Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటఎనుబదిఏడవ అధ్యాయము - పండ్రెండవమనువు దక్షపుత్రుని చరిత్ర మనోస్త్వం దక్షపుత్రస్య ద్వాదశస్యా త్మజాన్ శృణు | దేవవానుపదేవశ్చదేవశ్రేష్ఠో విదూరథః ||
1 మిత్రివాన్ మిత్రదేవశ్చ మిత్రసేనశ్చ వీర్యవాన్ | మిత్రబాహుః సువర్చాశ్చ దక్షపుత్ర మనోః సుతాః ||
2 సత్తమోద్యౌర్ద్యుతి శ్చైవ తపనః సుతపా స్తథా | తపోరతి స్తపస్వీచ ఋషయ స్సప్తకీర్తితాః ||
3 సుశర్మాణః సుతపసో హరితా రోహితా స్తథా | సుతారాభ్యా గణాః పంచ ప్రత్యేకం దశకో గణః ||
4 ఋతధామా చ ధర్మాత్మా తేషా మింద్రః ప్రతాపవాన్ | దాయాదా బాంధవా స్తస్య భవిష్యన్యసురా శ్చయే ||
5 తేషాం చ భవితా రాజా నరకో నామ నామతః | స్త్రీపుంసోః సత్వవధ్యశ్చ వరదానాత్ స్వయం భువః ||
6 హరి ర్నపుంసకో భూత్వా ఘాతయిష్యతి తం తదా | దేవాంతకం కాల సమగ్రభావం మహాసురం క్లీబవపుర్మహాత్మా | నిహత్య తం లోక మిదం సమగ్రంభీత్యా విహీనం భగవాన్ స కర్తా ||
8 ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే ద్వాదశస్య దక్షపుత్రస్య మనోర్వంశాను కీర్తనం నామ సప్తాశీత్యధిక శతతమో೭ధ్యాయః. శాంబరాయణియనియె. దక్షుని కొడుకు పండ్రెండవమనువు. అతని పుత్రులుదేవవంతుడు ఉపదేవుడు దేవశ్రేష్ఠుడు విదూరథుడు మిత్రదేవుడు మిత్రసేనుడు మిత్రబాహువు సువర్చుడు ననువారు. సత్తముడు ద్యౌద్యుతి, తపసుడు, సుతపుడు, తపోరతి, తపస్వియనువారు సప్తర్షులు సుశర్ములు సుతపసులు హరితులు రోహితులు సుతారులు ననునైదు దేవగణములు ఒక్కొక్క గణమందు పదిమంది దేవతలుందురు. ప్రతాపశాలి ధర్మాత్ముడునైన ఋతధామడు వారి కింద్రుడగును. అతనికి దాయాదులు బంధువులు నసురులు. వారికి రాజు నరకుడు. బ్రహ్మవలన నీతడుస్త్రీపురుషుల కవధ్యుడయ్యెను. హరి నపుంసకుడై వానిని జంపగలడు. దేవాంతకుడు కాలునివంటి ప్రభావముగలవాడు మహాసురుడునగు నరకుని హరిక్లీబరూపమునగూర్చి యీయశేషలోకమునకు భగవంతుడభయము నొసంగును. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ప్రథమఖండమున పండ్రెండవ మనువు ధర్మపుత్రుడు ఋతధాముని చరిత్రమను నూటయెనుబది ఏడవ యధ్యాయము.