Sri Devi Bhagavatam-1
Chapters
అథ పంచమో%ధ్యాయః ఋషయఊచుః : వసూనాం సంభవః సూతకథితః శాపకారణాత్| గాంగేయస్యతథోత్పత్తిః కథితా రౌమహర్షణ|
1 మాతా వ్యాసస్య ధర్మజ్ఞ నామ్నా సత్యవతీ సతీ| కథం శంతనునా ప్రాప్తా భార్యా గంధవతీ శుభా.
2 త న్మమాచక్ష్వ విస్తారం దాశపుత్రీ కథం వృతా| రాజ్ఞా ధర్మ వరిష్ఠేన సంశయం ఛింది సువ్రత!
3 ఐదవ అధ్యాయము శంతనుడు సత్యవతిని వరించుట ఋషు లిట్లడిగిరి : సూతమహామునీ! శాపకారణమున వసువు గాంగేయుడుగా నుద్భవించెనంటివి. శ్రీ వ్యాసుని తల్లియు గంధవతియని ప్రసిద్ధయునగు సత్యవతి శంతనుకు భార్య యెట్లయ్యెనో - ధర్మవరిష్ఠుడగు శంతను డా దాశపుత్త్రినెట్లు వరించెనో విపులీకరించి తెలిపి మా సందియము బాపుము. సూతః : శంతనుర్నామ రాజర్షి ర్మృగయానిరతః సదా| వనం జగామ నిఘ్నన్ వై మృగాంశ్చమహిషాన్రూరూన్.
4 చత్వార్వేవ తు వర్షాణి పుత్రేణ సహ భూపతిః | రమమాణః సుఖం ప్రాప కుమారేణ యథా హరః.
5 ఏకదా విక్షిప న్బాణా న్వినిఘ్న న్ఖడ్గసూకరాన్| స కదాచి ద్వనం ప్త్రాః కాళిందీం సరితాం వరామ్.
6 మహీపతి రన్దిర్దేశ్య మాజిఘ్ర ద్గంధ ముత్తమమ్| తస్య ప్రభవ మన్విచ్ఛ న్సంచచార వనం తదా.
7 న మందారస్య గంధో%యం మృగనాభిమదస్య న| చంపకస్య న మాలత్యా న కేతక్యా మనోహరః
8 కుతో%య మేతి వాయుర్వై మమ ఘ్రాణవిమోహనః.
9 ఇతి సంచింత్య మానో%సౌ బభ్రామ వనమండలమ్| మోహితో గంధలోభేన శంతనుః పవనానుగః
10 స దదర్శన నదీతేరే సంస్థితాం చారుదర్శనామ్| శృంగార సహితాం కాంతాం సుస్తితాం మలినాంబరామ్.
11 దృష్ట్వా తా మసితాపాంగీం విస్మితః స మహీపతిః | అస్యాదేహస్య గంధో%య మితి సంజాతనిశ్చయః
12 త దుద్భుతం రూప మతీవ సుందరమ్ తథైవ గంధో%ఃలలోకసమ్మతః | వయశ్చ తాదృగ్నవ¸°వనం శుభమ్ దృష్ట్వైవ రాజా కిల విస్మితో%భవత్. 13 కేయం కుతో వా సముపాగతా%ధునా దేవాంగనా వా కిము మానుషీ వా| గంధర్వపుత్రీ కిల నాగకన్యా జానేకథం గంధవతీం ను కామినీమ్.
14 సంచింత్య చైవం మనసా నృపో%సౌ న నిశ్చయం ప్రాప యదాతతః స్వయమ్| గంగాం స్మర న్కామవశం గతో%థ పప్రచ్ఛ కాంతాం తట సంస్థితాం చ. 15 సూతు డిట్లనియెను : రాజర్షియగు శంతనుడు గాంగేయుడగు తన కుమారునితో నా పరమశివుడు కైలాసమున తన కుమారునితోవలెనే సుఖముండెను. మృగయారతుడై వనముల కేగి మహిషరురు మృగములను జెండాడుచు వినోదించుచుండెను. ఆ రాజొకనాడు ఖడ్గసూకరములపై వాడి బాణములు ఏయుచు కాళిందీ నదీతీరమందలి వనముల కేగెను. అంతలో నతడచట నలౌకికమైన దివ్య పరిమళ మాఘ్రాణించి యా నెత్తావికెరటములు వీచు దిక్కు మొగమై దాని కారణ మారయుచుండెను. ఇది మందార పరిమళముగాని కస్తూరి సౌరభముగాని చంపక మాలతీ కేతక సుమముల నెత్తావిగాని కాదు. ఈ కమ్మతెమ్మెర యచ్చటినుండి వచ్చిననేమి! ఇది నా నాసికను తృప్తిపఱచుచున్నది? అని తలంచుచు ఆ సుగంధమునకు ముగ్ధుడై రాజావన సీమయంతయును కలయ దిరిగెను. అంతలో రాజొక యేకాంత ప్రదేశము మలిన వస్త్రములు ధరించియు మేని సొబగులు సింగారించుకొనిన ఒక రమణీయ కాంతను చూచెను. నల్లని కడకంటి చూపులుకల ఆమెను చూచి ఆ రాజు ఆశ్చర్యపడి ఈ తానాఘ్రాణించిన సుగంధ మామె దేహమునుడి బయలు వెడలినదే యని నిశ్చయించెను. మిగుల సుందరమును ఆద్భుతమును అగు ఆ రూపమును సర్వప్రాణులకు రంజకమగు ఆ సుగంధమును శుభమగు ఆ లేజవ్వనమును చూచి రాజు మిగుల నాశ్చర్యపడి ఇట్లు భావించెను: ఈమె ఎవరై యుండును. ఎక్కడినుండి ఇప్పుడు వచ్చి యుండును? దేవాంగనయో? మానవస్త్రీయో! గంధర్వ కన్యయో! నాగకన్యయో! ఈ గంధవతియగు కామిని ఎవరనునది ఎట్లు గుర్తింపగలను? అని రాజు తన లోలోన తలపోయుచు తానై స్వయముగ నిదమిత్థమని నిర్ణయింప లేకుండెను. ఈమె నాటి గంగయేమో! అనుకొనుచు నతడు కామవశుడై యా నదీతీరమున నున్న యా కాంతచెంత కేగి యామె నిట్లు ప్రశ్నింపసాగెను: కా%సి ప్రియే కస్య సుతా%సి కస్మా దిహ స్థితా త్వం విజనే వరోరు | ఏకాకినీ కిం వద చారునేత్రే వివాహితా వా న వివాహితా%సి. 16 సంజాతకామో%హ మరాలనేత్రే త్వాం వీక్ష్య కాంతాం చ మనోరమాం చ | బ్రూహి ప్రియే యా%సి చికీర్షసి త్వం కిం చేతా సర్వం మమ విస్తరేణ. 17 ఇత్యేవ ముక్తా సుదతీ నృపేణ ప్రోవాచ తం సస్మిత మంబుజేక్షణా | దాశస్యపు పుత్రీం త్వ మవేహి రాజన్కన్యాం పితుః శాసనసంస్థితాం చ. 18 తరీ మిమాం ధర్మనిమిత్త మేవ సంవాహయామీహ జలే నృపేంద్ర | పితా గృహే మే%ద్యగతో%స్తి కామం సత్యం బ్రవీమ్యర్థపతే తవాగ్రే. 19 ఇత్యేవ ముక్తా విరరామ బాలా కామాతుర స్తాం నృపతి ర్బభాషే | ఓ ప్రియరూపా! నీవు ఎవ్వరి పుత్త్రివి? ఏల ఈ విజన ప్రదేశమునందు ఒంటిగా నున్నావు? చారునేత్రా! నీవు వివాహితవా? అవివాహితవా? నా మనస్సును రంజింపజేయు సుందరివగు వంపులు తీరిన కనుగొనలు కల నిన్నుచూచి కామవశుడనయితిని. నీవు ఎవరవు? ఏమి చేయుదానవు? అను విషయములను నీవు నాకు వివరముగా తెలుపుము అని ఆ సుందరితో రాజు పలుకగనే ఆ పద్మాక్షి రాజుతో చిరునగవున నిట్లు పలికెను : ఓ నరాధినాథా! నేను దాశపుత్త్రిని. తండ్రియాజ్ఞలో మెలగు కన్నియనని తెలియుము. ఓ నృపేంద్రా! ధర్మనిమిత్తముగ నేనీ నీటిలో ఈ నావ నడుపుదును. నా తండ్రి యిపుడే యింటికేగెను. అర్థపతీ! నీతో నిది పూర్ణముగా సత్యము పల్కుచున్నాను. కురుప్రవీరం కురు మాం పతిం త్వం వృథా న గచ్ఛే న్నను ¸°వనం తే. 20 నచాస్తి పత్నీ మమ వై ద్వితీయా త్వం ధర్మపత్నీ భవ మే మృగాక్షి | దాసో%స్మి తే%హం వశగః సదైవ మనోభవ స్తాపయతి ప్రియే: మామ్. 21 గతా ప్రియా మాం పరిహృత్య కాంతా నాన్యా వృతా%హం విధురో%స్మి కాంతే | త్వాం వీక్ష్యసర్వావయవాతిరమ్యాం మనో హి జాతం వివశం మదీయమ్. 22 అని కామిని పలుకగనే కామాతురుడగు ఆ శంతను రాజు ఆమెతో నిట్లనెను : కురుప్రవీరుడనగు నన్ను నీ పతిగ జేసికొనుము. నీ యీ జవ్వనము వ్యర్థమయిపోరాదు గదా? నాకు ప్రకృతము మరియొక భార్యలేదు. మృగాక్షీ! నీవు నా ధర్మపత్నివి కమ్ము. నేను నీకు దాసుడనై సర్వదా నీకు వశవర్తినై యుండగలను. ఓ ప్రియా! నీయం దనురక్తుడనగు నన్ను మన్మథుడు సంతాపింపజేయుచున్నాడు. నా భార్య నన్ను వీడిపోయినది. పిమ్మట ఇంతవరకు వేరొకర్తుకను వివాహమాడలేదు. నేనిపుడు విధురుడను. రమ్యములగు సర్వావయవములు గల నిన్ను చూచిన నా మనస్సు వివశమయినది. శ్రుత్వా%మృతాస్వాదరసం నృపస్య వచో%తిరమ్యం ఖలు దాశకన్యా | ఉవాచ తుం సాత్వికభావయుక్తా కృతా%తిధైర్యం నృపతిం సుగంధా. 23 యదార్థ రాజ న్మయి తత్తథైవ మన్యే%హ మేతత్తు యథా వచస్తే| నాస్మి స్వతంత్రా త్వమవేహి కామం దాతా పితా మే%ర్థయ తం త్వ మాశు. 24 న సై#్వరిణీహాస్మ్యపి దాశపుత్రీ పితు ర్వశే%హం సతతం చరామి | స చే ద్దదాతి ప్రథితః పితా మే గృహాణ పాణిం వశగా%స్మి తే%హమ్. 25 మనోభవ స్త్వాం నృప కిం దునోతి యథా పున ర్మాం నవ¸°వనాం చ | దునోతి తత్రాపి హి రక్షణీయా ధృతిః కులాచారంపరంపరాసు. 26 దాశకన్యయగు ఆ గంధవతి అతి రమ్యమును అమృతమువలె మాధుర్యము కలదియునగు రాజు పలుకు విని తానును సాత్త్వికభావయుక్తురాలై శంతనునకు ధైర్యము కలిగించుచు ఇట్లు పలికెను: రాజా! నీవు నా విషయమున పలికినదంతయు యథార్థమే యని భావించుచున్నాను. కాని నేను స్వతంత్రురాలను కానని గ్రహించి మీరు శీఘ్రమే మా తండ్రి నన్ను నీకు ఇచ్చునట్లు అడుగగోరెదను. దాశకుమారికనగు నేను స్వేచ్ఛ కలదానగాను. నా తండ్రి యానతి జవదాటను. నా తండ్రి నన్ను నీకు దానము చేసినచో మీరు నన్ను చేపట్టవచ్చును. నేను నీ వశవర్తినగుదును. రాజా! నిన్ను మాత్రమే ఏమి, నవ¸°వనమందున్న నన్నును మన్మథుడట్లే వేధించుచున్నాడు. ఎట్టి స్థితియందును కులాచార పరంపరా వ్యవస్థచే సాగవలసిన నిలుకడలను కాపాడుట న్యాయ్యముగదా! సూతః : ఇత్యాకర్ణ్య వచ స్తస్యా నృపతిః కామమోహితః | గతో దాశపతే ర్గేహం తస్యా యాచనహేతవే. 27 దష్ట్వా నృపతి మాయాంతం దాశో%తి విస్మయం గతః | ప్రణామం నృపతేః కృత్వా కృతాంజలి రభాషత. 28 ఆ వనిత వాక్కులు విని కామాయత్తచిత్తుడగు శంతనుడు దాశరాజు నింటికి ఆ కన్యను తన కిమ్మని కోరుట కేగెను దాశరాజు తన చెంతకువచ్చు భూపతిని చూచి విస్మయమందెను. అతడు రాజునకు నమస్కరించి దోయిలి పట్టి ఇట్లు పలికెను: దాశః : దాసో%స్మి తవ భూపాలకృతార్థో%హం తవా%%గమే | ఆజ్ఞాం దేహి మహారాజ | యదర్థ మిహ చాగమః. 29 రాజోవాచ : ధర్మపత్నీం కరిష్యామి సుతా మేతాం తవానఘ | త్వయా చే ద్దీయతే మహ్యంసత్యమేతద్బ్రవీమితే. 30 దాశః : కన్యారత్నం మదీయం చేద్యత్త్వం ప్రార్థయసేనృప | దాతవ్యంతు ప్రదాస్యామి న త్వదేయంకదాచన. 31 తస్యాః పుత్రో మహారాజ! త్వదంతే పృథివీ పతిః | సర్వథా చాభిషేక్తవ్యః నాన్యః పుత్ర స్తవేతి వై. 32 సూతః : శ్రుత్వా వాక్యం తు దాశస్య రాజా చింతాతురో%భవత్ | గాంగేయంమనసాకృత్వానోవాచ నృపతి స్తదా. 33 కామాతురో గృహం ప్రాప్త శ్చింతావిష్ణో మహీపతిః | నసస్నౌ బుభుజే వాథ న సుష్వాప గృహం గతః. 34 చింతాతురంతు తం దృష్ట్వా పుత్రో దేవవ్రత స్తదా | గత్వా%పృచ్ఛ న్మహీపాలం తదసంతోషకారణమ్. 35 దాశరాజిట్లనెను: భూపాలకా! నేను మీ దాసుడను. మీ శుభాగమనమున ధన్యజీవుడనైతిని. ఏ యర్థము గోరి వచ్చితిరో నన్నాజ్ఞాపింపుడు. రాజిట్లనియెను. అనఘా! నీ వామోదించి ఇచ్చినచో నీ కూతును నా ధర్మపత్నిగ పరిగ్రహింతును. నా మాట నిజము.' దాశరాజిట్లనియె: రాజేంద్రా! నా కన్యారత్నమును మీరు ప్రార్థించుట మంచిదే. ఆమె ఒక యోగ్యుడైన యయ్యచేతిలో పెట్టదగినదే కదా! అపాత్రునకెన్నడు నీయను. రాజా! నాకూతునకు బుట్టుకొడుకే నీ తరువాత నీ గద్దెనెక్కవలయును. కాని నీ యితర కుమారులెక్కరాదు.' సూతుడిట్లనియె: దాశరాజు పల్కులువిని రాజు చింతాతురుడయ్యెను. గాంగేయునిదలచి దాశరాజునకు రాజేమియు మారు పలుకక మిన్నకుండెను. అంత రాజు కామార్తుడై తన యింటి కేగెను. చెప్పరాని దిగులుతో నతడు మజ్జనభోజనములు నిద్ర విడనాడెను. అట్లు చింతాతురుడైయున్న తన తండ్రినిగాంచి యతని దరిజేరి గాంగేయుడు అతని అసంతోష కారణ మడిగెను. దుర్జయః కో%స్తి శత్రుస్తే కరోమి వశగం తవ | కా చింతా నృపశార్దూల సత్యం వద నృపోత్తమ. 36 కిం తేన జాతేన సుతేన రాజన్ దుఃఖం న జానాతి న నాశ##యేద్యః | ఋణం గ్రహీతుం సముపాగ తో%సౌ ప్రాగ్జన్మజం నాత్ర విచారణా%స్తి. 37 విముచ్య రాజ్యం రఘునందనో%పి తాతాజ్ఞయో దాశరథిస్తు రామః | వనం గతో లక్ష్మణజానకీభ్యాం సహైవ శైలం కిల చిత్రకూటమ్. 38 సుతో హరిశ్చంద్రనృపస్యరాజన్యోరోహిత శ్చేతి ప్రసిద్ధనామా | క్రీతో%థ పిత్రా విపణోద్యతశ్చ దాసార్పితో విప్రగృహే తు నూనమ్. 39 తథా%జిగర్తస్య సుతో వరిష్ఠో నామ్నా శునఃశేప ఇతి ప్రసిద్ధః | క్రీతస్తు పిత్రా%ప్యథ యూపబద్ధః సమ్మోచితో గాధిసుతేన పశ్చాత్. 40 పిత్రాజ్ఞయా జామదగ్న్యేన పూర్వం ఛిన్నం శిరో మాతు రితి ప్రసిద్ధమ్ | అకార్య మప్యా చరితంచ తేన గురో రనుజ్ఞా చ గరీయసీ కృతా. 41 ఇదం శరీరం తవ భూపతే న క్షమో%స్మినూనం వద కిం కరోమ్యహమ్ న శోచనీయం మయి వర్తమానే% ప్యసాధ్య మర్థం ప్రతిపాదయా మ్యదః. 42 ప్రబ్రూహి రాజం స్తవ కా%స్తి చింతా నివారయామ్యద్య ధను ర్గృహీత్వా | దేహేన మే చే చ్చరితార్థతా వా భవత్వమోఘా భవత శ్చికీర్షా. 43 ధిక్తం సుతం యః పితు రీప్సితార్థం క్షమో%పి స న్న ప్రతిపాదయే ద్యః | జాతేన కిం తేన సుతేన కామం పితు ర్న చింతాం హి సముద్ధరేద్యః. 44 నీకెవడైన నలవిగాని వాడున్నచో చెప్పుము. ఆ శత్రువును పట్టితెచ్చి నీ పాదాలమీద పడవైతును. నీ చింతయేమో తెల్పుము. తన తండ్రి దుఃఖమెఱిగి దానిని బాపని కొడుకొక కొడుకేనా? వాడు పుట్టియేమి ఫలము? అట్టివాడు వెనుకటి జన్మల ఋణము దీర్చుకొనుటకు పుట్టిన వాడగును. ఇందు సందేహము లేదు. అలనాడు తన తండ్రి మాట నెరవేర్చుటకే కదా జన మనోనయనాభిరాముడగు శ్రీరాముడు రాజ్యమువదలి జానకీలక్ష్మణులుతోడురాగా వనములకేగి చిత్రకూటగిరులపై వసించెను. ఆనాడు హరిశ్చంద్ర మహారాజు కొడుకు రోహితుడను నతడు తన తండ్రి మాట మేరమీరకయే గదా యొక బాపని కమ్ముడుపోయి యతని యింట దాస్యమునకుండెను. మున్నొకనా డజీగర్తుని కొడుకు శునశ్శేపు డనువాడు తన తండ్రి చేత నమ్మబడి యూప స్తంభమునకు గట్టబడెను. అపు డతనిని విశ్వామిత్రుడు వచ్చి విడిపించెను గదా! మునుపొకనాడు పరశురాముడు తన పితృనానతిచేత తన తల్లి తల ఖండించి పేరు వడసెను. అత డపుడు తన గురు నాజ్ఞ తలదాల్చుటే తన గురు కర్తవ్యముగనెంచి చేయరాని పనియైనను చేసెను గదా! ఈ నా మేను మీది. నేను సమర్థుడనై యున్నాను. మీరు చెప్పినది తు-చ-తప్పక పాటింతును. నేనుండగ శోకింపనేల? ఎంత యసాధ్యకార్యమైనను సాధించి తీరుదును. నీ మదిలోని దిగులేమో తెలుపుము. ఈ క్షణమే విల్లు చేబూని నీ కోర్కి దీర్తును. నీ వాంఛితము నెఱవేఱినచో నా బ్రతుకు చరితార్థమగును. తన తండ్రి కామితము దీర్పజాలియుండియు నే కొడుకు దానిని దీర్పకుండునో వాడు వట్టి పనికిమాలినవాడు. తన తండ్రి చింత బాపి యతని నుద్ధరింపని కొడుకు పుట్టి యేమి ప్రయోజనము?' సూతః : నిశామ్యేతి వచ స్తస్య పుత్త్రస్య శంతను ర్నృపః| లజ్జమానస్తు మనసాతమాహ త్వరితం సుతమ్. 45 రాజా: చింతా మే మహతీ పుత్ర య స్త్వమే%కోసియేసుతః| శూరో%తిబలవాన్మానీసంగ్రామే ష్వపరాఙ్మఖః. 46 ఏకాపత్యస్య మేత తాత! వృథేదం జీవితం కిల | మృతే త్వయి మృథే క్వాపి కిం కరోమి నిరాశ్రయః. 47 ఏషా మే మహతీ చింతా తేనాద్య దుఃఃతో%స్మ్యహమ్| నాన్యా చింతా%స్తి మేపుత్రయాంతవాగ్రేవదామ్యహమ్. 48 సూతః : తదాకర్ణ్యాథ గాంగేయో మంత్రివృద్ధా నపృచ్ఛత | న మాం వదతి భూపాలో లజ్జయా%ద్య పరిప్లుతః. 49 విత్తవార్తాంనృపస్యాద్యపృష్ట్వాయూయం వినిశ్చియాత్ | సత్యం బ్రువంతుమాంసర్వంతత్కరోమినిరాకులః. 50 తచ్ఛ్రుత్వాతే నృపం గత్వా సంవిజ్ఞాయ చ కారణమ్ | శశంసు ర్విదితార్థస్తు గాంగేయ స్త దచింతయత్. 51 సహిత సై#్తర్జగామాశు దాశస్య సదనం తదా | ప్రేమపూర్వ మువాచేదం వినమ్రో జాహ్నవీసుతః. 52 గాంగేయః : పిత్నే దేహి సుతాం తే%ద్య ప్రార్థయామి సుమధ్యమామ్ | మాతా మే%స్తు సుతేయం తే దాసో%స్మ్యస్యాః పరంతప. 53 దాశః : త్వం గృహాణ మహాభాగ పత్నీం కురు నృపాత్మజ | పుత్రో%స్యాన భ##వేద్రాజా వర్తమానేత్వయీతి వై. గాంగేయః : మాతేయం మమ దాశేయీ రాజ్యం నైవ కరోమ్యహమ్ | 54 పుత్రో%స్యాః సర్వథా రాజ్యం కరిష్యతి న సంశయః. 55 దాశః : సత్యం వాక్యం మయా జ్ఞాతంపుత్రస్తే బలవాన్భవేత్| సో%పిరాజ్యంబలాన్నూ నంగృహ్ణీయాదితినిశ్చయః. 56 గాంగేయః : నదారసంగ్రహం నూనం కరిష్యామిహిసర్వథా | సత్యం మే వచనం తాతమయాభీష్మంవ్రతం కృతమ్. 57 సూతః : ఏవం కృతాం ప్రతిజ్ఞాం తు నిశమ్యఝషజీవకః | దదౌ సత్యవతీం తసై#్త్మ రాజ్ఞే సర్వాంగశోభనామ్. 58 అనేన విధినా తేన వృతా సత్యవతీ ప్రియా | న జానాతి పరం జన్మ వ్యాసస్య నృపసత్తమః. 59 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ద్వితీయస్కంధే పంచమో%ధ్యాయః. సూతు డిట్లనియెను: తన తనయుని సాంత్వవచనము లాలకించి శంతను మహారాజు నెమ్మదిగ మోమున దోచు సిగ్గుచు లోన నడచుకొని యతని కిట్లు పలికెను: నీవు మహాశూరుడవు-బలశాలివి-అభిమానివి. రణరంగధీరుడవు. ఇట్టి నీవొక్కడవే నాకు సుతుడవు గదాయని నాలోన తీరని చింత వేధించుచున్నది. కుమారా! నాకు నీవొక్కడవే సంతగుట చేత నొకవేళ నీవు యుద్ధమున మరణించినచో నాకిక ఆశ్రయముండదు. ఇంకేమి చేయగలను? ఇదొక్కటే నాకున్న చింత. నీముందు చెప్పుకొనదగిన చింత నాకు వేరేదియును లేదు. దీనికొఱకే నేనింతగ బాధపడుచున్నాను. తన తండ్రి మాట లాలకించి గాంగేయు డమాత్యవృద్ధులతో నిట్లనియెను: ఏదో సిగ్గువలన భూపతి నాతో సరిగ విడమఱచి పల్కుటలేదు. కనుక మీరతని చిత్తవర్తనమెఱిగి నాకంతయు నున్నదున్నట్లు దెల్పుడు. ఏ కలతయులేక వెంటనే యన్నిపనులు చక్కపెట్టి తండ్రి మదికి శాంతి చేకూర్చగలను. వారా మాటలువిని రాజు చెంతకేగి యతని చింతాకారణము దెలిసికొనిరి. వారా విషయముగూర్చి గాంగేయునకంతయు జెప్పిరి. విశేషజ్ఞుడగు గాంగేయుడు దానిగూర్చి యాలోచించెను. అపుడు వేగిరమే గంగాసుతుడు మంత్రులను వెంటనిడుకొని దాశరాజు నింటికేగి సవినయముగా నెమ్మిగదుర నతని కిట్లనియెను : పరంతపా! నా తండ్రికి నీ కూతు నిమ్మని నిన్ను ప్రార్థించుచున్నాను. ఆమె నాకు తల్లి యగుగాక! ఆమెకు దాసుడనై యుందును. దాశరాజిట్లనియెను: రాజా! నీవే నా కూతును భార్యగ గ్రహింపుము. ఏలయన, నీవుండగ నీమెకు పుట్టినవాడు రాజు గాజాలడు గదా? గాంగేయు డిట్లనియెను: ఈ దాశపుత్త్రి నా తల్లి. ఈమెకు గల్గు కుమారుడే యెల్లభంగుల రాజు గాగలడు. నేను రాజ్యము నేలను. ఇందు సుంతయు సందేహము లేదు. దాశరాజిట్లనియెః నీ వాక్యము సత్యమని నేనెఱుంగుదును. కాని నీకు గలుగు కుమారుడు బలవంతుడై బలిమితో నిశ్చయముగ రాజ్య మపహరించవచ్చును గదా? గాంగేయుడిట్లనియెను: అట్లయిన నేను పెండ్లియే చేసికొనను. నేనిదే భీష్మమగు ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా యీ మాట నిజము అను భీష్మ ప్రతిజ్ఞ విని దాశరాజు శోభనాంగియగు సత్యవతిని శంతనునకు ప్రదానమొనరించెను. అతడు సత్యవతిని విధివిధానమున వివాహము చేసికొనెను. ఈమెకే మున్ను వ్యాసుడు జన్మించెననుట శంతను డెఱుగడు. ఇది శ్రీదేవీ భాగవతమందలి ద్వితీయస్కంధమందు పంచమాధ్యాయము.