Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటపందమ్మిదవ అధ్యాయము - ధర్మవంశాను కీర్తనము మార్కండేయ ఉవాచ :- అస్మిన్యైవ స్వతేప్రాప్తే శృణు ధర్మస్య
పార్థివ! | దాక్షాయణ్యాశ్చ సకలం శృణు త్వం వంశముత్తమమ్ ||
1 ఏవం తాని మహేదుర్గశరీరాణి నరాధిప ! | అరుంధత్యా ప్రసూతాని ధర్మోవైవస్వతే೭ంతరే || 2 అష్టౌచవసవః పుత్రాః సోమపాశ్చవసో స్తధా | ధరోధ్రువశ్చ సోమశ్చ ఆపశ్చై వానలానితౌ ||
3 ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ పసవో೭ష్టౌ ప్రకీర్తితాః | ధరస్య పుత్త్రోంబునింబః కాలః పుత్త్రోధ్రువస్యచ ||
4 కాలస్యావయవానాంతు శరాణి నరాధిప | ముహూర్త వర్జం కాలాదిర్థి ప్రసూతాన్య విశేషతః ||
5 సోమస్య భగవాన్వర్చాః శ్రమస్త్వాపస్య కీర్త్యతే | అనేక జన్మాజనవః కుమారశ్చానలన్యతు ||
6 పురోజనాశ్చానిలస్య ప్రత్యూషస్య చదేపలః | విశ్వకవిర్మా ప్రభాసస్యత్రి ధశానాంస వార్ధకిః ||
7 జామీదుహితరః ప్రోక్తాః నాగవీధ్యాదయోనవ | లంచాపుత్త్రః స్మృతోఘోషో భాను పుత్త్రశ్చభానవః || 8 గ్రహర్షాణాంచ సర్వేషాం చాన్యేషామపితేజసామ్ | మరుత్వత్యాంమరుత్వంతః సర్వే పుత్త్రాః ప్రకీర్తితాః || 9 సంకల్పాయాశ్చ సంకల్పాస్తధా పుత్త్రాః ప్రకీర్తితాః | ముహూర్తశ్చ ముహూర్తాయాః సాధ్యాత్సాధాః సుతాఃస్మృతాః || మత్తోన్మత్త్చ ప్రాణశ్చ నరోపాశాణశ్చ వీర్యవాన్ | చిత్తిర్నరో హయశ్చైవ హంసోనారాయణ స్తధా || 11 విభుశ్చాపి ప్రభుశ్చాపి సాధ్యాద్వాదశకీర్తితాః | విశ్వాయాశ్చతధా పుత్త్రాః విశ్వేదేవాః ప్రకీర్తితాః || 12 క్రతుర్దక్షోవసుః సత్యః కాలః కామోధునిస్తధా | ఊరవాన్మనుజో విశ్యేరోమాయాశ్చ హితేదశ || 13 ఏతావదుక్తంత వధర్మవంశం సంక్షేపతః పార్థివ సంఘముఖ్యః | వ్యాసేనవక్తుంవ హిశ క్తిరస్తి రాజన్వినా వర్షశ##తైరనేకైః || ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయ వజ్రసంవాదే ధర్మవంశాను కీర్తినంనామ ఏకోన వింశోత్తర శతతమోధ్యాయః మార్కండేయు డిట్లనియె:- రాజా! వైవశ్వత మన్వంతరము రాగానే ధర్మునియొక్క దాక్షాయణియొక్క సర్వవంశమును వినుము. వసువు యొక్క కుమారులెనమండుగురు. అష్టవసువులు. సోమపాలము సేసినవారు. వారిపేర్లు ధరుడు, ధ్రువుడు, సోముడు, ఆపుడు, ఆనిలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడునని. ధరుని కొడుకు అంబునింబుడు. కాలుడు ధ్రువుని కొడుకు. కాలుని యవయవములయొక్క శరీరములు ముహూర్తములు తప్ప మిగిలినవి కాలునివలన పుట్టినవి. సోమునికొడుకు వర్యుడు. అతాపుని కుమారుడు శ్రముడు. అనలునికుమారుడు అనేక జన్మము లెత్తిన జనవుడు. అనిలుని కుమారుడు పురోజపసుడు ప్రత్యూషుని సుతుడు దేవలుడు. ప్రభాసునికుమారుడు విశ్వకర్మ. ఇతడుదేవతల వడ్రంగి. నాగవీథ్యాదులు తొమ్మిదిమంది కూతుండ్రు. లంబాపుత్రుండు ఘోషుడు భాపుపుత్రుడు గ్రహములనక్షత్రములు మరియితర తేజస్సులన్నిటి యొక్క సంతానమే. ముహూర్తములు మరుత్వతియం దుదయించిన కొడుకులందఱు మరత్వంతులు. సంకల్పయను నామె కొడుకులు సంకల్పులు. ముహూర్త కుమారులు. సాధ్యయందు గలిగిన వారు సాధుగలు ద్యసులుతు. మత్తుడు ఉన్మంత్తుడు ప్రాణుడు నపోపాణు చిత్త్యి నరుడు హయుడు హంసుడు నారాయణుడు విభువు ప్రభువు ననువారు పండ్రెండుగురు సాధ్యలు విశ్వ యొక్క కొడుకులు విశ్వేదేవులు. క్రతువు, దక్షుడు, వసువు, సత్యుడు, కాలుడు, కాముడు, ధుని, ఊరహతుడు, మనుజుడు విశ్వేదేవతలుననువారు పదిమంది రోమ యొక్క కుమారులు. ఇంత వరకు ధర్ముని వంశము సంక్షిప్తముగ దెల్పబడినదిప. పెక్కు వందల యేండ్లకుగాని వివరముగ దెలుపగల శక్తి నాకు లేదు. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున ధర్మవంశాను కీర్తనమను నూటపందొమ్మిదవ అధ్యాయము