Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటనాల్గవ అధ్యాయము - ప్రతిసరబంధ అశీర్వాదము మార్కండేయః ఏవంశాన్త్యవసానేతు యజనస్య యాజకః | హృది విన్యస్య దర్బాగ్రాన్ తధా స్వేదక్షిణ కరే||
1 కుర్యాత్ప్రతిసరాబంధం తన్మే నిగదతః శృణుః | బద్ధప్రతిసర స్యాస్య సర్వే నశ్యన్తు రాక్షసాః || 2 ధ్రువస్త్వా మూర్ధ్వతః పాతు పూర్వతః పాతుభాస్కరః | భౌమో దక్షిణతః పాతు వశ్చా త్పాతు శ##నైశ్చరః || 3 ఉత్తరేణ బుధః పాతు కేతుఃపాతు తధాహ్యధః | పూర్వదక్షిణతం శుక్రో దక్షిణవపరత స్తమః || 4 పశ్చిమోత్తరత శ్చంద్రో జీవః ప్రాగుత్తరేణతు | ఉక్తసంధిషు సర్వాణి నక్షత్రాణి తవానఘు! || 5 స్వాం స్వాం దిశ మధిష్ఠాయ తవ నిత్యం దిగీశ్వరాః | రక్షంతు సర్వదుష్టేభ్యః శక్రవహ్ని పురోగమాః || 6 శాత్రవాణాంచ చోరాణాం వ్యాధీనాం పాతకస్యచ | అమంగళానాం ఘోరాణా మనిష్టానాం తధైవచ || 7 దుస్స్వప్నానాంచ ఘోరాణాం చింతితానాం కృధా మృషా | వజ్రేణ నాశనం శక్రః కరోతు బలసూదనః 8 దండేన నాశనం నిత్యం విదధాతు యమో೭న్తకః | పాశేన వారుణో దేవో గదయాచ ధనేశ్వరః || 9 గ్రహసన్నాహసన్నద్ధో గ్రహపంజరమధ్యగః | ఆదృశ్యః సర్వభూతానాం సర్వదుఃఖవివర్జితః || 10 సర్వవ్యాధివిహీనశ్చ కాలకర్ణీ వివర్జితః | తధా త్వం భవ! దీర్ఘాయః గ్రహేంద్రాణాం ప్రసాదతః || 11 రక్షన్తుతే దేవగణా సమగ్రాః ధర్మే మతించాపి సదా దిశన్తు| నాశం తథా శత్రుగణస్య చోగ్రంభోగాన్ మనోజ్ఞాన్ విపులాం చ లక్ష్మీమ్ || 12 ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే శాన్త్యవసానే ప్రతిసరబంధ ఆశీర్వాదోనామ చతురధికశతతమోఅధ్యాయః మార్కండేయుడనియె. ఇట్లు శాంతిపూర్తియైనతరువాత యాజకుడు దర్భలను కొనలను తన కుడిచేతబట్టుకొని హృదయ మునందానించి యాతనికి తోరము (ప్రతిసరము) గట్టవలెను. యజమానుని క్షీప్రతిసరము కట్టిన యాతనికి సర్వరాక్షసులు నశింతురు గాక! ధ్రువుడు నిన్ను మూర్ధబాగమున రక్షించుగాక! భాస్కరుడు తూర్పున రక్షించుగాక! కుజుడు దక్షిణమున గాపాడుగాక! పడమట శని ప్రోచుగాక! ఉత్తరమున బుధుడు రక్షణయిచ్చుగాక! అధోభాగమున కేతువు పాలించుగాక! అగ్నేయమూల శుక్రుడు దక్షిణదిక్కు అవ్వల నిరృతిమూల రాహువు వాయవ్యమూల చంద్రుడు ఈశాన్యదిశను గురువు నిన్ను బ్రోచుగాక! ఈ చెప్పిన సంధులందు సర్వ నక్షత్రములు తమ తమ దిశలంధిష్ఠించి దిక్పతులు ఇంద్రాగ్ని ప్రభృతాలు సర్వదుష్టుల నుండి నిన్ను రక్షింతురు గాక! బలసూదనూడైన శక్రుడు ఇంద్రుడు వజ్రాయుధముంగొని శత్రువులు చోరులు రోగములు పాపము అమంగళములు ఘోరములు అరిష్టములుయొక్క అసత్యచింతనములు దుఃస్వప్న ములయొక్కయు నాశనముచేయుగాక! అంతకుడగు యముడు దండముచే నిత్యమును వరుణుడు, పాశముచే గదచే ధనేశుడు వీనిని నశింపజేయుదురుగాక ! నీవు గ్రహసన్నాహసన్నిద్ధుడవై గ్రహపంజర మధ్యస్థుడవై సర్వభూతములకు సదృశ్యుడవై సర్వదుఃఖవివర్జితుడవై నీవు గ్రహాధీశుంప్రసాదముచే దీర్ఘాయువగుము. దేవగణములెల్ల నిన్నురక్షింతురుగాక! ధర్మమునందు బుద్ధిని నీ కనుగ్రహింతురుగాక! నీ శత్రువుల నాశనమతిభయంకరముగ నాచరింతురు గాక! మనోజ్ఞములయిన విపులములైన భోగములను లక్ష్మిని నీకు వారు ప్రసాదింతురుగాక ! ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున ప్రతిసరబంధ--అశీర్వాదమను నూటనాల్గవ అధ్యాయము.