Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటడెబ్బదినాల్గవ అధ్యాయము - మాసనక్షత్రపూజనము మార్కండేయ ఉవాచ : ఇద మన్యత్ ప్రవక్ష్యామి మాసనక్షత్ర పూజనమ్
యత్ఫలం దేవ దేవస్య పురుషః సముపాశ్నుతే |
1 అరభ్య కార్తికా దేతద్ర్వతం కార్యం విజానతా! | పారణ త్రితయేనైత ద్ర్వతం పరిసమాప్యతే ||
2 చాతుర్మాస్యం తథైవాత్ర పారణం నృప! కీర్తితమ్ | పారణ రాజన్! ప్రతి మాస విధిం శృణు! ||
3 పంచగవ్యజం స్నానం సదైవచ సమాచరేత్ | పుష్పాది పూజాకర్తవ్యా యథాలాభ ముపాహృతైః ||
4 నైవేద్యం కృసరం పూర్వ మత్రమాస చతుష్టయమ్ | యావకేన తథా కార్యం మధ్యమంచ చతుష్టయమ్ || 5 చతుష్టయే తృతీయేచ నైవేద్యం పాయసం భ##వేత్ | తేనైవాన్నేన రాజేంద్ర! బ్రాహ్మణాన్ భోజయేద్బుధః || 6 నక్తం నైవేద్య మశ్నీయా ద్వాగ్యతః సుసమాహితః | సంయతస్తాంభ వేద్రాత్రిం తథా స్థండిల శాయకః || 7 ఏవం కుర్యాత్పున స్తావద్యావ త్కార్తిక కృత్తికా | తత్ర సంపూజ్య దేవేశ మారంభవిధినా నృప! || 8 భాజనం ఘృత సంపూర్ణం సహిరణ్యం ద్విజాతయే | దాతవ్యం భోజనం కార్యం బ్రాహ్మణానాం విశేషతః || 9 సంవత్సర మిదం కృత్వా వ్రతం పురుష సత్తమః | లబ్ధ్వా స్థానంచ మాదేత తథా నారీచ యాదవ! || 10 స్థిరాంశ్రియం ధర్మమతిం బలంచ సౌభాగ్యమోజః స్థిర సత్త్వతాంచ | అస్థాం సుదీర్ఘాం త్రిదివేచ కుర్యాత్ వ్రతం నృణా మేత దతీవ పుణ్యమ్ || 11 ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమ ఖండే మార్కండేయ వజ్రసంవాదే మాస నక్షత్ర పూజనం నామ చతుస్సప్త త్యధిక శతతమో೭ధ్యాయః. మార్కండేయుడిట్లనియె : మాసనక్షత్ర పూజన మిదియింకొకటితెల్పెద. దీనివలన మానవుడు పొందుఫలమునుం వాక్రుచ్చెద. కార్తికము నుండి యావ్రతము సేయవలెను. మూడు పారణములతో నిది పూర్తియగును. నాల్గుమాసములకొక పారణము విహితము. ప్రతిపారణమందు ప్రతిమాసము నాచరింప వలసిన విధిని వినుము. పంచగవ్య జలముతో స్నానము నిత్యము సేయ వలెను. యథాలాభముగ గొనివచ్చిన పూలతో బూజ, నైవేద్యము కృసరము మొదట నాల్గు మాసములు రెండవ నాల్గు మాసములు యావకము నువ్వుండలు నాఱుమినుములతో చేసిన పిండి వంటలు యవాన్నము (పులగము) నైవేద్యము. మూడు నాల్గుమాసము లందు పాయసము నివేదన సేయవలెను. బ్రాహ్మణులకు నీ యన్నము విందుసేయవలెను. వ్రతస్థుడు వాజ్నియమముతో సమాహితుడై రాత్రి నైవేద్యముం దాను దినవలెను. ఆ రాత్రి కటికినేలం బరుండ వలెను ఇట్లు కార్తిక మాసమున కృత్తిక తిరిగి వచ్చుదాక (ఒకయేడాది) సేయవలెను. అప్పుడు హరినర్చించి ఘృతకుంభ దానము సువర్ణ దక్షిణతో ద్విజునకీయవలెను. విశేషముగ సంతర్పణమును సేయవలెను. ఇట్లొక సంవత్సర మీవ్రతము సేసిన పురుషోత్తముడు ఉత్తమస్త్రీయు నుత్తమ పుణ్య స్థానము నందిమోదించును. ఈ పుణ్యవ్రతము శాశ్వత శ్రీని ధర్మబుద్ధిని బలమును సౌభాగ్యమును ఓజస్సు చెదరని సత్త్వమును స్వర్గముభాభిలాషను జేకూర్చును. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున మాసనక్షత్రపూజనమను నూటడెబ్బదినాల్గవ యధ్యాయము.