Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువది ఆరవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

తతఃసంపూజితో రుద్రః శైలేనప్రీతిమానభూత్‌ | సస్మారచమహర్షీంస్తు అరుంధత్యాసమంతతః. 1

తే సంస్మృతాస్తుఋషయః శంకరేణమహాత్మనా | సమాజగ్ముర్మహాశైలం మందరంచారుకందరమ్‌. 2

తానాగతాన్‌సమీక్ష్యైవ దేవస్త్రిపురనాశనః | అభ్యుత్థామాభిపూజ్యైతా నిదంవచనమబ్రవీత్‌. 3

థన్యో7యంపర్వతశ్రేష్ఠః శ్లాఘ్యఃపూజ్యశ్చదైవతైః | ధూతపాపస్తథాజాతో భవతాంపాదపంకజైః. 4

స్థీయతాంది స్తృతేరమ్యే గిరిప్రస్థేసమేశుభే | శిలాసుపద్మవర్ణాసు శ్లక్షసు చమృదుష్యపి. 5

పులస్త్య ఉవాచ :

ఇత్యేవముక్తాదేవేన శంకరేణమహర్షయః | సమమేవత్వరుంధత్యా వివిశుఃశైలసానుని. 6

ఉపనిష్టేఋషిషు నందీదేవగణాగ్రణీః | అర్ఘాదినాసమభ్యర్చ స్థతః ప్రయతమానసః. 7

తతో7బ్రవీత్పురపతదిః ధర్మ్యంవాక్యంహితంసురాన్‌ | ఆత్మనోయశసోవృద్ధైసప్తర్షీన్‌ వినయాన్వితాన్‌. 8

హర ఉవాచ :

కశ్యపాత్రేవారుణయ గాధేయశృణుగౌతమ | భరద్వాజ శృణుష్వత్వ మంగిరస్త్వంశృణుష్వచ. 9

మమాసీద్దక్షతనుజా ప్రియాసాదక్షకోపతః | ఉత్ససర్జసతీప్రాణాన్‌ యోగదృష్ట్యాపురాకిల. 10

సా7ద్యభూయఃసముద్భూతా శైలరాజసుతా ఉమా | సామదర్థాయశైలేంద్రో యాచ్యతాంద్విజసత్తమ. 11

పులస్త్యుడు చెప్పసాగెను. : ఆ విధంగా హిమవంతునిచే సంభావింపబడి శంకరుడు సంతోషించినవడై అరుంధతీ సహితులగు మహర్షులను స్మరించాడు. మహాత్ముడగు శంకరునిచే స్మరించబడి ఆ ఋషులు అందమైన గుహలతో నొప్పి యున్న ఆ మందర మహాశైలానికి చేరుకున్నారు. త్రిపురాంతకుడగు హరుడు వారలను ఆహ్వానించి పూజించి యిలా అన్నాడు. మీ ఆగమనం వల్ల ఈ పర్వతేశ్వరుడు సకలపాపముక్తుడై ధన్యుడైనాడు. అందాలు వెదజల్లే ఈ విశాలమైన గిరి ప్రదేశాన పద్మరాగశిలలతో నునుపుగా మృదువుగా ఉండే భూభాగాన విశ్రమించండి. నారదా ఇలా శంకరునిచే సంభావింప బడి ఆ మహర్షులు అరుంధతితో కూడి ఆ శైలసానువులపై ఆసీనులయ్యారు. అంతట దేవ గణాగ్ర గణ్యుడైన నందీశ్వరుడు వారందరకు అర్ఘ్యపాద్యాదులిచ్చి వినయంగా నిలబడ్డాడు. అప్పుడు దేవదేవుడైన హరుడు వినయావనతులయిన ఆ ఋషులతో తన యశస్సుకు తగిన విధంగా ధర్మయుక్తాలు క్షేమంకరాలు అయిన వాక్యాలు పలికాడు. ''క్ష కశ్యపా! వసిష్ఠా, అత్రీ, విశ్వామిత్రా, గౌతమా, భరద్వజా, అంగీరసా శ్రద్ధగా వినండి. నా ప్రియురాలు దాక్షాయణి సతి, దక్షుని కోపకారణంగా యోగ శక్తితో పూర్వం తన ప్రాణాలు వదలి తర్వాత మరల యిప్పుడు హిమవంతుని పుత్రిక ఉమగా జన్మించింది. నా కొరకై ఆమెను యిచ్చునట్టుగా మీరు వెళ్ళి ఆ పర్వత రాజును అర్థించవలెను.

పులస్త్య ఉవాచ :

సప్తర్షయస్త్వేవముక్తా బాఢమిత్యబ్రువన్‌వచః | ఓంనంమః శంకరాయేతిప్రోక్త్వాజగ్ముర్హిమాలయమ్‌. 12

తతో7ప్యరుంధతీంశర్వః ప్రాహగచ్ఛస్వసుందరి | పురంధ్య్రోహిపురంధ్రీణా గతింధర్మస్యవైవిధుః. 13

ఇత్యేవముక్తాదుర్లంఘ్యంలోకాచారంత్వరుంధతీ | నమస్తేరుద్రః ఇత్యుక్త్వా జగామపతినాసహ. 14

గత్వాహిమాద్రిఖరమోషధిప్రస్థమేవచ | దదృశ్యుః శైలరాజస్య పురీంసురపురీమివ. 15

తతఃసంపూజ్యమానాస్తే శైలయోషిద్భిరాదరాత్‌ | సునాభాదిభిరవ్యగ్రైః పూజ్యమానాస్తువర్వతైః. 16

గంధర్వైఃకింనరైర్యక్షై స్తథాన్యైస్తత్పురస్సరైః వివిశుర్‌భవనంరమ్యం హిమాద్రేర్హాటకోజ్జ్వలమ్‌. 17

తతస్సర్వేమహాత్మాన స్తపసాధౌతకల్మషాః | సమాసాద్యమహాద్వారం సంతస్థుర్ద్వాః స్థకారణాత్‌ 18

తతస్తుత్వరితో7భ్యాగాద్‌ ద్వాఃస్థో7ద్రిర్గంధమాదనః | ధారయన్‌వైకరే దండం పద్మరాగమయం మహత్‌.

తత స్తమూచుర్మునయో గత్వాశైలపతింశుభమ్‌ | నివేదయాస్మాన్‌ నంప్రాప్తాన్‌ మహత్కార్యార్థినోవయమ్‌.

ఇత్యేవముక్తఃశైలేంద్రో ఋషిభిర్గంధమాదనః | జగామ తత్రమత్రాస్తే శైలరాజో7ద్రిభిర్వృతః. 21

నిషణ్ణోభువిజానుభ్యం దత్వాహస్తౌముఖేగిరిః | దండంనిక్షిప్య కక్షాయా మిదంవచనమబ్రవీత్‌. 22

గంధమాదన ఉవాచ :

ఇమేహిఋషయఃప్రాప్తాః శైలరాజతవార్థినః | ద్వారేస్థితాఃకార్యిణస్తే తవదర్శనలాలసాః 23

పులస్త్య ఉవాచ :

ద్వాఃస్థవాక్యంసమాకర్ణ్య సముత్థాయాచలేశ్వరః | స్వయమభ్యాగమద్ద్వారి సమాదాయార్ఘ్యముత్తమమ్‌. 24

తానర్చ్యర్ఘ్యాదినాశైలః సమానీయసభాతలమ్‌ | ఉవాచవాక్యంవాక్యజ్ఞః కృతాసవపరిగ్రహాన్‌. 25

పులస్త్యుడిలా అన్నాడు : శివుని మాటలకు సరేయని అంగీకరించి ఆ సప్తర్షులు ఓం నమశ్శంకారయ ! అంటూ ఆయనకు నమస్కరించి హిమవంతుని యింటికి వెళ్ళారు అంతట శివుడు అరుంధతితో సుందరీ నీవుకూడ వెళ్ళుము పురంధ్రీ మణులే ఉత్తమ గృహిణుల విధానములు నెరుంగుదరుగదాయనెను. అవిలంఘ్యమైన లోకాచారాన్ని గ్రహించిన ఆ సతీమణి అందులకంగీకరించి రుద్రా ! నీకు నమస్కారమని ప్రణామం గావించి తనభర్త వెనుకనే వెళ్ళెను. వారంతా ఓషధులతో కళకళలాడుతూ యింద్రపురిని బోలియున్న పర్వతేశ్వరుని నగరానికి వెళ్ళారు. అక్కడ పర్వతాంగనలు సునాభుడు మొదలయిన పర్వతులు, గంధర్వ కిన్నర యక్షాదులు గావించిన ఆదర సత్కారాలు స్వీకరించి బంగారు కోటగోడలతో వెలిగి పోతున్న హిమవంతుని భవనం చేరుకున్నారు. మహాత్ములు పాపరహితులునగు వామునీశ్వరులు భవన ద్వారం వద్ద ఆగపోయారు. అప్పుడు ద్వారపాలకుడగు గంధమాదన పర్వతుడు చేతిలో పద్మరాగమణులు పొదిగిన దండంపట్టుకొని వేగంగా వారలవద్దకు వచ్చాడు. ఆ ఋషులా ద్వారపాలునితో మేము గొప్ప కార్యర్థులమై వచ్చాము. నీవు వెళ్ళి మీ ప్రభువుతో చెప్పమని పంపిచారు. గంధమాదన శైలుడట్లేయని వెళ్ళి పర్వత వీరులతో పరివేష్టితుడైన హిమవంతునిచూచి మోకాళ్ళపై వంగి, చేతులు జోడించి, చంకలో దండం యిముడ్చుకొని యిలా విన్నవించాడు. ఓ నగపతీ ! నీ దర్శనాభిలాషులైన మహర్షులు కార్యార్థులై వచ్చి ద్వారంవద్ద వేచియున్నారు. ద్వారపాలుని మాట వినగానే పర్వతేశ్వరుడు లేచి ఉత్తమమైన ఆర్ఘ్యాదులు తీసుకొని స్వయంగా వెళ్ళి ద్వారంవద్దనున్న వారల పూజించి సభాభవనంలోకి తీసుకవెళ్ళాడు. ఉత్తమాసనాల మీద వారలను కూర్చుండ బెట్టి తగినవిధంగా మాటడెను.

హిమవానువాచ :

అనభ్రవృష్టిఃకిమియ ముతాహో7కుసుమంఫలమ్‌ | అప్రతర్క్యమచింత్యంచ భవదాగమనంత్విదమ్‌. 26

అద్యప్రభృతిధన్యో7స్మి శైలరాడద్యసత్తమాః | సంశుద్దదేహో7స్మ్యద్యైవయద్‌భవంతోమమాజిరమ్‌. 27

ఆత్మ సంసర్గసంశుద్ధం కృతవంతోద్విజోత్తమాః | దృష్టిపూతంపదాక్రాంతం తీర్థంసారస్వతంయథా. 28

దాసో7హంభవతాంవిప్రాం కృతపుణ్యశ్చసాంవ్రతమ్‌ |

యేనా7ర్థినోహితేయూయం తన్మమాజ్ఞాతుమర్హథ. 29

సణారో7హంసమంపుత్రై త్భృత్యైర్నప్తృభిరవ్యయాః |

కింకరో7హంస్థితోయుష్మ దాజ్ఞాకారీతదచ్యతామ్‌. 30

పులస్త్య ఉవాచ :

శైలరాజవచఃశ్రుత్వా ఋషయసఃంశితవ్రతాః | ఊచురంగిరసంవృద్ధం కార్యమద్రౌనివేదయ. 31

ఇత్యేవంచోదితః సర్యైః ఋషిభిఃకశ్యపాదిభిః | ప్రత్యువాచపరంవాక్యం గిరిరాజంతమంగిరాః 32

అంగిరా ఉవాచ :

శ్రూయతాంపర్వత శ్రేష్ఠ ః యేనకార్యేణవైవయమ్‌ | నమాగతస్త్వత్సదన మరుంధత్యానమంగిరేః. 33

యో7సౌమహాత్మాసర్వాత్మా దక్షయజ్ఞక్షయంకరః | శంకరఃశూలద్భక్‌ శర్వస్త్రినేత్రోవృషవాహనః. 34

జీమూతకేతుఃశత్రుఘ్నో యజ్ఞభోక్తాస్వయంప్రభుః | యమీశ్వరంవదంత్యేకే శివంస్థాణుంభవంహరమ్‌. 35

భీమముగ్రం మహేశానం మహాదేవంవశోఃపతిమ్‌ | వయంతేనప్రేషితాఃస్మ స్త్వత్సకాశంగిరీశ్వర. 36

ఇయంయాత్వత్సుతాకాళీ సర్వలోకేషు సుందరీ | తాంప్రార్థయతిదేవేశ స్తాంభవాన్‌దాతుమర్హతి. 37

సఏవథన్యోహిపితా యస్యపుత్రీ శుభంపతిమ్‌ | రూపాభిజనసంపత్త్యా ప్రాప్నోతి గిరిసత్తమ. 38

యావంతోజంగమాగమ్యా భూతాఃశైలచతుర్థిదాః | తేషాంమాతాత్వియందేవే యతఃప్రోక్తఃపితాహరః. 39

ప్రణమ్యశంకరందేవాః ప్రణమంతుసుతాంతవ | కురుష్వపాదంశత్రూణాంమూర్ద్నిభస్మపరిప్లుతమ్‌. 40

యాచితారోవయంశర్వోవరోధాతాత్వమప్యుమా | వధూఃసర్వజగన్మాతా కరుయచ్ఛ్రేయసేతవ. 41

హిమవంతుడన్నాడు. ''ఆహా! మేఘం లేని వర్షం, పూవులేని ఫలం''లాగా ఆలోచనకూ తర్కానికీసైతం అందని ఈమీ యొక్క రాక ! మేలురాక ! ఈశైలాధిపతి నిజానికి ఈనాడే ధన్యుడు! సమానులలో ఉత్తముడైనాడు! తమ రాకవల్ల నేను పరిశుద్ధదేహుడనయ్యాను. నా గృహం పావనమైనది. తనకు ప్రదక్షిణంచేసి దర్శించినంతనే పవిత్రం గావించే సారస్వత తీర్థానికి వలె, తమ చరణ సంస్పర్శ సంసర్గాలవల్ల మేము పవిత్రులమైనము. ద్విజోత్తములారా! నేను మీ దాసుడను. నా పుణ్యతిశయాన్ని మీరు అర్థులై రావడమే చాటుతున్నది. ఆలస్యం చేయక ఆజ్ఞాపించండి. భార్యా పుత్ర, భృత్య పౌత్రాదులతో సహా మీకు కింకరుడను. మీ యాజ్ఞను శిరసావహించి నెరవేర్తును. సెలవివ్వండి. ''హిమవంతుని మాటలు విన సంశిత వ్రతులైన నా మహర్షులు తమలో వృద్ధుడైన అంగిరోమునిని తాము వచ్చినపని పర్వతేశ్వరునకు తెలుపమని కోరారు.. ఋషులందరచేత అర్థింపబడిన ఆ అంగిరసముని హిమవంతునితో ఉత్తమమైన వచనాలు ఈ విధంగా పలికాడు. ''ఓ పర్వతాగ్రణీ! అరుంధతీ సాధ్వితోకూడి మేమంతా నీ వద్దకు వచ్చిన కార్యం చెబుతున్న వినుము. సర్వ భూతాంత రాత్ముడు, దక్షాధ్వంనాశకుడు, శంకరుడు, శూలపాణి, శర్వుడు, త్రినేత్రడు, వృషభవాహనుడు, జీమూత కేతువు, శత్రుఘ్నడు, యజ్ఞభోక్త, స్వయంభువు, ఏకైక ఈశ్వరుడు, శివుడు, స్థాణువు, మహాదేవుడు, పశుపతి అయిన ఆ పరమ శివుడు పంపగా మేము వచ్చాము. గిరీశ్వరా! త్రిలోక సౌందర్యవతి అయిననీ కుమార్తె కాళిని మహేశ్వరుడు కోరుతున్నాడు. నీవామెనా భవున కర్పించి ధన్యుడవుకమ్ము. ఓ శైలేశ్వరా! ఎవని కుమార్తెకు సుందరుడు శుభంకరుడు, మంచి అభి జాత్యము కలిగిన వరుడు లభిస్తాడో ఆ తండ్రి భాగ్యమే భాగ్యము. హరుని చెట్టపట్టిన వెంటనే ఈదేవి, చరాచర జీవులకు, చతుర్విధ సృష్టి (జేరజ, అండజ, ఉద్భిజస్వేదజ) లోని వారలకు తల్లి-జగన్మాత కాగలదు. శంకరునకు ప్రణమిల్లు వారందరూ నీ పుత్రికకు పాదాక్రాంతులగుదురు. ఏమి నీ భాగ్యము. లెమ్ము. ధూళిలో నిండిన నీ పాదాన్ని శత్రువుల తలలపై నుంచి తరువాతి కార్యమునకుపక్రమింపుము. మేము యాచకులంః ఈ శంకరుడు వరుడు! నీవు దాతవు! జగన్మాత ఉమవధువు! ఈ అదృష్టాన్ని అనుభవించుము.

పులస్త్య ఉవాచ :

తద్వచో7ంగిరసః శ్రుత్వా కాళీతస్థావదోముఖీ | హర్షమాగత్యసహసా పునర్దైన్యముపాగతా. 42

తతఃశైలపతిఃప్రాహ పర్వతం గంధమాదనమ్‌ | గచ్చశైలానుపామంత్య్ర సర్వానాగంతుమర్హసి. 43

తతఃశీఘ్రతరఃశైలో గృహాద్‌గృహమగాజ్జవీ | మేర్వాదీన్‌ పర్వతశ్రేష్ఠా నాజుహావసమంతతః. 44

తే7ప్యాజగ్ముస్త్వరావంతః కార్యంమత్వామహ త్తదా | వివిశుర్విస్మయావిష్టాః సౌవర్జేష్వాసనేషుతే. 45

ఉదయోహేమకూటశ్చ రమ్యకోమందతస్తథా | ఉద్దాలకోవారుణశ్చ వరాహోగరుడాసనః. 46

శుక్తిమాన్‌వేగసానుశ్చ దృఢశృంగో7థశృంగవాన్‌ | చిత్రకూటస్త్రికూటశ్చ తథామందరకాచలః 47

వింధ్యశ్చమలయశ్ఛైవ పారియాత్రో7థదర్దురః | కైలాసాద్రిర్మహేంద్రశ్చ నిసధో7ంజనపర్వతః 48

ఏతేప్రధానాగిరయ స్తథా7న్యేక్షుద్రపర్వాతాః | ఉపవిష్టాఃసభాయాంవై ప్రణిపత్యృషీంశ్చతాన్‌. 49

తతోగిరీశఃస్వాంభార్యాం మేనామాహూతవాంశ్చసః | సమాగచ్ఛతకళ్యాణీ సమంపుత్రేఱభామినీ. 50

సా7భివంద్యఋషీణాంహి చరణాంశ్చతపస్వినీ | సర్వాన్‌ జ్ఞాతీన్‌సమాభాష్య వివేశససుతాతతః. 51

తతో7ద్రిషుమహాశైల ఉపవిష్టేషునారద | ఉవాచవాక్యంవాక్యజ్ఞః సర్వానాభాష్యసుస్వరమ్‌. 52

హిమవానువాచ :

ఇమేసప్తర్షయఃపుణ్యా యాచితారఃసుతాంమమ | మహేశ్వరార్థంకన్యాంతు తచ్చావేద్యంభవత్సువై. 53

తద్వదధ్వంయథాప్రజ్ఞం జ్ఞాతయోయూయమేవమే | నోల్లంఘ్యయుష్మాన్‌దాస్యామి తత్షమంవక్తుమర్హథ. 54

పులస్త్య ఉవాచ :

హిమవద్వచనంశ్రుత్వా మేర్వాద్యాఃస్థావరోత్తమాః | సర్వమేవాబ్రువన్‌వాక్యం స్థితాఃస్వేష్వాసనేషుతే. 55

యాచితారశ్చమునయో వరస్త్రిపురహాహరః | దీయతాంశైలకాళీయం జామాతా7భిమతోహినః. 56

మేనప్యథాహభర్తారం శృణుశైలేంద్రమద్వచః | పితౄనారాధ్యదేవైసై#్తర్దత్తా7నేనైవహేతునా. 57

యస్త్వస్యాంభూతపతినా పుత్రోజాతోభవిష్యతి | సహనిష్యతిదైత్యేంద్రం మహిషంతారకంతథా. 58

పులస్తుడిలా అన్నాడు : అంగిరసుని మాటలు విన్న వెంటనే కాళి సంతోషంతో అదోముఖియై నిలబడింది. అయితే మరల దైన్యంతో నిండిపోయింది. అంతట శైలాధిపతి గంధమాదనుని పలిచి నీవు వెంటనేవెళ్ళి మన పర్వత బంధువు నందరనూ పిలుచుకొనిరమ్మని ఆదేశించాడు. గంధమాదనుడు కడువేగంతో పర్వత ప్రముఖులనందరను వారల యిండ్లకు వెళ్లి పిలుచుకుని వచ్చాడు. మేరుమొదలయిన వారంతా విషయ ప్రాముఖ్యాన్ని గుర్తించి వెంటనే సంభ్రమాశ్చర్యాలతో హిమంతుని యింటికివచ్చి తమకు నేర్పాటు చేయబడిన స్వర్ణాసనాలమీద కూర్చున్నారు. ఉదయాచలం, హేమకూటం, రమ్యకం, మందరం, ఉద్దాలకం, జురుణం, వరాహం, గరుడాసనం, శక్తిమంతం, వేగసానువు, దృఢశృంగం, శృంగవంతం, చిత్రకూటం, త్రికూటం, మందరకాచలం, విధ్యం, పారియాత్రం, మలయం, దర్దురం, కైలాసం, మహేంద్రం, నిషధం, అంజనాచలం మొదలయిన ప్రధాన శైలవరులతోబాటుగా క్షుద్రపర్వతాలెన్నో సభామండపానికి వచ్చి హిమవంతునకు ఋషీశ్వరులకుమ్రొక్కి ఆసనాలు అలంకరించారు. అంతట హిమవంతుడు తన భార్య మేనాదేవిని పిలిచి కళ్యాణీ! మన కుమార్తెను తీసికొని రమ్మని ఆదేశించాడు. ఆమెయునట్లే కాళిని వెంటబెట్టుకొనవచ్చి మహర్షులకు ప్రణమిల్లి యితరులకు కుశల ప్రశ్నలతో సంభావించి, సభలో ఆసీనురాలయింది. అలా వచ్చి కూర్చున్న తన జ్ఞాతిపర్వతవరులనందరచూచి మధుర స్వరంతో వాగ్మి అయిన హిమవంతుడిలా అన్నాడు. ''బంధువులారా! పుణ్యమూర్తులైన ఈ సప్తర్షివర్యలు, నా కుమార్తెను పరమశివునకర్థాంగి నొనరించుటకై హరునిపక్షానవచ్చి యాచించుచున్నారు. ఇది మీరందరు తెలిసికొని అనుమతించవలసిన విషయం కాబట్టి మిమ్ములనాహ్వానించితిని. కనుక జ్ఞాతులైన మీరంతా ఆలోచించి నాకు సలహా యివ్వగలరు. మీ మాటను ఉల్లంఘించబోను'' నారదా! న్యాయసమ్మతమైన హిమవంతుని మాటలు విని మేరువు మొదలయిన ప్రముఖులు తమ ఆసనాలపై కూర్చొని యిలా అన్నారు. ''యాచించ వచ్చిన వారోమహర్షులు ! వరుడా దేవాధి దేవుడగు హరుడు. యింత కన్ననేమి కావలయును? వెంటనే కాళీ కుమారినిచ్చి శివునకుద్వాహమొనరింపుము. శైలేశ్వరా! వరుడు సర్వవిధాలా ఉత్తముడు!'' అంతట మేనాదేవి భర్తతో శైలపతీ! నా మాట వినండి. ఈ పవిత్ర సంబంధం కొరకే పితృదేవతల కోరికను మన్నించి నాకీ పుత్రికను ప్రసాదించారు. ఈమెకు త్రిపురహరుని వల్ల కలిగే పుత్రుడు దుష్టులయిన మహిష తారకా సురులను సంహరిస్తాడు.''

ఇత్యేవంమేనయాప్రోక్తః శైలైః శైలేశ్వరఃసుతాన్‌ | ప్రోవాచపుత్రి దత్తా7సి శర్వాయత్వంమయా7ధునా. 59

ఋషీనువాచకాళీయం మమపుత్రీతపోధనాః | ప్రణామంశంకరవధూ ర్భక్తినమ్రాకరోతివః. 60

తతో7ప్యరుంధతీకాళీ మంకమారోప్యచాటుకైః | లజ్జమానాంసమాశ్వాస్య హరనామోదితైఃశుభైః. 61

తతఃసప్తర్షయఃప్రోచుః శైలరాజనిశామయ | జామిత్రగుణసంయుక్తం తిథిపుణ్యంసుమంగళమ్‌. 62

ఉత్తరాఫల్గునీయోగం తృతీయే7హ్నిహిమాంశుమాన్‌ | గమిష్యతి చతత్రోక్తో ముహూర్తోమైత్రనామకః. 63

తస్యాంతిథ్యాంహరఃపాణిం గ్రహీష్యతిసమంత్రకమ్‌ | తవపుత్య్రావయంయామ స్తదనుజ్ఞాతుమర్హసి. 64

తతఃసంపూజ్యవిధినా ఫలమూలాదిభిఃశుభైః విసర్జయామానశ##నైః శైలరాడ్‌ఋషిపుంగవాన్‌. 65

తే7ప్యాజగ్ముర్మహావేగాత్‌ త్వాక్రమ్యక్షురుదాలయమ్‌ | అసాద్యమందరగిరిం భూయో7వందంతశంకరమ్‌.

ప్రణమోచుర్మహేశానం భవాన్‌భర్తా7ద్రిజావధూః | సబ్రహ్మకాస్త్రయోలోకా ద్రక్ష్యంతిఘనవాహనమ్‌. 67

తతోమహేశ్వరఃప్రీతో మునీన్‌సరవాననుక్రమాత్‌ | పూజయామాసవిధినా అరుంధత్యాసమం హరః 68

తతఃసంపూజితాజగ్ముః సురాణాంమంత్రణాయతే | తే7ప్యాజగ్ముర్హరంద్రష్టుం బ్రహవిష్ణ్వింద్రభాస్కరాః.

గేహంతతో7భ్యేత్యమహేశ్వరస్య కృతప్రణామావివిశుర్మహర్షే |

సస్మారనందిప్రముఖాంశ్చసర్వా నభ్యేత్యతే వంద్యహరంనిషణ్ణాః. 70

దేవైర్గణౖశ్చాపివృతోగిరీశః నశోభ##తేముక్తజటాగ్రభారః |

యథావనే సర్జకదంబమధ్యే ప్రరూఢమూలో7థవనస్పతిర్వై. 71

ఇతి శ్రీవామనమహాపురాణ షడ్వింశో7ధ్యాయః.

మేనాదేవి యిలా చెప్పగా నాశైలాధిపతి హిమవానుడు యితర పర్వతవర్యులతో కలిసి కుమార్తె కాళితలో అమ్మా! నిన్నిపుడే శర్వునకు ధారబోసినానని, మహర్షులనుద్దేశించి ''పూజ్యులారా! ఈ శంకర వధువు మీకందరకు భక్తితో ప్రణామాలు చేస్తున్నది, స్వీకరించండి'' అని అర్థించాడు. అంతట సిగ్గుదొంతరలతో ముడుచుకొని పోతున్న కాళీకుమారిని ప్రేమతో తనఒడిలో కూర్చుండబెట్టికొని అరుంధతీదేవిని హరనామాంకితాలయిన మృదుమధుర వచనాలతో అలరింపజేసింది. అప్పుడా సప్తర్షులునగాధిరాజునుచూచి ''శైలేశ్వరా! శ్రద్ధగా ఆలకించుము. జామిత్ర గుణ సంయుక్తమైన పవిత్ర తిథి వస్తోంది. మూడవనాడు చంద్రుడు ఉత్తరాఫల్గునిలో ప్రవేశిస్తాడు. ఆ శుభ సమయాన్నిమైత్రముహూర్తమంటారు. ఆ తిథినాడు శంకరుడు సమంత్రకంగా నీ కుమార్తె పాణిగ్రహణం చేస్తాడు. ఇవ మేము వెళ్ళి వస్తాము. అనుమతించండి'' అని ఆశీర్వదించారు. అంతట మహదానందంతో హిమవంతుడా మహర్షులనందరను చక్కగా పూజించి సాగనంపాడు. వారందరు వెంటనే ఆకాశ మార్గాన మందర పర్వతానికి వెళ్ళి శివునకు నమస్కరించి, దేవా నీవు పెండ్లి కుమారుడవయ్యావు. పార్వతి పెళ్ళికూతురయినది. బ్రహ్మపురస్సరంగాముల్లోకాలు త్వరలో మీ దర్శనం చేసుకుంటాయి'' అని విన్నవించారు. అంతట సంతోషించి శర్వుడు యథాక్రమంగా అరుంధతితో బాటు ఆ మహర్షులందరను పూజించాడు, తర్వాత నామునులు దేవతలతో సంప్రదించుటకు ప్రయాణమై వెళ్ళారు. ఇంతలో బ్రహ్మ విష్ణువు యింద్రుడు భాస్కరుడు, శివుని దర్శించుటకేతెంచి ఆయన యింటికి వెళ్ళి భక్తితో ప్రణామాలు చేసి ఆసీనులయ్యారు. శివుని ఆదేశానుసారం నందీ మొదలయిన వారు కూడ చేరారు. ఆ విధంగానాదేవతలూ భూతగణాలతో పరవేష్టింపబడిన, గిరీశుడు వదలినజటాభారం గాలిలో తేలాడుతూ ఉంటే అరణ్యంలో సర్జ కదంబాలమధ్య ఆకసాన్నంటే మహావృక్షంలాగ వెలిగి పోయాడు.

ఇది శ్రీ వామన మహాపురాణంలో యిరువది ఆరవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters