Sri Scanda Mahapuranamu-3    Chapters   

ద్వితీయ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

పృథ్వీ పురం ధ్య్రాః తిలకం లలాటే | లక్ష్మీలతాయాః స్ఫుటమాలవాలం

వాగ్దేవతాయాః జలకేలిరమ్యం | నోహెరకం సంప్రతి వర్ణయామి || 1 ||

సాధువృష్టం త్వయారాజన్‌ వారాణస్యథికాధికం | ధర్మారణ్యం నృపశ్రేష్ఠ శృణుష్వావహితో భృశం || 2 ||

సర్వతీర్థాని తత్రైవ ఊషరంతేన కథ్యతే | బ్రహ్మావిష్ణు మహెశాద్యైః ఇంద్రాద్యైః పరిసేవితం || 3 ||

లోకపాలైశ్చదిక్పాలైః మాతృభిః శివశక్తిభిః | గంధర్వై శ్చాప్సరోభిశ్చ సేవితం యజ్ఞకర్మభిః || 4 ||

భూతవేతాల శాకినీ గ్రహదేవాధిదేవతైః | ఋతుభిః మానవక్షైశ్చ సేవ్య మానం సురాసురైః || 5 ||

తదాద్యంచ నృపస్థానం సర్వసౌఖ్యప్రదం తథా | యజ్ఞైశ్చ బహుభిశ్చైవ సేవితం మునిసత్తమైః || 6 ||

సింహావ్యాఘ్రైః ద్విపైశ్చైవ పక్షిభిః వివిధైస్తథా | గోమహిష్యాదిభిశ్చైవ సారసైః మృగసూకరైః || 7 ||

సేవితం నృపశార్దూల శ్వాపదైః వివిధైరపి | తత్రయేనిధనం ప్రాప్తాః పక్షిణః కీటకాదయః || 8 ||

పశవః శ్వాపదాశ్చైవ జలస్థల చరాశ్చయే | శేచరా భూచరాశ్చైవ డాకిన్యో రాక్షసాస్తథా || 9 ||

ఏ కోత్తర శ##తైః సార్థం ముక్తిస్తేషాం హిశాశ్వతీ | తేనర్వే విష్ణులోకాంశ్చ ప్రయాంత్యేవన సంశయః || 10 ||

సంతారయతి పూర్వజ్ఞాన్‌ దశాపూర్వాన్‌ దశాపరాన్‌ | యవవ్రీహితిలైః సర్పిః బిల్వ వత్రైశ్చ దూర్వయా || 11 ||

గుడైశ్చైవోదకైర్నాథ తత్ర పిండం కరోతియః | ఉద్ధరేత్సప్తగోత్రాణి కులమే కోత్తరం శతం || 12 ||

వృక్షైరనేకధా యుక్తం లతాగుల్మైః సుశోభితం | సదాపుణ్యప్రదం తచ్చసదాఫల సమన్వితం || 13 ||

నిర్వైరం నిర్భయం చైవ ధర్మారణ్యంచ భూపతే | గోవ్యాఘ్రైః క్రీడ్య తేతత్ర తథా మార్జారమూషకైః || 14 ||

భేకో7హినా క్రీడతేచ మానుషా రాక్షసైః సహ | నిర్భయంవసతేతత్ర ధర్మారణ్యంచభూతలే || 15 ||

మహానంద మయం దివ్యం పాపనాత్పావనం వరం | కలకంఠఃకలోత్కంఠం అనుగుంజతికుంజగః || 16 ||

ధ్యానస్థః శ్రోష్యతి తదాపారా వత్యేతి వార్యతే | కేకః కోకీం పరిత్యజ్య మౌనంతిష్ఠతి తద్భయాత్‌ || 17 ||

చకోరశ్చంద్రికాభోక్తా నక్తవ్రతవిమాస్థితః | పఠంతి సారికాః సారం శుకం సంబోధయ త్యహో || 18 ||

అపార వారసంసార సింధుపార ప్రదః శివః | ఆలస్యేనాపియో యాయాత్‌ గృహాద్ధర్మ వనం ప్రతి || 19 ||

అశ్వమేధాధికో ధర్మః తస్యస్యాచ్చ పదపదే | శాపానుగ్రహ సంయుక్తా బ్రాహ్మణాస్తత్రసంతివై || 20 ||

అష్టాదశ సహస్రాణి పుణ్యకార్యేషు నిర్మితాః | షట్‌ త్రింశత్తు సహస్రాణి భృత్యాస్తే వణిజోభువి || 21 ||

ద్విజభక్తి సమాయుక్తా బ్రహ్మణ్యాస్తే త్వయోనిజాః పురాణ జ్ఞాః సదాచారాః ధార్మికాః శుద్ధబుద్ధయః స్వర్గే దేవాః ప్రశంసంతి ధర్మారణ్యనివాసినః || 22 ||

తా || వ్యాసుని వచనము - భూదేవత కు లలాట మందు తిలకము, లక్ష్మి అనే తీగకు చక్కని ఆలవాలము (పాదు) వాగ్దేవత జలకేళికి రమ్యమైన దేశము అట్టి దానిని ఇప్పుడు ఏమీ దాచకుండా వర్ణిస్తాను (1) ఓరాజా! నీవు బాగా అడిగావు. వారణాసి కంటె అధికాధికమైనది, ధర్మారణ్యము. ఓరాజ శ్రేష్ఠ. మిక్కిలి శ్రద్ధగా విను (2) అన్ని తీర్థములు అక్కడే ఉన్నాయి. అందువల్ల ఊషరం అనబడుతుంది. బ్రహ్మవిష్ణు శివుడు మొదలగు వారితో ఇంద్రాదులతో సేవించబడుతోంది. (3) లోకపాలురతో, దిక్పాలురతో మాతలతో శివశక్తులతో గంధర్వులతో అప్సరసలతో యజ్ఞకర్మలతో సేవించబడేది (4) భూతవేతాల శాకిని గ్రహదేవ, అధి దేవతలతో ఋతు మాస పక్షములతో సుర అసురులతో సేవించబడేది. (5) ఓ నృప! అది ఆదిస్థానము అట్లాగే అన్ని సౌఖ్యములనిచ్చేది. అనేక యజ్ఞములతో ముని సత్తములతో, సేవింపబడేది (6) సింహ వ్యాఘ్రములతో ఏనుగులతో అట్లాగే రకరకాల పక్షులతో, గోమహిష్యాదులతో సారసములతో (పక్షి) మృగసూకరములతో (7) సేవించబడేది. ఓ నృపశార్దూల ! రకరకాల మృగములతో కూడినది. ఇక్కడ మరణించిన పక్షులు కీటకాదులు (8) పశువులు, వ్యాఘ్రములు, జలచరములు, స్థలచరములు ఖేచరములు, భూచరములు, డాకినులు, అట్లాగే రాక్షసులు (9) వీటన్నిటికి నూటొక్కటితోకూడి (తరములు) శాశ్వతమైన ముక్తి లభిస్తుంది. అవన్నీ విష్ణులోకమునకు వెళుతాయి. అనుమానము లేదు (10) పూర్వజ్ఞులైన పదిమంది పూర్వులను పదిమంది అపరమైన వారిని తరింపజేస్తుంది. యవలు, వడ్లు, నువ్వులు, నేయి, బిల్వపత్రములు, దూర్వ (11) బెల్లము నీరు వీటితో అక్కడ పిండము చేసిన వారు, ఓనాథ! వారు సప్తగోత్రములను ఉద్ధరిస్తారు. ఏ కోత్తరశతము కులమును ఉద్ధరిస్తారు (12) అనేక విధములగు వృక్షములతో కూడినది, లతలు పొదలతో సుశోభితము ఎల్లప్పుడు పుణ్యమునిచ్చేది. అది ఎల్లప్పుడు ఫలములతో కూడినట్టిది (13) ఆధర్మారణ్యము, ఓ భూపతి ! వైరము లేనట్టిది. భయరహితమైనది. గోవ్యాఘ్రములు క్రీడిస్తాయి. అట్లాగే మార్జార మూషకములు కలసి ఆడుకుంటాయి (14) కప్ప పాముతో ఆడుతుంది. మనుషులు రాక్షసులతో ఆడుతారు. ఈభూమిపై ధర్మారణ్యము నిర్భయముగా ఉంది. (15) మహాఆనందమయమైనది, దివ్యమైనది పావనమైనదానికన్నపరమపావనమైనది. కుంజములలోఉండికోకిలఅవ్యక్తమధురముగా గొంతెత్తి అరుస్తోంది. (16) అప్పుడు పావురము ధ్యానమందున్నవారువింటారనివారిస్తోంది. అభయంతో, నెమలి, ఆడనెమలిని వదలిమౌనంగాఉంటోంది. (17) వెన్నెలనుభుజించే చకోరమునక్తవ్రతమువలె ఉంది. గోరువంకలు సారంచదువుతున్నాయి. చిలుకనుసంభోదిస్తున్నాయి. (18) దరిలేని సంసారసింధువునపారమును అంది ఇవ్వగల్గువాడు శివుడుఅని. ఆలస్యంగానైనా గృహంనుండి ధర్మవనానికి వెళ్ళినవానికి (19) అశ్వమేధముకన్నఅధికమైనధర్ముఅతనికిఅడుగడుగునవస్తుంది. శాప, అనుగ్రహములు ఇవ్వగల సమర్ధ బ్రాహ్మణులు అక్కడున్నారు. (2) పద్దెనిమిదివేలమంది ఆపుణ్యకార్యమందు ఉంచబడినారు. ముప్పదిఆరువేల మంది భృత్యులున్నారు. వారువణిజులుఈలోకంలో (21) బ్రాహ్మణభక్తికలిగినవారు బ్రాహ్మణహితముకోరేవారు, వారు అమో నిజులు. పురాణమునెరిగివారు. సదాచారసంపన్నులు, ధార్మికులు, శుద్దమైన బుద్ధికలవారు, ధర్మారణ్యమందు నివసించేవారిని స్వర్గమందుదేవతలుప్రశంసిస్తున్నారు (22).

మూ || యుధిష్ఠిర ఉవాచ -

ధర్మారణ్యతి త్రిదశైః కదానామప్రతిష్ఠితం - పావనం భూతలేజాతం కస్మాత్తేనవి నిర్మితం || 23 ||

తీర్థభూతం హికస్మాచ్చ కారణాత్తద్వదస్వమే | బ్రాహ్మణాః కతిసంఖ్యాకాః కేనవైస్థాపితాః పురా || 24 ||

అష్టాదశ సహస్రాణి కిమర్థం స్థాపితానివై | కస్మిన్వంశే సముత్పన్నా బ్రాహ్మణా బ్రహ్మసత్తమాః || 25 ||

సర్వవిద్యాసునిష్ణాతాః వేదవేదాంగపారగాః | ఋగ్వేదేషుచ నిష్ణాతా యజుర్వేద కృతశ్రమాః || 26 ||

సామవేదాంగ పారజ్ఞాః త్రైవిద్యా ధర్మవిత్తమాః | తపోనిష్ఠాః శుభాచారాః సత్యవ్రతపరాయణాః || 27 ||

మాసోవవాసైః కృశితాః తథాచాంద్రాయణాదిభిః | సదాచారాశ్చ బ్రహ్మణ్యాః కేననిత్యోవ జీవినః తత్సర్వమాదితః కృత్స్నం బ్రూహిమే వదతాం వర

దానవాస్తత్రదైతేయాః భూతవేతాల సంభవాః రాక్షసాశ్చ పిశాచాశ్చ ఉద్వేజంతే కథం సతాన్‌ || 29 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వార్థే ధర్మారణ్య మాహాత్మ్యే యుధిష్ఠిర ప్రశ్న వర్ణనం నామ ద్వితీయో7ధ్యాయః || 2 ||

తా || యుథిష్ఠురుని వచనము - దేవతలు ధర్మారణ్యమనే పేరును ఎప్పుడు ఎందువల్ల ఈ భూమిపై పావనమైంది. పావనమనికదా నిర్మించారు (23) ఎందువల్ల ఏ కారణంవల్ల తీర్థభూతమైనదో (స్థానము) దానిని నాకు చెప్పండి. ఎంతమంది బ్రాహ్మణులు ఏ కారణముగా అక్కడ ఉంచబడ్డారు ఎవరుంచారు (24) పద్దెనిమిది వేల మందిని ఎందుకుంచారు. బ్రహ్మసత్తములైన ఆ బ్రాహ్మణులు ఏవంశమందు జన్మించారు (25) అన్ని విద్యలలో నిష్ణాతులు, వేద వేదాంగ పారగులు, ఋగ్వేదమందు నిష్ణాతులు, యజుర్వేద మందు శ్రమించినవారు (26) సామవేదాంగ పారము ఎరిగినవారు, వేదముల నెరిగిన ధర్మసత్తములు, తపోనిష్ఠులు, శుభాచారులు, సత్యవ్రత పరాయణులు (27) మాసోవ వాసములతో, చాంద్రాయణాదులతో కృశించినవారు, సదాచారులు, బ్రాహ్మణహితులు ఏ కారణంగా (ఎవరిచే) భృత్యులైనారు. చెప్పేవారిలో ఉత్తముడ! అదంత సంపూర్ణముగా మొదటి నుండి నాకు చెప్పండి (28) దానవులు, దైతేయులు, భూత వేతాళ సంభవులు, రాక్షసులు, పిశాచులు వారినెందుకు ఎందుకు వేధించలేదు (29) అని శ్రీ స్కాంద మహా పురాణ మందు ఏకాశీతిసహస్ర సంహితయందు, తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వార్ధమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు యుధిష్ఠిర ప్రశ్నవర్ణన మనునది ద్వితీయ అధ్యాయము || 2 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters