Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటఅరువదితొమ్మిదవ అధ్యాయము - ఉపలేపనఫల ప్రశంస వజ్రః ఉవాచ : అటవ్యో దారుణా బ్రహ్మన్ ! సింహవ్యాఘ్రవిషేవితాః | తస్కరా చరితాఘోరాః సరీనృప విమిశ్రితాః || నిత్యోత్థితస్య చాధ్వానం దాహక్షయం వరం పరమ్ | అతః స్వల్పతరం కర్మ బ్రూహిమే కేశవార్చనే ||
2 మార్కండేయః : అతః స్వల్పతరం రాజన్ ! దేవ వేశ్మాను లేపనమ్ | మహాఫలం వినిర్దిష్టం బ్రాహ్మణౖ ర్వేదపారగైః ||
3 సంమార్జనంతుయః కుర్యాత్పురుషః కేశవాలయైః | రజస్తమోభ్యాం నిర్ముక్తః సభ##వేన్నాత్ర సంశయః ||
4 పాంశూనాం యావతాం రాజన్! కుర్యా త్సంమార్జనం నరః | తావన్త్యబ్దాని ససుఖీ నాకమాసాద్యమోదతే ||
5 అభ్యుక్షణం తుయః కుర్యాత్పానీయేన సురాలయే | సశాంత పాపో భవతి నాత్రకార్యా విచారణా || 6 కృత్వో పలేపనం విష్ణోర్న రస్త్వాయతనే సదా | గోమయేన శుభాంల్లోకా నయత్నాదేవ గచ్ఛతి || 7 హస్తప్రమాణం భూభాగము పలివ్య నరాధిప! | దేవరా మా శతం నాకం లభేత్ సతతం నరః || 8 తతో೭ను సారేణ ఫలం విస్తృతాయాంక్షితౌ స్మృతం | నిత్యా೭సమర్థస్తు తథా దేవ వేశ్మోపలేవనే || 9 త్రిః పక్షస్యతు కుర్వీత దేవవేశ్మోపలేపనం | పంచమీం దశమీం చైవతథా పంచదశీం నృప || 10 త్రిః పక్షస్య సదా కృత్వా దేవవేశ్మోపలేపనం | సంవత్సరాత్తదాప్నోతి యత్ఫలం తన్నిబోధమే || 11 జన్మాంతర మథాసాద్య గృహం ప్రాప్నోత్య నుత్తమమ్ | సర్మోపభోగ సంయుక్తం గృహప్రాసాద సంకులమ్ || 12 వృక్షోద్యాన లతా గుల్మ తోయవాపీ విభూషితమ్ | గవాశ్వ ధన ధాన్యాఢ్యం సర్వోపకరణౖర్యుతమ్ || 13 ప్రియం వదాభిః దృష్టాభిః సురూపాభిశ్చ పార్థివ! | వృతంచ బహుభిః స్త్రీభిః చారు వంశాభిరేవచ || 14 గార్హస్థ్యంచ దృఢం తత్ర సచాప్నోతి మహీతలే | నచ ప్రచ్యవనం తస్మా జ్జీవన్నాప్నోతి కర్హిచిత్ || 15 తస్యయే బాంధవా స్తత్ర సర్వేతే దీర్ఘజీవినః | భవన్తి న భవన్త్యస్య అధయో వ్యాధయస్తథా || 16 నతస్య మృత నిష్కృంతిర్గృహే భవతి కర్హిచిత్ | యావజ్జీవత్యసౌతత్ర గృహే శ్రీమాన్ ముదాయుతః || 17 చౌరజం న భయంతస్య సచావ్యాధి కృతం భయమ్ | వ్యాశభూపాలజంవా೭పినచ తస్య ఫలంభ##వేత్ || 18 స్వరూపః సర్వ సిద్ధార్థో దీర్ఘాయు ర్వ్యాధివర్జితః | ఆజ్ఞావిధేయ కృత్యశ్చధ్రువం స్యాన్మనుజేశ్వర! || 19 భుంజానోయ స్సదాకుర్యాత్తసై#్యతత్కథితం ఫలం | సక్తభోజీ తథా కృత్వా ద్విగుణం ఫలమాప్నుయాత్ || 20 ఉషోషితస్తు రిక్తాసు పూర్ణాసు తుహరేర్గృహే | కృత్వోపలేపనం నిత్యం చానంతంఫల మశ్నుతే || 21 ఉపలేపన కృద్యస్తు కృష్ణస్యాయతనే భ##వేత్ | పాప సంమార్జనం తస్య శీఘ్రమేవ భవిష్యతి || 22 నిష్పాద్య మేతత్స సుఖం నరేంద్ర! ఆరాధనం దేవ వరస్య విష్ణోః | ప్రోక్తం మయాతే ధనవర్జితానాం ధనాన్వితానాంతు ఫలం విశేషమ్ || 23 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ఉపలేపన ఫల ప్రశంసనంనామ ఏకోనసప్తత్యధిక శతతమో೭ధ్యాయః. సింహవ్యాఘ్రాది భయంకర మృగ సంకులములు తస్కరా చరితములు అతి ఘోరమలు మహాసర్ప సమ్మర్దము లడువులు. నిత్యము నిదేపనిగ బయలుదేరిన వానికి దాహము వారించు మార్గమును విష్ణునర్చస మందు అత్యల్పముగా జేయనైన పనిని యానతిమ్మన మార్కండేయు డిట్లనియె. ఇంత కంటె మిక్కిలి తేలికయైనసేవ దేవాలయముల కనులేపము సేయుట, అలుకుట, కడుగుట యన్న మాట. వేదపారగులగు బ్రాహ్మణులది మహాఫలమని పేర్కొన్నారు. విష్ణువుగుడిలో సమ్మార్జనము సేసినవాడు రజోగుణ తమోగుణ నిర్ముక్తుడగుటలో సందియము లేదు. హరియాలయ మందెన్ని పాంసువులను (పరాగములను) తుడుచు నన్ని యేండ్లాతడు స్వర్గమందానందించును. దేవాలయములో పానీయముచే (మంచినీటిచే) అభ్యుక్షణము (కలయంపి) చల్లిన వాడు పాపములు వాయును. విష్ణ్వాలయమున గోమయముచే ఉపలేపనము (పూత) వెట్టినవాడు మఱియేయత్నములేకుండ పుణ్యలోకమల కేగును. రాజా! ఒక్కమూర మేర యలికిన పుణ్యుడు నూరుగురు దేవతా సుందరులతోడి స్వర్గముం బొందును. నిత్యము దేవాలయ మలుకలేని వానికి గూడ యీ విశాల భూమిందదనుసారముగ ఫలము తెలుపబడినది. పక్షమునకు (15 రోజులకు) మూడుమార్లు దేవాలయోప లేపనము పంచమి దశమి పంచదశి నాడు నెలకారుసార్లు ఒక సంవత్సరము సేసినవాడుమలి పుట్టువున నుత్తమ గృహలాభమందును. ఆ గృహము శయనాసనాది సర్వోప భోగములతో మేడలతో మిద్దెలతో వృక్షోద్యానల తాగుల్మ జలవాపీ విభూషితయై గోవులు గుఱ్ఱాలు ధనము ధాన్యము సర్వసామగ్రితో నిండియుండును. అంతియగాదు ప్రియముగ మాటలాడుచు హృదయమున కానందముగూర్చుచు చక్కనివారై మిక్కిలి యెక్కువైన వంశమున బుట్టిన సుందరులతో నాయిల్లు కలకలలాడుచుండును. అట్టి గృహమందాతడు నిలుకడగల గార్హస్థ్యము నిర్వహించును. బ్రతికి యుండగా నాతడా గృహస్థ ధర్మమునుండి జారిపోడు. అతని బంధువులందును వారందరు దీర్ఘజీవులగుదురు. వీనికి ఆధి =(మనోవ్యాధి), వ్యాధి యుంగలుగవు. వాని యింటినుండి యెన్నడు మృత (నిష్ర్కాంతి) జరుగదు. (ఆయింట నెవ్వడు చచ్చిపోడన్నమాట) శ్రీమంతుడై యీపుణ్యపురుషుడాయింట వసించునంతకాలము చోరభయము వ్యాధిభయము వ్యాలభయము (వ్యాలము=పాము క్రూరజంతువును) రాజభయము వానికిగల్గదు. చక్కనిరూపము సర్వార్థసిద్ధి దీర్ఘాయువు నీ ఆరోగ్యముగని ఆజ్ఞా విధేయులయిన నౌకరులతో నీతడు సుఖముండును. ఈఫలము నిత్య భోజనముసేయుచు నుండువానికి దెల్పబడినది. నక్తభోజి (రాత్రిమాత్రమేభుజించువాడు) ఇంతకు రెట్టింపు ఫలమందును. రిక్తతిథులందు విష్ణువు గుడిలో నుపలేపనము (అలుకుట) సేసినాతడనంతఫలమందును. కృష్ణాలయమున నలుకువానికి (సమ్మార్జనముసేయువాని) పాపసమ్మార్జనము వెనువెంటనేయగును. విష్ణు దేవుని యారాధనమందీ యుపలేపనము (గుడియలుకుట) చాలసుఖకరమైనది (తేలికగాజేయనైనది) ఇది ధనములేనివాని కొరకునీకెరిగించితి. ఇదేధనవంతులు సేసిన యెడల విశేషఫలముగల్గును. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణ ప్రథమఖండ మందు విష్ణ్వాలయోపలేపనఫల ప్రశంసయను నూటయరువది తొమ్మిదవ యధ్యాయము.