Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
పదునెనిమిదవ అధ్యాయము సగరోపాఖ్యానము మార్కండేయ ఉవాచ : సగరస్యతు తే పుత్రాః సంహతా వీర్యసంయుతాః | సంజాతా దైవయోగేన దేవబ్రాహ్మణ కంటకాః || 1 తేషాంతు కర్మణోద్విగ్నాః దేవాస్సర్వే పితామహం | అబ్రువన్ సాగరైస్సర్వై దేవ ! బాధ్యామ సంహతై ః || 2 ఏవముక్తస్తథా బ్రహ్మా సర్వలోక పితామహః | ఉవాచ దేవా& సకలా& సాగరైః ప్రత్యమర్షితాన్|| 3 యస్త్వస్య జగతో నాథః పరమాత్మా సనాతనః | వాసుదేవస్స కపిల స్సురాంస్తా& ఘాత యిష్యతి || 4 ఏవముక్తా స్సురా స్తేన యయుస్సర్వే త్రివిష్టపమ్ | ఏతస్మిన్నేవ కాలేతు సగరస్స మహీపతిః || 5 దీక్షితో వాజిమేధాయ విధివద్వేద పారగైః | తురంగం చారయామాసు ర్యజ్ఞియం తనయా మహీమ్ || 6 తేషాం చారయతాం సో೭శ్వః కపిలేనతథా హృతః | కపిలేన హృతం నాశ్వం తేజానన్తి విమోహితాః || 7 అన్వేషన్తో೭పి యత్నేన నాపుస్తే తురగం యతః | పిత్రే నివేద్యతే సర్వే నిచఖ్నుః పృథివీతలమ్ || 8 భరతస్యాస్య వర్షస్య భేదే೭స్మిన్నవమే నృప ! | సమన్తత స్తతశ్చక్రుః ఖాతకర్మ బలాన్వితాః || 9 విస్తరా ద్యోజన శతం పాతాల తల గామినమ్ | వైడూర్య పర్వతా త్పూర్వ ముత్తరేణ హిమాచలాత్ || 10 పశ్చార్ధే కాంచనగిరే రుదగేవచ లావణాత్ | హిమాచలశ్చ తద్వీరై రాజ& దేశద్వయే క్షతః ||11 హిమాచలస్య ఖండశ్చ ఖాతస్యాన్తః ప్రవేశితః | ఉత్తర స్సాగర స్తస్మా ద్ధిమశైలేన దుర్దమః || 12 ఏవం విధేన ఖాతేనతే ప్రవిశ్య పృథక్ పృథక్ | ఏకీకృతా దై వయోగాత్ కపిలో యత్ర వైస్థితః || 13 కపిలస్యసమీపస్థం దదృశుస్తే తురంగమమ్| తురంగ సహితం దృష్ట్వా కపిలంతే త్వమర్షితాః || 14 కుద్దాల లేపికా హస్తాస్తస్య జగ్ముర్వధేప్సయా | తా& బాధమానా& దుర్బుద్ధీ& సందదర్శ తదా ఋషిః || 15 చక్షుషా దృష్టమాత్రాస్తే భస్మీభూతాస్తు సాగరాః | నరకంచగతా స్సర్వే దేవ బ్రాహ్మణ కంటకాః || 16 మార్కండేయు డిట్లనియె:- సగరుని పుత్రులు వీర్యవంతులు, కలిసియుండెడివారు, దేవ బ్రాహ్మణ బాధకులై దైవయోగమున పుట్టిరి వారి చర్యల కావేగపడినవారై దేవతలు అందరు బ్రహ్మదేవునితో దేవా ! సగరపుత్రులందరు మమ్ము బాధించుచున్నారు. అనిమొరపెట్టుకొనిరి. సర్వలోక పితామహుడగు బ్రహ్మ అ మొరవిని సగర పుత్రులతో ద్వేషమూనిన దేవతలందరితో నిట్లనెను. జగన్నాధుడగు వాసుదేవుడు కపిల మహర్షియై వారి నందరిని చంపగలడు ఇట్లు పలుక బడినవారై దేవతలందరు బ్రహ్మతో కలిసి స్వర్గమునకేగిరి. ఇంతలో సగర చక్రవర్తి అశ్వమేధ యాగార్థమై వేదవిదులతో దీక్ష బూనెను. సగర పుత్రులు యాగాశ్వమును భూమియందు త్రిప్పుచుండిరి. అట్టియెడ ఆ యాగాశ్వము కపిలునిచే నపహరింపబడెను. సాగరు లెంత ప్రయత్నించినను అశ్వము లభ్యము కాకపోవుటచే తండ్రికి నివేదించి భరతవర్ష నవమఖండమంయు భూతలమును తవ్విరి. శతయోజన విస్తృతితో పాతాలము చేరువరకు వైదూర్య పర్వతమునకు తూర్పుగ హిమాలయమునకు నుత్తరముగ మేరు పర్వతమునకు పశ్చిమార్ధమున లవణ సముద్రమునకు నుత్తరముగ హిమాచలమును ఖండించి ఆఖండమును ఆగర్త మధ్యమున చేర్చిరి. ఆ కారణమున నుత్తర సముద్రము హిమాద్రిచే దుర్గమమయ్యెను. ఆ ఖండముగుండ ఒక్కొక్కరు ప్రవేశించి కపిలుడున్న ప్రదేశమున గుమిగూడినవారై దైవయోగమున కపిలుని సమీపమున యాగాశ్వమును చూచిరి. కపిలుని అశ్వముతో కలిసియున్న వానిని చూడగనే ఆగ్రహముతో వానిని చంపుటకై త్రవ్వు సాధనములను చేతబూని వానిపైకి వెళ్ళిరి. దుర్బుద్ధిగలవారై బాధించుచున్న సాగరులు కపిలుడు చూడగనే భస్మీభూతులైరి దేవ బ్రాహ్మణ కంటకులగు వారందరు నరకము చేరిరి. విజ్ఞాయ తనయాన్నష్టాన్నారదా త్సగరో నృపః | ప్రేషయా మాస సతతమంశుమన్తం సధార్మికమ్ || 17 అంశుమానపి సంప్రాప్య పిలం మునిసత్తమమ్ | అభివాద్య మహాతేజాః తుష్టావ యదునన్దనః || 18 తస్యతుష్టో೭థ తురగం దత్తవా& కపిలో మునిః | అంశుమన్తం తదోవాచ పితౄణాం సలిలార్థినామ్ || 19 పౌత్రస్తే భవితా రాజన్ ! తపసా తస్యతోషితా | ఆగమిష్యతి సాదేవీ గంగా గగనమేఖలా || 20 తయాక్లిన్నమిదం భస్మ సాగరాణాం దురాత్మనామ్ || 21 యదా భవిష్యతి తదా సాగరా స్స్వర్గ గామినః | అన్యస్యాపి యదా త్వస్థి గంగాతోయే పతిష్యతి || 22 తస్యాపి స్వర్లోక గతి ర్భవిష్యతి న సంశయః | ఏవ ముక్తోంశుమా& శీఘ్రం చాభివాద్య జగద్గురుమ్ || 23 ఆగమ్య యోజయామాస తురగేణ పితామహమ్ | యజ్ఞం సమాపయామాస సగరో೭పి మహీపతిః || 24 ఏనంహి సాగరై ర్మత్తైః ఖాతకో నృపసత్తమ! | యేనక్లప్త మయం ద్వీపః సాగరో నృప ! కథ్యతే || 25 లవణోదాత్స ముద్రాచ్చ తోయేన నృప ! సాగరః | యదాపూర్ణ స్తదా జాతో లవణోదో నరాధిప|| 26 కృత్స్నం య ఏవం జయతి ససమ్రా డితి కీర్త్యతే | తతోగత స్సధర్మాత్మా కాలేన మహతా దివమ్ || 27 దిలీపే భార మాసజ్య జగామ తనయే స్వకే | దిలీపో೭పి సమాధాయ రాజ్యే పుత్రం భగీరథమ్ || 28 జగామత్రిదివం రాజావనే తప్త్వా మహత్తపః | ఆసాధ్య రాజ్యంస భగిరథో೭పి అనీయగంగాం తపసా చ భూమిమ్ || 29 సంప్లావయామాసజతేన భస్మ తత్సాగరాణాం యదు బృన్ద నాథ | సంప్లావితే భస్మని రాజపుత్రాః గంగా జలౌఘేన దివం ప్రయాతాః ||30 స్వర్లోక మాసాద్య తథా೭క్షియం తే వసన్తి హృష్టా స్త్రిదశై స్సమేతాః || 31 ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే సగరోపాఖ్యానంనామ - అష్టాదశో೭ధ్యాయః. సగరచక్రవరిత్త తనపుత్రులు నష్టమైన వృత్తాంతమును నారదముని వలన నెరంగి, ధార్మికుడగు అంశుమంతుని నచటికి పంప కపిలునిచేరి నమస్కరించె. దానికి సంతసించి కపిలముని యా తురంగము నాతనికినొసంగెను. మరియు అతనితోనిట్లనెను. నీ పౌత్రుడు సలిలార్థులైన నీ పితరులను తపస్సుతో సంతోషపెట్టగలడు. గంగానది యేతెంచి దురాత్ములగు సాగరుల భస్మమును తడుపగా సగర పుత్రులు స్వర్గము చేరుదురు. ఇంతియేకాక ఎవ్వరి యెముకయైనను గంగాజలమునందు పడినయెడల వానికి స్వర్గలోక నివాసము కలుగును. సందేహము లేదు. అంశుమంతుడు జగద్గురువగు కపిల మహర్షికి నమస్కరించి శీఘ్రముగ నిల్లుచేరి యాగాశ్వమును పితామహుడగు సగర చక్రవర్తికి నివేదింపగా నాతడు అశ్వమేధ యాగమును ముగించెను. ఇట్లు మదించిన సగర పుత్రులచే త్రవ్వబడుటచే నీ ద్వీపమునకు సాగరద్వీపమని పేరు లవణ జల సముద్రపు నీటితో నింపబడి లవణ సముద్ర మేర్పడెను. దీనినంతను జయించినవాడు సమ్రాట్ అని చెప్పబడును. ధర్మాత్ముడగు సగరుడు తన పుత్రుడగు దిలీపుని యందు రాజ్యభారము నుంచి కొంతకాలమునకు స్వర్గతి నొందెను. దిలీపుడు తన పుత్రుడగు భగీరథునకు రాజ్య మప్పగించి వనమునందు మహా తప మొనరించి స్వర్గము చేరెను. భగీరథుడు రాజ్యమునంది మహా తపస్సుచే గంగను భూమికి చేర్చి గంగోదకముతో సగరపుత్రుల భస్మమును ముంచి సగర పుత్రులనెల్ల అక్షయ స్వర్గ గతిని పొందించెను. వారచట దేవతలతో చేరి ఆనందముగ నివసించుచున్నారు. ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహా పురాణమున - ప్రథమ ఖండమున - మార్కండేయ వజ్ర సంవాదమున సగరోపాఖ్యాన మను పదునెనిమిదవ అధ్యాయము.