Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూరవ అధ్యాయము - ప్రతిగ్రహనక్షత్ర దేయాదేయ పానీయవర్ణనము మార్కండేయ ఉవాచ : ధ్రువస్థాన నివిష్టానాం దేవతానాం పృధక్ పృధక్ | పానాయ దాపయేత్ క్షీరం ప్రీతయే వా೭న్తరాత్మనః ||
1 గంధోదకం తధా೭ర్కాయ పయస్య్సోమాయ కీర్తితమ్ | భూమి పుత్రాయ ఖర్జూరం మర్ద్వీకం శశిజాయ చ ||
2 జీవాయచ తథా తక్రం శుక్రా యేక్షు రసం తథా || మాంసపానం తు సౌరాయ రాహోర్మీన రసం తధా | ఛాగం పయః ప్రదాతవ్యం కేతవే మనుజేశ్వర!
3 గంధోదకం కృత్తికానాం రోహిణీనాం సువీరకమ్ | ఇల్వలానాం పయః ప్రోక్తం రౌద్రేః ఖార్జూర మానవమ్ || 4 ఆదిత్యాయ తథా గౌడం క్షీరం తిష్యాయ దాపయేత్ | క్షీర మేవ చ సార్పాయ తధా పిత్ర్యాయ యాదవ! || 5 గంధోదకంచ భాగ్యాయ తధా೭ర్యవ్ణూయా కీర్తితమ్ | సావిత్రాయ తధాయస్తు త్వాష్ట్రాయ చ తధా పయః || 6 వాయవ్యాయచ మార్ద్వీక మైంద్రాగ్న్యాయ చ కాంజికమ్ | మిత్రాయ తక్రం దేయంచ శాక్రాయ దధి దాపయేత్ || 7 నారికేశాంబు మూలాయ తథాప్యాయ మధూదకమ్ | ఖార్జూరం వైశ్వదేవాయ బ్రాహ్మాయ సలిలం హితమ్ || ఆమ్రైః పానం వైష్ణవాయ జంబుభి ర్వాసవాయ చ | వారుణాయ మధూకై శ్చ రస మాజస్యపార్థివ! || 9 అహిర్బుధ్న్యస్య చ తధా రసమేవ భ##వే న్నృప! | పౌష్ణాయ చ భ##వే చ్ఛాగం చాశ్వినాయ చ మాహిషమ్ || 10 సమానదేవ నక్షత్రం కధితం చ తధా దిశామ్ | ఉత్తరాయై ప్రదాతవ్యం తధా క్షిరం నరాధిప! || 11 సాగరాణాంచ సర్వేషాం సతతం భూతి మిచ్ఛతా || 12 యద్యద్రహస్యా೭ భిహితం మయా೭త్ర ఋక్షస్యవా భూమిపతిప్రధాన! తద్దేవతాయాశ్చతధైవదేయం దిశ స్తథా నా೭త్ర విచారణా೭స్తి || 13 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే - ప్రధమ ఖండే - మార్కండేయ వజ్రసంవాదే ప్రతిగ్రహర్షదేయా దేయపానవివరణంనామ శతతమో೭ధ్యాయః మార్కండేయుడనియె. ధ్రువస్థానమందున్న దేవతలకును వేర్వేర పానముకొఱకు క్షీరమొసగ వలెను. అది అంతరాత్మ ప్రీతి కరమగును. గంధోదకము సూర్యునికి చంద్రునికి పాలు కుజునికి ఖర్జూర పండ్ల రసము బుధునికి ద్రాక్షరసము గురునికి మజ్జిగ శుక్రునికి చెఱకురసము శనికి మాంసపానము రాహువునకు మీనరసము కేతునకు మేకపాలు నీయవలెను. కృత్తికకు గంధోదకము రోహిణికి సువీరకము=పులిసిన కడుగు మృగశిరకు పాలు ఆరుద్రకు ఖర్జూరాసవము ప్రశర్వసువునకు బెల్లపు ఆసనము, పుష్యమికి అశ్లేషునకు మఘకును పాలే. పుబ్బకు ఉత్తరకు గంధోదకము హస్తకు చిత్తకు పాలు స్వాతికి ద్రాక్షరసము విశాఖకు కాంజికము (గంజి) అనూరాధకు తక్రము (మజ్జిగ) జ్యేష్టకు పెరుగు, మూలకు కొబ్బరినీరు, పూర్వాషాఢకు మధూదకము. ఉత్తరాషాఢకు ఖర్జూరోదకము శ్రవణమునకు మంచినీళ్ళు ధనిష్ఠకు మామిడిపండ్లరసము శతభిషమునకు నేరేడుపండ్లరసము పూర్వాభాద్రకు మేకరసము ఉత్తరాభాద్రకు మాంసరసము. రేవతికి మేకపాలు అశ్వినికి గేదెపాలు భరణికి స్వచ్ఛమైన మాంసరసము నీయవలెను. గ్రహనక్షత్ర దేవతాధిదేవతల కొకేవిధముగా నిది చెప్పబడినది. సముద్రములకు నంతే. ఉత్తర దిక్కునకు మాత్రము క్షీరము పానీయముగా నీయవలెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున ప్రతి గ్రహనక్షత్ర దేయాదేయ పానీయవర్ణనమను నూఱవ యధ్యాయము.