Sri Devi Bhagavatam-1
Chapters
అథ షోడశో%ధ్యాయః జనమేజయః: భృగుశాపా న్మునిశ్రేష్ఠ! హరే రద్భుతకర్మణః | అవతారాః కథం జాతాః కస్మిన్మన్వంతరే విభో.
1 విస్తరాద్వద ధర్మజ్ఞ! అవతారకతాం హరేః | పాపనాశకరీం బ్రహ్మన్ శ్రుతాం సర్వసుఖావహామ్.
2 వ్యాసః: శృణు రాజ న్ప్రవక్ష్యామి అవతారాన్ హరే ర్యథా | యస్మి న్మన్వంతరే జాతా యుగే యస్మి న్న రాధిప.
3 యేన రూపేణ యత్కార్యం కృతం నారాయణన వై | తత్సర్వం నృప వక్ష్యామి సంక్షేపేణ తవా%ధునా.
4 ధర్మసై#్యవావతారో%భూ చ్చాక్షుషే మను సంభ##వే | నరనారాయణౌ ధర్మపుత్త్రౌ ఖ్యాతౌ మహీతలే.
5 అథ వైవస్వతాఖ్యే%స్మి న్ద్వితీయేతు యుగే పునః | దత్తాత్రేయా%వతారో%త్రేః పుత్రత్వ మగమద్ధరిః. 6 బ్రహ్మా విష్ణు స్తథా రుద్ర స్త్రయో%మీ దేవసత్తమాః | పుత్రత్వ మగమ న్ధేవా స్తస్యా%త్రే ర్భార్యయా వృతాః. 7 అనసూయా%త్రిపత్నీ చ సతీనాముత్తమా సతీ | యయా సంప్రార్థితా దేవాః పుత్రత్వమగమంస్త్రయః. 8 బ్రహ్మా%భూ త్సోమరూపస్తు దత్తాత్రేయో హరిఃస్వయమ్ | దుర్వాసా రుద్రరూపో%సౌ పుత్రత్వం తే ప్రపేదిరే. 9 నృసింహస్యావతారస్తు దేవకార్యార్థ సిద్ధయే | చతుర్ధేతు యుగే జాతో ద్విధారూపో మనోహరః. 10 హిరణ్యకశిపోః సమ్యగ్వధాయ భగవాన్హరిః | చక్రే రూపం నారసింహం దేవానాం విస్మయప్రదమ్. 11 బలే ర్నియమనార్థాయ శ్రేష్ఠే త్రేతాయుగే తథా | చకార రూపం భగవాన్ వామనం కశ్యపా న్మునేః. 12 ఛలయిత్వా మఖే భూపం రాజ్యం తస్య జహార హ | పాతాళే స్థాపయామాస బలిం వామనరూపధృక్. 13 యుగే చై కోన వింశే%థ త్రేతాఖ్యే భగవా న్హరిః | జమదగ్ని సుతో జాతో రామో నామ మహాబలః. 14 పదుహారవ అధ్యాయము శ్రీ విష్ణువవతారములు దాల్చుట ఈ కథవిని జనమేజయు డిట్లనియెను: మునిశ్రేష్ఠా! అద్భుతకార్యము లొనరించునట్టి శ్రీహరి భృగుమహర్షి శాపకారణమున నేయే మన్వంతరములందే యే యవతారములు ధరించెను? శ్రీమన్నారాయణుని దివ్య లీలావతారములు మహాపాతక నాశకములు. అమృతమయమైన శాంతి సమృద్ధి గలిగించునవి. వానిని విశదముగ నాకు తెలియబలుకుము. అనగా వ్యాసుడిట్లనెను: రాజా! శ్రీహరి యే యే మన్వంతరములందే యే యుగములందే యే యవతారము లెత్తెనో యే యే మానవాతీత కార్యముల లోనరించెనో వానినెల్ల నిపుడు సంక్షేపముగ తెలుపుదును. చాక్షుష మన్వంతరమున ధర్మపుత్రులగు నరనారాయణులు ఈ మహీతలమున విఖ్యాతి గడించిరి. అది ధర్మావతార మనబడును. ఈ వైవస్వత మన్వంతరమున రెండవ మహాయుగమున హరి యత్రి పుత్త్రుడుగ నవతరించెను. అది దత్తాత్రేయ నామమున పేరుబొందెను. అత్రిభార్య అనసూయ. ఆమె సతులలో నుత్తమసతి. ఆమె ప్రార్థన నంగీకరించి బ్రహ్మ సోమరూపమున విష్ణువు స్వయముగ దత్తాత్రేయ రూపమున రుద్రుడు దుర్వాసుడుగ నిట్లు త్రిమూర్తులామెకు పుత్రులై యుద్భవిల్లిరి. నాలుగవ యుగము నందు విష్ణువు దేవకార్య సంసిద్ధి కొఱకు రెండు సుమనోహరమైన రూపములు దోప హిరణ్యకశిపుని చంపుటకు దేవతల కబ్బుర మగునట్లు నృసింహ రూపము దాల్చెను. శ్రీ భగవానుడు హరి త్రేతాయుగమందు బలిప్రభావ మడచుటకు కశ్యప మహర్షికి వామనుడుగ నవతరించెను. ఆ రాక్షసరాజు యజ్ఞ మొనరించు చున్నపుడు వామన రూపమున వచ్చి యతని వంచించి యతని రాజ్యము హరించి యతనిని పాతాళమున కంపెను. పిదప పందొమ్మిదవ త్రేతాయుగమున హరి బలశాలియగు పరశురాముడుగ నవతరించెను. అతడు జమదగ్ని తనయుడు. క్షత్రియాంతకరః శ్రీమాన్సత్యవాది జితేంద్రియః | దత్తవా న్మేదినీం కృత్స్నాం కశ్యపాయ మహాత్మనే. 15 యోవై పరశురామాభ్యో హరే రద్భుతకర్మణః | అవతారస్తు రాజేంద్ర కథితః పాపనాశనః. 16 త్రేతాయుగే రఘోర్వంశే రామో దశరథాత్మజః | నరనారాయణాంశై ద్వౌ జాతా భువి మహాబలౌ. 17 అష్టావింశే యుగే శప్తౌ ద్వాపరే%ర్జున శౌరిణౌ | ధరాభారా%వతారాయ జాతౌ కృష్ణార్జునౌ భువి. 18 కృతవంతౌ మహాయుద్ధం కురుక్షేత్రే%తి దారుణమ్ | ఏవం యుగేయుగే రాజన్నవతారా హరేః కిల. 19 భవంతి బహవః కామం ప్రకృతే రనురూపతః | ప్రకృతే రఃలం సర్వం వశ##మేతజ్జగత్త్రయమ్. 20 యథేచ్చతి తథైవేయం భ్రామయత్యనిశం జగత్ | పురుషస్య ప్రియార్థం సా రచయత్యఃలం జగత్. 21 సృష్ట్వా పురా హి భగవన్ జగదేత చ్చరాచరమ్ | సర్వాదిః సర్వగశ్చాసౌ దుర్జేయః పరమో%వ్యయః. 22 నిరాలంబో నిరాకారో నిఃస్పృహశ్చ పరాత్పరః | ఉపాధిత స్త్రీధా భాతి యస్యాః సా ప్రకృతిః పరా. 23 ఉత్పత్తికాలయోగా త్సా భిన్నా భాతి శివా తదా | సా విశ్వం కురుతే కామం సా పాలయతి కామదా. 24 కల్పాంతే సంహరతే త్రిరూపా విశ్వమోహినీ | తయా యుక్తో%సృజద్భ్రహ్మా విష్ణుః పాతి తయా%న్వితః. 25 రుద్రః సంహరతే కామం తయా సంగిలితః శివః | సా చైవోత్పాద్య కాకుత్థ్సం పురా వై నృపసత్తమ! 26 కుత్రచి త్థ్సాపయామాపస దానవానాం జయాయ చ | ఏవ మస్మింశ్చ సంసారే సుఖదుఃఖాన్వితాః కిల. 27 భవంతి ప్రాణినః సర్వే విధితంత్రనియంత్రితాః. ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ చతుర్థస్కంధే షోడశో%ధ్యాయః. సత్యవాది - జితేంద్రియుడు - క్షత్రియాంతకుడు. అతడు భూమినంతయును కశ్యప మహర్షికి దానమొసంగెను. అద్భుత చరిత్రుడగు శ్రీహరి పరశురామావతారము పాపహరము. అదే పందొమ్మిదవ త్రేతాయుగమున శ్రీమన్నారాయణుడు రఘువంశమందు దశరథనందనుడైన రాముడుగ నవతరించెను. ఆ తరువాత ఇరువదెనిమిదవ ద్వాపరమందు బలశాలురగు నరనారాయణులు భూభారముడుపుటకు కృష్ణార్జునులుగా నవతరించిరి. వారు కురుక్షేత్రమున మహాఘోరమైన యుద్ధమొనరించిరి. ఇట్లు యుగయుగమున హరి పెక్కులవతారములు దాల్చుచుండును. సర్వము ప్రకృతి ననుసరించి సంభవించుచుండును. ఈ ముజ్జగములును మహా ప్రకృతిశక్తి చేతిలోని కీలుబొమ్మలు. ప్రకృతి తాను తలచిన రీతిగ జగములను భ్రమింపజేయును. పరమ పురుషుని బ్రహ్మానందమునకై జగములను వెలయించుచుండును. ఈ లోవెలిలేని మయోపాధి వలన సర్వగుడు - సర్వాది - అవ్యయుడు - దుర్జేయుడు - నిరాలంబుడు - నిరాకారుడు - నిరీహుడు అగు పురుషోత్తముడు సృజించును. ఈ మాయ యుపాధివశమున త్రిగుణ రూపముల ప్రతిభాసించును. ఈ త్రిగుణముల సమ్యక్స్వరూపమైన మాయ పరా ప్రకృతియన వెలయును. ఆ శివా ప్రకృతి యుత్పత్తి కాలమున మహాకాలవశమున భిన్న భిన్న గతులతో ప్రతిభాసించును. ఆ కామప్రదాయిని యెల్ల లోకములు విరచించి కాపాడును. ఆమె కల్పాంతమున లోకములను సంహరించును. ఈ విశ్వమోహిని వలననే బ్రహ్మ సృజింప గల్గును. విష్ణువు పాలింప గల్గును. రుద్రుడు సంహార కార్యమొనర్చును. ఆ విశ్వమాత తొల్లి రాజవర్యుడైన కాకుత్థ్సు నవతరింపజేసెను. ఆమె దానవులకు జయము గలుగకుండునట్లు జేసెను. ఈ విశాల ప్రపంచమందు ప్రాణులందఱును సుఖదుఃఖములతో గూడి చరించుచుందురు. ఎల్ల ప్రాణులును విధిచేతి కీలుబొమ్మలై వర్తింతురు. ఇది శ్రీమద్దేవీ భాగవత మందలి చతుర్థ స్కంధమందు విష్ణువవతారములు దాల్చుటయను షోడశాధ్యాయము.