Sri Devi Bhagavatam-1
Chapters
అథ చతుర్థో%ధ్యాయః వ్యాసః: గతే దూతే సురేంద్రో%పి సమాహూయ సురానథ | యమ వాయు ధనాధ్యక్ష వరుణానిద మూచివాన్.
1 మహిషో నామ దైత్యేంద్రో రంభపుత్రో మహాబలః | వరదర్పమదోన్మత్తో మాయాశతవిచక్షణః.
2 తస్య దూతో%ద్య సంప్రాప్తః ప్రేషిత స్తేన భో సురాః | స్వర్గకామేన లుబ్ధేన మామువాచేదృశం వచః.
3 త్యజ దేవాలయం శక్ర యథేచ్ఛం వ్రజ వాసవ | సేవాం వా కురు దైత్యస్య మహిషస్య మహాత్మనః.
4 దయావాన్దానవేంద్రో%సౌ సతే వృత్తిం విధాస్యతి | నతేషు భృత్యభూతేషు న కుప్యతి కదాచన.
5 నో చే ద్యుద్ధాయ దేవేశ! సేనోద్యోగం కురు స్వయమ్ | గతే మయి సదైత్యేంద్ర స్త్వరితః సముపేష్యతి.
6 ఇత్యుక్త్వా స గతో దూతో దానవస్య దురాత్మనః | కిం కర్తవ్య మతః కార్యం చింతయధ్వం సురోత్తమా.
7 దుర్బలో%పి న చోపేక్ష్యః శత్రు ర్బలవతా సురాః | విశేషేణ సదోద్యోగీ బలవాన్బల దర్పితః.
8 ఉద్యమః కిల కర్తప్యో యథాబుద్ధి యథాబలమ్ | దైవాధీనో భ##వేన్నూనం జయో వా%థ పరాజయః.
9 సంధియోగో న చాత్రాస్తి ఖలే సంధి ర్నిరర్థకః | సర్వథా సాధుభిః కార్యం విచార్య చ పునః పునః.
10 యానమప్యధునా నైవ కర్తవ్యం సహసా పునః | ప్రేక్షకాః ప్రేషణీయాశ్చ శ్రీఘ్రగాః సుప్రవేశకాః.
11 ఇంగితజ్ఞా శ్చ నిఃసంగా నిఃసృహాః సత్యవాదినః | సేనాభియోగం ప్రస్థానం బలసంఖ్యాం యథార్థతః.
12 వీరాణాం చ పరిజ్ఞానం కృత్వా%%యాంతు త్వరాన్వితాః | జ్ఞాత్వాదైత్యపతే స్తస్య సైన్యస్యచ బలాబలమ్.
13 కరిష్యామి తతస్తూర్ణం యానం వా దుర్గ సంగ్రహమ్ | విచార్య ఖలు కర్తవ్యం కార్యం బుద్ధిమతా సదా. సహసా విహితం కార్యం దుఃఖదం సర్వథా భ##వేత్.
14 నాలుగవ అధ్యాయము ఇంద్రునకు గురుని హితబోధ మహిషుని దూత వెడలిన మీదట నింద్రుడు యమ వాయు వరుణ కుబేరులను పిలిపించి వారికిట్లనెను : సురలారా! రంభుని సుతుడు మహిషుడు. అతడు మహాబలశాలి. వరగర్వమున మత్తుడు. పెక్కు మాయలు పన్నుటలో నేర్పరి. అతడు స్వర్గమును గోరి యొక దూత నంపెను. ఆ దూత యిప్పుడే నా చెంతకు వచ్చి యిట్లు పలికెను: యింద్రా! స్వర్గము వదలి నీ కిష్టమైన చోటికేగుము. లేక మహాత్ముడగు మహిషుని సేవ లొనరింపుము. నీ వతనికి భృత్యుడవైనచో నిన్నతడు కోపింపక దయతో వదలిపెట్టి నీకు తగిన వృత్తి యేర్పరచగలడు. కానిచో బవరమునకు సేన నాయత్త పఱచుకొనుము. నేను వెడలిన వెంటనే దైత్యపతి యుద్ధసన్నద్ధుడై రాగలడు అని యిట్లు పలికి దానవ దూత యేగెను. కాన నిక మన కర్తవ్య మేమో యోజింపుడు. తన వైరి యెంత దుర్బలుడైనను బలశాలి వానిని వదలిపెట్టరాదు. ఇపుడా దైత్యుడు బలగర్వితుడు. పొగరుబోతు. అతడు ప్రయత్నశీలుడైన నిక చెప్పెడి దేమున్నది? ప్రతివాడును తన బుద్ధి బలముల ననుసరించి ప్రయత్నమొనరింప వలయును. జయాపజయములు దైవా ధీనములు గద! ఖలునితో సంధి యే నాటికిని దగదు. అది నిరర్థకము. సాధు వన్ని విధములుగ చక్కగ విచారించి పనికి బూనుకొనవలయును. మనమిపుడు తొందఱపడి యుద్ధయాత్రకు సాగగూడదు. శీఘ్రగాములు - సుప్రవేశకులు - ఇంగితజ్ఞులు - నిస్సంగులు - సత్యవాదులు నగు చారుల పంపి శత్రుసేనల సంఖ్యాబలము నెఱుగ వలయును. అటులే సేనలలోని వీరుల యావత్ బలాబలము లెఱుగ వలయును. ఆ పిదప యుద్ధభేరి మ్రోగింతము లేక యేదేని దుర్గములో తలదాచుకొందము. బుద్ధి శాలియైనవాడు చక్కగ విచారించి కాని యే పనియైన చేయడు. తొందఱ పడి చేసిన పని దుఃఖములు కలిగించును. తస్మా ద్విమృశ్య కర్తవ్యం సుఖదం సర్వథా బుధైః | నా%త్ర భేదవిధి ర్న్యాయో దానవేషు చ సర్వథా.
15 ఏక చిత్తేషు కార్మే%స్మిం స్తస్మాచ్చారా వ్రజంతువై | జ్ఞాత్వా బలాబలం తేషాం పశ్చాన్నీ తీర్విచార్య చ.
16 విధేయా విధివత్త ద్జైస్తేషు కార్యపరేషు చ | అన్యథా విహితం కార్యం విపరీతఫలప్రదమ్.
17 సర్వథా తద్భవే న్నూనమజ్ఞాత మౌషధం యథా | వ్యాస ఉవాచ : ఇతి సంచింత్య తైః సర్వైః ప్రణిధిం కార్యవేదినమ్.
18 ప్రేషయామాస దేవేంద్రః పరిజ్ఞానాయ పార్థివ | దూతస్తు త్వరితో గత్వా సమాగమ్య సురాధిపమ్.
19 నివేదయామాస తదా సర్వసైన్యబలాబలమ్ | జ్ఞాత్వా తద్బల ముద్యోగం తురాషా డతివిస్మితః.
20 దేవా నచోదయ త్తూర్ణం సమాహూయ పురోహితమ్ | మంత్రం మంత్రవిదాం శ్రేష్ఠం చకార త్రిదశేశ్వరః.
21 ఉవా చాంగిరసశ్రేష్ఠం సమాసీనం వరాసనే | ఇంద్ర ఉవాచ: భో భో దేవగురో విద్వన్కింకర్తవ్యం వదస్వనః.
22 సర్వజ్ఞో%సి సముత్పన్నే కార్యే త్వం గతిరద్య నః | దానవో మహిషో నామ మహావీర్యో మదాన్వితః. 23 యోద్ధుకామః సమాయాతి బహుభి ర్దానవైర్వృతః | తత్ర ప్రతిక్రియా కార్యా త్వయా మం తవిదా%ధునా. 24 తేషాం శుక్ర స్తథా త్వం మే విఘ్న హర్తా సుసమ్మతం | వ్యాస ఉవాచ : తచ్ఛ్రుత్వా వచనం ప్రాహ తురాషాహం బృహస్పతిః. 25 విచింత్య మనసా కామం కార్యసాధన తత్పరః. కాన తెలిసిన వాడాలోచించి చేయవలయును. దానవు లిపుడు ఐకమత్యముతో నున్నారు. వారిలో నిపుడు భేదము కలిగింప వీలుపడదు. కావున చారులేగి వారి బలాబలము లెఱిగి రావలయును. పిదప విజ్ఞులతో యథావిధిగ కార్యమాలోచించి చేయుదము. ఇట్లు చేయనిచో మన పని విపరీతఫలము లొసగును. అపుడు మన పని శాస్త్రమెఱుగని వైద్యుడిచ్చిన ఔషధమువలె నుండును. ఇట్లు దేవత లెల్ల రాలోచించుకొని కార్యకుశలుడగు చారుని బలిచిరి. ఇంద్రు డతనిని రహస్యము లెఱిగి రమ్మని పంపెను. దూత వేగిరమేగి తిరిగి వచ్చెను. అతడు శత్రుసేనల బలాబలములు తెలిపెను. మహిషుని బలము ప్రయత్నము విని యింద్రుడు విస్మయమందెను. అతడు దేవతలను పోరునకు సంసిద్ధులుగ నుండుడని ప్రేరించెను. మంత్రవిదుడు ఆంగిరసవరుడు గురుడునగు బృహస్పతి వరాసనమున నుండగ నింద్రు డేతెంచి యతనితో నిట్లనెను: 'దేవగురూ! మా కిపుడు కర్తవ్య ముపదేశింపుము. నీవు సర్వజ్ఞుడవు. ఇప్పటి మా యీ పనిలో నీవే మాకు దిక్కు. మహిషు డను దానవుడు మహావీర్యుడు నుమత్తుడు. అతడు దానవులను వెంటగొని పోరుటకు రానున్నాడు. నీవు మంత్ర విదుడవు. కాన దానికి ప్రతిక్రియ నాలోచింపుము. శుక్రు డసురులకు విఘ్నహరుడు. నీవును మా కటులే విఘ్నహరుడవు అను మాటలువిని గురుడు కార్యసాధన తత్పరుడై బాగుగ నాలోచించి ఇంద్రునితో నిట్లనెను: గురు రువాచ : స్వస్థో భవ సురేంద్ర త్వం ధైర్యమాలంబ్య మారిష! 26 వ్యసనే చ సముత్పన్నే న త్యాజ్యం ధైర్య మాశువై | జయాజ¸° సురాధ్యక్ష దైవాధీనౌ సదైవ హి. 27 స్థాతవ్యం ధైర్య మాలంబ్య తస్మా ద్బుద్ధిమతా సదా | భవితవ్యం భవత్యేవ జానన్నేవ శతక్రతో ! 28 ఉద్యమః సర్వథా కార్యో యథాపౌరుష మాత్మనః | మునయో%పి హి ముక్త్యర్థ ముద్యమైకరతాః సదా. 29 దైవాధీనం చ జానంతో యోగధ్యానపరాయణాః | తస్మాత్సదైవ కర్తవ్యో వ్యవహారోదితోద్యమః. 30 సుఖం భవతు వా మావా దైవే కా పరిదేవనా | వినా పురుషకారేణ కదా చిత్సిద్ధి మాప్నుయాత్. 31 అంధవ త్పంగువత్కామం న తథా ముదమావహేత్ | కృతే పురుషకారే%పి యది సిద్ధిర్నజాయతే. 32 న తత్ర దూషణం తస్య దైవాధీనే శరీరిణి | కార్యసిద్ధిర్న సైన్యే%స్తి న మంత్రే న చ మంత్రణ. 33 న రథేనా%%యుధే నూనం దైవాధీనా సురాధిప | బలవాన్ల్కేశమాప్నోతి నిర్బలః సుఖ మశ్నుతే. 34 బుద్ధిమాన్ క్షుధితః శేతే నిర్బుద్ధిర్భోగవాన్భవేత్ | కాతరో జయమాప్నోతి శూరో యాతి పరాజయమ్. 35 దైవాధీనే తు సంసారే కామం కా పరిదేవనా | ఉద్యమే యోజయే న్నూనం భవితవ్యం సురాధిప. 36 దుఃఖదే సుఖదే వా%పి తత్ర తౌ న విచింతయేత్ | దుఃఖే దుఃఖాధికాన్పశ్యే త్సుఖే పశ్యేత్సుఖాధికాన్. 37 ఆత్మానం హర్షశోకాభ్యాం శత్రుభ్యామివ నార్పయేత్ | ధైర్య మేవావగంతవ్యం హర్షశోకోద్భవే బుధైః. 38 అధైర్యా ద్యాదృశం దుఃఖం న తు ధైర్యే2స్తి తాదృశమ్ | దుర్లభం సహనత్వం వై సమయే సుఖదుఃఖయోః. 39 గురుడు కార్యసాధన తత్పరుడై బాగుగ నాలోచించి ఇంద్రునితో నిట్లనియెను: ''ఇంద్రా! స్వస్థుడవు గమ్ము. ధైర్య మూనుము. ఆపదలందు ధైర్యగుణ మావశ్యకము|జయాపజయములు దైవాధీనములు. కానున్నది కాకమానదు. దీని నెఱిగి ధీశాలి ధైర్యముగ నుండవలయును. ప్రతివాడును తన శక్తికి తగినట్లు ప్రయత్నము చేయవలయును. మునులు సైతము బంధమోచనమునకు యత్న మొనరింతురు. వారు సర్వము దైవాధీనమని యెఱిగి ధ్యానయోగ మొనరింతురు. కనుక శాస్త్రము ననుసరించి యత్నింపవలయును. సుఖము గలిగినను గులగకున్నను దైవమును నిందింపరాదు. ఒకవేళ కుంటి - గ్రుడ్డివారలకు గలిగినట్లు పురుష ప్రయత్నము లేకయే పని నెరవేరవచ్చును. అట్లు సిద్ధి చేకూరినను దానికి సంతసింపరాదు. ఒకప్పుడు పురుష కారమున ఫలము సిద్ధింపక పోవచ్చును. ఐనను దానిని దూషింపరాదు. ఏలయన, కార్యఫలములు దైవాధీనములు. కనుక నెపుడైన కేవలము సైన్యముచేతగాని మంత్రములతోగాని మంత్రణములచేతగాని పని సాధ్యము కాదు. రథములతో ఆయుధములతోనే పనియు నెరవేరదు. కేవలము దైవాధీనముగనే కార్యసిద్ధి జరుగును. ఒక్కొక్కప్పుడు బలశాలియును దుఃఖములందును. బలహీనుడును సుఖములందును. ధీశాలియు వ్యాకులపాటు చెందును. బుద్ధిహీనుడును సుఖభోగియగును. పిరికివాడు జయమందవచ్చును. శూరు డపజయమందవచ్చును. ఈ విశ్వమంతయును దైవాధీనము. దీనికి శోకింప నేటికి? భవితవ్యము ప్రాణిని తప్పక యత్నమునకు ప్రేరించును. ఈ పని సుఖప్రదమా దుఃఖదమా యని విచారింప దగదు. నరులు దుఃఖములందు దుఃఖాధిక స్థితులను గాంతురు. సుఖములందు మిక్కిలి సుఖము లందుదురు. ఎట్టివాడును హర్షశోకములకు వశుడై తన్ను శత్రువుల కర్పించుకొన దగదు - పండితుడు హర్షశోకములందు ధైర్యముతో నుండవలయును. అధైర్యమందు దుఃఖము గల్గును. ధైర్యమందు దుఃఖము గలుగదు. కనుక సుఖదుఃఖముల యెడల తాలిమి వహింపవలయును. హర్షశోకోద్భవో యత్ర న భ##వేద్బుద్ధి నిశ్చయాత్ | కిం దుఃఖం కస్య వా దుఃఖం నిర్గుణో%హం సదా2వ్యయః. 40 చతుర్విం శాతతిరిక్తో%స్మి కిం మే దుఃఖం సుఖం చ కిమ్ | ప్రాణస్య క్షుత్పిపాసే ద్వే మనసః శోకమూర్ఛనే. 41 జరామృత్యూ శరీరస్య షడూర్మిరహితః శివః | శోకమోహౌ శరీరస్య గుణౌ కిం మే%త్రచింతనే. 42 శరీరం నాహ మథవా తత్సంబంధీ న చాప్యహమ్ | సపై#్తకషోడశాదిభ్యో విభిన్నో%హం సదా సుఖీ. 43 ప్రకృతి ర్వికృతి ర్నా%హం కిం మే దుఃఖం సదా పునః | ఇతి మత్వా సురేశ త్వం మనసా భవనిర్మమః. 44 ఉపాయః ప్రథమో%యం తే దుఃఖనాశే శతక్రతో | మమతా పరమం దుఃఖం నిర్మమత్వం పరం సుఖమ్. 45 సంతోషా దపరం నాస్తి సుఖస్థానం శచీపతే | అథవా యది న జ్ఞానం మమతానాశ##నే కిల. 46 తతో వివేకః కర్తవ్యో భవితవ్యే సురాధిప | ప్రారబ్ధ కర్మణాం నాశో నాభోగాల్లక్ష్యతే కిల. 47 యద్భావి తద్భవత్యేవ కా చింతా సుఖదుఃఖయోః | సురైః సర్వైః సహాయై ర్వా బుద్ధ్యా వా తవసత్తమ. 48 సుఖం క్షయాయ పుణ్యస్య దుఃఖం పాపస్య మారిష | తస్మా త్పుణ్యక్షయే హర్షః కర్తవ్యః సర్వథా బుధైః. 49 అథవా మంత్రయిత్వా2ద్యకురు యత్నం యథావిధి | కృతే యత్నే మహారాజ భవితవ్యం భవిష్యతి. 50 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ పంచమస్కంధే చతుర్థో%ధ్యాయః. హర్షశోకములందు బుద్ధి నిశ్చలముగ నుండవలయును. ఈ దుఃఖ మేమి? ఇది ఎవరికి గలుగును? వేను నిర్గుణుడను. అవ్యయుడను. చతుర్వింశతి తత్వముల కతీతుడను. ఇట్టి నాకు సుఖదుఃఖము లెక్కడివి? ఆకలిదప్పులు ప్రాణమునకు గలుగును. శోకమూర్ఛలు మనస్సునకు గల్గును. జరామృత్యువులు దేహమునకు కలుగును. నే నీ యారు వ్యాధులు లేనివాడను. చిదానందరూపశివుడను. శోకమోహములు శరీర గుణములు. ఇంక నాకు వీని చింత యేల? నే నీ శరీరమను గాను. నాకు దీనితో నెట్టి సంబంధమును లేదు. నే నష్టప్రకృతులకంటె పదారువికృతులకంటె భిన్నుడను. కాన, నేను సుఃని-నిత్యానందరసఘనమను. నేను ప్రకృతినిగాను - వికృతిగాను. ఇక నాకు దుఃఖ మేల గలుగును? అని నెమ్మది దలచి నిర్మముడవు గమ్ము. దుఃఖనాశమునకు ముఖ్యమగు నుపాయము వినుము. నిర్మమత్వమున సుఖము గల్గును. ఈ లోకమందు సంతోషము కంటె వేరగు సుఖస్థానము లేదు. నీకు మమతానాశము వలన జ్ఞానము గలుగును. కానిచో భవితవ్యమందు నిశ్చయము గలిగి యుండుము. ప్రారబ్ధ కర్మము లేవియు ననుభవింపక నశింపవు. ఏది జరుగవలయునో యది జరిగితీరును. నీకు సురబల ముండుగాక! బుద్ధిబలముండుగాక! ఇక సుఖదుఃఖముల గూర్చి నీకు చింతయేల? నరులకు పుణ్యములు నశించుట కొఱకు సుఖభోగములు గలుగును. అటులే వారికి పాపములు నశించుటకు దుఃఖములు గల్గును. కనుక తన పుణ్యములు నశించినందులకు బుధుడు ముదమందవలయును. ఇపుడు చక్కగా నాలోచించి యథావిధిగ ప్రయత్న మొనరింపుము. ఆలోచించి ప్రయత్నించినచో పిమ్మట కాదగినది కాగలదు. ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ ష్కంధమందు ఇంద్రునకు గురుని హితబోధయను చతుర్థాధ్యాయము.