Sri Vamana Mahapuranam
Chapters
శ్రీ వామన పురాణ పంచ షష్టి తమో %ధ్యాయః పులస్త్య ఉవాచ -- ఏతస్మిన్నంతరే ప్రాప్తో భగవాన్ వామనాకృతిః | యజ్ఞవాట ముపాగమ్య ఉచ్చై ర్వచన మబ్రవీత్ ||
1 ఓంకార పూర్వాః శ్రుతయో మఖే %స్మిన్ | తిష్ఠంతి రూపేణ తపోధనానామ్ | యజ్ఞో%శ్వమేధః ప్రవరఃక్రతూనామ్ | ముఖ్యస్తథా సత్రిషు దైత్యనాథః || 2 ఇత్థం వచన మాకర్ణ్య దానవాధిపతి ర్వశీ | సార్ఘ్యపాత్రః సమభ్యాగా ద్యత్ర దేవః స్థితో%భవత్ || 3 తతో%ర్చ్య దేవ దేవేశ మర్చ్య మర్ఘ్యాది నా సురః | భరద్వాజర్షిణా సార్ధం యజ్ఞం వాటం ప్రవేశయత్ || 4 ప్రవిష్ట మాత్రం దేవేశం ప్రతి పూజ్య విధానతః | ప్రోవాచ భగవన్ బ్రూహి కిం దద్మ తవ మానద || 5 తతో%బ్రవీ త్సుర శ్రేష్ఠో దైత్య రాజాన మవ్యయః | విహస్య సుచిరం కాలం భరద్వాజ మవేక్ష్య చ || 6 గురో ర్మదీయస్య గురు స్తస్యాస్త్యగ్ని పరిగ్రహః | న స ధారయతే భూమ్యాం పారక్యాం జాతవేదసమ్ || 7 తదుర్ధ మభియాచే%హం మమ దానవ పార్థివ! | మచ్ఛరీర ప్రమాణన దేహి రాజన్ పద త్రయమ్ || 8 మురారే ర్వచనం శ్రుత్వా బలి ర్భార్యా మవేక్ష్య చ | బాణం చ తనయం వీక్ష్య ఇదం వచన మబ్రవీత్ || 9 న కేవలం ప్రమాణన వామనో%యం లఘు ప్రియే! | యేన క్రమ త్రయం మౌర్ఖ్యా ద్యాచతే బుద్దితో%పిచ || 10 ప్రాయో విధాతా%ల్పధియాం నరాణాం | బహిష్కృతానాం చ మహానుభాగ్యైః | ధనాదికం భూరినవై దదాతి యథేహ విష్ణో ర్న బహు ప్రయాసః || 11 న దదాతి విధి స్తస్య యస్య భాగ్య విపర్యయః | మయి దాతరి యశ్చాయ మద్య యాచే త్పద త్రయమ్ || 12 ఇత్యేవ ముక్త్వా వచనం మహాత్మా భూయో%ప్యువాచా థ హరం దనూజః | యాచస్వ విష్ణో గజ వాజి భూమిం దాసీ హిరణ్యం యదభీప్సితం చ || 13 భవాన్ యాచయితా విష్ణో అహం దాతా జగత్పతిః | దాతు ర్యాచయితు ర్లజ్ఞాక కథం న స్యాత్ పదత్రయే || 14 రసాతలం వా పృధివీం భువం నాక మధా%పివా | ఏతేభ్యః కతమం దద్యాం స్థానం యాచస్వ వామన || 15 శ్రీ వామన పురాణంలో అరువది యైదవ అధ్యాయము. పులస్త్యుని వచనము - ƒyLRiµy! C ÍÜ[xmsoƒ«s ªyª«sVƒyNRPX¼½ µ³R…LjiLiÀÁƒ«s ˳ÏÁgRiªyƒ«sV²R…V ‡ÁÖÁ ¸R…VÇìÁ aSÌÁƒ«sV xqs„dsVzmsLiÀÁ ®ªs[VxmnsV gRiLiÕ³dÁLRi xqs*LRiLi»][ LiVVÍØ @ƒyõ²R…V. C ¸R…VÇìÁLiÍÜ[ JLiNSLRi xmspLRi*NSÌÁLiVVƒ«s ®ªs[µyÌÁ¬dsõ »R½F¡µ³R…ƒ«sVÌÁ LRiWFyƒ«s ®ƒsÌÁN]¬s Dƒ«sõ„s!. BNRP @aRP*®ªs[Vµ³R…ª«sW! ¸R…VÇìØÌÁ¬sõLiÉÓÁÍÜ[ƒ«sV »R½ÌÁ ª«sW¬sNRPLi ‡ÁÖÁ µyƒ«s®ªs[LiúµR…V²][, ¸R…VÇìÁ NRPLRiòÌÁLiµR…LRi ÍÜ[ƒ«sW D»R½òª«sVV²R…V!
ఆ మాటలు వినగానే జితేంద్రియు డగు దానవేంద్రుడు అర్ఘ్య పాత్రతో భగవానుడు నిలబడిన చోటుకు వెళ్లి అర్ఘ్య పాద్యాదులతో భరద్వాజ మహర్షి సమేతంగా ప్రభువు నర్చించి, యజ్ఞ శాల లోనికి తీసి కొని వచ్చాడు. ప్రవేశ ద్వారాన మరల యథావిధిగా కూర్చుండ బెట్టి పూజించి చేతులు జోడించి వినయంతో %ో మానదా! ప్రభూ! మీకునే నేమి యివ్వ వలెనో ఆజ్ఞాపించండని అర్థించాడు. అంతనా అవ్యయు డగు దేవ శ్రేష్ఠుడు దానవేశ్వరుని చూచి చాల సేపు పక పక నవ్వి భరద్వాజ ఋషిని చూస్తూ ఇలా అన్నాడు. నా గురువు నకు గురువైన యి మహనీయుడు అగ్ని (యజ్ఞాగ్ని) పరిగ్రహం చేశాడు. ఆ అగ్నిని యితరుల భూమిపై నుంచరాదు. అందలకై ఓ దానవేశ్వనా! నాశరీర ప్రమాణానికి సరియైన మూడడుగుల నేల నా కొసగుము. ఇదియే నా యాచన. ముర మర్దనుని మాటలు విని ఆ బలి భార్యను తనయుడగు బాణుని చూస్తూ యిలా అన్నాడు. ప్రేయసీ! చూచావా! ఈ వామనుడు ఆకారంలోనే కాక బుద్దిలో కూడ వామనుడే సుమా! కనుకనే మూర్ఖుడై మూడడుగుల చోటు యాచించాడు. నిజమే. విధాత సామాన్యంగా అల్ప బుద్దులగు వారికీ, భాగ్య దూరులగు వారికీ, భూరి భోగ భాగ్యాలు యివ్వడు. ఇదిగో అల్పాన్ని యాచించే ఈ విష్ణువునకు వలెనే! భాగ్యం వక్రించిన వానికి విధి ప్రదానం చేయడు. నాలాంటి దాతను ఈ పొట్టి వాడు మూడడుగులు యాచించడం అంతే కదా! అని ఆ మహనీయుడగు దైత్యపతి శ్రీ హరితో మళ్లీ యిలా అన్నాడు. విష్ణో! అడగవయ్యా, గజాలా, అశ్వాలా, రధాలా, భూమియా, దాసీ జనమా, సువర్ణ రాసులా, ఏమి కావాలో కోరుకో, దాతనైన నేను త్రిలోకాధిపతిని! యాచించే నీవో విష్ణుడవు.! ఈ అల్పాన్ని కోరడం మనకు యిద్దరకూ సిగ్గు పడ వలసిన విషయం కాదా? రసాతలమా, ఈ ధరణీ మండలమా, భువర్లోకాలా, ఏమి కావాలో అడగవయ్యా వామనా! తప్పక యివ్వ గలను.
శ్రీ వామన ఉవాచ -
గజాశ్వ హిరణ్యాది తదర్ధిభ్యః ప్రదీయతామ్ |ఏతావతా త్వహం చార్థీ దేహి రాజన్! పద త్రయమ్ || 16
ఇత్యేవ ముక్తే వచనే వామనేన మహా%సురః | బలిర్భృంగార మాదాయ దదౌ విష్ణోః క్రమ త్రయమ్ || 17
పాణౌతు పతితే తోయే దివ్యం రూపం చకార హ | త్రైలోక్య క్రమణార్థాయ బహు రూపం జగన్మయమ్ || 18
పద్భ్యాం భూమి స్తధా జంఘే నభ సై#్త్రలోక్య వందితః | సత్యం తపో జాను యుగ్మే ఊరుభ్యాం మేరు మందరౌ || 19
విశ్వే దేవా కటీ భాగే మరుతో వస్తి శీర్షగాః | లింగే స్థితో మన్మథశ్చ వృషణాభ్యాం ప్రజాపతిః || 20
కుక్షిభ్యా మర్ణవాః సప్త జఠరే భువనాని చ | వలిషు త్రిషు నద్యశ్చ యజ్ఞాస్తు జఠరే స్థితాః || 21
ఇష్టా పూర్తా దయః సర్వాః క్రియా స్తత్ర తు సంస్థితాః | పృష్ఠస్థా వసవో దేవాః స్కంధౌ రుద్రై రధిష్ఠితాః || 22
బాహవశ్చ దిశ స్సర్వా వసవో%ష్టా కరే స్మృతాః | హృదయే సంస్థితో బ్రహ్మా కులిశో హృదయా స్థిషు || 23
శ్రీ సముద్రా ఉరో మధ్యే చంద్రమా మనసి స్థితః | గ్రీవాదితి ర్దేవ మాతా విద్యా స్తద్వలయ స్థితాః || 24
ముఖేతు సాగ్న యో విప్రాః సంస్కారా దశన చ్చదాః | ధర్మార్ధ కామ మోక్షీయాః శాస్త్రాః శౌచ సమన్వితాః || 25
లక్ష్మ్యా సహ లలాటస్థాః శ్రవణాభ్యా మథాశ్వినౌ | శ్వాసస్థో మాతరి శ్వాచ మరుతః సర్వసంధిషు || 26
సర్వ సూక్తాని దశనా జిహ్వా దేవీ సరస్వతీ | చంద్రాదిత్యౌచ నయనే పక్షస్థాం కృత్తికాదయః || 27
శిఖాయాం దేవ దేవస్య ధృవో రాజా న్యషీదత | తార కారోమ కూపేభ్యో రోమాణి చ మహర్షయః || 28
సర్వ భూత గుణో భూత్వా భగవాన్ భూత భావనః | క్రమే ణౖకేన జగతీం జహార సచరాచరమ్ || 29
భూమిం విక్రమ మాణస్య మహా రూపస్య తస్యవై | దక్షిణో%భూత్ స్తన శ్చంద్రః | సూర్యో%భూ దథ చోత్తరః | నభ శ్చాక్రమతో నాభిం సూర్యేందూ సవ్య దక్షిణా || 30
అందుల కాబలితో వామనుడిలా అన్నాడు. 'గజాశ్వ భూ రధ సువర్ణాదులు, అవి కావలసిన వారికివ్వుము. నాకు కావలసినది మూడడుగుల నేల యే కనుక నో రాజా కాదనక దీని నొసంగుము.' వామనుడిలా అనగానే ఆ మహాదైత్యుడు జల పాత్ర తీసికొని మూడడుగుల నేల విష్ణువునకు దానం చేశాడు. దాన జలం చేతిలో పడగానే వామనుడు ముల్లోకాలు ఆక్రమించేందుకు జగన్మయమైన బహురూపాన్ని ధరించాడు. పాదాలతో, పిక్కలతో ఆకాశాన్నీ సత్య తపో లోకాలను మోకాళ్లతో, మేరు మందరాలను తొడలతో ఆ త్రిలోక ప్రణమ్యుడు కప్పి వేశాడు. నడుములో విశ్వేదేవతలు, మరుత్తులు వస్తి శిరో భాగాల యందు , లింగ (మేఢ్రం) లో మన్మధుడు, వృషణాలలో ప్రజాపతులు, కుక్షి (పై పొట్ట) లో సప్త సాగరాలు, జఠరం (క్రింది పొట్ట) లో యజ్ఞాలు భువనాలు ఇష్టా పూర్తాలు మొదలగు వైదిక క్రియ లన్నీ కడుపు మీది మూడు పొరలలో నదులు నిలిచినయి. వీపు భాగాన వసువులు, భుజాలలో రుద్రులు, బాహువులలో పది దిక్కులు, చేతులలో అష్ట వసువులు, హృదయంలో బ్రహ్మ, హృదయాస్థులలో వజ్రాయుధము, లక్ష్మి, సముద్రాలు, వక్షోజాల మధ్యభాగాన చంద్రుడు, మనస్సులో, మెడలో దేవ మాత అదితి, కంఠపు మూడు పొరలలో విద్యలు కనిపించాయి. ఆ ప్రభువు నోటిలో అగ్నుల తోటి విప్రులు, పెదవులలో సంస్కారాలు, లలాట దేశాన లక్ష్మితో కలిసి ధర్మార్ద కామ మోక్ష శౌచ సమన్వితా లయిన శాస్త్రాలు, చెవులలో అశ్వినీ దేవతలు, ఊర్వులలో మాతరిశ్వుడు, సర్వ సంధులలో మరుత్తులు, దంతములలో సకల సూక్తాలు, నాలుక మీద సరస్వతి, నేత్రాలలో చంద్ర సూర్యులు, కృత్తిక మొదలగు నక్షత్రాలు, కనురెప్పలలో ను కనిపించాయి. ఆ దేవ దేవుని శిఖా భాగాన ధ్రవుడు ఉపవిష్టు డయ్యాడు. రోమ కూపాల్లో తారకలు రోమాల్లో మహర్షులు నిలిచారు. సర్వ గుణమయుడు, సర్వభూతమయుడు నగు నాభగవంతుడు ఒకే అడుగులో చరాచర ప్రాణులతో నిండిన భూమి నంతటినీ ఆక్రమించగా ఆ విశ్వ రూపుని కుడి రొమ్ము చంద్రుడయినది. ఎడమ రొమ్ము సూర్యుడైనది. ఆ ప్రభువు పైకి పెరిగే కొలదీ సూర్య చంద్రు లాయన బొడ్డుకు ఎడమ కుడి భాగాల నిలచారు.
ద్వితీయేన క్రమేణా థ స్వ ర్మహ ర్జన తాపసాః | క్రాంతార్దార్దేన వైరాజం మధ్యే నా%పూర్యతా%ంబరమ్ || 31
తతః ప్రతాపినా బ్రహ్మన్! బృహద్విష్ణ్వంఘ్రిణా%ంబరే | బ్రహ్మాండోదర మహత్య నిరాలోకం జగామ హ || 32
విష్ణ్వంఘ్రిణా ప్రసరతా కటాహో భేదితో బలాత్ | కుటిలా విష్ణు పాదే తు సమేత్య కుటిలా తతః || 33
తస్యా విష్ణు పదీత్యేవం నామాఖ్యాత మభూ న్మునే | తథా సురనదీత్యే వం తా మసేవంతా తాపసాః | భగవాన ప్యసంపూర్ణే తృతీ యే తు క్రమే విభుః || 34
సమభ్యేత్యం బలిం ప్రాహ ఈషత్ర్పస్పురితాధరః | ఋణా ద్భవతి దైత్యేంద్ర బంధనం ఘోర దర్శనమ్ | త్వం పూరయ పదం తన్మే నోచేద్ బంధం ప్రతీచ్ఛ భోః || 35
తన్మురారి వచః శ్రుత్వా విహస్యా%థ బలేః సుతః | బాణః ప్రాహా మర పతిం వచనం హేతు సంయుతమ్ || 36
బాణ ఉవాచ :-
కృత్వా మహీ మల్పతరాం జగ త్పతే! స్వాయంభువాది భువనానివైషట్ | కథం బలిం ప్రార్థయసే సువిస్తృతాం యం ప్రాగ్భవాన్ నో విపులా మధాకరోత్ || 37
విభో! మహీ యావతీయం త్వయాద్య సృష్టా | సమేతా భువనాంతరాళైః | దత్తా చ తాతే న హి తావతీయం కిం వాక్చవేనైష నిబధ్యతే%ద్య? || 38
యానైవ శక్త్యా భవతా హి పూరితుం కథం వితన్యా ద్దితి జేశ్వరో%సౌ | శక్తస్తు సంపూజయితుంమురారే! ప్రసీద మా బంధన మాదిశస్వ || 39
ప్రోక్తం శ్రుతౌ భవతాపీశ వాక్యం | దానం పాత్రే భవతే సౌఖ్య దాయి | దేశౌ సుపుణ్య వరదే యచ్చ కాలే తచ్చా శేషం దృశ్యతే చక్రపాణ || 40
దానం భూమిః సర్వ కామ ప్రదేయం | భవాన్ పాత్రం దేవ దేవోజితాత్మా | కాలో జ్యేష్ఠ్యా మూల యోగే మృగాంకః కురుక్షేత్రం పుణ్య దేశం ప్రసిద్దమ్ || 41
కిం వా దేవో %స్మద్వి ధై ర్బుద్ది హీనైః | శిక్షాపనీయః సాధు వా%సాధు చైవ | స్వయం శ్రుతీనా మపి చాది కర్తా | వ్యాప్య స్థితః సదసద్యో జగద్వై || 42
కృత్వా ప్రమాణం స్వయమేవ హీనం పదత్రయం యాచితవాన్ భవశ్చ | కిం త్వం న గృహ్ణా%సి జగత్రయం భో రూపేణ లోక త్రయ వందితేన || 43
నాత్రా%శ్చర్యం యజ్జగా ద్వై సమగ్రం | క్రమ త్రయం నైవ పూర్ణం తవాద్య | క్రమేణ త్వం లంఘయ తుం సమర్థో లీలా మేతాం కృతవాన్ లోకనాథ || 44
ప్రమాణ హీనాం స్వయ మేవ కృత్వా | వసుంధరాం మాధవ పద్మనాభ! విష్ణో న బధ్నా సి బలిం న దూరే ప్రభు ర్య ధే చ్ఛతి తత్క రోతి || 45
రెండువ పాదం మొదటి సగంతో స్వర్గ మహర్లోక జన తపో లోకాలను కప్పి, మిగిలిన సగంతో వైరాజాన్నీ, మిగిలిన మధ్య భాగంతో అంబరాన్ని, ఆక్రమించి అనంతమైన అంతరాళాన్ని నింపి, బ్రహ్మాండ కటాహాన్ని (పైపెంకును) భేదించి నిరాలోకమైన (గాఢాంధకార పూరితమైన) లోకానికి ద్వితీయ చరణాన్ని సాచి, నిలిపాడా విరాట్పుడుషుడు. రెండవ పదాంగుళుల తాకిడికి భిన్నమైన బ్రహ్మాండపు పైనుండి ఆ సాదం వెంట క్రిందికి జల జల గొప్ప ప్రవాహం నిర్గమించింది. వక్ర గతితో పారిన ఆ జలం కుటిల అయింది. అదే విష్ణు పదీ అనే పేరుతో (విష్ణుపాదోద్భవ) విఖ్యాతమైంది. నారదా! ఆ పవిత్రోదకాలనే సుర నది అని భక్తితో తాపసులు సేవిస్తారు. మూడవ పాదానికి చోటు లేకుండుట చూచి ఆ ప్రభువు పెదవులదురు చుండగా బలిని సమీపించి దైత్యేంద్రా! ఋణశేషం బంధనకారి అవుతుంది. మూడవ చరణానికి భూమిని చూపించుము. లేదా బంధనము నకు సిద్ద పడు మని హెచ్చిరించాడు. మురారి మాటలకు బలి పుత్రుడు బాణుడు నవ్వి హేతుబద్దంగా ఆయనతో యిలా అన్నాడు. జగన్నాధా! ఈ భూమండలాన్ని మిగిలిన భువన షట్కాన్నీ నీ విరాడ్రూపంతో అల్ప తరంగావించి నిశ్శేషమైన దాని నెట్లు కోరగల వయ్యా! నీవు సృష్టించిన దంతయు నదియే గదా! (నీ సృష్టి లోపాన్ని గుర్తించక) ఇంకను భూమి నెక్కడ నుంచి తెచ్చి యివ్వ మందువు? ప్రభూ! నీవు సృష్టించిన భూ మండలం భువనాంతరాలతో సహా సర్వం నా తండ్రి నీకు ధార బోశాడు. నీ సృష్టిలో మిగిలిన దేదియు లేదే? యింకను కపట వచనాలు పలుకుతూ బంధిస్తా నందువేల? నీవు సృష్టించినది లేనప్పుడూ నీకు సృష్టించుటకు శక్తి లేనప్పుడూ దైత్యేశ్వరుడేమి చేయగలడయ్యా! ఆయన ప్రస్తుతం చేయ గలిగినది ఆయనకు చేతనైనది ఒక్కటే నిన్ను మనసార పూజించడమే. కనుక బంధన ప్రసక్తి వదలి, ఆయనను అనుగ్రహించి ప్రసన్నుడవు కమ్ము. దేశము కాలము పాత్ర నెరిగి గావించిన దానం అక్షయ మవుతుందని శ్రుతులలో నీవే చెప్ప లేదా? ఓ చక్రధరా! మా తండ్రి చేసినది భూదానము, పాత్ర యా జితాత్మవూ, దేవ దేవుడవైన నీవు. సమయమా, చంద్ర జేష్ఠా మూలా నక్షత్రాల పవిత్రయోగం!. ఇక స్థానమా క్షత్రాలలో తల మానికం కుక్షేత్రం, సుప్రసిద్దం! సర్వజ్ఞుడవైన నీకు బుద్ది హీనులమైన మేము, మంచిచెడులను, విధి నషేధాలను గురించి ఏమి చెప్పగలమయ్యా? వేదాలను మొదటసృజించిన వాడవు. సదస ద్విల సితమైన విశ్వంలో సర్వత్రా నిండి యున్న ప్రభువువు, నీకు తెలియని దేమి కలదు? మొదట్లో పొట్టి బొట్టెడివిగా వచ్చి మూడడుగులు యాచించావు. నిజం చెప్పు ప్రభో! లోక త్రయ పూజ్యమైన విశ్వరూపం దాల్చి మూడడుగులకూ బదులు మూడులోకాలూ నీవు తీసుకోలేదటయ్యా? ఇంకా వంచన మాట లెందుకు? నీ మూడు అడుగులకూ మూడు లోకాలు చాలక పోవడం లో ఆశ్చర్యంలేదు. ఒక్క చరణంతో టే ముల్లోకాలనూ లంఘించ లేవా? లోకేశ్వరా! ఇదంతా నీ లీల మాత్రమే కాదా? ఈ భూమిని చిన్న దానిగా నీవే సృష్టించి తర్వాత ఇప్పుడు బలిని బంధిస్తావా? పద్మనాభా! మాధవా! ఇదెక్కడి ధర్మమయ్యా? అవును నిజమే పెద్దలు తమకు నచ్చినది చేస్తారు. వారేమి చేసినా చెల్లుబడి అవుతుంది.
పులస్త్య ఉవాచ -
ఇత్యేవ ముక్తే వచనే బాణన బలి సూనునా | ప్రోవాచ భగవాన్ వాక్య మాది కర్తా జనార్దనః || 46
శ్రీ త్రివిక్రమ ఉవాచ -
యాన్యుక్తాని వచాం సీత్థం త్వయాబాలేయ సంప్రతమ్ | తేషాంవై హేతు సంయుక్తం శ్రణు ప్రత్యుత్తరమం మమ || 47
పూర్వ ముక్త స్తవ పితా మయా రాజన్ పదత్రయమ్ | దేహి మహ్యం ప్రమాణన తదేత త్సమనుష్ఠితమ్ || 48
కిం నవేత్తి ప్రమాణం మే బలి స్తవ పితా సుర! | ప్రాయ చ్ఛ ద్యేన నిశ్శంకం మమా నంతం క్రమ త్రయమ్ || 49
సత్యం క్రమేణ చైకేన క్రమేయం భూర్భువా దికమ్ | బలే రపి హితా ర్తాయ కృత మేత త్క్ర మత్రయమ్ || 50
తస్మా ద్యన్మ మ బాలేయ త్వత్ పిత్రాంబుకరే మహత్ | దత్తంతేనా యునేతస్య కల్పం యావ ద్భవిష్యతి || 51
గతే మన్వంతరే బాణ! శ్రాద్ధదేవస్య సాంప్రతమ్ | సావర్ణికే చ సంప్రాప్తే బలి రింద్రో భవిష్యతి || 52
ఇత్థం ప్రోక్త్వా బలి సుతం బాణం దేవ స్త్రి విక్రమః | ప్రోవాచ బలి మభ్యేత్య వచనం మధురా క్షరమ్ || 53
శ్రీ భగవానువాచ :-
ఆపూరణా ద్దక్షిణాయా గచ్ఛ రాజన్! మహా ఫలమ్ | సుతలం నామ పాతాళం పస తత్ర నిరామయః || 54
బలి రువాచ :-
సుతలే వసతో నాధ! మమ భోగాః కుతో%వ్యయాః | భవిష్యంతి తు యేనా%హం నివత్స్యామి నిరామయః || 55
శ్రీ త్రివిక్రమ ఉవాచ :-
సుతలస్థస్య దైత్యేంద్ర యాని భోగాని తే%ధునా | భవిష్యంతి మహార్హాణి తాని వక్ష్యామి సర్వశః || 56
దానన్యవిధి దత్తాని శ్రాద్ధా న్య శ్రోత్రియాణి చ | తథా%ధీతా న్యవ్రతిభి ర్దాస్యంతి భవతః ఫలమ్ || 57
తథాన్య ముత్సవం పుణ్యం వృత్తే శక్ర మహోత్సవే | ద్వార ప్రతి పదానామ తవ భావీ మహోత్సవః || 58
తత్ర త్వాం నర శార్దూలా హృష్టాః పుష్టాః స్వలంకృతాః | పుష్ప దీప ప్రదానేన అర్చయిష్యంతి యత్నతః || 59
తత్రోత్సవోముఖ్యతమో భవిష్యతి దివాని శం హృష్ట జనాభిరామమ్ యథైవ రాజ్యే భవతస్తు సాంప్రతం తథైవ సా భావ్యథ కౌముదీ చ || 60
పులస్త్యుడిలా అన్నాడు. నారదా! బలి తనయుడుబాణుని పలుకులు విని ఆది కర్తయగు జనార్దనుడిలా బదులు చెప్పాడు. బలి పుత్రా! నీవు గావించిన ఆరోపణలకు హేతు బదమైన సమాధానం చెబుతున్నా విను. నేను మొదలట్లోనే నా ప్రమాణాన్ని అనుసరించి నాకు మూడడుగు లివ్వమని అడిగాను. ఆ ప్రకారంగానే ఆచరించాను. ఓ దానవా! మీ తండ్రికినా ప్రమాణం తెలియదా? అతడు నిస్సంకోచంగా పరిమాణాతీతాలయిన మూడడుగులు నాకిస్తాననలేదా? నిజమే. నేను తలచుకున్నచో ఒక్క పాదంతోనే అన్ని లోకాలను కొలువ గలను. అయితే నీ తండ్రి హితాన్ని కోరి యే మూడడుగులలో వానిని కొలిచాను. ఓ బాణా! పవిత్రమైన దాన ధారను నాచేతిలో విడిచాడు. ఆ కారణాన నీతండ్రి ఆయుర్దాయం కల్ప పర్యంతం ఉంటుంది. యిప్పుడు జరుగుతున్న శ్రాద్ద దేవుని మన్వంతరం గడచిన మీదట సావర్ణి మన్వంతరంలో యితడు (బలి) ఇంద్రుడు కాగలడు. ఈ విధంగా బాణుని సమాధాన పరచి ఆ త్రివిక్రమ దేవుడు బలిని చూచి ప్రేమార్ద్రాలయిన తియ్యటి మాటలు ఇలా పలికాడు. దైత్య నాథా! దాన సాద్గుణ్యం కోసం నీ వివ్వ వలసిన దక్షిణ పూర్తయ్యే వరకు నీవు నా వారలందతో సుతల మనే పాతాళానికి వెళ్లి రోగ బాధలు లేకుండా వాసం చేయుము. అది విని బలి, భగవానుని యిలా ప్రశ్నించాడు. ప్రభో! సుతలంలో నిరామయంగా ఉండగలుగుటకు అవసరమైన అక్షయ భోగాలు నా కెక్కడ నుండి లభిస్తాయో చెప్పండి. అందుల కాత్రివిక్రముడిలా చెప్పాడు. బలిరాజా! సుతలంలో ఉన్నపుడు నీకు లభించే అపూర్వమైన భోగా లేవో చెబుతాను విను. అవిధి పూర్వకంగా చేయబడిన దానాలు, వేద మంత్రాలు లేకుండా పెట్టబడే శ్రాద్ధాలు, (బ్రహ్మ చర్య) వ్రత దీక్ష తీసుకోకుండా చేయబడే వేదధ్యయనాలు, వీటన్నిటి ఫలాలు వివిధ భోగాల రూపంలో నీకు లభిస్తాయి. ఇవి గాక నీ పేరిట ఒక మహోత్సవం ప్రతి సంవత్సరం జనులంతా చేసుకుంటారు. ఆ రోజు ఆరోగ్య వంతులై సంతోష స్వాంతువైన మానవులంతా చక్కగా అలంకరించుకొని దీప జ్యోతులు, పుష్పాంజలులు సమర్పించి శ్రద్దగా నిన్ను పూజిస్తారు. ఆ ఉత్సవంలో ముఖ్య భాగంగా కౌముది ఉత్సవం చేసుకుంటారు. ప్రస్తుతం నీ రాజ్యంలో జరుగుతున్నట్లే అప్పుడు గూడ రాత్రింబవళ్లు నరులు వేడుకలు చేసుకుంటారు.
ఇత్యేవ ముక్త్వా మధుహా దితీశ్వరం విసర్జయిత్వా సుతలం సభార్యమ్ |
యజ్ఞం సమాదాయ జగామ తూర్ణం సశక్ర సద్మామర సంఘజుష్టమ్ || 61
దత్వామఘోనే చ విభు స్త్రి విష్టవం కృత్వా చ దేవాన్ మఖ భాగ భోక్తౄన్ |
అంతర్తధే విశ్వపతి ర్మహర్షే! సంపశ్యతామేవ సురాధిపానామ్ || 62
స్వర్గం గతే ధాతరి వాసుదేవే | సాల్వో%సురాణాం మహతా బలేన | కృత్వా పురం సౌభమితి ప్రసిద్ధం
తదా ంతరిక్షే విచచార కామాత్ || 63
మయుస్తు కృత్వా త్రిపురం మహాత్మా సువర్ణ తామ్రాయ సమగ్ర సౌఖ్యం | స తారకాక్షః సహవైద్యుతేన
సంతిష్ఠతే భృత్య కలత్రవాన్ సః || 64
బాణో%పి దేవేన హృతే త్రివిష్టపే | బద్ధే బలౌ చాపి రసాతలస్థే | కృత్వా సుగుప్తం భువి శోణి తాఖ్యం |
పురం స చాస్తే సహదానవేంద్రైః || 65
ఏవం పురా చక్రధరేణ విష్ణునా బద్దో బలి ర్వామన రూప ధారిణా | శక్ర ప్రియార్థం సుర కార్య సిద్దయే
హితాయ విప్రర్షభ! గోద్విజానామ్ || 66
ప్రాదుర్భ వస్తే కథితో మహర్షే! పుణ్యః శుచా ర్వామనస్యాఘహారీ | శ్రుతే యస్మిన్ సంస్మృతే కీర్తి తే చ పాపం
ఏత త్ర్పోక్తం భవతః పుణ్య కీర్తేః
ప్రాదుర్భావో బలిబంధో%వ్యయస్య
యచ్చాప్చ్యన్యత్ శ్రోతుకామో%సి విప్ర!
తత్ ప్రోచ్యతాం కధయిష్యామ్య శేషమ్ || 68
ఇతి శ్రీ వామన పురాణ పంచ షష్టి తమో%ధ్యాయః సమాప్తః
మధుసూదను డిలా బలిని సమాధాన పరచి భార్యతో సుతలానికి పంపాడు. యజ్ఞాన్ని తనతో తీసుకుని దేవతలతో పరివేష్టితుడైన యింద్రుని వీటికి వెళ్లాడు. ఇంద్రున కతని త్రివిష్టపాన్ని యిచ్చి దేవతలకు వారల యజ్ఞభాగాలు పునరుద్ధరించి, ఓ మహర్షి నారదా! యింద్రాదులు చూచు చుండగా నా విశ్వనాథు డక్కడి కక్కడే అంతర్హితుడైనాడు. మానవుల భాగ్య నిర్ణేత యగు వాసుదేవుడు స్వర్గానికి వెళ్లగానే శాల్వ దైత్యుడు గొప్ప రాక్షస బలంతో అంతరిక్షంలోనే సౌభమనే నగరాన్ని నిర్మించుకుని యిష్టము వచ్చినట్లు తిరుగసాగాడు. మహాత్ముడగు మయుడు స్వర్ణ తామ్ర లోహ నిర్మితమైన త్రిపుర మనే పట్టణం సకల వసతులతో సర్వాంగ సుందరంగా నిర్మించుకుని భార్యా పరివారంతో, తారకాక్ష దైత్యులతో గూడుకొని సుఖ నివాసం గావించ సాగాడు. బాణుడు కూడ శ్రీహరి త్రివిష్టపాన్ని అపహరించిన మీదట తన తండ్రి బద్దుడై రసాతలానికి వెళ్ళగా భూమి మీద శోణితమనే చక్కని నగర దుర్గం నిర్మింకొని ముఖ్యులైన దైత్యేశ్వరులతో కలిసి రాజ్యం చేశాడు. ఓ నారదా! ఈ విధంగా పూర్వకాలాన దేవ కార్యం సిద్ధింప జేసి యింద్రునకు హితం చేయుటకు గోబ్రాహ్మణ కల్యాణం కోసమూ చక్రధరుడగు విష్ణు దేవుడు వామన రూపం దాల్చి బలిని బంధించాడు. పాప హరం పుణ్య ప్రదమూ అయిన వామనావ తార కథ నీకు చెప్పాను. దీనిని వినినా స్మరించినా కీర్తించినా పాపక్షయం కలిగి పుణ్యం లభిస్తుంది. పుణ్య శ్లోకుడు అవ్యయుడు నగు విష్ణుడు వామనుడుగా పుట్టి బలిని బంధించిన గాధ వినిపించాను. ఇంకనూ ఏమి వినదలచెదవో అడుగుము. వివరింగా చెప్పెదను.
ఇది శ్రీ వామన పురాణంలో అరువది యైదవ అధ్యాయం ముగిసినది.