Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటముప్పది యారవ అధ్యాయము - త్రేతాగ్ని సంభవము మార్కండేయ ఉవాచ : ఉర్వశ్వపివరారోహా మదనేనాఖిపీడితా | జగాద నారద స్యాధ స్వామవస్థాం నృపంవినా ||
1 తతస్తాం నారదః ప్రాహ సుభ##గే! గచ్ఛపార్థివమ్ | తస్యావ్యవస్థా మహతీ త్వద్విహీనన్యసుందరి ! ||
2 ఏకాం రాత్రిం నరేంద్రేణ సహోష్య వర వర్ణిని! | స్వర్గలోక ముపాగచ్ఛ శ్రేయః ప్రాప్స్యసి వైతతః ||
3 నారదే నైవముక్తాసా సభీభిర్భహుభిర్వృతా | పుష్కరిణ్యాస్తరు ప్లక్షే య¸°ప్నాతుం వరాననా ||
4 ఏతస్మిన్నేవకాలేతు నిద్రయోవహృతో నృపః | అప్సరోభిరవజ్ఞాత స్తత్ర సుష్వాప పార్థివ! ||
5 అద్యయాస్యామి రాజానమితి హృష్టా తదోర్వశీ | క్రీడంత్యత్రజలే తస్మిన్ సభీగణ వృతా తదా ||
6 త్యక్త నిద్రో నరేంద్రో೭పి విలలాపచిరం పునః | శుశ్రావ విలపన్తంసా సభీఖః సహితా నృపమ్ ||
7 దర్శయామాసచాత్మానం పార్థివస్య శుభా తతః | ఉవాచచ వరారోహా నారదోక్త మశేషతః ||
8 తత్త్రైవోవాస తాం రాత్రిం సహతేన వరాననా | రాత్రిక్షయే విసంజ్ఞం సా రాజానం వాక్యమబ్రవీత్ ||
9 ఉర్వశ్యువాచ : ఆరాధయస్వ గంధర్వాన్ మోహం త్యక్త్వా నరేశ్వర! | తేషాం ప్రార్థయ మాం సౌమ్య! తతః ప్రాప్యసి మా చిరమ్ ||
10 మార్కండేయ ఉవాచ : ఏవముక్త్వా య¸° స్వర్గం రాజా తత్త్రైవ పార్థివ! | తపః స విపులం చక్రే తద్ధతేనైవ చేతసా ||
11 అధ సంవత్సరే పూర్ణే సూర్యస్యోడయనం ప్రతి | నారదం వురతః కృత్వా గంధర్వా దర్శనం దదుః ||
12 గంధర్వా ఊచుః : వరం వరయ రాజేంద్రః యదిచ్ఛసి మహాబుజ: || వయంహి తవ దాస్యామః సర్వఏకామరప్రభాః ||
13 పురూరవా ఉవాచ : భవంతశ్చేత్ర్పసన్నామే యదిమేరోచతే పరమ్ | ఉర్వశీసేహచా ర్వంగీ భవద్భిర్మమ దీయతామ్ || గంధర్వా ఊచుః : స్థారీం పూర్ణామిమాం రాజన్గృహాణాగ్నేర్మహాభుజః | అస్మాదగ్నిం త్రిధా కృత్వా యజస్వ విగత జ్వరః ||
15 వేదోక్తే న విధానేవ గంధర్వత్వ మవాప్స్యసి | త్రేతాగ్నిపూర్వస్యవిధేరస్మి న్మన్వంతరే భవాన్ ||
16 భవితా దర్శితా లోకే గురుశ్చ జగతీపతిః | గంధర్వత్వ మవాప్యాధ రాజన్ర్పాప్స్యధోర్వశీమ్ ||
17 మన్వంతర మిమం సర్వంరంతాచత్వం తయాసహ | మన్వంతరేగతే రాజన్నుర్వశ్యా సహితో భవాన్ ||
18 ప్రవేక్ష్యతి నిశానాధం సోమం శీతాంశుముజ్జ్వలమ్ | ఆధారం సర్వలోకస్య పితౄణాం స్థాన ముత్తమమ్ || 19 మార్కండేయ ఉవాచ : అగ్ని స్థాలీం నృపే దత్వా గంధర్వా స్త్రిదివం యయుః | అధా೭೭జగామ తం దేశం బాలమాదాయచోర్వశీ || 20 ఉర్వశ్యువాచ : తస్మిన్సమాగమే సౌమ్య! జాతో೭యం తనయః ప్రభో! | తమాదాయ ప్రతిష్ఠానం వ్రజ పార్థివ! మాచిరమ్ || 21 కృతం నామాస్య గంధర్వై ర్విశ్వాయురితి భూమిప! | మార్కండేయ ఉవాచ : ఏవం దత్వా నృపే బాలం సాప్రయాతా త్రివిష్టపమ్ || 22 మార్కండేయుడనియె:- ఊర్వశి రాజుం బాసి మరుబారికిం దక్కి నారద మహర్షితో దనయవస్థ విన్నవించుకొనియె ఆయనయు నో సుందరి! నీ వా పార్థివుని దరి కరుగుము. అతడును నిదే దురవస్థం గుములు చున్నాడు. ఒక రేయి యాతనితో నుండి స్వర్గమునకు దిఱిగి రమ్ము. నీకు శ్రేయస్సు కలుగునన నా భామిని సఖురాండ్రతో పుష్కరణీ ప్లక్ష వృక్ష ప్రాంతమునకు స్థానము సేయ నేగెను. ఇదే సమయమున రాజు అప్సరసల వలన నవమానితుడై యట నిదురించెను. ఇప్పుడ రాజుం బొందెదనని యానందభరితయై యూర్వశి చెలికత్తెలతో నట జలక్రీడ లాడ జొచ్చెను. నరేంద్రుడంతట మెళుకువగని విరహవ్యధం దుఃఖించెను. అది విని యయ్యప్సర యేగి యాతనికి గనబడెను. మఱియు నారదుడు చెప్పిన మాట విన్నవించెను. ఆ రేయి యతనితో నచ్చటనే వసించెను. మైమఱపున నున్న ఆ ఱనితో నీవు మోహమువాసిన గంధర్వుల నారాధింపుమ. ఓ సౌమ్య మూర్తీ! నిన్న మ్మని వారిం బ్రార్థింపుము. అప్పుడు నన్ను బొందెద వాలసింపకు మని స్వర్గమునకుం జనెను. ఆ భూపతి యామెపై మనసుపడి దివుల తపస్సు చేసెను. అటుపై నొక్క సంవత్సరమునకు గంధర్వులు నారద మహర్షిని ముందిడుకొని వచ్చి సూర్యోదయమున దర్శన మిచ్చి రాజేంద్రా! నీ కిష్టమైన వరము కోరుము. మే మమర ప్రభా సంపన్నుల మది యిత్తుమన పురూరపుడు తాము నా యెడ బ్రసన్నులైరేని యూర్వశి నా లలితాంగిం దయసేయు డనియె. వారు నిదిగో యీ యగ్ని పూర్ణస్థాలిం (పాత్ర) గైకొనుము. బాధవాసి ఇందున్నయగ్నిని మూడుగా నొనరించి వేదోక్త విధానమున యజింపుము. అందు వలన నీ మన్వంతరమందు గంధర్వుడ వయ్యెదవే. మఱియు నీ లోకమునకాదర్శ ప్రాయతగు గురువౌదువు. గంధర్వత్వ లాభమున నీ పూర్వశిం బొందెదవు. ఆమెతో నీ మన్వంతరమెల్ల క్రీడించి మన్వంతరము చివర నిశాపతి, నా శీతాంశుని సోమినిం బ్రవేశింప గలవు. ఆయన సర్వలోకాధారుడు. పితృదేవతలకు మహాస్థానమయినవాడు. అని గంధర్వు లగ్ని స్థాలి నాఱని కిచ్చి వారు త్రిదివమునకుం జనిరి. అవ్వల నూర్వసి బాలునెత్తుకొని యట కేతెంచి, ప్రభూ! ఆ నాటి మన సమాగమమున నీ తనయుడు గల్గినాడు వీనిం జేకొని ప్రతిష్ఠాన నగరమున కేగుము. అలసింపకుము గంధర్వులు వీనికి విశ్యాయు నను పేరు పెట్టిరి. అని యాఱని కాపిల్లవాని నిచ్చి యామో నాకమున కేగెను. ఏకాకీ చింతయామాస బుధ పుత్త్రో೭ప్యనతరమ్ | కింను బాల ముపాదాయ గాగ మిష్యామిపురం స్వకమ్ || 23 అధాదాయ గమిష్యామి స్థాలీమేతాం విభావసోః | శ్వా వదేభ్యో భయం ఘోరం బాలస్యాస్య భవిష్యతి || 24 మయా విహీనస్య భయం నాస్తి కించిద్విభావసోః | ఏవం సనిశ్చయం కృత్వా బాల మాదాయ సత్వరః || 25 జగామ స్వపురం హృష్టః ససైస్యశ్చాగమ త్పునః | స్థాలీం దదర్శమీనాంతు దృష్ట్వా మోహముపాగతః || 26 త్రిదివేదేత్య గంధర్వా మూఢం పార్థివసత్తమమ్ | ఉత్థాపయిత్వా వచన మూచుస్తద్దితకాంక్షిణః || 27 రాజన్మస్మించ్ఛమీగర్భే ప్రవిష్టః స హుతాశనః | అస్మాత్త్వమరణింకృత్వా జనయ స్వహుతాశనమ్ || 28 త్రిధాకృత్వాతు తం వీర! యజస్వ విధివత్తదా | తమిష్ట్వా ప్రాప్స్యసే వీర! గంధర్వత్వమసంశయమ్ || 29 త్రేతాగ్నింతే నరేం దేహ హోష్యంతి సతతం ద్విజాః | సప్తవర్షాణితే೭ప్యేవం యాస్యత్యస్మత్సలోకతామ్ || 30 త్రయోగ్నయశ్చౌపసదం తవ రాజన్ర్పకీర్తితాః | అగ్నిరాహవనీయస్తు వాసుదోవో నరాధిప! || 31 దక్షిణాగ్ని స్తధాజ్జేయో నిత్యం సంకర్షణో బుధైః | తధాచ గర్హపత్యో೭గ్నిః ప్రద్యుమ్నః పరిపఠ్యతే || 32 తధైవోపసధో రాజన్ననిరుద్ధః ప్రకీర్తితః | తస్మా దేవ వరో విష్ణు శ్చతురాత్మా నరాధిప! || 33 ఫలాభిసంధాన హుతో గంధర్వత్వం ప్రయచ్ఛతి | కామంవినాగ్నిహొత్రేణ హుతో రాజన్! జనార్దనః || 34 ప్రయచ్ఛతి పరంస్థాన మమృతం శాశ్వతం ధ్రువమ్ | అగ్నిహోత్రా దృతే రాజన్గంధర్వత్వం న విద్యతే || 35 సుహుతేనాగ్నిహోత్రేణ ప్రాప్యతే సంశయం వినా | ఏవముక్త్వా యయుః సర్వే గంధర్వా స్త్రిదివం తతః || 36 రాజాప్యరణి మాదాయ శమీగర్భాద్గృహంయ¸° | తతః ప్రభృతి రాజేంద్ర! శమీగర్భాద్ధుతాశనమ్ | జనయంతి ద్విజశ్రేష్ఠా స్తత్ర సన్నిహిత స్త్వసౌ || 37 ఏకోగ్ని రాసీ న్నృపవర్య! పూర్వం | వైవస్యతస్యాస్య తధా೭ంతరే೭స్మిన్ | త్రిధాకృతస్తేన మహానుభావ! | సంమంత్రి విపై#్తః క్రతుశాస్త్ర విజ్ఞైః || 38 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రధమఖండే మార్కండేయ వజ్రసంవాదే త్రేతాగ్న్యుత్పత్తిర్నామ షట్త్రింశదుత్తర శతతమో೭ధ్యాయః. అనతంర మొంటరిగ నా బుధ కుమారుడీ మరుంగొని నా రాజధాని కేగుదునా? అటుపై నీ యగ్నిం స్థాలిం గూడ గొంపోదునా! ఇయ్యడవిలో నీ శిశువునకు క్రూరమృగములవలని భయముగల్గును. నేను లేకున్న నగ్ని కేభయముగల్గదని నిశ్చయించి దొందరగ సంతోషమున బాలునెత్తుకొని తన నగరమునకుం జనెను. సేనతో తిఱిగి యటకువచ్చి యగ్నిలేని స్థాలిని(పాత్రను) జూచి మూర్ఛవడెను. గంధర్వులు సురలోకమునుండి వచ్చి లేవతీసి యాతని హితవు గోరి రాజా! యగ్ని యాజమ్మిగర్భమునం బ్రవేశించి నాడు. దీని నరణిం గావించి యందుండి యనలుని బుట్టింపుడు. ఆ యగ్నిని మూడు భాగములు సేసి యధావిధి యజింపుము. అందువలన గంధర్వత్వ మందెదవు. సందియములేదనిరి. ఈ నీ తేతాగ్నిని నవనిలో ద్విజులు యజింపగలరు. ఏడు సంవత్సరములలో వారు సాలోక్యమునందుదురు నీ ఔపసదమీ త్రేతాగ్నులలో నావహనీయాగ్ని వాసుదేవుడు. దక్షణాగ్ని సంకర్షణుడు. గార్హపత్యము ప్రద్యుమ్నుడు అట్లే ఔపసదము అనిరుద్ధుడు నను విద్వాంసులు వేదములందు పఠింతురు. అందువలన చతుర్వ్యూహ స్వరూపుడైన విష్ణువు ఫలాభి సంధానముగ హోమము గావింప బడి గంధర్వత్వ మొసంగును. నిష్కామముగ జనార్దనుడు హోమము గావింపబడు నేని శాశ్వతమైన యమృత స్థానమునగ్రహించును. అగ్ని హోత్రము లేకుండ గంధర్వత్వము లేదు. సుహుతమైన యగ్నిహోత్రము చేత నిస్సందేహముగ నది యందబడును. ఇట్లని యా గంధర్వులు త్రివిష్టపమునకుం జనిరి. అవ్వల నా రాజు శమీదర్భము నుండి యరణింగొని యింటికి జనియె. రాజేంద్ర! వింటివా? అది మొదలు ద్విజశ్రేష్ఠులు శముగర్భమునం దగ్నియు సన్నిహితుడు గావున నందుండి మధించి యగ్నిం జనింప జేయుదురు. ఇంతమున్నగ్ని యొక్కడే ఈ వైవస్వతమన్వంతర మందాయన క్రతు శాస్త్ర విదులగు విప్రత్రయము (శ్రౌతుల) తో బాటు మూడుగా నొనరింపబడెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమునందు త్రేతాగ్నిసంభవమను నూటముప్పదియారవ అధ్యాయము.