Sri Devi Bhagavatam-1    Chapters   

సప్తమాధ్యాయము

సూత ఉవాచ : 

తౌ వీక్ష్యబలినౌ బ్రహ్మో తదోపాయానచింతయత్‌సామదానభిదాదీంశ్చ యుద్ధాంతాన్‌సర్వతంత్రవిత్‌. 1

న జానే%హం బలం నూన మేతయో ర్వా యథాతథమ్‌ | అజ్ఞాతే తు బలే కామం నైవ యుద్ధం ప్రశస్యతే. 2

స్తుతిం కరోమి చే దద్య దుష్టయో ర్మదమత్తయోః | ప్రకాశితం భ##వే న్నూనం నిర్బలత్వం మయా స్వయమ్‌. 3

వధిష్యతి తదైకో%పి నిర్బలత్వే ప్రకాశితే | దానం నైవాద్య యోగ్యం వా భేదః కార్యో మయా కథమ్‌. 4

విష్ణుం ప్రబోధయామ్యద్య శేషే సుప్తం జనార్దనమ్‌ | చతుర్భుజం మహావీర్యం దుఃఖహా స భవిష్యతి. 5

ఇతి సంచింత్య మనసా పద్మనాళగతో%బ్జజః | జగామ శరణం విష్ణుం మనసా దుఃఖనాశనమ్‌. 6

తుష్టావ బోధనార్థం తం శుభైః సంబోధనై ర్హరిమ్‌ | నారాయణం జగన్నాథం నిస్పందం యోగనిద్రయా. 7

బ్రహ్మోవాచ : దీననాథ! హరే! విష్ణో! వామనోత్తిష్ఠ! మాధవ! భక్తార్తిహృ ద్ధృషీకేశ! సర్వావాస! జగత్పతే! 8

అంతర్యామి! న్న మేయాత్మ! న్వాసుదేవ! జగత్పతే! దుష్టారినాశ##నై కాగ్రచిత్త! చక్రగదాధర!. 9

సర్వజ్ఞ! సర్వలోకేశ! సర్వశక్తిసమన్విత! ఉత్తిష్ఠోత్తిష్ఠ! దేవేశ! దుఃఖనాశన! పాహి! మామ్‌. 10

విశ్వంభర! చిశాలాక్ష! పుణ్యశ్రవణకీర్తన! జగద్యోనే! నిరాకార! సర్గస్థిత్యంతకారక. 11

ఇమౌ దైత్యౌ మహారాజ! హంతుకామౌ మదోద్ధతౌ న జానా స్యఖిలాధార కథం మాం సంకటే గతమ్‌. 12

ఉపేక్షసే%తిదుఃఖార్తం యది మాం శరణం గతమ్‌ | పాలకత్వం మహావిష్ణో! నిరాధారం భ##వే త్తతః. 13

ఏవం స్తుతో%పి భగవా న్న బుబోధ యదా హరిః | యోగనిద్రాసమాక్రాంత స్తదా బ్రహ్మా హ్యచింతయత్‌. 14

ఏడవ అధ్యాయము

విష్ణుప్రబోధము

సూతు డిట్లనియె: ఆ బలశాలురగు మధుకైటభ రాక్షసులను జూచి బ్రహ్మ సర్వతంత్రజ్ఞుడగుటవలన సామదానభేదదండో పాయములను గూర్చి యాలోచింపదొడంగెను: ''వీరికి బలమెంతగలదో నిశ్చయముగ నాకు తెలియదు. కనుక నెదుటివాని బలాబలము లెఱుగక పోరుసలుపుట మేలుగాదు. దుర్మార్గులు మదమత్తులునగు వీరిని నేనిపుడు పొగడినచో నా చేతకానితనము నా చేతనే ప్రకాశింప చేయబడినట్లగును. నా దౌర్బల్యము బట్టబయలైనంతనే వీరిలో నొక్కడే నన్ను దునుమాడగలడు. వీరు దానముచేతను వశముగారు. ఇక వీరిపై భేదోపాయమునెట్లు ప్రయోగింపగలను? కాన నేనిపుడు శేషశయనుడగు భగవంతుని మేలుకొలుపుదును. ఆతడు మహాసత్త్వుడు - జనార్దనుడు - చతుర్భుజుడు - ఆతడే నా వెతలు బాపగలవాడు.'' ఈ విధముగ నెమ్మది దలంచి కమలాసనుడగు బ్రహ్మ వేగమే శోకనాశకుడు సర్వము తానయైనవాడు నగు వాసుదేవుని శరణు జొచ్చెను. ఆ జగత్పతి యోగనిద్రలో మునిగి కదలకుండెను. అట్టి నారాయణుని మేలుకొలుపుటకు బ్రహ్మ పలు మేలైన సంబోధనలతో హరి నిట్లు సంస్తుతించెను: ''ఓ దీననాథా! శ్రీహరీ! మాధవా! వామనా! భక్తత్రాణపరాయణా! జగత్పతీ! మేలుకోగదవయ్యా! సర్వాంతర్యామీ! అమేయాత్మా! వాసుదేవా! విపక్షశిక్షా దక్షా! చక్రగదాధరా! విశ్వాధారా! హృషీకేశా! మేలుకోగదవయ్యా. సర్వజ్ఞా! లోకేశా! సర్వశక్తి సమన్వితా! శోకనాశనా! దీనపరిపాలకా! లేలెమ్ము-మేలుకోగదవయ్యా. ఓ విశ్వంభరా! విశాలాకారా! పుణ్యశ్రవణకీర్తనా! నిరాకారా! లోక సృష్టి స్థిత్యంతకారకా! మేలుకోగదవయ్యా! నీవఖిలాధారుడవే! నీకిదంతయును దెలియుటలేదా! శ్రీ మహావిష్ణో! శరణార్థిని దీనుని దుఃఖితుని నన్నే యుపేక్షించినచో నింకమీదట నీ పాలకత్వమునకు భంగము వాటిల్లదా?' అని పెక్కుభంగుల సన్నుతించినను హరి యోగనిద్రావశుడై మేల్కొనలేదు. అపుడు బ్రహ్మ మరల తన యెదలో నిట్లు తలంచెను:

నూనం శక్తి సమాక్రాంతో విష్ణు ర్నిద్రావశం గతః | జజాగార న ధర్మాత్మా కిం కరో మ్యద్య దుఃఖితః. 15

హంతుకామా వుభౌ ప్రాప్తౌ దానవౌ మదగర్వితౌ | కిం కరోమి క్వ గచ్ఛామి నాస్తి మే శరణం క్వచిత్‌. 16

ఇతి సంచింత్య మనసా నిశ్చయం ప్రతిపద్య చ | తుష్టావ యోగనిద్రాం తా మేకాగ్రహృదయః స్థితః. 17

విచార్య మనసా% ప్యేవం శక్తి ర్మే రక్షణ క్షమా | మయా హ్యచేతనో విష్ణుః కృతో%స్తి స్పందవర్జితః. 18

వ్యసుర్యథా న జానాతి గుణాన్‌ శబ్దాదికా నిహ | తథా హరి ర్న జానాతి నిద్రా నిద్రయా%యం వశీకృతః. 20

యో యస్య వశ మాపన్నః స తస్య కింకరః కిల | తస్మాచ్చ యోగనిద్రేయం స్వామినీ మాపతే ర్హరేః. 21

సింధూజాయా అపి వశే యయా స్వామీ వశీకృతః | నూనం జగదిదం సర్వం భగవత్యా వశీకృతమ్‌. 22

అహం విష్ణు స్తథా శంభుః సావిత్రీ చ రమా%ప్యుమా | సర్వే వయం వశే%ప్యస్యా నాత్ర ఇకంచిద్విచారణా. 23

హరిర ప్యవశః శేతే యథా%న్యః ప్రాకృతో జనః యయా%భిభూతః కా వార్తా కిలాన్యేషాం మహాత్మనామ్‌. 24

స్తౌమ్యద్య యోగనిద్రాం వై యయా ముక్తో జనార్దనః | ఘటయిష్యతి యుద్ధం చ వాసుదేవః సనాతనః. 25

''ఈ హరియొక మహాశక్తికి లోబడి యుండుటచేత యోగనిద్రకు వశుడయ్యెను. కనుకనే యీ ధర్మాత్ముడెంతకును మేల్కొనుట లేదు. నేను దిక్కు మొక్కు లేని దీనుడను. ఇపుడేమి చేయగలను? ఈ మదమత్తులు దానవులు నన్ను వెన్నాడి చక్కాడ దలచుచున్నారు. ఇపుడేమి చేతును? ఎక్కడికేగుదును? నాకభయమొసంగునాథుడే యింక లేడా?'' ఇట్లు బ్రహ్మ తన మదిలో దలపోసిపోసి తుదకేకాగ్ర చిత్తముతో యోగమాయను సంతోషపఱచవలయునని నిశ్చయించుకొనెను. ఏ విశ్వశక్తి మూలమున హరి యచేతనుడై కదలకుండెనో, యా శక్తియే నను బ్రోవ సమర్థురాలగునని నిశ్చయించుకొనెను. ప్రాణము లేనివాడు శబ్దాది విషయము లెఱుగలేనట్లు యోగనిద్రలో నరమోడ్పు గన్నులవాడగు హరియు నేమియు నెఱుగలేకున్నాడు. ఇట్లెన్నెన్ని రీతుల కీర్తించినను హరి తనకూర్కును వదలుటలేదు. అందువలన కునుకితని వశమందులేదు. ఇతడే కున్కునకు వశీభూతుడయ్యెనని తోచుచున్నది. ఎవడెవని వశమున వర్తించుచుండునో వాడు వానికెల్లప్పుడు కింకరుడగును. ఈ కారణమున మాపతియగు హరికి యోగనిద్ర స్వామిని యగును. ఆ జలనిధి కన్యక సైతము హరిని తనవశమందుంచు కొనెను. కనుక నీ బ్రహ్మాండగోళములన్నియును సర్వశక్తుల కాదిశక్తియగు భగవతిచేతి కీలుబొమ్మలే. శ్రీహరి హరుడు రమ పార్వతి భారతి మేమెల్లరము నా శ్రీభగవతికి దాసానుదాసులమే. ఇందేమియు సందియము లేదు. ఆ హరియే సామాన్య మానవుని పగిది నిద్రా దేవతకు వశుడయ్యెను. ఇతర మహాత్ముల గుఱించి వేరుగ జెప్పెడి దేమి గలదు? కనుక నేనిపుడా యోగమాయనే ప్రస్తుతింతును. అపుడుగాని దేవి దయవలన హరి మేల్కాంచి వైరులతో సమరమొనరింపడు.''

ఇతి కృత్వా మతిం బ్రహ్మా పద్మనాళస్థిత స్తదా | తుష్టావ యోగనిద్రాం తాం విష్ణో రంగేషు సంస్థితామ్‌. 26

బ్రహ్మోవాచ : దేవి! త్వ మస్య జగతః కిల కారణం హి జ్ఞాతం మయా సకలవేదవచోభి రంబ

య ద్విష్ణు ర వ్యఖిలలోకవివేకకర్తా నిద్రావశం చ గమితః పురుషోత్త మో%ద్య. 27

కో వేద తే జనని మోహవిలాసలీలాం | మూఢో%స్మ్యహం హరి రయం వివశశ్చ శేతే |

ఈదృక్త యా సకలభూతమనోనివాసే విద్వత్తమో విభుదకోటిషు నిర్గుణాయాః. 28

సాంఖ్యా వదంతి పురుషం ప్రకృతిం చ యాం తాం చైతన్యభావరహితాం జగతశ్చ కీర్తిమ్‌ |

కిం తాదృశా%సి కథ మత్ర జగన్నివాస శ్చైతన్యతావిరహితో విహిత స్త్వయా%ద్వ. 29

నాట్యం తనోషి సగుణా వివిధప్రకారం నో వేత్తి కో%పి తవ కృత్యవిధానయోగమ్‌ |

ధ్యాయంతి యాం మునిగణా నియతం త్రికాలం సంధ్యేతినామపరికల్ప్యగుణాన్‌భవాని. 30

బుద్ధిర్హి బోధకరణా జగతాం సదా త్వం శ్రీశ్చాసి దేవి సతతం సఖదా సురాణామ్‌ |

కీర్తి స్తథా మతి ధృతీ కిల కాంతి రేవ శ్రద్ధా రతిశ్చ సకలేషు జనేషు మాతః. 31

నాతఃపరం కిల వితర్కశ##తైః ప్రమాణ ప్రాప్తం మయా మదిహ దుఃఖగతిం గతేన |

త్వం చాత్ర సర్వజగతాం జననీతి సత్యం నిద్రాళుతాం వితరతా హరిణా2త్రదృష్టమ్‌. 32

త్వం దేవి వేదవిదుషా మపి దుర్విభావ్యా వేదో%పి నూన మఖిలార్థతయా న వేద |

యస్మా త్త్వదుద్భవ మసౌ శ్రుతి రాప్నువానా ప్రత్యక్షమేవ సకలం తవ కార్య మేతత్‌. 33

కస్తే చరిత్ర మఖిలం భువి వేద ధీమా న్నాహం హరి ర్న చ భువో న సురా స్తథా%న్యే |

జ్ఞాతుం క్షమాశ్చ మునయో న మమాత్మజాశ్చ దుర్వాచ్య ఏవ మహిమా తవ సర్వలోకే. 34

యజ్ఞేషు దేవి యది నామ న తే వదంతి స్వాహేతి వేదవిదుషో హవనే కృతే%పి |

న ప్రాప్నువంతి సతతం మఖభాగధేయం దేవా స్త్వమేవ విబుధేష్వపి వృత్తిదా%సి. 35

అని యిట్లు పద్మాసనుడగు బ్రహ్మతలచి విష్ణునంగములందున్న యోగనిద్ర నిట్లు ప్రస్తుతింపదొడంగెను: ఓ దేవీ ! నీవే యీ యెల్లజగముల కన్నతల్లివని వేదములు పలుకగా చక్కగా నిక్కువ మెఱింగితిని. ఎల్లలోకములను పరమ వివేకమున బాలించు పురుషోత్తముడే నీ ప్రభావమువలన నిపుడు నిద్రావశుడయ్యెను. నీ మోహన విలాసలీల లెవడెరుంగగలడు? హరియును వివశుడై నిదురించుచున్నాడు. నేను మూర్ఖుడను. సకల భూతహృదయములలో నిండియుండు చైతన్యజ్యోతి నీవే. నిర్గుణాత్మికవగు నీ ప్రతిభా ప్రభావములు విబుధకోటులలో నెంత కోవిదుడైన నెఱుగ జాలడు. సాంఖ్యులు నిన్ను పురుష ప్రకృత్యాత్మికగ చైతన్య భావరహితనుగ లోకజనయిత్రిగ భావింతురు. నీవు నిక్కముగ నట్టిదానవా? కావు. నీవు ముమ్మాటికి చైతన్యజ్యోతిఃస్రవింతివే. కనుకనే నేడు విష్ణువు నీ మూలముననే చైతన్యము లేక పడియున్నాడు. నీవు సగుణరూపములతో బహుభంగుల మాయా జగన్నాటక సూత్రధారివై తనర్తువు. నీ కార్యప్రణాళిక నెట్టివాడును గ్రహింపజాలడు. నిన్ను మునులు సంధ్యాదేవతవని పిలుతురు. వారు నీ దివ్యసుగుణములను రేయనక పగలనక నీమముతో ధ్యానించుచు జపించుచుందురు. కనుక నీ విజ్ఞాన వినోదలీల లనంతములు. ఓ జననీ! నీవే యెల్లజగములకు తెలివి వెలుగు జూపు జ్ఞానరూపవు. దేవతలకు నిత్యసుఖకారిణియగు శ్రీవి. సకల ప్రాణులందలి శ్రద్ధ-బుద్ధి-మతి-ధృతి-కీర్తి-కాంతి-రతి- యివన్నియు నీవే. ఇంతకు మిక్కిలిగ తర్కవితర్కములతో బనియేమి? లోకముల కన్నిటికి నీవే మూలకారణ శక్తివి. నాకు దుఃఖము గలుగుటకును హరి నిద్రాళుడై యుండుటకును నీవే కారణమని నాకు ప్రత్యక్ష ప్రమాణము గోచరించుచున్నది. వేదమాతా! నీవు వేదవిదులకే తెలియరావు. ఆ వేదములు సకలార్థములను వెల్లడించగలవు. ఐన నవి నిన్నెఱుగజాలవు. ఏలయన, నన్నియును వేదమాతవగు నీ నుండియే యావిర్భవించినవిగదా! ఇట్లు సర్వకార్యములు నాకు ప్రత్యక్షముగ దోచుచున్నవి. నీ చరితమును తుదముట్ట తెలిసినవా డెవ్వడు? ఆ వైకుంఠుడు కైలాసవాసి సురలు నా కొమరులగు మునులు నేను నీ మహోజ్జ్వలమహిమ నర్థము చేసికొననేరము. ఎల్ల లోకములకే నీ మహిమ యందరానిది. ఓ పరాదేవీ! యజ్ఞములందు 'స్వాహా' యని నీ నామధేయమే పలుకబడును. అట్లు పలుకనిచో నమరులకు వారి భాగధేయము వారికి లభించదు. కనుక నెల్లదేవతల బ్రతుకుదెరువులు నీ చేతిలోనే కలవు.

త్రాతా వయం భగవతి! ప్రథమం త్వయా వై దేవారిసంభవభయా దధునా తథైవ |

భీతో%స్మి దేవి వరదే శరణం గతో%స్మి ఘోరం నిరీక్ష్య మధునా సహ కైటభం చ. 36

నో వేత్తి విష్ణు రధునా మమ దుఃఖ మేత జ్జానే త్వయా%%త్మవివశీకృతదేహయష్టిః |

ముంచాదిదేవ మథవా జహి దానవేంద్రౌ య ద్రోచతే తవ కురుష్వ మహానుభావే. 37

జానంతి యే న తవ దేవి పరం ప్రభావం ధ్యాయంతి తే హరిహరా వపి మందచిత్తాః |

జ్ఞాతంమయా%ద్య జనని ప్రకటం ప్రమాణం య ద్విష్ణుర ప్యతితరాం వివశో%థ శేతే. 38

సింధూద్భవా%పి న హరిం ప్రతిబోధితుం వై శక్తా పతిం తవ వశానుగమా%%ద్య శక్త్యా.

మన్యే త్వయా భగవతి ప్రసభం రమా%పి ప్రస్వాపితా న బుబుధే వివశీకృతేవ. 39

ధన్యా స్త ఏవ భువి భక్తి పరా స్తవాంఫ్ర° త్యక్త్వాన్యదేవభజనం త్వయి లీనభావాః |

కుర్వంతి దేవి భజనం సకలం నికామం జ్ఞాత్వా సమస్త జననీం కిల కామధేనుమ్‌. 40

ధీకాంతికీర్తి శుభవృత్తిగుణాదయస్తే విష్ణో ర్గుణాస్తు పరిహృత్య గతాః క్వచాద్య |

బందీకృతో హరి రసౌ నను నిద్రయా%త్ర శక్త్యా తవైవ భగవ త్యతిమానవత్యాః. 41

త్వం శక్తి రేవ జగతా మఖిల ప్రభావా త్వన్నిర్మతం చ సకలం ఖలు భావమాత్రమ్‌ |

త్వం క్రీడసే నిజనిర్మితమోహజాలే నాట్యే యథా విహరతే స్వకృతే నటోవై. 42

విష్ణు స్త్వయా ప్రకటితః ప్రథమం యుగాదౌ దత్తా చ శక్తి రమలా ఖలు పాలనాయ,

త్రాతం చ సర్వ మఖిలం వివశీకృతో%ద్య యద్రోచతే తవ తథాంబ కరోషి నూనమ్‌. 43

సృష్ట్యా%త్ర మాం భగవతి ప్రవినాశితుం చే న్నేచ్ఛా%స్తి తే కురు దయాం పరిహృత్య మౌనమ్‌ |

కస్మా దిమౌ ప్రకటితౌ కిల కాలరూపౌ యద్వా భవాని హసితుం ను కిమిచ్ఛసే మామ్‌. 44

జ్ఞాతం మయా తవ విచేష్టిత మద్భుతం వై కృత్వా%ఖిలం జగదిదం రమసే స్వతంత్రా |

లీనం కరోషి సకలం కిల మాం తథైవ హంతుం త్వమిచ్ఛసి భవాని కిమత్ర చిత్రమ్‌. 45

కామం కురుష్వ వధ మద్య మమైవ మాత ర్దుఃఖం న మే మరణజం జగదంబికే2త్ర |

కర్తా త్వయైవ విహితః ప్రథమం స చాయం దైత్యాహతో%థ మృత ఇ త్యయశోగరిష్ఠమ్‌. 46

ఉత్తిష్ఠ దేవి కురు రూప మిహాద్భుతం త్వం మాం వా త్విమౌ జహి యథేచ్ఛసి బాలలీలే |

నో చే త్ప్రబోధయ హరిం నిహనే దిమౌ య స్త్వత్సాధ్య మేతదఖిల కిల కార్యజాతమ్‌. 47

సూత ఉవాచ : ఏవం స్తుతా తదా దేవీ తామసీ తత్రవేధసా | నిఃసృత్య హరి దేహాత్తు సంస్తితా పార్శ్వత స్తదా. 48

త్యక్త్వాం%గాని చ సర్వాణి విష్ణో రతులతేజసః | నిర్గతా యోగనిద్రా సా నాశాయ చ తయో స్తదా. 49

విస్పందితశరీరో%సౌ యదా జాతో జనార్దనః ధాతా పరమికాం ప్రాప్తో ముదం దృష్ట్వాహరిం తతః. 50

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ప్రథమస్కంధే విష్ణుప్రబోధోనామ సప్తమో%ధ్యాయః.

ఓ వరదాయినీ! తల్లీ! తొల్లిటి కల్పమందు నీవు నన్ను గాపాడితివి. ఇపుడీ ఘోర క్రూర దానవులను గన్నంతనే నా గుండె జలదరించుచున్నది. వారి భయమున నిన్నే శరణనుచున్నాను. నన్ను బ్రోవుము. ఈ సమయమున హరి నా మొఱ వినునట్టులేడు. అతని తనువు నీ వశమందే కలదు. కనుక నీవు హరి నిద్రా ప్రమత్తతను వదలింపుము. కాదేని యీ దానవులనైన హతమార్చుము. నే జెప్పనేల? నీ కెట్లు ఇష్టమైన అట్లు చేయుము. నీ యపార పరమప్రబావ మెఱుంగని మందమతులు హరిహరులనే కొలిచెదరు. ఆ విష్ణువే యిట వివశుడై నిద్రించుటచే నీ మహిమ నా కిపుడు ప్రత్యక్షముగ బోధపడినది. ఆ లక్ష్మియును నీ కధీనయే. కనుక నామెయును హరిని మేలుకొలుపజాలదు. ఆ లక్ష్మిని సైతము నీవే నీ శక్తితో నీ వశమందుంచుకొంటివని తలంతును. నీవే విశ్వజననివని కోర్కెలుకురియు కామధేనువవని భక్తిపరులు నిష్కామముగ నీ పదకమలములచే నమ్మి నీయందు లీనమై నిన్నే నిచ్చలు సేవింతురు. అట్టివారితరదేవతలను గొలువరు. అట్టివారే ధన్యులు. బుద్ధి కాంతి కీర్తి శుభవృత్తి మున్నగు దివ్యకల్యాణ గుణములు నీ యందే చోటుచేసికొని యున్నవి. ఆ విష్ణువు నందలి సద్గుణములు నే డేమయ్యెనో తోచుటలేదు. నీవు మానవతులలో వన్కెకెక్కినదానవు. అట్టి నీ నిద్రాశక్తికి హరి నేడు పరతంత్రు డయ్యెను. ఈ యెల్ల జగములందు నఖిల ప్రభావముగల పరాశక్తివి నీవే. నీ సంకల్పమాత్రముననే లోకము లన్నియును నిర్మింపబడినవి. నటుడు నాటకమందు స్వేచ్ఛగ విహరించును. నీవు నట్లే నీచే నిర్మితమగు మోహజాలమందు క్రీడించు చుందువు. మున్ను యుగాదియందు నీవే యీ విష్ణువును సృజించి యతినికి లోక రక్షణకై నీ విమల సత్త్వశక్తి నొసంగితివి. ఆతడే యిపుడిట వివశుడై యున్నాడు. నీవు సర్వపరిపాలన దక్షవు. నీ కేది మేలని తోచిన నదియే చేయును. నన్ను నీవే పుట్టించితివి. నన్ను నలుగురిలో నగుబాటుపాలు చేయుటకా? నీ యభిమతమిదియేనా? భవానీ! నీ యచ్చెరువుగొలుపు కార్యములను నేను కొంతకొంత యెఱిగితిని. ఈ యెల్ల భువనములను నీవే స్వతంత్రించి సృజించి యానందింతువు. తుదకు నీ యందే లయ మొనర్చుకొందువు. అట్లే యిపుడు నీవే నా చావు కోరుచున్నచో మంచిదే. ఇందు వింతలేదు. జగదంబికా! నన్ను నీవే వధించిన నాకు మేలే. నా కిక మరణదుఃఖమే యుండదు. మున్ను నీ చేతనే నేను సృష్టికర్తనుగ ప్రకటింపబడితిని. అట్టి నాకే యొక దానవుని చేతిలో చావుగలిగెననిన యపకీర్తి నీకే కల్గును. నీ కది గలుగకుండుగాక! నీవు వెనువెంటనే లెమ్ము. భీకరమూర్తివి గమ్ము. నీ కిష్టమైనచో రక్కసులనే చక్కాడుము. లేదా నన్ను నుగ్గాడుము. కాక హరిని నిద్దుర నుండి మేలుకొల్పుము. ఈ దనుజులను హరియే దునుమాడగలడు. ఇంతకీ సర్వకార్యములును నీ చేతనే సులభసాధ్యము లగును. సూతు డిట్లనియె : అని బ్రహ్మ యిట్లు తామసీదేవిని సంస్తుతించెను. దేవి వెంటనే నారాయణుని దేహమునుండి వెడలి యతనిచెంత నిలుచుండెను. ఇట్లు పరమదేవియగు యోగనిద్ర దనుజుల నాశనమునకై అతుల తేజోనిధియగు విష్ణుని దేహావయవములనుండి తొలగినది. అపుడు జనార్దనునకు స్ఫూర్తిగలిగి మేను మెల్లగ గదలెను. అది గనుంగొని బ్రహ్మ పరమానందభరితుడయ్యెను.

ఇది శ్రీ దేవీభాగవత మహాపురాణమందలి ప్రథమస్కంధమందు విష్ణుప్రబోధమను సప్తమాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters