Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ పంచషష్ట్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథ దిక్పాలాది స్నానమ్‌

అగ్నిరువాచ :

సర్వార్థ సాధనం స్నానం వక్ష్యేశాంతికరం శృణు| స్నాపయేచ్చ సరిత్తీరే గృహాన్విష్ణుం విచక్షణః. 1

దేవాలయే జ్వరార్త్యాదౌ వినాయక గ్రహార్దితే| విద్యార్థినో హ్రదేగేహే జయకామస్య తీర్థకే. 2

పద్మిన్యాం స్నాపయేన్నారీం గర్భోయస్యాః స్రవేత్తథా! అశోక అశోక సన్నిధౌ స్నాయాజ్జాతో యస్యావినశ్యతి. 3

పుష్పార్థినాంచ పుష్పాడ్యే పుత్రార్థినాంచ సాగరే! గృహసౌభాగ్య కామానాం సర్వేషాం విష్ణుసన్నిధౌ. 4

వైష్ణవే రేవతీ పుష్యే సర్వేషాం స్నానముత్తమమ్‌!

స్నాన కామస్య సప్తాహం పూర్వముత్సాదనం స్మృతమ్‌. 5

పునర్నవాం రోచనాం చ శీతాంగం గురుణీత్వచమ్‌! మధూకం రజనీద్వేచ తగరం నాగకేసరమ్‌. 6

అంబరీం చైవ మంజిష్ఠాం మాంసీయాసకరకర్దమైః!

ప్రియంగు సర్పం కుష్ఠం బలాం బ్రాహ్మీంచ కుంకుమమ్‌. 7

పంచగవ్యం సక్తుమిశ్రం ఉద్వర్త్య స్నానమాచరేత్‌!

అగ్నిదేవుడు పలికెను. పరశురామ ఇపుడు సకల కార్యసిద్ధిని ఇచ్చు శాంతికరమగు స్నానమును గూర్చి చెప్పెదను వినుము. గృహములకు, శ్రీమహావిష్ణువునకు నదీతీరమున స్నానము చేయించవలెను జ్వరపీడాదులు కలుగునపుడు. వినాయక గ్రహబాధ కలిగినపుడును దేవాలయమునందు స్నానము చేయించవలెను. విద్యకోరువాడు జలాశయము నందు కాని, ఇంటిలోకాని స్నానము చేయించవలెను. విజయముకోరువాడు తీర్థజలమున స్నానము చేయించవలెను. గర్భస్రావముతో బాధపడుతున్న స్త్రీకి పుష్కరిణిలో స్నానము చేయించవలెను. పుట్టిన వెంటనే శిశువులు మరణించు స్త్రీకి అశోకవృక్ష సమీపమున స్నానము చేయించవలెను. రజోదర్శనము కోరు స్త్రీలు పుష్కములతో నిండిన వనమునందును,పుత్రులను కోరు స్త్రీలు సముద్రమునందును, సౌభాగ్యమును గోరు స్త్రీలు, గృహమునందును స్నానము చేయవలెను. పైన చేప్పిన వారందరును విష్ణు ప్రతిమ సమీపమున స్నానము చేయవలెను. శ్రవణ, రేవతి, పుష్ప నక్షత్రములందు అందరికిని స్నానము ఉత్తమును. కామ్య స్నానము చేయవారికి ఒక సప్తాహము ముందుగనే ఉత్సాదనము విధింపబడినది. పునర్నవ, గోరోచనము, శతాంగము, గురుణి, బెరడు, మధూకము, రెండు విధములగు పసుపు, తగరము, నాగ కేసరము, అంబరి మంజిష్ణ, జటామాంసి, యాసకము కర్దమము ప్రియంగుపు, తెల్ల ఆవలు, కుష్ఠముల బల బ్రాహ్మి కుంకుమము, సక్తువులు కలిపిన పంచగవ్యమలు వీటితో శరీరము నలుచుకొని, స్నానము చేయవలెను.

మండలే కర్ణికాయాంచ విష్ణుం బ్రహ్మాణమాచరేత్‌. 8

దక్షే వామే హరం పూర్వం పత్రే వూర్వాది కేక్రమాత్‌! లిఖేదింద్రాదికాన్దేవాన్సాయుధాన్సహబాంధవాన్‌.

స్నానమండల కాస్దిక్షు కుర్యాచ్చైవ విదిక్షుచ! విష్ణు బ్రహ్మేశ శక్రాదీంస్తదస్త్రాణ్యర్చ్య హోమయేత్‌. 10

ఏకైకన్య త్వష్టశతం సమిధస్తు తిలాన్వృతమ్‌! భద్రః సుభద్రః సిద్ధార్థ కలశాః పుష్టివర్ధనాః. 11

అమోఘః చిత్రభానుశ్చ వర్జన్యో7థ సుదర్శనః!స్థాపయేత్తు ఘటానే తాన్సాశ్వి రుద్ర మరుద్గణమ్‌. 12

విశ్వేదేవాస్తథా దైత్యావసవో మునయస్తథా! ఆవేశయన్తు సుప్రీతస్తథాన్యా ఆపి దేవతాః. 13

ఔషధీర్నిక్షి పేత్కుంభే జయన్తీం విజయాం జయామ్‌! శతావరీం శతపుష్పాం విష్ణుక్రాంతావరాజితామ్‌. 14

జ్యోతిష్మతీమతి బలాం చందనోశీర కేసరమ్‌! కస్తూరికాచ కర్పూరం వాలకం పత్రకం త్వచమ్‌. 15

జాతీఫలం లవంగం చ మృత్తికాం పంచగవ్యకమ్‌ః భద్రపీఠే స్థితం సాధ్యం స్నాపయేయుర్ద్విజాబలాత్‌.

రాజాభిషేక మంత్రోక్త దేవానాం హోమకాః పృథక్‌! వూర్ణాహుతిం తతో దత్త్వా గురవే దక్షిణాం దదేత్‌.

ఇంద్రో7భిషిక్తో గురుణాపురా దైత్యాంజఘానహ! దిక్పాల స్నానం కథితం సంగ్రామాదౌ జయాదికమ్‌. 18

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే దిక్పాలాది స్నానం నామ పంచషష్ట్యధిక

ద్విశతతమో7ధ్యాయః.

పిమ్మట తామ్రపత్రముపై పద్మమండలము నిర్మించి దానికర్ణిక యందు, విష్ణువును పూజించవలెను. దానికుడి భాగమున బ్రహ్మను, ఎడమప్రక్క శివుని పూర్వాది దగ్ధళములందు ఆయుధ డరివారాది సహితులగు దిక్పాలకులను ఉంచి పూర్వాది దిశలందును. ఆగ్నేయాది విదిశలందును, ఎనిమిది స్నానమండలములు నిర్నించవలెను. ఆమండలములపై ఆయుధ సహితులగను విష్ణు, బ్రహ్మ, శివ, ఇంద్రాదులను పూజించి, వారి నుద్దేశించి హోమము చేయవలెను. ఒక్కొక్క దేవతకు నూటయెనిమిది ఆహుతులు సమిధలతోను తిలలతోను, ఘృతముతోను ఇవ్వవలెను. పిదప భద్ర, సుభద్ర, సిద్ధార్థ, పుష్టివర్ధన అమోఘ చిత్రభాను, వర్జన్య, సుదర్శనములను యెనిమిదికల శల స్థాపించి వాటిపై, అశ్విని, రుద్ర - మరుద్గణ - విశ్వేదేవ దైత్య - వసుదుర్గా - మునులను ఇతర దేవతలను అవాహన చేసి "మీరందరును ప్రసన్నులై ఈకల శములపై ఉండుడు" అని ప్రార్థించవలెను. ఆకలశలో, జయంతి, విజయ, జయ, శతావరి, శతపుష్ప, విష్ణు క్రాంత, అపరాజిత, జ్యోతిష్మతి, అతిబల చందన, ఉశీర, కేసర, కస్తూరి, కర్పూర, వాలక, పత్రక, త్వచ జాతీఫల, లవంగములను, మృత్తికను, పంచగవ్యములను వేయవలెను. పిమ్మట బ్రాహ్మణులు సాధ్యుడగు మనుష్యుని భద్ర పీఠముపై కూడ్చండబెట్టి, బలపూర్వకముగా స్నానము చేయించవలెను. రాజ్యాభిషేక మంత్రములలో చెప్పబడిన దేవతలకు వేరువేరుగా హోమములు చేయించవలెను. పిదప పూర్ణాహుతి ఇచ్చి గురువునకు దక్షిణా ఇవ్వవలెను. పూర్వము బృహస్పతి ఇంద్రునకు అభిషేకము చేయించగ, ఆతడు దైత్యులను చంపెను. ఇంతవరకు విజయాదికమును ఇచ్చు దిక్పాలస్నానమును చెప్పితిని.

అగ్నిమహాపురాణమున దిక్పాలాది స్నానమను రెండు వందల అరువది ఐదవ ఆధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page