Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అశీత్యధిక త్రిశతతమో೭ధ్యాయః
అథాద్వైత బ్రహ్మవిజ్ఞానమ్
అగ్ని రువాచ :
ఆద్వైత బ్రహ్మవిజ్ఞానం వక్ష్యే యద్భరతో೭గదత్ | శాలగ్రామే తపశ్చక్రే వాసుదేవార్చనాదికృత్. 1
మృగే సంగాన్మృగో భూత్వాహ్యన్తకాలే స్మరన్మృగమ్ |
జాతిస్మరో మృగస్త్యక్త్వా దేహయోగాత్స్వతో೭భవత్. 2
అద్వైత బ్రహ్మభూతశ్చ జడవల్లో కమాచరత్ | క్షత్తా೭సౌవీర రాజస్య విష్టియోగ మమన్యత. 3
ఉవాహ శిబికామస్య క్షత్తుర్వచన చోదితః | గృహితో విష్టినాం జ్ఞానీ ఉవాహాత్మ క్షయాయతమ్. 4
య¸°జడగతి ః పశ్చాద్యేత్వన్యే త్వరితంయయుః | శీఘ్రగతీన్దృష్ట్వా అశీఘ్రం తంనృపో೭బ్రవీత్.
అగ్నిదేవుడు పలికెను. భరతుడు చెప్పినఅద్వైత బ్రహ్మ విజ్ఞానమునుగూర్చి చెప్పెదను. పూర్వము భరతుడను రాజు సాలగ్రామ క్షేత్రమున వాసుదేవాది పూజ చేయుచు తపస్సు చేసెను. ఒక మృగమునందు ప్రేమచే మరణసమయమున ఆ మృగమునే స్మరించుచు మరుజన్మమున మృగముగాపుట్టెను. కాని ఆజన్మలో పూర్వజన్మ స్మృతి వుండెను. అందుచే స్వయముగనే ఆ దేహమును విడిచి మరియొక జన్మ ఎతైను అద్వైత బ్రహ్మజ్ఞానము కలవాడు మూఢుడువలె లోకమున సంచరించెను. సౌవీర దేశరాజు అతనిని విష్టిగా నియమించెను. ఆతని ఆజ్ఞ ప్రకారము భరతుడు ఆతని పల్లకిని మోసెను. ఆతడు జ్ఞానియైనను ప్రారబ్ధ క్షయము కొరకై విష్టిగా గ్రహింపబడి పల్లకి మోసెను. ఇతరులు శీఘ్రముగ నడచుచుండిరి. వారు శీఘ్రముగ నడచుటను. ఇతడు మందముగా నడచుటను చూసి రాజు పలికెను.
రాజోవాచ :
కిం శ్రాంతో೭స్యల్పమధ్యానం త్వయోఢా శిబికామమ | కిమాయాస సహోనత్వం పీవానసినిరీక్ష్యతే. 6
బ్రాహ్మణ ఉవాచ :
నాహంపీవానవైవోఢా శిబికా భవతో మయా | న శ్రాంతో೭స్మి నవాయాసోవోఢ వ్యోస్మి మహీపతే. 7
భూమోపాదయుగం తస్థౌ జంఘేపాదద్వయోస్థితే | ఊరూజంఘాద్వయావస్థౌ తదాధారం తథోదరమ్. 8
వక్షఃస్థలం తథాబాహూ స్కంధౌ చోదరసంస్థితౌ | స్కంధస్థితేయం శిబికామమభావో೭త్ర కింకృతః. 9
శిబికాయాం స్థితంచేదం దేహంత్వదుప లక్షితమ్ | తత్రత్వమహమప్యత్రప్రోచ్యతే చేదమన్యథా. 10
అహంత్వంచ తథా೭న్యేచ భూతైరుహ్యామ పార్థివ | గుణప్రవాహాపతితో గుణవర్గో హి యాత్యయమ్. 11
కర్మవశ్యా గుణాశ్చైతే సత్త్వాద్యాః పృథివీపతే | అవిద్యా సంచితం కర్మతచ్చాశేషేషు జన్తుషు. 12
ఆత్మాశుద్ధో೭క్షరః శాన్తో నిర్గుణః ప్రకృతేః వరః | ప్రకృత్య పచయో నాస్య ఏకస్యాఖిల జన్తుషు. 13
యదానాపచయస్తస్య తదానాపచయోనృప | తదా పీవానసీతి త్వంకయా యుక్త్యాత్వయేరితమ్. 14
భూజంఘాపాత కట్యూరు జఠరాదిషు సంస్థితా | శిబికేయం తథాస్కంధే తదాభావ. సమస్త్వయా. 15
తదన్య జంతుభిర్భూవ శిబికోత్థాన కర్మణా | శైలద్రవ్య గృహోత్థాపి పృథివీ సంభవోపివా. 16
యథా పుంసః వృథగ్భావః ప్రాక్యతైః కరణౖర్నృప | సోఢవ్యః సమహాభారః కతరోనృపతమయా. 17
యద్ద్రవ్యాశిబికా చేయం తద్ద్రవ్యో భూతనగ్రహాః | భవతోమే೭ఖిలస్యాన్య సమత్వేనోవబృంహితః. 18
రాజు ఇట్లననె. ఓయీ ! నీవు నా పల్లకి కొంచెము దూరమే మోసితిని. ఇంతలోనే అలసిపోతివా ! నీవు చూచుటకు బలిసివున్నావు. శ్రమకు ఓర్చజాలవా ! బ్రాహ్మణుడు పలికెను. నేను బలిసిలేను, నేను నీ పల్లకి మోయుట లేదు. నేను అలసిపోలేదు నాపైన భారమేమియులేదు. నేలపై రెండు పాదములున్నవి. వాటిపై పిక్కలున్నవి. వాటిపై రెండు తోడలున్నవి వాటిపై ఉదరము దానిపై వక్షస్థలము, దానిపై భుజములు, వున్నవి. ఆ భుజములపై ఈ పల్లకి వుంచబడినది. అట్టి పరిస్థితులలో నాకేమి సంబంధమున్నది. నీది అను చెప్పబడు ఈ శరీరము పల్లకిలో వున్నది. నీవు అక్కడ వున్నావని, నేను ఇచట నున్నానని చెప్పుట ఇదంతయు మిథ్యా. నిన్ను, నన్ను, అందరిని, కూడ, పంచ భూతములు మోయుచున్నవి. పంచభూతములు గుణ ప్రవాహములో పడి కొట్టుకొని పోవుచున్నవి. సత్త్వాది గుణములు కర్మాధీనములు. కర్మ అవిద్యా సంచితము. ఇది అన్ని జీవులందు వున్నది. ఆత్మ శుద్ధము, అక్షరము, శాంతము నిర్గుణము, ప్రకృతి, అతీతము, అన్ని ప్రాణులయందు ఒకే ఆత్మవున్నది. దానికి వృద్ధికాని హ్రాసముకాని లేవు. అట్టి పరిస్థితులలో నీవు బలిసివున్నావు అని ఏయుక్తిని బట్టి నీవు పలికినావు వృథివీ, పాదములు, కాళ్ళు, కటి, ఊరువులు, ఉదరము, మొదలగు వాటిపైనను స్కంధమునందును. వున్న పల్లకి నాకు భారమైనచో అది నీకు కూడ భారమే. ఇది ఇతర ప్రాణుల విషయమున కూడ సమానమే. కేవలము, పల్లకిని మాత్రమే కాక జీవులు పర్వతములను, వృక్షములను, గృహములను, పృథ్వ్యాదులను, వాటి భారమును కూడ తన నెత్తిపై వేసికొనినాడు. రాజా ! ప్రకృతి జన్యములగు సాధనముల కంటే పురుషుడు సర్వధాభిన్ను డైనపుడు నేను భరించవలసిన భారమేమున్నది. ఏ పదార్థముతో ఈ పల్లకి తయారుచేయబడినదో ఆ పదార్థము తోటే నీయొక్క నాయొక్క సకల ప్రాణులయొక్క శరీరములు నిర్మింపబడినవి. ఆద్రవ్యములచేతనే అందరికిని వృద్ధి ఏర్పడినది.
తచ్ఛ్రత్యోవాచ రాజా తం గృహీత్వాంఘ్రీ క్షమాప్యచ |
ప్రసాదం కురుత్యక్త్వేమాం శిబికాంబ్రూహిశృణ్వతే ||
యో భవాన్యన్నిమిత్తం వాయదాగమనకారణమ్. 19
బ్రాహ్మణ ఉవాచ :
శ్రూయతాం కోహమిత్యేతద్వక్తం నైవచ శక్యతే ః ఉపభోగ నిమిత్తంచ సర్వత్రాగమన క్రియా. 20
సుఖ దుఃఖోప భోగౌతు తౌదేశాద్యుప పాదకౌ | ధర్మాధర్మోద్భవోభోక్తుం జంతుర్దేశాది మృచ్ఛతి. 21
రాజోవాచ :
యో೭స్తి సోహమితి బ్రహ్మన్కథం వక్తుం నశక్యతే | ఆత్మన్యేష నదోపాయ శబ్దోహ మితివై ద్విజ. 22
బ్రాహ్మణ ఉవాచ :
శబ్దోహమితి దోషాయ నాత్మన్యేష తథైవ తత్ | అనాత్మన్యాత్మ విజ్ఞానం శబ్దోవా భ్రాన్తి లక్షణః. 23
యదా సమస్త దేహేషు పుమానేకో వ్యవస్థితః | తదాహికో భవాన్కో హమిత్యే తద్విఫలం వచః. 24
త్వం రాజా శిబికా చేయం వయం వాహాఃపురఃసరాః | అయం చ భవతో లోకోన సదేత న్నృపోచ్యతే. 25
వృక్షాద్దారు తతశ్చేయం శిబికా త్వదధిష్ఠితా | కావృక్ష సంజ్ఞా జాతాస్య దారుసంజ్ఞాథవా నృప. 26
వృక్షారూఢో మహారాజో నాయంవదతి చేతనః న చ దారుణి సర్వస్త్వాం బ్రవీతి శిబికా గతమ్. 27
శిబికాదారు సంఘాతో రచనాస్థితి సంస్థితః | అన్విష్యతాం నృపశ్రేష్ఠ తద్భేదే శిబికా త్వయా. 28
పుమాంస్త్రీ గౌరయం వాజీ కుంజరో విహగస్తరుః | దేహేషు లోక సంజ్ఞేయా కర్మహేతుషు. 29
జిహ్వా బ్రవీత్యహమితి దంతోష్ఠౌతాలుకం నృవ | ఏతేనాహం యతః సర్వే వాజ్ నిష్పాదన హేతవః. 30
కింహేతు భిర్వ దత్యేషా వాగేవాహమితి స్వయమ్ | తథాపి వాఙ్మాహమేత దుక్తం మిథ్యానయజ్యతే. 31
పిండః పృథగ్యతః పుంసః శిరః పాయ్వాది లక్షణః |
తతో೭హమితి కుత్రైతాం సంజ్ఞాం రాజన్కరోమ్యమ్. 32
యదన్యో೭స్తి వరః కోపిమత్తః పార్థివసత్తమ ః తదేమోహమయం చాన్యోవక్తు మేవమపీష్యతే. 33
పరమార్థ భేదోన నాగోన పశుర్నచ పాదవః | శరీరాశ్చ విభేదాచ్చయ ఏతేకర్మయోనయః. 34
యస్తురాజేతి యల్లోకే యచ్చరాజభటాత్మకమ్ | తచ్చాన్యచ్చ నృహేత్యన్తు న సత్సమ్పగ నామయమ్. 35
త్వం రాజాసర్వ లోకస్య పితుః పుత్రోరిపోరిపుః | పత్న్యాః పతిః పితానూనోః కస్త్వాం భూపవదామ్యహమ్.
త్వం కిమేతచ్ఛిరః కిన్నశిరస్తవ తథోదరమ్ | కిము పాదాదికం త్వంవైతవతత్కిం మహీవతే. 37
సమస్తావయవేభ్యస్త్వం పృథగ్భూతో వ్యవస్థితః | కోహమిత్యత్రనిపుణో భూత్వా చిన్తయ పార్థివ.
ఆ మాట విని రాజు ఆతని పాదములు స్పృశించి క్షమాపణను కోరి ఇట్లు పలికెను. నన్ను అనుగ్రహించుము. ఈ పల్లకిని విడిచి నీవు ఎవ్వరవో - ఇట్లు ఎందుకు వచ్చినానో చెప్పుము అని ప్రార్థించెను బ్రాహ్మణుడు పలికెను. రాజా ! వినుము. నేను ఫలానావాడను అని చెప్పుట అశక్యము. కర్మ ఫలమును అనుభవించుటకే అందరును వచ్చుచుందురు. సుఖ దుఃఖోప భోగము కొరకై విభిన్న దేశ కాలాదులను పొందుచుందురు. ధర్మా ధర్మ ఫలములను అనుభవించుటకై జీవుడు ఆయా దేశములను పొందు చుండును. రాజు పలికెను. ఏది వున్నదో అది నేను అని చెప్పుటలో దోషమేమున్నది. అహం అనుశబ్దమును తన విషయమున ప్రయోగించుట దోషము కాదు కదా ! బ్రాహ్మణుడు పలికెను. తన విషయమున అహమ్ అను శబ్దమును ప్రయోగించుటలో దోషము లేదు. అని నీవు చెప్పినది సత్యమే. కాని అనాత్మ విషయమున ''అహం'' శబ్ద మును ప్రయోగించి దానిని ఆత్మగా భావించుట భ్రాంతియే. సమస్తదేహము నందును వున్న ఆత్మ ఒక్కటియే యైనపుడు నీ వెవ్వరు నే నెవ్వరు మొదలగు వచనములకు అర్థము లేదు. నీవు రాజువు. ఇది పల్లకి. మేము దీనిని మోయు వారము. ఎదుట నడచువారు నీ పరివారము. ఈ లోకము నీది. ఈ విధముగ చెప్పుట సత్యము కాదు. చెట్టు నుండి వచ్చిన కర్రతో చేసిన యీ పల్లకిని నీవు ఎక్కి యున్నావు. రాజా. ఈ పల్లకికి వుండవలసిన వృక్ష మను పేరు కర్ర అను పేరు ఏమైపోయినది అని చెప్పుము. ఇక్కడున్న వారెవరును మహారాజు చెట్టుపై ఎక్కినాడు అని కాని కట్టెపై ఎక్కినాడు అని కాని అనుట లేదు. పల్లకి ఎక్కినట్లు చెప్పుచున్నారు. ఒక విధముగ కూర్చిన కర్రల సముదాయమునకే ''శిబిక'' అని పేరు రాజా ! కర్రల కంటే వేరుగా పల్లకి ఎక్కడ వున్నదో వెతికి చూడుము. ఇతడు పురుషుడు, ఈమె స్త్రీ, ఇది యెద్దు ఇదిగుర్రము, ఇది ఏనుగు, ఇది వృక్షము, ఇది పక్షి అని ఈ విధములుగ కర్మ జనితములగు భిన్న భిన్న శరీరములకు వేర్వేరు నామములు ఆరోపింపబడుచున్నవి. ఇవన్ని లోకము కల్పించిన పేర్లు. జిహ్వ అహం అని అనుచున్నది. దంతములు ఓష్ఠములు తాలువు కంఠము మొదలగునవి కూడ ఉచ్చరించుచున్నవి. కాని ఇవి యేవియు అహం కాదు. ఇవి కేవలము శబ్దోచ్చారణ సాధన మాత్రములు. ఈ జిహ్వ అహం అని యేకారణముచే చెప్పుచున్నది? జిహ్వ అహం అని చెప్పుచు పలుకుచు నేను అహం కాదు అని ఆనను. మిథ్య కాదు. శిరస్సు పాయ్వాదులు మొదలగు అవయవముల రూపములలో నున్న శరీరము పురుషుని కంటే సర్వధా భిన్నము. అందుచే ఏ అవయవమును నిర్దేశించుటకు నేను అహం శబ్దమును ప్రయోగింతును? నా కంటే భిన్నమైన మరొక తత్త్వమున్నచో ఇది నేను, అది భిన్నము అనిచెప్పుటకు వీలు వుండును కాని వాస్తవమున పర్వత, పశు, పాద పాది భేదము, సత్యము కాదు. శరీర దృష్టిచే కనబడు భేదములన్నియు కర్మ జన్యములు. లోకములో ఇతడు రాజు. ఇతడు భటుడు మొదలగు విధమున చెప్పు భేదము లెవ్వియు నిర్వికార సత్యములు కావు. నీవు సకల లోకమునకు రాజువు. నీ తండ్రికి కుమారుడవు. నీ శత్రువునకు శత్రువు. నీ భార్యకు భర్తవు. నీ కుమారునకు తండ్రిని. ఇన్ని పేర్లుండగా నిన్ను ఏ పేరుతో పిలువవలెను. ఈ శిరస్సు నువ్వా ! ఈ శిరస్సు నీదైనట్లే ఈ ఉదరము కూడ నీదే. అందుచే ఉదరము నువ్వా. ఈపాదాద్యవయవములలో ఏదైన ఒకటి నువ్వా ! కానిచో ఇవన్నియు నీవెట్లైనవి మహారాజా! నీవు ఈ అవయవముల కంటే భిన్నుడవు కావున వీటి నుండి వేరుబడి వాస్తవమున నేను ఎవరిని అని చక్కగా ఆలోచించుము.
తచ్ఛ్రుత్వోవాచ రాజాత మవధూతం ద్విజంహరిమ్.
రాజోవాచ :
శ్రేయో೭ర్థముద్యతః ప్రష్టుం కపిలర్షి మహంద్విజ | తస్యాంశః కపిలర్షేస్త్వం మత్కృతే జ్ఞానదోభువి.
జ్ఞానవీచ్యుదదేర్యస్మాద్యచ్ఛ్రేయస్తచ్చ మేవద. 39
బ్రాహ్మణ ఉవాచ :
భూయః పృచ్ఛతి కింశ్రేయః పరమార్థం నపృచ్ఛసి | శ్రేయాంస్యపరమార్థాని అసేషాణ్యవ భూపతే. 40
దేవతారాధనం కృత్వా ధన సంపత్తిమిచ్ఛతి | పుత్రానిచ్ఛతి రాజ్యంచ శ్రేయస్తసై#్యవకింనృప. 41
వివేకినస్తు సంయోగః శ్రేయో యః పరమాత్మనః | యజ్ఞాదికా క్రియానస్యాన్నాస్తి ద్రవ్యోపపత్తితా. 42
పరమార్థాత్మనోర్యోగః పరమార్థ ఇతీష్యతే | ఏకోవ్యాపీసమః శుద్ధో నిర్గుణః ప్రకృతేః పరః 43
జన్మవృద్ధ్యాదిరహిత ఆత్మాసర్వగతో೭వ్యయః | పరంజ్ఞాన మయో೭సంగీ గుణజాత్యారిభిర్విభుః. 44
నిదాఘ ఋతుసంవాదం వదామి ద్విజతంశృణు | ఋతుర్భహ్మసుతోజ్ఞానీ తచ్ఛిష్యోభూ೭త్పులస్త్యజః. 45
నిదాఘః ప్రాప్తవిద్యో೭స్మాన్నగరే వైపురేస్థితః | దేవికాయాస్తటే తంచ తర్కయామాసవై ఋతుః. 46
దివ్యేవర్ష సహస్రే೭గాన్ని దాషుమవలోకితుమ్ | నిదాఘో వైశ్వదేవాన్తే భుక్త్వాన్నం శిష్యమబ్రవీత్.
భుక్త్యన్తే తృప్తిరుత్పన్నా తుష్టిదా సా೭క్షయా యతః. 47
ఋతు రువాచ :
క్షదస్తి యస్యభుక్తే೭న్నే తుష్టిర్ర్బాహ్మణ జాయతే | నమేక్షుదభవత్తృప్తిః కస్మాత్త్వంః పరిపృచ్ఛసి. 48
క్షుత్తృష్ణే దేహధర్మాఖ్యే న మమైతే యతోద్విజ | పృష్టోహం యత్త్వయా బ్రూయాం తృప్తిరసై#్యవమేనదా.
పుమాన్సర్వగతోవ్యాపీ ఆకాశవదయం యతః | ఆతో೭హం ప్రత్యగాత్మాస్మీత్యేతదర్థేభ##వేత్కథమ్. 50
సో೭హంగన్తా న చాగన్తానైకదేశనికేతనః | త్వం చాన్యోన భ##వేన్నాపి నాన్యస్త్వత్తో೭స్మి వాప్యహమ్. 51
మృన్మయం హి గృహం యద్వన్మృదా లిప్తం స్థిరీభ##వేత్ |
పార్థివో೭యం తథాదేహః పార్థివైః పరమాణుభిః. 52
ఋతురస్మితవాచార్యః ప్రజ్ఞాదానాయతే ద్విజ | ఇహాగతో೭హం యాస్యామి పరమార్థస్తవోదితః. 53
ఏకమేవమిదం విద్ది న భేదః సకలం జగత్ | వాసుదేవాభిధేయస్య స్వరూపం పరమాత్మనః. 54
ఆ మాటలు విని ఆరాజు భగవత్స్వరూపడగు ఆ అవధూత బ్రాహ్మణునితో ఇట్లనెను. ఓ బ్రాహ్మణోత్తమా ! నేను శ్రేయస్సును కోరి కపిల మహర్షి వద్ద ఉపదేశము పొందుటకై వెళ్లుచున్నాను. నీవు కూడ కపిల మహర్షి యొక్క అంశ##వే. నాకు జ్ఞానమునిమ్ము. జ్ఞానరూపమగు మనోసాగరమును చేరుటచే శ్రేయస్సును కలుగు ఉపాయము చెప్పుము. బ్రాహ్మణుడు పలికెను. ఇంకను శ్రేయస్సే కావలెనని అడుగుచున్నావు కాని పరమార్థ తత్త్వమేమని అడుగుటలేదు. రాజా ! నీవనుకొనని శ్రేయస్సులన్నియు ఆ పరమార్థములే. మానవుడు దేవతారాధన చేసి ధన సంపత్తిని పుత్రులను రాజ్యమును పొందకోరుచున్నాడు. రాజా నీవే చెప్పుము. అదియే ఆతనికి శ్రేయస్సు, వివేకవంతనకు పరమాత్మ ప్రాప్తియే శ్రేయస్సు. యజ్ఞాది క్రియగాని ద్రవ్యసిద్ధి కాని, ఆతనికి శ్రేయస్సు కాదు. పరమాత్మ జీవాత్మల ఏకత్వమే పరమార్థము. ఏకము వ్యాపి, సమము, శుద్ధము, నిర్గుణము, ప్రకృతి అతీతము, జన్మ వృద్ధ్యాది రహితము సర్వగతము, వికార రహితము జ్ఞానమయము అసంగము గుణజాత్యాది రహితము సర్వశక్తముయైన ఆత్మయొక్క జ్ఞానమే పరమార్థము. ఇపుడు నిదాఘునకును ఋతువునకును జరిగిన సంవాదమును చెప్పెదను వినుము. బ్రహ్మసుతుడగు ఋతువు మహాజ్ఞాని. పులస్త్యనందనుడగు నిదాఘుడు ఆతనిక శిష్యుడై విద్యలను నేర్చి పిదప ''దేవికా'' నదీ తటమున ఒక నగరములో నివసించుచుండెను. ఋతువు తన శిష్యునివాసస్థానమును తెలుసుకొనెను. వెయ్యి దివ్య వర్షములు దాటిన పిమ్మట ఋతువు నిదాఘుని చూచుటకు వెళ్లెను. ఆసమయమున నిధాఘుడు వైశ్వ దేవానంతరము భుజించి తన శిష్యులతో ఇట్లు పలుకుచుండెను. ''భోజనా నంతరము నాకు తృప్తి కలిగినది. అక్షయ తృప్తి నిచ్చునది భోజనమే. ఋతువు పలికెను. ఓ బ్రాహ్మణా ! ఆకలి గొన్న వానికే భోజనానంతరము తృప్తి కలుగును. నాకెన్నడును ఆకలియే కలుగలేదు. నన్ను తృప్తిని గూర్చి ఎందుకడుగు చున్నావు. ఆకలి దప్పికలు దేహ ధర్మములుకాని, నాకు సంబంధించినవి కావు. నీవు అడిగినావు కాన చెప్పుచున్నాను. నాకు సర్వదా తృప్తి యున్నది. ఆత్మ ఆకాశమువలె సర్వవ్యాప్తము. ఆత్మయే నేను. అందుచే నీవు ఎక్కడి నుండి వచ్చుచున్నావు? అను ప్రశ్నకు అవకాశములేదు. నేను వెళ్ళు వాడను కాను. వచ్చువాడనుకాను. ఒక ప్రదేశములో వున్నవాడనుకాను. మట్టితో కట్టిన ఇల్లు మట్టి పూయుటచే గట్టినపడినట్లు ఈ పార్థివ దేహము పార్థివ పరమాణువులచే గట్టి పడుచుండును నీవు నాకంటే భిన్నుడవుకాదు. నేను నీకంటే భిన్నుడనుకాను. ఓ బ్రాహ్మణా! నేను అచార్యుడనైన ఋతువును. నీకు జ్ఞానోపదేశము చేయుటకై వచ్చితిని. ఇపుడు వెళ్లెదను, నీకు పరమార్థతత్త్వమును ఉపదేశించితిని. ఈ ప్రపంచమంతయు ఏకైక వాసుదేవనామక పరమాత్ముని స్వరూపమని తెలిసికొనుము. దీనిలో భేదము ఏ మాత్రములేదు.
ఋతుర్‌వర్షసహస్రాన్తే పునస్తన్నగరం యమౌ | నిదాఘం నగర ప్రాన్తే ఏకాన్తే స్థితమబ్రవీత్. 55
నిదాఘ ఉవాచ :
భో విప్రజనసంవాదో మహానేష సరేశ్వర | ప్రతివీక్ష్య పురం రమ్యం తేనాత్ర స్థీయతే మయా. 56
ఋతు రువాచ :
నరాధిపో೭త్ర కతమః కతమశ్చేతరోజనః | కథ్యతాం మే ద్విజశ్రేష్ఠ త్వమభిజ్ఞో ద్విజోత్తమ. 57
యో೭యం గజేంద్ర మున్మత్తమద్రిశృంగ సముత్థితమ్ | అధిరూఢో నరేంద్రో೭యం పరివార స్తథేతంః. 58
గజోయో೭యమధో బ్రహ్మన్నుపర్యేష స భూపతిః | ఋతురాజో గజః కో೭త్ర రాజా చాహనిదాఘకః 59
ఋతుర్నిదాఘ ఆరూఢో దృష్టాన్తం పశ్యవాహనమ్ | ఉపర్యహం యథా రాజా త్వ మధః కుంజరోయథా. 60
ఋతుఃప్రాహ నిదాఘం తం కతమస్త్వా మహంవదే| ఉక్తో నిదాఘస్తం నత్వా ప్రాహమేత్వం గురుర్ద్రువమ్.
నాన్యస్మాద్ద్వైత సంస్కార సంస్కృతం మానసం తథా. 61
ఋతుః ప్రాహ నిదాఘం తం బ్రహ్మజ్ఞానాయ చాగతః |
పరమార్థం సారభూత మద్వైతం దర్శితం మయా. 62
బ్రాహ్మణ ఉవాచ :
నిదాఘో೭ప్యుపదేశేన తేనాద్వైత పరో೭భవత్ | సర్వభూతాన్యభేదేన దదృశే న తదాత్మని. 63
అవావ ముక్తిం జ్ఞానాత్స తథా త్వం ముక్తిమాప్స్యసి| ఏకః సమస్తం త్వంచాహం విష్ణుః సర్వగతోయతః. 64
పీతనీలాది భేదేన యథైకం దృశ్యతే నభః | భ్రాంతి దృష్టిభిరాత్మాపి తథైకః న పృథక్ పృథక్. 65
అగ్నిరువాచ :
ముక్తింహ్య వాహ భవతో జ్ఞానసారేణ భూపతిః | సంసారాజ్ఞాన వృక్షారిజ్ఞానం బ్రహ్మేతి చింతయ. 66
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే అద్వైత బ్రహజ్ఞానం నామాశీత్యధిక త్రిశతతమో೭ధ్యాయః.
పిదవ వెయ్యి సంవత్సరముల తరువాత ఆనగరమునకు వెళ్ళిన ఋతువు నగర ప్రాంతమున ఏకాంత ప్రదేశము నందు వున్న నిదాఘుని చూచి ఇట్లనెను. నీవు ఏకాంతస్థానమున వున్నా వెందులకు నిదాఘుడు ! ఫలికెను, ఓ బ్రాహ్మణా మార్గమున ఎక్కువ జనసమ్మర్దము వున్నది. ఇపుడు రాజు సుందరమైన తన నగరములోనికి ప్రవేశించుచున్నాడు. అందుచే నేనిచ్చట అగియున్నాను. ఋతువు పలికెను. వీరిలో రాజు ఎవ్వరు? సామాన్యులెవ్వరు? నీకు తెలియును. కాన చెప్పుము, నిదాఘుడు పలికెను. మదించియున్న పర్వతశిఖర సదృశిఖర సదృశమగు గజేంద్రమును అధిష్టించియున్నవాడు నరేంద్రుడు. ఆతనిని చుట్టియున్నవారు ఇతర పరివారము. క్రిందనున్నది గజము. దానిపైననున్నవాడు రాజు. ఋతువు పలికెను. వీరిలో రాజు ఎవరు? గజము ఏది? నిదాఘుడు చెప్పెను. సరే చెప్పెదను. అని పలుకుచు నిదాఘుడు ఋతుపైకి ఎక్కి ఈ ధృష్టాంతము ద్వారా తెలుసుకొనుము. పైనున్న నేను రాజు వంటివాడను. నాక్రింద నీవు ఏనుగువలె నిలచియున్నావు, ఋతువు పలికెను. నేనెవ్వరు? నీవు ఎవ్వరవని అందును. ఈ విధముగ పలుకగనే నిధాఘుడు నమస్కరించి సత్యముగ నీవు నా గురువువు. ఏలననగా ! ఈ విధముగా అద్వైత సంస్కారసంస్కృతమగు మనస్సు కలవారు ఎవ్వరును లేరు ఋతువు పలికెను. నీకు బ్రహ్మజ్ఞానము ఉపదేశించుటకై వచ్చితిని. పరమార్థము, సారము ఐన అద్వైతమును బోధించితిని. బ్రాహ్మణుడు పలికెను. ఆ ఉపదేశముపొంది నిదాఘుడు కూడ ఆద్వైత జ్ఞాని అయ్యెను. సమస్త ప్రాణులను, తనకంటే అభిన్నములుగా చూచెను. ఆజ్ఞానమువలన ముక్తిని పొందెను. నీవు కూడ అట్లే ముక్తిని పొందెదవు. నీవు నేను ఈ సర్వజగత్తు ఆంతయు ఏకమాత్రము వ్యాపకము అగు విష్ణు స్వరూపము. ఒకే ఆకాశము పీతనీలాది భేదములతో వేర్వేరుగా కనబడునట్లు భ్రాంత దృష్టి కలవారికి ఒకే ఆత్మ వేర్వేరు వేరుగ కన్పట్టును. అగ్ని దేవుడు పలికెను. ఆరాజు ఈ జ్ఞానసారమును పొంది సంసారమునుండి ముక్తిపొందెను. అజ్ఞాన మయమగు సంసార వృక్షమునకు బ్రహ్మ జ్ఞానమే ఖడ్గము అని నిరంతరము చింతనము చేయుము.
అగ్ని మహాపురాణమున అద్వైత బ్రహ్మ విజ్ఞానమను మూడు వందల ఎనుబదవ అధ్యాయము సమాప్తము.