Sri Devi Bhagavatam-1 Chapters
అథ ద్వాదశో%ధ్యాయః
రాజోవాచ: వద యజ్ఞవిధింసమ్యగ్దేస్తస్యాః సమంతతః | శ్రుత్వాకరోమ్యహంస్వామిన్యథాశక్తిహ్యతంద్రితః. 1
పూజావిధించ మంత్రాంశ్చహో మద్రవ్యమసంశయమ్ | బ్రాహ్మణాః కతిసంఖ్యాశ్చ దక్షిణాశ్చతథా పునః. 2
వ్యాసః శృణురాజ న్ప్రవక్ష్యామి దేవ్యాయజ్ఞం విధానతః | త్రివిధంతు సదాజ్ఞేయం విధిదృష్టేన కర్మణా. 3
సాత్త్వికంరాజసం చైవతామసం చతథా%పరమ్ | మునీనాం సాత్త్వికం ప్రోక్తం నృపాణాం రాజసం స్మృతమ్. 4
తామసంరాక్షసానాంవై జ్ఞానినాంతుగుణోజ్ఘితమ్ | విముక్తానాంజ్ఞానమయే విస్తరాత్ప్ర బ్రవీమితే. 5
దేశఃకాలస్తథా ద్రవ్యం మంత్రాశ్చ బ్రాహ్మణా స్తథా | శ్రద్ధా చసాత్త్వి కీయత్రతంయజ్ఞం సాత్త్వికంవిదుః. 6
ద్రవ్యశుద్ధిః క్రియాశుద్ధిర్యంత్రశుద్ధిశ్చ భూమిప | భ##వేద్యదితదా పూర్ణం ఫలంభవతినాన్యథా. 7
అన్యాయోపార్జి తేనైవ కర్త వ్యంసుకృతం కృతమ్ | నకీర్తిరిహలోకే చ పరలోకే నతత్ఫలమ్. 8
తస్మాన్న్యా యార్జితేనైవ కర్తవ్యం సుకృతం సదా | యశ##సే పరలోకాయ భవత్యేవ సుఖాయ చ. 9
పండ్రెండవ అధ్యాయము
శ్రీదేవి యజ్ఞ విధానము
స్వామీ! ఆ పరాదేవీ యజ్ఞవిధానము నాకు చక్కగ నెఱిగింపుము. దానిని విని యథాశక్తిగ నిశ్చలమతితో యాగమొనరింపగలను. శ్రీ మహాదేవీ యాగమునకు పూజా విధానమెట్టిది? ఏ మంత్రములు పఠించవలయును? ఏయే ద్రవ్యములావశ్యములు? ఎందఱు విప్రులు గావలయును. ఎంత దక్షిణలీయవలయును? ఇదంతయును నాకు సవిస్తరముగ దెలుపుము అని జనమేజయుడడుగ వ్యాసుడిట్లనెను: భూపతీ! ఆ దేవీ యజ్ఞవిధానము దెలుపుము. ఆలకింపుము! ఇది వేదోక్త మును విధ్యుక్తమునగు యాగము. సాత్త్వికము మునులకును రాజసము రాజులకును తామసము రాక్షసులకును సంబంధించినవి. ఆత్మానాత్మ వివేకముగల జ్ఞానులు చేయు యాగము నిర్గుణమైనది. అనగా అట్టి విముక్తుల యాగము పరిపూర్ణ జ్ఞానమయమై యొప్పారును. వానినన్నిటిని తేటతెల్లముగ వివరింతును వినుము. దేశకాలమంత్ర ద్రవ్యములలో బ్రాహ్మణులతో గూడి సాత్త్వికశ్రద్ధతో వెలయు యాగము సాత్త్విక యజ్ఞము. మంత్ర ద్రవ్యక్రియా శుద్ధులతో జరుగు యాగము సంపూర్ణఫలప్రద మగును. అన్యాయముగ సంపాదించిన డబ్బుతో చేసిన యాగమువలన నీ లోకమున కీర్తియు పరలోకమున సౌఖ్యమును గలుగజాలవు. కావున న్యాయధర్మములతో గడించిన ద్రవ్యములతో యాగ మొనరించినచో నిహమందు కీర్తియు పరమందు సుఖశాంతులను గల్గును.
ప్రత్యక్షంతవ రాజేంద్ర! పాండవైస్తు మఖః కృతః | రాజసూయః క్రతువరః సమాప్తవర దక్షిణః. 10
యత్రసాక్షా ద్ధరిఃకృష్ణోయాదవేంద్రో మహామనాః | బ్రాహ్మణాః పూర్ణవిద్యాశ్చ భారద్వాజా దయ స్తథా. 11
కృత్వాయజ్ఞం సుసంపూర్ణం మాసమాత్రేణ పాండవైః | ప్రాప్తం మహత్తరం కష్జం వనవాసశ్చ దారుణః. 12
పీడనంచైవ పాంచాల్యా స్తథాద్యూతే పరాజయః | వనవాసో మహత్కష్టం క్వగతం మఖజంఫలమ్. 13
దాసత్వంచ విరాటస్య కృతంసర్వైర్మహాత్మభిః | కీచకేనపరి క్లిష్టా ద్రౌపదీ చ ప్రమద్వరా.
14
ఆశీర్వాదా ద్విజాతీనాం క్వగతాః శుద్ధచేతసామ్ | భక్తిర్వా వాసుదేవస్య క్వగతాతత్ర సంకటే. 15
నరక్షితాతదా బాలాకేనాపి ద్రుపదాత్మజా | ప్రాప్తకేశగ్రహా కాలే సాధ్వీ చ వరవర్ణినీ. 16
కిమత్ర చింతనీయంవై ధర్మవై గుణ్య కారణమ్ | కేశ##వేసతిదేవేశే ధర్మపుత్త్రే యుధిష్టిరే.
17
భవితవ్య మితిప్రోక్తే నిష్ఫలం స్యాత్తదా%%గమః | వేదమంత్రాస్తథాన్యేవైవితథాఃస్యురసంశయమ్. 18
సాధనం నిష్ఫలం సర్వముపాయశ్చనిరర్థకః | భవితవ్యం భవత్యేవ వచనే ప్రతిపాదకే. 19
ఆగమో%ప్యర్థవాదః స్యాత్క్రియాః సర్వానిర్థకాః | స్వర్గార్థంచతపోవ్యర్థం వర్ణ ధర్మశ్చవైతథా. 20
సర్వం ప్రమాణం వ్యర్థం స్యాద్భవితవ్యేకృతే హృది | ఉభయం చాపిమం తవ్యందైవంచోపాయేవచ. 21
కృతే కర్మణి చేత్సిద్ధి ర్విపరీతా యదా భ##వేత్ | వై గుణ్యం కల్పనీయంస్యాత్ప్రాజ్ఞైః పండితమౌళిభిః. 22
తత్కర్మ బహుధాప్రోక్తం విద్వద్భిః కర్మకారిభిః | కర్తృభేదా న్మంత్ర భేదాద్ద్రవ్య భేదాత్తథాపునః. 23
పాండవులు భూరిదక్షిణలతో రాజసూయమను మహాయాగమొనరించుటెల్ల నీవెఱింగినదే కదా! అందు మహామనస్వియు యదువంశ తిలకుడునగు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగ నుండెను. సకల విద్యాపారంగతులగు భారద్వాజాది బ్రాహ్మణులు నుండిరి. ఆ యజ్ఞము పురిపూర్ణమైన పిదప నొక నెలకే వారు దారుణమైన వనవాస క్లేశము లనుభవించిరి. జూదమునందోటమి ద్రౌపది పరాభవము దుర్గమ వనవాస క్లేశములు వారనుభవించిరి గదా! మఱి వారి యాగఫలిత మేమైనట్లు? మహోర్జితులు మానధనులు ద్రౌపదీసహితులగు పాండవులు విరాటుని చెంత దాస్యమొనర్చిరే! రూపాభిమాని దుర్విదగ్ధుడు బలగర్వితుడునగు కీచకాధమునిచేత నారీమణి ద్రౌపది లాగబడినదే! అట్టి సంకటపరిస్థితులలో నెల్ల బ్రాహ్మణుల యాశీర్వచన బలము లేమయ్యెను? వాసుదేవునందలి వారి నిశ్చల భక్తికి ఫలిత మేమయ్యెను? ఆ సాధ్వీమతల్లియగు ద్రౌపదిని రక్షించువారే సభలో లేకపోయిరే! అయ్యో! ఆ పతివ్రతాతిలకము తలవెంట్రుకలు పట్టి నిండుకొలువులో నేలవడనీడ్చిరి గదా! సర్వభూతాత్మకుడగు వాసుదేవుడును ధర్మసుతుడగు ధర్మరాజును బ్రదికియుండగనే ధర్మమునకు గ్లాని యేర్పడెను గద! దీని కంతటికిని కారణమేమో విచారింపవలసి యున్నది. దీనికంతటికిని భవితవ్యతయే కారణ మందుమా! అది సరిగాదు. అట్లన్నచో ఆగమములు నిష్ఫలములగును. వేద మంత్రములు పొల్లుమాటలగును. ఇది నిజము. ఇంతేకాక ఇతరోపాయములన్నియు సాధనములన్నియు నిరర్థకములు నిష్పలములు నగును. కేవలము భవితవ్యతకే బలము చేకూరును. అత్తరినెల్ల యాగమములు నర్థవాదములగును. కర్మములు నిరర్థకములగును. స్వర్గ నిమిత్తమైన తపము వ్యర్థమగును. వర్ణాశ్రమ ధర్మములు వ్యర్థములగును. భవితవ్యత యొకటే హృదయములలో బలపడినచో దైవమును సర్వప్రమాణములు నుపాయములును వ్యర్థములగును. మన మొనరించిన మంచిపనికేదైన వైపరీత్యము జరిగినచో నందేదియో దోషమున్నదని విజ్ఞులు పండితులు భావింపవలయును. కర్మ బహువిధములుగ నుండునని కర్మవిదులగువారందురు. ప్రతి కర్మమును కర్తృభేదమున మంత్రభేదమున ద్రవ్యభేదమున ననేకభేదముల నొప్పుచుండును.
యథామఘవతా పూర్వం విశ్వరూపో వృతో గురుః | విపరీతం కృతంతేన కర్మమాతృహితాయవై. 24
దేవేభ్యో దానవేభ్యస్తుస్వ స్తీత్యుక్త్వాపునః పునః | అసురామాతృపక్షీయాఃకృతంతేషాంచరక్షణమ్. 25
దైత్యాన్దృష్ట్వా%తి సంపుష్టాంశ్చుకోపమఘవాతదా | శిరాంసితస్య వజ్రేణ చిచ్ఛేదతరసాహరిః. 26
క్రియావై గుణ్యమత్రైవకర్తృభేదాదసంశయమ్ | నోచేత్పం చాల రాజేన రోషేణాపికృతాక్రియా. 27
భారద్వాజ వినాశాయ పుత్రస్యోత్పాదనాయచ | ధృష్టద్యుమ్నః సముతృన్నో వేదిమధ్యాచ్చ ద్రౌపదీ. 28
పురాదశరథేనాపి పుత్రేష్టిస్తు కృతాయదా | అపుత్రస్యసుతాస్తస్య చత్వారః సంప్రజజ్ఞిరే. 29
అతః క్రియాకృతా యుక్త్యా సిద్ధిదాసర్వథాభ##వేత్ | అయుక్త్యా విపరీతా స్యాత్సర్వథానృపసత్తమ; 30
పాండవానాం యథాయజ్ఞేకించి ద్వైగుణ్యయోగతః | విపరీత ఫలం ప్రాప్తం నిర్జితాస్తే దురో దరే. 31
సత్యవాదీ తథతారాజన్ధర్మ పుత్రో యుధిష్ఠిరః | ద్రౌపదీచ తథాసాధ్వీ యథా%న్యే%ప్యనుజాఃశుభాః. 32
కుద్రవ్యయోగా ద్వైగుణ్యం సముత్పన్నం మఖే%థవా | సాభిమానైఃకృతా ద్వా%పి దూషణంసముపస్థితమ్. 33
సాత్త్వికస్తు మహారాజ! దుర్లభోవైమఖఃస్మృతః | వై ఖానస మునీవాంహి విహితో%సౌ మహామఖః. 34
ఎట్లన - తొల్లి యింద్రుడు విశ్వరూపుడనువానిని తన గురువుగ వరించెను. కాని యా గురువు తన తల్లి పక్షమువారగు రాక్షసుల హితమునుకోరి విపరీతకార్యమొనరించెను. ఆ గురువు దేవతలకు (ప్రత్యక్షముగ) రాక్షసులకు (పరోక్షముగ) స్వస్తియగుగాక యని మాటమాటకు పలికెను. మాతృపక్షమువారగు రాక్షసులు కూడ రక్షణ చేసెను. మంత్రబలమున పుష్టిజెందిన దానవులగని యింద్రుడు కోపించి తన వజ్రముతో విశ్వరూపుని శిరములను శీఘ్రముగ ఖండించెను. ఇట్లిచట కర్తృభేదమున నిస్సంశయముగ క్రియలో దోషము సంభవించినది. కర్మ వైగుణ్యము లేనిచో నధికఫలము కలుగును. ఎట్లనగా-పాంచాల రాజగు ద్రుపదుడు రోషముతో యాగమొనర్చినను ద్రోణాచార్యుని నాశము చేయగల పుత్త్రుడు గలుగవలయునని మాత్రమే భావించి యాగము చేసినను ఫలితముగ యజ్ఞవేదినుండి ధృష్టద్యుమ్నుడుదయించుటయేకాక అధికముగ ద్రౌపదియును యాగమున సంభవించినదిగదా! తొల్లి యపుత్త్రకుడగు దశరథుడు ఒక్క కుమారుని కొఱకు పుత్త్రకామేష్టి యొనరింపగ యజ్ఞాగ్ని నుండి నలువురు కుమారులుద్భవించిరి. కాననోమహీశా! యుక్తితో చేసిన ప్రతి పనియు సిద్ధించును. అయుక్తితో చేసిన ప్రతి పనియు విపరీతఫలమొసంగును. యాగమందలి కొలది దోషమువలన పాండవులు జూదమందోడుట మున్నగు వ్యతిరేక ఫలములందిరి. సత్యవాదియు ధర్మసుతుడునగు యుధిష్ఠిరుడు నతని తమ్ములును ద్రాపదియు నిందఱుండియు శుభులైనవారు ఇందఱున్నను పాపద్రవ్యము వలనో సాభిమానత్వము కారణముననో వారుచేసిన యాగమునందు వైగుణ్యమును దానివలన విపరీత ఫలమును ప్రాప్తించినవి. రాజవర్యా! సాత్విక యజ్ఞము కడుంగడు దుర్లభ##మైనది. అది కేవలము వైఖానస వ్రతనిష్ఠులగు మునివర్యులకే విధింపబడినది.
సాత్త్వికం భోజనంయేవై నిత్యం కుర్వంతి తాపసాః | న్యాయార్జి తం చ వన్యంచ తథాఋష్యం సుసంస్కృతమ్. 35
పురోడాశపరా నిత్యం వియూపా మంత్ర పూర్వకాః | శ్రద్ధాధికామఖా రాజాన్సాత్త్వికాః పరమాః స్మృతాః. 36
రాజసా ద్రవ్య బహుళాః సయుపాశ్చసుసంస్కృతా | క్షత్రియాణాం విశాంచైవ సాభి మానాశ్చవై మఖాః. 37
తామసాదా నవానాంవైసక్రోధా మదవర్ధకాః | సామర్షాః సంస్కృతాః క్రూరా మఖాఃప్రోక్తా మహాత్మభిః. 38
మునీనాం మోక్షకామానాం విరక్తానాం మహాత్మనామ్ | మానసస్తుస్మృతో యాగః సర్వసాధనసంయుతః. 39
అన్యేషు సర్వ యజ్ఞేషు కించిన్న్యూ నం భ##వే దపి | ద్రవ్యేణ శ్రద్ధయా వా%పి క్రియయా బ్రాహ్మణౖస్తథా. 40
దేశకాల వృథ గ్ద్రవ్య సాధనైః సకలైస్తథా | నాన్యోభవతి పూర్ణోవైతథా భవతి మానసః. 41
ప్రథమంతు మనఃశోధ్యం కర్తవ్యగుణ వర్జితమ్ | శుద్ధేమనసి దేహోవై శుద్ధ ఏవ న సంశయః. 42
ఇంద్రియార్థ పరిత్యక్తం యదాజాతం మనశ్శుచి | తదాతస్యమఖస్యాసౌ ప్రభ##వేదధి కారవాన్. 43
తదా%సౌమండపంకృత్వా బహుయోజన విస్తృతమ్ | స్తంభైశ్ఛవిపులైః శ్లక్ణైర్యజ్ఞి యద్రుమ సంభ##వై. 44
వేదించ విశదాంతత్ర మనసా పరికల్పయేత్| అగ్నయో%పి తథా స్థాప్యావిధివన్మనసాకిల.
45
అట్టి తాపసోత్తములు న్యాయార్జితము వన్యము ఋషిహితకరము సుసంస్కృతమునగు స్తాత్విక భోజనము చేయుదురు. అదే మేలైనది. పురోడాశములు మాత్రము గలిగియూ పరహితమై శ్రద్ధాభక్తులతో పరమ సంయమముతో సమంత్రకముగ నొనర్పబడు యజ్ఞములు సాత్త్విక యజ్ఞములనబడును. ఇక రాజస యజ్ఞములు ద్రవ్యబహుళ##మై యూపస్తంభము గలిగి అభిమాన సహితములై యుండును. అవి క్షత్త్రియులకు వైశ్యులకు విహితములు. కామక్రోధములను మదలోభములను నినుమడింప జేయునని సంస్కారము గలవి క్రూరములునగు యాగములు తామసయాగములు. అవి రాక్షసులకు మహాత్ములచే ప్రోక్తములు. ముముక్షులు విరక్తులు మహాత్ములునైన మునులకు సర్వసాధనసహితమైన మానస యజ్ఞము చెప్పబడినది. ఇతర యాగములందు కొంచెము లోపమున్నను నది పూర్ణము కాదు. బ్రాహ్మణుల శ్రద్థ ద్రవ్యము క్రియ మున్నగు వాని విషయమున లోపములుండవచ్చును. అటులే దేశకాల సాధనములందును లోటుపాటులుండవచ్చును. అట్టియెడ అవి మానస యాగమువలె పరిపూర్ణములును దోషరహితములును గావు. మానసయజ్ఞమొక్కటే దోషరహితమై పూర్ణమై శుద్ధమై వెల్లును. మొదట మన మనస్సు పరిశుద్ధమగును. దాన దేహము గూడ శుద్ధ (పాపరహిత) మగును. విషయరహితమై వృత్తులుబాసి నిర్మలమైన చిత్తముకల యతడే నిజమైన యజ్ఞాధికారి. అట్టి తగిన యాగాధికారి తన హృదయాంతరాళములో చక్కని యజ్ఞ వృక్షముల స్తంభములతో పెక్కు యోజనముల వఱకు చల్లని దేవీ మండపములు కల్పించుకొనవలయును. ఆ మండపమున తన పవిత్రమైన మనసుచే చక్కని యజ్ఞవేదికను కల్పించుకొని యందగ్నులను విధివిధానముగ తన మనసుచే ప్రతిష్టింపవలయును.
బ్రాహ్మణానాంచ వరణం తథైవ ప్రతిపాద్యచ | బ్రహ్మో%ధ్వర్యుస్తథాహోతా ప్రస్తోతా విధి పూర్వకమ్. 46
ఉద్గాతా ప్రతిహర్తాచ సభ్యాశ్చాన్యేయథావిధి | పూజనీయాః ప్రయత్నేన మనసైవ ద్విజోత్త మాః. 47
ప్రాణో%పానస్తథా వ్యానః సమానో దాన ఏవచ | పావకాః పంచ ఏవైతే స్థాప్యావేద్యాంవిధానతః. 48
గార్హపత్య స్తదా ప్రాణో%పానశ్చా హవనీయకః | దక్షిణాగ్ని స్తథా వ్యానః సమానశ్చావసథ్యకః. 49
సభ్యోదానః స్మృతా హ్యేతే పావకాః పరమోత్కటాః | ద్రవ్యం చ మనసాభావ్యం నిర్గుణం పరమంశుచి. 50
మన ఏవతదా హోతా యజమానస్త థైవతత్ | యజ్ఞాధిదేవతా బ్రహ్మ నిర్గుణం చ సనాతనమ్. 51
ఫలదా నిర్గుణా శక్తిః సదా నిర్వేదదాశివా | బ్రహ్మ విద్యా%భిలాధారా వ్యాప్యసర్వత్ర సంస్థితా. 52
తదుద్దే శేన తద్ద్రవ్యం హువేత్ప్రాణాగ్నిషు ద్విజః | పశ్చాచ్చిత్తం నిరాలం బంకృత్వా ప్రాణా నపిప్రభో. 53
కుండలీ ముఖ మార్గేణ హువే ద్బ్రహ్మణి శాశ్వతే | స్వానుభూ త్యాస్వయం సాక్షాత్స్వాత్మభూ తాం మహేశ్వరీమ్. 54
సమాధినైవ యోగేన ధ్యాయే చ్చేత స్యనాకులః | సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని. 55
యదా వశ్యతి భూతా త్మాతదా పశ్య తితాంశివామ్ | దృష్ట్యా తాం బ్రహ్మ విద్భూయా త్సచ్చిదానంద రూపిణీమ్. 56
తదా మాయా దికం సర్వం దగ్ధం భవతి భూమిప | ప్రారబ్ధ కర్మ మాత్రంతు యావద్దే హంచతిష్ఠతి. 57
జీవన్ముక్తస్తదా జాతో మృతోమోక్ష మవాప్నుయాత్ | కృతకృత్యో భ##వేత్తాత! యోభ##జే జ్జగదంబికామ్. 58
ఆ మానసయాగమును బ్రహ్మ-అధ్వర్యుడు-హోత-ప్రస్తోత ఉద్గాత-ప్రతిహర్త యితర సభ్యులు మున్నగు బ్రాహ్మణోత్తములను యథావిధిగ ఋత్విక్కులుగ వరించవలయును. మఱియు నా యాగమందు ఆ ఋత్విక్కులను మనస్సుతోనే విధ్యుక్తముగ పూజింపవలయును. ఆ యజ్ఞవేదికయందు ప్రాణము-అపానము-వ్యానము-ఉదానము-సమానము అను పంచప్రాణములను పంచాగ్నులను స్థాపింపవలయును. వానిలో ప్రాణమును గార్హపత్యాగ్నిగ అపానము నాహవనీయముగ వ్యానమును దక్షిణాగ్నిగ సమానము నావసథ్యాగ్నిగను ఉదానమును సభ్యాగ్నిగను నీ పంచాగ్నులు పరమోత్కృష్టములుగ చెప్పబడినవి. ఈ పావకులు కామప్రదులు-మహాశ్రేష్ఠులు. ఆ పిదప నంతరంగమందు పరమపావనమైన నిర్గుణ ద్రవ్యములను భావించి సమకూర్పవలయును. ఆ మానసయజ్ఞమందు మనస్సును హోతగ యజమానునిగ నెన్నవలయును. యజ్ఞాధి దేవతగ నిర్గుణ సనాతన పరబ్రహ్మమే యుండవలయును. నిర్గుణ శివాశక్తి మోక్షఫలప్రదాయిని-బ్రహ్మవిద్య-సదాధార-సర్వవ్యాపినియై యంతట జ్యోతిర్మయియై వెలుగొందును. ఆ తరువాత శ్రీ నిర్గుణ జగదంబ నుద్దేశించి కల్పించిన వస్తువులను బ్రహ్మాగ్నిలో వేయవలయును. పిదప చిత్తప్రాణముల నేకగ్రీవముగ నిరాధారముగ సంకల్పరహితముగ నొనరింపవయలును. ప్రాణములను కుండలీ ముఖమార్గమున పరబ్రహ్మమందు లగ్న మొనరింపవలయును. అట్టి స్థితిలో సంకల్పవికల్పములు బ్రహ్మసమాధిలో నశించును. ఆత్మసాధకుడు స్వాత్మానుభవముతో సర్వాత్మభూతయగు మహేశ్వరిని స్వయముగ సమాధియోగమున నిర్వికల్పుడై ధ్యానింపవలయును. అపుడా యోగి సర్వభూతములను తన యాత్మలోను తన్ను సర్వభూతాత్మలోనూ నున్నట్లు తెలివివెలుగుతో దెలిసికొనగలుగును. అపుడా విధేయాత్ముడు పరమదివ్యమంగళ విగ్రహ శివ యగు శ్రీదేవి సందర్శనభాగ్య మనుభవించగలడు. ఆ పరమయోగి సచ్చిదానందస్వరూపిణిలో లీనమై బ్రహ్మానంద భూయము నందును. దాన ఆ నాడీ హృదయ దౌర్బల్యములు దగ్ధమైపోవును. తనువు మాత్రము ప్రారబ్ధమనుభవించుటకు నిలుచును. ఇట్లా జగదంబను మానసయాగమున నెవడు ధ్యానించునో వాడు సోమపానము చేసినవాడగును. కృతకృత్యుడు-జీవన్ముక్తుడు నగును. వాని యెల్ల కాలమములు ఫలించును. అతడు పరమ నిఃశ్రేయసమందగలడు. ఇది నిజము.
తస్మా త్సర్వ ప్రయత్నేన ధ్యేయా శ్రీభువనే శ్వరీ | శ్రోతవ్యాచైవ మంతవ్యా గురువా క్యాను సారతః. 59
రాజన్నే వంకృతో యజ్ఞో మోక్షదో నాత్రసంశయః | అన్యేయజ్ఞాః సకా మాస్తు ప్రభ వంతి క్షయో న్ముఖాః. 60
అగ్నిష్టో మేన విధి వత్స్వర్గ కామో యజే దితి | వేదాను శాసనం చైత త్ప్రవదంతి మనీషిణః. 61
క్షీణ పుణ్య మృత్యులోకం విశంతి చయథా మతి | తస్మాత్తుమానసః శ్రేష్ఠో యజ్ఞో%ప్యక్షయ ఏవ సః. 62
నరాజ్ఞాసాధితుం యోగ్యో మఖో%సౌజయ మిచ్ఛతా | తిమసస్తు కృతః పూర్వం సర్పయజ్ఞస్త్వయా%ధునా. 63
వైరం నిర్వాహి తంరాజం స్తక్షకస్య దురాత్మనః | యత్కృతే నిహతాః సర్పాస్త్వయా%గ్నౌ కోటిశః పరే. 64
దేవీ యజ్ఞం కురు ష్వాద్య వితతం విధి పూర్వకమ్ | విష్ణునా యఃకృతః పూర్వం సృష్ట్యా దౌనృప సత్తమ! 65
తథా త్వంకురు రాజేంద్ర! విధింతే ప్రబ్ర వీమ్యహమ్ | బ్రాహ్మణాః సంతి రాజేంద్ర! విధిజ్ఞా వేదవిత్తమాః. 66
దేవీ బీజ విధానజ్ఞా మంత్ర మార్గవిచక్షణాః | యాజకాస్తే భవిష్యంతి యజమానస్త్వ మేవహి. 67
కృత్వా యజ్ఞం విధానేన దత్వాపుణ్యం మఖార్జి తమ్ | సముద్ధర మహారాజ! పితరం దుర్గతిం గతమ్. 68
విప్రావమానజం పాపం దుర్ఘటం నరక ప్రదమ్ | తథైవ శాపజో దోషః ప్రాప్తిః పిత్రా తవా%నఘ! 69
కనుక శ్రీభువనేశ్వరీదేవిని గురు వాక్యములను బట్టి ప్రయత్నించి తెలిసికొని ధ్యానించవలయును. ఇట్లు నిశ్చలముగ నొనరించిన మానసయజ్ఞము నిస్సంశయముగ పరమపద సౌఖ్య మొనగూర్చగలదు. ఇతర యాగములు సకామములై క్షణఫలము లగును. స్వర్గకాములు విధిగా నగ్నిష్టోమయాగ మొనర్పవలయునని వేదములు శాసించుచున్నవని మనీషులందురు. కాని వారును క్షీణపుణ్యులై తిరిగి మర్త్యలోకమునకు వత్తురు. కనుక నక్షయ ఫలప్రదమైన మానసయజ్ఞమే యెల్ల విధముల సర్వశ్రేష్ఠమైనది. జయకాంక్షులగు రాజుల కీ మానసయాగము సాధ్యముగాదు. నీవును తొల్లి తామస చిత్తవృత్తితో సర్పయాగ మొనరించితివి. నీవు నీ శత్రువగు తక్షకునితో పగ సాధించుట కనేక సర్పముల నిండుప్రాణముల నగ్ని కాహుతి యొనర్చితివి. కనుక నీ విపుడు భవ్యమైన శ్రీదేవీ మహాయజ్ఞము విధిప్రకార మాచరింపుము. పూర్వము సృష్టి ప్రారంభమునందా యజ్ఞమును శ్రీమహావిష్ణు వాచరించెను. అదే విధముగ నీవును శ్రీదేవీయాగ మొనరింపుము. నీ కా యజ్ఞ విధానము తెలియపఱచెదను. వేదవిదులగు బ్రాహ్మణులు యజ్ఞ విధానము సమగ్రముగ నెఱిగినవారు గలరు. వారు మంత్రశాస్త్రవేత్తలు. సమయమార్గ విచక్షణులు. శ్రీకామరాజ బీజ విధానజ్ఞులు. అట్టి వారు యాజకులుగ నుందురు. నీవు యజమానుడవు కమ్ము. నీవు విధిగ శ్రీదేవీ యజ్ఞ మాచరించి యాగఫలమును నీ పితరుల కొసంగి వారిని దుర్గతులనుండి సముద్ధరింపుము. ఏ విప్రునైన నిందించిన దోషము దుర్భరమును నరకప్రదము నగును. నీ తండ్రి కట్టి విప్రనిందవలన దోషము సంప్రాప్తమైనది.
తథా దుర్మణం ప్రాప్తం సర్ప దంశేన భూభుజా | అంత రాళే తథా మృత్యుర్న భూమౌ కుశ సంస్తరే. 70
న సంగ్రామే న గంగా యాం స్నానదానాది వర్జి తమ్ | మరణంతే పితుస్తత్ర సౌధేజాతం కురూద్వహ! 71
కపూణానిచ సర్వాణి నరక స్యనృ పోత్తమ | తత్రై కంకారణం తస్యా నజాతం చాతి దుర్లభమ్. 72
యత్ర యత్ర స్థితః ప్రాణీ జ్ఞాత్వా కాలం సమా గతమ్ | సాధనా నామ భావే%పి హ్యవశశ్చా తిసంకటే. 73
యదా నిర్వేద మాయాతి మనసా నిర్మలే నవై | పంచ భూ తాత్మకో దేహో మమ కిం చాత్రదుః ఖదమ్ : 74
పతత్వద్య యథా కామం ముక్తో%హం నిర్గుణో%వ్యయః | నాశాత్మకాని తత్త్వాని తత్రకా పరిదే వనా! 75
బ్రహ్మై వాహం నసం సారీ సదా ముక్తః సనాతనః | దేహేన మమ సంబంధః కర్మణా ప్రతి పాదితః 76
తాని సర్వాణి ముక్తాని శుభాని చేత రాణిచ | మనుష్య దేహ యోగేన సుఖదుః ఖాను సాధనాత్. 77
విముక్తో%తిభ యాద్ఘో రాద స్మాత్సం సార సంకటాత్ | ఇత్యేవం చింత్య మానస్తు స్నానదాన వివర్జితః. 78
మరణం చేదవాప్నోతి సముచ్యేజ్జన్మ దుఃఖతః | ఏషాకాష్ఠాపరాప్రోక్తా యోగినా మపి దుర్లభా. 79
పితాతే నృపశార్దూల! శ్రుత్వాశాపంద్విజోదితమ్ | దేహే మమత్వం కృతవాన్న నిర్వేద మవాప్తవాన్. 80
నీ తండ్రి పాముకాటుచే నంతరాళమున దుర్మరణ మొందెను. ఆతడు దర్భలపైగాని భూమిపైగాని చావలేదు. ఓ కురువరా! ఓ తండ్రి చావు రణమునగాని పావనగంగానదిలోగాని జరుగలేదు. ఆతని భవనమందే స్నాన దాన రహితముగ సంభవించినది. ఓ నరవరా! కుత్సితమైన పనులన్నియు నరకమునకై దారి తీయును. వానిలో నే యొక్కటియు జీవుల నుద్ధరింపజాలదు. కావున ప్రతి ప్రాణియు నెచ్చటనైన నెప్పుడైన తనకు కాలము మూడినచో తాను సాధనరహితుడైనను సంకటములలో బడియున్నను నిర్మలచిత్తముతో వైరాగ్యసంపన్నుడై యిట్లు చింతింపవలయును: ''ఈ దేహము పాంచ భౌతికము; దుఃఖదాయకము; నాకేదియులేదు. ఈ శరీరము నేడు పడిపోయినపోవుగాక! ఆత్మస్వరూపుడనగు నేను శాశ్వతుడను; ముక్తుడను; నిర్గుణుడను. ఈ భౌతిక పదార్థములు నశ్వరములు. ఇక వీనికొఱకు శోకింపనేల? నేనే సనాతనుడను; నేనే సదాముక్తుడను; నేనే బ్రహ్మమను; నేనే సంసారముక్తుడను; నా కీ శరీరముతో నెట్టి సంబంధమును లేదు. కర్మలవలననే నా కీ తనువుతో సంబంధ మేర్పడినది. మానవు డీ దేహసంబంధమువలన సుఖదుఃఖ సాధనములను శుభాశుభములను ననుభవించును. నేను భయంకరము-ఘోరము-దుఃఖదమునైన సంసారసాగర మందుండి విముక్తుడనైతిని'' అని యిట్లు చింతించువాడు. స్నానదానములు చేయనవసరములేదు. అతడు మరణించి జన్మమరణ దుఃఖములనుండి విడువబడును. ఇది పరమయోగులకును దుర్లభ##మైన పరకాష్ఠాగతి. ఓ నరశార్దూలా! నీ తండ్రి విప్రశాపము విని గూడ తన శరీరమందలి మమకారము వదలుకొనలేకపోయెను. వైరాగ్యభాగ్య మందలేక చిక్కులోబడి ఈ చెప్పబోవు విధమున పలుకుచుండెను:
నీరోగో మమదేహో%యం రాజ్యం నిహతకంటకమ్ | కథం జీవామ్యహంకామం మంత్రజ్ఞానానయంతువై. 81
ఔషధం మణిమంత్రౌ చయంత్రం పరమకంతథా | ఆరోహణంతథా సౌధేకృతవాన్మంత్రిభిస్తదా. 82
నస్నానంనకృతం దానం నదేవ్యాః స్మరణం కృతమ్ | నభూమౌ శయనం చైవ దౌవం మత్వాపరంతథా. 83
మగ్నేమోహార్ణవే ఘోరేమృతః సౌధే%హినాహతః | కృత్వాపాపంకలేర్యొగా త్తాపసస్యావ మానజమ్. 84
అవశ్య మేవనరక మేతైరా చరణౖర్భవేత్ | తస్మాత్తం పితరం పాపాత్సముద్ధర! నృపోత్తమ. 85
సూత ఉవాచ! ఇతి శ్రుత్వావచ స్త స్యవ్యాసస్మాఇతతేజసః | సాశ్రుకంఠో%తి దుఃఖార్తోబభూవ జనమే జయః. 86
ధిగిదం జీవితంమే%ద్య పితామేనరకే స్థితః | తత్కరోమి యథైవాద్య న్వర్గం యాత్యుత్తరాసుతః. 87
ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ తృతీయ స్కందే ద్వాదశో%ధ్యాయః.
'నే నెట్లు రోగముక్తుడ నగుదును? నా రాజ్య మెట్లు నిష్కంటకముగ నుండగలదు? నే నెట్లు జీవింపగలను? మంత్ర విదులను రావింపుడు' అని పలికెను. ఇట్లు నీ తండ్రి మణిమంత్రౌషధములతో యంత్రములతో తన చావును బాపుకొనుటకు సౌధోపరిభాగమున తలదాచుకొనెను. అట్టి చావుదశలోగూడ నీ తండ్రి శ్రీదేవి నొక్కసారియైన భక్తితో నమ్మా! యని నోరార పిలిచి యెఱుగడు. స్నానదానములు చేసికొనలేదు. దైవము బలవత్తరమైనదని నేల పై నైనను శయనింపలేదు. తుదకు కలి ప్రభావమున తాప సోత్తము నవమానించిన ఫలముగ మోహార్ణవమందు మునిగి నీ తండ్రి మేడపై ఘోర దుర్మరణమునకు బలియయ్యెను. ఇట్టి వానివలన తప్పక నరకము ప్రాప్తమగును. కాన నీ విపుడు నీ పితరుని పాపకూపము నుండి సముద్ధరింపుము. అమితతేజస్వి యగు వ్యాసుని యీ వచనము లాలకించి జనమేజయుడు కనులనిండ దుఃఖాశ్రులు నిండగ రుద్ధకంఠముతో విలపించుచు నా తండ్రికి సద్గతి గల్గనిచో నా జీవితము వ్యర్థము. కాన నా తండ్రికి సద్గతులు గల్గునట్టు లొనర్తును అని పలికెను.
ఇది శ్రీదేవీ భాగవతమందలి తృతీయ స్కంధమున పండ్రెండవ యధ్యాయము.