Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటడెబ్బదియొకటవ అధ్యాయము - పురుషస్వరూప వర్ణనము వజ్ర ఉవాచ : సతురాజా మయా బ్రహ్మన్ మాంధాతా భువనేశ్వరః | మహేశ్వరేణ శూలేన లవణన హతః శ్రుతః || మార్కండేయః - అజేయం వైష్ణవం తేజస్తచ్చ నిత్యంచ జంతుషు | నాశమాయాన్తి తేసర్వేహీనా వైష్ణవ తేజసా ||
2 అవినాశి జగత్యస్మిన్ నకించి దథ విద్యతే | ఋతేతు మహతస్తస్మాత్తేజసో నృప! వైష్ణవాత్ ||
3 తేజస్తస్య సుదుర్గ్రాహ్యం దేహిభిః నృప! సర్వదా | తస్మాత్తేన విహీనాప్తే క్షయం గచ్ఛన్తి మానద!
4 మత్స్యః కూర్మోవరాహశ్చ నారసింహో೭థవామనః | బ్రహ్మాశంభుస్తథైవార్క శ్చంద్రమాశ్చ శతక్రతుః ||
5 ఏవమాద్యా స్తథైవాన్యే యుక్తావైష్ణవ తేజసా | గజచ్ఛాయానుమానేన వియుజ్యన్తేచ తేజసా ||
6 వితేజసశ్చతే సర్వే పంచత్వ మువయాన్తిచ | పంచభూతాత్మకం స్థూలం యత్కించిజ్జగతీ గతమ్ ||
7 సర్వం వినాశి తద్‌జ్ఞేయం త్వయా పార్థివ సత్తమ ! | అవినాశితు తద్విద్ధి యేన విశ్వమిదంతతమ్ ||
8 యత్తుగంధ గుణౖర్‌హీనం రూపస్పర్శ వివర్జితమ్ | శబ్దహీనంచ విరసం సర్వేశం సర్వగం చయత్ ||
9 నిర్గుణం తద్గుణాతీత మన్తిక స్థంచదూరగమ్ | సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితమ్ ||
10 సర్వతః పాణి పాదాంతం సర్వోతో೭క్షి శిరోముఖమ్ | సర్వేంద్రియగుణం దేవం సర్వతః పరమేశ్వరమ్ ||
11 అవినాశి తదేవైకం యస్యోదర గతం జగత్ | సదాశివేతి తంకేచిదాహుర్దేవం జగత్పతిమ్ ||
12 వాసుదేవేతి చాప్యన్యే కాల మిత్యేవ చాపరే | దైవ మిత్యపరే తంచ స్వభావమితి చాపరే ||
13 కర్మేతి చాపరేప్రాహుః పురుషేతి తథా పరే | ప్రణవాఖ్యం తథా తంచ విదురేద్వవిదో జనాః ||
14 తదేవ మజమవ్యక్త మవినాశం నరాధిప! | ఋతే తమేకమీశానమంతవ త్సకలం జగత్ ||
15 ఏతత్తవోక్తం భువనస్య పత్యుర్మయా స్వరూపం యదువంశచంద్ర! | భక్తిం వినా బుద్ధిమతా೭పియస్య శక్యం సవక్తుం గ్రహణం నరేణ ||
16 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే పురుషస్వరూప వర్ణనం నామ ఏకసప్తత్యధిక శతతమో೭ధ్యాయః భువనాధీశ్వరుడగు ఆమాంధాత చక్రవర్తి మహేశ్వరుని శూలముచే లవణాసురునిచే హతుడయ్యెనని వింటినని వజ్రుండన మార్కండేయుండిట్లనియె. అజేయమగు వైష్ణవతేజస్సు జంతువులందు నిత్యముండును ఆవైష్ణవతేజస్సులేని జీవులన్నియు నాశముం బొందును. ఆవైష్ణవ తేజస్సుతప్ప తక్కినదేదియు నీజగమందు నశింపనిదే కొంచెమును లేదు. ఎల్లప్పుడు దేహధారుల కావిష్ణుని తేజస్సు సహింపశక్యముగాదు. అందువలన నదిలేనివారు క్షయవందుచుందురు. మత్స్యము కూర్మము వరాహము నరసింహము వామనము బ్రహ్మ శంభువు అర్కుడు చంద్రుడు శతక్రతువు ఈ మొదలగు నింకనుంగల వైష్ణవ తేజోయుక్తులుగూడ గజచ్ఛాయ (సూర్యగ్రహణము మరియొక పుణ్యకాలము) యొక్క అనుమానముచే యెంతవారైన యందరునావైష్ణవతేజో హీనులగుదురు అట్లు తేజోహీనులగు వారందరు పంచత్వము నందుదురు (పంచభూతములలో గలియుదురన్నమాట) జగమందలి యేకొంచెమేని స్థూల వస్తువు పంచభూతమయము. రాజోత్తమా! అది యెల్ల నిట్లు వినాశమందునదని యెరుంగుము. ఈ యెల్లజగము నిండియున్నది నాశికనాదిమాత్రమది యొక్కటి యని యెరుంగుము గంధగుణములు లేనిది రూపములేనిది స్పర్శలేనిది శబ్దములేనిది రసము (రుచి) లేనిదియగునది సర్వేశము సర్వగము నిర్గుణము గుణాతీతము దగ్గరనున్నది దూరముగనున్నది సర్వేంద్రియ గుణముల భాసింప జేయునది అదిమట్టుకు సర్వేంద్రియములులేనిది సర్వత్రప్రాణి పాదాంతములు గలది అన్నియెడల కన్ను శిరసు ముఖము గలది సర్వేంద్రియగుణములతో నైనది దేవము=ప్రకాశరూపము (కేవలజ్ఞానమన్నమాట) సర్వవ్యాపకము పరమేశ్వరము అవినాశి యదొక్కటేవస్తువు. దానియుదరమున జగమున్నది. అట్టి దానిని కొందరు సదాశివుడందురు. కొందరు జగదీశ్వరుడందురు కొందరు వాసుదేవుడందురు. మరికొందరు కాలమందురు దైవమని మరికొందరందురు. మరికొందరు స్వభావమందురు కర్మమని కొందరు పురుషుండని ఇంకగొందరు ప్రణవమని వేరొకరు వేదవేత్తలావస్తువును పేర్కొందురు. ఆవస్తువు ఒక్కటి అజము (పుట్టనిది) అవ్యక్తము (వ్యక్తముదృశ్యమగు జతగ్గునకధిష్ఠానమైయున్న దన్నమాట) అనాశనము ఈశానమైనయది తప్ప సకల జగమునంతయుగలదే భువనపతియొక్క స్వరూపమిది నేనోయాదవవం శచంద్ర! నీకుదెల్పితిని. భక్తిలేనినరులకు బుద్ధిమంతుల కేనియిది తెలుపరాదు తెలియరాదు. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున పురుషస్వరూపమను నూటడెబ్బదియొకటవ అధ్యాయము