Sri Devi Bhagavatam-1    Chapters   

అథ అష్టమోధ్యాయః

వ్యాస ఉవాచ : తరసా తే%థ సంప్రాప్య వైకుంఠం విష్ణువల్లభమ్‌ | దదృశుః సర్వశోభాఢ్యం దివ్యగృహ విరాజితమ్‌. 1

సరోవాపీ సరిద్భిశ్చ సంయుతం సుఖదం శుభమ్‌ | హంస సారస చక్రహ్వైః కూజిద్భి శ్చ విరాజితమ్‌. 2

చంపాకాశోకకహ్లార మందారవకుళా వృతైః | మల్లికాతిలకా మ్రాతయుతైః కురవకాదిభిః. 3

కోకిలారావసన్నాదైః శిఖండైర్నృ త్యరంజి తైః | భ్రమరారావరమ్యై శ్చ దివ్యై రుపవనైర్యుతమ్‌. 4

సునంద నందనాదైయశ్చ పార్షదై ర్భక్తి తత్పరైః | సంస్తువద్భి ర్యుతం భ##క్తై రనన్యభవ వృత్తిభిః. 5

ప్రాసాదై రత్న ఖచితైః కాంచనై శ్చిత్రమండితైః | అభ్రంలిహై ర్విరాజద్భిః సంయుతం శుభపద్మకైః. 6

గాయద్భి ర్దేవగంధర్వై ర్నృత్యద్భి రప్సరోగణౖః | రంజితం కిన్నరైః శశ్వ ద్రక్త కంఠై ర్మనోహరైః. 7

మునిభి శ్చ తథా శాంతై ర్వేదపాఠకృ%%దరైః | స్తువద్భిః శ్రుతి సూక్తైశ్చ మండితం సదనం హరేః. 8

తే చ విష్ణుంగృహం ప్రాప్య ద్వారపాలౌ శుభా%%కృతీ | వీక్ష్య చు ర్జయ విజ¸° హేమయష్టిధరౌ స్థితౌ. 9

గత్వైకో%ప్యుభయో ర్మధ్యే నివేదయతు సంగతాన్‌ | ద్వారస్థాన్‌ బ్రహ్మరు | దాదీ న్విష్ణుదర్శనలాలసాన్‌. 10

వ్యాస ఉవాచ : విజయ స్త ద్వచః శ్రుత్వా గత్వా%థ విష్ణు సన్నిధౌ | సర్వా న్సమాగతా న్దేవా న్ప్రప్రణమ్యోవాచ సత్వరః. 11

విజయ ఉవాచ : దేవదేవ మహారాజ రమాకాంత సురారిహన్‌ | సమాగతాః సురాః సర్వే ద్వారి తిష్ఠంతి వై విభో. 12

బ్రహ్మ రుద్ర స్తథేంద్ర శ్చ వరుణః పావకో యమః | స్తువంతి వేదవాక్యై స్త్వా మమరా దర్శనార్థినః. 13

ఎనిమిదవధ్యాయము

శ్రీదేవి యావిర్భవించుట

దేవత లెల్లరును శ్రీవిష్ణువు పరిపాలించు వైకుంఠపుర మేగిరి. వారు దాని నలుగడలు దర్శించిరి. అది సకలములగు సంపదలకు శోభలకు నిలయము. అచట సుందర దివ్య మందిరము లనేకములు గలవు. హంస-సారస-చక్రవాకముల కలకూజములతో నొప్పు సరస్సులు వాపీనదులు గలవు. చంపక-అశోక-కహ్లార-మందార-మల్లికా-తిలక-చూత - కురవక - వకుళములను పుష్ప తరువులు శోభిల్లును. ఆ చెట్లపై కోయిలల మధుర కలస్వనములు చెలంగుచుండును. ఆచోట మయూర నృత్య మనోహరములు భ్రమర రావరమ్యములు నైన దివ్యసుందరోపవనములు లలరారుచున్నవి. పరమ విష్ణు భక్తితత్పురులు సనందనాది పార్షదులు నిత్యము శ్రీ మహావిష్ణుని సంస్తుతించుచుందురు. రత్నఖచితములు కాంచన చిత్రితములు అంబర చుంబులు నగు భవ్య ప్రాసాదములు గలదు. పరమభక్తి పరాయణులగు దేవ-కిన్నర-గంధర్వులు సరసరాగములతో మధుర కంఠములతో గానము చేతురు. అచ్చరలు నర్తింతురు. వేదాధ్యయన మందానందన మందు ప్రశాంత మునులు శ్రుతి సూక్తులతో వేదపారాయణ మొనరింతురు. ఈ చందమున చెన్నొందు నిందిరా రమణ మందిరమును బృందారకులు సందర్శించిరి. అచ్చో బంగారు బెత్తములు పట్టుకొని దివ్య శరీరముల వెలుగొందు జయవిజయులను ద్వారపాలురను గాంచి సురలు బ్రహ్మాది దేవతలు విష్ణు దర్శనార్థము వచ్చి ద్వారమందున్నారని మీలో నొక రేగి పరమాత్మునకు నివేదింపుడు అనిరి. విజయుడా మాటలు విని వేగమే విష్ణు సన్నిధి కేగి దోయిలించి విభూ! దేవదేవా! మహారాజా! రమాకాంతా! దానవాంతకా! అమరు లెల్లరు ద్వారమందున్నారు. మిమ్ము దర్శింపగోరి బ్రహ్మ - రుద్ర - అగ్ని - యమ - వరుణులు వేదసూక్తములతో మిమ్ము సంస్తుతించుచున్నారు అని సురల రాక నివేదించెను.

వ్యాస ఉవాచ : తచ్ఛ్రుత్వా వచనం విష్ణు ర్విజయస్య రమాపతిః | నిర్జగామ గృహాత్తూర్ణం సురన్సమధికోత్సవః. 14

గత్వా వీక్ష్య హరి ర్దేవా న్ద్వారస్థాన్‌ శ్రమకర్శితాన్‌ | ప్రీతిప్రవణయా దృష్ట్వా ప్రీణయామాస దుఃఃతాన్‌. 15

ప్రణము స్తే సురాః సర్వే దేవదేవం జనార్దనమ్‌ | తుష్టువు శ్చ సురారిఘ్నం వాగ్భిర్వేద వినిశ్చితమ్‌. 16

దేవాఊచుః: దేవదేవ జగన్థా సృష్టి స్థిత్యంత కారక | దయాసింధో మహారాజ త్రాహి నః శరణాగతాన్‌. 17

విష్ణురువాచ : విశంతు నిర్జరాః సర్వే కుశలం కథయంతు వః | ఆసనేషు; కిమర్థం వై మిళితాః సముపాగతాః. 18

చింతాతురాః కథం జాతా విషణ్ణా దీనమానసాః బ్రహ్మరుద్రేణ సహితాః కార్యం ప్రబ్రూత సత్వరమ్‌. 19

దేవ ఊచుః: మహిషేణ మహారాజః ! పీడితాః పాపకర్మణా | అసాధ్యే న%తి దుష్టేన వరదృప్తేన పాపినా. 20

యజ్ఞభాగనసౌ భుంక్తే బ్రాహ్మణౖః ప్రతిపాదితాన్‌ | అమరా గిరి దుర్గేషు భ్రమంతి చ భయాతురాః. 21

వరదానేన ధాతుః స దుర్జయో మధుసూదన | తస్మా త్త్వా శరణం ప్రాప్తా జ్ఞాత్వా తత్కార్య గౌరవమ్‌. 22

సమర్ధో%పి సముద్ధర్తుం దైత్యమాయా విశారద | కురు కృష్ణ వధోపాయం తస్య దానవమర్దన. 23

ధాత్రా తసై#్మ వరో దత్తో హ్యవధ్యో%స్తి నరైః కిల | కా స్త్రీత్వేవంవిధా బాలా యా హన్యాత్తం శఠం రణ. 24

ఉమా మా వా శచీ విద్యా కా మసర్థా%స్య ఘాతనే | మహిషస్యాతిదుష్టస్య వరదానబలాదపి. 25

విచింత్య బుద్ధ్యా యత్సర్వం మరణస్యా%స్య కారణమ్‌ | కురు కార్యం చ దేవానాం భక్తవత్సల భూధర. 26

విజయుని మాటలు విని రమాపతి మిక్కిలి సంతోషముతో తన మందిరము నుండి బయటికి వచ్చెను. ద్వారము ముందు దుఃఖార్తులు శ్రమపీడితులు నగు దేవతలను గని హరి తన చల్లని నెయ్యపు చూపులతో వారికి ముదము గలిగించెను. దేవత లెల్లరును దేవదేవుడగు జనార్దనుని వేదవాక్కులతో చక్కగ సంస్తుతించుచు నంజలి ఘటించి ఓ దేవదేవా! జగన్నాధా! సృష్టిస్థిత్యంతకారకా! మేము శరణార్థులము. మమ్ము గాపాడుము' అనిరి. అది విని విష్ణు విట్లనెను : ఓ నిర్జరులారా ! మీరు మీమీ యాసనముల నుండుడు. మీ కుశలములు తెలుపుడు. మీరెల్లరును దీనులు నార్తులునై చింతాపరులై బ్రహ్మరుద్రులతో గూడి కలసికట్టుగ ఏగుదెంచిన హేతువు వెల్లడింపుడు' తన సుర లిట్లనిరి. మహారాజా! మహిషుడు వరగర్వితుడు; పాపకర్ముడు; దుష్టాత్ముడు - అజేయుడు. వాడు మమ్ము బాధించుచున్నాడు. వాడు విప్రులొసగు హవిర్భాగములు గ్రహించుచున్నాడు. వానికి భయపడి దేవతలు గిరిదుర్గముల పాలయినారు. మధుమథనా! వాడు విధివరమున దుర్జయు డయియున్నాడు. మాకు భారమగుటచే నిన్ను శరణు వేడుకొనుచున్నాము. కృష్ణా! మాయా విశారదా! దానవమర్దనా! వాని వధోపాయ మాలోచించి మమ్ముద్ధరింప నీవే సమర్థుడవు. వాడు నరుల కవధ్యుడు. బ్రహ్మవరము బొందినవాడు. అట్టి దుష్టుని రణమందే యబల చంపజాలును? వాడు వర ప్రభావమున కన్నుమిన్ను గానకున్నాడు. అట్టివానిని భారతి - లక్ష్మి - పార్వతి - శచీదేవులలో నెవరు చంపగలరు? భక్తవత్సలా ! వాని మరణోపాయమును సూక్ష్మబుద్ధితో నాలోచింపుము. దేవకార్యము నిర్వహింపుము.''

వ్యాస ఉవాచ : శ్రుత్వా తద్వచనం విష్ణు స్తానువాచ హసన్నివ | యుద్ధం కృతం పురా%స్మాభి స్తథా%సి న మృతో హ్యసౌ. 27

అద్య సర్వ సురాణాం వై తేజోభీ రూపసంపదా | ఉత్పన్నా చే ద్వరారోహా సా హన్యాత్తం రణ బలాత్‌. 28

హయారిం వరదృప్తం చ మాయాశతవిశారదమ్‌ | హంతుం యోగ్యా భ##వేన్నారీ శక్త్యం శూర్నిర్మితా హి నః. 29

ప్రార్థయంతు చ తేజో%ంశాన్‌ స్త్రియో%స్మాకం తథాపునః | ఉత్పన్నైసై#్త శ్చ తేజో%ంశై స్తేజోరాశి ర్భవేద్యథా. 30

ఆయుధాని వయం దద్మః సర్వే రుద్రపురోగమాః | తసై#్మ సర్వాణి దివ్యాని త్రిశూలాదీని యానిచ. 31

సర్వా%%యుధధరా నారీ సర్వతేజః సమన్వితా | హనిష్యతి దురాత్మానం తం పాపం మదగర్వితమ్‌. 32

వ్యాస ఉవాచ : ఇత్యుక్తవతి దేవేశే బ్రహ్మణో వదనాత్తతః | స్వయమేవోద్బభౌ తేజోరాశి శ్చాతీవ దుఃసహః. 33

రక్తవర్ణం శుభాకారం పద్మరాగమణి ప్రభమ్‌ | కించి చ్ఛీతం తథా చోష్ణం మరీచి జాలమండితమ్‌. 34

నిః సృతం హరిణా దృష్టం హరేణ చ మహాత్మనా | విస్మితౌ తౌ మహారాజ బభూవతు రురుక్రమౌ. 35

శంకరస్య శరీరాత్తు నిఃసృతం మహదద్భుతమ్‌ | రౌప్యవర్ణ మభూత్తీవ్రం దుర్దర్శం దారుణం మహత్‌. 36

భయంకరం చ దైత్యానాం దేవానాం విస్మయప్రదమ్‌ | ఘోరరూపం గిరిప్రఖ్యం తమోగుణ మివాపరమ్‌. 37

తతో విష్ణు శరీరాత్తు తేజోరాశి మివాపరమ్‌ | నీలం సత్త్వగుణోపేతం ప్రాదురాస మహాద్యుతి. 38

తతశ్చేంద్ర శరీరాత్తు చిత్రరూపం దురాసదమ్‌ | ఆ విరాసీ త్సు సంవృత్తం తేజః సర్వగుణాత్మకమ్‌. 39

దేవతల ఈ మాటలాలకించి చిరునగవుతో హరి వారి కిట్లనియెను : నేను మునుపు వానితో బోరి చూచితిని. కాని, వాడు చావలేదు. ఇపుడెల్ల దేవతల తేజోంశముల నుండి చక్కని వీరాంగన యావిర్భవించవలయును. ఆమె స్వశక్తితో వానిని యుద్ధమందు హతమార్చగలదు. మన కళాంశముల నుండి తేజోరూపము దాల్చిన వీర రమణి వరగర్వితులు మాయా విశారదులు నగు నూరుల కొలది మహిషులనైనను చంపజాలును. ఇపుడు మనమును మన పత్నులును మన తేజోంశములను ప్రార్థింతము. ఆ తేజోంశముల నుండి యొక తేజోరాశి యావిర్భవించుగాక! రుద్రుడు మొదలుగాగల దేవతల త్రిశూలము మున్నగు నాయుధముల నన్నిటి నా దివ్యావతారమూర్తి కొసంగుదము. అట్టి సర్వదివ్యాయుధములతో దివ్యతేజములతో వెలుగులు జిమ్ము వీరనారీమణి తప్పక మదగర్వితుడగు ఆ దుష్టుని పరిమార్చగలదు' అని విష్ణువు పలుకగనే చతుర్ముఖుని వదనముల నుండి దుస్సహమైన తేజోరాశి స్వయముగ నావిర్భవించెను. ఆ బ్రాహ్మతేజము పద్మ రాగమణి కాంతులు వెలార్చుచున్నది. రక్తవర్ణముగ సమ శీతోష్ణముగ నున్నది. మరీచి కాంతి మాలలతో నలంకృతమై మేలు వెలుగురూపున నొప్పుచున్నది. అట్లు వెలువడిన బ్రహ్మతేజమును గాంచి ఉరుక్రములగు హరిహరులు పరమ విస్మయమందిరి. రుద్రుని శరీరమునుండి రుద్రతేజ మావిర్భవించెను. అది దారుణమై దుర్దర్శమై మహాద్భుతమై తీవ్రమగు తెల్లని వెండికాంతుల విరజిమ్ముచు విరాజిల్లుచుండెను. అది దైత్య భయంకరము; దేవ విస్మయకరము; ఘోర ఘోరతరము; గిరివిశాలము; రూపు దాల్చిన తమోగుణమోయన వెలయుచుండెను. విష్ణుని శరీరమందుండి వైష్ణవ తేజము ప్రాదుర్భవించెను. అది సత్త్వగుణముతో కాంతివంతమై నీలవర్ణయుతమై వెలుగొందుచుండెను. ఇంద్రుని శరీరము నుండి యైంద్రతేజ ముద్భవిల్లెను. అది సర్వగుణాత్మకము. దుస్సహము. సుందరము. విచిత్ర రూపము.

కుబేర యమ వహ్నినాం శరీరేభ్యః సమంతతః | నిశ్చక్రామ మహత్తేజో వరుణస్య తథైవ చ. 40

అన్యేషాం చైవ దేవానాం శరీరేభోయ%తి భాస్వరమ్‌ | నిర్గతం తన్మహాతేజోరాశి రాసిన్మహోజ్జ్వలః. 41

తం దృష్ట్వా విస్మితాః సర్వే దేవా విష్ణుపురోగమాః | తేజోరాశిం మహాదివ్యం హిమాచల మివాపరమ్‌. 42

పశ్యతాం తత్ర దేవానాం తేజః పుంజ సముద్భమా | బభూవాతావరా నారీ సుందరీ విస్మయప్రదా. 43

త్రిగుణా సా మహాలక్ష్మీః సర్వదేవశరీరజా | అష్టాదశభుజా రమ్యా త్రివర్ణా విశ్వమోహినీ. 44

శ్వేతాననా కృష్ణనేత్రా సంరక్తాధరపల్లవా | తామ్రపాణితలా కాంతా దివ్యభూషణభూషితా. 45

అష్టాదశభుజా దేవీ సహస్రభుజమండితా | సంభుతా%సురనాశాయ తేజోరాశిసముద్భవా. 46

జనమేజయః: కృష్ణ దేవ మహాభాగ సర్వజ్ఞ మునిసత్తమ | విస్తారం బ్రూహి తస్యాస్త్వం శరీరస్య సముద్భవమ్‌. 47

ఏకీభూతం చ సర్వేషాం తేజః కింవా పృథ క్థ్సితమ్‌ | అంగాని చైవ తస్యా స్తు సర్వే తేజోమయాని వై. 48

భిన్నభాగవిభాగేన జాతా న్యంగాని యాని తు | ముఖనాసా%క్షి భేదేన సర్వత్రైకభవాని చ. 49

బ్రూహి తద్విస్తరం వ్యాస శరీరాంగ సముద్భవమ్‌ | బభూవ యస్య దేవస్య తేజసో%ంగం యదద్భుతమ్‌. 50

ఆయుధా%భరణాదీని దత్తాని యైర్యథా యథా | తత్సర్వం శ్రోతుకామో%స్మి త్వన్ముఖాంబుజనిర్గతమ్‌. 51

న హి తృప్యామ్యహం బ్రహ్మ న్సుధామయరసం పిబన్‌ | చరితం చ మహాలక్ష్మ్యా స్త్వన్ముఖాంభోజనిఃసృతమ్‌. 52

అగ్ని - యమ - వరుణ - కుబేరుల శరీరముల నుండి యొకేసారి మహా తేజములుద్భవించెను. అటులే యితర దేవతల నుండియు తేజో రాసులుదయయించెను. వాటి సముదాయము మహోజ్వల రాశిగ బొలిచెను. ఇట్లు దేవతేజో రాశినుండి అసుర నాశమునకై సముద్భవించిన ఆ దేవి వాస్తవమున అష్టాదశ భుజములే యుండియు సహస్ర భుజాలంకృతగా నుండెను. ఆ మహోజ్జ్వల తేజము రెండవ హిమాలయము చందమున దివ్యముగ నుండెను. దానిని విష్ణువు మొదలుగాగల వారు దర్శించి పరమాశ్చర్య మందిరి. దేవతలు చూచుచుండగనే యా తేజశ్రీల నుండి పమరాద్భుతము గొల్పుచు శ్రేష్ఠము సుందరియునగుయునొక దివ్యరమణి రూపొందెను. అట్లు సర్వదేవతల శరీరముల నుండి యావిర్భవించిన యాదేవి త్రిగుణయగు మహాలక్ష్మి. ఆ దేవి త్రిగుణమయి - అష్టాదశభుజ - జగన్మోహిని - త్రివర్ణ. తెల్లని మోము - నల్లని కన్నులు - మిగుల ఎర్రని అధరపల్లవములు ఎర్రని అరచేతులు - కలిగి దివ్యభూషణభూషితయై మనోహరగా నుండెను. ఇట్లు దేవతేజోరాశినుండి అసురనాశమునకై సముద్భవించిన ఆ దేవి అష్టాదశభుజ యయి యుండియు వాస్తవమున సహస్రభుజాలంకృతగా నుండెను అన జనమేజయుడు వ్యాసునితో నిట్లనెను : కృష్ణా! దేవా ! సర్వజ్ఞా! మహాభాగా ! మునిసత్తమా! ఆ తల్లి శరీర సంభవము గూర్చి విపులముగ తేట పఱచుము. ఆ యెల్ల దేవతల తేజము లొక్కటిగ నయ్యెనా? లేక వేరు వేరుగ నుండెనా? ఆమె యంగములు తేజోమయములా కావా? ఆమె ముఖము - ముక్కు - కన్నులు - ఇవి వేరు వేరు తేజముల నుండి కలిగెనా? ఏ దేవత తేజమునుండి యే యంగము రూపు దాల్చెనో యట్టి శరీరాంగముల పుట్టుక గూర్చి నాకు సర్వము నభివర్ణింపుము. ఆమె కెవరెవ రేయే యాభరణము లేయే యాయుధము లొసగిరో యదియంతయును నీ ముఖకమలమునుండి విని నుత్సహించుచున్నాను. నీ మోముదమ్మినుండి చిప్పిలు శ్రీ మహాలక్ష్మీ చరితామృత మధురస మెంత క్రోలినను నా యెడంద తనియుట లేదు.

సూతః: ఇతి తస్యవచః శ్రుత్వా రాజ్ఞః సత్యవతీ సుతః | ఉవాచ మధురం వాక్యం ప్రీణయన్నివ భూపతిమ్‌. 53

వ్యాసః: శృణు రాజన్మహాభాగ విస్తరేణబ్రవీమి తే | యథామతి కురుశ్రేష్ఠ తస్యా దేహసముద్భవమ్‌. 54

న బ్రహ్మా న హరిః సాక్షా న్న రుద్రో న చ వాసవః | యథాతథ్యేన తద్రూపం వక్తుమీశః కదాచన. 55

కథం జానా మ్యహం దేవ్యా యద్రూపం యాదృశం యతః | వాచారంభణమాత్రం తదుత్పన్నేతి బ్రవీమి యత్‌. 56

సా నిత్యా సర్వదైవాస్తే దేవకార్యార్థసిద్ధయే | నానారూపా త్వేకరూపా జాయతే కార్యగౌరవాత్‌. 57

యథా నటో రంగ గతో నానారూపో భవత్యసౌ | ఏకరూప స్వభావో%పి లోకరంజనహేతవే. 58

తథైషా దేవకార్యార్థ మరూపా%పి స్వలీలయా | కరోతి బహురూపాణి నిర్గుణ సగుణాని చ. 59

కార్యకర్మా%నుసారేణ నామాని ప్రభవంతి హి | ధాత్వర్థగుణ యుక్తాని గౌణాని సుబహూన్యపి. 60

తద్వై బుద్ద్యమసారేణ ప్రబవీమి నరాధిప | యథాతేజః సముద్భూతం రూపం తస్యా మనోహరమ్‌. 61

శంకరస్య చ యత్తేజ స్తేన తన్ముఖపంకజమ్‌ | శ్వేతవర్ణం శుభాకారమజాయత మహత్తరమ్‌. 62

కేశా స్తస్యా స్తథా స్నిగ్ధా యామ్యేన తేజసా%భవన్‌ | వక్రాగ్రా శ్చాతిదీరా వై మేఘవర్ణా మనోహరాః. 63

నయనత్రితయం తస్యా జజ్ఞే పావకతేజసా | కృష్ణం రక్తం తథా శ్వేతం వర్ణత్రయవిభూషితమ్‌. 64

అను రాజు మాటలు విని వ్యాసుడు మధురిమలు చిందు పలుకులతో ప్రీతి గల్గించుచు మరల నీ విధముగ చెప్ప దొడంగెను. 'రాజా! ఆ కఱకుచీకటులు బాపు తేజముల తేజస్స్వరూప మేర్పడిన తీరుతెన్నులు నా బుద్ధి కందినంతవఱకు వివరింతును, వినుము: హరి-హర-బ్రహ్మ-వాసవులలో నెవరేని యా జ్యోతిస్స్వరూప మున్నది యున్నట్లుగ వివరింపజాలరు. ఆ తేజముత్పన్నమయ్యె ననుట వాక్కును ఆలంబనము చేసికొని పలుకు పలుకే కాని వాస్తవముగ నది యుత్పన్నమయినది కాని అగునది కాని కాదు. మఱి యా స్వరూపము నెట్లని యేమని యెంతని తెలియగలను? ఆమె నిత్య కావున ఎల్లప్పుడు ఉండునదియే. ఏక రూపమయ్యు ఆమె దేవతల దుష్కరమైన కార్యము నెఱవేర్చుట కనంతరూపములు దాల్చును. ఒకే రూప మొకే స్వభావముగల నటుడు రంగ స్థలముపై చూపఱను రంజింపజేయుటకు బహురూపములు ధరించును. ఆ దేవి కనంతనామములు గలవు. అవి కార్యకర్మములు ధాత్వర్థముల ననుసరించి ముఖ్యములు నముఖ్యములు ననబరగును. ఆ దివ్య ప్రకటితమైన యమృతకాంతులీను స్వరూపమును నా బుద్ధికి తోచినట్లుగ వచింపగలను. శంకరుని తేజమునుండి శ్వేతతేజమునుండి వర్ణముతో నామె చక్కని శుభాకారముగల ముఖకమల ముద్భవించెను. ఆ దేవి కేశములు కుటిలాగ్రములు సహజ పరిమళములు అతి దీర్ఘములు. చిక్కగ నునుపుగ సుమనోహరముగ మేఘవర్ణముతో నొప్పుచున్నవి. అవి యముని తేజము నుండి గల్గినవి. ఆమెకు మూడు కనుదమ్ములు గలవు. అవి తెలుపు-నీలము-ఎఱుపు వన్నెలతో నందగించుచున్నవి. ఆ కన్ను లగ్నితేజమునుండి వెలసినవి.

వక్రే స్నిగ్ధే కృష్ణవర్ణే సంధ్యయోస్తేజసా భ్రువౌ | జాతే దేవ్యాః సుతేజస్కే కామస్య ధనుషీ వ తే. 65

వాయో శ్చ తేజసా శస్తౌ శ్రవణా సంబభూవతుః | నాతి దీరౌనా%తి హ్రస్వౌ దోలావివ మనోభువః. 66

తిలపుష్పసమాకారా నాసికా సుమనోహరా | సంజాతా స్నిగ్ధవర్ణా వై ధనదస్య చ తేజసా. 67

దంతాః శిఖరిణః శ్లక్షాణః కుందాగ్రసదృశాః సమాః | సంజాతాః సుప్రభా రాజ న్ప్రాజాపత్యేన తేజసా. 68

అధరశ్చా తిరక్తో%స్యాః సంజాతో%రుణతేజసా | ఉత్తరోష్ఠ స్తథా రమ్యః కార్తికేయస్య తేజసా. 69

అష్టాదశభుజాకారా బాహవో విష్ణుతేజసా | వసూనాం తేజసా%ంగుల్యో రక్తవర్ణా స్తథా%భవన్‌. 70

సౌమ్యేన తేజసా జాతం స్తనయో ర్ముగ్మముత్తమమ్‌ | ఇంద్రేణా స్యా స్తథా మధ్యం జాతం త్రివళిసంయుతమ్‌. 71

జంఘోరూ వరుణస్యా%థ తేజసా సంబభూవతుః | నితంబః స తు సంజాతో విపుల స్తేజసా భువః. 72

ఏవం నారీ శుభాకారా సురూపా సుస్వరా భృశమ్‌ | సముత్పన్నా తథా రాజం స్తజోరాశి సముద్భవా. 73

తాం దృష్ట్వా సుష్ఠుసర్వాంగీం సుదతీం చారులోచనమ్‌ | ముదం ప్రాపుః సురాః సర్వే మహిషేణ ప్రపీడితాః. 74

విష్ణు స్త్వాహ సురాన్సర్వా న్భూషణాన్యాయుధాని చ | ప్రయచ్ఛంతు శుభాన్యసై#్య దేవాః సర్వాణి సాంప్రతమ్‌. 74

స్వాయుధేభ్యః సముత్పాద్య తేజోయుక్తాని సత్వరాః | సమర్పయంతు సర్వే%ద్య దేవ్యై నానా%యుధానివై. 76

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ పంచమస్కంధే శ్రీదేవీ స్వరూపోద్భవో నామాష్టమోధ్యాయః.

ఆ దేవి కనుబొమలు వంపులు తిరిగి కోమలములై మరుని చాపములను తలపించుచున్నది. అవి నీలవర్ణము గలవి. సంజకెంజాయలనుండి యేర్పడినవి. వాయుని తేజమునుండి ప్రశస్తములగు ఆమె చెవులు గల్గినవి. అవి యంత పొట్టిగ లేవు పొడవుగ లేవు. అవి మదనుని తులకు చెందిన పళ్లెరములో యన నొప్పుచున్నవి. ఆమె సునాసికలు నూగు పూవులవలె కోమలములు మనోహరములు. అవి కుబేరునివలన నేర్పడినవి. ఆమె దంతపంక్తులు కుందసుమములవలె కొనలుదేలి కాంతులు విరజిమ్ముచున్నవి. అవి దక్షుని తేజము వలన గలిగినవి. ఆమె క్రీబెదవి యరుణుని తేజమున గలిగినది. అది యరుణవర్ణము వెలార్చుచున్నది. పై పెదవియు నట్లే రమ్యమైనది. అది కార్తికేయుని తేజమున సంభవించినది. విష్ణుని తేజమునుండి యష్టాదశభుజములు రూపుగొన్నవి. వసువుల తేజమునుండి చిగురుటాకులవంటి యెఱ్ఱని వ్రేళ్లు గలిగినవి. ఆ దేవి చనుదోయి సౌమ్యుని తేజమున గలిగినది. ఇంద్రుని తేజమునుండి నడుము - త్రివళులు రూపు దాల్చినవి. వరుణుని ప్రకాశమునుండి యామె తొడలు జంఘలు రూపైనవి. ఇంద్రుని తేజమునుండి పిఱుదులు వెలసినవి. ఈ విధముగ శ్రీదేవి యా యా దేవతల యా యా తేజములనుండి సురూపము సుస్వరము గలిగి యావిర్భవించెను. ఇట్టి శుభలక్షణసర్వాంగి-సుదతి-చారులోచన యగు శ్రీదేవిని సందర్శించి మహిషపీడితులైన దేవత లెల్లరును పరమానందభరితు లైరి. అపుడు విష్ణువు దేవతలారా! మీ రిపుడు శ్రీదేవికి మీ మీ దివ్యభూషణములు దివ్యాయుధములు సమర్పింపుడు. దేవత లెల్లరును తమ తమ తేజోవంతములగు నాయుధములనుండి దివ్యాయుధములు సిద్ధముచేసి శ్రీదేవికి సత్వరమే సమర్పింపుడు' అనెను.

ఇది శ్రీమద్దేవీ భాగవతమందలి పంచమ స్కంధమందు శ్రీదేవి యావిర్భవించుటయను నెనిమిదవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters