Sri Devi Bhagavatam-1
Chapters
అథ చతుర్వింశో%ధ్యాయః వ్యాసః : ప్రాతర్నందగృహే పుత్త్రజన్మమహోత్సవః | కిం వదం త్యథ కంసేన శ్రుతా చారముఖాదపి.
1 జానామి వసుదేవస్య దారా స్తత్ర వసంతి హి | వశవో దాసవర్గ శ్చ సర్వే తే నందగోకులే.
2 తేన శంకాసమావిష్ఠో గోకులం ప్రతి భారత | నారదేనా%పి తత్సర్వం కథితం కారణం పురా. 3 గోకులే యేచ నందాద్యా స్తత్పత్న్యశ్చ సురాంశజాః | దేవకీవసుదేవాద్యాః సర్వే తే శత్రవః కిల. 4 ఇతి నారద వాక్యేన బోధితో%సౌ కులాదమః | జాతః కోపమనా రాజన్కంసః పరమపాపకృత్. 5 పూతనా నిహతా తత్ర కృష్ణేనామితతేజసా | బకో వత్సాసురాశ్చాపి ధేనుకశ్చ మహాబలః. 6 ప్రలంబో నిహత స్తేన తథా గోవర్ధనో ధృతై | శ్రుత్త్వైతత్కర్మ కంసస్తు మేనే మరణ మాత్మనః 7 తథా వినిహతః కేళీ జ్ఞాత్వా కంసో%తి దుర్మనాః | ధనుర్యాగ మిషేణాశు తావానేతుం ప్రచక్రమే. 8 అక్రూరం ప్రేషయామాస క్రూరః పాపమతి స్తదా | ఆనేతుం రామకృష్ణౌ చ వధాయామితవిక్రమౌ. 9 రథ మారోప్య గోపాలౌ గోకులాద్గాందినీ సుతః | ఆగతో మధురాయాం తు కంసాదేశే స్థితః కిల.10 తావాగత్య తదా తత్ర ధనుర్భంగం చ చక్రతుః | హత్వా%థ రజకం కామం గజం చాణూరముష్టికమ్. 11 శలం చ తోశలం చైవ నిజఘాన హరిస్తదా | జఘాన కంసం దేవేశః కేశేష్వాకృష్య లీలయా. 12 పితరౌ మోచయిత్వా%థ గతదుఃఖౌ చకార హ | ఉగ్రసేనాయ రాజ్యం తద్దదా వరినిఘాదనః. 13 ఇరువది నాలుగవ యధ్యాయము శ్రీ కృష్ణుని యత్యద్భుత చరిత్రము వ్యాస సంయమి యిట్లు పలికెను : రాజా! గోకులమందు నింట నుదయమున పుత్రోదయ మహోత్సవము కనుల పండువుగ జరుగు చుండెను. ఆ వార్త కంసుడు తన చారుల వలన వినెను. వసుదేవుని భార్యయు నతని పశువులును గోకులమందు వసించుచున్న వార్త కంసుడు చారులవలన నెఱిగెను. కంసునకు గోకులముపై ననుమానము గల్గెను. మున్ను నారదుడును వారికి గోకులముతో సంబంధమున్నట్లు తెలిపెను. దేవకీ వసుదేవాదులును వారి భార్యలును దైవాంశ సంభూతులు - వారు నీ శత్రువులని నారదుడు చెప్పెను. నారదుని పలుకుల వలన పాపాచారుడు - కులాధముడునగు కంసుడు ప్రబుద్ధుడై క్రుద్ధుడయ్యెను. మహా విక్రముడైన శ్రీకృష్ణుడు పూతన రక్కసిని పరిమార్చెను. అతడు బలశాలురైన బక వత్సక ధేనుకుల నంతమొందించెను. ప్రలంబాసురుని చెండాడెను. మహా శక్తుడగు కృష్ణుడు గోవర్ధగిరిని లీలగ నెత్తెను. ఇదంతయును విని కంసుడు తన చావు నిక్కమని తలపోసెను. పిమ్మట కేశియను రక్కసుడు నిహతుడయ్యెను. దాని నెఱిగి దుర్మనస్కుడైన పాపమతి యగు కంసుడతుల విక్రములగు రామకృష్ణులను వధింప తలచెను. ధనుర్యాగము నెపముగ రామ కృష్ణులను పిలిపించెను. ఆ క్రూరాత్ముడు అందుల కక్రూరుని పంపెను. గాందినీ సుతుడగు నక్రూరుడు కంసునాదేశమున గోపబాలురను రథ మెక్కించుకొని గోకులము నుండి మధురకు తోడుకొని వచ్చెను. వారచటి కేతెంచి మొట్ట మొదట ధనుర్భంగ మొనరించిరి. వారు పిమ్మట రజకుని కువలయా పీడమను గజమును చాణూర ముష్టికులను చంపిరి. దేవేశుడగు కృష్ణుడు పిదప లీలగ కంసుని జుట్టిపట్టి యీడ్చి చంపివేసెను. శత్రు నిఘాదనుడగు కృష్ణుడు తన తలిదండ్రులను కారాముక్తులను గావించి వారి దుఃఖ ముడిపెను. పిమ్మట నుగ్రసేనుని మధురకు రాజుగ నొనరించెను. వసుదేవ స్తయో స్తత్ర మౌంజీబంధనపూర్వకమ్ | కారయామాస విధివ ద్ర్వంతబంధం మహాఘనాః. 14 ఉపనీతౌ తదా తు గతౌ సాందీపనాలయమ్ | విద్యాః సర్వాః సమభ్యస్య మధురామాగతౌ పునః. 15 జాతౌ ద్వాదశవర్షీ¸° కృతవిద్యౌ మహాబలౌ | మథురాయాం స్థితౌ వీరౌ సుతావానక దుందుభేః. 16 మాగధ స్తు జరాసంధో జామాతృవధదుఃఃతః | కృత్వా సైన్యసమాజం స మథురామాగతః పురీమ్. 17 స సప్తదశవారం తు కృష్ణేన కృతబుద్ధినా | జితః సంగ్రామమాసాద్య మధుపుర్యాం నివాసినా. 18 పశ్చా చ్చ ప్రేరితస్తేన స కాలయవనాభిధః | సర్వ వ్లుెచ్ఛాధిపః శూరో యాదవానాం భయంకరః. 19 శ్రుత్వా యవన మాయాంతం కృష్ణః సర్వాన్యదూత్తమాన్ | ఆనాయ్య చ తథా రామ మువాచ మధుసూదనః. 20 భయం నో%త్ర సముత్పన్నం జరాసంధా న్మహాబలాత్ | కిం కర్తవ్యం మహాభాగా యవనః సముపైతి వై. 21 ప్రాణత్రాణం ప్రకర్తవ్యం త్వక్త్వాగేహం బలం ధనమ్ | సుఖేన స్థీయతే యత్ర సదేశఃఖలు పైతృకః. 22 సదోద్వేగకరః కామం కిం కర్తవ్యః కులోచితః | శైలసాగరసాన్ని ధ్యే స్థాతవ్యం సుఖమిచ్ఛతా. 23 యత్ర వైరిభయం న స్యాత్థ్సాతవ్యం తత్ర పండితైః | శేషశయ్యాం సమాశ్రిత్య హరిః స్వపితి సాగరే. 24 తథైవ చ భయాద్భీతః కైలాసే త్రిపురార్దనః | తస్మాన్నాత్రైవ స్థాతవ్య మస్మాభిః శత్రుతాపితైః. 25 ద్వారవత్యాం గమిష్యామః సహితాః సర్వ ఏవ వై | కథితా గరుడేనాద్య రమ్యా ద్వారవతీ పురీ. 26 రైవతాచలసాన్ని ధ్యే సింధుకూలే మనోహరా | వ్యాసః తచ్ఛ్రుత్వా వచనం తథ్యం సర్వే యాదవ పుంగవాః. 27 అంత మహా మనసుడగు వసుదేవుడు రామకృష్ణులకు మౌంజీ బంధనము లొనరించి యుపనయన సంస్కారము లోనరించెను. వారుపనీతులై సాందీపనియగు గురునొద్ద సకల విద్యలు కళలు నభ్యసించి మధుర కేతెంచిరి. వసుదేవ నందనులు మధురలో వసింపసాగిరి. వారి కపుడు పండెండ్రేండ్లు. వారు మహా విద్వాంసులు మహా బలశాలురు మహా వీర్యులునై వాసి కెక్కిరి. అంత మగధరాజుగు జరాసంధుడు తన యల్లుని మృతికి వగచి సైన్యము గూర్చుకొని మధరపై దండెత్తెను. అతడు పదునేడుమార్లు మధురానివాసి ధీశాలి యగు శ్రీకృష్ణునితో బవర మెనర్చి యోడిపోయెను. పిమ్మట యాదవుల పాలిటి యముడు శూరుడు వ్లుెచ్ఛాధినాథుడు కాలయవనుడను వానిని కృష్ణునిపైకి పురికొల్పెను. యవనుడెత్తి వచ్చుట విని కృష్ణుడు సకల యాదవులను బలరాముని బిలిపించి వారితో నిటు పలికెను : ఓ మహాశయులారా! ఇపుడు మహాబలుడగు జరాసంధుని వలన మనకు ఘోరవిపత్తు ముంచుకొని వచ్చుచున్నది. అదే యవనుడు సమీపించు చున్నాడు. ఇత్తఱి మన కర్తవ్యమేమి? ఇపుడు మన యిండ్లు ధనము బలములు విడనాడి మన ప్రాణములు గాపాడుకొనుట ముఖ్య కర్తవ్యము. ఎచట సుఖము గలుగునో యది పైతృక స్థానము గదా! ఎచట వసించిన నుద్వేగము గలుగునో యచ్చోటు కులోచితమైనను విడువదగినది. ఇపుడు క్షేమము గోరుకొనువాడు పర్వతముల - సాగరముల సన్నిధిలో నుండుట భద్రము. ఎచ్చోట వైరి భయము గలుగదో యచ్చోట నుండదగునని పండితులందురు. మధుసూదనుడు సముద్రముపై శేషశయ్యపై పవ్వళించును. అటులే త్రిపురారియు భయపీడితులై కైలాసగిరిపై వసించును గదా! కనుక నిపుడు శత్రుపీడితులమగు మనము నిచ్చోట నుండ గూడదు. మనమెల్లరము వలసినవన్నియు తీసికొని ద్వారావతి కేగుదుము. ఆ పురి రమ్యమైనదని మున్ను నాకు గరుటామంతుడు చెప్పెను. సముద్ర తీరమున రైవతా చలమను కొండకు దగ్గరగా ద్వారక చెన్నొందును.'' వ్యాసుడిట్లనెను : కృష్ణుని హితవచనములు విని యాదవ పుంగవులామోదము వెలిపుచ్చిరి. గమనాయ మతిం చక్రుః సకుటుంబాః సవాహనాః | శకటాని తథోష్ట్రాంశ్చ వామీశ్చ మహిషాం స్తథా. 28 ధనపూర్ణాని కృత్వా తే నిర్యయు ర్నగరా ద్బహిః | రామకృష్ణౌ పురస్కృత్య సర్వేతే సపరిచ్ఛదాః. 29 అగ్రే కృత్వా ప్రజాః సర్వాశ్చేలుః సర్వే యదూత్తమాః | కతిచిద్దివసైః ప్రాపుః పురీం ద్వారవతీం కిల. 30 శిల్పిభిః కారయామాస జీర్ణోద్ధారంహి మాధవః | సంస్థాప్య యాదవాం స్తత్ర తావేతౌ బలకేశవౌ. 31 తరసా మథురామేత్య సంస్థితౌ నిర్జనాం పురీమ్ | తదా తత్రైవ సంప్రాప్తో బలవాన్యవనాధిపః. 32 జ్ఞాత్వైన మాగతం కృష్ణో నిర్య¸°నగరాద్బహిః | పదాతి రగ్రే తస్యాభూ ద్యవనస్య జనార్దనః. 33 పీతాంబరధరః శ్రీమా న్ప్రహసన్మధుసూదనః | తం దృష్ట్వా పురతో యాంతం కృష్ణం కమలలోచనమ్. 34 యవనో%పి పదా శంస స్పృష్ఠతో%నుగతః ఖలః | ప్రసుప్తో యత్ర రాజర్షిర్ముచుకందో మహాబలః. 35 ప్రయ¸° భగవాంస్తత్ర సకాలయవనో హరిః | తత్రైవాంతర్దధే విష్ణు ర్ముచుకుందం సమీక్ష చ. 36 తత్రైవ యవనఃప్రాప్తః సు ప్తభూత మపశ్యత | మత్వా తం వాసుదేవం స పాదే నాతాడయన్నృపమ్. 37 ప్రబుద్ధః క్రోధరక్తాక్ష స్తం దదాహ మహాబలః | తం దగ్ధ్వా ముచుకుందో%థ దదర్శ కమలేక్షణమ్. 38 వాసుదేవం సదేవేశం ప్రణమ్య ప్రస్థితో వనమ్ | జగామ ద్వారకాం కృష్ణో బలదేవసమన్వితః. 39 వారెల్లరును సకుటుంబముగ ద్వారక కేగ నిశ్చయించుకొనిరి. వారు శకటములు లొట్టిపిట్టలు మహిషములు అశ్వములు వెంట తీసికొనిరి. వారు వానినిండ వలసిన ధనసామగ్రులుంచుకొని నగరము వెడలిరి. వారికి ముందుగ రామకృష్ణులు నడచిరి. ప్రజానీకమెల్లను రామకృష్ణులకు ముందుగ యాదవులు వారికి వెనుకగ నడచుచుండగ వారు కొలది నాళ్ళలోనే ద్వారక జేరిరి. ఆ పురము నిర్జనమై యుండెను. రామకృష్ణులు శిల్పులచే దానిని చక్కగ సంస్కరింపజేసి యచట యాదవాదుల నుంచిరి. వారు వేగముగ నిర్జనమైన మధురాపురికేగి యట వసించిరి. అదే సమయమునందు బలశాలియగు యవనపతి యచ్చటికి వచ్చెను. యవనుని రాక విని శాశ్వత బ్రహ్మమగు కృష్ణుడు నగరము వెడలి పాదచారియై యతని ముందటికేగెను. అతనిని గని పీతాంబరధారి మొలక నవ్వులు నవ్వెను. కమలలోచనుడగు మధుసూదనుడు యవనుని ముందుగ ముందునకు సాగుచుండెను. యవను డపుడు తనముందు కృష్ణుని గని అతనిని వెన్నాడుచు ననుసరించెను. ఒకచోట మహా విక్రముడు రాజర్షి యగు ముచుకుందుడు నిదురించు చుండెను. కృష్ణ భగవానుడు తన్ను వెంబడించు యవనునితో ఆ రాజర్షియున్న యెడ కరిగి యంతర్ధానము నందెను. అచ్చోట నిద్రించు ముచుకుందుని వాసుదేవునిగ భావించి యవనుడు ఆతనిని కాలదన్నెను. ఆ తాపునకు మహితబలశాలియగు ముచుకుందరాజర్షి మేలుకొని క్రోధ రక్తాక్షుడై యవనుని తన కంటి మంటతో కాల్చివేసెను. పిమ్మట కమలలోచనుని దర్శించెను. దేవదేవుడగు వాసుదేవునకు ప్రణమిల్లి తత్క్షణమే ముచుకుందుడు వనముల కేగెను. కృష్ణుడు బలదేవునిగూడి ద్వారక కరిగెను. ఉగ్రసేనుని రాజుగ నొనరించి తాను యథేచ్ఛముగ విహరించు చుండెను. ఉగ్రసేనం నృపం కృత్వా విజహార యథారుచి | ఆహార ద్రుక్మిణ కామం శిశుపాల స్వయంవరాత్. 40 రాక్షసేన వివాహేన చక్రే దారవిధిం హరిః | తతో జాంబవతీం సత్యాం మిత్రవిందాం చ భామినీమ్. 41 కాళిందీం లక్ష్మణాం భద్రాం తథా నాగ్నజితీం శుభాం | పృథగ్పృథ క్సమానీయా ప్యుపయేమే జనార్దనః. 42 అష్టావేవ మహీపాల! పత్నీః పరమశోభనాః | ప్రాసూత రుక్మిణీ పుత్రం ప్రద్యుమ్నం చారుదర్శనమ్. 43 జాతకర్మాదికం తస్య చకార మధుసూదనః | హృతో %సౌ సూతికాగేహా చ్ఛంబరేణ బలీయసా. 44 నీతశ్చ స్వపురీం బాలో మాయావత్యై సమర్పితః | వాసుదేవో హృతం దృష్ట్వా పుత్త్రశోక సమన్వితః. 45 జగామ శరణం దేవీం భక్తియుక్తేన చేతసా | వృత్రాసురాదయో దైత్యా లీలయైన యయా హతాః. 46 తతో%సౌ యోగమాయాయా శ్చకార సరమాం స్తుతిం | వచోభిః పరమోదారై రక్షరైః స్తవనైః శుభైః. 47 శ్రీకృష్ణః: మాతర్మయ%తితపసా పరితోషితా త్వం | ప్రాగ్జన్మని ప్రసుమనాదిభి రర్చితా%సి | ధర్మాత్మజేన బదరీవన ఖండమధ్యే కింవిస్మితో జనని తే త్వయిభక్తి భావంః. 48 సూతీగృహా దపహృతః కిము బాలకో మే | కేనా పి దుష్టమనసా%ప్యథ కౌతుకా ద్వా | మానాపహార కరణాయ మమాద్య నూనం | లజ్జా తవాంబ! ఖలు భక్తజనస్యయుక్తా. 49 దుర్గో మహానతితరాం నగరీ సుగుప్తా | తత్రాపి మే%స్తిసదనం కిల మధ్యభాగే | అంతఃపురే చ పిహితం నను సూతిగేహే బాలో హృతః ఖలు తథా%పి మమైవ దోషాత్. 50 నాహం గతః పరపురం న చ యాదవాశ్చ రక్షావతీచ నగరీ కిల వీరవర్యైః | మాయా తవైవ జనని ప్రకటప్రభావా మే బాలకః పరిహృతః కుహకేనకేన. 51 ఒకసారి రుక్మిణీ వివాహము శిశుపాలునితో జరుగుట కేర్పాటులు జరిగెను. అపుడు హరి స్వయంవరము నుండి రుక్మిణిని హరించెను. ఆపైని రాక్షస వివాహ విధిగ ఆమెను వివాహమయ్యెను. పిదప శ్రీకృష్ణుడు జాంబవతి మిత్రవింద సత్యభామలను పెండ్లాడెను. మఱియు కాళింది లక్ష్మణ నాగ్నజితియనువారలను వేర్వేరుసమయములందు పరిగ్రహించెను. ఈ యెనమండుగురు పరమ పవిత్రులు శ్రీకృష్ణుని పత్నులు. వారిలో రుక్మిణి ప్రియదర్శనుడు ప్రద్యుమ్నుని గనెను. కృష్ణుడు ప్రద్యుమ్నునకు జాతకర్మాది సంస్కారము లొనరించెను. ఒకసారి బలశాలియగు శంబరారి బాలుని ప్రద్యుమ్నుని పురిటింట నపహరించెను. అతడు తన పురి కరిగి బాలుని మాయావతి చేతిలో నుంచెను. తన పుత్రు డపహృతుడగుటచే కృష్ణుడు శోకించెను. పద్మనాభుడు భక్తి ప్రపత్తులతో చిత్తమందు శ్రీ భువనేశ్వరీదేవిని శరణు వేడెను. ఆ దేవి మున్ను వృత్రాసురాదులను సంహరించెను. కృష్ణుడు యోగమాయను పరమోదారములైన లలితాక్షరములతో నిట్లు స్తుతించెను: జగజ్జననీ! తొంటి జన్మమున నేను ధర్ముని కొడుకనై బదరీవనమందు తపించితిని. అపుడు నీవు నా తపమునకు సంతసించితివి. నేను నిన్ను పూలతో నర్చించితిని. నీయందలి యానాటి నా భక్తి తత్పరతను మఱచితివా తల్లీ! నా పుత్త్రుడు పురిటింట నపహరింపబడెను. ఏ దుష్టుడైన వినోదమున కట్లొనరించెనో! కాక నన్న వమానించుటకు చేసెనో! తల్లీ ! నీవు భక్త సులభవు. ఇది నీకుగూడ నవమానకరముగదా! నా నగరము సురక్షితముగా నున్నది. నగర దుర్గము దృఢమైనది. నగరము నడుమ నా భవనము గలదు. దాని యంతిపురమున పురిటిల్లు గలదు. అందున్న నా పుత్త్రుడు నా దోషమున నపహరింపబడెను గదా! నేనుగాని యావులుగాని యన్యాయముగ శత్రు పురములై దండెత్త లేదు. నా నగరము వీరయోధులచేత సురక్షితము. ఇదంతయును నీ మాయా ప్రభావమని తెలియుచున్నది. నా బాలు డేమోసగానిచే నపహరింపబడెనో! నోవేద్మ్యహం జనని తే చరితం సుగుప్తం కోవేద మందమతి రల్పవిదేవ దేహీ | క్వా%సౌ గతో మమ భ##టై ర్న చ వీక్షితో వా హర్తాంబికే ! జవనికా తవ కల్పితేయమ్. 52 చిత్రం నతే%త్ర పురతో మమ మాతృగర్భా న్నీతస్త్వయా%ర్ధసమయే కిల మాయయా%సౌ | యం రోహిణీ హలధరం సుషువే ప్రసిద్ధం దూరే స్థితా పతిపరా మిథునం వినా%పి. 53 సృష్టిం కరోషి జగతా మనుపాలనం చ నాశం తథైవ పునరప్యనిశం గుణౖస్త్వమ్ | కోవేద తే%ంబ చరితం దురితాంతకారి ప్రాయేణ సర్వ మఃలం విహితం త్వయైతత్. 54 ఉత్పాద్య పుత్త్ర జననప్రభవం ప్రమోదందత్వాపునర్విరహజం కిల దుఃఖభాగమ్ | త్వంక్రీడసే సులలితైః ఖలుతైర్విహారై ర్నోచేత్కథం మమ సుతాప్తిరతి ర్వృథా స్యాత్. 55 మాతా%స్య రోదితి భృశం కురరీవ బాలా దుఃఖం తనోతి మమ సన్నిధిగా సదైవ | కష్టం న వేత్సి లలితే%ప్రమితప్రభావే మాత స్త్వమేవ శరణం భవ పీడితానామ్. 56 సీమా సుఖస్య సుతజన్మ తదీయానాశో దుఃఖస్య దేవి భవనే బహుధా వదంతి | తత్కిం కరోమి జనని ప్రథమే ప్రణష్టే పుత్త్రే మమాద్య హృదయం స్ఫుటతీవ మాతః. 57 యజ్ఞం కరోమి తవ తుష్టికరం వ్రతం వా దైవం చ పూజనమథాఃల దుఃఖహా త్వమ్ | మాతః సుతో%త్ర యది జీవతి దర్శయాశు త్వం వై క్షమా సకలశోకవినాశనాయ. 58 ఏవం స్తుతా తదా దేవీ కృష్ణేనాక్లిష్ట కర్మణా | ప్రత్యక్ష దర్శనా భూత్వా తమువాచ జగద్గురుమ్. 59 శ్రీదేవీ: శోకం మా కురుదేవేశ శాపో%యం తే పురాతనః | తస్యయోగేన పుత్త్రస్తే శంబరేణ హృతో బలాత్. 60 అతస్తే షోడశే వర్షే హత్వా తం శంబరం బలాత్ | ఆగమిష్యతి పుత్త్రస్తే మత్ప్రసాదా న్న సంశయః. 61 ఇత్యుక్త్వా%ంతర్దధే దేవీ చండికా చండవిక్రమా | భగవానపి పుత్త్రస్య శోకం త్యక్త్వా%భవత్సు భీ. 62 ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ చతుర్థస్కంధే చతుర్వింశో%ధ్యాయః. ఓ అమ్మా ! నీ రహస్య చరిత్ర మహత్త్వము నాకే తెలియదు. ఇంక దేహాభిమాని మందమతి యగు సామాన్యుని కెట్లు తెలియును? నా బాలకు నెవరపహరించిరో నా భటులకు గనబడ కతడెచటి కేగెనో ఇదంతయును నీ చే కల్పితమైన మాయ తెరమాత్రమే. తల్లీ! ఇది నీ లీలా విలాసమా! మున్ను నా తల్లి గర్భమందలి శిశువునైదవ నెలనే అప్పటికే పతిసంగతి పాసి యెక్కడనో యున్న రోహిణీ గర్భమందుంచి యామెను ప్రసవింప జేసితివే! అదియును లోకవిదితమే కదా! అంబికా! నీవు నీ మహత్తర గుణగణములతో నిరంతరముగ లోకములు పుట్టించి పెంచి యడంచు చుందువు. నీ దురిత దూరమగు పరమ పావన చరిత మెవ్వడెరుగజాలును? ఈ విశ్వ ప్రవృత్తి నీమూలముననే జరుగుచున్నది కదా! జననీ! నాకు మొదట పుత్రసంతాన మొసగితివి. పుత్త్ర జనన ప్రమోదము కల్గించితివి. పిదప పుత్త్ర వియోగ దుఃఖమును గల్గించితివి. దీనిబట్టి నీవు లలిత వినోద విహారముల నాడుకొనుచుందువని నాకు దోచుచున్నది. కాన నా పుత్రోత్సాహము వ్యర్థము గాదని తలతును. మాతా! ఆ బాలుని తల్లి కురరివలె పుత్త్ర శోకమున వలవల ఏడ్చుచు నా చెంతకు వచ్చి గుండె బాదుకొనుచున్నది. ఓ లలితాంబా! మా కడగండ్లు నీ వెరుగనివా? భవరోగ పీడితులకు నీవేకదా శరణ్యము! ఓ జననీ! పుత్త్ర జననము సుఖ సంసారమున చివరిమెట్టు పుత్రనాశము దుఃఖములకు చివరిమెట్టు. అని బుధులందురు. తొలి కుమారుడే నష్టుడుగాగా నింక నేనేమి చేయుదును? నా యెడద బ్రద్దలగుచున్నది. అమ్మా! నిన్ను దేవీ యాగములతో వ్రతములతో పూజలతో సంతోషపఱతును. నీవొక్కతెవే శోకములెల్ల బాపగలదానవు. నా కొడుకు బ్రతికియున్నచో నాకు వేగమే చూపుమమ్మా! అని యీ విధముగ నద్భుతకర్ముడు జగద్గురువు నగు శ్రీకృష్ణుడు సంస్తుతింపగా జగదంబ ప్రత్యక్షమై యతని కిట్లు పలికెను: దేవేశా! శోకింపకుము. నీకు వెనుకటి శాపమొకటి కలదు. ఆ కారణమున శంబరుడు మాయాబలమున నీబాలు నపహరించెను. నీ బాలునకు పదారేండ్ల వయసు రావలయును. అపుడతడు నా యనుగ్రహ బలమున శంబరాసురుని సంహరించి తిరిగి రాగలడు అని యిట్లు చండ విక్రమయు దయాతరింగిణియు నగు చండికాదేవి పలికి యంతర్ధాన మొందెను. కృష్ణభగవానుడు శోకముడిగి సుఖముందెను. ఇతి శ్రీమద్దేవీ భాగవతమందు చతుర్థ స్కంధమందు కృష్ణుని యత్యద్భుత చరిత్రము నిరువది నాల్గవ యధ్యాయము.