Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ పంచాశా దధిక ద్విశతతమో೭ధ్యాయః
పునః ధనుర్వేదః
అగ్నిరువాచ:
పూర్ణాయతం ద్విజః కృత్వాతతో మాంసైర్గదాయుధాన్ | సునార్ధౌతం ధనుః కృత్వా యజ్ఞభూమౌనిధాపయేత్.
తతో బాణం సమాగృహ్య దంశితః సుసమాహితః | తూణమాసాద్య బధ్నీ యాద్దృడాం కక్షాంచ దక్షిణామ్.
విలక్ష్యమపి తద్బాణం తత్ర చైవ సుసంస్థితమ్ | తతః సముద్దరేద్భాణం తూణాద్దక్షిణ పాణినా.3
తేనైవ సహితం మధ్యేశరం సంగృహ్యధారయేత్ | వామహస్తేన వై కక్షాం ధనుస్తస్మాత్సముద్దరేత్.4
ఆవిషణ్ణమతిర్భూత్వా గుణ పుంఖం నివేశ##యేత్ | సంపీడ్య సింహకర్ణేన పుంఖేనాపి సమేదృడమ్.5
వామకర్ణోప విష్టంచ ఫలం వామస్య ధారయేత్ | వర్ణాన్మధ్యమయా తత్ర వామాంగుల్యాచ ధారయేత్.6
మనోలక్ష్యగతం కృత్వా ముష్టినా చ విధానయేత్ | దక్షిణ గాత్రభాగేతు కృత్వా వర్ణం విమోక్షయేత్.7
లలాటపుట సంస్థానం దండం లక్ష్యం నివేశ##యేత్ | అకృష్య తాడయేత్తత్ర చంద్రకం షోడశాం గులమ్.8
ముక్త్వాబాణం తతః పశ్చాదుల్కా శిక్షస్తదాతయా| నిగృహ్ణీయాన్మధ్యమయా తతో7ఙ్గుల్యా పునఃపునః.9
అక్షిలక్ష్యం క్షిపేత్తూణాచ్చతురస్రం చ దక్షిణమ్ | చతురస్ర గతం వేద్యమభ్య సేచ్చదితఃస్థితః.10
అగ్నిదేవుడు పలికెను: ద్విజుడు పూర్తి పొడవుగల ధనస్సును తయారుచేయించి, దానిని బాగుగా కడిగితుడిచి, దానిని, గదాద్యాయుధములను గూడ శుభ్రముచేసి వాటిని, యజ్ఞభూమిలో నుంచవలెను. పిదప బాణములు గ్రహించి, కవచముధరించి , ఏకాగ్రచిత్తుడై అంబులపొదిని వీపుపై కుడి చంక దగ్గర గట్టిగ బంధించవలెను. అట్లు చేయుటచే విలక్ష్యమగు బాణము కూడ అతూణీరము నందు స్థిరముగా నుండును. కుడిచేతితో తూణీరమునుండి బాణమును వెలికి తీయవలెను. ఎడమచేతితో ధనస్సును అచటినుండి పైకెత్తి, దాని మధ్యభాగమున బాణసంధానము చేయవలెను. చిత్తమునందు విషాదమేమియ లేనివాడై, ఉత్సాహసంపన్నుడై నారిపై బాణపుంఖమునుండి, సింహకర్ణమను ముష్ఠితో నారిని బాణపుంఖముతో నొక్కిపెట్టి, సమముగసంధించి, బాణమును లక్ష్యము వైపు విడువలెను. ఎడమచేతితో బాణము విడువవలెనన్నపుడు ఎడమచేతిలో బాణముధరించి, కుడిచేతలో ధనస్సుముష్ఠిని పట్టుకొనవలెను. లాగినపుడు బాణము ఫలము(అగ్రము)గాని, చెవివరకు వచ్చునట్లు నారిపై బాణము నుంచవలెను. ఆసమయమున బాణమును తర్జన్యంగుష్ఠమునే కాక మధ్యమాంగుళితో కూడ పట్టుకొనవలెను. బాణ ప్రయోగ విధి నెరిగిన యోధుడు ధనస్సునో ముష్టితో గట్టిగ పట్టుకొని, మనస్సును, దృష్టిని లక్ష్యముపై నిలపి, బాణము శరీరము కుడివైపునకు వచ్చునట్లు చేసికొని లక్ష్యమువైపు విడువవలెను. . ధనుర్దండము నేలపై నిలపెట్టినపుడు లలాట సమీపమునకు వచ్చునంత పొడవు ఉండవలెను. దానిపై చంద్రక బాణమును సంధించి, బాగుగా లాగి లక్ష్యముపై విడువవలెను. ఈ విధముగా ఒక బాణము విడచిన పిమ్మట, వెంటనే తూణీరము నుండి, తర్జన్యంగుష్ఠము లతో మాటిమాటికి బాణముపైకి తీసి, దానిని మధ్యమాంగుళిచేతగూడ తన వంశమునందుండు నట్లు చేసికొని, శీఘ్రముగ లక్ష్యము వైపు విడువవలెను. నలువైపులను, దక్షిణమునందును లక్ష్యవేధము చేయుచుపోవలెను. మొదటినుండియు నాలుగువైపుల లక్ష్యమును కొట్టుచు బాణ ప్రయోగము చేయుట అభ్యసించవలెను.
తస్మాదనంతరం తీక్‌ష్ణం పరావృత్తం గతం చయత్ | నిమ్నమున్నత వేధం చ హ్యభ్యసే త్షిప్రకం తతః.
వేధ్య స్థానేష్వ థైతేషు నత్త్వస్య పుటకాద్ధనుః | హస్తా వాపశ##తైశ్చిత్రై స్తర్జయేద్దుస్తరై రపి. 12
తస్మిన్వేధ్యగతే విప్ర ద్వేవేధ్యే దృఢ సంజ్ఞకే | డ్వేవేధ్యే దుష్కరే వేధ్యేద్వే తథా చిత్ర దుష్కరే.13
నతునిమ్నంచ తీక్‌ష్ణం చ దృఢవేధ్యే ప్రకీర్తితే | నిమ్నం దుష్కరముద్దిష్టం వేధ్య మూర్ధ్వ గతం చయత్.
మస్తకాయన మధ్యేతు చిత్ర దుష్కర సంజ్ఞకే | ఏవం వేధ్యగణం కృత్వా దక్షిణనేతరేణ చ.15
ఆరోహేత్ర్పథమం వీరో జితలక్షస్తతో నరః | ఏష ఏవవిధిః ప్రోక్తస్తత్ర దృష్టః ప్రయోక్తృభిః.16
అధికం భ్రమణం తస్య తస్మాద్వేధ్యాత్ర్ప కీర్తితతమ్| లక్ష్యం సంయోజయేత్తత్ర పత్రిపత్ర గతం దృఢమ్.
భ్రాంతం ప్రచలితం చైవస్థిరం యచ్చ భ##వేదితి| నమంతాత్ తాడయేద్భిన్ద్యాచ్ఛేదయేద్య్వథ యేదపి.18
కర్మయోగ విధానజ్ఞో జ్ఞాత్వైవం విధిమాచరేత్ | మనసా చక్షుషా దృష్ట్యా యోగశిక్షుర్యమం జయేత్.19
ఇత్యాది మహాపురాణ అగ్నేయే ధనుర్వేదో నామ పంచాశదధిక ద్విశతతమో7ధ్యాయః.
పిదప అతడు తీక్‌ష్ణ-పరావృత్త-గత-నిమ్న-ఉన్నత- క్షిప్రవేధలను అభ్యసించవలెను. పైన చెప్పిన వేధ్యలక్ష్యస్థానములను కొట్టుటకు సత్త్వమును చూపుచు విచిత్రము. దుస్తరము అగు పద్ధతిలోఅనేక పర్యాయములు హస్తములచే బాణములను తీయుట విడుచుట అను పనులచే ధనుస్తర్జనము చేయవలెను. విప్రవరా! వేధ్యములలో అనేక బేధములున్నవి. దృడము, దుష్కరము, చిత్రదుష్కరము అని అవి మూడువిధములు. ఆ మూడును మరల రెండేసి విధములు- నతనిమ్నము, తీక్‌ష్ణము అనునవి దృఢవేద్యభేదములు. నిఘ్నము, ఊర్ధ్వగతము అని దుష్కరవేధ్యభేదములు. మస్తకపనము, మధ్యము అని చిత్రదుష్కర వేధ్యభేదములు. ఈ విధముగ వీరుడు వేధ్యగణములవేధించుటలో ప్రవీణుడై ముందుకుడి ప్రక్కనుండి గాని, ఎడమ ప్రక్కనుండిగాని శత్రుసైన్యముపై ఆక్రమణము చేయవలెను. దానివలన లక్ష్యముపై విజయము లభించును. ప్రయోగనిపుణులు వేద్యవిషయమున ఈ విధానమునే గ్రహించి ప్రతిపాదించి యున్నారు. యోధునకు వేధ్యముకంటెగూడ భ్రమణము ఉత్తమమని చెప్పబడినది. లక్ష్యమును తనబాణము పుంఖముచే ఆచ్ఛాదించి దానివైపు దృఢముగ శరసంధానము చేయవలెను. భ్రమణశీలము, చంచలము, అగులక్ష్యమును అన్నివైపుల నుండియు కొట్టవలెను. దానిని ఛేదించి, సర్వవిధముల దానికి పీడకలిగించవలెను. కర్మయోగవిధానము తెలిసిన వాడు ఈ విధముగా తెలిసికొని ఉచితవిధముగ ఆచరించవలెను. మనోనేత్రదృష్టులను లక్ష్యముపై నిలుపగలిగిన వాడు యముని కూడ జయించగలుగును.
అగ్ని మహాపురాణమున ధనుర్వేది కథనమను రెండువందల ఏబదవ అధ్యాయము సమాప్తము.