ్యం త్వయా పుత్ర కథ చన. 8 సుఖం జీవామి పుత్రాహం దృష్ట్వా తే ముఖపంజకమ్ | ఆవశ్య న్దుఃఖ మాప్నోమి ప్రాణ స్త్వమసి మే సుత. 9 దృష్ట్వా తం జనకం పుత్ర సందేహం వినివర్త్యచ | అత్రాగత్య సుఖం తిష్ఠ వేదాధ్యయన తత్పరః. 10 సూతః : ఇత్యుక్తః సో%భివాద్యార్యం కృత్వా చైవ ప్రదక్షిణామ్ | చలిత స్తరసా%తీవ ధనుర్ముక్తః వరోయథా. 11 సంవశ్య న్వివిధా న్దేశాన్ లోకాంశ్చ విత్తధర్మిణః | వనాని పాదపాంశ్చైవ క్షేత్రాణి ఫలితాని చ. 12 తాపసాం స్తవ్యమానాంశ్చ యజకా న్దీక్షయా%న్వితాన్ | యోగాభ్యాసరతా న్యోగి వానప్రస్థాన న్వనౌకసః. 13 శైవా న్పావుపతాంశ్చైవ సౌరాన్ శాక్తాంశ్చ వైష్ణవాన్ | వీక్ష్య నానావిధా న్ధర్మాన్ జగామతిస్మయన్మునిః. 14 వర్ష ద్వయేన మేరుం చ సముల్లంఘ్య మహామతిః | హిమాచలం చ వర్షేణ జగామ మిథిలాం ప్రతి. 15 ప్రవిష్టో మిథాలాం మధ్యే వశ్య న్సర్వర్ధి ముత్తమామ్ | ప్రజాశ్చ సుఖినః సర్వాః సదాచారః సుసంస్తితాః. 16 పదునేడవ యధ్యాయయము శ్రీ శుకుడు మిథిలకు జనుట సూతుడిట్లనియె : ఈ ప్రకారముగ మహామనస్వియగు శుకుడు పలికి చేతులు జోడించి తన తండ్రి పదకమలములకు నమస్కరించి మిథిలా ప్రయాణమునకు తరలి తండ్రి కిట్లనియెను : ఓ మహాభాగా! తండ్రీ! నీ మాట నొప్పుకొంటివి. జనకుడేలు విదేహపురిని జూడనేగుటకు నా కనుమతిమ్ము. ఆ రాజు దండములేకయే రాజ్యమెట్లు చేయును? దండనీతిలేనిచో లోకము ధర్మమున వర్తించదు. ధర్మసంస్థాపనకు దండనీతియే మూలమని మన్వాదులు వాక్రుచ్చిరి. అయ్యో! ఆ రాజు దండములేకయే రాజ్యమెట్లు చేయునాయని నా సందేహము. జనకుని ప్రవర్తన నా తల్లి వంధ్యయనినట్లు నాకు భాసించుచున్నది. దాని నిజ మెఱుంగుటకు మీ యనుమతితో అట కేగుచున్నాను. సూతు డిట్లనియెను : ఆ శుకు డహంకారమడగిన యాత్మనిష్ఠుడు నిర్లిప్తుడు జ్యోతిఃసాగరమున దేలియాడువాడు. అట్టి శుకుని తన కౌగిట జేర్చుకొని వాసుడిట్లు పలికెను: శుకా! నీకు కల్యాణమగుత. చిరంజీవివిగమ్ము. తిరిగి వత్తునని మాట యిచ్చి క్షేమముగ పోయి రమ్ము. నీ వచ్చటినుండి మరల ఇచ్చటికే రమ్ము. ఇంకొక చోటికి నీవెన్నడును పోరాదు. నీ ముఖకమలమును గాంచకున్నచో నాకు శాంతిగ మనుగడ సాగదు. నిన్నొక్కక్షణమేని చూడకున్నచో నా మనస్సు వ్యథజెందును. నాకు నీవు ప్రాణములోని ప్రాణము. జనకుని సందర్శించి నీ శంక బాపుకొని తిరిగి వచ్చి యిచ్చటనే వేదాధ్యయన పరుండవై సుఖముండును. సూతుడిట్లనియె : వ్యాసుని పలుకులు విని శుకుడు తన తండ్రికి ప్రదక్షిణ నమస్కారము లొనరించి వింటినుండి వెడలిన యమ్మువలె త్వరితముగ బయలుదేరెను. అతడు మార్గమధ్యమున పాడిపంటలు వెల్లివిరిసిన దేశములను దేశవాసులను ఫలపుష్పముల నలరు వనములను తపించు తాసనులను దీక్షితులగు యాజకులను యోగాభ్యాసపరులగు పరమయోగులను వననివాసులగు వానప్రస్థలును శైవ వైష్ణవ సౌర శాక్త పాశుపత మతస్థులను వేరువేర దర్శించుచు పయనము సాగించుచుండెను. ఆ మహాత్ముడు రెండేండ్లకు మేరుగిరిని నొక్క యేడాదిలో హిమగిరిని దాటి మిథిలవైపు సాగెను. అతడా నగరి ప్రవేశించి సకలకళా సమృద్ధులను సదాచార సంపన్నులను సందర్శించెను. క్షత్త్రా నివారిత స్తత్ర కస్త్వ మత్ర సమాగతః | కిం తే కార్యం వదస్వేతి పృష్టస్తేన నచాబ్రవీత్ 17 నిఃసృత్య నగరద్వారా త్థ్సితః స్థాణు రివాచలః | విస్మితో%తి హసంస్తస్థౌ వచో నోవాచ కించన. 18 ప్రతిహారంః : బ్రూహి మూకో%సి కిం బ్రహ్మ న్కిమర్థంత్వమిహాగతః | చలనం న వినాకార్యం న భ##వేదితిమేమతిః. 19 రాజాజ్ఞయా ప్రవేష్టవ్యం నగరే%స్మి న్సదా ద్విజ | అజ్ఞాత కుతలశీలస్య ప్రవేశో నాత్ర సర్వథా. 20 తేజస్వీ భాసి మానం త్వం బ్రాహ్మణో వేదవిత్తమెః | కులం కార్యంచ మే బ్రూహి యథేష్టం గచ్ఛ మానద 21 శుకః: యదర్థ మాగతో%స్మ్యత్ర తత్ప్రాప్తం వచనా త్తవ | విదేహనగరం ద్రష్టుం ప్రవేశో యత్ర దుర్లభః. 22 మోహో%యం మమ దుర్భద్ధేః సముల్లంఘ్య గిరిద్వయమ్ | రాజానం ద్రష్టుకామో%హం పర్యతన్సముపాగతః. 23 వంచితో%హం స్వయం పిత్రా దూషణం కసకచ దీయతే | భ్రామితో హం మహాభాగ కర్మణా వా మహీతలే. 24 ధనాశా పురుషస్యేహ పరిభ్రమణ కారణమ్ | సామే నాస్తి తథా%ప్యత్ర సంప్రాప్తో%స్మి భ్రమా త్కిల. 25 నిరాశస్య సుఖం నిత్యం యది మోహే న సజ్జతి | నిరాశో%హం మహాభాగ మగ్నో%స్మి న్మోహసాగరే. 26 క్వమేరు ర్మిథిలా క్వేయం పద్భ్యాం చ సముపాగతః | పరిభ్రమఫలం కిం మే వంచితో విధినా కిల. 27 ప్రారబ్ధం కిల భోక్తవ్యం శుభం వా%ప్యథవా%శుభమ్ | ఉద్యమ స్తద్వశే నిత్యం కారయ త్యేవ సర్వథా. 28 న తీర్థం న చ వేదో%త్ర యదర్థ మిహ మే శ్రమః | అప్రవేశః పురే జాతో విదేహో నామ భూపతిః. 29 ఇత్యుక్త్యా విరరామాశు మౌనీ భూత ఇవ స్థితః | జ్ఞాతో హి ప్రతిహారేణ జ్ఞానీ కశ్చి ద్ద్విజోత్తమః. 30 సామపూర్య మువా చాసౌ తం క్షత్తా సుస్థితం మునిమ్ | గచ్ఛ భో తే యత్ర కార్యం యథేష్టం ద్విజసత్తమ. 31 అపరాధో మమ బ్రహ్మ న్య న్నివారితవా నహమ్ | త తంతవ్యం మహాభాగ విముక్తానాం క్షమా బలమ్. 32 రాజద్వారము జేరగనే రాజభటు లతనిని నిలువబెట్టి ''నీవెవరవు? ఎటనుండి వచ్చితివి? నీకిందేమి పని?'' యని ప్రశ్నలు గురిపించిరి. ఐనను శుకుడు వారికి మారు పలుకలేదు. ఆ మునిబాలుడు వచ్చుపోవువారికి బాటవదలి తానొక ప్రక్కగ మిన్నువిఱిగిమీదపడినను కదలకమెదలక స్థాణువువలె నుండెను. నడుమనడుమ వింతనవ్వులు నవ్వుచుండెను. ద్వారపాలు డిట్లనియె : బ్రాహ్మణోత్తమా! నీవు మూగవా? ఇచ్చటి కేపనికై వచ్చితివి? ఎవ్వరేని ఏపనియులేకూరకే రారని నాకు తెలియును. రాజునానతిలేనిదే యెవ్వరును నగరము ప్రవేశింపరాదు. క్రొత్తగవచ్చినవాని కులశీలములెఱుగక లోనికి వెళ్ళనీయరు. నీవు వేదవిదుడవు. వైరాగ్యతేజమున వెలుగొందు బ్రాహ్మణుండవు. నీ కులమును వచ్చిన పనిని దెలిపి యథేచ్ఛగ నరుగుము. శుకుడిట్లనియె: ''నా వచ్చినపని నీ మాటలవలననే తీరినది. విదేహనగరమున ప్రవేశము దుర్లభమని తెలియుచున్నది. నా మతిమాంద్యము వలన రాజును జూడవలయుననెడి ఆసక్తితో నేనింతదూరము శ్రమపడి యేతెంచితిని. నేను నా తండ్రి మాటచే మోసపోతిని. ఇపుడెవరిని దూషింతురు? నేజేసికొన్న కర్మము కొలది ఇట్లు పర్యటించుచున్నాను. ధనాశ##యే పురుషుని ముప్పుత్రిప్పలు పెట్టును. నాకా యాస లేకున్నను విభ్రాంతిచే మోసపోయి యింతదూరము వచ్చితిని. నరుడు మోహపాశమునందు జిక్కుకొనకున్నచో నతనికి నిత్యసుఖము చేకూరును. నేనే కోర్కులులేనివాడనే. ఐనను మోహజలధిలో మునుగుచున్నాను. ఎక్కడి మేరుగిరి! ఎక్కడి మిథిలాపురి!! ఇంత దూరమిట్లు కాలినడకతో వచ్చుటేమి? నా రాకకు ఫలితమేమి? నన్నావిధిలీల వంచించినదని తోచుచున్నది. మేలైనను కీడైనను ప్రారబ్ధ మనుభవించక తీరదు. ఆ ప్రారబ్ధమునకు ప్రయత్నముతోడై యెల్లపనులను చేయించును. ఇంత శ్రమపడివచ్చితినేకాని ఇట నొకవేదముగాని యొకతీర్థముగాని లేదు. ఇంతకును విదేహరాజు పురమున ప్రవేశము దుర్లభము'' అని శుకుడు పలికి మౌనమూనెను. ప్రతీహారి శుకుని జ్ఞాన సంపన్నునిగ బ్రాహ్మణశ్రేష్ణునిగ దెఇసికొనెను. ద్వారపాలుడా మునితో సామవచనములనిట్లు పలికెను: ద్విజసత్తమా! నీకు పనియున్న చోటికిక స్వేచ్ఛగ నరుగుము. నిన్ను నేనడ్డగించిన నా యపరాధము క్షమింపుము. ముక్తపురుషులకు క్షమయే బలము. శుకః: కిం తే%త్ర దూషణం క్షత్తః పరతంత్రో%సి సర్వథా| ప్రభుకార్యం ప్రకర్తవ్యం సేవకేనయథోచితమ్. 33 న భూప దూషణం చాత్ర యదహం రక్షిత స్త్వయా | చోర వత్రు పరిజ్ఞాన కర్తవ్యం సర్వథా బుధైః. 34 మమైవ సర్వథా దోషో యదహం సముపాగతః | గమనం పరగేహే య ల్లఘుతాయాశ్చ కారణమ్. 35 ప్రతీహారః: కిం సుఖం ద్విజ కిం దుఃఖంకింకార్యంవుభమిచ్ఛతా | కః శత్రుర్హి తకర్తాకో బ్రూహిసర్వంమమాద్యవై 36 శుకః: దైవిధ్యం సర్వలోకేషు సర్వత్ర ద్వివిధో జనః | రాగీ చైవ విరాగీ చ తయో శ్చిత్తే ద్విధా పునః. 37 విరాగీ త్రివిధః కామం జ్ఞాతో%జ్ఞాతశ్చ మధ్యమః | రాగీ చ ద్వివిధః ప్రాక్తో మూర్ఖశ్చ చతుర స్తథా. 38 చాతుర్యం ద్వివిధం ప్రోక్తం శాస్త్రజం తథా | మతిస్తు ద్వివిధా లోకే యుక్తా%యుక్తేతి సర్వథా. 39 ప్రతిహారః: యదుక్తం భవతా విద్వ న్నార్థజ్ఞో%హం ద్విజోత్తమ | తత్సర్వం విస్తరేణాద్యయథార్థం వదసత్తమ. 40 శుక ఉవాచ : రాగో యస్యాస్తి సంసారే స రాగీ త్చుచ్ఛతే ద్రువమ్ | దుఃఖం బహువిధం తస్య సుఖంచ వివిధం పునః. 41 ధనం ప్రాప్య సుతా న్దారా న్మానం చ విజయం తథా | తదా ప్రాప్య మహ ర్దుఃఖం భవత్యేవ క్షణక్షణ. 42 కార్యం తస్య సుఖోపాయః కర్తవ్యం సుఖసాధనమ్ | తస్యారాతిః స విజ్ఞేయః సుఖవిఘ్నం కరోతి యః. 43 సుఖోత్పాదయితా మిత్రం రాగయుక్తస్య సర్వదా |చతురో నైవ ముహ్యేత మూర్ఖః సర్వత్ర ముహ్యతి. 44 విరక్తి స్యాత్మరక్తస్య సుఖ మేకాంతసేవనమ్ | ఆత్మానుచింతనం చైవ వేదాంతస్య చ చింతనమ్. 45 దుఃఖం తదేత త్సర్వం హి సంసార కథనాదికమ్ | శత్రవో బహవ స్తస్య విజ్ఞస్య శుభ మిచ్ఛతః. 46 కామః క్రోధ ప్రమాదశ్చ శత్రవో వివిధాః స్మృతాః | బందుః సంతోష ఏవాస్య నాన్యో%స్తి భువనత్రయే. 47 శుకుడినట్లనియె : 'ప్రతీహారీ ! ఇందు నీ దోషమావంతయును లేదు. నీవు పరతంత్రుడవు. సేవకుడు తన ప్రభు నానతి నిర్వహించి తీరవలయును. నన్ను నీవు వారించుటవలన రాజును సైతము నిందించుటకు వీలులేదు. వీడు దొంగ వీడు శత్రువని చక్కగ నెఱుంగుట పండితుల లక్షణముగదా! ఇంతకు నిచ్చట నాదే పొరబాటు. పొరుగింటకేగుట లఘుత్వమునకు కారణము.' ప్రతీహారి యిట్లు పలికెను : ద్విజవరా! అందఱి మేలుగోరువానికి సుఖమేది? దుఃఖమేది? ఏది కార్యము? ఎవడు కర్త? ఎవడు శత్రువు? నాకిది తేటపఱచుము. శుకుడిట్లు వచించెను: లోకములన్నిటియందు రెండు మార్గములు గలవు. మనుజులు రెండు తెగలు. ఒకడు రాగి, వేరొకడు విరాగి. విరాగులును ముత్తెఱంగులవారు. తీవ్రవిరాగి-మధ్యమవిరాగి-మందవిరాగి అని. ఇక రాగులు రెండు విధములు. మూర్ఖుడు చతురుడునని. చాతుర్యము రెండు తరగతులు: శాస్త్ర చాతురి-బుద్ధిచాతురియు. బుద్ధియు యుక్తము-అయుక్తము నని రెండువిధములు. ప్రతీహారి యిట్లనియె : బ్రాహ్మణవర్యా! నీవు చెప్పినదంతయు నాకు తికమకగనున్నది. నరిగ వివరించి నిజమేదో తెలుపుము. శుకుడిట్లు వచించెను. ఈ సారములేని సంసారమం దనురాగముగలవాడు రాగి. అట్టివాని కెన్నెన్నియో సుఖదుఃఖములు గల్గుచుండును. నరుడు తనకు ధనము పెండ్లము కొడుకులు ఘనవిజయము అభిమానము గలిగినచో సుఖముగాంచును. అవి తనకు వేరైనవాడు దుఃఖపడును. ఎవరికి దేనివలన సుఖముగలుగునో వారా సుఖోపాయము నాచరించవలయును. దానికి విఘ్నముగల్గించువారిని శత్రులుగ నెన్నవలయును. రాగవంతునకు మిత్రుడు సుఖము గలిగించును. ధీరుడై లోచూపుగలవాడెన్నడును మోహభ్రాంతిలో మునుగడు. మూర్ఖుడే యెల్లకాలము మోహమందును. విషయవిరక్తుడు జ్ఞాని స్వాత్మనక్తుడునగు. అధ్యాత్మజ్ఞాని స్వాత్మసక్తుడునగు అధ్యాత్మజ్ఞాని నిత్యుడై తత్త్వ జ్ఞానార్థచింతనమును చేయుచు నమృతత్వముగోరి యేకాంతసేవలో ప్రత్యగాత్మను సందర్శించవలయును. అదే యతనికి బ్రహ్మానందము చేకూర్చును. ఈ మాయా సంసారమందలి మాటలన్నియును వికారములు. దుఃఖప్రదములు. మేలుగోరు యథార్థవాదికి లోకమే విరుద్ధమగును. కామము క్రోధము మాంద్యము మున్నగునని నరు ననేకరీతుల వెన్నాడు వైరులు. ఈ లోకములన్నిటిలో తన యాత్మసుఖమునకు తానే బంధువు. ఆత్మానందమునకు సాటియగు సుఖము మరేదియును లేదు. సూతః: తుచ్ఛ్రుత్వా వచనం తస్య మత్వా తం జ్ఞానినం ద్విజమ్ | క్షత్తా ప్రవేశయామాన కక్షాంచాతిమనోరమామ్. 48 నగరం వీక్షమాణః సంస్త్రెవిధ్య జనసంకులమ్ | నానావిపణి ద్రవ్యాఢ్యం క్రయవిక్రయకారకమ్. 49 రాగద్వేషయుతం కామలోభమోహాకులం తథా | వివిద త్సుజనాకీర్ణం వసుపూర్ణం మహత్తమరమ్. 50 పశ్య న్స వివిధాన్ లోకా న్ప్రాసర ద్రాజమందిరమ్ | ప్రాప్తః పరమతేజస్వీ ద్వితీయ ఇవ భాస్కరః. 51 నివారితశ్చ తత్రైవ ప్రతీహారేణ కాష్ఠవత్ | తత్రైవ చ స్థితో ద్వారి మోక్ష మేవానుచింతయన్. 52 ఛాయాయా మా తపే చైవ సమదర్శీ మహాతపాః | ధ్యానం కృత్వా తథైకాంతే స్థితః స్థాణు రివాచలః. 53 సూతుడిట్లనియె: శుకుని ప్రబోధము విని ప్రతీహారి యతనిని మహాజ్ఞానిగ నెఱిగి చక్కని రాజమార్గమున నతనిని లోనికి ప్రవేవపెట్టెను. అంత శుకుడా నగరమందు పెక్కు విధముల ద్రవ్యరాసులను పోసి యమ్ముకొనువారు రాగద్వేషకామలోభమోహాకులులు కీచులాడుకొనువారునను మూడువిదముల మనుజులను గాంచుచు ముందునకు సాగి రాజమందిరములోనికి ప్రవేశించెను. అతడు ప్రభవలె నడచు రెండవ సూర్యుడో యన పరమవైరాగ్యమున భాసిల్లుచుండెను. లోనగూడ ప్రతీహారులు శుకునడ్డగించగా నతడు ద్వారమందే స్థాణువువలె కదలక మెదలకుండి ఆత్మమోక్షముగూర్చి విచారించు చుండెను. నీడను వేడిమిని సమముగ చూచు నా మహాతపుడు స్థాణువు పగిదినుండి వృత్తులకు మూలమును వెదకుచు నిశ్చల సమాధిలో మునింగెను. తం ముహూర్తా దుపాగత్య రాజ్ఞో%మాత్యః కృతాంజలిః | ప్రావేశయ త్తతః కక్షాం ద్వితీయాం రాజవేశ్మనః. 54 తత్ర దివ్యం మనోరమ్యం పుష్పితం దివ్యపాదపమ్ | తద్వనం దర్శయిత్వాతు కృత్వా చాతిథిసత్య్రియామ్. 55 పౌరముఖ్యాః స్త్రీయ స్తత్ర రాజసేవాపరాయణాః | గీతవాదిత్ర కుశలాః కామశాస్త్ర విశారదాః. 56 తా ఆదిశ్య చ సేవార్థ వుకస్య మంత్రి సత్తమః | నిర్గతః కసదనా త్తస్మా ద్వ్యాసపుత్రః స్థిత స్తదా. 57 పూజితః పరయా భక్త్యా తాభిః స్త్రీభి ర్యథావిధి | దేశకాలోపపన్నేన నానాన్నే నాతితోషితః. 58 తతో%ంతః పురవాసిన్య స్తస్యాంతఃపురకాననమ్ | రమ్యం సందర్శయామాసు రంగనాః కామమోహితాః. 59 స యువా రూపవా న్కాంతో మృదుభాషీ మనోరమః | దృష్ట్వాతా ముముహుః సర్వా స్తం చ కామ మివాపరమ్. 60 జితేంద్రియం మునిం మత్వా సర్వాః పర్యచరం స్తదా ! అరణయస్తు శుద్ధాత్మా మాతృభావ మకల్పయత్. 61 ఆత్మారామో జితక్రోధో న హృష్యతి న తప్యతి | పశ్యం స్తాసాం వికారాంశ్చ స్వస్థ ఏవ స తస్థివాన్. 62 తసై#్మ శయ్యాం సురమ్యాంచ దదు ర్నార్యః సుసంస్కృతామ్ | పరార్ధ్యా స్తరణోపేతాం నానోపస్కరసంవృతామ్ 63 స కృత్వా పాదశౌచం చ కుశపాణి రతంద్రితః | ఉపాస్య పశ్చిమాం సంధ్యాం ధ్యాన మేవాన్వపద్యత. 64 యామ మేకం స్థితో ధ్యానే సుష్వాప తదనంతరమ్ | సుప్త్వా యామద్వయం తత్త్ర చోదతిష్ఠ త్తతః శుకః 65 పాశ్చాత్త్యం యామినీ యాయం ధ్యాన మేవాన్వపద్యత | స్నాత్వా ప్రాతః క్రియాః కృత్వాపునరాస్తేసమాహితః. 66 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ప్రతమస్కంధే సప్తదశో%ధ్యాయః. ఒక్క ముహూర్తమాత్రముననే జనకుని మంత్రివచ్చి చేతులు జోడించి శుకుని రాజమందిరములోని రెండవ ద్వారమున ప్రవేశింపజేసెను. మంత్రి శుకునకందు విరిసిన మనోహరములైన తరువులు వనములు జూపి యతిథిమర్యాదలు జరిపెను. రాజసేవా పరాయణులు గేయ గానకళాశ్రీలు కామశాస్త్ర విశారదలునగు వారస్త్రీలను శుకునకు చేయవలసిన సేవలన్నియుచేయ నియోగించి మంత్రి తానందుండి బయటకు వచ్చెను. శుకుడందే యుండెను. ఆ కాంతలు శుకునకు వీడని భక్తితో సేవలుచేసి ఆయాకాలములకు దగిన వివిధములగు వంటకములతో శుకుని తనిపిరి. ఆ శుకుని గాంచి వారు కామమోహితులైరి. ఆ యంతిపురము మించుబోడులా విరాగికి తమ యుద్యానవనమందలి రమ్య విషయములను కలయజూపిరి. ఆ శుకుడు యువకుడు మనోహరుడు; మృదుభాషి; అపరమన్మథుడు; అతనిని గాంచగనే యాలలనల మనస్సులు కామవశ##మైనవి. కాని ఆ మరునిముసమందే వారతనిని విజితేంద్రియునిగ నెఱింగి పరమభక్తితో పూజలు చేసిరి. పరిశుద్ధాత్ముడగు శుకుడును వారిని తల్లులుగ భావించెను. ఆ శుకుడు ఆత్మారాముడు విజితాత్ముడు; వంతగాని సంతసముగాని చెందకుండెను. ఆ యువతులలోని మదసరాగములు గనియు విరాగభావముతో నాత్మసంస్థితి జెందెను. అపుడా కాంతలతనికి మేలైన వస్త్రములతో చక్కగ నలంకరించిన పానుపమర్చిరి. దానిచెంత మధురరసపదార్థములునిచిరి. శుకుడు పాదములు కడుగుకొని దర్భలుచేతబట్టి శ్రద్ధతో పశ్చిమసంధ్య నుపాసించి నిర్మలనిశ్చలచిత్తమున స్వాత్మసమాధియందు మునింగెను. అతడొక జాము ధ్యానమునుండి నిద్రించెను. రెండు జాములు నిదురించిన పిమ్మట మేల్కొనెను. అతడు మరల నపరరాత్రమున నాత్మధ్యానమగ్నుడయ్యెను. కొంతసేపటికి లేచి స్నానమొనర్చెను. ప్రాతఃక్రియలు నిర్వర్తించెను. స్థితప్రజ్ఞుడై వైరాగ్యజ్యోతితో బ్రహ్మతేజమున వెలుగుచుండెను. ఇది శ్రీదేవి భాగవతమందలి ప్రతమస్కంధమంది సప్తదశాధ్యాయము.