Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటఎనుబదిఒకటవ అధ్యాయము - చాక్షుషమన్వంతర వర్ణనము శాంబరాయణీ : చాక్షుషస్య మనోః పుత్రాన్ షష్ఠస్యశృణు వాసవ! | ఉరుః పురుః శతద్యుమ్నః తపస్వీ సత్యవాన్ ధృతిః || అగ్నిష్టుదతి రాత్రశ్చ సుద్యుమ్నశ్చ తథా೭నఘ! హవిష్మానున్మతం శ్రీమాన్ సుధామా విజయ స్తథా ||
2 అభిమానః సహిష్ణుశ్చ మధుశ్రీః ఋషయః స్మృతాః | ఆఢ్యాః ప్రసూతా భావ్యాశ్చ లేఖాశ్చ పృథుకా స్తథా ||
3 అష్టకాశ్చ గణాః పంచ తదాప్రోక్తా దివౌకసామ్ | తేషాం మనోజవో నామ బభూవేంద్రః ప్రతాపవాన్ ||
4 అసంస్తస్యా೭సురా ఘోరాస్తదా దాయాదబాంధవాః | యేషాం బభూవ నృపతిః మహామాలో బలాధికః ||
5 సకదాచి ద్వనం యాతో మృగయాం పాప నిశ్చయః | తత్ర చంద్రాంశు సంకాశం దదర్శా೭శ్వం మనోహరమ్ ||
6 తమారురోహ దుర్బుద్ధిః మృగాఘాత చికీర్షయా | తమారూడం సమాదాయ తదా వేగాత్తురంగః ||
7 గత్వా పారే సముద్రస్యచిక్షేపోపరి దుర్మతిమ్ | క్షిప్తమాత్రః సదుర్బుద్ధిః పవనేనాపవాహితః ||
8 అనాసాదితతోయశ్చ పవనేన స తూహ్యతే | అద్యాపి సుమహాతేజా లోకాలోకస్య బాహ్యతః ||
9 అమృత్యు పరదానేన సతుపాపః స్వయం భువః | వాయు మార్తం సమాశ్రిత్య సతుప్రాణౖర్వియుజ్యతే ||
10 ఏవం స ఘోరో వరదాన దర్పా దమృత్యు రస్మీతి కృతాపరాధః | దేవద్విజానాం హయరూపధారీ చిక్షేప విష్ణుః పవన ప్రవాహే || 11 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే షష్ఠచాక్షుష మన్వంతర వర్ణనంనామ ఏకాశీత్యధిక శతతమో೭ధ్యాయః. శాంబరాయణి యనియె : అరవ చాక్షుషమనువు పుత్రులు ఊరుపు పూరుపు శతద్యుమ్నుడు తపస్వి సత్యవంతుడు ధృతి అగ్నిష్టుత్తు అతిరాత్రుడు సుద్యుమ్నుడు అనువారు, హవిష్మంతుడు, ఉన్నతుడు, శ్రీమంతుడగు సుధాముడు విజయుడు, అభిమానుడు సహిష్టుడు మధుశ్రీ ఋషభుడు అనువారు సప్తర్షులు. ఒక్కొక్క గణములో నెనమండుగురు దేవతలుగలరు. అఢ్యులు ప్రసూతులు భావ్యులు లేఖులు పృథుకులు అను దేవగణములైదు గలవు. వారికి మనోజపుడనువాడింద్రుడు ప్రతాపవంతుడు. అతనికి జ్ఞాతులు బంధువులు ఘోరాసురులుండిరి. బలాధికుడైన మహాబలుడనువాడు వారికి రాజు. వాడొకనాడు పాపమతియై వేటకై యొక తరి వనమునకేగెను. అక్కడ చంద్రకిరణములట్లున్న చక్కని గుఱ్రమును జూచెను. దుర్బుద్ధియైన యాతడు మృగములం జంపు తలంపున నాగుఱ్ఱమెక్కెను. ఆయెక్కినవానింగొని యా తురంగమము వేగమున బరుగెత్తి సముద్రతీరమున నాతని పడగొట్టెను. పడగొట్టినమాత్రన నా దుష్టుడు వాయువుచే మోసికొనిపోబడెను. వాయువు వానిని నీరు కనబడనిచోటికి మోసికొనిపోయెను. లోకా లోక పర్వతము వెలుపల నిప్పుడును నామహాతేజస్వి చావులేకుండ బ్రహ్మవలన నొందిన వరముచే వాయుమార్గమందున్నాడు. వాని ప్రాణములు పోలేదు. ఈవిధముగా నా ఘోరుడు పరదాన గర్వముచే దేవబ్రాహ్మణులక పరాధము సేసియు చావకిప్పటికినున్నాడు. హయమూర్తి దాల్చి విష్ణువు వానిని వాయుప్రవాహమందు విసరివైచెను. ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున యారవ చాక్షుషమన్వంతరవర్ణనమను నూట యెనుబదియొకటవ యధ్యాయము.