Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నూటనలుబది తొమ్మిదవ అధ్యాయము - ఇరావతీవర్ణనము

మార్కండేయ ఉవాచ : 

సదదర్శ నదీం పుణ్యాం రమ్యాం హైమవతీం శుభామ్‌ | గంధర్వ గణసంకీర్ణాం నిత్యంశ##క్రేణ సేవితామ్‌ || 1

సురేభమద సిందూరై ర్యస్యాం రాజిర్విరాజతే | మధ్యేన శక్రచాపాభా తస్యాం మజ్జతి సర్వదా || 2

తవస్వి శరణాయాతాంముఖ్య బ్రాహ్మణ సేవితామ్‌ | దదర్శ శీతపానీయాం మహారాజః పురూరవాః || 3

ప్లుత హంసావశీచ్ఛత్రాం కాశచామర వీజితామ్‌ | సాభిషేకామివ స తాం పశ్యన్‌ ప్రీతింపరాంయ¸° || 4

పుణ్యాంసుశీతలాంహృద్యాంమనసః ప్రీతివర్ధనీమ్‌ | క్షయవృద్ధి యుతాం సౌమ్యాం సోమమూర్తి మివాపరామ్‌ || 5

సుశీత శీఘ్రుపానీయాం ద్విజపుంజనిషేవితామ్‌ | సుతాంహిమవతః శ్రేష్ఠం చంచద్వీచి విరాజితామ్‌ || 6

అమృతస్వాదు సలిలాంతా వసైరుపశోభితామ్‌ | స్వర్గారోహణనిఃశ్రేణీం సర్వకల్మష నాశనీమ్‌ || 7

అగ్ర్యాం సముద్ర మహిషీంమహిషీ గణగాహితామ్‌ | హితాం సర్వస్యలోకస్య కస్యనౌత్సుక్య కారిణీమ్‌ || 8

గోకులాకుల తీరాంతాం రమ్యాం శైవాల వర్జితామ్‌ | హంససారస సంఘుష్టెర్జలజైః సేవితాం శుభైః || 9

అవర్త నాభిగంభీరాం ద్వీపోరుజఘనస్థలామ్‌ | నీరనీరజ నేత్రాంతా ముత్ఫుల్ల కమలాననామ్‌ || 10

హిమాభ##ఫేనవ సనాం చక్రవాకధరాం శుభామ్‌ | బలాకా పంక్తి దశనాంచలన్మత్స్యావళి భ్రువమ్‌ || 11

స్వజలోద్ధత మాతంగరమ్యకుంభ పయోధరామ్‌ | హంసనూపుర సంఘుష్టాం మృణాలవలయావలీమ్‌ || 12

యస్యాంరూపమదోన్మత్త గంధర్వాను గతఃసదా | మధ్యాహ్నసమయే రాజన్‌ క్రీడత్యప్సర సాంగణః || 13

తామప్సరోవినిర్ముక్తా న్వహంతీం కుసుమాన్ముఖాన్‌ | స్వతీరద్రుమసంభూతాన్నానా వర్ణాన్సు గంధినః || 14

తరంగ శత సంక్రాంత సూర్యమండల దుర్దశమ్‌ | సురేభజనితాఘాత వప్రద్వయవి భూషితామ్‌ || 15

శ##క్రేభగండ సలిలైర్దేవ స్త్రీ కుచచందనైః | సంయుతం సలిలంయస్యాః షట్పదైరుపసేవ్యతే || 16

యస్యాస్తీరభవా వృక్షాః సుగంధికుసుమాన్వితాః | తథాప్రకృష్ట భ్రమరా భ్రమరైస్తే నిరాకులాః || 17

యస్యాస్తీరేరతిం యాంతి సదాకామవశానుగాః | తపోధనాశ్చఋషయ స్తథా దేవాః సవాసవాః || 18

లభ్యంతేయత్ల్పుతాంగాస్తు దేవేభ్యః ప్రతిమాననాః | స్త్రియశ్చనాకేబహులాః పద్మేందు ప్రతిమాననాః || 19

మార్కండేయుడనియె. ఆ రాజు పురూరవుడు చక్కని శుభ##మైన పుణ్యనదిని యిరావతిని నిత్యము గంధర్వగణ సంకుల మైనదని నింద్రుడు సేవించుదానిని జూచెను. అనది యైరావత మద సిందూరముచే నందలి తరంగరాశి ఎఱ్ఱని గీతగీసినట్లు విరాజిల్లు చుండును. అట్టి ఆఎఱ్ఱని తరంగపంక్తి నదీమధ్యమం దింద్రధనుస్సువోలె విలీనమగుచుండెను. అనేకమంది ఋషుల యాశ్రమము లందుండి యానది బ్రాహ్మణ ముఖ్యసేవితయై వచ్చుచుండును. పురూరవమహారాజు శీతపానీయమైన యాపుణ్యనదింజూచెను. అందీదు లాడు హంసలు శ్వేతచ్ఛత్రముగను రెల్లుపూపొదలచే చామర ములుగను మంగళోదక మలచే రాజ్యాభిషిక్తయగు మహారాజ్ఞియోయన్నట్లున్న యా నదీమతల్లింగని రాజెంతేని ప్రీతిసెందెను. పుణ్యము సుశీతలము హృద్యము మనఃప్రీతిసంవర్ధనము పెరుగుతరుగులు గలదియు రెండవ సోమమూర్తియో (చంద్రబింబమో) యన్నట్లు చలువతో నతిశీఘ్ర ప్రవాహజలములతో ద్విజపుంజము సేవింప కెరటములువేయుచున్న హిమగిరి కన్యారత్నమును అమృతస్వాదూదకమై తాపసులచే శోభించుచు స్వర్తారోహణమున నిఃశ్రేణియో (నిచ్చెనయో) యన్నట్లు సర్వకల్మషనాశనియై సముద్రుని కగ్రమహిషియై మహిషీగణముదిగి యీదులాడు సర్వలోక హితకారిణిని సర్వలోకమునకు ఔత్సుక్యకారిణిని (వేడుకగూర్చుదానిని) ఆలమందలచే సందడిగొను తీరములతో నాచులేక హంసలతో సారసము లతో (బెగ్గురుపక్షులు) సంఘర్షణముసెందునీ తామరపూలతో పిలువబడునది సుడులను లోతైన నాభిగలదానిని ద్వీపములను విశాల జఘనములు (పిఱుదులు) గలదై నీలనీరజములనెడి కన్నులుగలదై మంచునుఱుగట్టి తెలిచీరదాల్చి చక్రవాకములనెడి చేపలనెడి కనుబొమలుగొని తననీబుట్టిన యేమగలయొక్క కుంభస్థలములనెడి పయోధరములందాల్చి హంసలనెడి యందెలసవ్వడిగొని తామర తూండ్లనెడివలయములు బాహువులదాల్చి దనయా సరస్సున సౌందర్యమదోన్మత్తులయిన గంధర్వులతో మధ్యాహ్న సమయమందునప్సరోబృందమందు క్రీడించుచుండును. అప్సరసలు తనయొడ్దునంగల తరువులకుబూచిన పలురంగుల సువాసనలవించు తమకొప్పులం దాల్చిన పువ్వుల ధరించినదియు ననేకతరంగములందు ప్రతిబింబించిన సూర్యమండలము లనేకములచే గనుల మిరుమిట్లుగొలుపు చున్నదియు దేవలోకమందలి ద్విరదమలు మదముగొని పప్రక్రీడావిలాసమున కుంఢస్థలములంగ్రుమ్మిన యిరువైపు దరుల (ఒడ్డులచే) మిగుల సుందరమైనదియు ఇంద్రగజమగు నైరావతముయొక్క గండస్థలములంజారు సలిలములచే దేవసుందరీ స్తనచందనములం పరమళించు దుమ్మెద లాస్వాదించుచుండు సలిలముల గులుకునదియు గండుతుమ్మెదలు నిండుతుమ్మెద లెంతగ్రమ్ముకొన్నను నొక్కింతయేని వ్యాకులము సెందనివాడని సొగసువీడని గంధికుసుమ భరితములైన తావులతో తపోధనులతో యింద్రాది బృందారకులుం పురుషులుగూడ రతిక్రీడా వినోదులయి యేనది యుభయతీరములందు జలములందోగి దేవతలతో సమానమయిన ముఖములు గలవారగుదురు స్త్రీలును పద్మముతో చింన్నితోనీడగు ముఖములుగలవారగుచుందురు.

యాబిభర్తి సదాతోయందేవ సంఘైర పీడితమ్‌ | పులిందమృగబృందైశ్చ వ్యాధబృంధైర పీడితమ్‌ || 20

సతామర సపానీయాంసతారాగ గనామలామ్‌ | సతాంపశ్యన్య¸° రాజా సతామీప్సిత కామదామ్‌ || 21

దేవబృందముగాని మ్భగబృందముగాని బోయలు ఎరుకలు కోయలు కొండజాతులు అతి వినిర్మలసలిలలములుంగలదియు. తామరలతోగూడి సదా పానీయమునై తామరాకుసహితమై సదాగగనమట్ల తిస్వచ్ఛమై సత్పురుషుల కోరికల నీయగలదై యున్న యా యిరావతీనదిని జూచుచు నారాజేగెను.

యస్యాస్తీరరుహైః కాశైః పుల్లైశ్చంద్రాంశు సంనిభైః | రాజద్భిర్వి వృతాకాశైరమ్యై స్తత్షీరసంస్థితైః || 22

యాచసదాది విసేవ్యతిదేవై ర్యాచ సదాభువిసేవ్యతి విపై#్రః |

యాచసదా సకలాషు వినాశం భక్త జనస్య కరోత్యచిరేణ || 23

యాచగతా సరితాంచ కదంబైః యాచనుతా సతతంహిమహీనైః |

యాచయుతా సతతోయ కదంబైః యాదగతా సతతంహిమహీనైః || 24

యుక్తాపికేసరిగణౖఃకరిబృందయాతా సన్నాగ యుక్త సలిలాపి సువర్ణయుక్తా |

సూర్యాంశుతాప పరివృద్ధి వివృద్ధి శీలా శీతాంశుతుల్యయ శసా దదృశేనృపేణ ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ఇరావతీ వర్ణనో నామైకోన పంచా శదుత్తర శతతమోధ్యాయః.

చంద్రకిరణములట్లచ్చము తెల్లగపూచిన రెల్లుదుబ్బులుకాశములు అతిరమ్యములై యాకాశమున విస్తరింపజేయుచుండెను. ఆ నదిని దివంబున దేవతలు భువిలో భూదేవతలు నిరంతరము సేవింతురు. ఆ నది భక్తజనసకలాఘవినాశిని. అనేక నదీకదం బములానదితో గూడును. మహీనులు (మహీ+ఇన) భూపతులానదిని వినుతింతురు. మంచుగప్పనియనేకజలకదంబముతోనదిసతతము సంగమించును. కేసరిగణముతో పుష్పకింజల్కములతో గూడియు (సింహగణములతో గూడియు అని శ్లేష) కరిబృందముతో (ఏనుగులతో) గూడియున్నది, - సన్నాగయుక్త సలిలాపి =ఏనుగులతోకూడిన యుదకములు గలదయ్యు సువర్ణయుక్తా=చక్కని రంగు గలది (మంచిబంగారముగలది) సూర్యునికరిణములనలని తాపవృద్ధిచేతా పపృద్ధినందియు శీతాంశుతుల్యయశసా =చల్లని కిరణములు గల చంద్రునితో సమానమైన కీర్తిగలదై యా పుణ్యనది యా మేదినీశునకు మేదినీశునకు మిగుల దర్శనీయమయ్యెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండము నందు ఇరావతీ నదీవర్ణనమను నూటనలుబదితొమ్మిదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters