Sri Scanda Mahapuranamu-3
Chapters
నలుబదవ అధ్యాయము మూ || నారద ఉవాచ - జ్ఞాతి భేదేతు సంజాతే తస్మిన్ మోహేరకే పురే | త్రైవిద్యైః కింకృతం బ్రహ్మన్
తస్మమా చక్ష్వపృచ్ఛతః || 1 || బ్రహ్మోవాచ - స్వస్థానే వాడవాః సర్వేహర్షనిర్భరమానసాః | అగ్నిహోత్ర పరాఃకే7పి కే7పి యజ్ఞపరాయణాః || 2 || కే7పి చాగ్ని సమాధానాఃకే7పి స్మార్తా నిరంతరం | పురాణ న్యాయవేత్తారో వేదవేదాంగవాదినః || 3 || సుఖేన స్వాన్ సదాచారాన్ కుర్వంతో బ్రహ్మవాదినః | ఏవంధర్మసమాచారాన్ కుర్వతాం కుశలాత్మనాం || 4 || స్థానాచారాన్ కులాచారాన్ అధిదేవ్యాశ్చ భాషితాన్ | ధర్మశాస్త్ర స్థితం సర్వం కాజేశైరు దితంచయత్ || 5 || పరం పరాగతం ధర్మమూచుస్తే వాడవోత్తమాః || 6 || బ్రాహ్మణా ఊచుః - ఉపాస్తే యశ్చలిఖితం రక్తపాదైస్తు వాడవాః | జ్ఞాతిశ్రేష్ఠః సవిజ్ఞేయో బలిర్దేయస్తతః పరం || 7 || రక్త చందనం ప్రసాధ్యాధ ప్రసిద్థం స్వకులంతథా | కుంకుమారక్త పాదైసై#్తః గంధ పుష్పాది చర్చితైః || 8 || సంభూయ లిఖితం తచ్చరక్తపాదం తదుచ్యతే | రామస్యలేఖ్యంతే సర్వే పూజయంతు సమాహితాః || 9 || రామస్యకరముద్రాంచ పూజయందు ద్విజాన్సదా | యేసాందోషాం సదాచారే వ్యభిచారా దయోయది || 10 || తేషాం దండో విధేయస్తుయ ఉక్తోవిధివద్ద్విజైః చిహ్నంస రామముద్రాయాః యావద్దండందదాతిన || 11 || వినాదండ ప్రదానేన ముద్రా చిహ్నం సధార్యతే | ముద్రాహస్తాశ్చ విజ్ఞేయా వాడవానృపసత్తమ || 12 || పుత్రేజాతేపితా దద్యాత్ శ్రీమాత్రేతు బలింసదా | పలాని వంశతిః సర్పిః గుడః పంచ పలానిచ || 13 || కుంకుమాది భిరభ్యర్చ్య జాతమాత్రః సుతస్తదా | షష్ఠేచదివసే రాజన్ షష్ఠీం పూజయతే సదా || 14 || దద్యాత్యత్ర బలింసాజ్యం కుర్యాద్ధి బలిపంచకం | పంచప్రస్థాన్బలీన్ దద్యాత్ సవస్త్రాన్ శ్రీఫలైర్యుతాన్ || 15 || కుంకుమాది భిరభ్యర్చ్య శ్రీమాత్రే భక్తి పూర్వకం | విత్తశాఠ్యంస కుర్వీత కులే సంతతి వృద్ధయే || 16 || తద్థిచార్పయ తాద్రవ్యం వృద్ధ్రౌయద్థ్రీణితం పునః | జన్మనోనంతరం కార్యం జాతకర్మయథావిధి || 17 || విప్రాను కీర్తితా యా7త్ర వృత్తిః సాపి విభజ్యతే | ప్రథమాలభ్యమానాచ వృత్తిర్వైయా పతీపునః || 18 || తస్యావృత్తే రర్థభాగోగోత్రదేవ్యైతుకల్ప్యతాం | ద్విగుణం వణిజాచైవ పుత్రజాతే భ##వేదితి || 19 || మాండలీయాశ్చయే శూద్రాః తేషా మర్కకరంత్విదం | అడాల జానాంత్రి గుణం గోభుజానాంచతుర్గుణం || 20 || ఇత్యేతత్ కథితం సర్వంఅన్యచ్చశూద్రజాతిషుయస్యదోషన్తు హత్యాయాః సముద్భూతో విధేర్వశాత్ || 21 || దండస్తువిధి వత్తస్య కర్తవో వేదశాస్త్రిభిః అన్యాయో న్యాయవాదీస్యాత్ నిర్దోషేదోష దాయకః || 22 || పంక్తిభేదస్య కర్తాచ గోసహస్ర వధః స్మృతః వృత్తి భాగవిభజనం తథాన్యాయవిచారణం శ్రీరామ దూత కస్యాగ్రే కర్తవ్యమితి నిశ్చయః || 23 || తా || నారదుడిట్లన్నాడు - ఆమోహెరకపురమందు జ్ఞాతిభేదం సంభవిస్తే త్రైవిద్యులు ఏంచేశారో ఓబ్రహ్మ! నాకు చెప్పండి (1) అనగా బ్రహ్మిఇట్లన్నాడు - తమ స్థానమందు బాడబులంతా హర్షంతో నిండిన మనస్సు గలవారై కొందరు అగ్నిహోత్ర పరులైనారు. కొందరు యజ్ఞపరులైనారు (2) కొందరు అగ్ని సమాధానులైనారు. కొందరెల్లప్పుడు స్మృతి పరాయణులైనారు. పురాణ, న్యాయవేత్తలు, వేద వేదాంగవాదులు (3) సుఖంగా, తమ సదాచారములను ఆచరిస్తున్నారు. బ్రహ్మవాదులు ఈ విథముగా ధర్మమాచరిస్తున్న కుశలాత్ముజులైన వారు వారు (4) స్థానమందలి ఆచారములను అధి దేవిమాటలన, ధర్మశాస్త్రములందున్న దంతా కాజేశులు చెప్పిందంతా (5) పరంపరగా వచ్చిన ధర్మమంతా ఆ బాడబులు చెప్పారు (6) బ్రాహ్మణులిట్లన్నారు - రక్తపాదములతో వ్రాసినదానిని ఉపాసించే బ్రాహ్మణులు జాతిశ్రేష్ఠులు. వారికి బలి ఇవ్వాలి (కానుక) (7) రక్తచందనాన్ని సంపాదించి (కూర్చి) ఆకులము ప్రసిద్ధమైంది. కుంకుమతో కాళ్ళంతా ఎర్రబడి గంధపుష్పాదులతో అలంకరింపబడి (8) అంతా కలిసి వ్రాయబడిందది అదే రక్తపాదమన బడుతోంది. రాముని వ్రాతను వారంతా చిత్తశుద్ధితో పూజించని (9) ద్విజులు ఎల్లప్పుడు రాముని కరముద్రను పూజించని సదాచారమందు ఎవరు దోషులైతే, వ్యభిచారాదులు ఉంటే (10) వారిని దండించాలి అని విధి ప్రకారము ద్విజులు చెప్పారు. దండము ఇవ్వకుండా రామముద్ర చిహ్నం ధరించరాదు (11) ముద్రాహస్తులను బాడబులని గుర్తించాలి. (12) కొడుకుపుడ్తే తండ్రి శ్రీ మాత కొరకు కానుకలివ్వాలి. నేయివింశతి ఫలములు, బెల్లము, ఐదువలములు (13) కొడుకు కలగగానే కుంకుమాదులతో అర్చించాలి. ఆరవ రోజున షష్ఠిని పూజించాలి (14) అక్కడ నేయితో కూడా బలిఇవ్వాలి. వస్త్రములతో శ్రీ ఫలములతో కూడి (మారేడు) ఇవ్వాలి (15) కుంకుమాదులతో అర్చించి శ్రీమాతకు భక్తితో ఇవ్వాలి. డబ్బు లోభము చేయరాదు.కులంలో సంతతి వృద్ధి చెందాంలంటే చేయాలి (16) ఆ ద్రవ్యాన్ని అర్పించాలి. వృద్ధి యందు సిగ్గుచెంది తిరిగి ఇవ్వాలి. జన్మ యొక్క అనంతరమైన కార్యము జాతకర్మ యధావిధి చేయాలి (17) విప్రులచే అనుసరింపబడే వృత్తిని కూడా విభజిస్తున్నాము. మొదట వృత్తివల్ల లభించేది ఎంత ఉందో (18) ఆ వృత్తిలోని అర్థభాగాన్ని గోత్రదేవికి అర్పించాలి. వణిజులైతే వారికి పుత్రుడు కల్గితే రెండింతలు దేవికి అర్పించాలి (19) మాండలీయులైన శూద్రలు వేయింతలు అర్పించాలి. అడాలజులు మూడింతలు గోభుజులు నాల్గింతలు అర్పించాలి (20) అని ఇట్లా చెప్పబడింది. ఇతరమైనది శూద్ర జాతులలో (అర్పించాలి) విధి వశంవల్ల హత్యాదోషము ఎవనికైనా కల్గితే (21) వేదశాస్త్ర విదులు అతనికి విధిగా దండము విధించాలి. తప్పులేని వానిని దండిస్తే న్యాయవాది అన్యాయవాడౌతాడు. (22) పంక్తిభేధాన్ని ఆచరించేవాడు వేయి గోవులన చంపిన వాడౌతాడు. వృత్తిభాగ విభజన న్యాయవిచారణ శ్రీరామదూత యొక్కముందర ఆచరించాలి. అని నిశ్చయము (23). మూ || తస్యపూజాం ప్రకుర్వీత తదాకాలో7థవాసదా | తైలేన లేవయేత్తస్య దేహెవై విఘ్నశాంతయే || 24 || ధూపందీపం ఫలందద్యాత్ పుషై#్పః నానావిదైఃకిల | పూజితో హనుమానే వదదాతి తస్యవాంఛితం || 25 || ప్రతిపుత్రంతుత స్యాగ్రే కుర్యాన్నాన్యత్ర కుత్రచిత్ | శ్రీమాతాప కులస్వామి భాగధేయంతు పూర్వతః || 26 || పశ్చాత్ ప్రతిగ్రహం విపై#్రః కర్తవ్యమితి నిశ్చితం | సమాగమేషు విప్రాణాం న్యాయాన్యాయ వినిర్ణయే || 27 || నిర్ణయి హృదయేధృత్వా తత్రస్థం శ్రాపయేద్ద్విజాన్ | కేవలం ధర్మబుద్థ్యాచ పక్షపాతం వివర్జయేత్ || 28 || సర్వేషాం సమ్మతం కార్యం తద్ధ్యవికృతమేవచ | ఆకారితస్తతో విప్రః సభాయాం భయమేతి చేత్ || 29 || సతస్య వాక్యం శ్రోతవ్యం నిర్జీతార్థని వారణ | యస్యవర్జస్తు క్రియతేమిలిత్వా సర్వవాడవైః || 30 || ఖానపానాది కంసర్వం కార్యంతేన వివర్జయేత్ | తస్య కన్యా సదాతవ్యాతత్సం సర్గీచ తాదృశః || 31 || తతోదండం ప్రకుర్వీత సర్వైరేవద్విజోత్తమైః | భోజనం కన్యకా దానమితి దాశరథేర్మతం || 32 || యత్కించి త్కురుతే పాపం లబ్థుంస్థలమధాపివా | శుష్కార్ద్రం వనతే చాన్నే తస్మాదన్నం పరిత్యజేత్ || 33 || కుర్వంస్తత్సావ భాగీస్యాత్త స్యందండోయధావిధి | నాన్యంస పశ్యతే యస్తు శక్తౌ సత్యాం సదాయతః || 34 || పాపభాగీ సవిజ్ఞేయ ఇతి సత్యంస సంశయః | ఉత్కోచం యస్తు గృహ్ణాతి పాపినాం దుష్టకర్మిణాం సకలంచ భ##వేత్త న్యపాపంనైవాత్ర సంశయః || 35 || తస్యాన్నంగృహ్యంతే నైవ కన్యాపిన కదాచన | హితమాచరతేయస్తు పుత్రాణా మపివైనరః || 36 || న ఏతాన్నియమాన్ సర్వాన్ పాలయేన్నాత్ర సంశయః | ఏవంపత్రం లిఖిత్వా తువాడవాస్తే ప్రహర్షితాః || 37 || ప్రాప్తేకలియుగే ఘోరే యథాపాపం సకుర్వతే | ఇతి జ్ఞాత్వాతు సర్వేతే న్యాయధర్మం ప్రచక్రిరే || 38 || వ్యాస ఉవాచ - కలౌప్రాప్తే ద్విజా న్సర్వే స్థాన భ్రష్టాయతస్తతః | పక్షముత్కలం గ్రహీష్యంతి తధాన్యుః పక్షపాతినః || 39 || భోక్ష్యంతే వ్లుెచ్ఛకగ్రామాన్ కోలావిధ్వంసిభిః కిల | వేదభ్రష్టాశ్చతే విప్రాభవిష్యంతి కలౌయుగే || 40 || తా || అతనికి పూజ చేయాలి, ఆ సమయంలో లేదా ఎల్లప్పుడూ విఘ్నశాంతి కొరకు అతని దేహానికి నూనె పూయలి (24) నానివిధపుష్పములు ధూపదీప ఫలములు ఇవ్వాలి. పూజిస్తే హనుమంతుడే ఆతని కోరికలు నెరవేరుస్తాడు (25) ప్రతిపుత్రుని ఆతని ఎదుటనే ఉంచాలి. ఇతరత్రకాదు మొదట శ్రీమాత, వకుళ స్వాములకు భాగం ఇవ్వాలి (26) పిదపనే విప్రులు గ్రహించాలి, అని నిశ్చయము. విప్రులు ఒక దగ్గరచేరాక న్యాయాన్యాయ విచారణలో (27) మొదట నిర్ణయాన్ని మనసులో ధృవ పరచుకొని పిదప అక్కడున్న బ్రాహ్మణులకు విన్పించాలి. కేవలము ధర్మబుద్ధితో నిర్ణయం చేయాలి. పక్షపాతముండరాదు. (28) అందరికి సమ్మతమైన కార్యము వికృతం చేయదు. నిర్ణయంచేసి విప్రుడు సభలో భయపడేట్టయితే (29) ఆతడు చెప్పినదాన్ని కాదనవచ్చు. ఆతని మాటను వినరాదు. నిరాకరించిన దానిని నిర్ణయిస్తే బాడబులంతా కలిసి (30) ఆతనితో భోజన పానాదులు అన్ని బహిష్కరించాలి. ఆతనికి పిల్లనివ్వరాదు. ఆతని సహవాసికూడా అలాంటివాడే (31) అందరు బ్రాహ్మణులు కలిసి ఆతనిని దండించాలి. భోజనము, కన్యకాదానము చేయకుండుటే దండన అని దాశరథి మతము (32) స్థలము కాని మరొకటి కాని పొందటానికి ఏదైనా పాపంచేస్తే అది వట్టి తడిగానే అన్నంలో ఉంటుంది. కనుక అన్నాన్ని వదలాలి (33) అట్లాచేస్తే ఆ పాపమునకు భాగస్వామి ఔతాడు. దానికి దండము శాస్త్ర ప్రకారమే. శక్తి ఉండికూడా ఎల్లప్పుడూ న్యాయమాచరించని వాడు (34) పాపభాగిఔతాడు. ఇది సత్యము అనుమానంలేదు. దుష్టకర్మల నుండి, పాపుల నుండి లంచం తీసుకొన్నవాడు ఆ పాపాన్నంతా పొందుతాడు. ఇందులో అనుమానంలేదు. (35) ఆతని అన్నాన్ని తీసుకోరాదు. ఆతని కన్యను స్వీకరించరాదు. పుత్రులకు కూడా ఎవడు హితమాచరిస్తాడో (36) ఆ నరుడు ఈ నియమములన్నిటిని పాలించాలి అనుమానంలేదు. అని ఈ విధముగా ఆ బాడబులు పత్రము వ్రాసుకొని ఎంతో ఆనందించారు (37) ఘోరమైన కలియుగంవస్తే పాపం చేయకుండా చేశారు. అని తెలుసుకొని వారంతా న్యాయధర్మములను ఆచరించారు (38) వ్యాసుని వచనమిట్లా - కలియుగంవస్తే బ్రాహ్మణులంతా ఇటునటు స్థాన భ్రష్టులౌతారు. అన్యాయపు పక్షాన్ని వహిస్తారు. పక్షపాతం వహిస్తారు (39) పందిని వేటాడే వాళ్ళతో వ్లుెచ్ఛ గ్రామములలో భుజిస్తారు. కలియుగంలో వారు వేదభ్రష్టులౌతారు (40). మూ || యుధిష్ఠిర ఉవాచ - దేశేదేశే గమిష్యంతి తేవిప్రావణిజస్తథా | కథంవైజ్ఞాయతే సర్వైః కేనచిహ్నే%్నేన మారిష || 41 || యస్మిన్ గోత్రే సముత్పన్న వాడవాయే మహాబలాః || 42 || వ్యాస ఉవాచ - జ్ఞాయతే గోత్ర సంజ్ఞా7థ కేచిచ్చైవ పరాక్రమైః | యస్యయస్యచ యత్కర్మ తస్యతస్యావటం కకః || 43 || అవటంకైర్హిజ్ఞాయంతే నాన్యధాజ్ఞాయతేక్వచిత్ | గోత్రైశచప్రవరైశ్చైవఅవటంకైఃనృపాత్మజ || 44 || జ్ఞాయంతేహిద్విజారాజన్మోఢబ్రాహ్మణసత్తమాః || 45 || యుధిష్ఠిర ఉవాచ - గోత్రైశ్చప్రవర్తెశ్త్చెవశ్రుతాఏతేతవాసనాత్ | కాంవాశాఖామధీయానాస్తన్మేబ్రూహిపితామహ || 46 || వ్యాస ఉవాచ - జ్ఞాయంతేయత్రయస్థామాధ్యయందినీయామహబలాః | కౌథమీంచసమాశ్రిత్యకేచి ద్విప్రాగుణాన్వితాః || 47 || ఋగథర్వణజాశఖానష్టాసాచమహామతే | ఏవంవైవర్తమానాస్తేవాడవాధర్మసంభవాః || 48 || ధర్మారణ్యమహాభాగాఃపుత్రపౌత్రాన్వితా7భవన్ | శూద్రాఃసర్వేహహాభాగాఃపుత్రపౌత్రసమావృతాః || 49 || ధర్మారణ్యమహాతీర్థేసర్వేతేద్విజసేవకాః | అభవన్రామభక్తాశ్చరామాజ్ఞాంపాలయంతిచ || 50 || ఆజ్ఞామత్యా7దరేణహ హనుమంతశ్చవీర్యవాన్ | పాలయేత్సో7పిచేదానీంసంప్రాస్తేవైకలౌయుగే || 51 || అదృష్టరూపీహనుమాంస్తత్రభ్రమతినిత్యశః | త్రైవిద్యావాడవాయత్రచాతుర్విద్యాస్తదైవచ || 52 || సభాయాముపవిష్టాయే7న్యాయాత్పావంప్రకుర్వతే | జయోహిన్యాయకర్త ణాంఅజయో7న్యాయకారిణాం || 53 || సాపరాధేయస్తుపుత్రేతాతేభ్రాతరిచాపివా | పక్షపాతంపరకుర్వీతతస్యకుప్యతివాయుజః || 54 || కుపితోహనుమానేషధననాశంకరోతివై | పుత్రనాశంకరోత్యేవధామనాశంతదైవచ || 55 || సేవార్థంనిర్మితః శూద్రోనవిప్రాన్పరిషేవతే | వృత్తింవానదదాత్యేవహానుమాంస్తస్యకుప్యతి || 56 || అర్థనాశంపుత్రనాశంస్థాననాశంమహాభయం | కురుతేవాయుపుత్రోహిరామవాక్యమనుస్మరన్ || 57 || యత్రకుత్రస్థితావిప్రాఃశూద్రావానృపసత్తమ | ననిర్థనాభ##వేయుస్తేప్రసాదాద్రాఘవన్యచ || 58 || యోమూఢశ్చావ్యధర్మాత్మాపాపపాషండమాశ్రితః | నిజాన్విప్రాన్పరిత్యజ్యపరజ్ఞాతీంశ్చమన్యతే || 59 || తస్యపూర్వకృతంపుణ్యంభస్మీభవతినాన్యధా | అన్యేషాందీయతేదానంస్వల్పంవాయదివాబహు || 60 || యథాభవతివైపూర్వంబ్రహ్మవిష్ణుశివైఃకృతా | తస్యదేవానగృహ్ణంతిహవ్యంకవ్యంచపూర్వజాః || 61 || తా || అను - యుధిష్ఠిరునివచనము - ఆపణిజులు, విప్రులుదేశ##దేశములకువెళ్తారు. మారిష ! వారుఏచిహ్నములతో గుర్తింపబడుతారు (41) వీరు ఏ గోత్రమందుజన్మించారు. ఏ బాడబులు మహాబలులు అని ఎట్లాతెలుస్తుంది. అని అనగా (42) వ్యాసునివచనము - పరాక్రమముతోవారిగోత్రసంజ్ఞతెలుస్తుంది. ఎవడెవడు ఏపనిచేసున్నాడోఅదివానికి గుర్తు. (43) అవటంకములతోనేవారినిగుర్తిస్తాము. మరోవిధంగాగుర్తించలేము. గోత్రలతో, ప్రవరలతోఅవటంకములతో గుర్తిస్తాము. ఓ రాజ (44) మోఢబ్రాహ్మణసత్తముల ద్విజులు గుర్తింపబడుతారు. ఓ రాజ, అని అనగా (45) యుధిష్ఠిరుని వచనము - వీరిగోత్రములనుప్రవరలనుమీముఖంనుండివిన్నాము. వీరు ఏ శాఖలకుచెందినవారో (చదివేవారో) దానిని నాకు చెప్పండి. ఓ పితామహఅని అనగా (46) వ్యాసునివచనము - అక్కడక్కడ ఉన్నవారు మాధ్యందినీయులు మహాబలు లని తెలుసుకో. దర్భలనాశ్రయించికొందరు విప్రులుగుణవంతులున్నారు. (47) ఋక్అధర్వణలకు చెందినశాఖలవారు నష్టమైనారు. ఈ విధముగా ధర్మసంభవులైనబాడబులు ఉంటున్నారు. (48) ధర్మారణ్యమందున్న బాడబులు పుత్రపౌత్రాన్వి తులైనారు. శూద్రులందరుమహాభాగులుపుత్రులుపౌత్రులుకలవానారు. (49) ధర్మారణ్యమహాతీర్థమందు వారంతాద్విజసేవకులైనారు. రామాజ్ఞనుపాలిస్తున్నారు (50) ఆజ్ఞయందలిఆదరముచే వీర్యవంతుడైనహనుమంతుడుకూడాకలియుగంవస్తే ఆజ్ఞను పాలించాలి (51) హనుమంతుడు అక్కడప్రతిరోజు అదృష్టరూపంతో భ్రమిస్తున్నాడు. త్రైవిద్యులు, చాతుర్విద్యులు బాడబులున్నచోట ఉన్నాడు. (52) సభయందుకూర్చున్నవార అన్యాయంతో పాపంచేస్తే న్యాకకర్తలకుజయము అన్యాయ కారులకుఅపజయముకల్గుతుంది. (53) కొడుకు, తండ్రి, భ్రాతలుఎవరైనాఅపరాధంచేస్తేవారిపైపక్షపాతంచూపితే వానిపై వాయుజుడుకోపగిస్తాడు (54) హనుమంతుడు కోపగిస్తేధననాశంకల్గిస్తాడు. పుత్రనాశముచేస్తాడు. అట్లాగేస్థాననాశముకూడా చేస్తాడు. (55) సేవకొరకునిర్మింపబడిన శూద్రుడు విప్రులను సేవించకపోతే, వృత్తిని ఇవ్వకపోతేవారిని హనుమంతుడు కోపగిస్తాడు. (56) అర్థనాశము, పుత్రనాశము, స్థాననాశము, మహాభయము వీటినివాయుపుత్రుడురాముని వాక్యాన్ని స్మరిస్తూకల్గిస్తాడు (57) ఎక్కడోఅక్కడ ఉన్నవిప్రులుకానిశూద్రులుకాని ఓరాజ! వారు రాఘవుని అనుగ్రహంవలననిర్థనులు కారాదు. (58) ఎవడుమూఢుడై, అధర్మాత్ముడైపాపులనుపాషండులను ఆశ్రయించాడో తన విప్రులనువదలి, వారినిజ్ఞా తులను గాభావిస్తాడో (59) వానిపూర్వజన్మలోనిపుణ్యముభస్మమౌతుంది. తప్పదు. ఇతరులకుకొద్దోగోప్పోచేసినదానము (60) ముందెట్టాజరిగేదో, ముందుబ్రహ్మవిష్ణుశివులుచేసేవారోఇప్పుడు ఆతనిదానమును అట్లాహవ్యమును, కవ్యమును దేవతులు గ్రహించరు. పూర్వజులు గ్రహించరు (61) మూ || పంచయిత్వానిజాన్విప్రానన్యేభ్యఃప్రదదేత్తునయః | తస్యజన్మార్జితంపుణ్యంభస్మీభవతితత్క్షణాత్ || 62 || బ్రహ్మవిష్ణుశివైశ్చైవపూజితాయేద్విజోత్తమాః తేషాంయేవిముఖాశూద్రాఃరౌరవేనివసంతితే || 63 || యోలౌల్యాచ్చకులాచారంగోత్రాచారంప్రలోపయేత్ | స్వాచారాంయోనకుర్వీతకదాచిద్వైవిమోహితః || 64 || సర్వనాశోభ##వేత్తస్యభస్మీభవతితత్క్షణాత్ | తస్మాత్సర్వఃకులాచారః స్థానాచారస్తథైవచ || 65 || గోత్రాచారఃపాలనీయోయధావిత్తానుసారతః | ఏవంతేకధితంరాజన్ధర్మారణ్యంపురాతనం || 66 || స్థాపితందేవదేవైశ్చబ్రహ్మవిష్ణుశివాదిభిః | ధర్మారణ్యంకృతయుగేత్రేతాయాంసత్యమందిరం ద్వాపరేవేదభవనంకలౌమోహెరకంస్మృతం || 67 || బ్రహ్మోవాచ - యఇదంశృణుయాత్పుత్రశ్రద్ధయాపరయాయుతః | ధర్మారణ్యస్యమాహాత్మ్యం సర్వకిల్బిషనాశనం || 68 || మనోవాక్కాయజనితంపాతకంత్రివిధంచయత్ | తత్సర్వంనాశమాయాతిశ్రవణాత్కీర్తనాత్సకృత్ || 69 || ధన్యంయశస్యమాయుష్యంసుఖసంతానదాయకం | మాహాత్మ్యంశృణుమయాద్వత్ససర్వసౌఖ్యాప్తయేనరః || 70 || సర్వతీర్థేషుయత్పుణ్యంసర్వక్షేత్రేషుయత్ఫలం | తత్ఫలంసమవాప్నోతిధర్మారణ్యస్యసేవనాత్ || 71 || నారద ఉవాచ - ధర్మారణ్యస్యమాహాత్మ్యంయచ్ఛ్రుతంత్వన్ముఖాంబుజాత్ | ధర్మవాప్యాంయత్రధర్మఃతపస్తేపేసుదుష్కరం || 72 || తస్యక్షేత్రస్యమహిమామయాత్వత్తో7వధారితః | స్వస్తితే7స్తుగమిష్యామిధర్మారణ్యదిదృక్షయా || 73 || తపవాక్యజలౌఘేనపావితో7హంచతుర్ముఖ || 74 || వ్యాసఉవాచ - ఇదమాఖ్యానకంసర్వంకధితంపాండునందన | యచ్ఛ్రుత్వాగోసహస్రస్యఫలంప్రాప్నోతిమానవః || 75 || అపుత్రోలభ##తేపుత్రాన్నిర్థనోధనవాన్భవేత్ | రోగీరోగాత్ర్పముచ్యేతబద్ధోముచ్యేతబంధనాత్ || 76 || విద్యార్థీలభ##తేవిద్యాంఉత్తమాంకర్మసాధనాం | తీర్థయాత్రాఫలంతస్యకోటికన్యాఫలంలభేత్ || 77 || యఃశృణోతినరోభక్త్యానారీవాథనరోత్తమ | నిరయంనైవపశ్యంతిఏకోత్తరశ##తైఃసహ || 78 || శుభేదేశేనివేశ్యాథక్షౌమవప్త్రాదిభిస్తధా | పురాణపుస్తకంఠాజన్ప్రయతఃశిష్టసమ్మతః || 79 || అర్చయేచ్చయధాన్యాయంగంధమాల్యైఃపృథక్పృథక్ | సమాప్తౌనృపగ్రంథస్యవాచకస్యానుపూజనం || 80 || దానాదిభిర్యధాన్యాయంసంపూర్ణఫలహెతవే | ముద్రికాంకుండలేచైవబ్రహ్మసూత్రంహిరణ్మయం || 81 || వస్త్రాణిచవిచిత్రాణిగంధమాల్యానులేవనైః | దేవవత్పూజసంకృత్వాగాంచదద్యాత్పయస్వినీం || 82 || ఏవంవిధానతఃశ్రుత్వాధర్మారణ్యకధానకం | ధర్మారణ్యనివాసస్యఫలమాప్నోత్యసంశయం || 83 || ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే ధర్మారణ్య నివాసి వ్యవస్థా వర్ణన పూర్వక ధర్మారణ్య పురాణ శ్రవణ మాహాత్మ్య వర్ణనం నామ చత్వారింశో7ధ్యాయః ఇతి ద్వితీయం ధర్మారణ్య మాహాత్మ్యం సమాప్తం పూర్వభాగః సమాప్తః || 40 || తా || తనతోటి బ్రాహ్మణులను మోసగించి ఇతరులకు ఇచ్చినవాని జన్మార్జిత పుణ్యము ఆ క్షణంలోనే భస్మమౌతుంది (62) బ్రహ్మ విష్ణు శివులతో పూజింపబడిన ద్విజోత్తములున్నారో, వారికి విముఖులైన శూద్రులు ఎవరున్నారో వారు రౌరవ నరకంలో నివశిస్తారు (63) లౌల్యం వల్లకులాచారమును గోత్రాచారమును లోపింపచేసినవారు మోహితులై స్వాచార మాచరించని వారు (64) సర్వనాశమౌతారు, ఆ క్షణంలోనే భస్మమౌతారు. అందువల్ల అందరు కులాచారము, అట్లాగే స్థానాచారము (65) గోత్రాచారము తమద్రవ్యానుకూలత కొలది పాలించాలి. ఈ విధముగా ఓ రాజ! పురాతనమైన ధర్మారణ్యాన్ని గూర్చి నీకు చెప్పాను (66) దానిని దేవదేవులైన బ్రహ్మవిష్ణు శివాదులు స్థాపించారు. కృతయుగంలో ధర్మారణ్యము, త్రేతమందు సత్యమందిరము, ద్వాపరంలో వేదభవనము, కలిలో మోహరకమని పిలువడింది. (67) బ్రహ్మవచనము - ఓపుత్ర! దీనిని అధిక శ్రద్ధతో విన్నవారి (పాపాలు నశిస్తాయి) ధర్మారణ్య మాహాత్మ్యము అన్ని పాపముల నశింపచేసేది (68) మనోవాక్కాయములవల్ల కల్గిన త్రివిధ పాపము దీనిని వినటంవల్ల ఒక్కసారి కీర్తించటం వలన అదంతా నాశనమౌతుంది. (69) అది ధన్యమైనది. కీర్తిని కల్గించేది. ఆయుస్సునిచ్చేది. సుఖమును సంతానాన్ని ఇచ్చేది. నరుడు సర్వసౌఖ్యములు లభించే కొరకు ఈ మాహాత్మ్యాన్ని వినాలి, ఓ వత్స! (70) సర్వతీర్థములవల్ల కలిగే పుణ్యమును సర్వక్షేత్ర దర్శనంవల్ల కలిగే ఫలమును దర్మారణ్యమును సేవించి పొందుతారు (71) నారదుని వచనము - మీ ముఖాంబుజము నుండి ధర్మారణ్య మాహాత్మ్యము విన్నాము. ధర్మవాపి యందు ధర్ముడు సుదుష్కరమైన తపమాచరించాడు (72) ఆ క్షేత్రమాహాత్మ్యాన్ని నేను మీ నుండి విన్నాను. మీకు జయమగుగాక ధర్మారణ్యాన్ని చూచే కొరకు వెళుతాను (73) ఓ చతుర్ముఖ మీ వాక్యజల ప్రవాహంతో నేను పవిత్రుణ్ణౖనాను. (74) వ్యాసుని వచనము - ఓ పాండునందన ! ఈ ఆఖ్యానాన్ని అంతా చెప్పాను. దీనినివిన్న మానవుడు గోసహస్రదాన ఫలమును పొందుతాడు (75) సంతానహీనుడు సంతానవంతుడౌతాడు. ధనహీనుడు ధనవంతుడౌతాడు. రోగి రోగహీనుడౌతాడు. బద్ధుడు బంధవిముక్తుడౌతాడు (76) విద్యనార్జించే వారు విద్యను పొందుతారు. ఉత్తమమైన కర్మ సాధనను పొందుతాడు. తీర్థయాత్ర ఫలమును, కోటికన్యాదాన ఫలమును పొందుతాడు (77) నరుడు కానినారికాని భక్తితో విన్నవారు ఓరాజ! నరకాన్ని చూడరు. కులములోని ఇరువది ఒక్క తరముల వరకు (78) శుభ##మైన ప్రదేశమందుంచి, పట్టువస్త్రమందుంచి, పురాణ పుస్తకమును ప్రయత్న పూర్వకముగాశిష్టుల అనుమతితో, తగిన విధంగా గంధమాలలతో విడివిడిగా పూజించాలి. ఓరాజ! గ్రంథం సమాప్తి చెందాక, పురాణంచెప్పిన వారిని పూజించాలి (80) సంపూర్ణ ఫలసిద్ధి కొరకు దానాదులతో న్యాయమని పించిన రీతి పూజించాలి. ముద్రికను, కుండలములను బంగారు బ్రహ్మసూత్రమును (81) గంధమాల్య అను లేపనములతో కూడా విచిత్ర వస్త్రములన దేవునివలె పూజించి పాలిచ్చే ఆవును దానంచేయాలి (82) ఈ విధముగా ధర్మారణ్య కథను విధి ప్రకారము వినినవారు ధర్మారణ్య నివాస ఫలమును పొందుతారు, అనుమానంలేదు. అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు పూర్వభాగము, ధర్మారణ్య మాహాత్మ్యమందు ధర్మారణ్య నివాసుల వ్యవస్థ వర్ణనము, ధర్మారణ్య పురాణ శ్రవణ మాహాత్మ్య వర్ణనము అనునది నలుబదవ అధ్యాయము. అని ద్వితీయమైన ధర్మారణ్య మాహాత్మ్యము సమాప్తము పూర్వభాగము సమాప్తము.