Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

పదునైదవ అధ్యాయము

మధుకైటభవధ

మార్కండేయ ఉవాచ :

ఇక్ష్వాకో రభవత్పుత్రో వికుక్షిర్నామ ధార్మికః | కకుత్థ్స స్తనయ స్తస్య చానేనా స్తస్య చాత్మజః || 1

తస్య పుత్రః పృథు శ్శ్రీమాన్‌ విశ్వదాస స్తదాత్మజః తస్య శ్రావస్తకో నామ శ్రావస్తీ యేన నిర్మితా || 2

బృహదశ్వః సుత స్తస్యకువలాశ్వస్తదాత్మజః | కువలాశ్వోమహాతేజాఃధుంధుమారత్వ మాగతః ||

ధుంధుం హత్వా మహాకాయ ముదకే జలరాక్షసమ్‌ | 3

వజ్ర ఉవాచ :

కథం ధుంధు ర్మహాతేజాః క7వలాశ్వేన ఘాతితః | కశ్చాయం ధుంధు రిత్యేష విశ్రుతోజల రాక్షసః || 5

మార్కండేయ ఉవాచ :

ఏకార్ణవే పురాలోకే నష్ట స్థావం జంగమే ||

నష్ట చంద్రార్క పవనే వినష్ట గ్రహతాంకే | శేషపర్యంక మాసాద్య-సుప్తోదేవో జనార్దనః || 6

నాభౌ తస్య సముత్పన్నం దేవస్య కమలం శుభమ్‌ | తత్రజజ్ఞే స్వయం బ్రహ్మా, దేవః శుభ చతు ర్ముఖః || 7

తత్రా77స్తే సో7భ్యసన్‌వేదాన్‌ సుప్తేదేవే జనార్దనె | ఉపాసాం చక్రిరే తస్యవేదాః దేహభృతస్తథా || 8

వేదాభ్యాస రతేతత్ర స్వేదబిందు రజాయత | స పద్మపత్ర మాసాద్య ద్విధా భూతో7భవన్నృప ! 9

రజస్తమోమ¸° తస్మాజ్జాతౌ దైత్యౌ బలోత్కటౌ మధుకైటభ నామానౌ మహాబల పరాక్రమౌ || 10

తతస్తౌ జహ్రతు ర్వేదాన్‌ బ్రహ్మణః పాపనిశ్చ¸° | స శరీరేషు వేదేషు హృతేష్వథ పితామహః || 11

బోధయామాస దేవేశం వద్మనాభం సచానఘః | సవిబుద్ధ స్తదాదేవః కృత్వా వాయ శిరోధరమ్‌ || 12

శశాంక శత సంకాశం నానాభరణ శోభితమ్‌ ద్వితీయేన శరీరేణ రసాతల తలం గతః || 13

తేనాశ్వశిరసా గత్వా వేదా నాదాయ శాశ్వతాన్‌ పితామహాయ ప్రదదౌ భూయ ఏవ జగద్గురుః 14

తతో హయ శిరోధారీ గతో7న్తర్ధాన మీశ్వరః | ఆజగ్మతుస్తతో దేశం దానివే మధుకైటభౌ || 15

విష్ణుశ్చకార దేహౌ ద్వౌ విష్ణుర్జిష్ణు రితిస్మృతౌ | మధునా యుయుధే జిష్ణుర్విష్ణు ర్వైకైట భేన చ || 16

తతస్తయో స్సుయుద్ధేన తుష్టో దేవో జనార్దనః | ఉవాచ తౌ మహాకా¸° దానవౌ మధుకైటభౌ || 17

వరం వరయతాం శ్రేష్ఠం భవన్తావ పరాజితౌ | తావబ్రూతాం తతోదేవం విష్ణుం కమలలోచనమ్‌ || 18

పుత్రో7స్మాకం భ##వే ద్దేవ మహాబల పరాక్రమః | పుత్రే జాతేత్రు ¸° తౌ ద్వౌ విష్ణువా జిష్ణునాపురా || 19

నిహతౌచ తదా వీరౌ హ్యుదకం చ సమాశ్రి తౌ | మేదో ముముచతు స్తత్ర వ్యాప్తా యేనా7భవన్మహీ || 20

మేదినీతి తతఃఖ్యాతా లోకేస్మిన్‌ తత్త్వచింతకైః | వరాహ రూపేణ తదా చోద్ధృతా వసుధా తతః || 21

తేసైవ దేవ దేవేన పూర్వస్థానే నివేశితా | సర్గంచక్రే తతో బ్రహ్మా దేవ దేవస్య శాసనాత్‌ || 22

ఏనంతదా దేవవరస్య యుద్ధే నిపాతి తౌ మధుకైటభాఖ్యౌ |

దేవస్యవిష్ణోః సదనం ప్రయాతౌక్షీరార్ణవే తస్య సమీపగౌచ || 23

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే - మార్కండేయ వజ్రసంవాదే మధుకైటభ వధోపాఖ్యానం నామ పంచదశో7ధ్యాయః

మార్కండేయుడనియె : ఇక్ష్వాకువు వికుక్షి కకుత్థ్సుడు అనే నుడు పృథువు విశ్వదాసుడు (శ్రీమంతుడు) శ్రావస్తుడు శ్రావస్తి యను నగర నిర్మాత) బృహదశ్వుడు - ఇతడే దుంధుమారుడయ్యెను - దుంధువను మహా శరీరుని జలరాక్షసుం జంపి యీ పేరందెను. అన విని వజ్రుండు - ధుంధువుడు గువలాశ్వుండు చంపిన కథ తెలుపుమన మార్కండేయుం డిట్లనియె : స్థావర జంగమ ప్రపంచము నశించి లోకమేక సముద్రమైనపుడు సూర్యచంద్ర గ్రహతారకలు నష్టమైన తఱి శేషపర్యంక మందు జనార్దన దేవుడు సుప్తుడయ్యెను. ఆయన నాభియందు శుభప్రదమైన కమలము పుట్టినది. అందు స్వయంభువు బ్రహ్మ శుభదము లయిన నాల్గు మోములతో నుదయించెను. విష్ణువు నిదవోవ నా నలువ వేదాభ్యాసము సేయుచుండెను. వేదములు శరీరధారులై యాతని నుపాసించినవి. వేదాభ్యాస రతుడైయున్నతఱి నాతనిమేన చెమట బిందువు పొడమెను. ఆ చెమట చుక్క తామరాకునబడి రెండయ్యెను. వానినుండి రజోగుణ తమోగుణమయు లిద్దరు దైత్యులు మధుకైటభులను వారు మదోత్కటులు మహాబలపరాక్రములు పుట్టిరి. పాపబుద్ధు లా యిద్దరు నవ్వల బ్రహ్మయొక్క వేదములను హరించిరి. మూర్తి ధరించిన వేదము లట్లు నష్టమయినంతట పితామహుడు పద్మనాభుని దేవేశుని విష్ణువును మేల్కొలిపెను. ఈ దేవుడు లేచి హమగ్రీవుని శతచంద్ర సంకాశ ప్రకాశుని నానాభరణ భూషితుని తన రెండవ శరీరముగ నొనరించి రసాతలమున కేగెను. అట్లేగి శాశ్వతములయిన వేదములంగొని వచ్చి యా జగద్గురువు చతుర్ముఖుని కిచ్చెను. ఆమీదట నయ్యీశ్వరు డంతర్ధానమునందెను. అటుపై మధెకైటభులను నాదానవు లచ్చోటి కేతెంచిరి. విష్ణువపుడు విష్ణువు జిష్ణువు నను పేర రెండు శరీరములం బొనరించెను. జిష్ణువు మధునితోను విష్ణువు కైటభునితోను పోరెను. అటుపైవారి యుద్ధమునకు హరి సంతుష్టుడై అపరాజితులైన మీరు వరమడుగుడనియె. వారు కమలలోచను హరిని మాకు మహాబలపరాక్రముడైన పుత్రుడు గలుగుగాక! యనిరి. వారికట్లు సుతుడుదయింప వారిద్దరిని విష్ణువు గూల్ప వారుదకమందునికి గొనిరి. వారందు మేదస్సును విడిచిరి. భూమిని దానమేదిని యని తత్త్వ విదులు పేర్కొనిరి. అయ్యెడ వరాహరూపియగు హరిచే నది మీది కుద్ధరింపబడెను. ఆయన దానిని యథాస్థానమునందుంచెను. ఆ దేవదేవు నాజ్ఞచే బ్రహ్మ యవ్వల సృష్టి ప్రారంభించెను. ఈ విధముగ హరిచేత గూలిన మధుకైటభులు విష్ణులోకమును బొంది క్షీరసముద్ర మ దాయన సాన్నిధ్యమును బడసిరి.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమున ప్రథమఖండమున మధుకైటభవధోపాఖ్యానమను పదునైదవ అధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters