Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటఎనుబదితొమ్మిదవ అధ్యాయము - చతుర్దశభౌత్యమనువర్ణనము శాంబరాయణీ : చతుర్దశస్య భౌత్యస్య శృణు | పుత్రాన్మనోర్మమ | తరంగో భేద భిద్బుధ్న్య స్తరస్వా నుగ్రఏవచ ||
1 అభిమానీ ప్రవీరశ్చ జిష్ణుః సంకందన స్తథా | తేజస్వీ సులభశ్చూవ భౌత్యసై#్యతే మనో స్సుతాః ||
2 అగ్నీధ్ర శ్చాతిబాహు శ్చ మాగధశ్చ తథా శుచిః | అజితో యుక్తగో೭శక్యొ ఋషయస్సప్త కీర్తితాః ||
3 చాక్షుపాశ్చ కనిష్ఠాశ్చ పవిత్రా భజిరా స్తథా | వయెవృద్ధా దేవగనాః పంచప్రోక్తాస్తు సప్తకాః ||
4 తేషామింద్రః శుచిర్నామ తస్య దాయాద బాంధవాః | యే భవిష్యన్తి భవితా రాజా తేషాం మహాసుఖః ||
5 దివ్యం వర్ససహస్రం తు యుద్ధం దేవాసురం తదా | భవిష్యతి మహాఘోరం తస్యాన్తే తం మహాసురమ్ ||
6 అస్థితం తామసీం మాయాం ఘాతయిష్యతి కేశవః | అరూఢం కుంజరం భీమం చరత్పర్వత సన్నిభమ్ ||
7 ఉత్ఖాత పర్వత సమం చక్రేణ మధుసూదనః | రథస్థం తం మహాదైత్యం ఘాతయిష్యతి దుర్మతిమ్ ||
8 తస్మిన్ హతే వాసవా దేవశత్రౌ మహాబలే కాల సమప్రభావే | త్రైలోక్యమేతద్విరుజం సమన్తాత్ తదా భవిష్యత్యమర ప్రతాపమ్ ||
9 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే చతుర్దశ భౌత్య మనువర్ణనంనామ నవాశీత్యధిక శతతమో೭ధ్యాయః. శాంబరాయణియనియె. పదునాల్గవమనువు భౌత్యుడు. ఆయన కొడుకులు తరంగుడు భేదభిత్తు బుధ్న్యుడు తరస్వంతుడు ఉగ్రుడు అభిమాని ప్రవీరుడు జిష్ణువు సంక్రందనుడు తేజస్వి సులభుడు ననువారు. అగ్రీధ్రుడు అతిబాహువు మాగధుడు శుచి అజితుడు యుక్తగుడు అశక్యుడు ననువారు సప్తర్షులు. చాక్షుషులు కనిష్ఠులు పవిత్రులు. భజిరులు, వయోవృద్ధులు, ననునైదు దేవ గణములు. వానిలో నేడేసిమంది దేవతలుందురు. వారికింద్రుడు శుచియనువాడు. ఆయనకు దాయాదులు బంధువులు నుందురు. వారికి రాజు మహాసుఖుడు. దేవాసురులకు వేయి దివ్య సంవత్సరములు ఘోరయుద్ధము జరుగును. అందు తామసమాయను బూని యుద్ధముసేయు నామహాసురుని నడచు పర్వతమువంటి కోరాడుపర్వతమువంటి దివ్యకుంజరమెక్కి చని రథమందున్న యా దైత్యుని దుర్మతిని హరిగూల్చును. దేవేంద్రశత్రువు వాడు మహాబలుడు కాలసమప్రభావుడు హతుడైనంత నీ లోకమంతట బాధలు తొలగి యమర ప్రతాపవంతముగాగలదు. ఇది శ్రీవిష్ణు మహాపురాణమందు ప్రథమఖండమున పదునాల్గవభౌత్యమను వర్ణనమను నూటయెనుబది తొమ్మిదవ యధ్యాయము.