Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ ద్విచత్వారింశదధిక ద్విశతతమో7ధ్యాయః
అథ పునః రాజనీతిః
శ్రీరామ ఉవాచ :
షడ్విధంతు బలంప్యూహ్యదేవాన్ర్పార్చ్యరిపుం వ్రజేత్ | మౌలభూతం శ్రేణి సుహృద్ద్విషదాటవికం బలమ్. 1
పూర్వం పూర్వం గరీయస్తు బలానాం వ్యసనం తథా | షడఙ్గం మంత్రకోశాభ్యాం పదాత్యశ్వరథద్విపైః 2
నద్యద్రివనదుర్గేషు యత్ర యత్ర భయం భ##వేత్ | సేనాపతిస్తత్ర తత్ర గచ్ఛేద్వ్యూహీకృతైర్బలైః. 3
నాయకఃపురతోయాయాత్ర్పవీర పురుషావృతః | మధ్యేకళత్రం స్వామీ చ కోశః. ఫల్గుచయద్బలమ్. 4
పార్శ్వయోరుభయోరశ్వావాజినాం పార్శ్వయోరథాః |
రథానాం పార్శ్వయోర్నాగా నాగానాం చాటవీబలమ్. 5
పశ్చాత్సేనాపతిః సర్వం పురస్కృత్య కృతీస్వయమ్ |
యాయాత్సన్నద్ధసైన్యౌఘః భిన్నానాశ్వాసయఞ్ఛనైః. 6
యాయాద్వ్యూహేన మహతా మకరేణ పురోభ##యే | శ్యేనేనోద్దృత పక్షేణ సూచ్యావా వీరవక్రయా. 7
పశ్చాద్భయే తు శకటం పార్శ్వయోర్వజ్ర సంజ్ఞితమ్ |
సర్వతః సర్వతోభద్రం భ##యేవ్యూహంతు కల్పయేత్. 8
(అ) 2 /11
శ్రీరాముడు పలికెను . షడ్విధమగు సేనను కవచాదులతో సన్నద్ధము చేసి, వ్యూహము ఏర్పరచి, ఇష్టదేవతలను, యుద్ధ సంబంధి దుర్గాది దేవతలను పూజించి, శత్రువుపై ఆక్రమణము చేయవలెను. మూల - భృతి - శ్రేణి - మిత్ర - శత్రు - ఆటవికములని సేనలు ఆరువిధములు. వీటిలో పూర్వపూర్వసేనలు శ్రేష్ఠములు, వీటివ్యసనములు కూడ ఈ విధముగనే గరిష్ఠములు పదాతి - అశ్వ - రథ - గజములు సేనకు నాలుగు అంగములు. మంత్రము, కోశము అను రెండు అంగములు కూడ కలిసి ఆరు అంగములు నదీదుర్గ - పర్వతదుర్గ - వనదుర్గములలో, భయకారణము లున్నచోట, సేనాపతి సంనద్ధములై, వ్యూహబద్ధములైన సైన్యములతో వెళ్ళవలెను. అధికవీరులైన యోధులతో కలిసి ఒక సేనానాయకుడు ముందుగా వెళ్ళవలెను. విజిగీషురాజు, వాని అంతఃపురము సేనామధ్యలోనుండి యాత్ర సాగించవలెను. స్వామికి ఇరువైపుల ఆశ్వికసైన్యము, దాని ఇరుప్రక్కల రథసేన, దానికి ఇరుప్రక్కల గజసేన, దాని రెండుప్రక్కల ఆటవికసేన ఉండవలెను. కుశలుడగు ప్రధానసేనాపతి, యాత్రా సమయమున తాను స్వామికి వెనుకనుండి, ఇతరులనందరిని ముందు ఉంచి నడువవలెను.
హతోత్సాహులగు సైనికులకు మెల్లమెల్లగ ఆశ్వసనమిచ్చుచుపోవలెను. సైన్యమంతయు యుద్ధసన్నద్ధమై యుండవలెను. ఎదుటినుండి శత్రువుల ఆక్రమణము జరుగు భయమున్నచో గొప్పమకర వ్యూహమేర్పరచి ముందుకు సాగవలెను. అడ్డముగా ఆక్రమణము జరుగునను భయమున్నచో రెక్కలు చాపిన శ్యేనపక్షి ఆకారముగల వ్యూహమును, సన్నని మార్గమునుండి ఆక్రమణము జరుగునను భయమున్నపుడు వీరులు ఆగ్రమునందున్న సూచీముఖవ్యూహమును, వెనుకనుండి భయమున్నచో శకట వ్యూహమును, ప్రక్కలనుండి భయమున్నచో వజ్రవ్యూహమును, నలుమూలలనుండి భయమున్నచో సర్వతో భద్ర వ్యూహమును నిర్మించుకొని ముందుకు వెళ్ళవలెను.
కందరే శైలగహనే నిమ్నగావనసంకటే | దీర్ఘాధ్వని పరిశ్రాంతం క్షుత్పిపాసాహితక్లమమ్. 9
వ్యాధిదుర్భిక్ష మారక పీడితం దస్యు విద్రుతమ్ | పంకపాంసు జలస్కంధం వ్యస్తం పుంజీకృతం పథి. 10
ప్రసుప్తం భోజనవ్యగ్ర మభూమిష్ఠ మనుస్థితమ్ | చౌరాగ్నిభయ విత్రస్త వృష్టివాత సమాహతమ్. 11
ఇత్యాదౌ స్వచమూం రక్షేత్పరసైన్యం చ ఘాతయేత్ | విశిష్టో దేశకాలాభ్యాం భిన్న విప్రకృతిర్బలీ. 12
కుర్యాత్ర్పకాశ యుద్ధంహి కూటయుద్ధం విపర్యయే | తేష్వవస్కందకాలేషు పరం హన్యాత్సమాకులమ్. 13
అభూమిష్ఠం స్వభూమిష్ఠః స్వభూమౌచోపజాయతః.
పర్వత గుహలందును, దుర్గమపర్వతమార్గమునందును, దీర్ఘప్రయాణముచే అలసిపోయినదియు, ఆకలిదప్పులచే పీడింపబడినదియు, రోగ-దుర్భిక్ష-మహామారులతో బాధపడుచున్నదియు, దోపిడి దొంగలచే చెల్లాచెదరు చేయబడినదియు, బురద, ధూళి, నీళ్ళు-వీటిలో చిక్కుకొన్నదియు, వ్యాకులముగానున్నదియు, ఒక వ్యక్తిమాత్రమేనడచుటకు తగిన మార్గముండుటచే ముందుకు నడవక ఒకేచోట నిలచిపోయినదియు, భోజనపానములు చేయుచున్నదియు, అయోగ్యమైన ప్రదేశమునందున్నదియు, కూర్చుండిపోయినదియు, చోరాగ్ని భయవ్యాకులమైనదియు, వర్షములచేతను, తుపానుచేతను పీడితమైనదియు, ఇట్టి ఇతర సంకటములలో చిక్కుకొనినదియు అగు తన సేవను అన్ని వైపులనుండి రక్షించుకొనుచు, శత్రుసైన్యముపై దెబ్బతీయుటకై వేచి యుండవలెను. శత్రువుకంటే తనకు దేశకాలము ఎక్కువ అనుకూలముగ నున్నపుడును, శత్రు ప్రకృతులలో పరస్పరవైషమ్యము ఏర్పడినప్పుడును, తన బలము అధికముగా నున్నపుడును, శత్రువుతో ప్రత్యక్షముగ యుద్ధమునకు దిగవలెను. పరిస్థితి ఇందుకు విరుద్ధముగా నున్నపుడు కూటయుద్ధమున కుపక్రమించవలెను. శత్రుసైన్యము పైన చెప్పిన వ్యసనములలో చిక్కుకొని యుద్ధాయోగ్యమైన ప్రదేశమునందున్నపుడు, విజిగీషువు, అనుకూలప్రదేశమునందుండి, శత్రువుపై ఆక్రమణముచేసి, నశింప చేయవలెను. శత్రుసైన్యము అనుకూలప్రదేశమునందున్నపుడు, వారి ప్రకృతులలో భేదము కల్పించి, సమయము చూచుకొని శత్రువులను నశింపచేయవలెను.
ప్రకృతి ప్రగ్రహాకృష్టం పాశైర్వనచరాదిభిః. 14
హన్యాత్ర్పవీర పురుషైర్భఙ్గదానాపకర్షణః | పురస్తాద్దర్శనం దత్త్వా తల్లక్ష కృతనిశ్చయాన్ . 15
హన్యాత్పశ్చాత్ర్పవీరేణ బలేనోపేత్య వేగినా | పశ్చాద్వా సంకులీకృత్య హన్యాచ్ఛూరేణ పూర్వతః. 16
ఆభ్యాం పార్శ్వాభిఘాతౌతు వ్యాఖ్యాతౌ కూటయోధనే | పురస్తా ద్విషయే దేశే వశ్చాద్ధన్యాత్తు వేగవాన్. 17
పురః పశ్చాత్తువిషమే హ్యేవమేవతు పార్శ్వయోః | ప్రథమం యోధయిత్వాతు దూష్యామిత్రాటవీబలైః . 18
శ్రాంతం మందం నిరాక్రందం హన్యాదశ్రాంతవాహనమ్ |
దూష్యామిత్ర బలైర్వాపి భంగం దత్త్వా ప్రయత్నవాన్. 19
జితమిత్యేవ విశ్వస్తం హన్యాన్మంత్ర వ్యపాశ్రయః | స్కంధావార పురగ్రామ సస్యస్వామి ప్రజాదిషు. 20
విశ్రభ్యంతం పరానీకమప్రమత్తో వినాశ##యేత్ | అథవా గోగ్రహాకృష్టం తల్లక్ష్యం మార్గబంధనాత్. 21
అవస్కంద భయాద్రాత్రి ప్రజాగర కృత శ్రమమ్ | దివాసుప్తం సమాహన్యాన్నిద్రా వ్యాకుల సైనికమ్. 22
నిశి విస్రబ్ధసంసుప్తం నాగైర్వా ఖడ్గపాణిభిః.
యుద్ధమునుండి వెనుకవైపు పరుగెత్తుకొనివెళ్ళి శత్రువులను ఆతని భూమినుండి బైటకు లాగికొనివచ్చు, ఆటవికుల చేత గాని, అమిత్ర సైనికులచే గాని లాగికొనిరాబడిన శత్రువులను వీరులగు యోధులచే చంపించవలెను. అల్పసంఖ్యాకులగు సైనికులను ఎదుటనిలబెట్టి శత్రువుతో యుద్ధముచేయుచు, వారేమరియుండగా, ఉత్తమవీరులుగల సైన్యముతో వెనుకనుండి శత్రుసైన్యమును ప్రవేశించి నశింప చేయవలెను. లేదా వెనుక వైపు సైన్యమును సమీకరించి, శత్రువుల దృష్టి అటువైపున నున్నపుడు ముందునుండి ప్రవేశించి వారిని చంపవలెను. వెనుకనుండియు, ముందునుండియు ఆక్రమణము చేసిన విధముననే పార్శ్వములనుండి కూడ చేయవలెను. ఇది కూటయుద్ధమునందు అవలంబించవలసిన పద్ధతి. ముందుగా దూష్యబలముతోను, అమిత్రబలముతోను, ఆటవికబలముతోను యుద్ధముచేసిన శత్రుసేన అలసిపోయిన పిమ్మట, తన సేవ అలసిపోకపూర్వము, శత్రుసేనపై ఆక్రమణముచేసి నశింపచేయవలెను. లేదా దూష్యబలమును, అమిత్రసేనను యుద్ధభూమినుండి పారిపోవునట్లు ఆజ్ఞాపించి, నేను జయించితిని అని శత్రువునకు విశ్వాసము కలిగిన పిమ్మట, మంత్రబలము నాశ్రయించి, ప్రయత్నపూర్వకముగా ఆక్రమించి శత్రువును నశింపచేయవలెను స్కంధావారమును, పురములను, గ్రామములను, సస్యములను, గోష్ఠములను దోచుకొనుటకు శత్రువుల మనస్సులో లోభము కలిగించి, వారు ఆపనిలో నిమగ్నులై యున్నప్పుడు తానుమాత్రము సావధానుడై వారినందరిని సంహరించవలెను. లేదా శత్రురాజుల గోవులను అపహరించి, వారి దృష్టిని వాటిని విడిపించుకొనుటయందు మరలునట్లుచేసి, వాళ్లను మార్గమధ్యమునందే ఆపి సంహరించవలెను. తమపై ఆక్రమణము జరుగునను భయముచే రాత్రియంతయు మేల్కొనియున్న శత్రుసైనికులు నిద్రాలసులై యున్నపుడు వారి నాక్రమించి సంహరించవలెను. లేదా రాత్రి నిశ్చింతగా నిద్రించుచున్న సైనికులను ఖడ్గధాదులచే చంపించవలెను.
ప్రయాణ పూర్వయాయిత్వం వనదుర్గప్రవేశనమ్. 23
అభిన్నానామనీకానాం భేదనం భిన్న సంగ్రహః | విభీషికాద్వారఘాతం కోశరక్షేభ కర్మచ. 24
అభిన్న భేదనం, మిత్రసంధానం రథ కర్మచ | వనదిఙ్మార్గం విచయే వీవధాసారలక్షణమ్. 25
అనుయానాపసరణ శీఘ్రకార్యోపవాదనమ్ | దీనానుసరణం ఘాతః కోటీనాం జఘనస్యచ. 26
అశ్వకర్మాథ పత్తేశ్చ నర్వదా శస్త్రధారణమ్ | శిబిరస్య చ మార్గాదేః శోధనం బస్తికర్మచ. 27
సంస్థూలస్థాణు వల్మీక వృక్షగుల్మాపకంటకమ్ | సాపసారా పదాతీనాం భూర్నాతి విషమాసమా. 28
స్వల్ప వృక్షోపలా క్షిప్రలంఘనీయనగాస్థిరా | నిఃశర్కరా విపంకా చ సాపసారా చ వాజిభూః. 29
నిఃస్థాణువృక్షకేదారా రథభూమికర్మదా | మర్దనీయ తరుచ్ఛేద్య వ్రతతీపంకవర్జితా. 30
సేన ఒకసారి ముందుకు దుమికిన తరువాత శత్రువుల మార్గమునందు అవరోధములు కల్పించినచో, తన్నివారణార్థమై ఏనుగులను ముందు నడుపవలెను. అశ్వములు కూడ ప్రవేశింపజాలని వనదుర్గమునందు గజములసాహాయ్యముచేతనే సైన్యము ప్రవేశింపగలుగును. గజములు ఎదుటనున్న వృక్షాదులను విరచివేసి సైనికులకు మార్గమును కల్పించును. దృఢముగానున్నసైనికపంక్తిని భేదింపవలెనన్నచో గజములనే ఉపయోగించవలెను. వ్యూహముభిన్నమగుటచే ఛిద్రములేర్పడినచో ఏనుగుల నుంచి ఆ ఛిద్రములు పూడ్చవలెను. శత్రువులలో భయము కలిగించుట, శత్రుదుర్గద్వారములను శిరస్సుతో పగులగొట్టుట, సైన్యముతో కోశమును తీసుకొని వెళ్ళుట, ఏదైన భయముత్పన్నమైనపుడు రక్షించుకొనుట- ఇదియంతయు గజములద్వారామాత్రమే సాధింపశక్యమగును. అభిన్నమగు సైన్యమును భేదించుట, భిన్నమైన దానిని పూడ్చుట అను పనులు రథసేనాసాహాయ్యముతో కూడ చేయవచ్చును. వనములలో ఎచట ఉపద్రవములున్నవి. ఎచటలేవు అను విషయమును పరిశీలించుట, మార్గమును నిర్ణయించుట, ఇది అశ్వసేన చేయవలసిన కార్యము. తన పక్షము వారికి, ఆహారాది సామగ్రిని అందజేయుట, పారిపోవుచున్న శత్రుసైన్యమును శీఘ్రముగా తరుముట, సంకట సమయములందు శీఘ్రముగా పారిపోవుట, పనులు శీఘ్రముగా చేయుట, తమ సైన్యము కష్టపరిస్థితులలో నున్నపుడు శీఘ్రముగా అచట చేరి సాహాయ్యము అందించుట, శత్రుసేనాగ్రభాగమున ప్రహారముచేసి వెంటనే వెనుకకుపోయి అక్కడకూడ ప్రహారముచేయుట, అశ్వసేనాకార్యములు, సర్వదా శస్త్రధారణము చేసియుండుట కాలిబంటుల కార్యము. సైన్యమునకు విడిది ఏర్పరచు స్థానము, మార్గము మొదలగునవి అన్వేషించుట వెట్టి వారి కర్తవ్యము, పెద్ద పెద్ద మోళ్ళు, చెట్లు పొదలుఉండి ముళ్ళచెట్లు లేనిదియు, పారిపోవుటకు అనువైన మార్గముగలదియు, ఎక్కువ మెరకపల్లములు లేనిదియు అగు భూమి పదాతిసైన్య సంచారయోగ్యము. వృక్షములు శిలలు తక్కువగా నున్నది, శీఘ్రముగా లంఘింపవీలగు భూచ్ఛిద్రములు, గట్టి నేల గలది రాళ్లు, బురదలేనిది, బైటికిపోవుటకు అనువగు మార్గముకలది అగు భూమి అశ్వ సంచారయోగ్యము. పాదాలతో త్రొక్కివేయుటకు శక్యమైన చెట్లు, ఛేదించవీలైన తీగలు కలదియు, బురదలేనిదియు, గోతులులేనిదియు, గజారోహణ యోగ్యములగు చిన్న పర్వతములు మాత్రమే ఉన్నదియు అగు భూమి నిమ్నోన్నతముగా ఉన్నను గజసేనాగమన యోగ్యము.
నిర్ఝరాగమ్యశైలాచ విషమా గజమేదినీ | ఉరస్యాదీని భిన్నాని ప్రతిగృహ్ణన్బలానిహి. 31
ప్రతిగ్రహ ఇతిఖ్యాతో రాజాకార్యాన్తరక్షమః | తేనశూన్యస్తుయో వ్యూహః సభిన్న ఇవలక్ష్యతే. 32
జయార్థీ నచ యుధ్యేత మతిమానప్రతిగ్రహః | యత్ర రాజా తత్రకోశః కోశాధీనాహి రాజతా. 33
యోధేభ్యస్తు తతో దద్యాత్కించిద్దాతుం నయుజ్యతే | ద్రవ్యలక్షం రాజఘాతే తదర్థం తత్సుతార్దనే. 34
సేనాపతివధే తద్వద్దద్యాద్ధస్త్యాది మర్దనే | అథవా ఖలు యుధ్యేరన్పత్త్యశ్వరథదంతినః. 35
యథా భ##వేదసమ్బాధో వ్యాయామావినివర్తనే | అసంకరేణ యుధ్యేరన్సంకరః సంకులావహః. 36
మహాసంకుల యుద్ధేషు సంశ్రయేరన్మతఙ్గజమ్ | అశ్వస్య ప్రతియోద్ధారో భ##వేయుః పురుషాస్త్రయః. 37
ఇతి కల్ప్యాస్త్రయశ్చాశ్వా విధేయాః కుంజరస్యతు | పాదగోపా భ##వేయుశ్చ పురుషాదశ పంచ చ. 38
విధానమితి నాగస్య విహితస్యన్ద నస్య చ | అనీకమితి విజ్ఞేయమితి కల్ప్యా నవద్విపాః. 39
తథానీకస్య రంధ్రంతు పంచధాచ ప్రచక్షతే | ఇత్యనీక విభాగేన స్థాపయేద్వ్యూహ సంపదః. 40
అశ్వసైన్యాదులు విచ్ఛిన్నమైనపుడు వాటిని ఆదుకొని ఆలోపమును పూరించుసైన్యమునకు 'ప్రతిగ్రహము' అని పేరు. ప్రతిగ్రహమును చక్కగా సంఘటితము చేసికొనవలెను. అది భారమును సహింప సమర్థమై యుండును. ప్రతిగ్రహములేని వ్యూహము శూన్యమువలె కనబడును. విజయాభిలాషియైన బుద్ధిమంతుడగు రాజు ప్రతిగ్రహసైన్యమును కూర్చుకొనకుండ యుద్ధము చేయగూడదు. కోశము రాజుదగ్గరనే ఉండవలెను. రాజత్వము కోశాధీనము. విజయము సాధించిన యోధులకు ఆకోశమునుండియే పారితోషికమీయవలెను. దాతకోసమై యుద్ధము చేయనివాడెవ్వడైన ఉండునా ? శత్రురాజును వధించిన యోధునకు ఒక లక్షముద్రలివ్వవలెను రాజకుమారుని చంపినవానికి దానిలో సగము పారితోషికముగా ఈయవలెను. సేనాపతిని చంపినవానికి గూడ అంతయే. ఏనుగ రథము మొదలగు వాటిని నశింపచేసినవారికి గూడ ఉచితరీతిని పారితోషికములీయవలెను. పదాతులు, అశ్వికులు, రథికులు, హాస్తికులు కూడ తమబడలికకు, విశ్రాంతినిమిత్తమై వెనుకకు వెళ్లుటకు అడ్డుఉండనంత దూరమునందుండి యుద్ధము చేయవలెను. యోధులందరును దూరదూరముగా ఉండి యుద్ధము చేయవలెను. కలిసిపోయియుద్ధము చేసినచో అది సంకులమైపోవును. మహాసంకుల యుద్ధమునందు అలసి పోయిన పదాత్యాగులగు అసహాయసైనికులు పెద్ద పెద్ద ఏనుగుల సాహాయ్యము తీసికొనవలెను. ఒక్కొక్క ఆశ్వికుని ఎదుట ముగ్గురు పదాతులు ప్రతియోద్ధలుగా, అనగా అగ్రగ్రాములుగా ఉండవలెను ఒక్కొక్క హస్తికుని ఎదుట ఐదుగురేసి చొప్పున అశ్వికులుండవలెను. వీరు కాక ఏనుగుకు పాదరక్షకులు గూడ అంతమందియే, అనగా ఐదుగురేసి అశ్వికులు, పదునైదుగురు పదాతులు. ప్రతియోద్ధులు ఏనుగుకు ముందును, పాదరక్షకులు గజపాదసమీపమునందును ఉందురు. ఇది ఏనుగులకు సంబంధించిన వ్యూహము. రథవ్యూహ విషయమునందుకూడ ఇట్లే తెలియవలెను. గజవ్యూహమునకు చెప్పబడిన రీతియందే నవగజవ్యూహముకూడ ఏర్పరుపవలెను. దీనికి 'అనీకము' అని పేరు. ఒక అనీకమునకు ఒక అనీకమునకును మధ్య అయిదుధనస్సుల దూరముండవలెను. ఈ విధముగ అనేకవిభాగానుసారము వ్యూహసంపత్తిని ఏర్పరచుకొనవలెను.
ఉరస్య కక్షపక్షాంస్తు కల్ప్యానేత్రాన్న్ర చక్షతే | ఉరః కక్షౌచ పక్షౌచ మధ్యం పృష్ఠ ప్రతిగ్రహః. 41
కోటీ చ వ్యూహ శాస్త్రజ్ఞైః సప్తాంగో వ్యూహ ఉచ్యతే | ఉరస్యకక్షపక్షాస్తు వ్యూహో7యం సప్రతిగ్రః. 42
గురోరేష చ శుక్రస్య కక్షాభ్యాం పరివర్జితః | తిష్ఠేయుః సేనాపతయః ప్రవీరైః పురుషైర్వృతాః. 43
అభేదేన చయుధ్యేరన్రక్షేయుశ్చ పరస్పరమ్ | మధ్యవ్యూ హే ఫల్గు సైన్యం యుద్ధవస్తు జఘన్యతః. 44
యుద్ధం హి నాయకప్రాణం హన్యతే తదనాయకమ్ | ఉరసిస్థాపయేన్నాగాన్ర్ప చండాస్కక్షయోరథాన్.
హయాంశ్చ పక్షయోర్వ్యు హోమధ్య భేదీ ప్రకీర్తితః | మధ్యదేశే హయానీకం రథానీకంచ కక్షయోః. 46
పక్షయోశ్చ గజానీకం వ్యూహో7న్తర్భేద్యయం స్మృతః |
రథస్థానే హయాన్దద్యాత్పదాతీంశ్చ హయాశ్చయే. 47
రథాభావేతు ద్విరదా న్వ్యూహే సర్వత్రదాపయేత్ | యదిస్యాద్దండ బాహుల్యమాబాధః సంప్రకీర్తితః. 48
మండలా సంహతో భోగోదండస్తే బహుధాశృణు | తిర్యగ్వృత్తిస్తు దండః స్యాద్భోగో7న్యా వృత్తిరేవచ.
మండలః సర్వతోవృత్తిః పృథగ్వృత్తిరసంహతః |
వ్యూహమునకు ప్రధానముగా మూడు అంగములున్నవి. 'ఉరస్యము', 'కక్షము', 'పక్షము', అను మూడును కల్పింపదగినవి. ఉరస్సు, రక్షము, పక్షములు, మధ్యము, ప్రతిగ్రహము, కోటి అని వ్యూహమునకు ఏడు అంగములు శాస్త్రజ్ఞులచే చెప్పబడినవి. ఉరస్య-కక్ష-పక్ష-ప్రతిగ్రహాదులతో కూడిన వ్యూహవిభాగము బృహస్పతిచే చెప్పబడినది. శుక్రాచార్యునిమతమున కక్ష-ప్రకక్షములు లేవు. సేనాపతులు ఉత్తమ వీరపరివృతులై యుద్ధరంగమునందు నిలువవలెను. వారందరును సంఘటితులై యుండి ఒకరి నొకరు రక్షించుచు యుద్ధము చేయవలెను. దుర్బలసైన్యమును వ్యూహమధ్యము నందుంచవలెను. యుద్ధమునకు సంబంధించిన యంత్రములు ఆయుధములు, ఓషధులు మొదలగు ఉపకరణములను సైన్యమునకు వెనుక ఉంచవలెను. యుద్ధమునకు ప్రాణము రాజు. రాజు లేనిచో యుద్ధములో పాల్గొన్నవారు హతులగుదురు. హృదయస్థానము నందు గజములను, కక్షస్థానమున రథములను, వక్షస్థానములందు అశ్వములను, కక్షభాగమునందు రథములను, పక్షములందు గజములను ఉంచిన వ్యూహము 'అంతభేది'. కక్షములందు అశ్వములను, మధ్యదేశమున పదాతులను ఉంచి ఏర్పరచినది మరొక విధమగు ''అంతభేదివ్యూహము'' ఈ రథములు లేనిచో వ్యూహము లోపల అంతటను గజములను ఉంచవలెను. సేన అధికముగా ఉన్నచో అది ''ఆవాపము''. మండలము, అసంహతము, భోగము, దండము అనునవి నాల్గును ప్రకృతివ్యూహములు. దండాకారమున పొడవుగా ఏర్పరచిన వ్యూహము ''దండ వ్యూహము'' సర్పశరీరాకారమున ఏర్పరచినది ''భోగవ్యూహము'' దానిలో సైనికుల అన్వావర్తనము జరుగుచుండును. సర్వతోముఖమునుండి గోళాకారమున నేర్పరచిన వ్యూహము ''మండలవ్యూహము'' అనీకములను దూరదూరముగా నిలబెట్టిన వ్యూహము'' అసంహతవ్యూహము''.
ప్రదరో దృఢకో7సహ్యః దాపో వైకుక్షిరేవచ. 50
ప్రతిష్ఠః సుప్రతిష్ఠశ్చశ్యేనో విజయ సంజ¸° | విశాలో, విజయః సూచీ స్థూణాకర్ణచమూముఖౌ. 51
సర్పాస్యోవలయశ్చైవ దండభేదాశ్చ దుర్జయాః | అతిక్రాంతః ప్రతికాంతః కక్షాభ్యాం చైకపక్షతః. 52
అతిక్రాంతస్తు పక్షాభ్యాం త్రయో7న్యే తద్విపర్యయే | పక్షోరసై#్యరతిక్రాంతః ప్రతిష్ఠో7న్యో విపర్యయః. 53
స్థూణాపక్షో ధనుఃపక్షో ద్విస్థూణోదండ ఊర్థ్వగః | ద్విగుణో7న్తస్త్వతిక్రాంత పక్షో7న్యస్యవిపర్యయః. 54
ద్విచతుర్దండ ఇత్యేతే జ్ఞేయాః లక్షణతఃక్రమాత్ |
ప్రదరము, దృఢకరము, అసహ్యము, చాపము, చాపకుక్షి, ప్రతిష్ఠము, సుప్రతిష్ఠము, శ్యేనము, విజయము, సంజయము, విశాలవిజయము, సూచి, స్థూణాకర్ణము, చమూముఖము, ఝషాస్యము, వలయము సుదుర్జయము అని దండవ్యూహము పదునేడు విధములు. పక్ష-కక్ష- ఉరస్యము లను మూడు స్థానములందును సైనికులు సమస్థితిలో నున్నచో అది ''దండ ప్రకృతి'' కక్ష భాగమునందు సైనికులు కొంచెము ముందుకు వెళ్ళగా మిగిలిన రెండు స్థానములందలి సైనికులు లోనికి అణగియున్నచో అది 'ప్రదరము'. శత్రువులను చీల్చివేయును గాన దీని కాపేరు వచ్చినది. కక్ష - పక్షములు రెండును లోనికి అణగియుండి, ఉరస్యము మాత్రము బైటకు వచ్చినచో అది 'దృఢకము' రెండు పక్షములు మాత్రము బైటకు వచ్చినచో అది ''అసహ్యము'' ప్రదర - దృఢక - అసహ్యములను విపరీతముగా ఏర్పరచినచో అవి క్రమముగ చాప - చాపకుక్షి - ప్రతిష్ఠ లగును. రెండు పక్షములు బైటకురాగా ఉరస్యము అంతః ప్రవిష్టమైనచో అది ''సుప్రతిష్ఠితము'' ఏతద్విరుద్ధస్థితి ''శ్యేనవ్యూహము''. నిలబెట్టిన దండము వంటి ఆకారముగల దండ వ్యూహమునకు స్థూణాకర్ణములు రెండు పక్షములైనచో అది ''విజయము'', రెండు చాప వ్యూహములు రెండు పక్షములుగా నున్నది ''సంజయము'', ఒక దానిపై ఒకటి చొప్పున రెండు స్థూణాకర్ణములు నిలిపినచో అది ''విశాల విజయము'', కక్ష - పక్షాదులను ఒకదానిపై ఒకటిగ నిలబెట్టినచో అది ''సూచి''. రెండు రెట్లుగా ఉన్న పక్షములు గల దండవ్యూహము ''స్థూణాకర్ణము''. మూడేసి పక్షములు బైటకు వచ్చినది. చతుర్గుణ పక్షములు కలది అగు వ్యూహము ''చమూముఖము''; దీనికి విపరీతమైనది ఝషాస్యము; రెండుదండ వ్యూహములచే వలయవ్యూహమేర్పడును. నాలుగు దండవ్యూహములచే దుర్జయవ్యూహమేర్పడును.
గోమూత్రికాహిసంచారీ శకటో మకరస్తథా. 55
భోగభేదాః సమాఖ్యాతాస్తథా పారిప్లవంగకః | దండపక్షౌయుగోరస్య శకట స్తద్విపర్యయే. 56
మకరోవ్యతికీర్ణశ్చ శేషః కుంజరరాజిభిః | మండలవ్యూహ భేదౌతు సర్వతోభద్ర దుర్జ¸°. 57
అష్టానీకో ద్వితీయస్తు ప్రథమః సర్వతోముఖః | అర్దచంద్రక ఊర్దాంగో వజ్రభేదాస్తు సంహతేః. 58
తథాకర్కట శృంగీచ కాకపాదీచ గోధికా | త్రిచతుః పంచసైన్యానాం జ్ఞేయాః ఆకారభేదతః. 59
దండస్య స్యుః సప్తదశ వ్యూహాద్వౌ మండలస్య చ | అసంఘాతశ్చ షట్ పంచ భోగసై#్యవతు సంగరే. 60
పక్షాదీనామథైకేన హత్వాశేషై పరిక్షిపేత్ | ఉరసావా సమాహత్య కోటిభ్యాం పరివేష్టయేత్. 61
పరేకోటీ సమాక్రమ్య పక్షాభ్యామప్రతిగ్రహాత్ | కోటిభ్యాం జఘనం హన్యాదురనా చ ప్రపీడయేత్. 62
యతః ఫల్గుయతో భిన్నం యతశ్చాన్యైరధిష్ఠితమ్ | తతశ్చారిబలం హన్యా దాత్మనశ్చోప బృంహయేత్. 63
సారం ద్విగుణసారేణ ఫల్గుసారేణ పీడయేత్ | సంహతం చ గజానీకైః ప్రచండైర్దారయేద్బలమ్. 64
భోగ వ్యూహమున గోమూత్రిక, అహిసంచారి, శకటము, మకరము, పరిపతన్తికము అని ఐదు భేదములున్నవి. నడచుచున్న ఎద్దు మూత్రముపోసినపుడు ఎట్లు రేఖ ఏర్పడునో ఆ విధముగా సైన్యమును నిలిపిన గోమూత్రికా వ్యూహము. సర్పము సంచరించునపుడు ఏర్పడు రేఖవలె సైన్యమును నిలిపిన అది అహసంచారి. రక్ష - పక్షములు రెండును ముందు వెనుక క్రమమున దండ వ్యూహమువలె నుండి ఉరస్య సంఖ్య రెట్టింపు అయినచో అది ''శకట వ్యూహము''; దీనికి విపరీతముగ నున్నది మకర వ్యూహము. ఈ రెండు వ్యూహములలో దేనికైన మధ్యభాగమునందు అశ్వ - గజాదుల ఆవాపము చేసినచో అది పరిపతంతిక వ్యూహము. సర్వతోభద్రము దుర్జయము అని మండల వ్యూహము రెండు విధములు. దీనిలో ఐదు అనీకములసేన ఉండును. ఆవశ్యకతాను సారము ఉరస్యమునందును, రెండు కక్షములందును ఒక్కొక్క అనీకమును పెంచినచో దుర్జయమును వ్యూహము. అర్ధచంద్రము, ఉత్థానము వజ్రము అని అసంహతము మూడు విధములు. కర్కట శృంగి కాకపాది, గోధిక అని కూడ అసంహతమున మరి మూడు భేదములు. అర్ధచంద్ర - కర్కట శ్పంగులందు మూడేసి అనీకములుండును. ఉత్థాన - కాకపాదులందు నాలుగేసి అనీకములును, వజ్ర - గోధికలు ఐదేసి అనీకములతో ఏర్పడును. అనీకములను పట్టి మూడు భేదములేయైనను, ఆకృతి భేదమును బట్టి ఆరు భేదములు చెప్పబడినవి. ఈ విధముగ దండవ్యూహమున పదునేడు భేదములు, మండల వ్యూహమునకు రెండు భేదములు అసంహతమునకు ఆరుభేదములు, భోగవ్యూహమునకు ఐదు భేదములు చెప్పబడినవి. పక్షాది అంగముల ఏదైన ఒక అంగము సేనచే శత్రువ్యూహమును ఛేదించి, మిగిలిన అనీకములచే దానిని చుట్టుముట్టవలెను. లేదా ఉరస్యమునందలి అనీకముచే శత్రువ్యూహమును ఆక్రమించి, రెండు ప్రపక్షములచే చుట్టుముట్టవలెను. శత్రుసేన యొక్క రెండు ప్రపక్షములందును తన వ్యూహమునందలి పక్షములచే ఆక్రమణము సలిపి, శత్రుజఘనభాగమును తన ప్రతిగ్రహ - కోటి ద్వయముతో నశింపచేయవలెను. ఉరస్యమునందలి సేనతో శత్రు పక్షమును పీడించవలెను. వ్యూహమునందు సారహీన సైనికులున్న చోట్లను, విభేదము లేర్పడిన సైన్యమునందును, దూష్య సైనికులున్న ప్రదేశములందును శత్రుసేనను సంహరించి, తన పక్షమునందున్న అట్టి స్థానములకు బలము చేకూర్చవలెను. బలిష్ఠసేనను, అంతకంటే బలిష్టమగు సేనను ఉపయోగించి, పీడించవలెను. నిర్బల సైన్యమును సబల సైన్యముతో అణచివేయవలెను. శత్రుసైన్యము సంఘటితముగనున్నచో, ప్రచండమగు గజసేనతో ఆ శత్రుసైన్యమును చీల్చివేయవలెను.
స్యాత్కక్షపక్షోరసై#్యశ్చ వర్తమానస్తు దండకః | తత్ర ప్రయోగో దండస్యస్థానం తుర్యేణ దర్శయేత్. 65
స్యాద్దండ సమవృక్షాభ్యా మతిక్రాంతః ప్రదారకః | భ##వేత్స పక్ష కక్షాభ్యా మతిక్రాంతో దృఢఃస్మృతః. 66
కక్షాభ్యాం చ ప్రతిక్రాంత వ్యూహో7సహ్యః స్మృతో యథా |
కక్ష పక్షౌవధః స్థాప్యోరసై#్యః క్రాంతశ్చ ఖాతకః. 67
ద్వౌదండౌ వలయఃప్రోక్తో వ్యూహోరిపువిదారణః | దుర్జయశ్చతుర్వలయః శత్రోర్బలవిమర్దనః. 68
కక్ష పక్షరసై#్యర్భాగో విషయం పరివర్తయన్ | సర్వచారీ గోమూత్రికా శకటః శకటాకృతిః. 69
విపర్యయో7మరః ప్రోక్తః సర్వశత్రు విమర్దకః | స్యాత్కక్షపక్షోరస్యానామేకీ భావస్తు మండలః. 70
చక్ర పద్మాదయోభేదా మండలస్య ప్రభేదకాః | ఏవంచ సర్వతో భద్రో వజ్రాక్షవరకాకవత్. 71
అర్థచంద్రశ్చ శృంగాటో హ్యచలో నామరూపతః | వ్యూహా యథా సుఖం కార్యాః శత్రూణాం బలవారణాః.
అగ్నిరువాచ :
రామస్తు రావణం హత్వా హ్యయోధ్యాం ప్రాప్తవాన్ద్విజ | రామోక్త నిత్యేంద్రజితం హతవాం ల్లక్ష్మణః పురా.
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రామోక్త రాజనీతిర్నామ ద్విచత్వారింశదధిక ద్విశతతమో7ధ్యాయః.
పక్ష - కక్ష - ఉరస్యములు మూడును సమస్థితిలో నున్నపుడు అది దండవ్యూహము. దండము యొక్క ప్రయోగమును, స్థానమును వ్యూహ చతుర్థాంగముతో ప్రదర్శించవలెను. దండముతో సమానముగ రెండు పక్షములు కూడ ముందుకు వచ్చినచో అది 'ప్రదరము' లేదా 'ప్రదారక' వ్యూహము. అదే పక్షకక్షముద్వారా అంతిక్రాంతమైనచో అది దృఢవ్యూహము. రెండుపక్షములు మాత్రమే ముందుకు చొచ్చుకున్నచో అది ''అసహ్యవ్యూహము''. కక్షమును పక్షమును క్రిందనుంచి, ఉరస్యముద్వారా ముందుకు వచ్చినది ''చాపవ్యూహము'' రెండుదండములు కలిసిన ''వలయవ్యూహము'' ఏర్పడును. ఈవ్యూహము శత్రువులను చీల్చివేయును. నాలుగువలయ వ్యూహములు కలసినచో, శత్రుసేనను మర్దించు ''దుర్జయవ్యూహము'' ఏర్పడును. కక్ష-పక్ష-ఉరస్యము విషమములుగా నున్నచో అది ''భోగవ్యూహము''. సర్పచారి, గోమూత్రిక, శకటము, మకరము, పరిపతంతికము అని దానికి ఐదుభేదములు. సర్పము సంచరించు ఆకారమున సర్పచారి, గోమూత్రాకారమున గోమూత్రిక, శకటాకారమున శకటము, దీనికి విపరీతముగ మకరవ్యూహము ఏర్పడును. ఇట్లు పంచభేదములుగల భోగవ్యూహము శత్రువినాశకము, మండలవ్యూహమునకు చక్రవ్యూహ - పద్మవ్యూహాదులు భేద ప్రభేదములు. ఇదే విధముగ సర్వతోభద్ర - వజ్ర - అక్షవర - కాక - అర్ధచంద్ర - శృంగార - ఆచలాదివ్యూహములు ఉన్నవి. వీటి ఆకారములను బట్టి పేర్లు వచ్చినవి. వ్యూహములను తమ ఇచ్ఛననుసరించి ఏర్పరచుకొనవలెను. వ్యూహములు శత్రుసేన ప్రగతిని నిలిపివేయును. అగ్నిచెప్పెను:- శ్రీరాముడు రావణుని వధించిన పిదప అయోధ్యారాజ్యమును పొందెను. శ్రీరాముడు చెప్పిన ఈనీతిని అనుసరించుట చేతనే లక్ష్మణుడు పూర్వము ఇంద్రజిత్తును వధించెను.
అగ్ని మహాపురాణమునందు రాజనీతికథనమను రెండువందల నలుబదిరెండవ అధ్యాయము సమాప్తము.