Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటఐదవయధ్యాయము - గ్రహసంభవము మార్కండేయః : హవిష్యాశీ తతస్తిష్ఠేత్ బ్రహ్మచారీచ తాం నిశామ్ | గ్రహశాన్తి రియం పోక్తా మయా కల్మషనాశినీ ||
1 అనావృష్ట్యాం ప్రయోక్తవ్యా పృష్టికామేన భూభుజా | అతివృష్ట్యాం ప్రయోక్తవ్యా వృష్టిం శమయతా తథా ||
2 యాత్రాకాలే తథా కార్యా రిపూణాం క్షయ మిచ్ఛతా | రణకాలే తథా కార్యా సంగ్రామే జయ మిచ్ఛతా ||
3 కర్తవ్యా చాభిచారార్థం శత్రూణాం మనుజేశ్వర | పుష్టికామై ర్నరైః కార్యా విద్యాకామై స్తదైవచ ||
4 లాభార్థంచ తథా వైశ్యైః శూద్రే ఖర్మ ఫలే ప్సుభిః | రాజ్యకామేన కర్తవ్యా రాజపుత్రేణ పార్థివః || 5 తథా బంధనమోక్షార్థం బద్దేన చ మహీపతే | స్థాన చ్యుతేన కర్తవ్యా స్థాన లబ్ధి మధే చ్ఛతా || 6 వ్యాధితేన చ కర్తవ్యా వ్యాధేః ప్రశమ మిచ్ఛతా | మారికే చ తథా కార్యా మారకక్షయ మిచ్ఛతా || 7 పరాభిచారశంకాయాం గ్రహశాన్తిం ప్రయోజయేత్ | దివ్యా న్తరిక్ష భౌమానా ముత్పాతానాం తధోద్భవే || 8 గ్రహాధీనా నరేంద్రాణా ముచ్ర్ఛాయాః పతనానిచ | భావాభావౌ చ జగతాం గ్రహాయత్తా నరాధిపః || 9 బ్రహ్మాణౖ షాం వరో దత్తః పూజితాః పూజయిష్యధ | తస్మా త్సర్వ ప్రయత్నేన నృణాం పూజ్యతమా గ్రహాః || 10 గురు భక్తన్య దాన్తస్య ధర్మార్పితధనస్యచ | పూజానాచ్చ గ్రహేంద్రాణాం సదా సానుగ్రహా గ్రహాః || 11 మానవస్యాస్వతంత్రస్య గోబ్రాహ్మనహితస్యచ | మాంసభక్షణ హీనస్య సదా సానుగ్రహా గ్రహాః || 12 యే భక్తాః పుండరీకాక్షం దేవదేవం జనార్దనమ్ | నాస్తి తేషాం జగ త్యస్మిన్ దోషో గ్రహా కృతో సృణాం || 13 యథా రణ ప్రహారాణాం కవచం వారణం భ##వేత్ | తథా దైవోపఘాతానాం శాన్తిర్భవతి వారణం || 14 గ్రహయాగవిధిం సమ్యగ్యశ్చాధీతే నరాధిప | గ్రహపాప కృతం చైవ తస్యాపి న భవిష్యతి || 15 అతీవ విస్తరేణయం గ్రహశాన్తి రుదాహృతా | ధన్యా యశస్యా చాయుష్యా సర్యకిల్భిష నాశినీ || 16 ప్రయుంతో సమ్య గిమాం నరేంద్ర | న జాతు లోకే భయ మస్తి కించిత్ | ఆరోగ్య మాసాద్య చిరంచ జీవేత్ | ప్రాప్నోతి లక్ష్మీం సకలాంశ్చ భోగాన్ || 17 ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమ ఖండే గ్రహశాన్తి ఫలవర్ణనంనామ పంచాధిక శతతమో ೭ధ్యాయః || మార్కండేయుడనియె. శాంతియయిన యారాత్రి హవిష్య మారగించి బ్రహ్మాచారియై యుండవలెను. కల్మషహరమైన గ్రహశాంతి యిది నే దెల్పితిని. అనావృష్టియందు వర్షముకోరి రాజిద్దానిని బ్రయోగింపవలెను. అతివృష్టికి రోగశాంతికిని యిది ప్రయెగింపదగినది. శత్రుక్షయమునకు, దండయాత్ర సమయములో, యుద్ధకాలములో జయముకోరి యిది యాచరించవలెను. అభిచార మునకు [శత్రునాశనముగావలెనని] యిది సేయనగును. వుష్టిని విదనుగోరువారిది యనుష్ఠింపవలెను. లాభార్థులై వైశ్యులు ధర్మఫలార్థులై శూద్రులు రాజ్యలేమియై రాజకుమారుడు నిది నిర్వర్తింపనగును. బంధమోక్షమునకు స్థానభంగమందినవాడు స్థానలాభముకోరి వ్యాధితుడు వ్యాధిశాంతినర్థించి దుర్భిక్షదశలో దుర్భిక్షముపోగోరి శత్రువెవడేని అభిచారకర్మ చేతబడి మొదలైనవిచేసెనేమోయని శంకగల్గినపుడు దివ్య-అంరీక్ష-భౌమములను త్రివిధోత్పాతములు తటస్థించినతరి మనోవ్యాధులతిశయించినపుడు నిది యనుష్టింపవలెను. రాజులకు ఉచ్ఛాయము (హెచ్చుస్థితి) పతనములు జగత్తులకు భావాభావములు (ఉండుట లేకుండుట) మొదలగు నివి యెల్ల గ్రహనిమిత్తములు. బ్రహ్మ వీరికి మిమ్ము పూజించినవారిని మీరు పూజింపుడని వరమిచ్చిన్నాడు. కావున సర్వప్రయత్నముచేత నరులకు గ్రహములు అత్యంతపూజ్యములు. గుర్వనుగ్రహపాత్రునికి దాంతునికి ధర్మార్జిత సంపన్నునికి గ్రహాధీశ పూజకునికి గ్రహములు సదా సానుగ్రహములగును. అస్వతంత్రుడైన మానవునకు గోబ్రాహ్మణహితునికి మాంసభక్షణము సేయని వానికి గ్రహములు మహానుగ్రహ సంపన్న ములగును. పుండరీకాక్షునియెడ దేవదేవుని జనార్దనుని భక్తులగు వారకీలోకమందు గ్రహదోషము లేదు. బాణములదెబ్బలకు కవచము వారణమైనట్లు దైవికోపఘాతములకు హరిభక్తి నివారణ మగును. ఈ గ్రహయాగ విధి నెవ్వడు చక్కగా జదువు నాతనికి మాహాపాపఫలముగూడ గలుగదు ఈ గ్రహ శాంతి మిక్కిలివిస్తరముగకు దాహృతమైనది. ఇది ధన్యము యశస్యము ఆయుష్యము సర్వకిల్బిష నాశకము. దీనిని లెస్సగ ప్రయోగించిన వాని రాజేంద్ర! ఎన్నడు దేని లోకమున నెంచుకేని భయము. కలుగదు. అతడారోగ్యమంది లక్ష్మీని సకలభోగములు నంది చిరకాలముజివించును. మహాలక్ష్మిని సకలభోగములనుగూడ పొందును. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున గృహశాంతి ఫలవర్ణనమను నూటయైదవ అధ్యాయము.