Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ ఏకోన పంచాశదధిక ద్విశతతమో೭ధ్యాయః.
అథ ధనుర్వేదః
అగ్ని రువాచ :
చతుష్పాదం ధనుర్వేదం వదే పంచవిధం ద్విజ | రథనాగాశ్వపత్తీనాం యోదాంశ్చాశ్రిత్యకీర్తితమ్.
యంత్రముక్తం పాణిముక్తం ముక్తసందారితం తథా | అముక్తం బాహుయుద్ధంచ పంచధాతత్ర్పకీర్తితమ్.2
తత్ర శస్త్రాస్త్రసమ్పత్త్యా ద్వివిధం పరికీర్తితమ్ | ఋజుమాయా విభేదేన భూయోద్వివిదముచ్యతే.3
క్షేపణి చాపయంత్రాద్యైర్యం త్రముక్తం ప్రకీర్తతమ్ |
శిలాతోమరయం త్రాద్యం పాణిముక్తం ప్రకీర్తితమ్.4
ముక్తసందారితంజ్ఞేయంప్రాసాద్యమపి యద్బవేత్ | ఖడ్గాదికమముక్తం చ నియుద్ధం విగతాయుధమ్.5
కుర్యాద్యోగ్యాని పాత్రాణి యోద్ధుమిచ్ఛుర్జితశ్రమః | ధనుః శ్రేష్ఠానియుద్ధాని ప్రాసమధ్యానితానిచ.6
తాని ఖడ్గజఘన్యాని బాహుప్రత్యవరాణిచ | ధనుర్వేదే గురుర్విప్రఃప్రోక్తా వర్జద్వయస్య చ.7
యుద్ధాదికారః శూద్రస్యస్వయంవ్యాపది శిక్షయా | దేశ##స్థైః శంకరరైరాజ్ఞః కార్యాయుద్ధ సహాయతా.8
అగ్నిదేవుడు పలికెను : వసిష్ఠా! ఇపుడు నాలుగు పాదములు గల ధనువర్వేదమును గూర్చి చెప్పెదను. ధనుర్వేదము నాలుగు విధములు. రథములు, గజములు, అశ్వములు, పదాతులు- ఈ యోధులను బట్టి దీనిని వర్ణించవచ్చును. యంత్రముక్తము, పాణిముక్తము, ముక్తసంధారితము, ఆముక్తము, బాహుయుద్ధము, అనునవి ధనుర్వేదము నందలి ఐదు ప్రకారములు. అందునకు శస్త్ర సంపత్తి-అస్త్ర సంపత్తులచే యుద్ధము రెండు విధములు. ఋజుయుద్దము, మాయాయుద్ధము అని మరల రెండు బేధములు. క్షేపణి (విసురునది) ధనస్సు, యంత్రము మొదలగు వాటిచే విడువబడునది ''యంత్రముక్తము''. శిలాఖండము, తోమరము మొదలగునవి ''పాణి ముక్తములు''. శత్రువుమీద విసరి మరల గ్రహింపబడు బల్లేము మొదలగునవి ''ముక్తసంధారితములు''. ఖడ్గాదులు ''అముక్తములు''.అస్త్రప్రయోగములేకుండ కలియబడిచేయు యుద్ధము ''నియుద్ధము'' లేదా''బాహుయుద్ధము''. యుద్ధము చేయగోరువాడు శ్రమను జయించి, యోగ్యములగు శస్త్రములను సంగ్రహించుకొనవలెను. ధనుర్భాణములప్రయోగమున యుద్ధము సర్వశ్రేష్ఠము. బల్లెముల యుద్దము మధ్యమము. ఖడ్గయుద్ధము అథమము. బాహుయుద్ధము అత్యంత నికృష్టము. ధనునర్వేదమున క్షత్రియవైశ్యుల కిరువురికిని బ్రాహ్మణుడే గురువు. ఆపత్సమయమున శూద్రుడుకూడ యుద్ధాభ్యాసముచేసి యుద్ధము చేయవలెను. దేశములో నున్న వర్ణసంకరులకూడ యుద్ధ సమయమున రాజునకు సాహాయ్యము చేయవలెను.
అంగుష్ఠగుల్పపాణ్యంఘ్ర్యః శ్లిష్టాఃస్యుః సహితాయది | దృష్టం సమపదం స్థానమేతల్లక్షణతస్తథా.9
బాహ్యాంగులిస్థితౌ పాదౌ స్తబ్దజాను బలావుభౌ | త్రివిత స్త్యంతరాస్థానమేతద్వై శాణముచ్యతే.10
హంసపంక్త్వాకృతిసమే దృశ్యేతే యత్రజానునీ | చతుర్విత స్తివిచ్ఛిన్నే తదేతన్మండలం స్మృతమ్.11
హలాకృతిమయం యచ్ఛస్తబ్ధం జానురుదక్షిణమ్ | వితస్త్యః పంచవిస్తారే తదాలీడం ప్రకీర్తితమ్.12
ఏతదేవ విపర్యస్తం ప్రత్యాలీడమితి స్మృతమ్ | తిర్యగ్భూతో భ##వేద్వామో దక్షిణోపి భ##వేదృజుః.13
గుల్పౌపార్షిణ గృహౌచైవస్థితౌ పంచాంగులాంతరౌ | స్థానం జాతం భ##వేదేతద్ధ్వాదశాంగుల మాయతమ్.14
ఋజుజానుర్భవేద్వామో దక్షిణః సుప్రపారితః | అథవాదక్షిణం జాను కుబ్జం భవతి నిశ్చలమ్ 15
దండాయతో భ##వేదేష చరణః సహజానునా | ఏవం వికటముద్దిష్టం ద్విహస్తాన్తరమాయతమ్.16
జానునీ ద్విగుణస్యాతాముత్తానౌ చరణావుభౌ | అనేన విధియోగేన సమ్పుటం పరికీర్తితమ్.17
కించిద్వివర్తితౌ పాదౌ సమదండాయతస్థిదౌ| దృష్టమేవ యథాన్యాయ్యం షోడశాంగుల మాయతమ్.18
అంగుష్టములు, మణవలు, గుల్పములు, పాదములు, ఒకే వైపునుండి పరస్పరము దూరముగానున్నచో అది ''సమపదస్థానము''. రెండు పాదములును వ్రేళ్ళ బలముపై నిలచి , మోకాళ్లు బిగియబిట్టి ఉండగా రెండు పాదముల మధ్యభాగము మూడు జానలున్నచో అది ''వైశాఖస్థానము.'' రెండు మోకాళ్ళు హంస పంక్త్వాకారమున కనబడుచు నాలుగు జానల ఎడమున్నచో అది ''మండల స్థానము''. కుడికాలు మోకాలముందుకు చాపగా రెండు పాదముల మధ్య ఐదుజానలున్నచో అద ''అలీఢము'' . దీనికి విపరీతముగా ఎడమకాలు చాపినపుడు ''ప్రత్యాలీఢము''. కుడికాలు వంకరగను, ఎడమకాలు అవక్రముగను రెండు పాదముల గుల్ఫ పార్షిణబాగముల ఎడమ ఐదు అంగుళములున్నచో ఇది పండ్రెండు అంగుళములు ''పెద్ద స్థానకము'' ఎడమమోకాలు అపక్రముగానుండి, కుడికాలు బాగుగా చాపినను, లేదా, కుడి మోకాలు వంగి నిశ్చలముగానున్నను, లేదా మోకాలితో పాటు కుడికాలు దండాకారమున విశాలమగ కనబడిననను 'వికటము' అను స్థానకము దీనిలో రెండు పాదముల నడుమ రెండు హస్తములు ఎడముండును. రెండు మోకాళ్ళు కలిసి, ఉత్తానములైనచో అది 'సంపుట' స్థానము కొంచెము తిరిగిన రెండు పాదములు సమభావము తో దండమువలె విశాలముగను, స్థిరముగను కనబడినచో ఆ రెండు పాదములు సభావముతో దండమువలె విశాలముగను, స్థిరముగను కనబడినచో ఆ రెండింటి మధ్య పొడవు పదునారు అంగుళములుండును. ఇది స్థానముల యథోచిత స్వరూపము.
స్వస్తికేనాత్ర కుర్వీత ప్రణామం ప్రథమం ద్విజ| కార్ముకం గృహ్యహమేన బాణం దక్షిణకేనతు.19
వైశాఖేయది వాజాతేస్థితౌ వాప్యథ వాయతౌ | గుణాన్తం తు తతఃకృత్వా కార్ముకే ప్రియకార్ముకః.20
అధఃకోటింతు ధనుషః ఫలదేశంతుపత్రిణః | ధరణ్యాం స్థాపతయీత్వాతు తోలయిత్వాత థైవచ. 21
భుజాభ్యామత్ర కుబ్జాభ్యాం ప్రకోష్ఠోభ్యాం శుభవ్రత | తస్యభాణం ధనుఃశ్రేష్ఠం పుంఖదేశేచ పత్రిణః.22
విన్యాసో దనుషశ్చైవ ద్వాదశాంగుల మంతరమ్ | జ్యయా విశిష్టః కర్తవ్యో నాతిహీనో నచాధికః.23
నివేశ్య కార్ముకం నాభ్యాం నితంబే శరసంకరమ్ | ఉత్షిపే దుత్థితం హస్తమంతరేణాక్షి కర్ణయోః.24
పూర్వేణ ముష్టినాగ్రాహ్యఃస్తనాగ్రే దక్షిణ శరః | హరణంతు తతః కృత్వా శీఘ్రం పూర్వం ప్రసారయేత్
నాభ్యంతరా నైవ బాహ్యానోర్ధ్యకానాధరా తథా| నచ కుబ్జాన చోత్తానా నచలా నాతివేష్టితా.26
నమాస్థైర్య గుణోపేతా పూర్వదండమివస్థితా | ఛాదయిత్వా తతో లక్ష్యం పూర్వేణానేన ముష్టినా.27
వసిష్ఠా! యోధులు ముందుగా ఎడమ చేతధనస్సును, కుడిచేత బాణములు ధరించి, విడచిన బాణములు స్వస్తి కాకారమున నుండునట్లు చేసి వాటితో గురుజనులకు నమస్కారము చేయవలెను. ధనుర్ధాదియగు యోధుడు వైశాఖ స్థానమున స్థిరముగ నిలచి, స్థిత్యాయతులందు, (వర్తమాన భవిష్యత్తులందు) ఆవశ్యకత ఏర్పడినపుడు ధనస్సుపై నారిని విస్తరించి, ధనస్సు యొక్క క్రింది అగ్రమును బాణఫలమును భూమిపై అన్చి మూర్లతోను, మణిబంధములతోను కొలవవలెను. ఓ ఉత్తమవ్రతపాలకా! ఆ యోధుని బాణము కంటె ధనస్సు సర్వదా పెద్దదిగా నుండవలెను. పిడికిలికి ఎదుట బాణపుంఖము నకును, ధనుర్దండమునకును మధ్య పండ్రెండు అంగుళముల దూరముండవలెను. ఇట్లున్నపుడు ధనస్సుకు నారి కట్టవలెను. ఇంతకంటె ఎక్కువగాని తక్కువగాని ఉండరాదు. ధనస్సును నాభిస్థానమునందును, బాణమును నితంబము నందును ఉంచి, ఎత్తిన హస్తమును కంటికి చెవికి మధ్య ఉంచి, అట్టి స్థితిలో బాణము విడువవలెను. మొదట బాణమును పిడికిలి యందు పట్టుకొని దానిని దక్షిణస్తనాగ్రమునకు ఎదురుగా ఉంచవలెను. పిదప దానిని నారిపై ఉంచి, నారిని పూర్తిగా లాగి పూర్తిగ విస్తరింప చేయవలెను. నారి లోనికిగాని బైటకుగాని, ఎత్తుగాగాని, క్రిందుగా గాని, బోర్లపడిగాని, ఉత్తానముగ గాని, చంచలముగాని, అత్యంతావేష్టితము గాని కాకూడదు. అది సమముగను, స్థిరముగాను, దండమువలె ఋజువుగను ఉండవలెను. ఈ విధముగా ముష్టితో లక్ష్యమును ఆచ్ఛాదించి బాణమును విడువవలెను.
ఉరసా తూత్థితోయన్తా త్రికోణ వినతస్థితః | స్రస్తాంసో నిశ్చలగ్రీవో మయూరాంచిత మస్తకః.28
లలాట నాసా వక్రాంసాః కుర్యురేషు సమంభ##వేత్ | అంతరం త్ర్యంగులం జ్ఞేయం చిబుక స్యాంసకస్యచ.29
ప్రథమంత్ర్యంగులం జ్ఞేయం ద్వితీయేద్వ్యంగులం స్మృతమ్|
తృతీయే7ంగుల ముద్దిష్టమాయతం చిబుకాంసయోః. 30
గృహీత్వా సాయకం పుంఖాత్తర్జన్యాంగుష్ఠకేనతు| అనామయా పునర్గృహ్యతథా మధ్యమయాపి చ.31
తావదాకర్షయేద్వేగాద్యావద్బాణః సుపూరితః | ఎవం విధ ముపక్రమ్యయోక్తవ్యం విధివత్ఖగమ్. 32
దృష్టి ముష్టి హతం లక్ష్యం భింద్యాద్బాణన సువ్రతః | ముక్త్వాతు పశ్చిమం హస్తం క్షిపేద్వేగేనపృష్ఠతః.33
ఏత దుచ్చేదమిచ్చంతి జ్ఞాతవ్యం హిత్వయాద్విజ | కర్పూరం తదధః కార్యమాకృష్య తు ధనుష్మతా.34
ఊర్ధ్వం విముక్తకే కార్యే లక్ష్యశ్లిష్టం తు మధ్యమమ్ |
శ్రేష్ఠం ప్రకృష్టం విజ్ఞేయం ధనుఃశాస్త్ర విశారదైః.35
జ్యేష్ఠస్తు సాయకో జ్ఞేయో భ##వేద్ ద్వాదశ ముష్టయః | ఏకాదశ తథా మధ్యః కనీయాన్దశముష్టయః.36
చతుర్హస్తంధనుః శ్రేష్ఠం త్రయః సార్ధంతు మధ్యమమ్ | కనీయస్తుత్రయః ప్రోక్తం నిత్యమేవ పదాతినః.
అశ్వేరథే గజేశ్రేష్ఠం తదేవం పరికీర్తితమ్.37
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ధనుర్వేదో నామైకోన పంచాశదధిక ద్విశతతమో7ధ్యాయః.
ధానుష్కుడు ప్రయత్న పూర్వకముగ వక్షమును ఎత్తుగానుంచి శరీరము త్రికోణాకారముగ నుండునట్లు వంగ వలెను. భుజములు శిథిలముగ నుండి కంఠము నిశ్చలమై, శిరస్సు మయూరశిరస్సు వలె ప్రకాశించవలెను. లలాట నాశికా-ముఖ-బాహు-మూల-కూర్పరములు సమావస్థలో నుండవలెను. గడ్డమున ను భుజమునకును మధ్య మూడు అంగుళముల వ్యవధానుముండవలెను. ఈ వ్యవధానము మొదట మూడు అంగుళములు, తరువాత రెండు అంగుళములు తరువాత ఒక అంగుళము అని చెప్పబడినది. బాణపుంఖమును తర్జన్యంగుష్ఠములతో పట్టుకొనవలెను. పిదప మధ్యమా-అనామికాలతో కూడ పట్టుకొనవలెను. పూర్తి బాణమంతయు ధనస్సుపైకి వచ్చునంతవరకు వేగ పూర్వకముగా లాగవలెను. ఈ విధముగా ఉపక్రమించి బాణమును విధిపూర్వకముగా విడువవలెను. ఓ సువ్రతా! దృష్టిచేతను ముష్టిచేతను ముందుగ ఆహతమగు లక్ష్యమునే బాణముచే భేదించవలెను. బాణము విడచిన హస్తమును శత్రువు భేదించ కుండుట కై వెంటనే దానిని వీపువైపునకు ఉంచుకొంనవలెను. అందుచే ధానుష్కుడు ధనస్సును లాగి మోచేతికి క్రిందుగా, నుంచి బాణము విడచు సమయమున దానినిపైకి తేవలెను. ధనుఃశాస్త్రుజ్ఞులీ విషయమును బాగుగా గుర్తు ఉంచుకొనవలెను. మోచేతిని కనబడకుండ ఉంచుట మధ్యమరక్షణోపాయము. శత్రులక్ష్యముకాంకుండ ఉంచుకొనుట ఉత్తమము, పండ్రెండు ముష్టుల పొడవుగల బాణము ఉత్తమము, పదునొకండు ముష్టుల పొడవుగలది మధ్యమము, పదిముష్టులు అధమము, నాలుగు హస్తముల పొడవుగల ధనస్సు ఉత్తమము, మూడున్నరహస్తముల మధ్యమము, మూడుహస్తములు అధమము, పదాతులు సర్వదా మూడు హస్తముల ధనస్సును మాత్రమే ఉపయోగించవలెను. అశ్వము, రథము, గజము ఎక్కి యుద్ధము చేయువారు ఉత్తమధనస్సును మాత్రమే ఉపయోగించవలెను.
అగ్నిమహాపురాణమున ధనుర్వేదవర్ణనమను రెండువందల నలుబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.