Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటయిరువదినాల్గవ అధ్యాయము - భగవద్దర్శనము మార్కండేయ ఉవాచ :- నాయ్వగ్నీ సహితౌగత్వామయతారపురోగమాన్ |
జిగ్యతుః సమరే దైత్యా న్నానా ప్రహరణోద్యతాన్ ||
1 విజితాస్తే రణీదైత్యా మయతార పురోగమాః | త్యక్త దేవాలయాః సర్వే వరుణాలయ మాగతాః ||
2 ఏతస్మిన్నేవ కాలేతు హిరణ్యకశిపోః సుతః | కాలనేమిరితి ఖ్యాతః శీత శీర్షోను దృశ్యతే ||
3 శతబాహుర్మహాకాయః పర్వతాకార దర్శనః | బ్రహ్మలబ్ధవరోరౌ ద్రో దగ్ధ శైలసమచ్ఛవిః ||
4 ఏకోదరోద్వెపాదశ్చ ఏకగ్రీవః సురాంతకః | అంగదీ బద్దముకుటః కుండలాంబర భూషణః ||
5 సర్వాయుధధరో రౌద్రో గదాపాణీర్విభీషణః | దత్వా೭భయం సదైత్యానాం తసై#్మ మీరుంసురాలయమ్ ||
6 గత్వా విజిగ్యేత్రిదశాన్ స్థానేభ్యశ్చావరో పయత్ | త్రైలోక్యమాత్మ సాత్కృత్వా సుఖమాస్తే త్రివిష్టపే ||
7 తస్యతేహ్యనుగాః సర్వేలోకాః స్థావరజంగమాః | తదాజ్ఞాకారిణఃస్సర్వే తద్భావస్యాను వర్తకాః ||
8 పంచతత్రాభ్య వర్త విపరీతేన కర్మణా | వేదో ధర్మ క్షమా సత్యం శ్రీశ్చనారాయణాశ్రయాః || 9 సర్వేషామను సంధానాత్సరోషో దానవేశ్వరః | వైష్ణవం పదమయన్విచ్ఛన్ య¸°నారాయణాన్తికమ్ || 10 జ్ఞాత్వాదైత్య మధాయాంతం దేవో೭పిమధునూ దనః | తార్‌క్ష్యమావాహయాంచక్రే ఆరురోహరచతం హరిః 11 సదదర్శ హరిందేవం తార్ష్యస్థం దైత్యరాట్ తదా || సజల జలదనీలం పద్మ పత్రాయతాక్షమ్ ఖగవతి మవరూఢం కల్పవృక్షోపమానమ్ | హలముసలగదాభిః శోభితందేవదేవం వర పురుషమజేయం శార్గ చక్రాసిపాణిమ్ || 12 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయ వజ్రసంవాదే కాలనేమ్యుపాభ్యానే శ్రీభగవద్దర్శనం నామ చతుర్వింశత్యధిక శతతమో೭ధ్యాయః మార్కండేయుడనియె :- వాయువు అగ్నియు నేగిమయతారా ప్రభృతులగు దైత్యులను గెల్చిరి. ఆదైత్యులు దేవాలయము (స్వర్గమును) విడిచి వరుణాలయమునకు వచ్చిరి. ఇదే సమయమున హిరణ్య కశిపుని కొడుకు కాలనేమి చల్లని శిరస్సుతో గనబడెను. శతబాహులై పర్వత మట్లుండెను, బ్రహ్మ పరములొందెను. కాలినకొండవలె వెలుగుచుండెను. ఏకోదరుడు ద్విపాదుడు సురాంతకుడు అంగదములు దాల్చి కిరీటము పెట్టుకొని కుండలములు దాల్చి చక్కని వస్త్రములు కట్టుకొని సర్వాయుధములూని భయంకరుడై దైత్యుల కభయమిచ్చి సురలకావాసమైన మేరువునకేగి వేల్పులను గెల్చెను. వారిని స్థాన భ్రష్టులను గూడ చేసెను. ముల్లోకములు తన వశము సేసికొని స్వర్గమందు సుఖముండెను. వానిననుగమించి చరాచరములయిని యెల్లలోకములు వావి యజ్ఞకు కట్టుపడి వాని భావమున కనుకూలముగ మెలగిరి. వాని రాజ్యమందు వేదము ధర్మము క్షమ (ఓరిమి) సత్యము. నారాయణాశ్రయమైన లక్ష్మియను నైదు పదార్ధములు మాత్రము వానికి విపరీతములై (వ్యతిరేకించి) ప్రవర్తించినవి. అందరిం గూడకట్టుకొని రోషముతో వైష్ణవ స్థానముకోరి నారాయణుని దరికేగెను. దైత్యుని రాకగని విష్ణుదేవుండును గరుడుని యదియెక్కి యెదురేగెను. వాడా హరింగని జలము తోడి మబ్బట్లు నిగనిగలాడు నల్లనిమేను తామర రేకులల్ల కన్నులు గల గరుడారూధుని కల్పవృక్షమట్లున్న నాగలి రోకలి గద మున్నగు నాయుధములతో శోఖించు నా దేవదేవు నజేయుని శార్గ చక్ర గదాఖడ్గధారిని హరిం జూచెను. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున కాలనేమి ఉపాఖ్యానమందు భగవద్దర్శనమును నూటయిరువదినాల్గవ అధ్యాయము.