Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటఎనుబదిఐదవ అధ్యాయము - దశమ ధర్మపుత్ర మన్వంతర వర్ణనము శాంబరాయణీ : ధర్మపుత్రస్యతు మనోర్దశమస్య సుతాన్ శృణు! సుక్షేత్ర ఉత్తమౌజాశ్చ భూరిశోణశ్చ వీర్యవాన్ ! | శతానీకో నిమిర్మిత్రో వృషసేనో జయ ద్రథః | భూరి ద్యుమ్నః సువర్మాచ ధర్మపుత్ర మనోః సుతాః ||
2 అపో మూర్తి ర్హవిష్మాంశ్చ మృతికి శ్చావ్యయ స్తథా | నాభాగః ప్రమితిశ్చైవ సౌరభా ఋషయ స్తథా ||
3 ప్రాణాఖ్యాః శతసంఖ్యాశ్చ దేవతానాం గణా స్తథా | భవితా తస్య భవితా శాన్తిరింద్రః ప్రతాపవాన్ ||
4 దాయాదా బాంధవా స్తస్యభవిష్యం త్యసురాశ్చయే | తేషాంచ భవితా రాజా వాలీ నామ మహాసురః ||
5 ద్యోతయిష్యతి తం విష్ణుర్గదయా భీమవేగయా | దేవాసురేతు సంగ్రామే దేవానాం హిత కామ్యయా ||6 గదా నిపాతాభిహతే సురేంద్రే మహాబలే దేవవరేణ తేన త్రైలోక్యమేతద్భ వితా సమగ్రం వినష్ట దోషం సురవిప్రజుష్టమ్ ||
7 ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే శక్రశాంబరాయణీసంవాదే దశమధర్మపుత్ర మన్వంతర వర్ణనం నామ పంచాశీత్యధిక శతతమో೭ధ్యాయః. శాంబరాయణి యనియె. ధర్ముని కుమారుడగు పదియవమనువు కుమారులు సుక్షేత్రుడు ఉత్తమౌజుడు భూరిశోణుడు శతానీకుడు నిమిమిత్రుడు వృషసేనుడు జయద్రథుడు భూరిద్యుమ్నుడు సువర్మ అనువారు. అపోమూర్తి. హవిష్మంతుడు. మృతికి (సత్పతియని పాఠాంతరము) అవ్యయుడు నాభాగుడు ప్రమితి. సౌరభుడు ననువారు అమన్వంతర మందలి సప్తర్షులు ప్రాణుల నెడు నూరుమంది దేవతాగణము అప్పుడు శాంతియను ప్రతాపవంతు డింద్రుడగును. అతనికిజ్ఞాతులు బాంధవులు నసురులు. వారికి వాలియను మహాసురుడు రాజగును (వారియనిపాఠాంతరము) విష్ణువు వానిని దేవా సుర సంగ్రామమును దేవతలకు హితమొనరింప వానిని భయంకర వేగముగల గదచేగూల్చును. అట్లు వానింగూల్చినంత ముల్లోకము దోషమెల్లపోయి దేవతలతోను విప్రులతోను గల కలలాడును. ఇది శ్రీవిష్ణు ధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున దశమ ధర్మపుత్రమన్వంతర వర్ణనమను నూట యెనుబది యైదవయధ్యాయము