Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
శ్రీరస్తు శ్రీ గణశాయనమః శ్రీ మాత్రేనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ఒకటవ అధ్యాయము మార్కండేయ వజ్ర సంవాదము నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్ | దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ || 1 కృతవర్మా తథా భోజః శ్వేతో మాహిష్మతీ పతిః | కులిన్ద స్సర్వదమనో మాలవి శ్చంద్ర వర్ధనః || 2 వత్స నాభశ్చ బాణశ్చ నందీశో దరసత్పతిః | ప్రతిసార శ్చిత్రధను స్సర్వో వాయురథ స్తథా || 3 ద్రవిడః కుసుమాపీడ ఔత్రశ్చ సమరప్రియః | శంభుః కిరాతరాజశ్చ ఔరసోనందివర్ధనః || 4 వటుమూలశ్చ తూనేశ శ్వాల్వశ్చ జనమేజయః | సుహ్మరాజో దధీకర్ణో బాహ్లీకో దమన స్తథా || 5 హిరణ్యనాభః కౌసల్యో దాశార్హో విజయ స్తథా | ఏతే చాన్యేచ రాజన శ్శతశో బహుదక్షిణాః || 6 సంపూర్ణచంద్రవదనా గజరాజ కరోరవః | ఉపాసాంచక్రిరే వజ్రం సింహాసనగతా నృపాః || 7 బహుభిర్భూమిపాలై శ్చ తథా వజ్రేణ ధీమతా | యుధిష్ఠి రేణచ సదా శోభితా శుశుభే సభా || 8 రాజానస్తే తతో దృష్ట్వా ఋషీన్ దుర్లభ దర్శనాన్ | బ్రహ్మలోకస్థ మాత్మాన మమన్యంత యశోభృతః || 9 ఊచు స్తే ప్రణయా ద్వాక్యం వజ్రం భూరి సహస్రదమ్ | యథా త్రేతాయుగే రాజన్ | ద్వాపరేచ యథా నృపాః || 10 అస్మిన్ తిష్యే చ సంప్రాప్తే తవ రాజన్ ! ప్రసాదతః | రాజన్ ! కృష్ణసగోత్రో ೭సి తేనేయం తే సభానృప! || ఉపాస్యతే మహాభాగైః బ్రహ్మకల్పై స్తపోధనైః | న తథా వీర్య నిర్జితా || 12 భక్త్యా యథా తు తసై#్యవ కృష్ణస్యామిత తేజసః | తేన కృష్ణేన తే చక్రుః వ్యతీతాః పూర్వ పార్ధివాః ||13 వర్తతా తేన కృష్ణేన తే రాజన్ ! మోక్ష మాప్నుయుః | అయం తిష్యయుగఃప్రాప్తో ఘెరః పరమ దారుణః ||14 దుర్లభం దర్శనం యత్ర నృప సంఘే మహాత్మనామ్ || 15 తస్మాత్త్వం రాజ శార్దూల ! ప్రష్టుమర్హో ద్విజోత్తమాన్ | వైష్ణవాన్ వివిధాన్ ధర్మాన్ సరహస్యాన్ ససంగ్రహాన్ || 16 ఇత్యేవ ముక్తో వజ్ర సై#్తః త్య క్త్వా సింహాసనం తదా | వజ్రంతు ప్రాంజలిం దృష్ట్వా సర్వ ఏవ నరాధిఫాః || 17 వరాసనాన్ విహాయాశు తస్థుః ప్రాంజలయ స్తదా || వజ్ర ఉవాచ : భవద్భిః నృపశార్దూలాః ప్రార్థితా యే ద్విజాఃశ్రితాః || 18 అనుగ్రహార్థం భూపానాం జగతో హితకామ్యయా | భవంతో వక్తు మర్హన్తి విష్ణుధర్మాన్ సనాతనాన్ || 19 * వి.ధ.పు-1 తస్మాత్తిష్యయుగేనా స్తి భవతాం దర్శనం నృపై ః నారాయణమునిని నరశ్రేష్ఠుడగు నరుని వాగ్ధేవిని వ్యాసమహామునిని నమస్కరించి పిమ్మట జయ శబ్ద వాచ్యమగు పురాణాదికమును ప్రవచనము చేయవలయును. కృతవర్మ భోజుడు శ్వేతుడు మాహిష్మతీపతి కువిందుడు సర్వదమనుడు మాలవి చంద్రవర్ధనుడు వత్సనాభుడు బాణుడు నందీశుడు దరసత్పతి పతిసారుడు చిత్రధనువు సర్వుడు వాయురథుడు ద్రవిడుడు కుసుమాపీడుడు ఓత్రుడు సమరప్రియుడు శంభువు కిరాతరాజు ఔరసుడు నందీవర్ధనుడు వటుమూలుడు తూనేశుడు శాల్వుడు జనమేజయుడు సుహ్మరాజు దధీకర్ణుడు బాహ్లికుడు దమనుడు హిరణ్యనాభుడు కౌసల్యుడు దాశార్హుడు విజయుడు మరి వందల కొలది రాజులు బహుదక్షిణలిచ్చి యజ్ఞములు సేసినవారు పూర్ణచంద్రముఖులు సింహాసనములధిష్ఠించినవారు వజ్రుని సార్వభౌమునిగ సేవించిరి. పెక్కుమంది రాజులచే యుద్ధమందు చలింపని వజ్రునిచే నాసభ మిక్కిలి శోభించెను. ఆ రాజులు దర్శనము సులభముగా లభింపని ఋషులను దర్శించి బ్రహ్మలోక మందున్నామనుకొనిరి. ప్రీతితో స్వర్ణ సహస్రదానములు సేసిన యా వజ్రునితో నిట్లనిరి: రాజా! త్రేతాయుగ ద్వాపరయుగము లందువలనే రాజులు- బ్రహ్మతో సమానులయిన బ్రాహ్మణులు-ఈకలియుగమందు నీదరికి దయచేసినారు. నీయనుగ్రహభాగ్యము. నీవు శ్రీకృష్ణునికి సగోత్రుడవు. నీసభ బ్రహ్మకల్పులగు మునులచే సేవింపబడుచున్నది. కృష్ణుని యెడల భక్తిచే నాతనితో గలసిమెలసియున్న మహానుభావులా కృష్ణునితో మోక్షముం బొందిరి. ఇదిగో కలియుగము పరమదారుణము వచ్చినది. ఇందు రాజసమాజమందు మహాత్ముల దర్శనము దుర్లభము. కావున నీవు ఈవచ్చిన మహర్షులను వైష్ణవధర్మములను సరహస్యముగ నడిగి తెలిసికొన నర్హుడువు. అనవిని సింహాసనము నుండి లేచి ప్రాంజలియైన వజ్రునింగని రాజులు తామును ఆసనముల నుండి లేచి నిలువబడిరి. అప్పుడు వజ్రుడు రాజులంగని మీచే బ్రార్థింపబడి మీచేత నాశ్రయింపబడి రాజుల ననుగ్రహింప హితార్థులై యిటకేతెంచిన బ్రాహ్మణులెల్ల ఋషులు మీరందరు సనాతన విష్ణుధర్మములను దెలుపదగును. కలియుగమందిక రాజులకు మీ దర్శనము కాబోదు. ఋషయః ఊచుః : ఉత్తిష్ఠ ! త్వం మహీపాల ! అలంకురు ! స్వమాసనమ్ || 20 శ్రవణ೭పి వయంతస్య విశేషేణ అర్థితాః నృప ! వజ్ర ! తేసంశయాన్ సర్వాన్ భేత్స్యత్యేష మహామునిః || 21 ఇత్యేవ ముక్తావజ్రంతే ఋషయ స్తపసి స్థితాః | మార్కండేయ మథోచుస్తే బ్రూహి ధర్మాన్ మహీపతేః || 22 వైష్ణవాన్ వివిధాన్ ధర్మాన్ లోకానా మఘహారిణః | తథా పార్థివ సంఘస్య సంశయాన్ మనసి స్థితాన్ || 23 మార్కండేయ ఉహచ: బ్రహ్మణ్య స్సత్యవాన్ ధన్య స్సర్వ శత్రు నిబర్హణః ! యద్యత్ పృచ్ఛసి మాంవజ్ర ! తత్తద్వక్తాస్మ్యసంశయం || 24 సింహాసనసోభవ ! భూమిపాల ! భవన్తు సర్వే ೭పి తథా మహీపాః | సుఖోపవిష్టైరిహ భూమిపాలై ః స్వసంశయాన్ బ్రూహియథా ప్రకామమ్ || 25 ఇత్యేవ ముక్తస్స యదు ప్రధానో భృగుప్రబర్హేణ మహర్షి మధ్యే | ప్రణామ్య విప్రాన్ సజగామ రాజా సింహాసనం రత్న సహస్ర చిత్రమ్ || 26 సింహాసనస్థే నృపవర్యముఖ్యే సింహాసనస్థాఃక్షితిపప్రధానాః | సర్వే బభూవుః ప్రణతా స్తథాచ శుశ్రూషవో బ్రహ్మణ ముఖ్యవాక్యమ్ || 27 వజ్ర ఉహచ: ఆచక్ష్వ మహ్యం భృగువంశ చంద్ర ! సముద్భవంత్వం జగతో యథావత్ | శృణ్వంత్వి మే బ్రాహ్మణసంఘముఖ్యాః నరేంద్ర ముఖ్యాశ్చ వచ స్త్వదీయమ్ ||28 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే కథాప్రస్తావనంనామ ప్రధమో೭ ధ్యాయః రాజా ! నీ యాసనము నీవలంకరింపుము. మేమును నావిషయము శ్రవణముసేయగోరుచున్నాము. నీ సంశయము లన్నిటిని నీమహాముని వారింపగలడు. అని వారు మార్కండేయ మహర్షినిగని 'లోకముల పాపములను హరించు వివిధ వైష్ణవ ధర్మములను ఈరాజునకు నీరాజసంఘమునకును ఆనతిచ్చి వీరి సంశయనివారణము సేయుమన మార్కండేయుడిట్లు తెలుపదొడంగెను: ఓ వజ్రేశ్వరా | నీవు బ్రహ్మణ్యుడవు- సత్యసంధుడవు-ధన్యుడవు-సర్వశత్రు సంహర్తవు. కావున నీవేదియడిగెద వది నిస్సంశయముగ నేను జెప్పెదను. నీ సింహాసన మీవధిష్ఠింపుము. ఈరాజులందరును సుఖోపవిష్టులగుదురుగాక ! నీ సందేహములడుగు మన యదుముఖ్యుడైన వజ్రుడు ఆ భృగుప్రవరునికి ప్రణామములు గావించి రత్న సింహాసనముపై కూర్చుండెను. రాజులును ఆసనములు నలంకరించిరి. ఆ నిప్రముఖ్యుని వచనములాలింప వారు ప్రణతులైరి. అప్పుడు వజ్రుడు ఓ భృగువంశచంద్రా ! ఈజగత్తు ఎట్లు పుట్టినదో దెలుపుము. ఈ బ్రాహ్మణసంఘము రాజసమాజము నీవచనము లాలింతురు. అనియె. ఇది విష్ణుధర్మోత్తరమహాపురాణము-ప్రథమఖండమందు మార్కండేయ వజ్రసంవాదమందు కథాప్రస్తావనమను ప్రథమాధ్యాయము