Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటయిరువదియొకటవ అధ్యాయము - దితివంశాను కీర్తనము మార్కండేయ ఉవాచ : దితిః పుత్త్రద్వయం రాజన్! జనయామాస విశ్రుతమ్ |
హిరణ్యాక్షం
చ దుర్ధర్షం హిరణ్యకశిపుం తధా || 1 హిరణ్యాక్షోహాతో రాజన్నృవరాహేణ సంయుగే | హిరణ్యకశ్యిపూరాజ న్నృసింహేననిపాతితః ||
2 హిరణ్యకశిపోః పుత్త్రః ప్రహ్లాదోరి కులాంతకః | కాలనేమిశ్చ దుర్ధర్షో మహాబలపరాక్రమః || 3 ఆరాధ్య కేశవం దేవం ప్రహ్లాదశ్చ మహాబలః | ప్రాప్తవాన్జీజలితం దీర్ఘం బ్రాహ్మందిన మనుత్తమమ్ || 4 కాలనేమిశ్చ దుర్ధర్షోమహాబలపరాక్రమః | నిహతో వాసుదేవేన నివృత్తే తారకాగమే || 5 ప్రహ్లాదస్య సుతః శ్రీమాన్రాజన్నామ్నా విరోచనః | విరోచన సుతః శ్రీమాన్బవిరిత్యేవ విశ్రుతః || 6 వామనం రూపమాస్థాయ బద్ధోయో విష్ణునాపురా | బలేర్పాణః సుతోరాజన్ స్మృతో బాహు సమస్రవాన్ || 7 పితుస్తేశ్వశురః శ్రీమాన్ పితురర్థే తవానఘం! | వివాహంకృతవాన్ కృష్ణో నగరే శోణితాహ్వయే || 8 యస్మిన్సవైదేవవరః ప్రసహ్య | స్కందంచ రుద్రం దితిజైః సమేతమ్ | రణ విజిజిగ్యే నృపతిప్రధానః సహానుగం వీర్య బలోప పన్నమ్ || 9 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే దితివంశానుకీర్తనంనామ ఏకవింశత్యుత్తర శతతమో೭ధ్యాయః మార్కండేయుడనియె : దితికిద్దరు కొడుకులు హిరణ్యాక్షుడు హిరణ్య కశిపుడను వారు. నరవరాహాపతారమెత్తి విష్ణువు హిరణ్యాక్షుం జంపెను. నరసింహావతారుడై హిరణ్యకశిపుం జంపెను. హిరణ్యకశిపు కుమారులు. ప్రహ్లాదుడు, కాలనేముయును. కాలనేమి బలశాలి. వానిని తారకామయము నివృత్తముకాగా విష్ణువు గడతేర్చెను. ప్రహ్లాదుడు హరిని ఆలాధించి బ్రహ్మయొక్క యొక పగలు అనగా నొక కల్ప మాయువుం బడసెనుంప్రహ్లాదుని సుతుడు విరోచనుడు. వానికొడుకు బలి. వామనరూపుముదాల్చి విష్ణువు అతనిం బంధించెను. బలి కొడుకు బాణుడు. వానికి వేయిబాహువులుండెనట. ఓ వజ్ర మహారాజా ! నీతండ్రి మామగారగు కృష్ణుడు మీతండ్రి కొరకు శోణిత నగరమున వివాహము గావించెను. ఆ వివాహమందు స్కందుని (కుమారస్వామిని) రుద్రుని దేవతలతో గూడి వచ్చినవారిని యుద్ధమునందు సపరివారముగ నున్న వారిని జయించెను. ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమ ఖండమున దితి వంశ కీర్తనమను నూటగ యిరువది యొక్కటవ అధ్యాయము