Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకవింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథానుజీవివృత్తమ్‌.

పుష్కర ఉవాచ :

భృత్యః కుర్యాత్తు రాజాజ్ఞాం శిష్యవత్సచ్ఛ్రియః పతేః | నక్షిషేద్వచనం రాజ్ఞోహ్యనుకూలం ప్రియంవదేత్‌.

రహోగతస్య వక్తవ్యమప్రియం యద్ధితం భ##వేత్‌ | ననియుక్తో హరేద్విత్తం నోపేక్షేత్తస్యమానకమ్‌. 2

రాజ్ఞశ్చ న తథాకార్యం దేశభాషావిచేష్టితమ్‌ | అంతఃపురచరాధ్యక్షో వైరభూతూర్నిరాకృతైః 3

సంసర్గం న వ్రజేద్బృత్యోరాజ్ఞో గుహ్యం చగోపయేత్‌ | ప్రదర్శ్య కౌశలం కించిద్రాజానం తు విశేషయేత్‌. 4

రాజ్ఞా యచ్ఛ్రావితం గుహ్యం న తల్లోకే ప్రకాశ##యేత్‌ | ఆజ్ఞాప్యమానే వాన్యస్మిన్‌ కింకరోమీతివావదేత్‌. 5

వస్త్రం రత్నమలంకారం రాజ్ఞాదత్తం చధారయేత్‌ | నానిర్దిష్టోద్వారివిశేన్నాయోగ్యే భువిరాజదృక్‌. 6

జృంభాం నిష్ఠీవనం కాసం కోపం పర్యన్తికాశ్రయమ్‌ | భ్రుకుటీం వాత ముద్గారం తత్సమీపే వివర్జయేత్‌. 7

స్వగుణాఖ్యాపనేయుక్త్యా పరానేవ నియోజయేత్‌ | శాఠ్యం లౌల్యం సపైశున్యం నాస్తిక్యం క్షుద్రతాం తథా. 8

చాపల్యం చ పరిత్యాజ్యం నిత్యం రాజానుజీవినా | శ్రుతేనా విద్యాశిల్పైశ్చ సంయోజ్యాత్మానమాత్మనా. 9

రాజసేవాం తతః కుర్యాద్భూతయే భూతివర్ధనః | నమస్కార్యాః సదా చాస్య పుత్రవల్లభమంత్రికాః. 10

సచివైర్నాస్య విశ్వాసో రాజచిత్త ప్రియఞ్చరేత్‌ | త్యజేద్విరక్తంరక్తాత్తు వృత్తిమీ హేతరాజవిత్‌. 11

అపృష్టశ్చాస్య న బ్రూయాత్కామం కుర్యాత్తథాపది | ప్రసన్నో వాక్యసంగ్రాహీ రహస్యే నచ శఙ్కతే.

కుశలాది పరిప్రశ్నం సంప్రయచ్ఛతి చాసనమ్‌ | తత్కథాశ్రవణాద్థృష్టో హ్యప్రియాణ్యపినన్దతే. 13

అల్పం దత్తం ప్రగృహ్ణాతి న్మరేత్కథాన్తరేష్వపి | ఇతి రక్తస్య కర్తవ్యం సేవా మన్యస్య వర్జయేత్‌. 14

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే అనుజీవివృత్తం నామైకవింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః.

పుష్కరుడు పలికెను : భృత్యుడు రాజాజ్ఞను, శిష్యుడు గుర్వాజ్ఞను పాలించినట్లును, పతివ్రత భర్త ఆజ్ఞ పాలించినట్లును పాలించవలెను. రాజు మాటలను ఎన్నడును వ్యతిరేకించక సర్వదా ఆతనికి అనుకూలమగు మాటలు చెప్పవలెను. ఏదైన రాజునకు హితకరము- కాని ఆతనికి అప్రియము అయిన విషయము చెప్పవలసి వచ్చినపుడు అతనికి రహస్యముగా చెప్పవలెను. ధనాదాయమునకు సంబంధించిన కార్యమునందు నియుక్తుడైనవాడు రాజధనమును అపహరింప కూడదు. రాజసన్మానమును ఉపేక్షింపగూడదు. రాజును మాటలలోగాని, చేష్టలలోగాని, వేషభూషణాదులతో గాని అనుకరింపరాదు. అంతఃపుర సేనాధ్యక్షుడు రాజుతో వైరము కలవారితో కాని, అవమానపూర్వముగా రాజాస్థానమునుండి వెడలగొట్టబడిన వారితోగాని కలిసిమెలసి ఉండరాదు. రాజరహస్యములను భృత్యుడెన్నడును ఇతరులను చెప్పరాదు. తనకున్న ఏదోఒక నేర్పును చూపి రాజును సంతుష్టుని చేయవలెను. రాజు తనకేదైన రహస్యవిషయము చెప్పినచో అది ఇతరులకు చెప్పరాదు. రాజు మరెవ్వరికైన పని చెప్పదలచుచున్నపుడు తానేరేచి- ''మహారాజా! ఏమి చేయవలెనో సెలవిమ్ము, నేను చేసెదను'' అని ముందుకు రావలెను. బాహూకరించిన వస్త్రాలంకారాదులను సర్వదాధరించు చుండవలెను. రాజాజ్ఞ లేనిదే ద్వారమునందుగాని, రాజు దృష్టిపడుటకు అవకాశముండు మరొక స్థానమునందుగాని కూర్చుండగూడదు. రాజసమీపమున ఆవులింత, ఉమ్మివేయుట, దగ్గుట, కోపముప్రకటించుట, మంచముపై కూర్చుండుట, కనుబొమ్మలు విరచుట. ఆపానవాయువు విడచుట, త్రేన్చుట మొదలగు పనులు చేయరాదు. రాజు సమక్షమున తన గుణములను ఇతరుల ద్వారా వర్ణింపచేయవలెను. శఠత్వము (రహస్యముగా అపకారము చేయుట), దురాశ, చెవికొరకుట, నాస్తికత్వము, నీచత్వము చాపల్యము మొదలగు దోషములను రాజసేవకుడు సర్వథా పరిత్యజించవలెను. ప్రయత్నపూర్వకముగా వేద విద్యా శిల్పాకలాదులతో ముందుగా ప్రావీణ్యము సంపాదించుకొని, పిమ్మట ధనాభివృద్ధి కొరకై రాజసేవానియుక్తి సంపాదించుకొనవలెను. రాజునకు ఇష్టుడైన వానికిని, అతని పుత్రులకును మంత్రులకును నమస్కరించుచుండవలెను. మంత్రుల దగ్గర ఉన్నంతమాత్రముచే రాజునకు తనపైవిశ్వాసము కలుగదు. అందుచే ఆతని మనస్సుకు అనుకూలములగు కార్యములు సర్వదా చేయుచుండవలెను. రాజు స్వభావమును బాగుగా గుర్తించి ఆతనికి తనపై సదభిప్రాయము లేనిచో ఆతనిని విడచి, తనను ఆదరించు మరొక రాజును ఆశ్రయించవలెను. అడగకుండా రాజుకు ఏమియు చెప్పరాదు. కాని ఆపత్సమయమునందు మాత్రము చెప్పవచ్చును. రాజు ప్రసన్నుడైనచో వినీతుడని సేవకుని మాట విని ఆతని ప్రార్థనను అంగీకరించును ప్రేమపాత్రుడైన సేవకు అంతఃపురాది రహస్యస్థానములందు కనబడినను రాజు ఆతని విషయమున శంకించడు. ఆతడు సభకు పచ్చినపుడు రాజు ఆతనిని కుశలప్రశ్నలు వేసి ఆసనమిచ్చును. ఆతడు చేయు చర్చలు విని సంతోషించును. ఆతడేదైన అప్రియ వాక్యము పలికినను దానిని చెడ్డగా తీసుకొనిన ప్రసన్నుడు కూడ అగును ఆతడిచ్చిన చిన్నవస్తువును కూడ ఆదరముతో గ్రహించి, మాటలలో దానిని స్మరించుచుండును. ఈ లక్షణములను బట్టి రాజు తనపై విరక్తుడా అనురక్తుడా అను విషయమును గ్రహించి అనురక్తుడగు రాజును సేవించవలెను. విరక్తుడైన వానిని విడువవలెను.

అగ్ని మహాపురాణమునందు 'అనుజీవివృత్తకథన'మను రెండువందలిరువదియొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page