Sri Devi Bhagavatam-1
Chapters
అథ పంచదశో%ధ్యాయః వ్యాసః: ఇతి తస్య వచః శ్రుత్వా భార్గవస్య మహాత్మనః | ప్రహ్లాదస్తు సుసంహృష్టో బభూవ నృపనందన:
1 జ్ఞాత్వా దైవం బలిష్ఠం చ ప్రహ్లాద స్తానువాచహ | కృతే%పి యుద్ధే న జయో భవిష్యతి కదాచన.
2 తదా తే జయినః ప్రోచు ర్దానవా మదగర్వితాః | సంగ్రామ స్తు ప్రకర్తవ్యో దైవం కిం న విదామహే.
3 నిరుద్యమానాం దైవం హి ప్రధాన మసురాధిప | కేన దృష్టం క్వ వా దృష్టం కీదృశం కేన నిర్మితమ్. 4 తస్మా ద్యుద్ధం కరిష్యామో బలమాస్థాయ సాంప్రతమ్ | భవాగ్రే దైత్యవర్య! త్వం సర్వజ్ఞో%సి మహామతే. 5 ఇత్యుక్త సై#్త స్తదా రాజ న్ప్రహ్లాదః ప్రబలారిహా | సేనానీశ్చ తదాభూత్వా దేవాన్యుద్ధే సమాహ్వయత్. 6 తే%పి తత్రాసురా న్దృష్ట్వా సంగ్రామే సమువస్థితాన్ | సర్వే సంభృత సంభారా దేవా స్తాన్పమయోధయన్. 7 సంగ్రామ స్తు తదా ఘోరః శక్రప్రహ్లాదయో ర్భవత్ | పూర్ణం వర్షశతం తత్ర మునీనాం విస్మయావహః. 8 వర్తమానే మహాయుద్ధే శుక్రేణ ప్రతిపాలితాః | జయమాపు స్తదా దైత్యాః ప్రహ్లాదప్రముఖా నృపః. 9 తదైవేంద్రో గురోర్వాక్యా త్సర్వ దుఃఖవినాశినీం | సస్మార మనసా దేవీం ముక్తిదాం పరమాం శివామ్. 10 ఇంద్ర ఉవాచ :- జయదేవి మహామాయే శూలధారిణి చాంబికే | శంఖచక్రగదా పద్మఖడ్గహస్తే% భయప్రదే. 11 నమస్తే భువనేశాని శక్తిదర్శన నాయికే | దశతత్త్వాత్మికే మాతర్మహా బిందుస్వరూపిణి. 12 పదుఅయిదవ అధ్యాయము ప్రహ్లాదుడు శ్రీదేవి మహిమను కొనియాడుట ఓ నృపనందనా! మహాత్ముడగు భార్గవుని వచనము లాకర్ణించి ప్రహ్లాదుడు సంతుష్టాంతరంగుడై దైవమే బలవత్తరమైనది. దేవతలతో ఇపుడు యుద్ధమొనరించినను మనకు జయము కలుగదు.' అని దైత్యులతో నుడివెను. అపుడు మదగర్వితులు విజయశీలురునైన దానవు లిట్లు పలికిరి. మేము యుద్ధమే చేసెదము. మాకు దైవముతో బనిలేదు. దానవేంద్రా! ఉద్యోగహీనులు దైవమును ప్రధానముగ తలచెదరు. దాని నెవరు చూచిరి? ఎక్కడ చూచిరి? దాని నెవరేర్పరచిరి? అదెట్టిది? మేమిపుడే తగినబలము చేకూర్చుకొని రణ మొనర్తుము. నీవు సర్వజ్ఞుడవు. కాన మాకు నాయకుడవు గమ్ము అను దానవుల మాటలకు వైరినాశకుడగు ప్రహ్లాదుడు వారికి సేనానిగ నుండి దేవతలను రణమున కాహ్వానించెను. యుద్ధ సన్నద్ధులైన రాక్షసులను జూచి దేవతలును తగిన సన్నాహములతో వారితో బోర సమకట్టిరి. అపుడింద్ర ప్రహ్లాదులకు నూఱండ్లవరకు ఘోరసమరము సాగెను. అది మునులకు సైతము వింతగొల్పునదిగ నుండెను. ఆ మహాయుద్ధము జరుగుచుండగ నందు శుక్రపాలితులైన ప్రహ్లాదుడు మున్నగు దానవులకు జయము చేకూరెను. ఆ కష్టసమయమున నింద్రుడు గురుని వచనాను సారముగ సర్వదుఃఖ వినాశినీ - ముక్తిదాయిని - శివస్వరూపిణి యైన శ్రీరాజరాజేశ్వరిని నెమ్మదిలో నీరీతిగ స్మరించి ప్రస్తుతించెను: ఇంద్రుడిట్లనెను: ఓ దేవి! ఓ మహాదేవి! ఓ మహామాయా! భక్తుల యిలవేల్ప! ఓయమ్మా! నీవు శంఖ చక్ర గదా పద్మములు శూల ఖడ్గములు ధరించి మా కభయ వరము లొసగు తల్లివి. నీకు జయమగుత. భువనేశానీ! మాతా! నాదబిందు కళాస్వరూపిణీ! దశతత్త్వాత్మికా! శక్తి ప్రధానమైన దర్శన శాస్త్రములకు ముఖ్యనాయికా! నీకు వందనములు తల్లీ| మహాకుండలినీరూపే సచ్చిదానందరూపిణి| ప్రాణా%గ్నిహోత్రవిద్యేతే నమో దీపశిఖాత్మికే. 13 పంచకోశాంతరగతే పుచ్ఛబ్రహ్మస్వరూపిణీ | ఆనందకళికే మాతః సర్వోపనిష దర్చితే. 14 మాతః ప్రసాదసుముఖీ భవ హీనసత్త్వాం | స్త్రాయస్వనోజనని దైత్యపరాజితాన్వై త్వం దేవి నః శరణదా భువనే ప్రమాణా | శక్తా%సి దుఃఖశమనే%ఃల వీర్యయుక్తే. 15 ధ్యాయంతి యే %పి సుఃనో నితరాంభవంతి | దుఃఖాన్వితా విగతాశోకభయా స్తథా%న్యే | మోక్షార్థినో విగతమానవిముక్త సంగాః | సంసారవారిధిజలం ప్రతరంతి సంతః. 16 త్వం దేవి విశ్వజనని ప్రథితప్రభావా సంరక్షణార్థ ముదితా%%ర్తి హరప్రతాపా | సంహర్తు మేతదఃలం కిలకాలరూపా కోవేత్తి తే%ంబ చరితం ను మందబుద్ధిః. 17 బ్రహ్మా హరశ్చ హరిదశ్వరథో హరిశ్చ ఇంద్రోయమోథ వరుణో%గ్ని సమీరణౌ చ | జ్ఞాతుం క్షమా న మునయో%పి మహానుభావా యస్యాః ప్రభావ మతులం నిగమా%%గమాశ్చ. 18 ధన్యాస్త ఏవ తవ భక్తిపరా మహాంతః | సంసార దుఃఖరహితాః సుఖసింధుమగ్నాః | యే భక్తిభావరహితా న కదా%పి దుఃఖాంభోధిం జనిక్షయ తరంగముమే తరంతి. 19 యే వీజ్యమానాః సితచామరైశ్చ క్రీడంతి ధన్యాః శిబికాధిరూఢాః | తైః పూజితా త్వం కిల పూర్వదేహే నానోపహారైరితి చింతయామి. 20 యే పూజ్యమానా వరవారణస్థా విలాసినీబృందవిలాసయుక్తాః | సామంతకై శ్చోపనతై ర్వ్రజంతి మన్యేహి తై స్త్వం కిల పూజితా2సి. 21 వ్యాస ఉవాచ: ఏవం స్తుతా మఘవతా దేవీ విశ్వేశ్వరీ తదా | ప్రాదర్బభూవ తరసా సింహారూఢా చతుర్భుజా. 22 శంఖచక్రగదాపద్మా న్బిభ్రతీ చారులోచనా | రక్తాంబరధరా దేవీ దివ్యమాల్యవిభూషణా. 23 తా నువాచ సురాన్దేవీ ప్రసన్నవదనా గిరా | భయం త్యజంతు భో దేవాః శం విధాస్యే కిలా%ధునా. 24 మహాకుండలినీ శక్తి స్వరూపిణీ! సచ్చిదానంద స్వరూపిణీ! నిత్య చైతన్యజ్యోతీ! ఓ ప్రాణాగ్ని హోతృవిద్యా! శిఖాత్మికా! నీకు వందనములు: నీవు పంచకోశాంతర నిలయవు. ఆనంద కోశమందలి పుచ్ఛ బ్రహ్మస్వరూపిణివి! ఆనంద కళికవు! సర్వోపనిషదర్చితవు. నీకు వందనములు తల్లీ! ఓహో జగజ్జననీ! ఏము దైత్యులవలన నోటుపడితిమి. దుర్బలులమైతిమి. మా యెడల ప్రసన్నవుగమ్మా! అమ్మా మమ్ము గాపాడుమమ్మా! ఈ త్రిభువనములం దీవొక్కతెవే శరణమొసగుదానవమ్మా! మా దుఃఖము లెడబాపుట కీవే సర్వశక్తురాలవు. వీర్యయుక్తురాలవు. నీకు వందనములు తల్లీ! ఓ విశ్వజననీ! నిన్ను నిరంతరము ధ్యానించువారు శాశ్వత సుఖశాంతు లందుదురు. నిన్ను ధ్యానింపనివారు భయశోకములతో దుఃఖముల పాలగుదురు. సంగరహితులైన ముముక్షులీ భవసాగరము తరింతురు. ఓయమ్మా? నీవు విశ్వజననివి. దేవీ! నీ ప్రభావము విశ్వ ప్రసిద్ధము. నీవు దుఃఖార్తిహారిణివి. నీవే సర్వరక్షణ దక్షురాలవు. నీవే యఖండ కాలస్వరూపవు. ఈ సకలము నీవే సంహరింతువు. ఓ తల్లీ! నీ దివ్యచరితము మందమతికేమి తెలియును? నీ యతుల దివ్యశక్తి ప్రభావమును హరిహర బ్రహ్మలును ముని జనగణమును నిగమాగమములు నెఱుగ నేరవు. ఓ యుమాదేవీ! నీ పాదపద్మ సేవాపరాయణులైన మహాత్ములే ధన్యులు. వారు సంసార దుఃఖరహితులు. కాని, భోగ సాగరమగ్నులు భక్తిరహితులు జన్మమృత్యుసాగరము దాటనోపరు. ఓ మాతా! నిత్యము వెల్లచామరములచేత వీవబడువారును సుఖక్రీడ లాడువారును బంగరు టందలము లెక్కువారును తొల్లిటి జన్మమును నిన్ను పెక్కులుపచారములచే బూజించియుండిరని నేను దలతును. ఓ తల్లీ! ఎవ్వరు నిత్యము పూజ్యులో ఎవరేనుగల నధిరోహింతురో ఎవరు విలాసినీ బృందమున విలాసవంతులై వర్తింతురో తమకు నమ్రులైన సామంతులతో గూడి సంచరించు చుందురో వారు మున్ను నిన్ను పూజించియుండిరని భావింతును అని యీ విధముగ నింద్రుడు ప్రస్తుతి సేయగా శ్రీ త్రిభువనేశ్వరీదేవి సింహాధిరూఢయ్తె చతుర్భుజయై వేగమే ప్రత్యక్షమయ్యెను. ఆ రాజీవనయనయగు జనని శంఖ చక్ర గదా కమలములు ధరించి రక్తాంబర ధారిణియై దివ్యమాల్య విభూషితయై దేదీప్యమానయై యొప్పెసగెను. శ్రీదేవి ప్రసన్న వదనముతో నమృత వచనములతో దేవతలతో నీవిధముగ వచించెను: ఓ దేవతలారా! భయము విడువుడు. మీకిపుడు సుఖశాంతులును సిరిసంపదలును గలిగింతును. ఇత్యుక్త్వా సా తదాదేవీ సింహా%%రూఢా%తి సుందరీ | జగామ తరసా తత్ర యత్ర దైత్వా మదాన్వితాః. 25 ప్రహ్లాదప్రముఖాః సర్వే దృష్ట్వా దేవీం పురఃస్థితామ్ | ఊచుః పరస్పరం భీతాః కిం కర్తవ్య మితస్తదా. 26 దేవం నారాయణం చా%త్ర సంప్రాప్తా చండికా కిల | మహిషాంతకరీ నూనం చండముండ వినాశినీ. 27 నిహనిష్యతి నః సర్వానంబికా నా%త్ర సంశయః | వక్ర దృష్ట్యా యయా పూర్వం నిహతౌ మధుకైటభౌ. 28 ఏవం చింతా%%తురా న్వీక్ష్య ప్రహ్లాద స్తానువాచ హ | యోద్ధవ్యం నా%థ గంతవ్యం పలాయ్య దానవోత్తమాః. 29 నముచి స్తా నువాచా%థ పలాయన పరానిహ | హనిష్యతి జగన్మాతా రుషితా కిల హేతిభిః. 30 తథా కురు మహాభాగ యథా దుఃఖం నజాయతే | వ్రజాయో%ద్యైవ పాతాళం తాంస్తుత్వా తదనుజ్ఞయా. 31 ప్రహ్లాదః: స్తౌమి దేవీం మహామాయాం సృష్టిస్థిత్యంతకారిణీం | సర్వేషాం జననీం శక్తిం భక్తానామభయం కరీమ్. 32 వ్యాసః: ఇత్యుక్త్వా విష్ణుభక్త స్తు ప్రహ్లాదః పరమార్థవిత్ | తుష్టావ జగతాంధాత్రీం కృతాంజలి పుట స్తదా. 33 మాలాసర్పవ దాభాతి యస్యాం సర్వం చరాచరమ్ | సర్వాధిష్ఠానరూపాయై తసై#్య హ్రీ మూర్తయే నమః. 34 త్వత్తః సర్వ మిదం విశ్వం స్థావరం జంగమం తథా | అన్యే నిమిత్తమాత్రా స్తే కర్తార స్తవ నిర్మితాః. 35 నమో దేవి! మహామాయేః సర్వేషాం జననీ స్మృతా | కోభేద స్తవ దేవేషు దైత్యేషు స్వకృతేష చ. 36 అని పలికి సింహాసనాసీనయైన జగదేకమాత వెనువెంటనే మదగర్వితులగు దైత్యులున్న యెడ కరిగెను. ప్రహ్లాదుడు మున్నగువారా దేవిని గని వారొకరి మొగము లొకరు చూచుకొని యిపుడేమి చేయుదమని చింతించిరి. ఈ దేవత శ్రీచండిక. ఈమె దేవతల రక్షణ కిటకు వచ్చినది. తొల్లి చండముండ మహిషాసురాదుల నీమెయే పరిమార్చినది. పూర్వ మీ తల్లియే వక్రదృష్టితో మధుకైటభులను తెగటార్చినది. ఇపు డీమె తప్పక మన యంతు తేల్చుకొనగలదు అని యిట్లు చింతాపరులగు దానవులను గని ప్రహ్లాదు డిట్లనెను: దానవులారా! ఇపుడు యుద్ధము తగదు. మనము కాలికి బుద్ధి చెప్పుట మంచిది అనెను. ఆ మాటలు పాటించి పరుగిడుటకు సిద్ధపడిన దనుజులతో నముచి యను నతడిట్లనెను: మీరు పరుగెత్తి నప్పటికిని జగన్మాత రోషముతో నాయుధములతో మనలను చంపకమానదు. కనుక మనకు దుఃఖము గలుగని పనిచేయుట మంచిది. ఆ తల్లి నిపుడు సంస్తుతించి యామె యాన బడసి మనము పాతాళమున కేగుదము అన ప్రహ్లాదు డిట్లనియెను. నేను సృష్టి స్థిత్యంతకారిణి-సర్వజనని-భక్తుల కభయప్రదాయిని - మహామాయాశక్తియగు మహాదేవిని సంస్తుతించుచున్నాను' అని నుతించి పరమార్థవిదుడు విష్ణుభక్తుడునైన ప్రవ్లూదుడు జగదంబకు నమస్కరించెను. పూలమాలయందు సర్పభ్రాంతి గలుగు నట్లే యే తల్లియందు చరాచరజగ మాభాసించునో యా సర్వాధిష్ఠానరూపిణి యగు హ్రీంబీజ స్వరూపిణిని నమస్కరించుచున్నాను. తల్లీ! ఈ స్థావర జంగమాత్మకమైన విశ్వమంతయును నీవలననే కలిగినది. బ్రహ్మాదులును నీచేతనే సృజింపబడి నిమిత్తమాత్రులై యున్నారు. ఓ మహామాయాదేవీ! నీకు నా నమోవాకములు. నీవు బ్రహ్మాండమాతవు. దేవదానవులను నీవే సృజించితివి. కాన నీకు వీరిపట్ల భేద మెక్కడిది? మాతుః పుత్త్రేషు కోభేదో%ప్యశుభేషు శుభేషు చ | తథ్తెవ దేవే ష్వస్మాసు న కర్తవ్య స్త్వయా%ధునా. 37 యాదృశా స్తాదృశా మాతః సుతాస్తే దానవాః కిల | యత స్త్వం విశ్వజననీ పురాణషు ప్రకీర్తితా. 38 తే%పి స్వార్థపరా నూనం తథైవ వయ మప్యుత | నాంతరం దైత్య సురయో ర్భేదో%యం మోహసంభవః. 39 ధనదారాదిభోగేషు వయం సక్తా దివానిశమ్ | తథైవ దేవా దేవేశి! కో భేదో%సురదేవయోః. 40 తే%పి కశ్యపదాయాదా వయం తత్సంభవాః కిల | కుతో విరోధ సంభూతి ర్జాతా మాత స్తవా%ధునా. 41 న తథా విహితం మాత స్త్వయి సర్వం సముద్భవే | సామతైవ త్వయా స్థాప్యా దేవేష్వస్మాసు చైవ హి. 42 గుణవ్యతికరాత్సర్వే సముత్పన్నాః సురా సురాః | గుణాన్వితా భ##వేయుస్తే కామం దేహభృతో%మరాః. 43 కామః క్రోధశ్చ లోభశ్చ సర్వదేహేషు సంస్థితాః | వర్తంతే సర్వదా తస్మాత్కో%విరోధీ భ##వేజ్జనః. 44 త్వయా మిథో విరోధో%యం కల్పితః కిల కౌతుకాత్ | మన్యామహే విభేదేన సూనం యుద్ధదిదృక్షయా. 45 అన్యథా ఖలు భ్రాతౄనాం విరోధః కీదృశో%నఘే | త్వం చే న్నేచ్ఛసి చాముండే వీక్షితుం కలహం కిల. 46 జానామి ధర్మం ధర్మజ్ఞే! వేద్మి చా%హం శతక్రతుమ్ | తథా%పి కలహో%స్మాకం భోగార్థం దేవి! సర్వథా. 47 ఏకఃకో%పి నశాస్తా%స్తి సంసారే త్వాం వినాం%బికే | స్పృహావతస్తు కః కర్తుం క్షమతే వచనం బుధః. 48 తల్లికి బుట్టిన పుత్రులలో సన్మార్గులు దుర్మార్గులు నుందురు. ఐనను తల్లి వారిని సమానముగా గాంచును. అటులనే యిపుడు దేవతలయందును మాయందును నీకు భేదభావము తగదు. మాతా! నీవు పురాణములందు విశ్వజననివిగ పేరొందితివి. నీకు దేవత లెట్లో మేము నట్లు సుతులము. జననీ! వారును స్వార్థపరులే. మేమును స్వార్థపరులమే. నిజముగ దేవదానవుల మధ్య భేద మన్నది లేదు. ఉన్నచో నది భ్రాంతి మాత్రమే. ఓ యమ్మా! దేవేశ్వరీ! మేము ధనభార్యాది భోగము లందు నిత్యము సంసక్తులమైన మాట నిజమే. వారును మావంటివారే కదా? ఇంక మా యిరువురి నడుమ భేద మెక్కడిది? మాతా! వారును కశ్యపాత్మజులు. మేమును కశ్యపాత్మజులమే. ఇంక మా యిర్వురియందు నీకు భేదభావ మేల కలిగెను? విశ్వజననీ! నీయం దిట్టి విరుద్ధభావము తగదు. నీవు మమ్ములను దేవతలను సమభావమున జూడుమమ్మా! సురాసురులెల్లరును గుణకర్మ సంయోగమున సంభవించిరి. ఇంక దేహధారులైన దేవతలు మాకంటె నధికతరముగ గుణవంతు లెట్టులగుదురు? అన్ని శరీరము లందును కామక్రోధలోభమోహము లుండును. ఇంక విరోధభావము లేనివాడెవ డుండును? తల్లీ! నీకు నీ బుద్ధియందు మా యుద్ధము గను వేడుక పుట్టి యుండును. అందుచే నీవు లీలామాత్రముగ మాలో విభేదములు పుట్టించి పరస్పర విరోధములు గల్పించితివని తలంతుము. చాముండా! ఓ యనఘురాలా! నీకు నిక్కముగ మా కలహము గాంచు కోరికయే లేనిచో నన్నదమ్ములమైన మాలో మా కీ పొరపొచ్చెము లేల కలుగును? మేమును కొంచెము ధర్మ మెఱుగుదుము. ఇంద్రునిగూర్చి మాకంతయును తెలియును. ఇక మాలో మాకు గల కలహము కేవలము నీ భోగముకొఱకే సుమా! ఈ విశ్వబ్రహ్మాండ మందెల్ల నీవు గాకింకొకరు డెవడు శాసకుడు గలడు? కామములు గలవాని కోర్కు లన్నిటి నెంతటి పండితుడైన నెరవేర్చజాలడు. దేవాసురై రయం సింధు ర్మథితః సమయే క్వచిత్ | విష్ణునా విహితో భేదః సుధారత్న చ్ఛలేన వై. 49 త్వయా%సౌ కల్పితః శౌరిః పాలకత్వే జగద్గురుః | తేన లక్ష్మీః స్వయం లోభా ద్గహీతా%మరసుందరీ. 50 ఐరావతస్తథేంద్రేణ పారిజాతో%థ కామధుక్ | ఉచ్చైఃశ్రవాః సురైః సర్వం గృహీతం వైష్ణవేచ్చయా. 51 అనయం తాదృశం కృత్వా జాతాదేవాస్తు సాధవః | అన్యాయినః సురా సూనం విష్ణువా బహుమానినా. 52 నూనం దైత్యాః వరాధూవ న్పశ్య త్వం ధర్మలక్షణమ్ | క్వ ధర్మః కీదృశో %ధర్మః క్వ కార్యం క్వ చ సాధుతా. 53 కథయామి చ కస్యా%గ్రే సిద్దై ర్మీమాంసకం మతం | తార్కికా యుక్తివాదజ్ఞా విధిజ్ఞా వేదవాదకాః. 54 ఉక్తాః సకర్తృకం విశ్వం వివదంతే జడాత్మకాః | కర్తా భవతి చేదస్మి న్సంసారే వితతే కిల. 55 విరోధః కీదృశ స్తత్ర చైకకర్మణి వై మిథః | వేదే నైకమతిః కస్మా చ్ఛా స్త్రేష్వపి తథా పునః. 56 నైకవాక్యం వచస్తేషా మపి వేదవిదాం పునః | యతః స్వార్థపరం సర్వం జగత్థ్సావరజంగమమ్. 57 నిఃస్పృహః కో%పి సంసారే న భ##వేన్న భవిష్యతి | శశినా%థ గురోర్భార్యా హృతాజ్ఞాత్వా బలాదపి. 58 గౌతమస్య తథేంద్రేణ జానతా ధర్మనిశ్చయమ్ | గురుణా%నుజ భార్యాచ భుక్తా గర్భవతీ బలాత్. 59 శప్తో గర్భగతో బాలః కృతశ్చాంధ స్తథా పునః | విష్ణునాచ శిరశ్ఛిన్నం రాహో శ్చక్రేణ వై బలాత్. 60 మున్నొకప్పుడు దేవాసురులు గలిసి పాలసంద్రము మథించిరి. అపు డందుండి దివ్యామృతమును దివ్యరత్నములును వెలువడినవి. ఆ యమృతము పంచు నెపముతో శ్రీహరి మాలో భేదములు గల్పించెను. విశ్వమాతా! జగద్గురువగు శ్రీహరి నీచేతనే విశ్వపరిపోషణకు నియమింపబడెను. అతడే స్వయముగ నమరసుందరియైన శ్రీమహాలక్ష్మిని గ్రహించెను. ఆ సమయమున దేవరా జైరావతమును ఉచ్చైఃశ్రవమును కామధేనువును పారిజాతమును గ్రహించెను. హరి యనుమతితో తక్కిన దేవతలు తక్కిన విలువగల వస్తువులు గ్రహించిరి. అట్లా నా డన్యాయమునకు పాల్పడిన దేవతలే నేడు సాధువర్తనులైరి. నిజము చెప్పవలె ననిన దేవతలే యన్యాయపరులు. ఇక ధర్మలక్షణ మెట్టిదో యెఱుగుము. లోకమాన్యుడైన విష్ణువే వారి నంత మహోన్నతస్థాన మందుంచెను. అపుడు సురలవలన నసురులు పరాభవ మందిరి. కనుక నేది ధర్మము? ఏది కార్యము? ఆ ధర్మస్వరూప మెట్టిది? ఆ సాధుత్వ మెట్టిది? ఇవన్నియు నీవే యెఱుగ సమర్థురాలవు. నీవు ధర్మసూక్ష్మతాదృష్టితో నంతయు సమతతో గనుమమ్మా! ఇక మీమాంసకుల మతము నెవరిముందు వెల్లడింపదగును. తార్కికులు యుక్తివాద మెఱిగినవారు. వేదవాదులు విధి మార్గమును సూటిగ ననుసరించువారు. ఈ విశ్వమంతయు సృష్టించిన యీశ్వరు డున్నాడను విషయమున మందమతులగు ఈ నిరీశ్వర మీమాంసకులు వివాదము సేతురు. నిజముగ నీ విశాల విశ్వమంతటికిని సృష్టికర్త యొక్కడే యైయున్నచో మఱి యొక్కని సృష్టిలో నింత వైవిధ్య మేల యుండవలయును? ఈ పరస్పర వైరుధ్య మేల గల్గవలయును? ఎల్ల వేదశాస్త్రములం దైక్యభావ మేల లేదు? అని వీరందురు. ఈ స్థావర జంగమాత్మకమైన జగంబంతయును స్వార్థమయమే. అందువలన ఈ వేదవిదుల వాక్కులందు నైక్యములేదు. ఈ ప్రపంచమందెల్ల కోర్కులు లేనివాడు లేడు. చంద్రుడు గురు భార్యయని తెలిసియు తారను బలిమితో సొంతము చేసికొనెను. ఇంద్రుడు ధర్మసూక్ష్మ మెఱిగినవాడే కదా! ఐన నతడును గౌతమ మహర్షి భార్యను గూడెను. గురుని సోదరుని భార్య గర్భిణిగ నుండెను. ఐనను గురు డామెను బలిమి మీర పొందెను. మఱి గురు డామె గర్భమందలి శిశువును గ్రుడ్డివాడవు గమ్మని శపించెను. శ్రీవిష్ణువు చక్రముతో బలిమితో రాహు శిరమును ఖండించెను. అపరాధం వినా కామం తదా సత్త్వవతాం%బికే | పౌత్రో ధర్మవతాం శూర సత్యవ్రత పరాయణ. 61 యజ్వా దానవపతిః శాంతః సర్వజ్ఞః సర్వపూజకః | కృత్వా%థ వామనం రూపం హరిణా ఛలవేదినా. 62 వంచితో%సౌ బలిః సర్వం హృతం రాజ్యం పురా కిల | తథా%పి దేవాన్ధర్మస్థా న్ప్రవచంతి మనీషిణిః. 63 వదంతి చాటువాదాంశ్చ ధర్మవాదాంజనం గతాః | ఏవం జ్ఞాత్వా జగన్మాత ర్యథేచ్ఛసి తథా కురు. 64 శరణా దానవాః సర్వే జహి వా రక్షవా పునః | శ్రీ దేవ్యువాచ: సర్వేగచ్ఛత పాతాళం తత్రవాసం యథేప్సితమ్. 65 కురుధ్వం దానవాః సర్వే నిర్భయా గతమన్యవః | కాలః ప్రతీక్ష్య యుష్మాభిః కారణం స శుభే%శుభే. 66 సునిర్వేదపరాణాం హి సుఖం సర్వత్ర సర్వదా | త్రైలోక్యస్య చ రాజ్యే%పి న సుఖం లోభ##చేతసామ్. 67 కృతే%పి న సుఖం పూర్ణం సస్పృహాణాం ఫలైరపి | తస్మాత్త్యక్త్వా మహీమేతాం ప్రయాంత్వద్య మహీతలమ్. 68 మమా%%జ్ఞాం పురతః కృత్వా సర్వేవిగతకల్మషాః | వ్యాసః: తచ్ఛ్రుత్వావచనం దేవ్యా స్తథేత్యుక్త్వారసాతలమ్. 69 ప్రణమ్య దానవాః సర్వే గతాః శుక్రా%భిరక్షితాః | అంతర్దధే తతో దేవీ దేవాః స్వభువనం గతాః. 70 త్యక్త్వావైరం స్థితాః సర్వే తే తదా దేవదానవాః | ఏతదాఖ్యాన మఃలం యః శృణోతి వదత్యత. 71 సర్వదుఃఖ వినిర్ముక్తః ప్రయాతి పదముత్తమమ్. 72 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ చతుర్థుస్కంధే పంచదశో%ధ్యాయః. నా మనుమడు బలి. అతడు ధార్మికాగ్రాణి-సత్యవ్రత పరాయణుడు-శాంతుడు-సర్వజ్ఞుడు-సర్వపూజకుడు-నిరపరాధి. అతడు దానవపతి. ఐనను శ్రీహరి కపట వామన రూపము వహించి అతని నెత్తిపై కాలు పెట్టి యతని రాజ్యము నపహరించెను. ఐనను దేవతలే ధర్మపరులని మనీషులు పొగడుదురు. ఈ లోకములలో చాటువాదము లాడువానినే ధర్మవాది యందురు. ఇవన్నియును నీకు తెలియనికావు. కాన నీకెట్లుదోచిన అట్లు చేయుము. దానవులందఱు నీకిపుడు శరణార్థులైనారు. కుక వారిని గాపాడుదువో, విడనాడుదువో! అంతయు నీయిష్టము అనగా దేవి యిట్లు వచించెను. ఓ దానవులారా! మీరిపుడు పాతాళ##మేగి స్వేచ్చగా నుండుడు. మీరు కోపము వీడుడు. నిర్భయులుగండు. శుభాశుభములకు కారణమగు కాలమున కెదురు చూడుడు. ఎల్లడల నెల్లపుడు నిర్వేదపరులకు మాత్రము సుఖము చేకూరును. లోభచిత్తులకు త్రైలోక్య రాజ్యము ప్రాప్తించినను సుఖము మాత్రము సున్న. వేయేల? కృతయుగ మందును లోభాత్ములు ఫలము బొందియు సుఖము బడయకుండిరి. కావున మీరిపుడే నేలను వదలి పాతాళమున కేగుడు. మీరెల్లరును నా యాన తలదాల్చి పాపరహితులు గండు అనిన దేవీ వచనములు విని వారటులే మేము పాతాళమున కేగుదుమని చేతులెత్తి మ్రొక్కి యామెచేత రక్షితులై పాతాళమున కేగిరి. అంత దేవి యంతర్ధాన మొందెను. దేవతలును నిజ భవనముల కరిగిరి. ఇట్లు అపుడు దేవదానవు లందఱును వైరము బాసిరి. ఈ యాఖ్యానక మంతయును వినిన-చదివినవాడు సర్వదుఃఖములు బాసి యుత్తమపద మందును. ఇది శ్రీదేవీ భాగవత మందలి చతుర్థ స్కంధమందు ప్రహ్లాదుడు శ్రీదేవి మహిమను కొనియాడుటయను పంచదశాధ్యాయము.